new scheme
-
కొత్త పథకం.. ఈపీఎఫ్‌వో గడువు పెంపు
యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) యాక్టివేట్ చేసుకోవడానికి జనవరి 15 నుండి ఫిబ్రవరి 15 వరకు గడువును పొడిగిస్తున్నట్లు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ప్రకటించింది . "యూఏఎన్ యాక్టివేషన్, ఆధార్ సీడింగ్ కోసం గడువును 2025 ఫిబ్రవరి 15 వరకు పొడిగించాం" అని ఫిబ్రవరి 2 నాటి సర్క్యులర్‌లో ఈపీఎఫ్‌వో పేర్కొంది.యూఏఎన్ అంటే..?యూఏఎన్ లేదా యూనివర్సల్ అకౌంట్ నంబర్ అనేది ఈపీఎఫ్‌వో ద్వారా సభ్యులకు కేటాయించే ఒక విశిష్టమైన 12-అంకెల సంఖ్య. ఇది ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలను నిర్వహరణకు కీలకం. ఇది వివిధ కంపెనీల నుండి అన్ని ఈపీఎఫ్ ఖాతాలను ఒకే ఖాతాలోకి లింక్ చేస్తుంది. ఉద్యోగాలు మారేటప్పుడు నిధులను సులభంగా బదిలీ చేసుకోవడంలో సహాయపడుతుంది.యూఏఎన్ సురక్షిత ప్రామాణీకరణ ద్వారా ఖాతా సమాచారం, లావాదేవీలు రెండింటినీ రక్షిస్తూ భద్రతను పెంచుతుంది. అంతేకాకుండా వివిధ కంపెనీల కింద సృష్టించిన ఎక్కువ పీఎఫ్ ఖాతాలను ఏకీకృతం చేసే ఇబ్బందిని తొలగిస్తూ, ఉద్యోగుల పదవీ విరమణ పొదుపు ప్రక్రియను క్రమబద్ధీకరించడంలో సహాయపడుతుంది. యూఏఎన్ జనరేట్ చేయడానికి అవసరమైన పత్రాలలో పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, గుర్తింపు రుజువు (పాస్‌పోర్ట్, ఓటరు ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి), చిరునామా రుజువు, బ్యాంక్ ఖాతా వివరాలు మొదలైనవి ఉన్నాయి.ఈఎల్ఐ పథకంసంఘటిత రంగంలో ఉపాధిని పెంచడమే లక్ష్యంగా 2024 బడ్జెట్లో ఎంప్లాయీ లింక్డ్ ఇన్సెంటివ్ (ELI) పథకాలను ప్రవేశపెట్టారు. ఇవి అటు యాజమాన్యాలతోపాటు ఇటు మొదటిసారి ఉద్యోగులకు ఇద్దరికీ ప్రయోజనాలను అందిస్తాయి. ఈ ప్రయోజనాలను పొందడానికి ప్రతిఒక్కరూ ఈపీఎఫ్‌వోలో నమోదు చేసుకోవాలి.ప్రస్తుతం మూడు ఈఎల్ఐ పథకాలు ఉన్నాయి. వాటిలో స్కీమ్-ఎ అనేది మొదటిసారి ఉద్యోగులకు వర్తిస్తుంది. స్కీమ్-బి తయారీ రంగంలోని కార్మికులకు, , స్కీమ్-సి యాజమాన్యాలకు మద్దతు అందిస్తుంది. ఈపీఎఫ్‌వోకి సంబంధించిన ఈఎల్ఐ పథకం కింద ప్రయోజనాలను పొందడానికి యాఏఎన్ యాక్టివేషన్, బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి. -
ఇంటింటా లక్ష్మీకళ
ఆడపిల్ల పుడితే ‘అయ్యో’ అంటూ సానుభూతి చూపేవాళ్లు మన దేశంలో ఎన్నోచోట్ల కనిపిస్తారు.మధ్యప్రదేశ్‌లో ఈ ధోరణి మరీ ఎక్కువ. ఆడిపిల్ల పుడితే ఆర్థికభారంగా భావించి పురిట్లోనే ప్రాణం తీసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మార్పు తేవడానికి మన తెలుగు బిడ్డ, ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి ‘లాడ్లీ లక్ష్మీ యోజన’తో నడుం బిగించారు. ప్రతిష్ఠాత్మకమైన ‘బేటీ బచావో బేటీ పడావో’ కు స్ఫూర్తిగా నిలిచిన ఈ సంక్షేమ పథకాన్ని పదిహేను రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం...కొందరు ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు అప్పటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ఆడపిల్ల పుడితే భారంగా భావించడం నుంచి భ్రూణహత్యల వరకు ఎన్నో విషయాలపై మాట్లాడారు. ఆయన మాటల్లో ఎంతో ఆవేదన కనిపించింది. ‘ఈ పరిస్థితుల్లో మనం మార్పు తేవాలి’ అనే పట్టుదల కనిపించింది.ఇదీ చదవండి: Maha Kumbh Mela 2025: ‘కండల బాబా’ స్పెషల్ ఎట్రాక్షన్, ఎవరీ బాహుబలి‘మనం మాత్రం ఏం చేయగలం సర్, ప్రజలు అలా ఆలోచిస్తున్నారు!’ అని ఆ అధికారులు చేతులెత్తేస్తే కథ కంచికి వెళ్లినట్లే. అయితే కథ అక్కడితో ముగిసిపోలేదు. అక్కడినుంచే మొదలైంది. ముఖ్యమంత్రితో సమావేశం అయిన వారిలో ఐఏయస్ అధికారి నరహరి కూడా ఉన్నారు. ఒక సమస్యకు పది రకాల పరిష్కార మార్గాలు ఆలోచించడం ఆయన సొంతం.‘మనం ఏం చేయలేమా!’... సీఎం ఆవేదనపూరిత మాటలు నరహరి మనసులో సుడులు తిరిగాయి.‘కచ్చితంగా చేయాల్సిందే. చేయగలం కూడా’ అని ఒకటికి పదిసార్లు అనుకున్నారు. పేదింటి బిడ్డ అయిన నరహరికి పేదోళ్ల కష్టాలు తెలియనివేమీ కాదు. ఆడపిల్ల అంటే పనిగట్టుకొని వ్యతిరేకత లేకపోయినా పేదరికం వల్ల మాత్రమే ‘ఆడబిడ్డ వద్దు’ అనుకునే వాళ్లను ఎంతోమందిని చూశారు. ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయడానికి హరియాణ, పంజాబ్... మొదలైన రాష్ట్రాల్లో ఎన్నో ప్రాంతాలు తిరిగారు. ఎన్నో కోణాలలో ఎన్నో ప్రశ్నలు వేశారు.‘మేం బతకడమే కష్టంగా ఉంది. ఇక ఆడబిడ్డను ఎలా బతికించుకోవాలి సారు’ అనే మాటలను ఎన్నో ప్రాంతాలలో విన్నారు. వారికి ఆర్థిక భరోసా ఇస్తే సమస్యకు పరిష్కారం దొరికినట్లే కదా! అలా మొదలైందే లాడ్లీ లక్ష్మీ యోజన(గారాల కూతురు). ఇది సంక్షేమ పథకం మాత్రమే కాదు... సామాజిక మార్పు తెచ్చిన శక్తి. ఆడపిల్ల భారం అనే భావన తొలగించేందుకు వారికి ముందు ఆర్థిక భరోసా కల్పించాలి. అదే సమయంలో అమ్మాయిలను విద్యావంతులను చేయాలి... ఈ కోణంలో పథకానికి రూపకల్పన చేశారు. (అత్యధిక జీతాన్ని వద్దనుకొని.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలు)‘పుట్టగానే అమ్మాయిని లక్షాధికారి చేస్తాం’ అని ప్రకటించారు. అయితే ఆ డబ్బు చేతికందడానికి షరతులు విధించారు. అమ్మాయి ఇంటర్ పూర్తి చేయాలి. 5వ తరగతి పూర్తి చేస్తే రూ.2000, 8వ తరగతి పూర్తి చేస్తే రూ.4000 చొప్పున ప్రతి తరగతికి బోనస్ చెల్లింపులు చేశారు. అమ్మాయికి పద్దెనిమిది ఏళ్లు వచ్చాక మాత్రమే ‘లాడ్లీ లక్ష్మీ యోజన’ కు సంబంధించిన డబ్బులు చెల్లించేవారు. అలా పథకం వందశాతం విజయవంతమైంది.ఆడపిల్ల పుడితే రైఫిల్ లైసెన్స్!మధ్యప్రదేశ్‌లోని చంబల్లోయప్రాంతాల్లో కొన్ని కులాల ప్రజలు రైఫిల్‌ను సామాజిక హోదాగా భావిస్తారు. మగవారు సైకిల్ మీద తిరిగినా భుజాన తుపాకీ ఉండాల్సిందే! ఆడపిల్లలను పురిట్లోనే చంపేసేవారు కూడా ఆప్రాంతాల్లో ఎక్కువే. ఆప్రాంతాలలో ‘లాడ్లీ లక్ష్మీ యోజన’ అంతగా ఫలితం ఇవ్వలేదు. దీంతో ప్రతి 1000 మంది బాలురకు 400 మంది బాలికలే మిగిలారు. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని ఆయా కులాల వారితో సమావేశం నిర్వహించారు. ‘ఆడపిల్లలను మీరు వద్దనుకుంటూ పోతే వారే కాదు చివరికి మీ కులాలు త్వరలోనే అంతరించి పోవడం ఖాయం’ అని కులపెద్దలకు చెప్పారు. దీంతో వారిలో మార్పు వచ్చింది. అయితే తమకు తుపాకీ లైసెన్స్ లేకుండా ఉండలేమన్నారు. దీంతో ఆడపిల్ల పుడితే రైఫిల్ లైసెన్స్ అని నిబంధన విధించారు!2007 నుంచి 50 లక్షల మంది ఆడపిల్లలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. బాలికల లింగ నిష్పత్తి 400 నుంచి 950కి పెరిగింది. ‘లాడ్లీ లక్ష్మీ యోజన’ ద్వారా సామాజిక ఫలాలు అందుతున్న తీరును అధ్యయనం చేసి ఎంతోమంది పీహెచ్డీ చేశారు.లింగ వివక్షకు తావు లేని సమాజాన్ని కల కంటున్నారు నరహరి. అది చారిత్రక అవసరం. తక్షణ అవసరం.భ్రూణహత్యల నివారణకు...‘లాడ్లీ లక్ష్మీ యోజన’ పథకం విజయవంతంగా అమలు చేస్తూనే మరోవైపు భ్రూణహత్యలపై దృష్టి సారించారు. ఇందుకోసం ఆశావర్కర్లు, అంగన్ వాడీ కార్యకర్తలు, నర్సులు, కిందిస్థాయి సిబ్బందితో విస్తృతమైన విజిలెన్స్ నెట్వర్క్ ఏర్పాటు చేశారు. తప్పుదారి పట్టిన వైద్యులపై కేసులు నమోదు చేశారు. దీంతో చట్టాన్ని ఉల్లంఘించిన వైద్యులు దారికొచ్చారు.పేదింటి బిడ్డఎంతోమంది ఆడపిల్లల జీవితాల్లో వెలుగులు నింపిన నరహరిది తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్. నిరుపేదింట జన్మించిన నరహరి కష్టపడి చదివి ఐఏఎస్ అయ్యారు. ప్రస్తుతం పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఉన్నారు. జన్మభూమికి ఏదైనా చేయాలనే ఆశయంతో ‘ఆలయ ఫౌండేషన్ ’ స్థాపించి స్థానికంగా విద్య, వైద్య, ఆరోగ్య సంబంధమైన సేవాకార్యక్రమాలు చేపడుతున్నారు.– భాషబోయిన అనిల్‌కుమార్, సాక్షి ప్రతినిధి కరీంనగర్ -
పేదోళ్లను లక్షాధికారి చేసే స్కీమ్: ఇదిగో డీటెయిల్స్
భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టలేని వారు లేదా చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారి కోసం 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (SBI) హర్ ఘర్ లఖ్పతి రికరింగ్ డిపాజిట్ పేరుతో ఓ సరికొత్త స్కీమ్ తీసుకువచ్చింది. ఇందులో ప్రతి ఒక్కరూ సులభమైన పద్ధతిలో పొదుపు చేసుకోవచ్చు. ఆకర్షణీయమైన వడ్డీని పొందవచ్చు.హర్ ఘర్ లఖ్పతి పథకం (Har Ghar Lakhpati Scheme)హర్ ఘర్ లఖ్పతి పథకం అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించిన ఓ సరికొత్త పొదుపు స్కీమ్. దీని ద్వారా ఒక వ్యక్తి లేదా కుటుంబం ఆర్థికంగా కొంత వృద్ధి చెందవచ్చు. అంతే కాకుండా క్రమశిక్షణతో కూడిన ఆర్థిక అలవాట్లను పెంపొందించుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది పెద్దవారికి మాత్రమే కాకుండా.. మైనర్లకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది.హర్ ఘర్ లఖ్పతి పథకం కింద ప్రజలు 12 నెలల నుంచి 120 నెలల (1 ఏడాది నుంచి 10 సంవత్సరాలు) వరకు పొదుపు చేసుకోవచ్చు. వివాహాలకు లేదా ఇంటి కొనుగోళ్లు వంటి వాటికి ప్లాన్ చేసుకునేవారికి ఇది కొంత ప్రయోజనకారిగా ఉంటుంది. 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న వారి దగ్గర నుంచి పెద్దవారి వరకు ఎవరైనా ఇందులో పొదుపు చేసుకోవచ్చు. అయితే 10 ఏళ్లకంటే తక్కువ వయసున్న పిల్లలు మాత్రం తల్లిదండ్రులు లేదా సంరక్షకులతో అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది.వడ్డీ రేటు●సాధారణ ప్రజలకు 6.75 శాతం●సీనియర్ సిటిజన్లకు 7.25 శాతం●స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులకు 8 శాతం●ఆదాయ పన్నుశాఖ నిబంధనల ప్రకారం.. పన్ను మినహాయింపు వర్తిస్తుందినెలవారీ పెట్టుబడులుహర్ ఘర్ లఖ్పతి రికరింగ్ డిపాజిట్ పథకం కింద.. నెలవారీ పెట్టుబడులు చేయడం ద్వారా లక్ష రూపాయలు పొందవచ్చు. సాధారణ పౌరులకు, 6.75 శాతం వడ్డీతో మూడు సంవత్సరాలకు నెలకు రూ. 2,500 లేదా 6.50 శాతం చొప్పున ఐదు సంవత్సరాలకు నెలకు రూ. 1,407 పెట్టుబడి పెట్టడం లక్ష్యాన్ని చేరుకోవడానికి సహాయపడుతుంది. సీనియర్ సిటిజన్లు 7.25 శాతం చొప్పున మూడేళ్లపాటు నెలవారీ రూ. 2,480 లేదా 7 శాతం చొప్పున ఐదు సంవత్సరాలకు నెలకు రూ. 1,389 పెట్టుబడి పెట్టడం ద్వారా దీనిని పొందవచ్చు.ఇదీ చదవండి: ఈ టిప్స్ పాటిస్తే.. EMI ఆలస్యమైనా పర్లేదు!జరిమానాలువాయిదా ప్రకారం తప్పకుండా డిపాజిట్ చేయాలి. అలా చేయని సమయంలో లేదా ఆలస్యమైతే రూ.100కు రూ.1.50 పైసలు నుంచి 2 రూపాయలు జరిమానా పడుతుంది. అంతే కాకుండా ఆరు నెలల పాటు వాయిదాలు చెల్లించకపోతే మీ అకౌంట్ క్లోజ్ అవుతుంది. అప్పటికి మీరు పొదుపు చేసిన మొత్తం సేవింగ్ ఖాతాకు బదిలీ అవుతుంది.అకౌంట్ ఓపెన్ చేయడం ఎలా?●హర్ ఘర్ లఖ్పతి రికరింగ్ డిపాజిట్ పథకం కోసం అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే.. సమీపంలోని SBI బ్రాంచ్ సందర్సించాలి.●ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి కావలసిన డాక్యుమెంట్స్ సమర్పించాలి.●ఖాతా ప్రారంభించే సమయంలోనే మెచ్యూరిటీ మొత్తాన్ని, ఈఎంఐ వంటి వాటిని లెక్కించుకోవాలి. -
బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్త స్కీమ్..
బ్యాంక్ ఆఫ్ బరోడా ఎంపిక చేసిన డిపాజిట్లపై ఎఫ్డీ వడ్డీ రేట్లను ఇటీవల అప్డేట్ చేసింది. దీంతోపాటు బీఓబీ ఉత్సవ్ డిపాజిట్స్ స్కీమ్ అనే కొత్త డిపాజిట్ ఎంపికను ప్రవేశపెట్టింది. ఇది డిపాజిట్‌దారులకు అధిక వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ కొత్త రేట్లు అక్టోబర్ 14 నుండి అమలులోకి వచ్చాయి.కొత్త స్కీమ్ వడ్డీ రేట్లుబీఓబీ ఉత్సవ్ డిపాజిట్స్ స్కీమ్ సాధారణ పౌరులకు 7.30 శాతం వడ్డీని అందిస్తుంది. అదే సీనియర్ సిటిజన్లు 7.80 శాతం వడ్డీ అందుకోవచ్చు. ఇక సూపర్ సీనియర్ సిటిజన్లకు అయితే గరిష్టంగా 7.90 శాతం వడ్డీ లభిస్తుంది.ఇదీ చదవండి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇకపై భారీగా రిటైర్మెంట్ సొమ్ముబ్యాంక్ ఆఫ్ బరోడా ఎఫ్డీ వడ్డీ రేట్ల మార్పు తర్వాత రూ. 3 కోట్ల లోపు 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు వ్యవధి గల డిపాజిట్లపై సాధారణ పౌరులకు 4.25% నుండి 7.30% (ప్రత్యేక డిపాజిట్‌తో సహా) వడ్డీ లభిస్తోంది. సీనియర్ సిటిజన్లకు 4.75% నుండి 7.80% మధ్య వడ్డీ రేటును అందిస్తుంది. -
వివాద్ సే విశ్వాస్ పథకం 2024: రేపటి నుంచే అమల్లోకి..
