mandatory
-
1 నుంచి ‘ఉపాధి’కి ఆధార్ చెల్లింపులు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఉపాధి హామీ కూలీలకు సెప్టెంబరు 1వతేదీ నుంచి పూర్తి స్థాయిలో ఆధార్‌తో అనుసంధానం చేసిన బ్యాంకు అకౌంట్లకు మాత్రమే వేతనాలు చెల్లింపులు చేస్తారు. ఉపాధి హామీ జాబ్ కార్డు నెంబరుతో పాటు ఆధార్, బ్యాంకు ఖాతాలను ఉమ్మడిగా అనుసంధానం చేసుకుంటేనే ఆయా ఖాతాలకు వేతనాలు జమ అవుతాయి. ఈ మూడింటినీ అనుసంధానం చేసుకోని వారికి సెప్టెంబరు ఒకటో తేదీ తర్వాత ఉపాధి పథకం పనులకు హాజరైనా వేతనాలు జమ చేసే పరిస్థితి ఉండదని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం అమలులో అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఈ మేరకు కీలక మార్పులు తెచ్చింది. దీన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 1వతేదీ నుంచే అమలు చేయాలని తొలుత భావించినా చాలా రాష్ట్రాల్లో (మన రాష్ట్రం కాదు) పెద్ద సంఖ్యలో కూలీల జాబ్‌కార్డులను ఆధార్, బ్యాంకు అకౌంట్లతో అనుసంధానించే ప్రక్రియ పూర్తి కాకపోవడంతో పలు దఫాలు వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా సెప్టెంబరు ఒకటి నుంచి ఖచ్చితంగా నూతన విధానంలోనే కూలీలకు వేతనాల చెల్లింపులు ఉంటాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్రాలకు స్పష్టం చేసినట్టు అధికారులు వెల్లడించారు. కేంద్రం ఈ ప్రతిపాదనలను తేకముందు నుంచే మన రాష్ట్రంలో ఉపాధి కూలీలకు పాక్షికంగా ఆధార్ అనుసంధానంతో కూడిన వేతనాల చెల్లింపులు కొనసాగుతున్నట్లు వివరించారు. రాష్ట్రంలో పథకం అమలులో పారదర్శకత కోసం వీలైనంత మేర కూలీల జాబ్‌కార్డులను బ్యాంకు అకౌంట్లతో అనుసంధానించగా మిగతావారికి కూడా ఇప్పటివరకు వేతనాలను చెల్లిస్తున్నారు. అయితే సెప్టెంబరు ఒకటి నుంచి మాత్రం వందకు వంద శాతం తప్పనిసరిగా ఆధార్ అనుసంధానం విధానంలో వేతనాల చెల్లింపుల ప్రక్రియ ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో 99.53 శాతం అనుసంధానం ఆంధ్రప్రదేశ్‌లో 69 లక్షల కుటుంబాలకు చెందిన 1.24 కోట్ల మంది కూలీలు ఉపాధి హామీ పథకంలో పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో ఏటా గరిష్టంగా 47.74 లక్షల కుటుంబాలకు సంబంధించి దాదాపు 79.81 లక్షల మంది కూలీలు ఉపాధి పనులతో లబ్ధి పొందుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు కలిపి గత ఐదేళ్లుగా ఏటా రూ.ఐదారు వేల కోట్లకు తక్కువ కాకుండా ప్రయోజనం చేకూరుతోంది. వేతనాల చెల్లింపుల్లో కేంద్రం తెచ్చిన నూతన విధానంతో ఉపాధి హామీ కూలీలెవరూ ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు తీసుకుంది. మొత్తం 1.24 కోట్ల మంది కూలీలలో 99.53 శాతం మంది జాబ్ కార్డులు ఆధార్, బ్యాంకు అకౌంట్లతో అనుసంధానం ప్రక్రియను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. గత మూడేళ్లలో ఒక్క రోజైనా ఉపాధి పనులకు హాజరైన క్రియాశీలక కూలీలలో 97.2 శాతం మందిని కూడా ఇప్పటికే అనుసంధానించారు. ఉపాధి పథకం కూలీల జాబ్‌కార్డులను ఆధార్, బ్యాంకు అకౌంట్లతో అనుసంధానించే ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. త్రిపుర, కేరళ, లడఖ్, పుదుచ్చేరి, చత్తీస్‌గఢ్, సిక్కిం, తమిళనాడు తరువాత స్థానాల్లో ఉన్నాయి. మన రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో పేర్లు నమోదు చేసుకున్న కూలీలలో ఇంకా కేవలం 60 వేల మందికి సంబంధించి మాత్రమే ఆధార్ అనుసంధానం ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. వారు గతంలో పేర్లు నమోదు చేసుకున్నప్పటికీ ఉపాధి పనులపై పెద్దగా ఆసక్తి చూపని వారే కావచ్చని పేర్కొంటున్నారు. -
ప్రేమ పెళ్లిళ్లకు పెద్దల అనుమతి తప్పనిసరి చేస్తే?
గాంధీనగర్: ప్రేమ వివాహాలపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రేమ వివాహాలకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిగా ఉండేలా సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు వ్యాఖ్యానించారాయన. ప్రేమ వివాహాల విషయంలో తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిగా ఉంటే ఎలా ఉంటుంది?. ఈ విషయంపై మా ప్రభుత్వం అధ్యయనం జరపాలనుకుంటోంది. అది రాజ్యాంగబద్ధంగా సాధ్యమవుతుందా? అనే కోణంలో పరిశీలించాకే ముందుకెళ్లాలనుకుంటున్నాం అని వ్యాఖ్యానించారాయన. పటీదార్ లాంటి కమ్యూనిటీల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇలాంటి డిమాండ్లు వినిపిస్తున్నాయని ఆదివారం మెహసనాలో జరిగిన ఓ కార్యక్రమంలో చెప్పారాయన. ఆరోగ్య శాఖ మంత్రి రుషికేష్ పటేల్ ఈ విషయంలో సలహా ఇచ్చారు. ఇంట్లోంచి పారిపోయి పెళ్లిళ్లు చేసుకున్న ఘటనలపై అధ్యయనం చేపట్టాలని కోరారు. వాటి ఆధారంగా ఇక నుంచి ప్రేమ వివాహాలకు పెద్దల అంగీకారం ఉండేలా విధివిధానాలు రూపకల్పన చేయాలని సూచించారు అని సీఎం భూపేంద్ర పటేల్ తెలిపారు. రాజ్యాంగం గనుక అందుకు అనుమతిస్తే.. అధ్యయనం కొనసాగించి మంచి ఫలితం సాధిస్తాం అని తెలిపారాయన. ఈ విషయంలో ఓ ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యే సైతం అలాంటి చట్టమేదైనా తెస్తే.. తాను ప్రభుత్వానికి మద్దతు ఇస్తానంటూ తనతో అన్నారాని సీఎం భూపేంద్ర వ్యాఖ్యానించారు. ఆయన పేరు ఇమ్రాన్ ఖేదావాలా. ‘‘ప్రమే వివాహాల విషయంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా ఉన్నా.. