october 1
-
వివాద్ సే విశ్వాస్ పథకం 2024: రేపటి నుంచే అమల్లోకి..
గతంలో ఇటువంటి స్కీములు వచ్చాయి. ప్రత్యక్ష పన్ను మదింపులో హెచ్చుతగ్గులు సహజం. మనం లెక్కించిన దానికన్నా పన్ను భారం పెరిగితే మనం అప్పీలుకు వెళ్లవచ్చు. అలాగే డిపార్టుమెంటు వారు కూడ అప్పీలుకు వెళ్లవచ్చు. అప్పీలుకు వెళ్లడం అంటే వివాదమే. ఈ వివాదాలు ఒక కొలిక్కి వచ్చేసరికి సమయం ఎంత వృధా అవుతుంది. కాలయాపనతో పాటు మనశ్శాంతి లేకపోవటం, అశాంతి, అనారోగ్యం మొదలైనవి ఏర్పడతాయి. అటువంటి వివాదాల జోలికి పోకుండా పన్ను భారాన్ని వీలున్నంత వరకు తగ్గించి కట్టేలా చేసే స్కీమ్ ఇది. ఇది 2024 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. వివాదాలు పోయి ఒకరి విశ్వాసాన్ని మరొకరు పొందడమే దీని పరమావధి. ఈ స్కీమ్‌ని నోటిఫై చేశారు.ముఖ్యాంశాలు➤2024 జూలై వరకు ఏర్పడ్డ వివాదాలకు ఇందులో అవకాశం కల్పించారు. ➤సుప్రీంకోర్టు ముందు, హైకోర్టులు ముందు, ట్రిబ్యునల్స్ ముందు పెండింగ్‌లో ఉన్న వివాదాల విషయంలో మీరు డిక్లేర్ చేయొచ్చు. ➤సెర్చ్‌లో, సీజర్లో, ప్రాసిక్యూషన్‌లో ఉన్నవి, విదేశాల్లో ఉన్న ఆస్తులు, ఆదాయం తెలియచేయని వారికి ఇతర చట్టాల ప్రకారం ఏర్పడ్డ ప్రొసీడింగ్స్‌కి ఈ స్కీమ్ వర్తించదు. ➤2020లో అమల్లోకి వచ్చిన స్కీములోలాగే ఉదాహరణల వర్తింపు, విధివిధానాలు, సెటిల్మెంట్ పద్ధతి మొదలైనవి ఉన్నాయి. ➤పన్ను, వడ్డీ, ఫెనాల్టీ, రుసుము మొదలైన విషయాల్లో వివాదం.. అంటే తేడా ఉంటే, ఈ స్కీమ్‌లో ప్రయోజనం పొందవచ్చు. అప్పీలు ఏ స్థాయిలో ఉన్నా ఈ స్కీమ్‌లోకి రావచ్చు. ➤కమిషనర్ ముందు రివిజన్‌కి వెళ్లినప్పుడు, ఆ విషయం పెండింగ్‌లో ఉంటే ఇందులో ప్రయోజనం పొందవచ్చు. ➤సకాలంలో డిక్లరేషన్స్ ఇచ్చి ఈ స్కీమ్‌లో చేరితే పన్నుల భారం తగ్గుతుంది. వివాదం సమసిపోతుంది. డిపార్ట్మెంట్ దృష్టిలో ఒక రకమైన సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది. ఇందులో నాలుగు ఫారాలు ఉన్నాయి. మొదటి ఫారం ఒక డిక్లరేషన్. ప్రతి వివాదానికొక ఫారం ప్రత్యేకంగా దాఖలు చేయాలి. రెండో ఫారం, అంటే నిర్ధారిత అధికారి జారీ చేసే ధృవపత్రానికి సంబంధించినది. మూడో ఫారంలో పన్ను చెల్లింపు వివరాలుంటాయి. నాలుగో ఫారంలో స్కీము ఉత్తర్వులు ఉంటాయి. ముందుగా ఫారం 1 ఆన్లైన్లో దాఖలు చేయాలి. దీనితో పాటు ఫారం 3 కూడా వేయాలి. అయితే, ఫారం 3 అప్పీల్ విత్‌డ్రా చేసినట్లు వివరాలు ఇవ్వాలి. మనం విత్‌డ్రా చేసినట్లయితేనే ఈ స్కీమ్‌కి అర్హత సంపాదిస్తాము. విత్‌డ్రా చేసే నాటికి అప్పీలు ఆర్డర్లు పూర్తయినట్లుగా ఉండకూడదు. అంటే, ఇప్పటికి ఆర్డర్లు అయినట్లు ఉండేవారు ఈ స్కీమ్‌లో చేరకూడదు.ముందు ముందు ఎటువంటి ప్రాసిక్యూషన్స్ ఉండవు. ఇలాంటి స్కీమ్‌ల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఖర్చులు తగ్గుతాయి. సమయం తగ్గుతుంది. అనిశ్చిత పరిస్థితి ఉండదు. అప్పీలు తీరేవరకు టెన్షన్ మొదలైనవి ఉండవు. సంవత్సరాల తరబడి పేరుకుపోయిన పెండింగ్ వివాదాలు మాయం అవుతాయి. మీ దగ్గర ఏవైనా పెండింగ్‌లో ఉంటే ఈ స్కీమ్‌లో చేరడం మంచిది. -
డొమెస్టిక్ నేచురల్ గ్యాస్ ధర పెంపు
డొమెస్టిక్ నేచురల్ గ్యాస్ ధరను కేంద్ర ప్రభుత్వం పెంచింది. అక్టోబర్ నెలలో డొమెస్టిక్ నేచురల్ గ్యాస్ ధరను ఒక మెట్రిక్ మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ (mmBtu)కు 8.60 డాలర్లు (రూ.715) నుంచి 9.20 డాలర్లు (రూ.765) కు పెంచింది. 2023 అక్టోబర్ 1 నుంచి 31వ తేదీ మధ్య కాలానికి దేశీయ సహజ వాయువు ధరను పెంచినట్లు తెలియజేస్తూ కేంద్ర పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ శాఖ తాజాగా ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. సీఎన్జీ ధరలపై ప్రభావం ప్రభుత్వం డొమెస్టిక్ నేచురల్ గ్యాస్‌ను పెంచడంతో గ్యాస్ పంపిణీ సంస్థలు సీఎన్జీ, పీఎన్జీ ధరలను పెంచే అవకాశం ఉంది. నేచురల్ గ్యాస్ అనేది శిలాజ ఇంధనం. దీన్ని పలు పారిశ్రామిక అవసరాలతోపాటు వంట గ్యాస్ గానూ ఉపయోగిస్తారు. వరుసగా రెండో నెల డొమెస్టిక్ నేచురల్ గ్యాస్ ధర పెంచడం ఇది వరుసగా రెండో నెల. సెప్టెంబర్‌లో ఈ గ్యాస్ ధర ఒక మెట్రిక్ మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ (mmBtu)కు 7.85 డాలర్ల నుంచి 8.60 డాలర్లకు పెరిగింది. ఇప్పుడు అక్టోబర్‌లోనూ 8.60 డాలర్ల నుంచి 9.20 డాలర్లు పెరిగింది. -