గతంలో ఇటువంటి స్కీములు వచ్చాయి. ప్రత్యక్ష పన్ను మదింపులో హెచ్చుతగ్గులు సహజం. మనం లెక్కించిన దానికన్నా పన్ను భారం పెరిగితే మనం అప్పీలుకు వెళ్లవచ్చు. అలాగే డిపార్టుమెంటు వారు కూడ అప్పీలుకు వెళ్లవచ్చు. అప్పీలుకు వెళ్లడం అంటే వివాదమే. ఈ వివాదాలు ఒక కొలిక్కి వచ్చేసరికి సమయం ఎంత వృధా అవుతుంది. కాలయాపనతో పాటు మనశ్శాంతి లేకపోవటం, అశాంతి, అనారోగ్యం మొదలైనవి ఏర్పడతాయి. అటువంటి వివాదాల జోలికి పోకుండా పన్ను భారాన్ని వీలున్నంత వరకు తగ్గించి కట్టేలా చేసే స్కీమ్ ఇది. ఇది 2024 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. వివాదాలు పోయి ఒకరి విశ్వాసాన్ని మరొకరు పొందడమే దీని పరమావధి. ఈ స్కీమ్‌ని నోటిఫై చేశారు.ముఖ్యాంశాలు➤2024 జూలై వరకు ఏర్పడ్డ వివాదాలకు ఇందులో అవకాశం కల్పించారు. ➤సుప్రీంకోర్టు ముందు, హైకోర్టులు ముందు, ట్రిబ్యునల్స్ ముందు పెండింగ్‌లో ఉన్న వివాదాల విషయంలో మీరు డిక్లేర్ చేయొచ్చు. ➤సెర్చ్‌లో, సీజర్లో, ప్రాసిక్యూషన్‌లో ఉన్నవి, విదేశాల్లో ఉన్న ఆస్తులు, ఆదాయం తెలియచేయని వారికి ఇతర చట్టాల ప్రకారం ఏర్పడ్డ ప్రొసీడింగ్స్‌కి ఈ స్కీమ్ వర్తించదు. ➤2020లో అమల్లోకి వచ్చిన స్కీములోలాగే ఉదాహరణల వర్తింపు, విధివిధానాలు, సెటిల్మెంట్ పద్ధతి మొదలైనవి ఉన్నాయి. ➤పన్ను, వడ్డీ, ఫెనాల్టీ, రుసుము మొదలైన విషయాల్లో వివాదం.. అంటే తేడా ఉంటే, ఈ స్కీమ్‌లో ప్రయోజనం పొందవచ్చు. అప్పీలు ఏ స్థాయిలో ఉన్నా ఈ స్కీమ్‌లోకి రావచ్చు. ➤కమిషనర్ ముందు రివిజన్‌కి వెళ్లినప్పుడు, ఆ విషయం పెండింగ్‌లో ఉంటే ఇందులో ప్రయోజనం పొందవచ్చు. ➤సకాలంలో డిక్లరేషన్స్ ఇచ్చి ఈ స్కీమ్‌లో చేరితే పన్నుల భారం తగ్గుతుంది. వివాదం సమసిపోతుంది. డిపార్ట్మెంట్ దృష్టిలో ఒక రకమైన సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది. ఇందులో నాలుగు ఫారాలు ఉన్నాయి. మొదటి ఫారం ఒక డిక్లరేషన్. ప్రతి వివాదానికొక ఫారం ప్రత్యేకంగా దాఖలు చేయాలి. రెండో ఫారం, అంటే నిర్ధారిత అధికారి జారీ చేసే ధృవపత్రానికి సంబంధించినది. మూడో ఫారంలో పన్ను చెల్లింపు వివరాలుంటాయి. నాలుగో ఫారంలో స్కీము ఉత్తర్వులు ఉంటాయి. ముందుగా ఫారం 1 ఆన్లైన్లో దాఖలు చేయాలి. దీనితో పాటు ఫారం 3 కూడా వేయాలి. అయితే, ఫారం 3 అప్పీల్ విత్‌డ్రా చేసినట్లు వివరాలు ఇవ్వాలి. మనం విత్‌డ్రా చేసినట్లయితేనే ఈ స్కీమ్‌కి అర్హత సంపాదిస్తాము. విత్‌డ్రా చేసే నాటికి అప్పీలు ఆర్డర్లు పూర్తయినట్లుగా ఉండకూడదు. అంటే, ఇప్పటికి ఆర్డర్లు అయినట్లు ఉండేవారు ఈ స్కీమ్‌లో చేరకూడదు.ముందు ముందు ఎటువంటి ప్రాసిక్యూషన్స్ ఉండవు. ఇలాంటి స్కీమ్‌ల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఖర్చులు తగ్గుతాయి. సమయం తగ్గుతుంది. అనిశ్చిత పరిస్థితి ఉండదు. అప్పీలు తీరేవరకు టెన్షన్ మొదలైనవి ఉండవు. సంవత్సరాల తరబడి పేరుకుపోయిన పెండింగ్ వివాదాలు మాయం అవుతాయి. మీ దగ్గర ఏవైనా పెండింగ్‌లో ఉంటే ఈ స్కీమ్‌లో చేరడం మంచిది. -
NPS Vatsalya: పిల్లల కోసం ప్రత్యేక పథకం ప్రారంభం
పిల్లల కోసం ప్రత్యేక పొదుపు పథకం ‘ఎన్పీఎస్ వాత్సల్య’ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. తమ పిల్లల భవిష్యత్తు కోసం దీర్ఘకాల పెట్టుబడులు పెట్టాలనుకునే తల్లిదండ్రులు ఈ పెన్షన్ ఖాతాలను తెరవచ్చు. 2024-25 యూనియన్ బడ్జెట్లో ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆవిష్కరించిన ఎన్పీఎస్ వాత్సల్య పథకం కింద తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తమ మైనర్ పిల్లలకు పెన్షన్ పొదుపును ప్రారంభించచ్చు. ఇది భారతీయ పౌరులతోపాటు ఎన్ఆర్ఐలకు కూడా సౌకర్యవంతమైన దీర్ఘకాలిక పెట్టుబడి అవకాశాన్ని అందిస్తుంది. ఎన్పీఎస్ వాత్సల్య ఖాతా పిల్లలకి 18 ఏళ్లు నిండగానే ప్రామాణిక ఎన్పీఎస్ ఖాతాగా మారుతుంది. తద్వారా భవిష్యత్తులో ఆర్థిక భద్రత కోసం నిరంతర పెట్టుబడిని కొనసాగించేందుకు అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: బంగారం మళ్లీ తగ్గుముఖం! ఈసారి ఎంతంటే..బ్యాంకులు, పోస్టాఫీసులు, పెన్షన్ ఫండ్లు లేదా ఈ-ఎన్పీఎస్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఎన్పీఎస్ వాత్సల్య ఖాతాను తెరవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ ముంబై సర్వీస్ సెంటర్లో ఈ పథకాన్ని ప్రారంభించింది. కొత్త ఖాతాలను నమోదు చేసి సింబాలిక్ ప్రాన్ (PRAN-పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్) కార్డ్‌లను జారీ చేసింది. ఐసీఐసీఐ, యాక్సిస్‌తో సహా ప్రధాన బ్యాంకులు ఈ పథకాన్ని ప్రోత్సహించడానికి ముందుకు వచ్చాయి.వీటిలో పెట్టిన మొత్తాన్ని ఈక్విటీలు, కార్పొరేట్ డెట్, ప్రభుత్వ సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేస్తారు. తద్వారా వచ్చే రిటర్న్స్‌ను ఖాతాల్లో జమ చేస్తారు. ఈ కార్పస్ ఫండ్‌ను ఖాతాదారు 60 ఏళ్లు నిండిన తర్వాత మాత్రమే తీసుకునేందుకు వీలుంటుంది. అయితే మూడేళ్ల లాక్ఇన్ పీరియడ్ ముగిసిన తర్వాత విద్య, అనారోగ్యం వంటి కారణాలకు పాక్షికంగా ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంటుంది. -
ఈ–టూవీలర్లపై 10 వేలు
న్యూఢిల్లీ: త్వరలో అమల్లోకి రానున్న పీఎం ఈ–డ్రైవ్ పథకం కింద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనదారులు తొలి ఏడాదిలో గరిష్టంగా రూ. 10,000 వరకు సబ్సిడీని పొందవచ్చని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి తెలిపారు. ఈ స్కీమ్ ప్రకారం ఎలక్ట్రిక్ టూ–వీలర్ల విషయంలో బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి కిలోవాట్ అవర్‌కు (కేడబ్ల్యూహెచ్) సబ్సిడీని రూ. 5,000గా నిర్ణయించినట్లు చెప్పారు. అయితే, తొలి ఏడాది ఇది మొత్తమ్మీద రూ. 10,000కు మించదు. రెండో ఏడాది ఇది కిలోవాట్ అవర్‌కు సగానికి తగ్గి రూ. 2,500కు పరిమితమవుతుంది. మొత్తమ్మీద సబ్సిడీ రూ. 5,000కు మించదు. ఇక, ఈ–రిక్షా కొనుగోలుదారులు తొలి ఏడాది రూ. 25,000 వరకు, రెండో ఏడాది రూ. 12,500 వరకు సబ్సిడీ ప్రయోజనాలు పొందవచ్చని కుమారస్వామి చెప్పారు. కార్గో త్రీ వీలర్లకు తొలి ఏడాది రూ. 50,000, రెండో ఏడాది రూ. 25,000 సబ్సిడీ లభిస్తుంది. స్కీమ్ ప్రకారం పీఎం ఈ–డ్రైవ్ పోర్టల్‌లో ఆధార్ ఆధారిత ఈ–వోచర్ జారీ అవుతుంది. కొనుగోలుదారు, వినియోగదారు దానిపై సంతకం చేసి పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. ప్రోత్సాహకాన్ని పొందేందుకు కొనుగోలుదారు సెల్ఫీని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 25 లక్షల టూ–వీలర్లకు.. పీఎం ఈ–డ్రైవ్ పథకం కింద వివిధ రకాల ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు రూ. 3,679 కోట్ల మేర సబ్సిడీలు/ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు కుమారస్వామి చెప్పారు. మొత్తం మీద 24.79 లక్షల ఈ–టూవీలర్లు, 3.16 లక్షల ఈ–త్రీ వీలర్లు, 14,028 ఈ–బస్సులకు స్కీముపరమైన తోడ్పాటు ఉంటుందన్నారు. ప్రస్తుతం ఓలా, టీవీఎస్, ఏథర్ ఎనర్జీ, హీరో విడా, బజాజ్ చేతక్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరల శ్రేణి రూ. 90,000 నుంచి రూ. 1.5 లక్షల వరకు ఉంది. ఈవీల వినియోగానికి ప్రోత్సాహం.. పీఎం ఈ–డ్రైవ్ స్కీమును ఆటోమొబైల్ దిగ్గజాలు స్వాగతించాయి. ఈవీల వినియోగం జోరందుకుంటుందని, ఫాస్ట్ చార్జింగ్ మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టడం కూడా ఈవీలపై వినియోగదారుల నమ్మకాన్ని పెంపొందిస్తుందని మహీంద్రా గ్రూప్ సీఈవో అనీష్ షా తెలిపారు. ఉద్గారాల విషయంలో వేగంగా తటస్థ స్థాయిని సాధించేందుకు స్కీమ్ ఉపయోగపడుతుందని టాటా మోటార్స్ ఈడీ గిరీష్ వాఘ్ చెప్పారు. ఈవీ రంగం వేగంగా విస్తరించేందుకు పథకం తోడ్పడుతుందని ఓలా ఫౌండర్ భవీష్ అగర్వాల్ తెలిపారు. -
ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు ఊరట
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్ర మంత్రివర్గం కొత్త పథకానికి ఆమోదం తెలిపింది. ఈ కొత్త స్కీమ్ పేరు ''పీఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్'' (PM E-DRIVE). ఇది మార్చి వరకు తొమ్మిదేళ్లపాటు అమలులో ఉన్న ప్రస్తుత 'ఫేమ్' ప్రోగ్రామ్‌ను భర్తీ చేస్తుంది.ఈ కొత్త పథకం ద్వారా ఎలక్ట్రిక్ కార్లకు ఎటువంటి సబ్సిడీలు లభించదు. కానీ ఎలక్ట్రిక్ టూ వీలర్స్, త్రీ వీలర్స్, బస్సులకు సబ్సిడీ లభించే అవకాశం ఉంది. దీనికోసం కేంద్రం రెండేళ్లకు రూ. 10900 కోట్లు కేటాయించారు. ఇందులో హైబ్రిడ్ అంబులెన్స్‌లు, ఎలక్ట్రిక్ ట్రక్కులకు కూడా కొంత ప్రోత్సాహాలు లభిస్తాయి.పీఎం ఈ-డ్రైవ్ స్కీమ్ కింద 88500 ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జర్లను ఏర్పాటు చేయనున్నట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి 'అశ్విని వైష్ణవ్' ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పీఎం ఈ-డ్రైవ్ స్కీమ్‌పై నిర్ణయం తీసుకున్నట్లు వైష్ణవ్ విలేకరులతో చెప్పారు.రాష్ట్ర రవాణా సంస్థలు & ప్రజా రవాణా సంస్థల ద్వారా 14,028 ఎలక్ట్రిక్ బస్సుల సేకరణకు రూ.4,391 కోట్లు అందించారు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్, సూరత్, బెంగళూరు, పూణె, హైదరాబాద్‌ల వంటి 40 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న తొమ్మిది నగరాల్లో CESL ద్వారా డిమాండ్ అగ్రిగేషన్ చేయనున్నారు. రాష్ట్రాలతో సంప్రదించిన తరువాత ఇంటర్సిటీ, ఇంటర్‌స్టేట్ ఎలక్ట్రిక్ బస్సులకు కూడా మద్దతు లభిస్తుంది.ఎలక్ట్రిక్ అంబులెన్స్‌ల ఏర్పాటు చేయడానికి కేంద్రం రూ.500 కోట్లు కేటాయించింది. రోగుల రవాణా కోసం ఎలక్ట్రిక్ అంబులెన్స్ వినియోగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఎలక్ట్రిక్ ట్రక్కుల ప్రోత్సహించేందుకు కూడా రూ.500 కోట్లు అందించారు.ఛార్జింగ్ స్టేషన్స్ ఇన్స్టాలేషన్స్భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ఇప్పటికి కూడా చాలామంది కొనుగోలు చేయకపోవడానికి ప్రధాన కారణం.. ఛార్జింగ్ సదుపాయాలు లేకపోవడమే. దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేయనుంది. ఎంపిక చేసిన నగరాల్లో ఛార్జింగ్ స్టేషన్స్ ఇన్స్టాల్ చేయనున్నారు. ఇందులో ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్స్ కోసం 22,100 ఫాస్ట్ ఛార్జర్లు, ఈ-బస్సుల కోసం 1,800 ఫాస్ట్ ఛార్జర్లు, టూ వీలర్ & త్రీ వీలర్స్ కోసం 48400 ఫాస్ట్ ఛార్జర్లను ఇన్స్టాల్ చేయనున్నట్లు సమాచారం. దీనికోసం రూ. 2000 కోట్లు వెచ్చించారు. -
వైద్య పరికరాల తయారీకి కొత్త పథకం
న్యూఢిల్లీ: దేశీ వైద్య పరికరాల తయారీ పరిశ్రమను బలోపేతం చేసేందుకు ఒక పథకాన్ని తీసుకురానున్నట్టు కేంద్ర ఫార్మాస్యూటికల్స్ విభాగం సెక్రటరీ అరుణీష్ చావ్లా తెలిపారు. పరిశ్రమతో విస్తృత సంప్రదింపుల అనంతరం ఈ పథకాన్ని రూపొందించినట్టు, దీనికి ఆర్థిక శాఖ సూతప్రాయ ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు. వచ్చే నెలలోనే దీన్ని అమల్లోకి తేనున్నట్టు చెప్పారు.రెండో మెడిటెక్ స్టాకథాన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చావ్లా మాట్లాడారు. వైద్య పరికరాల తయారీ పరిశ్రమ అవసరాలను తీర్చేదిగా ఈ పథకం ఉంటుందని చెప్పారు. రానున్న రోజుల్లో దిగుమతులపై ఆధారపడడాన్ని ఇది తగ్గిస్తుందన్నారు. దీర్ఘకాలంలో దేశీ పరిశ్రమ స్వయంసమృద్ధి సాధిస్తుందని అభిప్రాయపడ్డారు. వైద్య పరికరాలకు సంబంధించి ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) ఇప్పటి వరకు సత్ఫలితాలను ఇచ్చినట్టు, 20 పెద్ద ప్రాజెక్టులు కార్యకలాపాలు ప్రారంభించినట్టు చెప్పారు.కంప్యూటెడ్ టోమోగ్రఫీ (సీటీ) స్కాన్, ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్ స్కాన్, డయలాసిస్ మెషిన్లు దేశీయంగా తయారవుతున్నట్టు చావ్లా తెలిపారు. గతేడాది కేంద్ర కేబినెట్ ‘నేషనల్ మెడికల్ డివైజెస్ పాలసీ’కి ఆమోదం తెలపడం తెలిసిందే. వచ్చే ఐదేళ్లలో 50 బిలియన్ డాలర్ల స్థాయికి పరిశ్రమ ఎదిగేందుకు ఈ విధానం తోడ్పడుతుందని కేంద్రం భావిస్తోంది. -
ఎస్బీఐ కొత్త ఫండ్‌కు కోట్లలో నిధులు
ముంబై: ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఓ నూతన పథకం ద్వారా భారీగా నిధులు సమీకరించింది. ఎస్బీఐ ఎనర్జీ అపార్చునిటీస్ ఫండ్ పట్ల ఇన్వెస్టర్లు ఎంతో ఉత్సాహం చూపించారు. రూ.5,000 కోట్ల సమీకరణను ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ అంచనా వేయగా, దీన్ని అధిగమించి రూ.6,700 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అన్ని రకాల పంపిణీ ఛానళ్ల ద్వారా విస్తృతమైన స్పందన వచ్చిందని, దరఖాస్తులు 5 లక్షలు దాటాయని ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ప్రకటించింది. పెద్ద సంఖ్యలో కొత్త ఇన్వెస్టర్లు ఈ నూతన ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో)లో పాల్గొనడం చూస్తుంటే అది ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ పట్ల ఇన్వెస్టర్లలో ఉన్న విశ్వాసాన్ని తెలియజేస్తోందని పేర్కొంది. ఎనర్జీ ధీమ్ (ఇంధన రంగం) పట్ల ఇన్వెస్టర్లు నమ్మకానికి నిదర్శనమని తెలిపింది. ఇంధనం, దాని అనుబంధ రంగాల్లో పనిచేసే కంపెనీల్లో ఈ పథకం ఇన్వెస్ట్ చేస్తుంది. ఈక్విటీ, డెరివేటివ్స్, డెట్ సెక్యూరిటీలలోనూ పెట్టుబడులు పెడుతుంది. రాజ్ గాం«దీ, ప్రదీప్ కేశవాన్ ఫండ్ మేనేజర్లుగా పనిచేయనున్నారు. -
హైవేలపై డ్రైవర్లకు భవనాలు: మోదీ
న్యూఢిల్లీ: ట్రక్కులు, ట్యాక్సీ డ్రైవర్లకు జాతీయ రహదారులపై తగినంత విశ్రాంతి తదితర సౌకర్యాల నిమిత్తం కొత్త పథకం తేనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ‘‘ఇందులో భాగంగా తొలి దశలో అన్ని సదుపాయాలతో కూడిన 1,000 అధునాతన భవనాలు నిర్మిస్తాం. వాటిలో ఫుడ్ స్టాళ్లు, స్వచ్ఛమైన తాగునీరు, టాయ్లెట్లు, పార్కింగ్, విశ్రాంతి స్థలాల వంటివిన్నీ ఉంటాయి’’ అని వెల్లడించారు. శుక్రవారం భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో–2024లో పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఈ మేరకు వెల్లడించారు. దేశ ఆర్థిక వ్యవస్థ శరవేగంగా పరుగులు తీస్తోందని మోదీ అన్నారు. తాము వరుసగా మూడోసారి గెలిచి కేంద్రంలో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేశాక ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని పునరుద్ఘాటించారు. ఆటో, ఆటోమోటివ్ పరిశ్రమది ఇందులో కీలక పాత్ర కానుందన్నారు. దేశ మొబైల్ పరిశ్రమకు ఇది స్వర్ణయుగమన్నారు. -
గుడ్‌న్యూస్: రూ.13,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం.. ప్రయోజనాలు ఇవే..