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆలోచన చేయాలని కోరుతున్నా. ఒకవేళ అసెంబ్లీలో చట్టం లాంటిది తెస్తే.. దానికి నా మద్దతు ఉంటుంది’’ అని ప్రకటించారాయన. ఇదిలా ఉంటే.. గుజరాత్ ఫ్రీడమ్ ఆఫ్ రెలిజియన్ యాక్ట్ 2021(సవరణ) ప్రకారం వివాహం వంకతో బలవంతంగా మతం మార్చడం లాంటివి చేస్తే కఠిన శిక్షలు ఉంటాయి. దోషిగా తేలితే పదేళ్ల దాకా శిక్ష పడుతుంది. అయితే గుజరాత్ హైకోర్టు ఈ చట్టంపై స్టే విధించగా.. ప్రస్తుతం ఆ పిటిషన్ పెండింగ్‌లో ఉంది. -
దేశీయ దగ్గు మందులపై కేంద్రం కీలక నిర్ణయం, త్వరలోనే అమల్లోకి
న్యూఢిల్లీ: దేశీయ కాఫ్ సిరప్‌లపై ఇటీవలి ఆరోపణలు, వివాదాల నేపథ్యంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. దగ్గు మందు ఎగుమతులపై కీలక నిబంధనలు జారీ చేసింది. భారతీయ సంస్థలు ఎగుమతి చేసే దగ్గు మందుల (సిరప్)లపై అనుమతిని తప్పనిసరి చేసింది. జూన్ 1వ తేదీ నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ఒక నోటిఫికేషన్లో తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా నాణ్యతా పరమైన ఆందోళనలు తలెత్తిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. ఇదీ చదవండి: అదానీ గ్రూపు ఇన్వెస్టర్ జాక్‌పాట్: మూడు నెలల్లో ఎన్ని వేల కోట్లో తెలిస్తే..! ప్రభుత్వ ల్యాబ్‌ల్లో తనిఖీ తర్వాతే ఎగుమతులకు అనుమతి ఇవ్వనున్నట్టు కేంద్రం తాజాగా ప్రకటించింది. ప్రభుత్వ ల్యాబుల్లో పరీక్షల అనంతరం మాత్రమే అనుమతి ఉంటుంది. ఆ యా ల్యాబ్స్ టెస్టింగ్ సంబంధించి దగ్గు సిరప్‌లపై తప్పనిసరిగా ఓ ధృవీకరణ పత్రాన్ని జారీ చేస్తాయి. ఎగుమతుల సమయంలో ఆ ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరిగా అధికారులకు చూపించాల్సి ఉంటుంది. దేశం నుండి ఎగుమతి చేసే వివిధ ఔషధ ఉత్పత్తుల నాణ్యతకు భరోసా ఇవ్వడంలో తమ నిబద్ధతను తిరిగి నొక్కిచెప్పడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఇండియన్ ఫార్మకోపోయియా కమిషన్, ఆర్డీటీఎల్-చండీఘర్, సెంట్రల్ డ్రగ్స్ ల్యాబ్-కోల్‌కతా, సెంట్రల్ డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్-చెన్నై, హైదరాబాద్, ముంబై, ఆర్డీటీఎల్- గువహటితో పాటు రాష్ట్ర ప్రభుత్వాలచే గుర్తింపు పొందిన ల్యాబ్‌ల్లో పరిక్షలకు అనుమతి. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో, తమిళనాడుకు చెందిన గ్లోబల్ ఫార్మా హెల్త్‌కేర్ ఐ డ్రాప్స్‌ను రీకాల్ చేసింది. గత సంవత్సరం గాంబియా, ఉజ్బెకిస్తాన్‌లలో వరుసగా 66, 18 మంది చిన్నారుల మరణాలకు భారతదేశంలో తయారు చేసిన దగ్గు సిరప్లు కారణమని ఆరోపణలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. (Jeff Bezos-Lauren Sanchez: ఎట్టకేలకు గర్ల్‌ఫ్రెండ్‌తో అమెజాన్ ఫౌండర్ ఎంగేజ్మెంట్) చదవండి: అన్నీ సాహసాలే: ఆరు నెలలకే వేల కోట్ల బిజినెస్! -
జనాభా పెరుగుదల కోసం ఆ దేశం పాట్లు.. నిబంధనను బ్రేక్ చేసి మరీ..
దక్షిణ కొరియాలో గత నెలలో దేశంలోనే అత్యల్ప సంతానోత్పత్తి రేటు నమోదయ్యింది. దీంతో అక్కడి పాలక సంప్రదాయ పీపుల్ పవర్ పార్టీ జనన రేటుని పెంచే సంప్రదాయేతర మార్గాలపై దృష్టిసారించింది. వాస్తవానికి దక్షిణ కొరియాలో 18 నుంచి 28 ఏళ్ల వయసులోపు పురుషులు తప్పనసరిగా మిలటరీ సేవ చేసేలా కఠినమైన నిబంధన ఒకటి ఉంది. ఐతే అక్కడి ప్రభుత్వం ఆ నిబంధనను సైతం బ్రేక్ చేసేందుకు రెడీ అయిపోయింది. ఈ మేరకు అక్కడ పురుషులకు 30 ఏళ్లు వచ్చేలోపు ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే తప్పనిసరి అయిన మిలటరీ సేవ నుంచి మినహాయింపు ఇస్తానని చెబుతోంది. ఈ మేరకు సియోల్ ఆధారిత మిలటరీ హ్యుమన్ రైట్స్ సెంటర్ కో ఆర్డినేటర్ చో క్యు సుక్ మాట్లాడుతూ..ఈ ప్రతిపాదన యువకులు ఇష్టపడతారని, పైగా జననాలకు అడ్డంకి తొలుగుతుందని చెప్పారు. అయితే ఈ ప్రతిపాదనను సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. యుక్త వయస్కులను పిల్లలను కనమని ప్రోత్సహిస్తున్నారా అని మండిపడుతున్నారు. అయినా మిటలటరీకి వెళ్లకుండా ఉండేందుకు ముగ్గురు పిల్లలను ఎవరు కలిగి ఉంటారు, ఆ ఖర్చులను ఎలా భరిస్తారు అని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. మరికొంత మంది నిపుణులు ఇది చాలా ప్రమాదకరం, హాస్యస్పదమైనది అని చెబుతున్నారు. ఈ క్రమంలో సియోల్ విశ్వవిద్యాలయంలోని పబ్లిక్ అడ్మినస్ట్రేషన్ అసోసియేట్ ప్రోఫెసర్ ఎరిక్ హై వాన్ కిమ్ మాట్లాడుతూ..జాతీయ ఆర్థిక వృద్ధి లేదా దేశ స్థిరత్వం కోసం పిల్లలను కనమని ప్రజలను అడగలేం. సంతానోత్పత్తిని అలాంటి సాధనంగా భావించకూడదు. అలాగే ముసాయిదా మినహాయింపు విధానం కూడా ప్రమాదకరమేనని ప్రొఫెసర్ జెఫ్రీ రాబర్ట్సన్ హెచ్చరించారు. దీని వల్ల ఉద్యోగం చేసే తల్లులకు ఇంటి బాధ్యతలు, పిల్లల సంరక్షణ వంటివి మరింత భారమయ్యే అవకాశం ఉంది. అలాగే ఆ ఖర్చులను భరించగలిగేలా మంచి జీతంతో కూడిన ఉద్యోగాలు పొందడం కూడా కష్టమే అని నిపుణులు చెబుతున్నారు. కాగా, దక్షిణ కొరియా ఇంకా ఈ నిబంధనను ఖరారు చేయలేదని, అమలు చేయాలా? లేదా అని అంశంపై సమీక్షిస్తున్నట్లు సమాచారం. (చదవండి: అమెరికాలోని గురుద్వార్‌లో కాల్పులు..ఇద్దరికి తీవ్ర గాయాలు) -
