అపుడు కూడా ఆధార్ ఉండాల్సిందే..
న్యూడిల్లీ: దాదాపు అన్ని ప్రభుత్వ పథకాలకు ఆధార్ కార్డు నమోదును కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మరణ నమోదుకు కూడా ఆధార్ నంబర్‌ను మాండేటరీ చేస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. అక్టోబరు 1 2017 నుంచి ఇది అమలు కానుంది హోం మంత్రి త్వశాఖ ప్రకటించింది.
ఐడెంటిటీని గుర్తించడంలో అక్రమాలను, మోసాలను నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని హోమ్ మంత్రిత్వశాఖ తెలిపింది. అందుకే మరణ నమోదు సమయంలో ఆధార్ నెంబర్ అనుసంధానం తప్పని సరి అని తేల్చి చెప్పింది.
కాగా ప్రభుత్వ, ప్రభుత్వేతర బ్యాంకు ఖాతాలు, సేవలు, బీమా, పన్నుల సేవలతోపాటు రాయితీ లబ్ధి, పింఛన్లు, ఉపకార వేతనాలు, సామాజిక పథకాల లబ్ధి, విద్య, ఉద్యోగం, ఆరోగ్యరక్షణ, మొబైల్ నెంబర్ వగైరాలకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి. అలాగే అక్రమ సంపాదనకు, బినామీ ఆస్తులకు చెక్‌పెట్టే యోచనలో భాగంగా ఆదాయ పన్ను దాఖలు కూడా ఆధార్‌ను తప్పని సరి చేసింది. అలాగే ఆధార్ తో పాన్ అనుసంధానం కూడా తప్పనిసరిగా చేయాలని చెప్పింది. ఆగస్టు 31 లోపు ఆధార్‌తో అనుసంధానం కాని పాన్‌కార్డ్‌లు చెల్లవని కూడా తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.