చేతివృత్తుల వారు, సంప్రదాయ హస్తకళాకారుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించింది. విశ్వకర్మ జయంతి సందర్భంగా 'పీఎం విశ్వకర్మ' (PM Vishwakarma) పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) తాజాగా ప్రారంభించారు. ఈ పథకం కింద సంప్రదాయ హస్తకళాకారులు, చేతివృత్తుల వారికి పూచీకత్తు అవసరం లేకుండా అతి తక్కువ వడ్డీకి రుణసాయం అందిస్తారు. ఐదేళ్ల కాలానికి రూ. 13,000 కోట్ల ఆర్థిక వ్యయంతో ఈ పథకం చేనేత కార్మికులు, స్వర్ణకారులు, కమ్మరులు, లాండ్రీ కార్మికులు, బార్బర్లతో సహా సంప్రదాయ హస్తకళాకారులకు చెందిన 30 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. సాంప్రదాయ హస్తకళాకారులు, చేతివృత్తుల వారి ఉత్పత్తులు, సేవల్లో నాణ్యతను పెంచి తద్వారా వారికి మరింత ఆదరణను పెంచడమే ఈ పథకం లక్ష్యం. రెండు విడతల్లో.. పీఎం విశ్వకర్మ పథకం కింద లబ్ధిదారులకు ఎటువంటి పూచీకత్తు లేకుండా మొదటి విడతలో రూ. 1 లక్ష రుణం అందిస్తారు. దీన్ని 18 నెలల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత రెండో విడతలో రూ. 2 లక్షలు అందిస్తారు. ఈ రుణాన్ని 30 నెలలలో లబ్ధిదారులు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇక వడ్డీ రేటు విషయానికి వస్తే లబ్ధిదారుల నుంచి కేవలం 5 శాతం వడ్డీ వసూలు చేస్తారు. మిగిలిన 8 శాతం వడ్డీని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ ద్వారా ప్రభుత్వం చెల్లిస్తుంది. క్రెడిట్ గ్యారెంటీ ఫీజులను కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఇతర ప్రయోజనాలు పీఎం విశ్వకర్మ పథకం కింద తక్కువ వడ్డీ లోన్‌తోపాటు మరికొన్ని ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం కల్పించనుంది. లబ్ధిదారులకు మొదట 5-7 రోజుల (40 గంటలు) ప్రాథమిక శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత వారి నైపుణ్యాన్ని ధ్రువీకరిస్తూ సర్టిఫికెట్, గుర్తింపు కార్డు ఇస్తారు. మరింత ఆసక్తి గల అభ్యర్థులు 15 రోజుల (120 గంటలు) అధునాతన శిక్షణ కోసం కూడా నమోదు చేసుకోవచ్చు. అభ్యర్థులకు శిక్షణా కాలంలో రోజుకు రూ. 500 చొప్పున స్టైఫండ్ కూడా చెల్లిస్తారు. అంతేకాకుండా, టూల్‌కిట్ ప్రోత్సాహకంగా రూ. 15,000 అందిస్తారు. తర్వాత వారి వృత్తిలో భాగంగా నిర్వహించే డిజిటల్ లావాదేవీలకు ఒక్కోదానికి రూ. 1 చొప్పున నెలవారీ 100 లావాదేవీల వరకు ప్రోత్సాహకం చెల్లిస్తారు. లబ్ధిదారుల ఉత్పత్తులకు నాణ్యతా ధ్రువీకరణ, బ్రాండింగ్, ప్రమోషన్, ఈ-కామర్స్ అనుసంధానం, ట్రేడ్ ఫెయిర్స్ ప్రకటనలు, ప్రచారం, ఇతర మార్కెటింగ్ కార్యకలాపాలు వంటి సేవలను జాతీయ మార్కెటింగ్ కమిటీ అందిస్తుంది. అర్హతలు స్వయం ఉపాధి ప్రాతిపదికన అసంఘటిత రంగంలో పని చేసే చేతివృత్తులపై ఆధారపడినవారు ఈ పీఎం విశ్వకర్మ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ పథకంలో పేర్కొన్న 18 కుటుంబ ఆధారిత సాంప్రదాయ హస్తకళలు లేదా చేతివృత్తుల్లో ఏదో ఒకదానిలో నిమగ్నమైనవారు ఈ పథకానికి అర్హులు. అలాగే రిజిస్ట్రేషన్ తేదీ నాటికి లబ్ధిదారుల కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి. -
ఇల్లు కట్టుకునేవారికి గుడ్‌న్యూస్.. త్వరలోనే కొత్త పథకం!
New Housing Loan Subsidy Scheme: పట్టణ పేదలు, మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. పట్టణ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకునేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నవారి కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త వడ్డీ రాయితీ పథకాన్ని సెప్టెంబర్ నెలలోనే ప్రారంభించనుంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేస్తున్నట్లు గృహనిర్మాణ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఈ పథకాన్ని ప్రకటించారు. “మధ్యతరగతి కుటుంబాలు సొంత ఇల్లు కొనాలని, కట్టుకోవాలని కలలు కంటున్నాయి. నగరాల్లోని మురికివాడల్లో, అద్దె ఇళ్లల్లో నివసిస్తూ కాలం వెల్లదీస్తున్న కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే కొత్త పథకాన్ని రాబోయే సంవత్సరాల్లో తీసుకురాబోతున్నాం. వారు సొంతంగా ఇల్లు నిర్మించుకునేందుకు వడ్డీ రాయితోపాటు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తాం ” అని మోదీ చెప్పారు. పట్టణ పేదలు, మధ్యతరగతి ప్రజలకు సెప్టెంబర్ నెలలో తీసుకొచ్చే కొత్త పథకం ఇప్పుడున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి పొడిగింపు. అయితే కొత్త పథకంలో వడ్డీ రాయితీని పొందే అర్హతను పెంచనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
‘పీఎం విశ్వకర్మ’కు మంత్రివర్గం ఆమోదం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన ‘ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ’ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రానున్న ఐదేళ్లలో అమలు చేయనున్న ‘పీఎం విశ్వకర్మ’ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ పథకం కింద రూ.13,000 కోట్లు ఖర్చు చేస్తారు. దేశవ్యాప్తంగా 30 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. చేనేత కార్మికులు, స్వర్ణకారులు, వడ్రంగులు, లాండ్రీ కార్మికులు, క్షురకులు, కుమ్మరులు, శిల్ప కళాకారులు, రాళ్లు కొట్టేవారు, తాపీ మేస్త్రీలు, బుట్టలు అల్లేవారు, చీపుర్లు తయారుచేసేవారు, తాళాలు తయారుచేసేవారు, బొమ్మల తయారీదారులు, పూలదండలు తయారుచేసేవారు, మత్స్యకారులు, దర్జీలు, చేపల వలలు అల్లేవారు తదితర సంప్రదాయ వృత్తుల్లో ఉన్నవారికి ప్రయోజనం కలి్పంచాలని నిర్ణయించారు. పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రధాని మోదీ మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. విశ్వకర్మ జయంతి సందర్భంగా సెపె్టంబర్ 17న ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఈ పథకం కింద అర్హులైన వారికి ‘పీఎం విశ్వకర్మ సరి్టఫికెట్, గుర్తింపు కార్డు’ అందజేస్తారు. రూ.2 లక్షల దాకా రుణ సదుపాయం కలి్పస్తారు. వడ్డీ రేటు 5 శాతం చెల్లించాల్సి ఉంటుంది. లబి్ధదారులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడంతోపాటు ఇతర ప్రోత్సాహకాలు అందజేస్తారు. మార్కెటింగ్ మద్దతు సై తం ఉంటుంది. అంటే ఉత్పత్తులను విక్రయించుకోవడానికి ప్రభుత్వం సహకరిస్తుంది. శిక్షణ కాలంలో రోజుకి రూ.500 స్టైపెండ్ పీఎం విశ్వకర్మ పథకంలో బేసిక్, అడ్వాన్స్డ్ అనే రెండు రకాల నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. లబి్ధదారులకు శిక్షణ కాలంలో రోజుకి రూ.500 చొప్పున స్టైపెండ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే ఆధునిక యంత్రాలు, పరికరాలు కొనుక్కోవడానికి రూ.15,000 వరకూ ఆర్థిక సాయం అందజేయనున్నట్లు వెల్లడించారు. మొదటి ఏడాది 5 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తామని పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో మొత్తం 30 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతాయని వివరించారు. గురు–శిష్య పరంపరను, కుటుంబ ఆధారిత సంప్రదాయ నైపుణ్యాలను బలోపేతం చేయడమే పథకం ఉద్దేశమని స్పష్టం చేశారు. తొలుత 18 రకాల సంప్రదాయ నైపుణ్యాలకు పథకాన్ని వర్తింపజేస్తామని అన్నారు. నగరాల్లో ‘పీఎం ఈ–బస్ సేవ’ పర్యావరణ హిత రవాణా సాధనాలకు పెద్దపీట వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికొచి్చంది. ఎలక్ట్రిక్ వాహనాలకు మరింత ప్రోత్సహం ఇవ్వాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ‘పీఎం ఈ–బస్ సేవ’కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలియజేసింది. రవాణా సేవలు వ్యవస్థీకృతంగా లేని నగరాల్లో ఎలక్ట్రిక్సిటీ బస్సులను ప్రవేశపెట్టడమే ఈ కార్యక్రమ లక్ష్యమని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్య(పీపీపీ) విధానంలో 169 నగరాల్లో 10,000 ఈ–బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ఈ పథకం అంచనా వ్యయం రూ.57,613 కోట్లు కాగా, ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.20,000 కోట్లు సమకూరుస్తుందని వివరించారు. హరిత పట్ణణ రవాణా కార్యక్రమాల్లో భాగంగా 181 నగరాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. 7 మల్టి–ట్రాకింగ్ ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్ రైల్వే శాఖలో 7 మల్టి–ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. ఈ ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.32,500 కోట్లు. ఈ భారాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, జార్ఖండ్, పశి్చమ బెంగాల్ రాష్ట్రాల్లో మొత్తం 35 జిల్లాలు ఈ ప్రాజెక్టుల పరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం ఉన్న లైన్ కెపాసిటీ పెంచుతారు. మన కళాకారులకు మరింత ప్రోత్సాహం: మోదీ పీఎం విశ్వకర్మ పథకంతో మన సంప్రదాయ కళాకారులకు, చేతి వృత్తిదారులకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. మన దేశంలో నైపుణ్యాలకు, సాంస్కృతి వైవిధ్యానికి కొదవ లేదన్నారు. మన విశ్వకర్మల్లోని వెలకట్టలేని నైపుణ్యాలను ముందు తరాల కోసం కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. -
వారికి గుడ్‌న్యూస్: 5 శాతం వడ్డీతో లక్షరూపాయల లోన్
PM Vishwakarma Scheme: 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విశ్వకర్మ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. సంప్రదాయ నైపుణ్యాలు కలిగిన వారి కోసం 13 -15వేల కోట్ల రూపాయల కేటాయింపుతో విశ్వకర్మ పథకాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు. తాజాగా నైపుణ్యాలు కలిగినవ్యక్తులను ఆదుకునేందుకు ‘పీఎం విశ్వకర్మ’ పథకానికి బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రధానమంత్రి ఆమోదం తెలిపారని కేంద్ర మంత్రి అశ్విని వైష్షవ్ వెల్లడించారు.ఈ పథకం వల్ల 30 లక్షల మంది హస్తకళాకారులు మరియు వారి కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర మంత్రి తెలిపారు. 2028 వరకు ఐదు సంవత్సరాల కాలానికి రూ13,000 కోట్ల ఆర్థిక వ్యయంతో కూడిన ఈ పథకం, తొలి ఏడాది 18 సంప్రదాయ వ్యాపారాలను కవర్ చేస్తుంది. ఇందులో భాగంగా లక్ష రూపాయలను రుణాన్ని ఇవ్వనున్నట్టు కేంద్ర మంత్రి ప్రకటించారు. "పీఎం విశ్వకర్మ" కింద తొలి విడతగా వడ్రంగులు, పడవలు తయారు చేసేవారు, కమ్మరి, తాళాలు చేసేవారు, స్వర్ణకారులు, కుమ్మరులు, శిల్పులు, చెప్పులు కుట్టేవారు తాపీ పని వారికి లబ్ధి చేకూరనుంది. ఈ రుణాలపై కేవలం 5 శాతం వడ్డీని మాత్రమే వసూలు చేయన్నుట్టు తెలిపారు. చేతి వృత్తుల కళాకారులకు, మత్య్సుకారులకు, తాపీ పనిచేసే వారికి ఆర్థిక చేయూతనందించాలనేది లక్ష్యమన్నారు. అలాగే మొబిలిటీ ఫండ్ కింద రూ.57వేల కోట్లు కేటాయించినట్టు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. పీఎం ఈ-బస్ సేవకు కేంద్రకేబినెట్ ఆమోదం తెలిపిందనీ, దీని కింద100 నగరాలు, పట్టణాలకు 10 వేల ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తేనున్నట్టు తెలిపారు. ప్రైవేట్-పబ్లిక్ పార్టనర్షిప్ మోడల్లో సిటీ బస్సుల కార్యకలాపాలను 10,000 ఇ-బస్సులను అందించే పథకం అంచనా వ్యయం రూ. 57,613 కోట్లు. ఈ పథకంలో రెండు విభాగాలు ఉన్నాయి - ఒకటి సిటీ బస్ సేవలను పెంపొందించడానికి మరియు మరొకటి గ్రీన్ అర్బన్ మొబిలిటీ ఇనిషియేటివ్స్ కింద ఇన్ఫ్రా అభివృద్ధి చేయడానికి సిటీ బస్సు కార్యకలాపాల్లో సుమారు 10,000 బస్సులను ఏర్పాటు చేయడం ద్వారా ఈ పథకం 45,000 నుండి 55,000 ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టిస్తుంది. The PM in Union Cabinet meeting today approved ‘PM Vishwakarma’ scheme to support people with traditional skills. Under this scheme, loans up to Rs 1 lakh will be provided on liberal terms: Union Minister Ashwini Vaishnaw pic.twitter.com/CcDkV5slX1 — ANI (@ANI) August 16, 2023 -
ఇలాంటి స్కీమ్ మళ్ళీ మళ్ళీ రాదు.. తక్కువ సమయంలో ఎక్కువ వడ్డీ!
SBI Amrit Kalash: భారతదేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన 'ఎస్బీఐ' (SBI) గత కొన్ని నెలలుగా ఫిక్స్డ్ డిపాజిట్‌కి సంబంధించిన స్కీమ్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పథకం 2023 జూన్ 30 నాటికి ముగిసింది. అయితే డిపాజిట్ల స్వీకరణకు గడువు మళ్ళీ ఇప్పుడు పొడిగించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అమృత్ కలశ్ (Amrit Kalash) అనే పేరుగల ఈ స్కీమ్ గడువు ఇప్పటికే ముగిసింది. కానీ ఇప్పుడు SBI దీని గడువుని 2023 ఆగష్టు 15కి పెంచింది. అంటే ఈ స్కీమ్ ఇక కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది ఒకరకమైన షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. దీని ద్వారా మంచి వడ్డీ పొందవచ్చు. తక్కువ కాలంలో మంచి వడ్డీ కావాలనుకునే వారికి ఇది మంచి స్కీమ్ అనే చెప్పాలి. అమృత్ కలశ్ స్కీమ్ వడ్డీ.. నిజానికి అమృత్ కలశ్ స్కీమ్ కాల వ్యవధి కేవలం 400 రోజులు మాత్రమే. ఇందులో పెట్టుబడి పెట్టిన తరువాత సాధారణ పౌరులకు 7.1 శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం వడ్డీ లభిస్తుంది. కాగా ఎస్బీఐ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఒక శాతం వడ్డీ ఎక్కువగా లభిస్తుంది. (ఇదీ చదవండి: మొదటిసారి రోడ్డుపై కనిపించిన ప్రపంచములోనే ఖరీదైన కారు - చూస్తే హవాక్కావల్సిందే!) అమృత్ కలశ్ స్కీమ్ కింద ఒక సీనియర్ సిటిజన్ రూ. 10 లక్షలు డిపాజిట్ చేస్తే.. అతనికి 400 రోజులకు 7.6 శాతం వడ్డీ ప్రకారం రూ. 86,000 వడ్డీ, సాధారణ పౌరులకు 7.1 శాతం వడ్డీ లెక్కన రూ. 80,170 వడ్డీ లభిస్తుంది. (ఇదీ చదవండి: భారత్ కీలక నిర్ణయం.. ఇలాగే జరిగితే చైనా కంపెనీల కథ కంచికే!) అమృత్ కలశ్ స్కీమ్ కోసం అప్లై చేసుకోవాలనుకుంటే సమీపంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌కి వెళ్ళవచ్చు. లేదా నెట్ బ్యాంకింగ్, యోనో యాప్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. -
రూ. 7.27 లక్షల వరకు ఆదాయ పన్ను ఉండదు
ఉడుపి (కర్ణాటక): మధ్యతరగతి వర్గాలకు కేంద్ర ప్రభుత్వం పన్నులపరంగా పలు ప్రయోజనాలు కలి్పంచిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వార్షికంగా రూ. 7.27 లక్షల వరకు ఆదాయం పొందే వారికి కొత్త పథకంలో పన్ను భారం నుంచి మినహాయింపు ఇవ్వడం కూడా ఇందులో ఒకటని వివరించారు. 2023–24 బడ్జెట్లో రూ. 7 లక్షల వరకు ఆదాయంపై మినహాయింపు ప్రకటించినప్పుడు ఆ పరిమితికి మించి కాస్తంతే ఎక్కువగా ఆర్జిస్తున్న వారి పరిస్థితి ఏమిటని కొన్ని వర్గాల్లో సంశయాలు తలెత్తాయని ఆమె తెలిపారు. దీంతో అదనంగా ఆర్జించే ప్రతి రూపాయిపై ఏ స్థాయి నుంచి పన్ను కట్టాల్సి ఉంటుందనే అంశం మీద తమ బృందం మళ్లీ కసరత్తు చేసిందని వివరించారు. మొత్తం మీద ప్రస్తుతం రూ. 7.27 లక్షల వరకు పన్ను లేదని, ఆ తర్వాతే ట్యాక్స్ వర్తిస్తుందని మంత్రి చెప్పారు. కొత్త స్కీములో స్టాండర్డ్ డిడక్షన్ లేదంటూ ఫిర్యాదులు రావడంతో దాన్ని కూడా చేర్చినట్లు చెప్పారు. -
అదనపు రాబడికి బంగారం లాంటి పథకం..