జనవరి 1 నుంచి ఆర్టీపీసీఆర్ టెస్టులు తప్పనిసరి
ఢిల్లీ: కరోనా కొత్త వేరియెంట్ల విజృంభణ నేపథ్యంలో.. కేంద్రం కీలక నిర్ణయం ప్రకటించింది. జనవరి 1వ తేదీ నుంచి కరోనా విజృంభిస్తున్న దేశాల నుంచి భారత్‌కు వచ్చే వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ టెస్టులు తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించింది. చైనాతో పాటు హాంకాంగ్, జపాన్, సౌత్ కొరియా, థాయ్‌లాండ్, సింగపూర్ నుంచి వచ్చే వారు ఆర్టీపీసీఆర్ టెస్టులు తప్పనిసరిగా చేయించుకోవాలని గురువారం కేంద్రం తెలిపింది. అలాగే ప్రయాణికులు ప్రయాణాలకు ముందు.. ఎయిర్ సువిధ పోర్టల్‌లో ఆ రిపోర్ట్‌లను అప్లోడ్ చేయాల్సిందేనని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. లేకుంటే భారత్‌లోకి ఎంట్రీ ఉండబోదని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా, ప్రత్యేకించి ఈ ఆరు దేశాల్లో కేసులు వెల్లువలా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. రాబోయే 40 రోజుల్లో భారత్ అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరించారు. న్యూఇయర్‌తో పాటు పండుగల ప్రయాణాల నేపథ్యంలో వైరస్ వ్యాప్తి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. దీంతో విదేశాల నుంచి, ప్రత్యేకించి ఆ ఆరు దేశాల నుంచి వచ్చే వాళ్లకు టెస్టులు తప్పనిసరి చేసింది కేంద్రం. మరోవైపు ప్రస్తుతం విజృంభణకు కారణమైన ఒమిక్రాన్ బీఎఫ్.7 వేరియెంట్ తీవ్రత తక్కువే కావడంతో భారత్‌లో మరో వేవ్ ఉండకపోవచ్చని, పేషెంట్లు ఆస్పత్రుల పాలుకావడం.. మరణాలు ఎక్కువగా సంభవించకపోవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది. కాకపోతే.. వైరస్ వ్యాప్తి త్వరగతిన ఉంటుందని భావిస్తోంది. మరోవైపు నిపుణులు చైనాలో మాదిరి తీవ్ర పరిస్థితులు భారత్‌లో నెలకొనకపోవచ్చని, అందుకు వ్యాక్సినేషన్ డ్రైవ్, ప్రజల్లో రోగ నిరోధక కారణాలని చెబుతున్నారు. అయినప్పటికీ ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. -
ఈపీఎఫ్‌వో అలర్ట్: ఉద్యోగులకు తీపి కబురు!
సాక్షి, ముంబై: పీఫ్ చందాదారులకు శుభవార్త. ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితి (సీలింగ్) ని పెంచాలని ఈపీఎఫ్‌వో నిర్ణయించినట్టు సమాచారం. చందాదారుల గరిష్ట వేతన పరిమితి రూ. 21 వేలకు పెంచనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రూ. 15వేలుగా ఉన్న ఈ పరిమితిని రూ. 21 వేలకు సవరించాలని ఈపీఎఫ్‌వో యోచిస్తోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే రిటైర్మెంట్ సమయంలో పెద్దమొత్తంలో ఉద్యోగుల చేతికి సొమ్ము అందనుంది. కనీస వేతనం పెంపు? ఈ అంశంపై త్వరలో ఒక కమిటీని వేయనుంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో కనీస వేతన పరిమితి 21 వేలు కావచ్చు. దీని ప్రకారం ఉద్యోగుల వేతన పరిమితి 6వేల రూపాయల మేర పెరుగుతుంది. అలాగే ఉద్యోగి పీఎఫ్‌లో కంపెనీ ఇచ్చే కంట్రిబ్యూషన్ మొత్తం కూడా పెరగనుంది. (చదవండి: షాకిచ్చిన వోల్వో: ఆ మోడల్ కార్లు కొనాలంటే!) ప్రస్తుతం రూ.15 వేలు జీతం ఉన్న ఖాతాదారుడికి ఖాతాలో రూ.1800 పీఎఫ్ కట్ అయితే, జీతం 21 వేలు అయితే, పీఎఫ్ మొత్తం రూ. 2530కు చేరుతుంది. ఫలితంగా ఉద్యోగుల ఈపీఎఫ్ ఖాతాకు జమయ్యే మొత్తం కూడా పెరుగుతుంది. ఇది ఉద్యోగి, యజమాని చెల్లించే వాటాలకు కూడా వడ్డీ వర్తిస్తుంది కాబట్టి ఉద్యోగులకు మరింత ప్రయోజనం చేకూరనుంది. సభ్యులకు ఈపీఎఫ్ఓ భవిష్య నిధి ఫండ్‌తో పాటు పెన్షన్ సదుపాయం కూడా కల్పిస్తుంది. అలాగే, ఉద్యోగి దురదృష్టవశాత్తూ మరణిస్తే, ఫ్యామిలీ పెన్షన్, బీమా సదుపాయం కూడా ఉంది. (Bisleri1969-2022: అపుడు 4 లక్షలు, ఇపుడు వేల కోట్లు, ‘బిస్లరీ’ పేరు ఎలా వచ్చింది?) కాగా ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితిని కేంద్రం చివరిసారి 2014లో సవరించింది. అప్పట్లో రూ. 6,500గా ఉన్న పరిమితిని రూ. 15 వేలకు పెంచిన సంగతి తెలిసిందే. అయితే, 20 మంది అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు ఉన్న సంస్థలకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. తాజా లెక్కల ప్రకారం ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఈ పథకంలో కొత్తగా 16.82 లక్షల మంది చేరారు. అలాగే, తాజా నిర్ణయంతో దాదాపు 75 లక్షల మంది ఈపీఎఫ్‌వో పరిధిలోకి వస్తారని అంచనా. -
మాస్కు ధరించడం తప్పనిసరికాదు.. కేంద్రం కీలక ఆదేశాలు..