ఇండిగో ఉద్యోగులకు అక్టోబర్ 1 నుంచి పండగే..!
అతిపెద్ద దేశీయ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo)ను నిర్వహిస్తున్న ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ తమ పైలట్లు, క్యాబిన్ సిబ్బందికి వేతనాలను పెంచినట్లు ఒక నివేదిక తెలిపింది. వేతనాల పెంపుదల అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. గత ఏడాది ఇండిగో తమ సిబ్బందికి రెండు విడతల్లో 10 శాతానికిపైగా జీతాలను పెంచింది. ఈ విమానయాన సంస్థ పైలట్లకు నెలకు 70 గంటల చొప్పున స్థిరమైన వేతనాన్ని కూడా కొనసాగిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. 2023-24 మొదటి త్రైమాసికంలో ఇండిగో రికార్డు స్థాయిలో రూ. 3,090 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. భారతీయ విమానయాన సంస్థలు అంతర్జాతీయంగా, దేశీయంగా విస్తరించడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఉన్న పైలట్లు వెళ్లిపోకుండా చూసుకోవడంతోపాటు కొత్త పైలట్లను నియమించుకోవడానికి గట్టి పోటీనే ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నారు. ఇండిగో కార్యకలాపాలు ప్రారంభించి 17 ఏళ్లు కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ సంస్థ 320కు పైగా విమానాలతో 1,900 రోజువారీ సర్వీసులు నిర్వహిస్తోంది. దేశీ విమానయాన మార్కెట్లో ఈ సంస్థకు 63 శాతం వాటా ఉంది. 32 అంతర్జాతీయ, 81 దేశీయ గమ్యస్థానాలకు ప్రయాణికులను చేరవేస్తోంది. అయితే ఇటీవల పీఅండ్‌డబ్ల్యూ ఇంజన్లలో సమస్యల కారణంగా కొన్ని ఏ320 విమానాలను నిలిపివేయాల్సి వచ్చింది. దీన్ని అధిగమించేందుకు సంస్థ కొన్ని విమానాలను వెట్‌లీజ్ తీసుకుంది. -
1న మోదీ షెడ్యూల్ ఖరారు
సాక్షి, హైదరాబాద్: వచ్చేనెల 1న (అక్టోబర్) ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఆదివారం మధ్యాహ్నం 11.20 గంటలకు ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి ఐఏఎఫ్ ప్రత్యేక విమానంలో బయల్దేరి మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడికి దగ్గరలోనే ఉన్న ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్, రైల్వే, ఇతర శాఖల అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు బేగంపేట నుంచి ఎంఐ–17 ప్రత్యేక హెలీకాప్టర్‌లో బయల్దేరి మధ్యాహ్నం 3.05 గంటలకు మహబూబ్‌నగర్‌కు చేరుకుంటారు. మహబూబ్‌నగర్ శివార్లలోని భూత్పూర్లో మధ్యాహ్నం 3.15 నుంచి 4.15 గంటల వరకు జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. సాయంత్రం 4.30 గంటలకు మహబూబ్‌నగర్ హెలీపాడ్ నుంచి హెలీకాప్టర్‌లో 5.05 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి 5.10 గంటలకు ఐఏఎఫ్ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు పయనమవుతారు. 3న మరోసారి రాష్ట్రానికి మోదీ అక్టోబర్ 3న ప్రధాని మోదీ మరోసారి రాష్ట్రానికి రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నిజామాబాద్‌లో రోడ్‌షో, బహిరంగసభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా పసుపుబోర్డుకు సంబంధించిన ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించడంతోపాటు, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. -
అక్టోబర్ 1 నుంచి అమలయ్యే కొత్త మార్పులు, నిబంధనలు ఇవే..