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ తాజాగా గోల్డ్ పేరిట వినూత్న, దీర్ఘకాలిక పొదుపు పథకాన్ని ఆవిష్కరించింది. ఇటు వృత్తి, ఉద్యోగాల ద్వారా వచ్చే ఆదాయానికి తోడు అదనపు రాబడి అందుకోవాలనుకునే వారికి అనువైనదిగా ఇది ఉంటుందని సంస్థ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ అమిత్ పాల్టా తెలిపారు. ఇది జీవిత బీమా కవరేజీతో పాటు కుటుంబానికి ఆర్థిక భద్రతను కూడా అందిస్తుందని పేర్కొన్నారు. (కార్ల ధరలు పెంచేసిన మారుతీ సుజుకీ.. అమల్లోకి కొత్త ధరలు) ఐసీఐసీఐ ప్రు గోల్డ్ మూడు వేరియంట్లలో లభ్యమవుతుంది. ఇమీడియట్ ఇన్కమ్, ఇమీడియట్ ఇన్కమ్ విత్ బూస్టర్, అలాగే డిఫర్డ్ ఇన్కమ్ వీటిలో ఉన్నాయి. మొదటి దానిలో పాలసీ జారీ చేసిన 30 రోజుల తర్వాత నుంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఇక రెండో వేరియంట్లో ప్రతి ఐదో ఏటా అదనంగా గ్యారంటీడ్ ఆదాయాన్ని కూడా అందుకోవచ్చు. మూడోదైన డిఫర్డ్ ఇన్కమ్ వేరియంట్లో ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా వినియోగదారులు ఆదాయాన్ని ఎప్పటి నుంచి పొందాలనుకుంటున్నది తామే నిర్ణయించుకోవచ్చు. అంటే పాలసీ తీసుకున్న రెండో ఏడాది నుంచే లేదా 13 ఏళ్ల తర్వాత నుంచైనా ఆదాయాన్ని అందుకోవడం ప్రారంభించవచ్చు. చెల్లింపులను సాధారణంగా తీసుకోవడానికి బదులుగా సేవింగ్స్ వాలెట్లో జమ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. దీన్ని కావాలంటే పూర్తిగా లేదా పాక్షికంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. లేదా ప్రీమియం ఆఫ్సెట్ సదుపాయంతో తమ భావి ప్రీమియంలను కూడా ఈ మొత్తం నుంచి చెల్లించవచ్చు. (Radhika Merchant Bag: అంబానీకి కాబోయే కోడలు చేతిలో చిన్న బ్యాగు.. అందరి దృష్టి దానిపైనే.. ధర ఎంతో తెలుసా?) -
వ్యాపారవేత్తలుగా వృత్తి పనివాళ్లు
న్యూఢిల్లీ: వృత్తి పనివాళ్లకు, చిన్న వ్యాపారాలకు మరింత తోడ్పాటు అందించాల్సిన అవసరముందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. బడ్జెట్ వెబినార్లలో చివరిదైన ‘పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్’ పథకంపై ఆయన శనివారం మాట్లాడారు. గ్రామ స్థాయిలో ప్రతి వృత్తినీ విభాగాన్నీ బలోపేతం చేయడం దేశ ప్రగతి ప్రయాణానికి చాలా కీలకమన్నారు. ఇందుకోసం డెడ్లైన్లు పెట్టుకుని ఉద్యమ స్ఫూర్తితో పని చేయాల్సిన అవసరముందన్నారు. గొప్పవైన మన పురాతన సంప్రదాయాలను కాపాడటంతో పాటు చిన్న వ్యాపారాలను వాటిలో భాగస్వాములుగా ఉండే వృత్తి పనివాళ్లకు ఇతోధికంగా సాయం అందించడమే పీఎం విశ్వకర్మ సమ్మాన్ పథకం లక్ష్యమని చెప్పారు. సులభ రుణాలు, నైపుణ్య వృద్ధికి అవకాశాలు, సాంకేతిక, డిజిటల్ సాయం, బ్రాండ్ ప్రమోషన్, మార్కెటింగ్, ముడి సరుకు లభ్యత తదితరాల్లో వారికి ఈ పథకం అండగా నిలుస్తుందన్నారు. వృత్తి పనివాళ్లకు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు అన్ని అవకాశాలూ కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. మార్చి 13 నుంచి పార్లమెంటు మలి దశ బడ్జెట్ సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో మోదీ శనివారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో భేటీ అయ్యారు. మోదీ తల్లి స్మృతులపై మైక్రోసైట్ మోదీ మాతృమూర్తి హీరాబెన్ స్మృతుల సమాహారంగా ‘మా’ పేరిట మైక్రోసైట్ ఆయన అధికార వెబ్సైట్లో ప్రారంభమైంది. ఇటీవల మరణించిన ఆమెకు నివాళిగా దీన్ని తీర్చిదిద్దినట్టు అధికారులు తెలిపారు. ‘‘బిడ్డలకు హీరాబెన్ నేర్పిన విలువలు తదితరాల విశేషాలు సైట్లో ఉంటాయి. హీరాబా జీవితం, ఫొటోలు, వీడియోలు, ఆమె వందో పుట్టినరోజు సందర్భంగా మోదీ రాసిన బ్లాగ్, ఆమె మృతిపై పలు దేశాధినేతల స్పందన, నివాళులు కూడా ఉంటాయి’’ అని వివరించారు. -
ఎంఎస్ఎంఈ పోటీ పథకం పునరుద్ధరణ
న్యూఢిల్లీ: పునరుద్ధరించిన ఎంఎస్ఎంఈ కాంపిటీటివ్ స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. నూతన పథకంలో కేంద్ర ప్రభుత్వం 90 శాతం వ్యయాలను భరించనుంది. పాత పథకంలో కేంద్రం వాటా 80 శాతంగా ఉండడం గమనార్హం. ప్రతీ క్లస్టర్‌కు స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ఏర్పాటు చేయాల్సిన నిబంధనను కూడా తొలగించింది. గతంలో 18 నెలల్లోగా అమలు చేయాలనే నిబందన ఉండేది. పునరుద్ధరించిన పథకంలో దశలు వారీగా పేర్కొంది. బేసిక్ రెండు నెలలు, ఇంటర్మీడియట్ ఆరు నెలలు, అడ్వాన్స్డ్ పన్నెండు నెలలుగా నిర్ణయించింది. అంటే ఈ వ్యవధిలోపు ప్రాజెక్టులను దశలవారీగా ఎంఎస్ఎంఈలు అమ లు చేయాల్సి ఉంటుంది. మొదటి దశలో తయారీ రంగానికి ఈ పథకం అమలు చేస్తామని, రెండో దశలో సేవల రంగానికి అమల్లోకి వస్తుందని ఎంఎస్ఎంఈ శాఖ కార్యదర్శి బీబీ స్వెయిన్ తెలిపారు. -
ఉమెన్స్ డే స్పెషల్: తెలంగాణలో ఆరోగ్య మహిళ పథకం ప్రారంభం
సాక్షి, కరీంనగర్: మహిళా దినోత్సవం సందర్బంగా ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ఆరోగ్య మహిళ పథకాన్ని కరీంనగర్లో ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ.. మహిళల కోసం ఆరోగ్య మహిళ అనే కొత్త కార్యక్రమాన్ని తీసుకువచ్చామన్నారు. ఈ పథకం కింద 100 ఆసుపత్రులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంతకు ముందు ఆరోగ్య మహిళ కిట్‌ను, లోగోను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆరోగ్య మహిళ పథకంలో ఎనిమిది రకాలు సేవలు అందించునున్నారు. ప్రతీ మహిళా ఏదో ఒక ఆరోగ్య సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. వాటి పరిష్కారం కోసమే ఈ పథకం తీసుకువచ్చినట్టు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదట 100 ఆరోగ్య మహిళ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. రానున్న రోజుల్లో వీటి సంఖ్య పెంచుతామన్నారు. పెద్ద ఆసుపత్రుల్లో అందించే చికిత్సలు కూడా ఇక్కడ లభిస్తాయన్నారు. శ్రీరామ నవమి తరువాత న్యూట్రిషన్ కిట్ పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. మహిళలు గర్భం దాల్చిన తర్వాత వారికి పోషకాహరం కోసం న్యూట్రిషన్ కిట్ ఇవ్వనున్నట్టు చెప్పారు. మహిళల సంక్షేమం కోసం ఇప్పటికే కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలను అందిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు ఆరోగ్య మహిళ కార్యక్రమంతో మహిళల పక్షపాతిగా నిలిచారన్నారు. ఇక, రాష్ట్రవ్యాప్తంగా నేడు అన్ని జిల్లాలలోనూ ఆరోగ్య మహళ క్లినిక్ లను ఆయా జిల్లాలలోని స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రారంభిస్తున్నారని తెలిపారు. -
మహిళల కోసం ‘లాడ్లి బెహనా’యోజన
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా లాడ్లి బెహనా(ప్రియమైన సోదరి) పథకాన్ని ప్రకటించింది. భోపాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి ‘లాడ్లి బెహనా యోజన’ఫలకాన్ని ఆన్లైన్లో ఆవిష్కరించారు. పథకం కింద ప్రభుత్వం మహిళలకు నెలకు రూ.వెయ్యి అందజేస్తుంది. ఇందుకు అర్హులుగా.. ఆదాయ పన్ను చెల్లించని, వార్షిక ఆదాయం రూ.2.50 లక్షల లోపు ఉండే వారు, తదితర కేటగిరీలను నిర్ణయించారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలకు ఈ పథకంతో లబ్ధి కలుగనుంది. ఇందుకోసం బడ్జెట్లో రూ.8 వేల కోట్లను కేటాయించారు. మార్చి 15–ఏప్రిల్ 30 తేదీల మధ్య దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. -
నెలకు రూ.12వేలు పెన్షన్ కావాలా? ఇలా ట్రై చేయండి!
సాక్షి, ముంబై: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ఇన్సూరెన్స్ కవర్‌తో పాటు,భారీ రాబడితో కస్టమర్ల ఆదరణతో మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందింది. తాజాగా ఒక కొత్త పాలసీని తీసుకొచ్చింది. వినియోగదారులు ఒకసారి పెట్టుబడి పెట్టి నెలకు 11వేలు ఆర్జించే ఎల్ఐసీ న్యూ జీవన్ శాంతి స్కీమ్ గురించి తెలుసుకుందాం. ఎల్ఐసీ న్యూ జీవన్ శాంతి ద్వారా నెలకు రూ.11000 ఎలా? ఎల్ఐసీ కొత్త జీవన్ శాంతి పథకంలో పెట్టుబడి పెట్టగల కనీస మొత్తం రూ. 1.5 లక్షలు. ఈ పథకం ద్వారా 12వేల కనీస రాబడి లభిస్తుంది. అలాగే ఈ పథకంలో పెట్టుబడి మొత్తంపై గరిష్ట పరిమితి లేదు.. ఎంతయినా ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే నెలకు రూ. 11,000 కంటే ఎక్కువ సంపాదించాలంటే మాత్రం కనీసం రూ. 10 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. తద్వారా ఈ ప్లాన్ ద్వారా నెలవారీ పెన్షన్ రూ. 11,192 పొందవచ్చు. అలాగే జాయింట్ లైఫ్ డిఫర్డ్ యాన్యుటీ విషయంలో, నెలవారీపెన్షన్ రూ. 10,576. మరింత సమాచారం కోసం LIC ఎల్ఐసీ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. -
టాటా ఏఐఏ లైఫ్ పాలసీదారులకు కొత్త పథకం
ముంబై: టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ తన యులిప్ పాలసీదారుల కోసం ‘ఎమర్జింగ్ అపార్చునిటీస్ ఫండ్’ అనే నూతన పతకాన్ని (ఎన్ఎఫ్వో) ఆఫర్ చేస్తున్నట్టు తెలిపింది. మధ్య స్థాయి కంపెనీలు, భవిష్యత్తులో గణనీయమైన వృద్ధిని చూపించే కంపెనీల్లో ఈ పథకం ఇన్వెస్ట్ చేస్తుందని ప్రకటించింది. యులిప్ హోల్డర్లు ఈ నూతన ఫండ్ ఆఫర్ కోసం ఈ నెల 30వరకు తమ ఆప్షన్ ఇచ్చుకోవచ్చని ఓ ప్రకటనలో తెలిపింది. చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే! -
నాడు– నేడు’ స్ఫూర్తితో ‘పీఎం శ్రీ’
అనంతపురం: విద్యారంగ సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన బడి ‘నాడు–నేడు ’ కార్యక్రమం పలు రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఆదర్శంగా తీసుకుని దేశ వ్యాప్తంగా సర్కారీ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కలి్పంచేందుకు ‘పీఎం శ్రీ’ పేరుతో పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో మొత్తం 1,174 పాఠశాలలను ప్రాథమికంగా ఎంపిక చేశారు. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, మోడల్ స్కూళ్లు, కేజీబీవీ, గురుకుల పాఠశాలలు, మండల పరిషత్, జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో ఈ పథకం అమలు చేయనున్నారు. మొత్తం 42 అంశాల్లో ఎన్ని అమలు అవుతున్నాయో వాటి వివరాలను బట్టి 1,174 పాఠశాలల నుంచి తుది జాబితాను త్వరలో ప్రదర్శించనున్నారు. ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు 2022–23 విద్యా సంవత్సరం నుంచి 2026–27 వరకు దశల వారీగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గ్రీన్ స్కూల్స్, పాఠశాల ఆవరణంలో ఎల్ఈడీ బల్బుల ఏర్పాటు, సేంద్రీయ విధానంలో తోటల పెంపకం, ప్లాస్టిక్ నిర్మూలన, నీటి యాజమాన్య పద్ధతులు, వాతావరణ మార్పుల గురించి విద్యార్థులకు వివరించడం, విద్యలో గుణాత్మకమైన మార్పులు తదితర అంశాలపై శిక్షణ ఇవ్వడం, విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడం, ప్రతి విద్యారి్థకీ మేథమేటిక్స్, సైన్స్ కిట్లు అందజేయడం చేస్తారు. అలాగే పాఠశాల వార్షిక నిధులు అందేలా చూడడం, స్మార్ట్ తరగతులు, డిజిటల్ శిక్షణ నిర్వహించడం, సైన్స్ ల్యాబ్‌లు, లైబ్రరీలు ఏర్పాటు చేయడం, నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం చేస్తారు. తుది జాబితా ఎంపిక చేస్తాం పీఎం శ్రీ పథకానికి సంబంధించి పాఠశాల వివరాలను పంపాలని విద్యాశాఖ కోరింది. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ప్రాథమికంగా 1,174 పాఠశాలలను ఎంపిక చేశాం. ఇందులో 42 పాయింట్లను బట్టి పాఠశాలల తుది జాబితాను ఎంపిక చేస్తాం. – కే. వెంకట కృష్ణారెడ్డి, ఇన్చార్జి డీఈఓ, అనంతపురం (చదవండి: పేరు గొప్ప.. ఊరు దిబ్బ.. అలా ఊగిపోతారంతే..!) -
PM PRANAM: రసాయన ఎరువులకు ‘పీఎం–ప్రణామ్’తో చెక్!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, ప్రత్యామ్నాయ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా కొత్త పథకాన్ని ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. అంతేకాకుండా రసాయన ఎరువులపై సబ్సిడీ భారాన్ని తగ్గించుకోవడానికి ప్రధానమంత్రి ప్రమోషన్ ఆఫ్ ఆల్టర్నేట్ న్యూట్రియంట్స్ ఫర్ అగ్రికల్చర్ మేనేజ్మెంట్ (పీఎం–ప్రణామ్) యోజనను తీసుకొచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది. గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా రసాయన ఎరువుల వినియోగం భారీగా పెరగడం, వాటిపై రాయితీలు మోయలేని భారంగా మారుతున్న నేపథ్యంలో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. సబ్సిడీల భారం రూ.2.25 లక్షల కోట్లు! దేశంలో రసాయన ఎరువుల వాడకం ప్రతి ఏటా విపరీతంగా పెరిగిపోతోంది. 2017–18లో వినియోగం 5.28 కోట్ల మెట్రిక్ టన్నులు కాగా, 2021–22 నాటికి 6.40 కోట్ల మెట్రిక్ టన్నులకు (21శాతం) పెరిగింది. ఇందులో యూరియా వినియోగం 2017–18లో 2.98 కోట్ల మెట్రిక్ టన్నుల నుంచి 2021–22 నాటికి ఏకంగా 3.56 కోట్ల మెట్రిక్ టన్నులకు (19.64 శాతం) చేరుకుంది. అలాగే డీఏపీ వినియోగం 98.77 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 1.23 కోట్ల మెట్రిక్ టన్నులకు (25.44 శాతం) పెరిగింది. ఇతర ఎరువుల వినియోగం సైతం ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. దానికి అనుగుణంగానే సబ్సిడీల భారం పెరుగుతూ వస్తోంది. 2020–21లో సబ్సిడీల భారం రూ.1.27 లక్షల కోట్లు కాగా, 2021–22 నాటికి రూ.1.62 లక్షల కోట్లకు చేరింది. 2022–23 నాటికి రూ.2.25 లక్షల కోట్లు చేరుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకే ‘పీఎం–ప్రణామ్’ పథకంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. మిగిలే నిధులతో పథకం అమలు ‘పీఎం–ప్రణామ్’ కింద కేంద్ర సర్కారు ఎలాంటి ప్రత్యేక బడ్జెట్ కేటాయించదు. వివిధ కేంద్ర పథకాల కింద ఉన్న ఎరువుల సబ్సిడీలను ఆదా చేయడం ద్వారా మిగిలే నిధులతో ఈ పథకాన్ని అమలు చేయనుంది. మిగులు నిధుల్లో 50 శాతం సొమ్మును రాష్ట్రాలకు గ్రాంట్‌గా అందిస్తుంది. ఈ గ్రాంట్‌లో 70 శాతం నిధులను గ్రామ, బ్లాక్, జిల్లా స్థాయిల్లో ప్రత్యామ్నాయ ఎరువులు, ప్రత్యామ్నాయ ఎరువుల ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటుకు వినియోగించవచ్చు. మిగిలిన 30 శాతం నిధులను రసాయన ఎరువుల వాడకం తగ్గింపుపై రైతుల్లో అవగాహన కల్పించిన పంచాయతీలకు, రైతు సంఘాలకు, స్వయం సహాయక సంఘాలకు బహుమతులు ఇవ్వడానికి, ఇతర ప్రోత్సాహకాలకు ఉపయోగించుకోవచ్చు. పీఎం–ప్రణామ్ యోజనకు సంబంధించిన లక్ష్యాలపై రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది. రాష్ట్రాల అభిప్రాయాలు పూర్తిగా తెలుసుకున్నాక తుది ముసాయిదాను సిద్ధం చేయనుంది. -
SBI Life: గిల్ట్ ఫ్రీ మామ్స్.. ప్రత్యేకతలు ఇవే!
ముంబై: పిల్లల సంరక్షణ బాధ్యతల్లో నిత్యం తలమునకలయ్యే తల్లులు తమ సొంత అవసరాలపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని చాటి చెప్పేలా ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ గిల్ట్ఫ్రీమామ్స్ పేరిట డిజిటల్ ఫిలిమ్ ఆవిష్కరించింది. సాధారణంగా పిల్లలు పుట్టాక మహిళలు తమకు ఇష్టమైన వ్యాపకాల వైపు మళ్లాలంటే కొంత అపరాధ భావనతో జంకుతుంటారని ఎస్బీఐ లైఫ్ సీఎస్ఆర్ విభాగం చీఫ్ రవీంద్ర శర్మ తెలిపారు. అలాంటి సంకోచాలను పక్కన పెట్టి ఇటు వ్యక్తిగత అవసరాలు, అటు కుటుంబ బాధ్యతల మధ్య సమతౌల్యం పాటించేందుకు తల్లులు పాటించతగిన విధానాలను ఈ వీడియోలో ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. శ్రేయా గౌతమ్, యువికాఆబ్రోల్ మొదలైన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఈ ఫిలిమ్‌లో తమ ప్రస్థానాలను వివరించారు. చదవండి: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త! -
ఎర్లీబర్డ్’..యమా సక్సెస్!