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో కరోనా కొత్త కేసులు కనిష్ఠ స్థాయికి చేరుకున్న తరుణంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విమానాల్లో ప్రయాణించే వారు మాస్కు ధరించడం తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. అయితే ప్రయాణికులు మాస్కుకు ప్రాధాన్యమిస్తే మంచిదేనని సూచించింది. విమానయాన సంస్థలు కూడా ఇకపై విమానాల్లో ప్రకటనలు చేసే సమయంలో మాస్కు తప్పనిసరి అని చెప్పొద్దని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. మాస్కులు, ఫేస్ కవర్లు ఉపయోగిస్తే మంచిదని మాత్రమే చెప్పాలని పేర్కొంది. ఈ ఆదేశాలకు ముందు వరకు విమానాల్లో మాస్కు తప్పనిసరి నిబంధన అమల్లో ఉంది. మాస్కు ధరించని కారణంగా ప్రయాణికులను కిందకు దింపిన సందర్భాలు కూడా ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం దేశంలో గత 24 గంటల్లో కొత్త 501 కరోనా కేసులు వెలుగుచూశాయి. అంతకుముందు దేశవ్యాప్తంగా 474 కేసులు మాత్రమే నమోదయ్యాయి. 2020 ఏఫ్రిల్ 6 తర్వాత ఇవే అత్యల్పం కావడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే విమానాల్లో మాస్కు తప్పనిసరి నిబంధనను కేంద్రం ఎత్తివేసింది. చదవండి: ఢిల్లీ హత్యోదంతం.. ఆ ఒక్క అబద్దమే అతడ్ని పట్టించింది.. -
సైరస్ మిస్త్రీ విషాదం: గడ్కరీ కీలక నిర్ణయం, త్వరలోనే ఆదేశాలు
న్యూఢిల్లీ: టాటాసన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో అకాల మరణం నేపథ్యంలో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై కారులో ప్రయాణించే వారందరికీ సీటు బెల్టు ధరించడం తప్పనిసరి చేస్తామన్నారు. సెప్టెంబర్ 4న జరిగిన కారు ప్రమాదంలో టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ మృతి చెందడమే ఈ నిర్ణయానికి కారణమని గడ్కరీ తెలిపారు. సైరస్ మిస్త్రీ మరణం తర్వాత, కారులో వెనుక సీటు ప్రయాణికుల భద్రత దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనుందని ఒక మీడియా కార్యక్రమంలో వెల్లడించిన కేంద్రమంత్రి వెనుకసీటులో కూర్చున్నవారికి కూడా సీటు బెల్ట్ తప్పని సరిగి ధరించాలని వ్యాఖ్యానించారు. త్వరలోనే వెనుకసీట్లో కూర్చున్న వారితో సహా కారులో ప్రయాణించే అందరూ సీటు బెల్ట్ ధరించడం తప్పనిసరి చేస్తామని చెప్పారు. సీటుబెల్ట్ ధరించకుంటే సీట్‌బెల్ట్ బీప్ సిస్టమ్ కూడా అమలులో ఉంటుందని గడ్కరీ తెలిపారు. అంతేకాదు ఈ నిబంధన పాటించిక పోతే జరిమానా కూడా విధించేఅవకాశం ఉందని, దీనికి సంబంధించిన ఆదేశాలనుమూడు రోజుల్లో జారీ చేస్తామని కూడా గడ్కరీ పేర్కొన్నారు. (పండుగ వేళ ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం, ఫైర్ క్రాకర్స్ బ్యాన్ ) కాగా మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మిస్త్రీ కన్నుమూశారు. మితిమీరిన వేగానికితోడు, వెనుక సీట్లో కూర్చున్న మిస్త్రీ సీటు బెల్ట్ పెట్టుకోకోవడంతోనే ప్రాణాలు కోల్పోయారని పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
మలేషియా సంచలన నిర్ణయం... మరణ శిక్ష రద్దు!
Death Penalty Remains Mandatory For Several Offences: మలేషియా సంచలన నిర్ణయం తీసుకుంది. హత్య, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా తదితర తీవ్రమైన నేరాలకు మలేషియా దేశంలో మరణశిక్ష తప్పనిసరి. ఐతే మలేషియా ప్రభుత్వం కొన్ని నేరాల్లో విధించే తప్పనిసరి మరణశిక్షను రద్దు చేయడానికి అంగీకరించినట్లు తెలిపింది. 2018లోనే అధికారాన్ని చేజిక్కించుకున్న సంస్కరణవాద కూటమి మరణశిక్షను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఐతే రాజకీయ ప్రత్యర్థులు, బాధితుల కుటుంబాల నుంచి వచ్చిన వ్యతిరేకత కారణంగా ఈ మరణశిక్ష రద్దు నిలిచిపోయింది. ప్రస్తుతం కేబినేట్ మరణ శిక్షను రద్దు చేసేందుకు సమ్మతించినట్లు న్యాయశాఖ మంత్రి వాన్ జునైది తువాంకు జాఫర్ తెలిపారు. కానీ ఈ మరణశిక్షకు ప్రత్యామ్యాయంగా ఎలాంటి శిక్షలు విధించవచ్చనే దానిపై తదుపరి అధ్యయనం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాదు ఈ విషయంపై నిర్ణయం అన్ని పార్టీల హక్కులను రక్షించే విధంగా ఇవ్వడానికే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మార్పులు చేయడానికి పార్లమెంట్లో చట్టం చేయవలసి ఉంటుందన్నారు. పైగా ఇది పూర్తి స్థాయిలో అమలు కావడానికి కూడా కాస్త సమయం పడుతుందని అన్నారు. మానవ హక్కుల ఆసియా డిప్యూటీ డైరక్టర్ ఫిల్ రాబర్ట్సన్ తప్పనిసరి మరణశిక్షను తొలగిస్తామని మలేషియా బహిరంగంగా ప్రకటించడం ఒక ముఖ్యమైన ముందడుగుగా అభినందించారు. ఐతే మలేషియాలో ఇంతవరకు వరుసగా అధికాలోకి వచ్చిన ఇతర ప్రభుత్వాలు ఈ మరణశిక్షను రద్దు చేస్తాం అంటూ... మాటలకే పరిమితం చేశాయే తప్ప ఆచరణలోకి తీసుకు రావడంలో విఫమయ్యాయి. (చదవండి: తనని తాను కాల్చుకునేలోపే ఊహించని దారుణం... ఆ తర్వాత) -
ఆ నిర్ణయంతో చిన్న కార్లకు కష్టకాలమే!