మ్యూచువల్ ఫండ్ ఫోలియోలు, డీమ్యాట్ ఖాతా, ట్రేడింగ్ ఖాతాలు, రూ.2000 నోట్ల డిపాజిట్ వంటి ఆర్థికంగా ముఖ్యమైన పలు అంశాలకు డెడ్‌లైన్ సెప్టెంబర్ 30తో ముగియనుంది. అలాగే పలు కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అవేంటో ఒక్కొక్కటిగా ఈ కథనంలో తెలుసుకుందాం. మ్యూచువల్ ఫండ్లకు నామినీల చేర్పు ప్రస్తుతం ఉన్న అన్ని మ్యూచువల్ ఫండ్ ఫోలియోలకు నామినీలను చేర్చడానికి గడువు సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. ఆ తర్వాత డెబిట్‌లకు వేలు లేకుండా ఫోలియోలు ఫ్రీజ్ అవుతాయి. (RBI Rules: వారికి 6 నెలలే సమయం.. ఆర్బీఐ కీలక నిబంధనలు) కొత్త టీసీఎస్ నియమాలు క్రెడిట్ కార్డ్‌లపై విదేశీ ఖర్చులు రూ. 7 లక్షలు దాటితే 20 శాతం టీసీఎస్ అక్టోబర్ 1 నుంచి అమలు కానుంది. వైద్య లేదా విద్యా ప్రయోజనాల కోసం రూ. 7 లక్షలకు మించి ఖర్చు చేస్తే 5 శాతం టీసీఎస్ విధిస్తారు. ఇక విదేశీ విద్య కోసం రుణాలు రూ.7 లక్షల పరిమితి దాటితే 0.5 శాతం టీసీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలకు నామినేషన్ కరెంట్ ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాదారులకు లబ్ధిదారుని నామినేట్ చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. మార్కెట్ రెగ్యులేటర్ సర్క్యులర్ ప్రకారం.. 'ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాల అసెస్మెంట్ ఆధారంగా నామినేషన్ వివరాల ఎంపిక (అంటే నామినేషన్ లేదా నామినేషన్ నుంచి వైదొలగడానికి డిక్లరేషన్ అందించడం) గడువు తర్వాత అప్డేట్ చేయడానికి వీలుండదు. వాటాదారుల నుంచి స్వీకరించిన ప్రతిపాదనలు, ఖాతాల స్తంభనకు సంబంధించి 2022 ఫిబ్రవరి 24 నాటి సెబీ సర్క్యులర్‌లోని 3 (ఎ) పేరా, 2021 జూలై 23 నాటి సెబీ సర్క్యులర్‌లోని పేరా 7లో పేర్కొన్న నిబంధనలు సెప్టెంబర్ 30 నుంచి అమల్లోకి వస్తాయి. రూ. 2,000 నోట్ల మార్పిడి రూ.2000 నోట్లను ఆర్బీఐ చలామణి నుంచి ఉపసంహరించిన విషయం తెలిసిందే. ఈ రూ.2000 నోట్లను మార్చుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ సెప్టెంబర్ 30ని డెడ్ లైన్ గా నిర్ణయించింది. ఇప్పటికీ తమ వద్ద రూ. 2,000 నోట్లు ఉన్న వారు గడువు తేదీలోపు బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలి. బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరి ఆధార్ నుంచి విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తు కోసం జనన ధృవీకరణ పత్రాలను సింగిల్ డాక్యుమెంట్‌గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన జనన మరణాల నమోదు (సవరణ) చట్టం-2023 అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తుంది. -
సిమ్ కార్డ్స్ నిబంధనలు మరింత కఠినం - ఉల్లంఘిస్తే..
SIM Cards Rules: భారత ప్రభుత్వం సిమ్ కార్డుల విషయంలో చాలా కఠినమైన నిబంధలనలను ప్రవేశపెట్టడానికి సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే 2023 అక్టోబర్ 01 నుంచి కొత్త నియమాలు అమలులోకి రానున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. దుకాణాలకు కఠినమైన నియమాలు.. సిమ్ కార్డులను విక్రయించే దుకాణాలు మునుపటి కంటే కూడా రానున్న రోజుల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. కొత్త రూల్స్ ప్రకారం అక్టోబర్ 1 నుంచి టెలికామ్ ఆపరేటర్లు రిజిస్టర్డ్ డీలర్ల ద్వారా మాత్రమే సిమ్ కార్డులను విక్రయించాయి. దీనికి వ్యతిరేఖంగా ప్రవర్తిస్తే వారికి రూ. 10 లక్షలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కంపెనీల బాధ్యత.. ఎయిర్టెల్, జియో వంటి పెద్ద టెలికామ్ కంపెనీలు తప్పకుండా తమ సిమ్ కార్డ్‌లను విక్రయించే దుకాణాలను తనిఖీ చేయాలి. అంతే కాకుండా దుకాణాలు నిబంధనలు పాటించేలా చూసుకోవాలి. పోలీసు తనిఖీలు.. పటిష్టమైన భద్రతలను అమలుపరచడానికి పోలీసులు కూడా దీనిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా అస్సాం, కాశ్మీర్ వంటి కొన్ని ప్రదేశాలలో కొత్త సిమ్ కార్డ్‌లను విక్రయించే దుకాణాలపై పోలీసు తనిఖీ చేసే అవకాశం ఉంటుంది. కావున విక్రయదారులు ఖచ్చితంగా నియమాలను అనుసరించాలి. ధృవీకరణ.. వినియోగదారులు కొత్త సిమ్ కార్డుని కొనుగోలు చేయాలన్నా.. లేదా పాతది పోయినప్పుడు & పనిచేయనప్పుడు ఖచ్చితంగా వివరణాత్మక ధృవీకరణ అందించాల్సి ఉంది. ఈ ప్రక్రియ సరైన వ్యక్తులకు మాత్రమే సిమ్ కార్డ్ యాక్సెస్ ఉందని నిర్థారిస్తుంది. కొత్త రూల్స్ సిమ్ కార్డులను సురక్షితం చేయడంలో ఉపయోగపడతాయి. అంతే కాకుండా మోసగాళ్ల భారీ నుంచి కూడా కాపాడంలో సహాయపడతాయి. -
కొత్త కారు కొంటున్నారా.. ఈ రూల్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు!