సాక్షి హైదరాబాద్: కరువు కాలంలో 5 శాతం రాయితీ అయినా ఎంతో ఊరటే. అందుకే కాబోలు ‘ఎర్లీబర్డ్’ స్కీమ్‌కు నగర వాసులు బాగా స్పందించారు. ఆస్తిపన్ను చెల్లింపులో రాయితీ అవకాశాన్ని వినియోగించుకొని దాదాపు 36 శాతం మంది తమ ఆస్తిపన్ను చెల్లించారు. తద్వారా జీహెచ్ఎంసీ ఖజానాకు ఒక్కనెలలోనే రూ.600 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. శుక్రవారం సాయంత్రం వరకు రూ.616 కోట్ల ఆస్తిపన్ను జీహెచ్ఎంసీ ఖజానాలో చేరింది. శనివారం వరకు ఎర్లీబర్డ్ పథకాన్ని వినియోగించుకొని 5 శాతం రాయితీతో చెల్లించేందుకు అవకాశం ఉంది. దీంతో గడువు ముగిసేలోగా దాదాపు రూ.700 కోట్ల వరకు రావచ్చని అధికారుల అంచనా. ఇది ఒకవైపు దృశ్యం కాగా.. మరోవైపు మిగతా సంవత్సరమంతా ఎలా నెట్టుకురావాలా అన్న ఆలోచనలోనూ అధికారులున్నారు. ఎర్లీబర్డ్ పథకం పాత బకాయిలు లేని, కొత్త ఆర్థికసంవత్సరం(2022–23)ఆస్తిపన్ను చెల్లించేవారికి వర్తిస్తుంది. ఎర్లీబర్డ్ రాయితీ వినియోగించుకోవాలనుకుంటే ముందు బకాయిలన్నీ చెల్లించాలి. పాత బకాయిలు కాకుండా, ఈ ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను అంచనా దాదాపు రూ.1500 కోట్లు. అంటే వచ్చే ఆస్తిపన్నులో దాదాపు సగం మొత్తం ఈ ఒక్కనెలలోనే వసూలైతే మిగతా 11 నెలలు ఎలా నెట్టుకురావాలన్నదే అధికారుల ఆలోచన. జీహెచ్ఎంసీకి ఉన్న ఆదాయ వనరుల్లో సింహభాగం ఆస్తిపన్నే. వీటిద్వారానే సిబ్బంది, పెన్షన్‌దారుల జీతభత్యాల చెల్లింపులు తదితరమైనవి జరుపుతున్నారు. మున్ముందు వసూలయ్యే ఆస్తిపన్ను తగ్గనున్నందున ఆదాయం ఎలా సమకూర్చుకోవాలా అనే ఆలోచనలో పడ్డారు. నేడు రాత్రి 10 గంటల వరకు సీఎస్సీలు పనిచేస్తాయి.. జీహెచ్ఎంసీ ఆస్తిపన్నును ఆన్‌లైనా ద్వారా, మీసేవా కేంద్రాలు, సిటిజెన్ సర్వీస్ సెంటర్ల (సీఎస్సీలు)ద్వారా చెల్లించేందుకు అవకాశం ఉంది. ఎర్లీబర్డ్ అవకాశానికి చివరి రోజైన శనివారం ప్రజల సదుపాయార్థం జీహెచ్ఎంసీ అన్ని సర్కిళ్లలోని సీఎస్సీలు రాత్రి 10 గంటల వరకు తెరచి ఉంటాయని అధికారులు తెలిపారు. అర్ధరాత్రి 12 గంటల లోపు ఆన్లైన్ ద్వారా చెల్లించే సదుపాయం ఉంది. గత రెండు సంవత్సరాల్లో కరోనాను దృష్టిలో ఉంచుకొని ఎర్లీబర్డ్ అవకాశాన్ని ఏప్రిల్ నెలలోనే కాకుండా మే నెలాఖరు వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. అప్పట్లో రెండునెలల గడువు ఇచ్చినా ఏ ఒక్క సంవత్సరం కూడా రూ.600 కోట్లు వసూలు కాలేదు. (చదవండి: టైమ్‌సెన్స్ లేక..) -
బాధితులను ఆదుకో..రివార్డు పొందు! స్టాలిన్ కొత్త స్కీం
సాక్షి చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కొత్త పథకాన్ని ప్రకటించారు. ఆ పథకంలో భాగంగా స్టాలిన్ సోమవారం రాష్ట్రంలో రోడ్డు ప్రమాద బాధితులకు వైద్య సదుపాయాలను అందించడంలో సహాయపడే వ్యక్తులకు నగదు రివార్డులు, ధృవపత్రాలను ప్రకటించారు. రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్న వారికి గోల్డెన్ అవర్ వ్యవధిలో వైద్య సాయం అందిలే ఆసుపత్రులకు తరలించి సాయం చేసిన వ్యక్తులు ప్రశంసా పత్రం తోపాటు రూ.5 వేల నగదు పారితోషకం ఇస్తాం అని స్టాలిన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. గాయపడిన వారికి మొదటి 48 గంటల్లో ఉచిత వైద్యం అందించే 'ఇన్నుయిర్ కాప్పోన్' పథకాన్ని ముఖ్యమంత్రి గతంలోనే ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 609 ఆసుపత్రులు, 408 ప్రైవేట్ ఆసుపత్రులు, 201 ప్రభుత్వ ఆసుపత్రులు గోల్డెన్ అవర్‌లో వైద్యం అందించి ప్రాణాలను రక్షించడానికి నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నాయి. ఈ ఇన్నుయిర్ కాప్పోన్ పథకం బాధితునికి గరిష్టంగా సుమారు లక్ష రూపాయల వరకు దాదాపు 81 గుర్తింపు పొందిన ప్రభుత్వాసుపత్రులలో వైద్య భీమాను పొందగలుగుతారు. అయితే మొదటి 48 గంటల్లో తమిళనాడు ప్రమాద బాధితులు లేదా తమిళనాడులో ప్రమాదం బారిన పడిని ఇతర రాష్రల వారికి ఉచిత వైద్యం అందించబడుతుంది. ముఖ్యమంత్రి సమగ్ర భీమా పథకం లబ్ధిదారులు అదే ఆసుపత్రిలో చికిత్స కొనసాగించడానికి అనుమతిస్తారు. అయితే ఈ పథకం లేదా ఏదైనా భీమా పథకం పరిధిలోనికి రానివారు అతడు లేదా ఆమె ప్రమాదం నుంచి కోలుకునేంత వరకు మాత్రమే ఉచిత వైద్యం అందిస్తారు. (చదవండి: ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన హీరో విశాల్ జట్టు) -
టాటా మోటార్స్ వినూత్న ఆఫర్! ఇంటి వద్దకే కారు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గ్రామీణ మార్కెట్‌పై టాటా మోటార్స్ దృష్టిసారించింది. వినియోగదార్ల ఇంటి వద్దకే కార్లను తీసుకెళ్లాలని నిర్ణయించింది. అనుభవ్ పేరుతో మొబైల్ షోరూంలను (షోరూం ఆన్ వీల్స్) ఆవిష్కరించింది. వీటి ద్వారా వినియోగదార్ల ఇంటి వద్దనే కార్ల విక్రయం, నూతన మోడళ్ల సమాచారం, ఉపకరణాలు, రుణ పథకాలు, టెస్ట్ డ్రైవ్, పాత కార్ల మార్పిడి వంటి సేవలు ఉంటాయి. దేశవ్యాప్తంగా 103 మొబైల్ షోరూంలను కంపెనీ అందుబాటులోకి తెస్తోంది. సమీపంలోని టాటా మోటార్స్ డీలర్షిప్ వీటిని నిర్వహిస్తుంది. జనాభా, ఆర్థిక పరంగా అధిక సామర్థ్యాన్ని కలిగి ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో సంస్థ పరిధిని పెంచడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ సేల్స్, మార్కెటింగ్, కస్టమర్ కేర్ వైస్ ప్రెసిడెంట్ రాజన్ అంబా తెలిపారు. దేశవ్యాప్తంగా మొత్తం కార్ల అమ్మకాల్లో గ్రామీణ ప్రాంతాల వాటా 40 శాతం దాకా ఉంది. -
పిల్లల్ని కంటే రుణాలిస్తాం
బీజింగ్: ఒకప్పుడు చైనా అంటే జనాభా విస్ఫోటనం. దీన్ని అరికట్టేందుకు అక్కడి ప్రభుత్వం పలు కఠిన నియమాలు తెచ్చింది. అవన్నీ ఫలితాలివ్వడంతో చాలావరకు జనన రేటు అదుపులోకి వచ్చింది. ఈ ప్రయత్నాలు క్రమంగా ఆదేశ జనాభా తరుగుదలకు, ముఖ్యంగా యువత సంఖ్య తగ్గేందుకు కారణమయ్యాయి. ప్రమాదాన్ని ఊహించిన ప్రభుత్వం ప్రస్తుతం మరింతమందిని కనేందుకు ప్రోత్సాహాలిస్తోంది. ఈ కోవలోనే జిలిన్ ప్రావిన్సు కొత్త పథకం ప్రకటించింది. పెళ్లైన వారు పిల్లలు కనాలనుకుంటే వారికి 2 లక్షల యువాన్ల(సుమారు రూ. 25 లక్షలు) బ్యాంకు రుణాలిప్పిస్తామని ప్రకటించింది. చిన్నాచితకా వ్యాపారాలు నడిపే జంటలకు ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువమంది పిల్లలుంటే వారి వ్యాపారాలపై పన్నుల్లో తగ్గింపులు, మినహాయింపులు ఇస్తామని ప్రకటించింది. -
Mahindra : కొత్త కారు.. కొనక్కర్లేదు.. అద్దెతోనే నడిపేయండి
Mahindra Finance Vehicle Leasing & Subscription Business Under Quiklyz Brand: మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ క్విక్లీజ్ పేరుతో లీజ్ ఆధారిత సబ్స్క్రిప్షన్ సేవలను పరిచయం చేసింది. ఆన్లైన్ వేదికగా రిటైల్, కార్పొరేట్ క్లయింట్లు లక్ష్యంగా అన్ని రకాల బ్రాండ్లకు చెందిన కార్లను అద్దె విధానంలో ఆఫర్ చేస్తుంది. ఎటువంటి ముందస్తు చెల్లింపు అవసరం లేదు. కనీస చందా నెలకు రూ.10,000 ఉంది. 24–60 నెలల కాలానికి కస్టమర్ తనకు నచ్చిన సరికొత్త కారును అద్దెకు తీసుకోవచ్చు. ఈ పద్దతిలో క్విక్లీజ్ వెబ్సైట్లో లాగిన్ అయి కారుతోపాటు కంపెనీ నుంచి ఎటువంటి సేవలు కావాలో ఎంచుకోవాలి. అవసరమైన పత్రాలు జతచేసి సెక్యూరిటీ డిపాజిట్ చెల్లిస్తే చాలు. స్టాక్నుబట్టి కొద్ది రోజుల్లోనే కస్టమర్ పేరునే వైట్ నంబర్ ప్లేట్‌తో ఇంటి ముంగిట వాహనం ఉంటుంది. కాల పరిమితి తర్వాత కారును వెనక్కి ఇవ్వొచ్చు. లేదా అదే వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు. మరో కారుకు అప్‌గ్రేడ్‌కూ అవ కాశం ఉంది. ఎనిమిది మోడళ్లు బుధవారం నాటికి ఎనిమిది బ్రాండ్లకు చెందిన 22 మోడళ్లు కొలువుదీరాయి. ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లను జోడిస్తామని కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం హైదరాబాద్‌సహా ఎనిమిది నగరాల్లో క్విక్లీజ్ అందుబాటులో ఉంది. ఏడాదిలో 30 నగరాలకు సేవలను విస్తరించాలన్నది సంస్థ ఆలోచన. - హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: -
ఆదిత్య బిర్లాసన్లైఫ్ నుంచి నిఫ్టీ హెల్త్‌కేర్ ఈటీఎఫ్
ముంబై: ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ మ్యూచువల్ ఫండ్.. నూతనంగా ‘ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ నిఫ్టీ హెల్త్‌కేర్ ఈటీఎఫ్’ పథకాన్ని ప్రారంభించింది. ఇది ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ పథకం. నిఫ్టీ హెల్త్‌కేర్ టీఆర్ఐ ఇండెక్స్‌ను అనుసరించి పెట్టుబడులు పెడుతుంది. ఈ నెల 8న మొదలైన ఈ పథకంలో 20వ తేదీ వరకు ఇన్వెస్ట్ చేసుకునేందుకు అవకాశం ఉంది. ఆరోగ్య సంరక్షణ (హెల్త్‌కేర్) రంగంలో ఉన్న అవకాశాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో పెట్టుబడులను వృద్ధి చేసే విధంగా ఈ పథకం పనిచేస్తుంది. నిఫ్టీ హెల్త్‌కేర్ ఇండెక్స్‌లో 20 వరకు కంపెనీలున్నాయి. వీటిల్లో ఈ పథకం ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ సందర్భంగా ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఏఎంసీ ఎండీ, సీఈవో ఏ.బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ.. ‘‘ఆదాయం, ఎగుమతులు, ఉపాధి కల్పన పరంగా హెల్త్‌కేర్ కూడా దేశంలో ఒకానొక ముఖ్య మైన రంగంగా అవతరించింది. ఈ వృద్ధి లిస్టెడ్ కంపెనీల్లోనూ ప్రతిఫలించాల్సి ఉంది. ఇది ప్యాసివ్ పథకం. కనుక వ్యయాలు తక్కువగా ఉంటాయి. ఈ రంగం వృద్ధిలో పాల్గొనేందుకు ఈ పథకం ఒక చక్కని మార్గం అవుతుంది’’ అని చెప్పారు. -
మధ్యాహ్న భోజన పథకానికి కొత్త పేరు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత మధ్యాహ్న భోజన పథకం పేరును ‘నేషనల్ స్కీమ్ ఫర్ పీఎం పోషణ్ ఇన్ స్కూల్స్’గా మారుస్తూ మరో ఐదేళ్ల పాటు కొనసాగించాలన్న ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 2021–22 నుంచి 2025–26 వరకూ ఐదేళ్లపాటు పథకాన్ని కొనసాగిస్తారు. ఇందుకు కేంద్రం రూ.54,061.73 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.31,733.17 కోట్ల మేరకు వ్యయాన్ని భరించనున్నాయి. అలాగే ఆహార ధాన్యాల కోసం కేంద్రం రూ.45 వేల కోట్లు అదనంగా వెచ్చించనుంది. మొత్తంగా ఐదేళ్లలో పీఎం పోషణ్ పథకం అమలుకు రూ.1,30,794.90 కోట్లు ఖర్చు చేయనున్నారు. ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడ్ పాఠశాలల్లో వండి, నిత్యం ఒకపూట వేడిగా భోజనం అందించే ఈ పథకంతో ఒకటో తరగతి నుంచి 8వ తరగతి విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. గతంలో ఈ పథకం పేరు ‘నేషనల్ స్కీమ్ ఫర్ మిడ్డే మీల్ ఇన్ స్కూల్స్’గా ఉండగా ఇప్పుడు ‘నేషనల్ స్కీమ్ ఫర్ పీఎం పోషణ్ ఇన్ స్కూల్స్’గా మార్చినట్టు కేంద్రం వెల్లడించింది. 2007 వరకు ఈ పథకం పేరు ‘నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ న్యూట్రిషనల్ సపోర్ట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్’ అని ఉండగా, 2007లో ‘నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ మిడ్ డే మీల్ ఇన్ స్కూల్స్’గా మార్చారు. దేశవ్యాప్తంగా 11.20 లక్షల పాఠశాలల్లో చదువుతున్న 11.80 కోట్ల మంది విద్యార్థులకు పీఎం పోషణ్ స్కీమ్ వర్తిస్తుందని కేంద్రం వెల్లడించింది. స్కూళ్లలో మధ్యాహ్న భోజనం కోసం 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.24,400 కోట్లు వెచ్చించినట్టు తెలిపింది. పిల్లలకు ‘తిథి భోజనం’ ► పీఎం పోషణ్ పథకాన్ని ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ ప్రీ–ప్రైమరీ లేదా బాల వాటికలకు కూడా వర్తింపజేయాలని కేంద్రం యోచిస్తోంది. 11.80 కోట్ల విద్యార్థులకు ఇది అదనం. ► తిథి భోజనం కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. ► ప్రత్యేక సందర్భాలు, పండుగల సమయాల్లో ప్రత్యేకమైన ఆహారాన్ని పిల్లలకు అందించేందుకు ఉద్దేశించిన సామాజిక భాగస్వామ్య కార్యక్రమం ఈ తిథి భోజనం. ► పాఠశాలల్లో న్యూట్రిషన్ గార్డెన్స్ అభివృద్ధి చేయడాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. తోటల పెంపకాన్ని విద్యార్థులకు పరిచయం చేయడమే దీని ఉద్దేశం. ఇప్పటికే 3 లక్షల పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. ► అన్ని జిల్లాల్లో సామాజిక తనిఖీలు తప్పనిసరిగా అమలు చేయాలి. పిల్లల్లో రక్తహీనత ఎక్కువగా ఉన్న జిల్లాల్లో అనుబంధ పౌష్టికాహారం అందించేందుకు ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తారు. -
ధర్మ ప్రచారం కోసం ప్రత్యేకంగా ధర్మపథం కార్యక్రమం
-
స్టార్టప్‌ల కోసం ‘సమృధ్’ కార్యక్రమం
న్యూఢిల్లీ: దేశీయంగా 300 పైచిలుకు ఐటీ స్టార్టప్‌లకు తోడ్పాటు అందించేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ (మెయిటీ) తాజాగా కొత్త కార్యక్రమం ప్రారంభించింది. స్టార్టప్ యాక్సెలరేటర్ ఆఫ్ మెయిటీ ఫర్ ప్రోడక్ట్ ఇన్నోవేషన్, డెవలప్మెంట్ అండ్ గ్రోత్ (సమృధ్) పేరిట బుధవారం దీన్ని ఆవిష్కరించింది. సిలికాన్ వేలీకి చెందిన వైకాంబినేటర్ తరహా యాక్సిలరేటర్గా దీన్ని రూపొందించినట్లు మెయిటీ ప్రత్యేక కార్యదర్శి జ్యోతి ఆరోరా తెలిపారు. దీనికి ఎంపికైన అంకుర సంస్థల్లో కనీసం 100 స్టార్టప్‌లను యూనికార్న్‌లుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. సమృధ్ కింద స్టార్టప్‌లకు సీడ్ ఫండింగ్ రూపంలో నిధులపరమైన తోడ్పాటు, మార్గదర్శకత్వం, మార్కెట్లోకి విస్తరించేందుకు అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ మొదలైనవి లభిస్తాయి. ఎంపికైన అంకుర సంస్థలకు ఈ పథకం కింద మెయిటీ రూ. 40 లక్షల దాకా సీడ్ ఫండ్, ఆరు నెలల పాటు మెంటార్షిప్ అందిస్తుంది. స్టార్టప్‌లకు నిధుల కొరత పెద్ద సమస్య కాదని, ఐడియాను ఉత్పత్తిగా మార్చే క్రమంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు తగు మార్గదర్శకత్వం ఎంతో ముఖ్యమని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. -
ఫేస్బుక్ లోన్లు.. హైదరాబాదీలకు అవకాశం
Small Business Loan Initiative: చిరు వ్యాపారులు, స్టార్టప్‌లకు అండగా నిలిచేందుకు ఫేస్బుక్ ముందుకు వచ్చింది. వీరికి తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేసింది. ఆగస్టు 20 నుంచి ఈ లోన్లు ఇస్తామని ఫేస్బుక్ ఇండియా ప్రకటించింది. స్మాల్ బిజినెస్ లోన్ స్టార్టప్ కంపెనీగా ప్రారంభమై ఈ రోజు అతిపెద్ద సంస్థల్లో ఒకటిగా నిలిచింది ఫేస్బుక్. లక్షల కోట్ల రూపాయల సంపద ఈ రోజు ఫేస్బుక్ సొంతం. దీంతో తనలాగే ఎదుగుతోన్న స్టార్టప్‌లు చిరు వ్యాపారులకు అండగా నిలిచేందుకు స్మాల్ బిజినెస్ లోన్ పేరుతో గతేడాది 100 మిలియన్ డాలర్లతో ప్రత్యేక నిధిని ఫేస్బుక్ ఏర్పాటు చేసింది. వీటితో 30 దేశాల్లోని మైక్రో, మీడియం బిజినెస్‌లో ఉన్న సంస్థలకు సాయం చేయాలని నిర్ణయించింది. ఇండియాఫై ద్వారా స్మాల్ బిజినెల్ లోన్ పథకం అమలు చేసేందుకు ఇండిఫై సంస్థతో ఫేస్బుక్ ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం ఇండిఫై సంస్థ చిరు వ్యాపారులకు లోన్లు అందించే సంస్థగా పని చేస్తోంది. ఫేస్బుక్ స్మాల్బిజినెస్ లోన్లు పొందాలనుకునేవారు ఇండియాఫై ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్‌లో కూడా స్మాల్ బిజినెస్ లోన్ పథకంలో భాగంగా ఇండియాకు 4 మిలియన్ డాలర్లు కేటాయించింది. వీటితో దేశంలో ఉన్న 200 పట్టణాల్లోని చిరు, మధ్యతరహా వ్యాపారులకు లోన్లు ఇవ్వనున్నారు. కనిష్టంగా రూ. 5 నుంచి గరిష్టంగా రూ.50 లక్షల వరకు లోన్లు ఇస్తారు. తొలివిడతగా ఆగస్టు 20వ తేది నుంచి ఈ పథకాన్ని హైదరాబాద్, న్యూఢిల్లీ, గురుగ్రామ్, ముంబై, బెంగళూరులలో అమలు చేయనున్నారు. కనీసం మూడు వేల మందికి అయినా లోన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తక్కువ వడ్డీ ఫేస్బుక్లో ప్రకటనలు ఇవ్వడానికి వస్తున్న అనేక స్టార్టప్ కంపెనీలు పెట్టుబడి దొరక్క ఇబ్బందులు పడుతున్నట్టు గుర్తించాం. అందుకే వారికి అండగా నిలిచేందుకు స్మాల్ బిజినెస్ లోన్ పథకానికి శ్రీకారం చుట్టినట్టు ఫేస్బుక్ ఇండియా, వైస్‌ప్రెసిడెంట్ అజిత్ మోహన్ అన్నారు. స్మాల్బిజినెస్ ద్వారా ఇచ్చే లోన్‌కి నామమాత్రపు వడ్డీ తీసుకుంటామన్నారు. ఇక మహిళా వ్యాపారులకయితే వడ్డీలో అదనంగా 0.20 శాతం రాయితీతో రుణాలు ఇస్తామన్నారు. - సాక్షి, వెబ్‌డెస్క్ చదవండి: దక్షిణాదిలోనే ఎత్తయిన నివాస సముదాయం..హైదరాబాద్‌లోనే -
రోజుకు రూ.29 పొదుపు చేస్తే చాలు..చేతికి రూ.4లక్షలు!