న్యూఢిల్లీ: ప్యాసింజర్ కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్స్ తప్పనిసరి ఉండాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై దేశీయ వాహన రంగ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా స్పందించింది. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని సూచించింది. ఇప్పటికే తగ్గుతున్న చిన్న కార్ల మార్కెట్‌పై ప్రతిపాదిత నిబంధన తీవ్ర ప్రభావం చూపిస్తుందని సంస్థ చైర్మన్ ఆర్.సి.భార్గవ వెల్లడించారు. వాహన రంగంలో ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ‘మూడేళ్లుగా చిన్న కార్ల విభాగం అమ్మకాలు తగ్గుతూ వస్తున్నాయి. ద్విచక్ర వాహనదారులు అప్‌గ్రేడ్ అయ్యే అవకాశాలను దెబ్బతీస్తుంది. ధరలు దూసుకెళ్తుండడంతో మెట్రోయేతర ప్రాంతాల్లో విక్రయాలు తగ్గాయి. ఆరు ఎయిర్‌బ్యాగ్స్ తప్పనిసరి అయితే ధర రూ.20–25 వేల దాకా అధికం అవుతుంది. చిన్న కారు కొనుగోలుదార్లకు ఇది భారమే’ అని భార్గవ వివరించారు. -
పోలీస్స్టేషన్ల సీసీటీవీల్లో ఆడియో ఫుటేజీ తప్పనిసరి
న్యూఢిల్లీ: పోలీస్ స్టేషన్లలోని సీసీటీవీల్లో వీడియోతో పాటు ఆడియో రికార్డింగ్ సదుపాయం కూడా తప్పనిసరిగా ఉండాల్సిందేనని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ‘‘లాకప్‌లు, కారిడార్లు, లాబీలు, రిసెప్షన్ ప్రాంతం, వరండాలు, ఔట్హౌస్లు, ఇన్స్పెక్టర్ చాంబర్ వంటి అన్నిచోట్లా నైట్ కాప్చరింగ్ సదుపాయంతో కూడిన వీడియోతో పాటు ఆడియో రికార్డింగ్ తప్పనిసరని సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశించింది. ఈ మేరకు అన్ని పోలీస్స్టేషన్లలోనూ సీసీటీవీ వ్యవస్థలను ఆధునీకరించాలని స్పష్టంగా చెప్పింది’’ అని గుర్తు చేసింది. ఢిల్లీలోని ఓ పోలీస్‌స్టేషన్‌లో ఆడియో రికార్డింగ్ వ్యవస్థ లేకపోవడాన్ని తప్పుబడుతూ కోర్టు ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. -
సీఎం యోగి కీలక నిర్ణయం.. అక్కడ జాతీయ గీతం తప్పనిసరి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో రెండోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. సీఎంగా యోగి ఆదిత్యానాథ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. యూపీలోని మదర్సాలలో జాతీయ గీతం ఆలపించడం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు గురువారం జారీ చేసింది. ఉత్తరప్రదేశ్ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డ్ కౌన్సిల్ మదర్సాలలో ప్రతీరోజు తరగతులు ప్రారంభించడానికి ముందు జాతీయ గీతాన్ని ఆలపించడాన్ని తప్పనిసరి చేస్తూ యోగి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు బీజేపీ అధికార ప్రతినిధి రాకేశ్ త్రిపాఠి తెలిపారు. జాతీయ గీతం ఆలపించడం మదర్సా విద్యార్థులందరిలో జాతీయతా భావాన్ని పెంపొందిచేలా చేస్తుందని అన్నారు. Uttar Pradesh Madrasa Education Board Council has made singing of National Anthem mandatory at madrasas before the start of classes. — ANI UP/Uttarakhand (@ANINewsUP) May 12, 2022 ఇది కూడా చదవండి: ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం -
ఏటీఎస్‌లలోనే వాహనాల ఫిట్ నెస్ పరీక్షలు
న్యూఢిల్లీ: వాహనాల ఫిట్నెస్ పరీక్షలను ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్స్‌లోనే (ఏటీఎస్) నిర్వహించడం తప్పనిసరి కానుంది. దశల వారీగా 2023 ఏప్రిల్ నుంచి ఈ నిబంధన అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. సరుకు రవాణా, ప్యాసింజర్ విభాగంలో భారీ వాహనాలకు 2023 ఏప్రిల్ 1, మధ్యస్థాయి, తేలికపాటి వాహనాలకు 2024 జూన్ 1 నుంచి ఇది తప్పనిసరి కానుంది. ఈ మేరకు ప్రజల అభిప్రాయాల కోసం డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసినట్లు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. వ్యక్తిగత వాహనాలకు సైతం రానున్న రోజుల్లో ఈ నిబంధన అమలు చేస్తారు. -
సొంత వాహనాల్లోనూ మాస్క్ తప్పనిసరి! ఇంకెన్నాళ్లు?
కరోనా టైంలో ‘మాస్క్ తప్పనిసరి’ ఆదేశాలను కొన్ని రాష్ట్రాలు తూ.చా. తప్పకుండా పాటిస్తున్నాయి. ముఖ్యంగా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న ప్రాంతాల్లో కఠినంగానే అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో సొంత వాహనాల్లో ప్రయాణాలపై.. అదీ ఒంటరిగా ఉన్నప్పుడూ మాస్క్ తప్పనిసరి చేయడంపై ఢిల్లీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ: ఒంటరి ప్రయాణంలో.. అదీ సొంత వాహనాల్లో మాస్క్ తప్పనిసరి ఆదేశాల్ని ఢిల్లీ ప్రభుత్వం ఇంకా అమలు చేస్తోంది. దీనిపై నమోదు అయిన ఓ పిటిషన్‌పై స్పందించింది ఢిల్లీ హైకోర్టు. కొవిడ్-19 పేరుతో ఇంకా ఆ నిర్ణయాన్ని అమలు చేయడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. ‘ఇది అసలు అర్థం పర్థం లేని నిర్ణయం. ఇంకా ఎందుకు అమలు చేస్తున్నారు?. సొంత కారులో కూర్చుని ఇంకా మాస్క్ తప్పనిసరిగా ధరించడం ఏంటి? అని జస్టిస్ విపిన్‌సింగ్, జస్టిస్ జస్మిత్ సింగ్ నేతృత్వంలోని బెంచ్ వ్యాఖ్యలు చేసింది. పరిస్థితులు ఇంకా అలానే ఉన్నాయా? ఇంకా ఈ ఆదేశం ఉండడం ఏంటి? తక్షణమే చర్యలు తీసుకోండి అంటూ ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒక వ్యక్తి తన తల్లితో కలిసి కారులో కూర్చుని.. అదీ కారు అద్దాలు ఎక్కించుకుని మరీ కాఫీ తాగుతూ ఉన్నాడు. ఈ క్రమంలో ఆ వ్యక్తి ఫొటో తీసి.. ఛలాన్ పంపింది ఢిల్లీ ట్రాఫిక్ విభాగం. దీనిపై సదరు వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. అయితే గతంలో సింగిల్ బెంచ్ న్యాయమూర్తి ఓ కేసులో ఇచ్చిన తీర్పు ఆధారంగా ఆదేశాలను తాము అనుసరిస్తామని.. అయినా ఆ తీర్పుపై మరోసారి కోర్టును ఆశ్రయించినట్లు ప్రభుత్వ తరపున న్యాయవాది రాహుల్ మెహ్రా వివరణ ఇచ్చుకున్నారు. మరి అలాంటప్పుడు.. అలాంటి ఆదేశాలను పక్కకు పెట్టే ఆలోచన ఢిల్లీ ప్రభుత్వం ఎందుకు చేయడం లేదని పేర్కొంటూ.. తక్షణమే ఆ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలంటూ ఆదేశించింది. ఇదిలా ఉంటే వ్యక్తిగత వాహనాల్లో కాకుండా.. పబ్లిక్ ప్లేస్‌లలో ఇతర ఏ వెహికిల్స్‌లో ప్రయాణించినా మాస్క్ తప్పనిసరి అంటూ సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశించింది. -
కొన్ని కేటగిరీల్లో ఈ–ఫైలింగ్ తప్పనిసరి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని అన్ని హైకోర్టుల్లో 2022 జనవరి 1వ తేదీ నుంచి కొన్ని కేటగిరీల్లో ఈ–ఫైలింగ్ తప్పనిసరి చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. దీనిప్రకారం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ప్రభుత్వం ద్వారా వచ్చే కేసులు/పిటిషన్లకు ఈ–ఫైలింగ్ తప్పనిసరి కానుంది. ఆ తేదీ తర్వాత ఏ విషయంలోనూ ప్రభుత్వం భౌతికంగా కేసులు వేయడానికి వీలులేదు. రెవెన్యూ, పన్ను, మధ్యవర్తిత్వం, వాణిజ్య వివాదాలు, హైకోర్టు ద్వారా సాగే ఇతర కేటగిరీల్లో అందరికీ ఈ–ఫైలింగ్ తప్పనిసరి చేయాలి. అంతేగాక సబార్డినేట్ కోర్టుల తీర్పులు/ఉత్తర్వులకు వ్యతిరేకంగా పిటిషన్లు, అప్పీళ్లు, రివిజన్లకు ఈ–ఫైలింగ్ తప్పనిసరి. డబ్బు రికవరీ సూట్లు (బ్యాంకుల ద్వారా రుణ రికవరీ సూట్లు, అద్దె బకాయిలు మొదలైనవి), నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ సెక్షన్ 138 కింద ఫిర్యాదులు, నిర్వహణ కోసం దరఖాస్తులు, పరస్పర అంగీకారం ద్వారా విడాకుల పిటిషన్లు, బెయిల్ దరఖాస్తులను కూడా ఈ–ఫైలింగ్ ద్వారానే స్వీకరిస్తారు. (సమాచారం: ఐక్యతా శిల్పం సందర్శన ఐదు రోజులపాటు నిలిపివేత) -
వ్యాక్సిన్: మందుబాబులకు పరేషాన్!