Bharat NCAP New Rules: ఆధునిక కాలంలో కార్లను కొనే చాలామంది వినియోగదారులు ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ ఉన్న వాహనాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు కూడా తమ ఉత్పత్తులను మరింత పటిష్టంగా రూపొందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భాగంగానే 2023 అక్టోబర్ 01 నుంచి మన దేశంలో కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారతదేశం కోసం ప్రత్యేకంగా రూపొందించిన 'భారత్ ఎన్సీఏపీ' (Bharat NCAP) అక్టోబర్ 01 నుంచి అమలులోకి రానుంది. మన దేశంలో తయారైన వాహనాలు మరింత భద్రతను కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ క్రాష్ టెస్ట్ నిర్వహించనున్నారు. దీనికి ఇప్పటికే దిగ్గజ ఆటోమొబైల్స్ సంస్థలు కూడా తమ అంగీకారం తెలిపాయి. భారత్ ఎన్సీఏపీ.. నిజానికి భారత్ ఎన్సీఏపీ అంటే 'న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్'. ఇది భారతదేశంలోని వాహనాలను మరింత పటిష్టం చేయడానికి దోహదపడుతుంది. మన దేశంలో తయారైన వాహనాలు మాత్రమే కాకుండా ఇతర దేశాల నుంచి దిగుమతైన వాహనాలకు కూడా తప్పనిసరిగా భారత్ ఎన్సీఏపీ సర్టిఫికెట్ ఉండాలి. (ఇదీ చదవండి: వందల కోట్లు వదిలి.. సన్యాసిగా మారిన బిలియనీర్!) భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ నిబంధనలను ప్రభుత్వం ఇప్పటికే ఫిక్స్ చేసింది. దీని ప్రకారం వాహనం డిజైన్, అడల్ట్ చైల్డ్ సేఫ్టీ, సేఫ్టీ అసిస్ట్ టెక్నాలజీ వంటివి తప్పకుండా కలిగి ఉండాలి. ఇప్పటికే అమలులో ఉన్న గ్లోబల్ ఎన్సీఏపీ అండ్ యూరో ఎన్సీఏపీ రెండు కూడా ఈ నియమాలనే పాటిస్తున్నాయి. (ఇదీ చదవండి: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్, రూ.20కే కడుపు నిండా భోజనం!) ప్రస్తుతం ఉన్న గ్లోబల్ ఎన్సీఏపీ వాహనాలకు క్రాష్ టెస్ట్ నిర్వహించి 1 నుంచి 5 స్టార్ రేటింగ్ అనేది అందిస్తుంది. భారత్ ఎన్సీఏపీ కూడా ఇదే విధంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ విధానంలో నిర్వహణ సంస్థ ఏదైనా షోరూమ్ నుంచి తమకు నచ్చిన కారుని సెలెక్ట్ చేసుకుని టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇందులో పెట్రోల్, డీజిల్, CNG, ఎలక్ట్రిక్ వాహనాలు ఉంటాయి. మొత్తం మీద రానున్న రోజుల్లో భరతదేశంలో తయారయ్యే అన్ని కార్లు ప్రయాణికుల భద్రతకు పెద్ద పీట వేస్తాయని తెలుస్తోంది. -
అక్టోబరు ఒకటిన 5జీ సేవలు లాంచ్
న్యూఢిల్లీ: వేగవంతమైన 5జీ సేవలకోసం ఎదురు చూస్తున్న ప్రజలకు ప్రభుత్వ జాతీయ బ్రాడ్‌బ్యాండ్ మిషన్ శనివారం గుడ్ న్యూస్ చెప్పింది. దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ అక్టోబరు 1న ప్రగతి మైదాన్‌లోని ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో ఇండియా 5జీ సేవలను ప్రారంభించనున్నట్లు ట్వీట్ చేసింది.రానున్న ఆసియాలో అతిపెద్ద టెక్నాలజీ ఎగ్జిబిషన్, ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో 5 జీ సేవలను లాంచ్ కానునున్నాయని ప్రకటించింది. (విప్రో ఉద్యోగులకు దసరా కానుక, 96 శాతం కవర్) దేశీయ డిజిటల్ పరివర్తన, కనెక్టివిటీని కొత్త శిఖరాలకు తీసుకువెళుతూ ప్రధాని ఈ సేవలను అందుబాటులోకి తీసుకు రానున్నారని వెల్లడించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధరర్వ్యంలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ)ని నిర్వహిస్తారు. కాగా అతి త్వరలోనే దేశంలో 5జీ టెలికాం సేవలు 80శాతం చేరువ కావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ గత వారం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
వాళ్లంతా అరవైలో ఇరవై
కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులేమో కానీ, ఆ వృద్ధుల్లో మాత్రం వయసు మీదపడినా ఉత్సాహమే ఉత్సాహం. కాటికి కాళ్లు చాపుకునే వయసులో కృష్ణా రామా అంటూ మూల కూర్చోవడం వాళ్ల పని కాదు. జీవిత చరమాంకంలో ఏం చెయ్యాలి, సమయాన్ని ఎలా గడపాలి అంటూ కుంగిపోయే జీవితం వాళ్లది కానే కాదు. సాటి పండుటాకుల్లో మనోస్థైర్యాన్ని నింపడమే వారి పని. అదే వాళ్లకు కొండంత బలం. అది చెన్నైకి చెందిన ఉధవి అనే స్వచ్ఛంద సంస్థ. వృద్ధాప్యంలో ఒంటరితనంతో బాధపడే వారిని ఆదుకోవాలన్న ఉద్దేశంతో అయిదేళ్ల క్రితమే మొదలైంది. ఈ సంస్థ ప్రత్యేకత ఏమిటంటే అక్కడ వాలంటీర్లు అందరూ కూడా డెబ్బయి ఏళ్ల పైబడిన వారే. వృద్ధులైతేనే సాటి వారి కష్టాలు అర్థం చేసుకుంటారన్న ఉద్దేశంతో సీనియర్ సిటిజన్లనే వాలంటీర్లుగా నియమించింది. ఇప్పుడు వారే ఒక సైన్యంగా మారారు. తమని తాము ఉత్తేజంగా ఉంచడమే కాదు, ఆపదలో ఉన్న తోటివారికి అండదండగా ఉంటున్నారు. సూపర్ హీరోయిన్లుగా గుర్తింపు పొందారు. అటు నుంచి ఫోన్ కాల్ ఒకటి వస్తుంది. సన్నటి ఏడుపు, బాధిస్తున్న ఒంటరితనం, ఏం చెయ్యాలో సమయాన్ని ఎలా గడపాలో తెలీని నిస్సహాయత, ఒక్కోసారి ఆత్మహత్యవైపు ప్రేరేపించే ఆలోచనలు. కాటికి కాళ్లు చాపుకునే వయసులో అయినవాళ్లు పట్టించుకోకపోతే ఆ బాధ అంతా ఇంతా కాదు. ఆ బాధ పంచుకోవడానికి ఒకరు కావాలి. అలాంటి ఫోన్ రాగానే 76 ఏళ్ల వయసున్న సుందర గోపాలన్ అనే వాలంటీర్ రెక్కలు కట్టుకొని ఆ బాధితుల దగ్గరకి వెళ్లిపోతారు. వాళ్లతో కబుర్లు చెబుతారు. జోకులు వేస్తారు. నవ్విస్తారు. కాసేపు అలా పార్కుకి తీసుకెళ్లి చల్లగాలిలో కలిసి వాకింగ్ చేస్తారు. డెబ్బయి ఆరేళ్ల వయసులో కూడా తాను ఎంత హాయిగా ఉన్నానో వాళ్లకి చెబుతారు. అలా ఏదో ఒక్కసారి కాదు. వారంలో రెండు, మూడు సార్లు వాళ్ల దగ్గరికి వెళ్లి వస్తుంటారు. అలా నెల రోజుల పాటు ఆ బాధితులతో టచ్‌లో ఉంటారు. మళ్లీ వారి ముఖం మీద చిరునవ్వు వచ్చేవరకు కౌన్సెలింగ్ ఇస్తారు. ‘ఒంటరితనం మనిషిని చంపేస్తుంది. నా భర్త చనిపోయినప్పుడు అదెంత బా«ధిస్తుందో నాకు తెలిసివచ్చింది.. అలాంటి బాధలో ఉన్నవారిని ఎలా బయటకు తీసుకురావాలో నాకు బాగా తెలుసు. జీవితం ముందుకు వెళ్లేలా వారికి అన్ని విధాలుగా సాయపడగలను‘ అని సుందర గోపాలన్ వివరించారు. వేదవల్లి శ్రీనివాస గోపాలన్. ఆమె వయసు 85. ఈ వయసులో కూడా స్వెట్టర్లు అల్లుతారు. హ్యాండ్‌బ్యాగ్స్ తయారు చేస్తారు. వాటిని ఇరుగుపొరుగు వాళ్లకి, స్నేహితులకి అమ్మి ఆ వచ్చిన డబ్బుని కష్టాల్లో ఉన్న వృద్ధులకి ఇస్తూ ఉంటారు. ‘ మా అమ్మ ఎప్పుడు చూసినా అదే పనిలో ఉంటుంది. తనని తాను కష్టపెట్టుకుంటుంది. ఆ పని వద్దన్నా వినిపించుకోదు. ఎంత ఎక్కువ మందికి సాయపడితే తనకు అంత తృప్తి అంటుంది. కానీ మాకు ఆమె ఆరోగ్యం ఏమైపోతుందోనన్న ఆందోళన ఉంటుంది‘ అని వేదవల్లి కుమార్తె కృష్ణవేణి చెప్పుకొచ్చారు. ఉధవి సంస్థ వ్యవస్థాపకురాలు సబితా రాధాకృష్ణన్, ఆమె వయసు 75 ఏళ్లు. అయినవాళ్లు ఎవరూ లేక ఒంటరితనంతో బాధపడే వృద్ధుల్లో కొత్త ఉత్తేజాన్ని నింపడం కోసమే ఆమె ఈ సంస్థ స్థాపించారు. చిన్న చిన్న అవసరాలైనా నేనున్నానంటూ తీరుస్తారు. గుళ్లు గోపురాలు తిప్పడం, షాపింగ్‌కు తోడు వెళ్లడం, రెస్టారెంట్లకి తీసుకువెళ్లడం, బ్యాంకు పనుల్లో సాయ పడడం వంటివి చేస్తూ ఉంటారు. ‘సీనియర్ సిటిజన్ల దైనిందిన కార్యక్రమాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ వారి ఒంటరితనాన్ని పోగొట్టడమే మా సంస్థ ప్రధాన ఉద్దేశం. వాలంటీర్లు అదే వయసు వారు ఉంటే వారి మధ్య వేవ్ లెంగ్త్ బాగా ఉంటుందని సీనియర్‌సిటిజన్లనే వాలంటరీర్లుగా నియమిస్తున్నాం‘ అని సబిత వెల్లడించారు. అంతేకాదు సీనియర్ సిటిజన్లు నిరంతరం పనిలో ఉంటేనే వారిలో మానసిక, శారీరక ఆరోగ్యం బాగా ఉంటుందని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. వాలంటీర్‌గా పని చేస్తున్న వృద్ధుల్లో చలాకీతనం బాగా పెరిగిందని సబిత చెప్పారు. ఇలాంటి సంస్థల అవసరం