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మహిళల కోసం 'ఆధార్ శిలా' అనే పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. పథకంలో భాగంగా కట్టిన మొత్తానికి గాను అదనంగా రెండు రెట్లు నగదును సొంతం చేసుకోవచ్చు. ఎల్ఐసీ మహిళలకు స్వావలంబన చేకూర్చేందుకు ఆధార్ శిలా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా 8 సంవత్సరాల నుంచి 55 ఏళ్ల వయస్సున్న మహిళలు 20ఏళ్లపాటు ఏడాదికి రూ.10,959 అంటే రోజుకి రూ.29 చెల్లించాలి. ఇలా చెల్లించిన మొత్తం 20ఏళ్లకు రూ.2,19,180 అవుతుంది. మెచ్యూరిటీ సమయంలో రూ.4లక్షలు వస్తాయి. అంతేకాదు ఈ పథకం రిటర్న్ ఎండోమెంట్ పాలసీ కిందకు వస్తుంది.అంటే పెట్టుబడి ప్రణాళికపై హామీనిచ్చే రాబడులతో పాటు, పెట్టుబడి పెట్టిన మొత్తానికి ఎల్ఐసీ సెక్యూరిటీ కవరేజీని అందిస్తోంది.ఉదాహరణకు పెట్టుబడిదారుడు మెచ్యూరిటీ వ్యవధికి ముందే మరణిస్తే మరణించిన వారి బంధువులకు ఎల్ఐసీ ఆర్థిక సహాయం అందిస్తుంది. పాలసీలో భాగంగా కుటుంబానికి కనీసం రూ .75,000 నుంచి గరిష్టంగా రూ.3,00,000 వరకు ఆర్ధికంగా భరోసా ఇస్తుంది. -
కేంద్రం కొత్త పథకం.. రియల్టీలో జోష్..
న్యూఢిల్లీ: జాతీయ రహదారులకు సమీపంలో పారిశ్రామిక సమూహాలు, లాజిస్టిక్స్ పార్క్‌లు, స్మార్ట్ పట్టణాలు, టౌన్‌షిప్‌ల నిర్మాణానికి అనుమతి కోరుతూ కేబినెట్ నోట్‌ను తయారు చేసినట్టు కేంద్ర రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. వర్చువల్‌గా నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... ప్రపంచస్థాయి ప్రమాణాలు, హంగులతో రహదారుల నెట్‌వర్క్‌ను నిర్మించాలన్న లక్ష్యం తో ఉన్నట్టు చెప్పారు. ప్రస్తుత రహదారుల ప్రాజెక్టులను విక్రయించేందుకు ప్రణాళికను కూడా సిద్ధం చేసినట్టు పేర్కొన్నారు. 400 ప్రాంతాల్లో రహదారుల పక్కన సౌకర్యాలను కల్పిస్తున్నట్టు చెప్పారు. -
సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..!
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో ఆదివారం రోజున జరిగిన అఖిలపక్షభేటి ముగిసింది. సామాజికంగా, ఆర్ధికంగా దళితులు అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు అన్నారు. తెలంగాణలో సీఎం దళిత సాధికారత పథకం ద్వారా దళితులకు నిధులు కేటాయించనున్నారు. ఒక్కో యూనిట్‌కి రూ.10 లక్షల ఆర్థికసాయం అందించనున్నారు. నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మొదటి దశలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 100 కుటుంబాల చొప్పున 10వేల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికసాయం అందించనుంది. సుమారు రూ.1200 కోట్లతో సీఎం దళిత సాధికారిత పథకం ప్రారంభంకానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో సమిష్ఠి నిర్ణయాన్ని తీసుకున్నారు. చదవండి: సీఎం దళిత్ ఎంపవర్మెంట్కు రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తాం: కేసీఆర్ -
Kia: కారు నచ్చకుంటే 30 రోజుల్లో వాపస్ చేయొచ్చు!
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం కియా తాజాగా తమ ప్రీమియం మల్టీపర్పస్ వెహికల్ (ఎంపీవీ) కార్నివాల్‌పై కొత్త స్కీమ్ ప్రకటించింది. కొనుగోలుదారులు కారు పనితీరుపై సంతృప్తి చెందని పక్షంలో కొన్న 30 రోజుల్లో వాపసు చేయొచ్చని తెలిపింది. కార్నివాల్ ఎంపీవీలోని అన్ని వేరియంట్స్‌కి ‘శాటిస్ఫాక్షన్ గ్యారంటీడ్ స్కీమ్’ వర్తిస్తుందని కియా ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ స్కీమ్ కింద వాపసు చేయాలంటే కొన్న తేదీ నుంచి ప్రయాణించిన దూరం 1,500 కి.మీ.లకు మించకూడదు. అలాగే ఎలాంటి డ్యామేజీలు, పెండింగ్ క్లెయిమ్‌లు మొదలైనవి ఉండకూడదు. హైపోథికేషన్ ఉండకూడదు. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) ఇవ్వాల్సి ఉంటుంది. వాపసు చేస్తే ఎక్స్–షోరూం ధరలో దాదాపు 95% మొత్తంతో పాటు రిజిస్ట్రేషన్, ఫైనాన్స్ మొదలైన వాటికి అయిన ఇతర ఖర్చులకు కవరేజీ ఉంటుంది. ప్రస్తుత గడ్డుకాలంలో తమ కస్టమర్లకు మరింత భరోసా కల్పించేందుకు ఈ స్కీము దోహదపడగలదని కియా ఇండియా ఈడీ టే–జిన్ పార్క్ తెలిపారు. చదవండి: New York Mercantile Exchange: మళ్లీ పసిడి జిగేల్! -
అన్నదాతల కోసం మరో కేంద్ర పథకం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అన్నదాతల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిది యోజన పథకాన్ని తీసుకొచ్చిన సంగతి మనకు తెలిసిందే. దీని కింద ప్రతి ఏడాది రూ.6వేల రూపాయలను మూడు విడతల్లో రైతుల ఖాతాలో జమ చేస్తుంది. అలాగే ఇప్పుడు రైతుల కోసం మరో పథకం కూడా అందుబాటులో ఉంది. గతంలోనే అన్నదాతల కోసం పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. దీనిపై అవగాహన తక్కువగా ఉండటం వల్ల చాలా తక్కువ మంది రైతుల మాత్రమే ఇందులో చేరారు.(చదవండి: రైతులకు భారీ ఊరట: రుణ మాఫీ) పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన అనేది చిన్న, ఉపాంత రైతుల సామాజిక భద్రత కోసం తీసుకొచ్చిన ప్రభుత్వ పథకం. 18 నుండి 40 సంవత్సరాల వయస్సులోపు 2 హెక్టార్ల వరకు సాగు చేయగల భూములను కలిగి ఉన్న చిన్న, ఉపాంత రైతులు ఈ పథకం కింద ప్రయోజనం పొందటానికి అర్హులు. ఈ పథకం కింద 60 ఏళ్లు నిండిన తరువాత రైతులకు నెలకు 3000/- రూపాయల కనీస భరోసా పెన్షన్ లభిస్తుంది. రైతు మరణిస్తే రైతు జీవిత భాగస్వామికి 50శాతం పెన్షన్‌ను కుటుంబ పెన్షన్‌గా పొందటానికి అర్హత ఉంటుంది. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల చందాదారులు 60ఏళ్లు వచ్చే వరకు నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుడు 60 ఏళ్లు నిండిన వెంటనే పెన్షన్ మొత్తాన్ని క్లెయిమ్ చేయవచ్చు. ప్రతి నెల సంబంధిత వ్యక్తి యొక్క పెన్షన్ ఖాతాలో రూ.3వేలు జమ అవుతాయి. దీని కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతా/PM-కిసాన్ ఖాతా, పొలం పాస్‌బుక్, రెండు ఫోటోలు ఉంటే సరిపోతుంది. అయితే పీఎం కిసాన్ స్కీమ్‌లో ఉన్నా వారు ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా ఉచితంగానే ఈ పథకంలో చేరవచ్చు. -
ఎకానమీకి మరింత జోష్..
న్యూఢిల్లీ: కరోనా వైరస్ సంక్షోభంతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడంపై కేంద్రం మరింతగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ఆత్మనిర్భర్ భారత్ 3.0 కింద మరిన్ని చర్యలు ప్రకటించారు. నిర్దిష్ట గృహ విక్రయ లావాదేవీలపై పన్నుపరమైన ప్రయోజనాలు, మరికొన్ని రంగాలకు అత్యవసర రుణ హామీ పథకం వర్తింపు, కొత్త ఉద్యోగాల కల్పనకు ప్రోత్సాహకాలు, ఎరువుల సబ్సిడీకి అదనంగా కేటాయింపులు మొదలైనవి వీటిలో ఉన్నాయి. లాక్డౌన్ అమలు చేసినప్పట్నుంచీ ఇప్పటిదాకా ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీల మొత్తం పరిమాణం దాదాపు రూ. 30 లక్షల కోట్లుగా ఉంటుందని (స్థూల దేశీయోత్పత్తిలో 15 శాతం) నిర్మలా సీతారామన్ తెలిపారు. పటిష్టంగా రికవరీ... దీర్ఘకాలం లాక్డౌన్ అనంతరం దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టమైన రికవరీ నమోదు చేస్తోందని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఉత్పత్తి గణాంకాల మెరుగుదలతో పాటు, అక్టోబర్‌లో ఇంధన వినియోగ వృద్ధి 12 శాతం పెరిగిందని.. వస్తు, సేవల పన్నుల వసూళ్లు 10 శాతం వృద్ధి చెంది రూ. 1.05 లక్షల కోట్లకు చేరాయని పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన.. కొత్తగా ఉద్యోగులను తీసుకునే సంస్థలకు ప్రావిడెంట్ ఫండ్పరమైన సబ్సిడీని ఇవ్వడం ద్వారా ఉద్యోగాల కల్పనకు ఊతమిచ్చేందుకు కేంద్రం ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన ఆవిష్కరించింది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)లో నమోదై, కొత్తగా ఉద్యోగులను తీసుకునే సంస్థలకు ఇది వర్తిస్తుంది. దీని ప్రకారం రెండేళ్ల పాటు పీఎఫ్ చందాలో ఉద్యోగి వాటా (జీతంలో 12 శాతం), సంస్థ వాటా (జీతంలో 12 శాతం) కలిపి మొత్తం 24 శాతాన్ని ప్రభుత్వం భరిస్తుంది. ఈపీఎఫ్‌వోలో నమోదైన సంస్థలో, రూ. 15,000 లోపు నెలవారీ జీతంపై చేరే కొత్త ఉద్యోగులకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. అలాగే రూ. 15,000 కన్నా తక్కువ వేతనమున్న ఈపీఎఫ్ సభ్యులు, కరోనా వైరస్ పరిణామాలతో మార్చి 1వ తేదీ తర్వాత ఉద్యోగం కోల్పోయి, అక్టోబర్ 1న లేదా ఆ తర్వాత తిరిగి ఉద్యోగంలోకి చేరినా.. వారికి కూడా ఈ పథ కం వర్తిస్తుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. 2021 జూన్ 30 దాకా ఈ స్కీమ్ అమల్లో ఉంటుంది. ఈ స్కీమును ఉపయోగించుకోదల్చుకున్న పక్షంలో.. 50 మంది దాకా ఉద్యోగులు ఉన్న సంస ్థలు కొత్తగా కనీసం ఇద్దరు ఉద్యోగులకు, 50 మంది కి పైగా సిబ్బంది ఉన్న సంస్థలు కనీసం అయిదు మందికి ఉద్యోగాలు కల్పించాల్సి ఉంటుంది. ఈసీఎల్జీఎస్ మార్చి దాకా పొడిగింపు... వచ్చే ఏడాది మార్చి 31 దాకా ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్‌ను కేంద్రం పొడిగించింది. చిన్న, లఘు సంస్థలకు ఈ పథకం కింద తనఖా లేని రుణాలు లభిస్తాయి. కామత్ కమిటీ గుర్తించిన 26 రంగాలతో పాటు హెల్త్‌కేర్ రంగానికి కూడా ఈ స్కీమ్ వర్తింపచేయనున్నట్లు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఈ కంపెనీలకు రుణాలపై ఏడాది మారటోరియంతో పాటు చెల్లింపునకు నాలుగేళ్ల వ్యవధి లభిస్తుందని వివరించారు. రియల్టీకి తోడ్పాటు... గృహ కొనుగోలుదారులు, డెవలపర్లకు ఆదాయ పన్నుపరమైన ఊరటనిచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రూ. 2 కోట్ల దాకా విలువ చేసే కొత్త గృహాలను స్టాంప్ డ్యూటీ సర్కిల్ రేటు కన్నా 20 శాతం తక్కువకు విక్రయించేందుకు అనుమతించేలా ఆదాయ పన్ను చట్టాన్ని సవరించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యత్యాసం 10 శాతం దాకా మాత్రమే ఉంది. అమ్ముడుపోకుండా పేరుకుపోయిన గృహాల విక్రయానికి ఊతమివ్వడంతో పాటు కొనుగోలుదారులు, డెవలపర్లకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని నిర్మలా సీతారామన్ వివరించారు. ప్రస్తుతం ఐటీ చట్టంలోని సెక్ష¯Œ 43సీఏ ప్రకారం.. సర్కిల్ రేటు కన్నా ఒప్పంద విలువ 10 శాతానికి మించి తగ్గిన పక్షంలో పన్నుపరమైన జరిమానాలు ఉంటున్నాయని పరిశ్రమవర్గాలు తెలిపాయి. దీనివల్ల నిల్వలు పేరుకుపోతున్నా.. బిల్డర్లు రేట్లు తగ్గించే పరిస్థితి లేదని వివరించాయి. ఈ నిబంధన సడలించడమనేది.. రేట్లు తగ్గించేందుకు, విక్రయాలు పెంచుకునేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నాయి. రూ. 65వేల కోట్ల ఎరువుల సబ్సిడీ .. ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా ఎరువుల సబ్సిడీ కోసం రూ. 65,000 కోట్లు కేటాయిస్తున్నట్లు సీతారామన్ వెల్లడించారు. పంట సీజ¯Œ లో రైతులకు సరైన సమయంలో, తగినంత స్థాయిలో ఎరువులు అందుబాటులో ఉండేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇది రైతాంగానికి గణనీయంగా తోడ్పడగలదని కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ పేర్కొన్నారు. ఎరువుల వినియోగం 2016–17లో 499 లక్షల టన్నులుగా ఉండగా 2020–21లో 673 లక్షల టన్నులకు పెరుగుతుందని అంచనా. మరిన్ని చర్యలు.. ► పట్టణ ప్రాంతాల్లో అందుబాటు ధరల్లో ఇళ్ల పథకానికి అదనంగా రూ. 18,000 కోట్లు. ► కాంట్రాక్టర్లకు నిధుల లభ్యత మరికాస్త మెరుగ్గా ఉండే విధంగా ప్రాజెక్టులకు కట్టాల్సిన ముందస్తు డిపాజిట్ పరిమాణం తగ్గింపు. 2021 డిసెంబర్ 31 దాకా వర్తింపు. ► కోవిడ్–19 టీకాపై పరిశోధనలకు బయోటెక్నాలజీ విభాగానికి రూ. 900 కోట్ల గ్రాంటు. ► గ్రామీణ ఉపాధికి రూ.10,000 కోట్లు. ► మరింతగా రుణ వితరణకు తోడ్పడేలా ఎగ్జిమ్ బ్యాంక్‌కు రూ. 3,000 కోట్లు. ► డిఫెన్స్, ఇన్ఫ్రా కోసం బడ్జెట్ కేటాయింపులకు మించి రూ. 10,200 కోట్లు. -
కొనసాగుతున్న రికార్డులు..
