గతంలో ఇటువంటి స్కీములు వచ్చాయి. ప్రత్యక్ష పన్ను మదింపులో హెచ్చుతగ్గులు సహజం. మనం లెక్కించిన దానికన్నా పన్ను భారం పెరిగితే మనం అప్పీలుకు వెళ్లవచ్చు. అలాగే డిపార్టుమెంటు వారు కూడ అప్పీలుకు వెళ్లవచ్చు. అప్పీలుకు వెళ్లడం అంటే
వివాదమే. ఈ వివాదాలు ఒక కొలిక్కి వచ్చేసరికి సమయం ఎంత వృధా అవుతుంది. కాలయాపనతో పాటు మనశ్శాంతి లేకపోవటం, అశాంతి, అనారోగ్యం మొదలైనవి ఏర్పడతాయి. అటువంటి వివాదాల జోలికి పోకుండా పన్ను భారాన్ని వీలున్నంత వరకు తగ్గించి కట్టేలా చేసే స్కీమ్ ఇది. ఇది 2024 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. వివాదాలు పోయి ఒకరి విశ్వాసాన్ని మరొకరు పొందడమే దీని పరమావధి. ఈ స్కీమ్‌ని నోటిఫై చేశారు.
ముఖ్యాంశాలు
➤2024 జూలై వరకు ఏర్పడ్డ వివాదాలకు ఇందులో అవకాశం కల్పించారు.
➤సుప్రీంకోర్టు ముందు, హైకోర్టులు ముందు, ట్రిబ్యునల్స్ ముందు పెండింగ్‌లో ఉన్న వివాదాల విషయంలో మీరు డిక్లేర్ చేయొచ్చు.
➤సెర్చ్‌లో, సీజర్‌లో, ప్రాసిక్యూషన్‌లో ఉన్నవి, విదేశాల్లో ఉన్న ఆస్తులు, ఆదాయం తెలియచేయని వారికి ఇతర చట్టాల ప్రకారం ఏర్పడ్డ ప్రొసీడింగ్స్‌కి ఈ స్కీమ్ వర్తించదు.
➤2020లో అమల్లోకి వచ్చిన స్కీములోలాగే ఉదాహరణల వర్తింపు, విధివిధానాలు, సెటిల్మెంట్ పద్ధతి మొదలైనవి ఉన్నాయి.
➤పన్ను, వడ్డీ, ఫెనాల్టీ, రుసుము మొదలైన విషయాల్లో వివాదం.. అంటే తేడా ఉంటే, ఈ స్కీమ్‌లో ప్రయోజనం పొందవచ్చు.
అప్పీలు ఏ స్థాయిలో ఉన్నా ఈ స్కీమ్‌లోకి రావచ్చు.
➤కమిషనర్ ముందు రివిజన్‌కి వెళ్లినప్పుడు, ఆ విషయం పెండింగ్‌లో ఉంటే ఇందులో ప్రయోజనం పొందవచ్చు.
➤సకాలంలో డిక్లరేషన్స్ ఇచ్చి ఈ స్కీమ్‌లో చేరితే పన్నుల భారం తగ్గుతుంది. వివాదం సమసిపోతుంది. డిపార్ట్‌మెంట్ దృష్టిలో ఒక రకమైన సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది.
ఇందులో నాలుగు ఫారాలు ఉన్నాయి. మొదటి ఫారం ఒక డిక్లరేషన్. ప్రతి వివాదానికొక ఫారం ప్రత్యేకంగా దాఖలు చేయాలి. రెండో ఫారం, అంటే నిర్ధారిత అధికారి జారీ చేసే ధృవపత్రానికి సంబంధించినది. మూడో ఫారంలో పన్ను చెల్లింపు వివరాలుంటాయి. నాలుగో ఫారంలో స్కీము ఉత్తర్వులు ఉంటాయి. ముందుగా ఫారం 1 ఆన్‌లైన్‌లో దాఖలు చేయాలి. దీనితో పాటు ఫారం 3 కూడా వేయాలి. అయితే, ఫారం 3 అప్పీల్ విత్‌డ్రా చేసినట్లు వివరాలు ఇవ్వాలి. మనం విత్‌డ్రా చేసినట్లయితేనే ఈ స్కీమ్‌కి అర్హత సంపాదిస్తాము. విత్‌డ్రా చేసే నాటికి అప్పీలు ఆర్డర్లు పూర్తయినట్లుగా ఉండకూడదు. అంటే, ఇప్పటికి ఆర్డర్లు అయినట్లు ఉండేవారు ఈ స్కీమ్‌లో చేరకూడదు.
ముందు ముందు ఎటువంటి ప్రాసిక్యూషన్స్ ఉండవు. ఇలాంటి స్కీమ్‌ల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఖర్చులు తగ్గుతాయి. సమయం తగ్గుతుంది. అనిశ్చిత పరిస్థితి ఉండదు. అప్పీలు తీరేవరకు టెన్షన్ మొదలైనవి ఉండవు. సంవత్సరాల తరబడి పేరుకుపోయిన పెండింగ్ వివాదాలు మాయం అవుతాయి. మీ దగ్గర ఏవైనా పెండింగ్‌లో ఉంటే ఈ స్కీమ్‌లో చేరడం మంచిది.
Comments
Please login to add a commentAdd a comment