ఉంది మన దేశంలో సీనియర్ సిటిజన్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. జీవన ప్రమాణాలు మెరుగుపడడంతో వారి సంఖ్య పెరిగిపోతోంది. మన దేశంలో 60ఏళ్లపై బడినవారు 13 కోట్ల మంది ఉన్నారు. వారిలో 63శాతం మంది దారిద్య్ర రేఖకి దిగువన నివసిస్తున్నారు. అనారోగ్యంతో మంచానపడితే చూసే దిక్కులేనివారు 62% , ఇక కుటుంబ సభ్యుల నిర్లక్ష్యానికి గురవుతున్న వృద్ధులు 54%. మరో ఎనిమిదేళ్లలో దేశంలో వృద్ధుల సంఖ్య 17.3 కోట్లకు చేరుకోవచ్చు. ఇక 2050 నాటికి జనాభాలో 20 శాతం మంది వృద్ధులే ఉంటారని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్, హెల్పేజ్ ఇండియా సంస్థలు అంచనా వేశాయి. వృద్ధుల సంక్షేమం కోసమే ఐక్యరాజ్యసమితి అక్టోబర్ 1వ తేదీని ఇంటర్నేషనల్ డే ఫర్ ఓల్డర్ పర్సన్స్‌గా ప్రకటించింది. నానాటికి పెరిగిపోతున్న వృద్ధుల్ని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన సంస్థల అవసరమూ భవిష్యత్‌లో పెరుగుతుంది. అందుకే ఉధవి సంస్థ చేస్తున్న సేవల్ని అందరూ భేష్ అంటూ కొనియాడుతున్నారు. కాలక్షేపంలో వృద్ధులు -
గతవారం బిజినెస్
భారత్ రుణ భారం 485.8 బిలియన్ డాలర్లు.. భారత్ విదేశీ రుణ భారం ఈ ఏడాది జూన్ ముగిసే నాటికి 485.8 బిలియన్ డాలర్లు. అంతక్రితం త్రైమాసికం ము గింపుతో పోల్చితే 3% మేర ఈ భారం పెరిగిందని ఆర్బీఐ ప్రకటన తెలిపింది. విదేశీ పోర్టిఫోలియో ఇన్వెస్ట్మెంట్లు దేశీయ క్యాపిటల్ మార్కెట్ డెట్ విభాగంలోకి భారీగా రావడం త్రైమాసికంలో విదేశీ రుణం 3 శాతం పెరగడానికి కారణమని ఈ మేరకు విడుదలైన ఒక ప్రకటన తెలిపింది. పోటీతత్వంలో భారత్‌కు 40వ స్థానం అత్యధిక పోటీతత్వం గల ఆర్థిక వ్యవస్థల జాబితాలో భారత్ 40వ ర్యాంకు దక్కించుకుంది. గతేడాదితో పోలిస్తే ఒక స్థానం దిగజారింది. మొత్తం 137 దేశాలతో వరల్డ్ ఎకనామిక్ ఫోరం రూపొందించిన అంతర్జాతీయ పోటీతత్వ సూచీ (జీసీఐ) ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని స్విట్జర్లాండ్ సాధించింది. ఎస్బీఐ ఖాతాదారులకు ‘బ్యాలెన్స్’ ఊరట ఎస్బీఐ కనీస నెలవారీ బ్యాలెన్స్ (ఎంఏబీ) నిబంధనలను సడలించింది. సేవిం గ్స్ ఖాతాలపై ఇప్పటిదాకా రూ. 5,000గా ఉన్న ఎంఏబీని రూ. 3,000కు తగ్గించింది. బ్యాలెన్స్ నిబంధనలు పాటించకపోతే విధించే జరిమానాల పరిమాణాన్నీ సవరించింది. కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకొస్తాయి. దీని ప్రకారం.. పెన్షనర్లు, మైనర్లతో పాటు ప్రభుత్వ సామాజిక సంక్షేమపథకాల లబ్ధిదారులకు మిని మం బ్యాలెన్స్ నిబంధనల నుంచి మినహాయింపు లభిస్తుంది. గోల్డ్ స్పాట్ ఎక్సేంజ్ ఏర్పాటుకు బ్లూప్రింట్ బంగారం స్పాట్ ఎక్సేంజ్ ఏర్పాటుకు కేంద్రం ఆసక్తిగా ఉండ టంతో ఇందుకు సంబంధించి బ్లూప్రింట్ రూపొం దించేందుకు ప్రపంచ స్వర్ణ మండలి ఓ కమిటీని ఏర్పా టు చేస్తోంది. ఇందులో పరిశ్రమకు చెందిన వారు కూడా సభ్యులుగా ఉంటారు. అంబానీ సంపద... యెమెన్ జీడీపీకి రెట్టింపు! హురుణ్ ఇండియా సంపన్నుల జాబితా–2017లో ఆర్ఐఎల్ అధినేత ముకేశ్ అంబానీ వరుసగా ఆరోసారి అగ్ర స్థానాన్ని కైవసం చేసుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) షేర్లు ర్యాలీ జరపడం వల్ల ఈయన సంపద 58 శాతం వృద్ధితో రూ.2,57,900 కోట్లకు చేరింది. అంబానీ సంపద తను జన్మించిన యెమెన్ దేశపు జీడీపీ కన్నా 50 శాతం ఎక్కువగా ఉండటం గమనార్హం!!. ఇక పతంజలి సీఈవో బాలకృష్ణ సంపద 173 శాతం వృద్ధితో రూ.70,000 కోట్లకు చేరింది. దీంతో ఈయన 8వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అవెన్యూ సూపర్‌మార్ట్స్ (డిమార్ట్) ఫౌండర్ చైర్మన్ దమాని సంపదలో గరిష్టంగా 320 శాతం వృద్ధి నమోదయ్యింది. 