ముంబై: ఫార్మా, మెటల్, ఆటో షేర్ల ర్యాలీతో సూచీలు ఎనిమిదోరోజూ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 316 పాయింట్లు పెరిగి 43,594 వద్ద, నిఫ్టీ 118 పాయింట్లను ఆర్జించి 12,749 వద్ద స్థిరపడ్డాయి. దీంతో సూచీల రికార్డుల పర్వం మూడోరోజూ కొనసాగినట్లయింది. దేశంలో పది కీలక రంగాల్లో ఉత్పత్తిని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా కేంద్రం ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల పథకం(పీఎల్ఐ)కు ఆమోదం తెలపడంతో సంబంధిత రంగాల్లో విస్తృతంగా కొనుగోళ్లు జరిగాయి. అలాగే ఫైజర్ కంపెనీ రూపొందించిన కోవిడ్ –19 వ్యాక్సిన్ విజయవంతం ఆశలు సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 431 పాయింట్లు పెరిగి 43, 708 వద్ద, నిఫ్టీ 139 పాయింట్ల 12,770 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేశాయి. ఇంట్రాడేలో అమ్మకాలు... లాభాలతో మొదలైన మార్కెట్లో తొలి గంటలో కొనుగోళ్లు కొనసాగాయి. ముఖ్యంగా ఆటో, ఫార్మా, బ్యాంకింగ్ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తిచూపారు. అంతా సాఫీగా సాగుతున్న తరుణంలో ట్రేడర్లు ఒక్కసారిగా లాభాల స్వీకరణకు పూనుకున్నారు. ప్రభుత్వరంగ బ్యాంకింగ్, ఇంధన, మీడియా రంగ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా మిడ్‌సెషన్ కల్లా సెన్సెక్స్ ఇంట్రాడే(43,708) నుంచి ఏకంగా 738 పాయింట్ల కోల్పోగా, నిఫ్టీ డే హై నుంచి 200 పాయింట్లు పడింది. 4 శాతం నష్టపోయిన రిలయన్స్... ఇండెక్స్‌ల్లో అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్ షేరు బుధవారం 4 శాతం నష్టపోయి రూ. 1979 వద్ద స్థిరపడింది. ఎమ్ఎస్సీఐ ఇండెక్స్ రివ్యూలో రిలయన్స్ షేరుకు వెయిటేజీ తగ్గించడంతో అమ్మకాలు తలెత్తాయి. గ్లాండ్ ఫార్మా ఐపీఓకు 2 రెట్ల స్పందన హైదరాబాద్: గ్లాండ్ ఫార్మా ఐపీఓ చివరిరోజు ముగిసేసరికి 2.05 రెట్లు్ల ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. ఇష్యూలో భాగంగా కంపెనీ జారీ చేసిన మొత్తం 3.50 కోట్ల షేర్లకు గానూ 6.21 కోట్ల బిడ్లు ధాఖలయ్యాయి. ఇందులో క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్ల (క్యూఐబీ) విభాగం 6.40 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (ఎన్ఐఐ)విభాగం 51 శాతం, రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం 24 శాతం సబ్‌స్క్రైబ్ అయినట్లు ఎన్ఎస్ఈ గణాంకాలు తెలిపాయి. రూ.6,480 కోట్ల సమీకరణ లక్ష్యంగా ఐపీఓకు వచ్చిన ఇష్యూ ఈ నవంబర్ 9 న ప్రారంభమైంది. -
‘తయారీ’ బూస్ట్ 2 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: తయారీ రంగంలో భారత్ స్వావలంబన సాధించాలన్న ప్రధాని మోదీ ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం మరో పథకానికి తెరతీసింది. దేశంలో టెలికం, ఆటోమొబైల్, ఫార్మాసూటికల్స్ వంటి మరో 10 కీలక తయారీ పరిశ్రమలకు మరింత చేయూతనిచ్చేందుకు ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని అమలు చేయనుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ స్కీమ్ అమలుకు ఆమోదముద్ర వేశారు. దీని ప్రకారం ఐదేళ్ల వ్యవధిలో మొత్తం రూ. 2 లక్షల కోట్ల మేర రాయితీలు ఆయా రంగాలకు చెందిన పరిశ్రమలకు లభించనున్నాయి. కాగా, సామాజిక మౌలికసదుపాయాల కల్పన రంగాలకు కూడా వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) స్కీమ్‌ను విస్తరించేందుకు కేబినెట్ ఓకే చెప్పింది. ప్రస్తుతం ఆర్థిక మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టులకు మాత్రమే ఈ స్కీమ్ అమలవుతోంది. దేశీ తయారీకి దన్ను... ఆర్థిక వ్యవస్థ వృద్ధిని పుంజుకునేలా చేయడం, అలాగే దిగుమతులను తగ్గించి తద్వారా ఉపాధి అవకాశాలను సృష్టించాలనేది ప్రభుత్వ సంకల్పం. ఈ దిశగా దేశీ తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి ఈ స్కీమ్ తోడ్పాటును అందించనుంది. ఈ కొత్త పథకం కింద రూ.1,45,980 కోట్ల ఆర్థిక ప్రయోజనాన్ని ప్రభుత్వం కేటాయించనుంది. కాగా, ఇప్పటికే రూ.51,311 కోట్ల వ్యయానికి కేంద్రం ఆమోదం తెలిపిందని అధికారిక ప్రకటన వెల్లడించింది. ‘భారతీయ తయారీ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా మరింత పోటీపడేలా చేయడమే లక్ష్యంగా ఈ ఐదేళ్ల పీఎల్ఐ స్కీమ్‌ను రూపొందించాం. దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది’ అని సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. సంబంధిత మంత్రిత్వ శాఖలు/విభాగాలు ఈ స్కీమ్‌ను అమలు చేస్తాయి. విడివిడిగా ఆయా రంగాలకు సంబంధించిన తుది ప్రతిపాదనలను వ్యయ ఆర్థిక కమిటీ (ఈఎఫ్‌సీ) మదింపు చేసిన తర్వాత, కేబినెట్ ఆమోదిస్తుంది. షిప్పింగ్ శాఖ పేరు మార్పు... కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖ పేరును పోర్టులు, షిప్పింగ్, వాటర్‌వేస్ మంత్రిత్వ శాఖగా కేంద్ర ప్రభుత్వం మార్చింది. ఈ ప్రతిపాదనను ప్రధాన మంత్రి మోదీ ప్రకటించిన కొద్ది రోజుల్లోనే ఈ దిశగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ‘స్వావలంబన భారత్’ సాకారం: నిర్మలా సీతారామన్ పీఎల్ఐ స్కీమ్‌కు ఆమోదం గురించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, తయారీ రంగానికి ఇది అద్భుతమైన ప్రోత్సాహకాలను అందిస్తుందని చెప్పారు. తద్వారా ‘ఆత్మనిర్భర్ భారత్’ (స్వావలంబన భారత్) లక్ష్యం సాకారం దిశగా దేశాన్ని నడిపించడంలో తోడ్పడుతుందని పేర్కొన్నారు. ‘రెండు స్కీమ్‌లకు సంబంధించి కేబినెట్ చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థకు ఇది కచ్చితంగా సరైన దన్నును అందిస్తుంది. ఎందుకంటే మేము స్వావలంబన కోసం ప్రయత్నిస్తున్నాం. ప్రపంచ విలువ ఆధారిత సరఫరా వ్యవస్థలో భారత్‌ను భాగంగా చేసేందుకు ఇవి దోహదం చేస్తాయి’ అని సీతారామన్ వివరించారు. దీనిద్వారా ఉద్యోగాలను సృష్టించడంతో పాటు ప్రపంచ సరఫరా వ్యవస్థకు భారత్‌ను అనుసంధానం చేస్తుందని చెప్పారు. భారత్‌ను ప్రపంచ తయారీ గమ్యస్థానంగా మార్చేందుకు ఈ ప్రోత్సాహకాలు తోడ్పడతాయని పేర్కొన్నారు. సమయానుకూల నిర్ణయం: కార్పొరేట్ ఇండియా పీఎల్ఐ స్కీమ్‌ను మరో 10 కీలక రంగాలకు వర్తింపజేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలపడం పట్ల భారత పారిశ్రామిక దిగ్గజాలు, నిపుణులు ప్రశంసలు కురిపింటటచారు. ఎవరేమన్నారంటే... కొత్త పీఎల్ఐ పాలసీ సమయానుకూలమైనది అలాగే తయారీ రంగంలో సమూల మార్పులను తీసుకొస్తుంది. తద్వారా ప్రపంచ తయారీ రంగ కేంద్రంగా భారత్ ఎదిగేందుకు దోహదం చేస్తుంది. – ఉదయ్ కోటక్, సీఐఐ ప్రెసిడెంట్ తయారీ రంగంలో భారత్ స్వావలంబన సాధించేందుకు ఉద్దేశించిన ఈ ఫ్లాగ్షిప్ పథకానికి సుమారు రూ.2 లక్షల కోట్లను వెచ్చించనున్నారు. ఆర్థిక కార్యకలాపాలపై ఇది భారీ ప్రభావాన్నే చూపుతుంది. ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, తదితర విభిన్న రంగాల వ్యాప్తంగా గణనీయంగా ఉద్యోగ కల్పనకు దోహదం చేస్తుంది. – దీపక్ సూద్, అసోచామ్ సెక్రటరీ జనరల్ పీఎల్ఐ స్కీమ్ పరిధిలోకి మరిన్ని రంగాలను తీసుకురావడం వల్ల తయారీ రంగానికి భారీ బూస్ట్ లభించనుంది. ఈ చర్యలు వ్యూహాత్మకం అలాగే సాంకేతికతతో ముడిపడినవి, దీనివల్ల దేశంలో ఉద్యోగాల కల్పన కూడా జోరందుకుంటుంది. దేశీ మార్కెట్ కోణంలోనే కాకుండా ఆయా రంగాలకు చెందిన ఉత్పత్తులకు భారత్‌ను ఎగుమతి కేంద్రంగా మార్చేందుకు భారీ అవకాశాన్ని భారత ఆర్థిక వ్యవస్థ అందిస్తుంది. – సంగీతా రెడ్డి, ఫిక్కీ ప్రెసిడెంట్ -
కొత్త జంటలకు బంఫర్ ఆఫర్!
టోక్యో: జపాన్‌లో జననాల రేటు దారుణంగా పడిపోవడంతో ఆ దేశం వినూత్నంగా ఆలోచించింది. అక్కడి యువతి యువకులను పెళ్లి చేసుకునేలా ప్రోత్సాహించి జననాల రేటు పెంచేందుకు కొత్త జంటకు 6 లక్షల యెన్లను జపాన్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జననాల రేటు తిరిగి గాడిన పడుతుందని జపాన్ ఆలోచించింది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి పెళ్లి చేసుకునే జంటలకు ప్రోత్సాహక బహుమతి కింద 6 లక్షలు యెన్లు(ఇండియన్ కరెన్సీలో రూ. 4 లక్షలకు కంటే ఎక్కవ) ఇవ్వనుంది. అంతేగాక పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఈ ప్రోత్సాహం ఎంతగానో ఉపయోగపడుతుందని జపాన్ ప్రభుత్వం పేర్కొంది. (చదవండి: 516కు పైగా ఆపరేషన్స్.. అయినా కానీ..) ఈ పథకాన్ని ప్రకటిస్తూ ప్రభుత్వం కొన్ని నిబంధనలు కూడా విధించింది. పెళ్లి చేసుకునే జంట మొదట వారి పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని, వారి వయసు 40 ఏళ్లకు మించి ఉండకూడదు. వార్షిక ఆదాయం 5.4 లక్షల కంటే తక్కువగా ఉన్న వారే ఈ ప్రోత్సాహక బహుమతికి అర్హులుగా జపాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. గతేడాది దేశ వ్యాప్తంగా 8.65 లక్షల మంది మాత్రమే జన్మించడంతో రానురాను జననాల రేటు పడిపోతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దేశంలో జననాల రేటును తిరిగి పెంచేందుకు జపాన్ ఈ కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ ప్రోత్సాహాకాన్ని ఆ దేశ యువతీ యువకులు ఏ స్థాయిలో సద్వినియోగం చేసుకుంటారో, జననాల రేటు పెరుగుదలకు ప్రభుత్వ ప్రయత్నం తోడ్పడుతుందో లేదో వేచి చూడాలి. (చదవండి: చైనా ముప్పు; భారత్- జపాన్ కీలక ఒప్పందం) -
భూముల రక్షణకు ‘స్వామిత్వ’
న్యూఢిల్లీ: ‘గ్రామీణ ప్రజలకు ఆస్తి కార్డులను పంపిణీ చేసే ‘స్వామిత్వ’ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. ఇది గ్రామీణ భారతాన్ని మార్చే విప్లవాత్మక కార్యక్రమం అని, ‘ఆత్మనిర్భర్ భారత్’ దిశగా కీలక ముందడుగు అని పేర్కొన్నారు. ఈ కార్డులను ఉపయోగించి పల్లె ప్రజలు బ్యాంకుల్లో రుణాలు పొందవచ్చన్నారు. అలాగే, దీంతో గ్రామస్తుల మధ్య భూ యాజమాన్యానికి సంబంధించిన ఆస్తి తగాదాలు తొలగిపోతాయన్నారు. ఈ ‘సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రొవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్(స్వామిత్వ)’ కార్యక్రమంలో వీడియో కాన్ఫెరెన్స్ విధానంలో ప్రధాని పాల్గొన్నారు. ఆస్తిపై యాజమాన్య హక్కు దేశాభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తుందని ప్రపంచవ్యాప్తంగా నిపుణులు చెప్తున్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా తమ ఆస్తులకు సంబంధించి చట్టబద్ధమైన రికార్డులు ఉన్నవారు మూడింట ఒక వంతు మాత్రమేనని ప్రధాని వెల్లడించారు. ‘గ్రామాల్లోని యువత ఈ ప్రాపర్టీ కార్డులను హామీగా పెట్టి, స్వయం ఉపాధి కోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవచ్చు. ఆస్తిపై చట్టబద్ధ హక్కును కలిగి ఉండడం వల్ల యువతలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. తద్వారా స్వావలంబన సాధించగలుగుతారు’ అన్నారు. ప్రజలు తమ ఆస్తులపై స్పష్టమైన యాజమాన్య హక్కులు కలిగి ఉండటం అవసరమని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో డ్రోన్ టెక్నాలజీతో భూముల మ్యాపింగ్ చేయాలని యోచిస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు. ప్రసంగిస్తున్న సమయంలో ప్రధాని వెనుకవైపు ఆదివారం జయంతి ఉన్న సోషలిస్ట్ నేత జయప్రకాశ్ నారాయణ్, ఆరెస్సెస్ దిగ్గజం నానాజీ దేశ్‌ముఖ్‌ల ముఖచిత్రాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తన ప్రసంగంలో ఆ మహనీయుల సిద్ధాంతాలను ప్రధాని వివరించారు. గ్రామాల్లోని ప్రజలు తరచు ఆస్తికి సంబంధించిన వివాదాల్లో చిక్కుకుపోతే.. వారే కాకుండా, సమాజమూ అభివృద్ధి చెందబోదని నానాజీ దేశ్‌ముఖ్ భావించేవారిని వివరించారు. ఆ సమస్యను అంతం చేసే దిశగానే ఈ ఆస్తి కార్డుల విధానాన్ని ప్రారంభించామన్నారు. ఆస్తి కార్డుల ద్వారా బ్యాంక్ ఖాతాలను, విద్యుత్ కనెక్షన్, గ్యాస్ కనెక్షన్, పక్కా ఇల్లు తదితర సౌకర్యాలు పొందవచ్చన్నారు. ప్రస్తుతం యూపీ, హరియాణా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరా ఖండ్, కర్ణాటక రాష్ట్రాల్లోని 763 గ్రామా ల్లో ఈ స్వామిత్వను ప్రారంభించారు. ఈ గ్రామా ల్లోని ప్రజలు తక్షణం అవసరమనుకుంటే తమ ఫోన్లకు అధికారులు ఎస్ఎంఎస్ చేసిన లింక్ ద్వారా ప్రాపర్టీ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆస్తి కార్డుల పంపిణీని త్వరలో ప్రారంభిస్తాయి. ప్రతీ కార్డుకు ఆధార్ కార్డు తరహాలో ఒక ప్రత్యేక సంఖ్య ఉంటుంది. రానున్న మూడు, నాలుగేళ్లలో ప్రతీ కుటుంబానికి ప్రాపర్టీ కార్డులను అందజేస్తామని మోదీ తెలిపారు. వ్యవసాయ బిల్లులను వారే వ్యతిరేకిస్తున్నారు దళారి వ్యవస్థ బాగుపడాలని కోరుకునేవారే వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్నారని ప్రధాని విపక్షాలపై విమర్శలు గుప్పించారు. మధ్యవర్తులు, దళారులు అందించిన అధికారంతోనే వారు రాజకీయాలు చేశారన్నారు. వారి కుయుక్తులకు రైతులు మోసపోరని వ్యాఖ్యానించారు. గత ఆరు దశాబ్దాల్లో విపక్ష ప్రభుత్వాలు చేయలేని గ్రామీణాభివృద్ధిని గత ఆరేళ్లలో తమ ప్రభుత్వం చేసి చూపిందన్నారు. ‘దేశ ఆత్మ గ్రామాల్లోనే ఉంటుందని చెబుతుంటారు. కానీ గత ప్రభుత్వాలు గ్రామీణ భారతాన్ని పట్టించుకోకుండా వదిలేశాయి’ అని విమర్శించారు. ‘గ్రామాలు, పేదలు, రైతులు, కూలీలు స్వావలంబన సాధించడం చాలా మందికి ఇష్టం ఉండదు. మా సంస్కరణలు రైతుల పొట్టకొడ్తున్న దళారుల అక్రమ ఆదాయాన్ని దెబ్బతీస్తున్నాయి. అందుకే మా సంస్కరణలపై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు’ అని ప్రధాని ఆరోపించారు. ‘ఆ మధ్యవర్తులు, దళారుల వల్ల బలపడిన కొందరు కూడా ఈ వ్యవసాయ సంస్కరణలను వ్యతిరేకిస్తున్నారు’ అని విపక్షాలపై పరోక్ష విమర్శలు చేశారు. -
8న ‘కృష్ణా’లో జగనన్న విద్యాకానుక ప్రారంభం
సాక్షి, విజయవాడ: జగనన్న విద్యాకానుక పథకాన్ని ఈ నెల 8న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా పునాదిపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రారంభిస్తారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘జగనన్న విద్యా కానుక ద్వారా 40 లక్షల మందికి పైగా విద్యార్ధులకి లబ్ది చేకూరుతుంది. జగనన్న విద్యాకానుక పథకానికి సుమారు 650 కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నాం. విద్యార్ధులకు ఇచ్చే ఈ కిట్‌లో యూనిఫారం, పుస్తకాలు, నోట్ బుక్స్, స్కూలు బ్యాగ్ ఇలా వివిధ రకాల వస్తువులని అందిస్తున్నాము. రాష్ట్రంలో విద్యాశాఖకి సీఎం వైఎస్ జగన్ అత్యంత ప్రాధాన్యతనిచ్చి జగనన్న గోరుముద్ద, అమ్మఒడి, నాడు-నేడు ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. విద్యాశాఖలో సంక్షేమ పథకాల ద్వారా డ్రాప్ అవుట్స్‌ని తగ్గించడం, ప్రాథమిక స్ధాయి నుంచే అత్యుత్తమ విద్యని అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. విద్యా శాఖలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో 2.5 లక్షల మందికి పైగా విద్యార్ధులు ప్రైవేట్ నుంచి ప్రభుత్వ స్కూళ్లల్లో చేరారు. 90 శాతం ఎన్రోల్మెంట్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామ’ని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. (100 కోట్లకు అధిపతి ఎలా అయ్యాడు...?) విద్యార్థులకు వరం: డిప్యూటీ సీఎం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు వరం.. జగనన్న విద్యా కానుక అని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి అన్నారు. గిరిజన ప్రాంతాల్లో విద్యార్థులకు ఎన్నడూ ఇలాంటి కిట్లు ఇవ్వలేదని, 4 లక్షలకు పైగా గిరిజన విద్యార్థులకు విద్యా కానుక అందిస్తున్నామని చెప్పారు. ‘గిరిజన పిల్లలు కలలో కూడా ఊహించని పథకం ఇది. కార్పొరేట్ స్కూళ్ల కంటే ప్రభుత్వ పాఠశాలలకు డిమాండ్ పెరిగేలా సీఎం జగన్ చేశారు. ప్రతి పేద విద్యార్థికి రూ.1600 విద్యాకానుక ఇస్తున్నాం. గిరిజనులకు ఎన్నడూ లేని సదుపాయాలు, మధ్యాహ్న భోజనం, అమ్మ ఒడి ఇచ్చిన చరిత్ర సీఎం వైఎస్ జగన్‌కే సొంతమ’ని అన్నారు. -
మరో భారీ పథకానికి సీఎం జగన్ శ్రీకారం