లక్నో: కరోనా మహమ్మారి అంతానికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ఒక్కటే శరణ్యం. ఈ నేపథ్యం ఉత్తర ప్రదేశ్‌లో ఇటావా జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా లాక్డౌన్ ప్రకటించగానే లిక్కర్‌షాపుల ముందు బారులు తీరే మందుబాబులకు షాకిచ్చేలా సంచలన నిర్ణయం తీసుకుంది. ‘నో వ్యాక్సిన్, నో లిక్కర్’ అనే విధానాన్ని అమలు చేయాలని లిక్కర్ షాపులకు స్థానిక అధికారులు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసే క్రమంలో మద్యం సేవించాలనుకునేవారికి వ్యాక్సిన్ తీసుకోవడాన్ని తప్పనిసరి చేస్తూ ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది. కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే మద్యాన్ని విక్రయించాలంటూ మద్యం షాపు యజమానులకు అధికారులు ఆదేశించారు. ఇటావా అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ఎడిఎం) హేమ్ కుమార్ సింగ్ ఆదేశాల మేరకు సైఫాయిలోని మద్యం దుకాణాల బయట పోస్టర్లు కూడా వెలిసాయి. వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే లిక్కర్ విక్రయించమని నోటీసుల్లో పేర్కొనడం విశేషం. అయితే ఇలాంటి ఉత్తర్వులేవీ తాము జారీ చేయలేదని ఇటావా జిల్లా ఎక్సైజ్ అధికారి కమల్ కుమార్ శుక్లా తెలిపారు. టీకాలు వేయడానికి జిల్లా యంత్రాంగం ప్రయత్నాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, అయితే మద్యం కొనుగోలుకు వ్యాక్సిన్ సర్టిఫికెట్లు తప్పనిసరి చేయమని ఆదేశించలేదని ఆయన అన్నారు. ఈ జిల్లాలో ఇప్పటివరకు 13వేల 777 కరోనా కేసులు నమోదయ్యాయి. 279మంది కరోనా కారణంగా మరణించారు. కాగా జూన్ నెలలో కోటి కరోనా వ్యాక్సిన్లను ఇవ్వాలని యూపీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. -
ఏపీ: కర్ఫ్యూ సమయంలో ఈ పాస్ తప్పనిసరి
సాక్షి, అమరావతి: కర్ఫ్యూ సమయంలో అంతర్రాష్ట్ర ప్రయాణాలు చేసేవారు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని, అందుకు అవసరమైన ఈ పాస్‌కు దరఖాస్తు చేసుకోవాలని డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. ఈ పాస్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన వివరాలను ఆయన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సిటిజన్ సర్వీసు పోర్టర్లో appolice.gov.in, twitter@appolice100, facebook@andhrapradeshstatepolice ద్వారా ఈ పాస్ పొందవచ్చని వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే తగిన ధ్రువపత్రాలను జతచేసి దరఖాస్తు చేసుకునేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. శుభకార్యాలు, అంత్యక్రియలకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సంబంధిత స్థానిక అధికారుల వద్ద నుంచి సరైన గుర్తింపుపత్రాలతో అనుమతులు పొందాలని సూచించారు. అందరూ కరోనా నిబంధనలు పాటిస్తూ పోలీస్‌శాఖకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. చదవండి: అత్యవసరమైతేనే బ్యాంకులకు రండి Ongole: కోవిడ్ కేర్ సెంటర్.. మెనూ అదుర్స్ -
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు పీహెచ్డీ తప్పనిసరి
సాక్షి, న్యూఢిల్లీ: సాంకేతిక సంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు పీహెచ్డీ తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును సమర్థించింది. డివిజన్ బెంచ్ తీర్పును సవాల్‌చేస్తూ ప్రియదర్శిని తదితరులు దాఖలు చేసిన పలు స్పెషల్ లీవ్ పిటిషన్లను బుధవారం జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ హృషీకేష్రాయ్ల ధర్మాసనం విచారించింది. ‘‘పే స్కేల్స్, సర్వీస్ కండీషన్స్, క్వాలిఫికేషన్ ఫర్ ద టీచర్స్, అదర్ అడకమిక్ స్టాఫ్ ఇన్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ డిగ్రీ రెగ్యులేషన్స్, 2010’’ని ఏఐసీటీఈ 2010 మార్చిలో జారీ చేసిందని కేరళ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది వి.చిదంబరేష్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ నిబంధనల ప్రకారం 2010 మార్చి 5 నుంచి సాంకేతిక సంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు పీహెచ్డీ చేసిన వారే అర్హులని కోర్టుకు తెలిపారు. చిదంబరేష్ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం ‘‘2003 ఫిబ్రవరి 18 నోటిఫికేషన్ ప్రకారం అసోసియేట్ ప్రొఫెసర్ (తదనంతరం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా మార్చారు) పోస్టు వచ్చిన ఏడేళ్లలో పీహెచ్డీ పొందాలి. అయితే ఇది 2010 వరకు మాత్రమే వర్తిస్తుంది. ఆ తర్వాత నుంచి పీహెచ్డీ పొందిన తర్వాత తేదీ నుంచి పోస్టు పరిగణనకు అర్హులు’’ అని ఆదేశాలు జారీ చేసింది. స్పెషల్ లీవ్ పిటిషన్లను కొట్టివేసింది. -