2020 కల్లా 5జీ టెక్నాలజీ మరింత వేగవంతమైన వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులోకి తేవడంపై కేంద్రం దృష్టి సారించింది. ఇందులో భాగంగా 2020 నాటికల్లా 5జీ టెక్నాలజీని ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం ప్రత్యేకంగా అత్యున్నత స్థాయి 5జీ ఫోరంను ఏర్పాటు చేయడంతో పాటు పరిశోధన.. అభివృద్ధి కార్యకలాపాలకు తోడ్పడటానికి రూ.500 కోట్లతో నిధిని కూడా ఏర్పాటు చేయనుంది. భారత్ వృద్ధి రేటుకు ఏడీబీ కోత భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017–18) వృద్ధి రేటు అంచనాలను ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) 7 శాతానికి తగ్గించింది. జూలైలో ఈ రేటును 7.4 శాతంగా అంచనా వేసింది. ప్రైవేటు వినియోగం, తయారీ రంగం, వాణిజ్య పెట్టుబడుల పేలవ పనితీరు వంటివి అంచనాల కోతకు కారణమని పేర్కొంది. 2018–19 వృద్ధి అంచనాలను సైతం 7.6 శాతం నుంచి 7.4 శాతానికి తగ్గించింది. ‘నారీ’ శక్తి వీరిదే!! ఫార్చ్యూన్ తాజాగా అమెరికాకు వెలుపల అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాను విడుదల చేసింది. ఇం దులో భారత్‌కు చెందిన చందా కొచర్, శిఖా శర్మలకు స్థానం దక్కింది. ఇద్దరూ బ్యాంకింగ్ రంగానికి చెందిన వారే కావడం గమనార్హం. ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ చందా కొచర్ ఐదో స్థానాన్ని దక్కించుకోగా, యాక్సిస్ బ్యాంక్ ఎండీ, సీఈవో శిఖా శర్మ 21వ స్థానంలో నిలిచారు. బాన్కో శాంటాన్డర్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అన బొటిన్ అగ్రస్థానంలో ఉన్నారు. ఐసీఐసీఐ బ్యాంకు బంపర్ ఆఫర్ మార్ట్గేజ్ రుణ గ్రహీతలకు ఐసీఐసీఐ బ్యాంకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. వారు తీసుకున్న ఇంటి రుణాన్ని తిరిగి చెల్లించడం ద్వారా ఒక శాతం క్యాష్ బ్యాక్ పొందొచ్చు. ప్రతి నెలా వాయిదా చెల్లించిన వెంటనే ఒక శాతాన్ని బ్యాంకు వెనక్కిస్తుంది. 30 ఏళ్ల రుణ కాల వ్యవధిలో ఈ విధంగా రుణ గ్రహీత అసలులో 11 శాతం వరకు క్యాష్ బ్యాక్‌గా పొందొచ్చు. ఈ అవకాశం కొత్తగా రుణం తీసుకునేవారికే!!. 2025కి రియల్టీలో 80 లక్షల ఉద్యోగాలు! రియల్టీ రంగంలో 2025 నాటికి కొత్తగా 80 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. కొత్త రియల్ ఎస్టేట్ చట్టం (రెరా), జీఎస్టీ వంటి అంశాలు దీనికి ప్రధాన కారణంగా నిలువనున్నాయి. రియల్టీ సమాఖ్య క్రెడాయ్, కన్సల్టెంట్ సంస్థ సీబీఆర్ఈ సంయుక్త నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం.. దేశ జీడీపీలో రియల్ ఎస్టేట్ రంగం వాటా 2025 నాటికి రెట్టింపయి 13 శాతానికి చేరొచ్చు. 2016లో ఈ వాటా 6.3 శాతంగా ఉంది. రియల్టీలో గతేడాది 92 లక్షలుగా ఉన్న ఉద్యోగాలు 2025 నాటికి 1.72 కోట్లకు చేరొచ్చు. ఐసీసీయూలో టెలికం రంగం! తీవ్రమైన పోటీ, రుణభారంతో కుంగుతున్న టెలికం రంగం ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ) దాటి ఐసీసీయూ లోకి చేరిందని ఆర్‌కామ్ అధినేత అనిల్ అంబానీ వ్యాఖ్యానించారు. దీంతో ఇటు ప్రభుత్వానికి, అటు రుణదాతలకు కూడా భారీ రిస్కు తప్పదని హెచ్చరించారు. గుత్తాధిపత్య ధోరణుల దిశగా మార్కెట్ సాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆటోమొబైల్స్ ఐఫోన్ యూజర్లకు శుభవార్త. యాపిల్ ఐఫోన్–8, 8 ప్లస్ ఫోన్ల నిరీక్షణకు తెరపడింది. శుక్రవారం నుంచి వీటి విక్రయాలు ప్రారంభమయ్యాయి. కాగా ఐఫోన్–10 హ్యాండ్సెట్లు మాత్రం నవంబర్ 3 నుంచి అందుబాటులోకి వస్తాయి. వాహన తయారీ కంపెనీ ‘నిస్సాన్ మోటార్ ఇండియా’ తన డాట్సన్ బ్రాండ్ ఎంట్రీ లెవెల్ హ్యాచ్‌బ్యాక్ కారు ’డాట్సన్ రెడిగో గోల్డ్’ అనే లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. 1 లీటర్ ఇంజిన్ సామర్థ్యంతో వస్తోన్న ఈ కారు ధర రూ.3.69 లక్షలుగా (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ) ఉంది. హెచ్ఎండీ గ్లోబల్ తాజాగా ’నోకియా8’ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.36,999గా ఉంది. ఈ ఫోన్లు అక్టోబర్ 14 నుంచి అందుబాటులోకి వస్తాయి. ’ఆసుస్’ తాజాగా కొత్త నోట్‌బుక్ ’వివోబుక్ ఎస్15’ని మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.59,990గా ఉంది. అలాగే ’జెన్‌బుక్ యూఎక్స్430’ ల్యాప్‌టాప్‌ను కూడా ఆవిష్కరించింది. దీని ధర రూ.74,990గా ఉంది. దోమలను తరిమేసే స్మార్ట్ఫోన్లు కూడా మార్కెట్లోకి వచ్చేశాయి. మొబైల్ హ్యాండ్సెట్స్ కంపెనీ ఎల్జీ తాజాగా ఇలాంటి ఫీచర్‌తో ’కే7ఐ’ అనే స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.7,990గా ఉంది. ’మహీంద్రా’ తాజాగా ’బొలెరొ మ్యాక్సీట్రక్ ప్లస్’ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.5.24 లక్షలు. ‘టయోటా కిర్లోస్కర్ మోటార్’ తన ‘ఎతియోస్ క్రాస్’లో లిమిటెడ్ ఎడిషన్ ’ఎతియోస్ క్రాస్ ఎక్స్’ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.6.64 లక్షలుగా (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ) ఉంది. -
అపుడు కూడా ఆధార్ ఉండాల్సిందే..
న్యూడిల్లీ: దాదాపు అన్ని ప్రభుత్వ పథకాలకు ఆధార్ కార్డు నమోదును కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మరణ నమోదుకు కూడా ఆధార్ నంబర్‌ను మాండేటరీ చేస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. అక్టోబరు 1 2017 నుంచి ఇది అమలు కానుంది హోం మంత్రి త్వశాఖ ప్రకటించింది. ఐడెంటిటీని గుర్తించడంలో అక్రమాలను, మోసాలను నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని హోమ్ మంత్రిత్వశాఖ తెలిపింది. అందుకే మరణ నమోదు సమయంలో ఆధార్ నెంబర్ అనుసంధానం తప్పని సరి అని తేల్చి చెప్పింది. కాగా ప్రభుత్వ, ప్రభుత్వేతర బ్యాంకు ఖాతాలు, సేవలు, బీమా, పన్నుల సేవలతోపాటు రాయితీ లబ్ధి, పింఛన్లు, ఉపకార వేతనాలు, సామాజిక పథకాల లబ్ధి, విద్య, ఉద్యోగం, ఆరోగ్యరక్షణ, మొబైల్ నెంబర్ వగైరాలకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి. అలాగే అక్రమ సంపాదనకు, బినామీ ఆస్తులకు చెక్‌పెట్టే యోచనలో భాగంగా ఆదాయ పన్ను దాఖలు కూడా ఆధార్‌ను తప్పని సరి చేసింది. అలాగే ఆధార్ తో పాన్ అనుసంధానం కూడా తప్పనిసరిగా చేయాలని చెప్పింది. ఆగస్టు 31 లోపు ఆధార్‌తో అనుసంధానం కాని పాన్‌కార్డ్‌లు చెల్లవని కూడా తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. -
అక్టోబర్ 1 నుంచి మైసూరులో దసరా ఉత్సవాలు
సాక్షి, బెంగళూరు: మైసూరు దసరా ఉత్సవాలను అక్టోబర్ 1 నుంచి 11వ తేదీ వరకూ నిర్వహించనున్నారు. వరుస కరువుల నేపథ్యంలో గతేడాది ఉత్సవాలను సాదాసీదాగా నిర్వహించారు. ఈ ఏడాది కర్ణాటకలో మంచి వర్షాలు పడుతుండటంతో ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఉత్సవాల్లో ఆకర్షణీయమైన జంబు సవారీ అక్టోబర్ 11న జరగనుంది. బెంగళూరులోని విధానసౌధలో గురువారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ విషయాన్ని వెల్లడించారు. -
లారీల నిరవధిక సమ్మె
కోవూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ అక్టోబరు 1వ తేదీ నుంచి ఆలిండియా లారీల నిరవధిక సమ్మె చేస్తున్నట్లు లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గోపాలనాయుడు అన్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరులోని అసోసియేషన్ కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా లారీల రవాణా ద్వారా మన ప్రభుత్వానికి రూ.కోట్లు ఆదాయం వస్తోందన్నారు. పెట్రోలు ధర తగ్గించాలి.. పెట్రోలు ధరలను దేశంలో ఎక్కడ లేని విధంగా మనరాష్ట్రంలో లీటరుకు రూ.4 అధికంగా ఉందని ఏపీ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గోపాలకృష్ణ , జిల్లా ప్రధానకార్యదర్శి రవికుమార్ అన్నారు. అక్టోబర్ 1 నుంచి పెట్రోలు బంకుల నిరవధిక బంద్ జరుగుతుందన్నారు.