పాత వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి
న్యూఢిల్లీ : టోల్‌ప్లాజాల వద్ద నగదు చెల్లించే విధానాన్ని త్వరలోనే పూర్తిగా నిలిపివేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. డిజిటల్, ఐటీ ఆధారిత టోల్ ఫీజుల చెల్లింపు విధానాలను ప్రోత్సహించే దిశగా 2017 డిసెంబర్ 1కి ముందు విక్రయించిన వాహనాలన్నింటికీ ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తోంది. ఫాస్టాగ్ మొదలైన తర్వాత కూడా ఇంకా 40 శాతం మంది వాహనదారులు టోల్ ఫీజును నగదు రూపంలో చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2021 జనవరి 1 నుంచి దీన్ని అమలు చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు సెంట్రల్ మోటర్ వెహికల్స్ నిబంధనలకు రహదారి రవాణా శాఖ సవరణలు ప్రతిపాదించింది. సంబంధిత వర్గాల అభిప్రాయాలను కోరుతూ ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. (ప్రధాని ట్విట్టర్ ఖాతా హ్యాక్) -
పరిశ్రమలకు ఊరట, ఉద్యోగులకు షాక్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సంక్షోభంతో కుదేలైన పరిశ్రమలకు కేంద్రం ప్రభుత్వం ఊరటనిచ్చింది. లాక్డౌన్ సమయంలో పనిచేయని ఉద్యోగులకు వేతనాలు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తూ ఆదివారం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) ఉత్తర్వుల ను జారీ చేసింది. దీని ప్రకారం లాక్డౌన్ సమయంలో పని చేయని ఉద్యోగులకు కంపెనీలు ఇకపై తప్పనిసరిగా వేతనాలు చెల్లించాల్సిన అవసరం లేదు. కరోనావైరస్ లాక్డౌన్ కారణంగా పరిశ్రమలు మూతపడినా, ఎలాంటి కోతలు లేకుండా ఉద్యోగులందరికీ వేతనాలు చెల్లించాలంటూ మార్చి 29 న ఎంహెచ్ఏ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి విదితమే. కరోనా వైరస్ సంక్షోభాన్ని అడ్డుపెట్టుకుని ఐటీ ఉద్యోగులను తొలగించకుండా, వారి జీతాల్లో కోత విధించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యాన్ని సుప్రీంకోర్టు గత వారం తిరస్కరించింది. అలాగే మార్చి 20 న కార్మిక కార్యదర్శి నోటిఫికేషన్ , మార్చి 29న హోంశాఖ నోటిఫికేషన్ పై కర్ణాటక కేంద్రంగా పనిచేస్తున్న ఫికస్ పాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై స్పందించిన సుప్రీం ఈ కాలంలో తమ ఉద్యోగులకు పూర్తి జీతాలు చెల్లించలేని సంస్థలపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో తాజా ఆదేశాలు జారీ అయ్యాయి. (కరోనా : లాక్డౌన్ సడలింపుల వేళ గుడ్ న్యూస్!) కాగా ముదురుతున్న ఆర్థిక సంక్షోభం, ప్రధానంగా దేశస్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)గణనీయంగా క్షీణించనుందనే అంచనాల నేపథ్యంలో ఆర్థిక కార్యకాలాపాల పునరుద్ధరణ నిమిత్తం అనేక రాష్ట్రాలు కంటైన్మెంట్ జోన్లతో పాటు దాదాపు అన్ని ప్రాంతాలలో కీలకమైన ఆర్థిక కార్యకలాపాల ప్రారంభానికి ఆంక్షలను సడలించిన సంగతి తెలిసిందే. -
ఆధార్ "ఫేషియల్ రికగ్నిషన్" త్వరలో
సాక్షి, న్యూఢిల్లీ: ఆధార్ వ్యవస్థకు మరింత భద్రత కల్పించేలా యుఐడిఎఐ మరిన్ని చర్యల్ని చేపట్టనుంది. ఆధార్ ప్రమాణీకరణలో అదనపు ఫీచర్‌గా ఫేషియల్ రికగ్నిషన్‌ను మాండేటరీ చేయనుంది. ఆధార్ గుర్తింపును మరింత పకడ్బందీగా చేసేందుకు ఇకపై ఫేషియల్ రికగ్నిషన్ కూడా తప్పనిసరి చేయనున్నట్టు యుఐడిఎఐ తెలిపింది. సెప్టెంబర్ 15నుంచి ఆధార్ నెంబర్లను వారివారి ఫేషియల్ రికగ్నిషన్‌తో అనుసంధానం చేయాలని యూఐడీఏఐ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే వేలిముద్రలు, చేతిముద్రలు, కంటిపాపలతో ఆధార్ సెక్యూరిటీ కోసం జాగ్రత్తలు తీసుకున్న అధికారులు మరిన్ని భద్రతా ప్రమాణాల దృష్ట్యా ఇకపై ఫేషియల్ రికగ్నిషన్ ని తప్పనిసరి చేస్తున్నారు. ఈ మేరకు యూఐడీఏఐ తో పనిచేస్తున్న అన్ని ఏజెన్సీలు, సర్టిఫైడ్ బయోమెట్రిక్ డివైస్ ప్రొవైడర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఓ పది శాతం లావాదేవీలను పరిశీలించి సమీక్షిస్తామని సీఈఓ అజయ్ భూషణ్ చెప్పారు.ఈ నిబంధనను ఎవరు అతిక్రమించినా సెక్షన్ 42, 43 ప్రకారం జైలుశిక్ష గానీ, జరిమానా గానీ లేదా రెండూ గానీ విధిస్తారని అజయ్ భూషణ్ చెప్పారు. కాగా ఆధార్ చట్టబద్దతను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు వాదనలు కొనసాగుతున్నాయి. -
‘చచ్చినా’ వదలడం లేదు..
వారణాసి, ఉత్తరప్రదేశ్ : ‘వ్యక్తిగత గోప్యత - ఆధార్ అనుసంధానం’ మీద ప్రజలకున్న అనుమానాలు తీరకముందే మరో కొత్త ప్రతిపాదన తెర మీదకొచ్చింది. బతికున్న వారికే కాదు ఇక మీదట మరణించిన వారికి కూడా ఆధార్ తప్పనిసరి అంటోంది వారణాసిలోని జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్).గంగానది తీరంలో ఉన్న మణికర్ణిక ఘాట్, హరిశ్చంద్ర ఘాట్లలో అంత్యక్రియలు నిర్వహించాలంటే బంధువులు మరణించిన వ్యక్తి ఆధార్ కార్డును తప్పనిసరిగా చూపించాలంటున్నారు. ఈ ఘాట్లలో మృతదేహంతో పాటు, దానికి అంత్యక్రియలు నిర్వహించడానికి వచ్చే బంధువులను తీసుకెళ్లడానికి ఎన్డీఆర్ఎఫ్ వారు ‘కార్పస్ క్యారియర్ మోటార్ బోటు’ సౌకర్యం కల్పిస్తుంటారు. ఇక మీదట మరణించిన వ్యక్తి ఆధార్ కార్డు చూపిస్తేనే వారికి ఈ సౌకర్యం కల్పించనున్నట్లు ఘాట్ నిర్వహకులు తెలిపారు. ఈ నియమాన్ని తీసుకురావడం వెనుక బలమైన కారణమే ఉందంటున్నారు ఘాట్ నిర్వహకులు. కొంతకాలంగా ‘సుధాన్షు మెహతా’ ఫౌండేషన్‌కు చెందిన వ్యక్తులు మణికర్ణిక ఘాట్‌లో అంత్యక్రియల నిర్వహణకు కావాల్సిన సదుపాయాలు కల్పిస్తున్నారు. దానిలో భాగంగా 2015లో మొత్తం 4 కార్పస్ ‘మోటర్ క్యారియర్ బోట్ల’ను ఏర్పాటు చేశారు. కానీ గత కొన్ని రోజుల నుంచి అనుమానాస్పద స్థితిలో చనిపోయిన వారిని తీసుకువచ్చి రహస్యంగా ఇక్కడ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. అందువల్లే ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని తెలుపుతున్నారు సంస్థ సభ్యులు. ఇప్పటికే ఆధార్ భద్రత గురించి వివాదాలు నడుస్తున్న నేపథ్యంలో ఈ కొత్త నిబంధనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. హిందూవుల విశ్వాసం ప్రకారం మరణించిన వారికి కాశీలో అంత్యక్రియలు చేస్తే పుణ్యం అనే నమ్మకంతో చాలా మంది తమ ఆత్మీయుల చివరి కార్యక్రమాలను కాశీలో నిర్వహించడానికి వస్తుంటారు. కానీ ఇప్పుడు తీసుకువచ్చిన ఈ నూతన నియమం దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఇబ్బందిగా మారనుండటంతో ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. -
నీట్‌కు ఆధార్ తప్పనిసరి -సీబీఎస్ఈ
సాక్షి, న్యూఢిల్లీ: నీట్- 2018 పరీక్షకు ఆధార్ నంబర్ అనుసంధానం తప్పని సరి చేస్తూ సీబీఎస్ఈ ఆదేశాలు జారీ చేసింది. నీట్- 2018 పరీక్షలకు ఆధార్ నంబర్ అనుసంధానం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అధికారిక వెబ్సైట్లో సీబీఎస్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంటన్స్ టెస్ట్ (నీట్) దరఖాస్తుకు ఆధార్ నంబర్ తప్పనిసరి సెంట్రల్ బోర్డ్ అఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఆదేశించింది. ఈ మేరకు పరీక్ష తేదీ తదితర వివరాలను cbseneet.nic.in లో గురువారం వెల్లడించింది. అసోం,జమ్ము కశ్మీర్, మేఘాలయ మినహాయించి మిగతా రాష్ట్రాల అభ్యర్థులు ఆధార్ నెంబర్‌ను తప్పనిసరిగా ఇవ్వాలని పేర్కొంది. అండర్గ్రాడ్యుయేట్ మెడికల్ అండ్ డెంటల్ కోర్సులు ప్రవేశానికి మే 6 వ తేదీన నిర్వహించనున్న ఈ పరీక్షకు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తు ప్రక్రియ ఈ రోజునుంచి(ఫిబ్రవరి 9) ప్రారంభమై మార్చి 9 వతేదీ 11.50 వరకు గడువు వుంటుందని సీబీఎస్ఈ తెలిపింది. మరిన్ని వివరాలు బోర్డు తేదీ అధికారిక వెబ్ సైట్ cbseneet.nic.inలో లభ్యం. -
అటల్ పెన్షన్‌కూ ఆధార్ తప్పనిసరి
సాక్షి, న్యూఢిల్లీ: అటల్ పెన్షన్ యోజన (ఏపీవై)లో మదుపు చేసే సబ్స్క్రైబర్లు తప్పనిసరిగా ఆధార్ వివరాలు ఇవ్వాలని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) స్పష్టం చేసింది. సబ్స్క్రైబర్ల ఆధార్ కార్డు నెంబర్‌ను కోరుతూ పీఎఫ్ఆర్డీఏ అటల్ పెన్షన్ యోజన రిజిస్ట్రేషన్ ఫాంలో మార్పులు చేసింది. 2018 జనవరి 1 నుంచి ఏపీవైకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేస్తూ పీఎఫ్ఆర్డీఏ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 1 నుంచి సవరించిన దరఖాస్తు ప్రకారం ఏపీవై ఫాంను పూర్తి చేయాలని సర్వీస్ ప్రొవైడర్లందరికీ సమాచారం పంపింది. అసంఘటిత రంగ కార్మికుల భవిష్యత్ అవసరాల కోసం మోదీ సర్కార్ 2015 మేలో అటల్ పెన్షన్ యోజనను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ స్కీమ్ కింద ప్రతి సబ్‌స్క్రైబర్ 60 ఏళ్లు నిండిన అనంతరం కనీస నెలవారీ ఫించన్‌ను అందుకుంటారు. -
ఫిబ్రవరి 1నుంచే ఇ-వే బిల్లు
జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ పన్ను పరిధిలో ఇ-వే బిల్లు విధానాన్ని కచ్చితంగా అమలు చేసేలా నిర్ణయం తీసుకుంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం జరిగిన ఈ సమావేశంలో ఇ-వే బిల్లు విధానాన్ని తప్పని సరిచేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంట్రా-స్టేట్ ఇ-వే బిల్లు జూన్ 1 నుంచి తప్పనిసరి చేసింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి వస్తువుల అంతర్ రాష్ట్ర ఇ-వే బిల్లు మాండేటరీ అని జీఎస్టీ కౌన్సిల్ ప్రకటించింది. దీన్ని ట్రయల్ రన్ కోసం జనవరి 16నాటికి సిద్ధం చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఇ-వే బిల్లు విధానం, ఇన్వాయిస్ మ్యాచింగ్ తదితర అంశాలపై చర్చించిన 24వ జీఎస్టీ మండలి సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం రూ. 50వేల విలువకంటే ఎక్కువ వస్తువులను రవాణా చేస్తే తప్పనిసరిగా ఇ-వే బిల్లు, రాష్ట్రంలో 10 కి.మీ లోపు వస్తువులను రవాణా చేస్తే ఇంట్రా స్టేట్ ఇ-వే బిల్లు ఉండాలి. కొన్ని రాష్ట్రాలు ఫిబ్రవరి 1 నుంచి స్వచ్ఛంద ప్రాతిపదికన ఇంటర్-స్టేట్ , ఇంట్రాస్టేట్ ఇ-వే బిల్లును అమలు చేస్తాయని కౌన్సిల్ తెలిపింది. అయితే ఇంట్రా స్టేట్ ఇ-వే బిల్లు విధానం మాత్రం ఫిబ్రవరి నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. కాగా అంతర్ రాష్ట్ర వస్తువుల రవాణా, పన్నుల ఎగవేత నిరోధాన్ని ఇ-వే బిల్లు విధానాన్ని జనవరి 1 నుంచి దశలవారీగా..ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకురావాలని గతంలో నిర్ణయించింది. దీనిపై రివ్యూ నిర్వహించిన మండలి ఈ నిర్ణయం అమలు ఫిబ్రవరికి ప్రీ పోన్ చేసింది. అలాగే నవంబరులో గువాహటిలో జరిగిన గత మండలి సమావేశంలో 178 వస్తువులపై పన్ను రేట్లు తగ్గించిన విషయం తెలిసిందే.