సాక్షి, అమరావతి: ప్రజా సంకల్ప పాదయాత్ర సందర్భంగా రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో భారీ పథకానికి శ్రీకారం చుట్టారు. తన పాదయాత్రలో బోరు బావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతుల కష్టాలను స్వయంగా చూసిన వైఎస్ జగన్ వారికి అండగా నిలుస్తానని ఆనాడు హామీ ఇచ్చారు. సాగునీటి కోసం వేల అడుగుల లోతుతో బోరుబావులను తవ్వించుకునేందుకు రైతులు పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి రావడం, అందుకోసం అప్పులపాలవుతున్న వైనాన్ని గమనించిన వైఎస్ జగన్ రైతులు పడుతున్న అవస్థలను పూర్తిగా తొలగించేందుకు ఇచ్చిన హామీ కార్యరూపం దాలుస్తోంది. ఆనాడు పార్టీ మేనిఫేస్టోలో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన నవరత్నాల్లో రైతులకు ఉచిత బోర్వెల్ పై ఇచ్చిన హామీ మేరకు ఉచిత బోరుబావుల తవ్వకం కోసం ''వైఎస్సాఆర్ జలకళ'' పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ మేరకు ఈనెల 28న ఈ పథకాన్ని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. (చదవండి: మద్దతు ధర ఇవ్వాల్సిందే) ఈ పథకం కోసం రైతులు ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.. రైతులు ఈ పథకం కోసం తమ పరిధిలోని గ్రామ వాలంటీర్ల ద్వారా గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. అలాగే ఆన్‌లైన్‌లోనూ దీనికోసం దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు. రైతులు చేసుకున్న దరఖాస్తులు గ్రామ సచివాలయం స్థాయిలో వీఆర్వో పరిశీలిస్తారు. అక్కడి నుంచి డ్వామా అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సదరు దరఖాస్తులను భూగర్భ జలాల సర్వే కోసం ముందుగా జియోలజిస్ట్కు పంపుతారు. సాంకేతికంగా దానిని జియోలజీ విభాగం పరిశీలించి అనుమతి ఇవ్వగానే డ్వామా అసిస్టెంట్ పిడి సదరు దరఖాస్తుకు పరిపాలనా అనుమతి ఇస్తారు. సదరు అనుమతి అనంతరం కాంట్రాక్టర్ డ్రిల్లింగ్ సైట్ లో బోరుబావులను తవ్వుతారు. బోరుబావుల సక్సెస్ శాతంను బట్టి కాంట్రాక్టర్‌కు బిల్లుల చెల్లింపులు జరుపుతారు. (చదవండి: ఆ ఘటనలు పునరావృతం కాకూడదు: సీఎం జగన్) పారదర్శకత కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్.. ‘వైఎస్సాఆర్ జలకళ పథకం’ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేసింది. ఆ సాఫ్ట్వేర్ ద్వారా రైతులు దరఖాస్తు చేసుకున్న తరువాత నుంచి దానికి అనుమతులు ఇవ్వడం, బోర్ బావి తవ్వకం, కాంట్రాక్టర్‌కు బిల్లు చెల్లించడం వరకు అత్యంత పారదర్శకతతో, నిర్ణీత సమయంలోనే ప్రక్రియను పూర్తి చేస్తారు. ప్రతి దశలోనూ దరఖాస్తు చేసుకున్న రైతుకు తన దరఖాస్తుకు సంబంధించిన వివరాలు ఎస్ఎస్ఎంల ద్వారా పంపిస్తారు. అలాగే ఆన్లైన్ ద్వారా కూడా తన దరఖాస్తు ఏ దశలో వుందో రైతు తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. ఏ రోజు రైతు పొలంలో బోర్ డ్రిల్లింగ్ చేస్తారో అది కూడా అటు రైతు ఫోన్‌కు ఎస్ఎంఎస్ ద్వారా, ఇటు వాలంటీర్ల ద్వారా కూడా సమాచారం అందిస్తారు. ఒకవేళ మొదటిసారి బోర్ డ్రిల్లింగ్ లో నీరు పడక విఫలం అయితే, మరోసారి బోర్ కోసం నిపుణుడైన జియోలజిస్ట్ నిర్ధేశించిన ప్రాంతంలో డ్రిల్లింగ్ చేసేందుకు అవకాశం కల్పించారు. రైతుల కోసం మరో అడుగు ముందుకు: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంతో పాటు, ఈ ప్రభుత్వం రైతు పక్షపాతి అన్న విషయాన్ని ఆచరణలో చూపుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నదాతల కోసం వైఎస్సాఆర్ జలకళ పథకాన్ని ప్రారంభిస్తున్నారని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం మొత్తం రూ.2,340 కోట్ల రూపాయలను కేటాయించిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల ఉచిత బోరు బావులను తవ్వడం ద్వారా దాదాపు 3 లక్షల మంది రైతులకు మేలు చేసే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు. ఈ పథకం కింద 5 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందుతుందని వెల్లడించారు. రాష్ట్రంలోని కమాండ్, నాన్ కమాండ్ ఏరియాల్లో ఎక్కడైతే భూగర్భ జలాలు వినియోగానికి అనువుగా వుంటాయో ఆ ప్రాంతాల్లో ‘వైఎస్సాఆర్ జలకళ’ కార్యక్రమాన్ని అమలు చేయనున్నామని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో వున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని, ఎక్కడైతే భూగర్భ జలాలు అందుబాటులో వుంటాయో అక్కడే బోరుబావులు తవ్వేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. పొలాల్లో హైడ్రో జియోలాజికల్, జియో గ్రాఫికల్ సర్వే ద్వారా శాస్త్రీయంగా ఎక్కడ బోరుబావులను తవ్వాలో నిపుణులు గుర్తించిన తరువాతే వాటికి అనుమతి ఇస్తున్నామని తెలిపారు. అలాగే సంబంధిత జియోలజిస్ట్ నిర్ధేశించిన లోతులో మాత్రమే బోరు బావుల తవ్వకం జరుగుతుందని అన్నారు. ఈ పథకం కింద తవ్వే ప్రతి బోరుబావికి జియో ట్యాగింగ్ చేస్తామని, అదే క్రమంలో భూగర్భజలాలు ఎప్పటికప్పుడు రీచార్జ్ అయ్యేలా వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలను కూడా కొనసాగిస్తామని తెలిపారు. పర్యావరణానికి నష్టం జరగకుండా, భూగర్భజలాలు అడిగంటి పోకుండా శాస్త్రీయ పద్దతుల్లో బోరుబావుల తవ్వకం జరుగుతుందని, దీనివల్ల రైతుకు కూడా బోర్లు వేసిన కొద్దిరోజులకే బోర్లు అడిగంటి పోవడం, తరువాత మరోసారి బోర్లు వేసుకునేందుకు వ్యయం చేయాల్సిన అవసరం వుందని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. -
‘నేతన్నకు చేయూత’తో కార్మికులకు లబ్ధి
సాక్షి, హైదరాబాద్: ‘నేతన్నకు చేయూత’పథకం నిబంధనలను సడలించడం ద్వారా నేత కార్మికులకు రూ.110 కోట్ల నిధులు అందుబాటులోకి వచ్చాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు వెల్లడించారు. కార్మికులకు భారీగా లబ్ధి చేకూరుతుండటంతో ఈ తరహా పథకాలను ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. చేనేత, పవర్లూమ్ కార్మికుల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం హైదరాబాద్ హస్తకళల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. నేతన్నకు చేయూత పథకంలో మూడేళ్ల లాక్ఇన్ పీరియడ్‌ను తగ్గించడంతో గడువుకు ముందే పొదుపు డబ్బులను తీసుకోవడం సాధ్యమైందన్నారు. ఇందులో చేనేత కార్మికులకు రూ.96.43 కోట్లు, పవర్లూమ్ కార్మికులకు రూ.13 కోట్ల చొప్పున మొత్తం 25 వేల మందికి లబ్ధి జరిగిందన్నారు. కష్టకాలంలో ప్రభుత్వం తమను అర్థం చేసుకుందని కార్మికుల నుంచి సందేశాలు అందుతున్నాయని, ఈ నేపథ్యంలో ప్రస్తుత పథకం గడువు ముగియడంతో ఇలాంటి పథకాలను మరోమారు ప్రవేశ పెట్టేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. పండుగకు ముందే బతుకమ్మ చీరలు బతుకమ్మ చీరల ఉత్పత్తి దాదాపు పూర్తి కావొచ్చిందని, వాటి పంపిణీపై దృష్టి సారించినట్లు కేటీఆర్ వెల్లడించారు. పండుగకు కనీసం వారం రోజుల ముందు నుంచే చీరల పంపిణీ ప్రారంభించి, అక్టోబర్ 2వ వారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగా చీరల పంపిణీ జరిగేలా కలెక్టర్లను ఆదేశిస్తామన్నారు. చేనేత వస్త్రాల వాడకం పట్ల అవగాహన, ఆసక్తి పెరిగిన నేపథ్యంలో టెస్కో వస్త్రాలకు మరింత బ్రాండింగ్ కల్పించే ప్రయత్నాలను ప్రారంభించాలని సూచించారు. హైదరాబాద్‌లో అన్ని వైపులా టెస్కో షోరూమ్‌ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కేటీఆర్ సూచించారు. హ్యాండీ క్రాఫ్ట్ షోరూమ్ సందర్శన.. సమీక్ష సమావేశం ముగిసిన తర్వాత మంత్రి కేటీఆర్ ముషీరాబాద్‌లోని గోల్కొండ షోరూమ్‌ను సందర్శించారు. షోరూమ్‌లోని చేనేత వస్త్రాలు, నిర్మల్ పెయింటింగ్స్, హ్యాండీ క్రాఫ్ట్ ఉత్పత్తులను పరిశీలించారు. షోరూమ్ కార్యకలాపాలు, ప్రజల స్పందన తదితరాలను తెలుసుకున్నారు. షోరూమ్ పరిసరాల్లో ఉన్న కామన్ ఫెసిలిటీ సెంటర్‌ను సందర్శించి కళాకారుల యోగ క్షేమాలను మంత్రి తెలుసుకున్నారు. -
‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ’ వాయిదా
సాక్షి, విజయవాడ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతికి సంతాప సూచకంగా సెప్టెంబర్ 1 న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతులమీదుగా ప్రారంభించాల్సిన వైఎస్సార్ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. సెప్టెంబర్ 7న ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్, ఎక్స్ అఫీషియో కార్యదర్శి తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. (చదవండి : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత) గర్భవతులు, బాలింతలు, చిన్నపిల్లల్లో పోషకాహార లోపం వల్ల కలిగే రక్తహీనత, ఎదుగుదల లోపం, మాతాశిశు మరణాలు తదితర ఆరోగ్య సమస్యలను నివారించే లక్ష్యంతో రూ. 1,863.11 కోట్ల వ్యయంతో వైఎస్సార్ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ని 55,607 అంగన్ వాడీ కేంద్రాలలో నమోదైన 30,16,000 మందికి లబ్ధి చేకూరనుంది. అయితే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి కారణంగా కేంద్ర ప్రభుత్వం సంతాప దినాలు ప్రకటించినందున ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 7 వ తేదీకి వాయిదా వేయడం జరిగిందని కమీషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. -
1న ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ’ ప్రారంభం
సాక్షి, అమరావతి: సెప్టెంబర్ 1న ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాన్ని’ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారని మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనురాధ తెలిపారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ రూ.1,863 కోట్లతో 30లక్షల మందికి పౌష్టికాహారం అందిస్తామని వెల్లడించారు. సెప్టెంబర్ నుంచి రేషన్‌ను ఇంటికే పంపిణీ చేస్తామని తెలిపారు. 50 శాతం మంది మహిళల్లో రక్త హీనత ఉందని.. గర్భిణీలు, మహిళలు, పిల్లల్లో రక్తహీనత నివారించేందుకే ఈ పథకాన్ని తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు ప్రీ ప్రైమరీ విద్యను ప్రవేశపెట్టబోతున్నామని.. 55 వేల అంగన్వాడీ కేంద్రాల టీచర్లకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. అంగన్వాడీ పిల్లలకు ప్రైవేట్ స్కూళ్ల తరహాలో విద్య అందిస్తామని అనురాధ పేర్కొన్నారు. (చదవండి: అమరావతి రైతులు: రూ. 158 కోట్లు విడుదల) -
చిన్న పరిశ్రమలకు రుణ సౌలభ్యం
న్యూఢిల్లీ: అత్యవసర రుణ హామీ పథకం (ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్– ఈసీఎల్జీఎస్) పరిధిలోకి వచ్చే లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) రుణాల మంజూరీని నిరాకరించవద్దని ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ బ్యాంకింగ్‌కు శుక్రవారం స్పష్టంచేశారు. ఇలాంటి పరిస్థితి ఏ సంస్థకైనా ఎదురైతే ఆ విషయాన్ని తమ దృష్టికి తీసుకురావాలని కూడా ఆమె కోరారు. వివరాల్లోకి వెళితే... . మేలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన రూ.20.97 లక్షల కోట్ల ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ (స్వావలంబన భారత్) ప్యాకేజ్‌లో ఈసీఎల్జీఎస్ ఒక భాగంగా ఉంది. కోవిడ్–19 నేపథ్యంలో ఏర్పడిన మందగమన పరిస్థితుల్లో చిక్కుకున్న లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఈ స్కీమ్ కింద మొత్తం రూ.3 లక్షల కోట్లను అందించాలన్నది ప్యాకేజ్ ఉద్దేశం. జూలై 23 వరకూ ఈ పథకం కింద ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు రూ.1,30,492 కోట్లను మంజూరు చేశాయి. ఇందులో 82,065 కోట్లను పంపిణీ కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇండస్ట్రీ చాంబర్– ఫిక్కీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఆర్థికమంత్రి ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘అత్యవసర రుణ సౌలభ్యం కిందకు వచ్చే ఎంఎస్ఎంఈలకు రుణాల మంజూరీని బ్యాంకులు తిరస్కరించలేవు. ఒకవేళ అలా జరిగితే ఫిర్యాదు చేయండి. నేను ఆ విషయాన్ని పరిశీలిస్తాను’’ అని నిర్మలా సీతారామన్ ఈ సమావేశంలో పేర్కొన్నారు. ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల జీఎస్టీ రేటు తగ్గింపుపై జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటుందని ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి వెల్లడించారు. పరస్పర ప్రయోజనాలే లక్ష్యంగా ఇతర దేశాలతో వ్యాపార సంబంధాలు ఉంటాయని ఆర్థికమంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేసినట్లు ఫిక్కీ వెల్లడించింది. మారటోరియం పెంపు అవకాశం రుణాల పునఃచెల్లింపులకు సంబంధించి మార్చి నుంచి ఆగస్టు వరకూ అమలులో ఉన్న బ్యాంకింగ్ రుణ మారటోరియం కాలపరిమితిని మరింత పెంచే అంశంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)తో చర్చిస్తున్నట్లు ఆర్థికమంత్రి ఈ సందర్భంగా తెలిపారు. దీనితోపాటు ఆతిథ్య పరిశ్రమకు రుణ పనర్వ్యవస్థీకరణ అంశంపైనా ఆర్బీఐతో మాట్లాడుతున్నట్లు వెల్లడించారు. ‘‘ఆతిథ్య రంగం అవసరాలను నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. మారటోరియం పెంపుకానీయండి లేదా రుణ పునర్వ్యవస్థీకరణ కానీయండి. ఆయా అంశాలపై ఆర్బీఐతో కేంద్రం చర్చిస్తోంది’’ అని ఆర్థికమంత్రి పేర్కొన్నారు. ‘‘ప్రస్తుత ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనడానికి ప్రభుత్వం తగిన అన్ని చర్యలూ తీసుకుంటుంది. చర్యలు తీసుకునే ముందు సంబంధిత పారిశ్రామిక రంగాలతో సంప్రతింపులు జరుపుతుంది’’ అని ఆర్థికమంత్రి పేర్కొన్నట్లు పిక్కీ ఒక ట్వీట్లో వెల్లడించింది. -
హైటెక్ వ్యవ‘సాయం’!
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో ఆవిష్కరణలకు, టెక్నాలజీని ప్రవేశపెట్టేవారికి, స్టార్టప్‌లకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ముందుకు వచ్చే వారికి ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర సర్కారు రూ.లక్ష కోట్లతో అగ్రి ఇన్ఫ్రా ఫండ్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. మౌలిక సదుపాయాలు, రవాణా వసతుల కోసం ఏర్పాటయ్యే రైతు గ్రూపులకు కూడా ఈ నిధి కింద రుణ సాయం అందుతుంది. కరోనా వైరస్ తర్వాత కేంద్రం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీకి తాజాగా ప్రకటించిన రూ.లక్ష కోట్ల నిధి అదనం. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వివరాలను కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ థోమర్ మీడియాకు తెలిపారు. చరిత్రాత్మకమైన ఈ నిర్ణయం వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు. అగ్రి ఇన్ఫ్రా ఫండ్ పదేళ్ల పాటు 2029 వరకు అమల్లో ఉంటుంది. సాగు అనంతరం పంట ఉత్పత్తుల విక్రయం వరకు వసతుల నిర్వహణ (శీతల గోదాములు, గోదాములు, గ్రేడింగ్, ప్యాకేజింగ్ యూనిట్లు, ఈ మార్కెటింగ్, ఈ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లు తదితర), సామాజిక సాగు తదితరాలకు దీర్ఘకాల రుణ సాయం పొందొచ్చు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా ఈ రుణాలను మంజూరు చేస్తారు. రూ.లక్ష కోట్ల నిధి ఏర్పాటులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2020–21) కేంద్రం రూ.10,000 కోట్లను సమకూరుస్తుంది. తదుపరి మూడు ఆర్థిక సంవత్సరాల్లో రూ.30,000 కోట్ల చొప్పున ఏర్పాటు చేస్తుంది. గరిష్టంగా రూ.2 కోట్ల రుణానికి 3 శాతం వడ్డీ రాయితీని ఇవ్వనున్నట్టు మంత్రి తోమర్ చెప్పారు. ఈపీఎఫ్ చెల్లింపుల పథకం ఆగస్టు వరకు చిన్న సంస్థల తరఫున ఈపీఎఫ్ చెల్లింపుల పథకాన్ని ఆగస్టు వరకు కొనసాగిస్తూ కేంద్ర కేబినెట్ మరో నిర్ణయం తీసుకుంది. 100 వరకు ఉద్యోగులు కలిగిన సంస్థల్లో 90 శాతం మంది రూ.15,000లోపు వేతనం కలిగి ఉంటే.. ఉద్యోగుల చందాతోపాటు, వారి తరఫున ఆయా సంస్థల చందా (చెరో 12 శాతం)ను కేంద్రమే చెల్లించనుంది. లాక్డౌన్ కారణంగా చిన్న, మధ్య స్థాయి సంస్థలు చాలా వరకు మూతపడడంతో.. వాటికి వెసులుబాటునిస్తూ ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ పథకం కింద ఈ భారాన్ని తాను భరించనున్నట్టు కేంద్రం లోగడ ప్రకటించింది. తొలుత మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన చందాలను చెల్లించాలని నిర్ణయించింది. జూన్, జూలై, ఆగస్టు నెలలకూ ఈపీఎఫ్ చందాలను తానే చెల్లించాలని కేబినెట్ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగులు మరింత వేతనాన్ని ఇంటికి తీసుకెళ్లొచ్చని, సంస్థలపైనా భారం తగ్గుతుందని కేంద్ర మంత్రి జవదేకర్ పేర్కొన్నారు. మూడు బీమా సంస్థలకు రూ.12,450 కోట్లు ప్రభుత్వరంగంలోని మూడు సాధారణ బీమా సంస్థ లు.. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీలకు రూ.12,450 కోట్ల మూలధనసాయాన్ని అందించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇందులో 2019–20లో అందించిన రూ.2,500 కోట్లు కలసి ఉంటుందని మంత్రి జవదేకర్ తెలిపారు. ఈ మూడు కంపెనీలను విలీనం చేసి, స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలన్నది కేంద్రం ప్రణాళికగా ఉంది. -
'50వేల కోట్లతో వలస కార్మికులకు ఉపాధి'
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విస్తృతి నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కారణంగా ఉపాధి లేక సొంత రాష్ట్రాలకు తిరిగి వచ్చిన కూలీలకు కేంద్రప్రభుత్వం ఓ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. 'గరీబ్ కళ్యాణ్ రోజ్‌గార్ యోజన' పేరుతో శనివారం రోజున బిహార్‌లోని ఖగారియా జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 50వేల కోట్ల రూపాయలతో వలస కార్మికులకు ఉపాధి కల్పించనున్నారు. దేశ వ్యాప్తంగా మొత్తం వలస కూలీలు ఎక్కువగా తరలి వచ్చిన 116 జిల్లాల్లో మొదట ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. ఈ పథకం కింద బీహార్‌తో పాటు ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలు ఎంపికైనట్టు తెలిపారు. వచ్చే 125 రోజుల్లో సుమారు 25 పథకాలను గరీబ్ కళ్యాన్ రోజ్‌గార్ అభియాన్ కిందకు తీసుకొచ్చి వలస కార్మికులకు సొంతూళ్లలోనే ఉపాధి చూపిస్తామన్నారు. 25 భిన్న రకాలైన పనులు చేసే వారికి ఈ పథకం కింద ఉపాధి లభించనుంది. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. చదవండి: దేశంలోకి ఎవరూ ప్రవేశించలేదు: ప్రధాని మోదీ -
మహిళల రక్షణ కోసం ‘స్త్రీ’
గోల్కొండ: మహిళా సాధికారత, భద్రత కోసం ఓ వేదిక కల్పించడం ఎంతో గర్వంగా ఉందని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. హైదరాబాద్ సిటీ పోలీస్, హైదరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తంగా రూపొందించిన స్త్రీ పథకాన్ని శనివారం హైదరాబాద్‌లోని తారామతి బారాదరి ఆడిటోరియంలో ప్రారంభించారు. మహిళలకు సమున్నత గౌరవం, సమానత్వం, సాధికారత కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మాట్లాడుతూ.. సమాజంలో వివిధ వర్గాల మహిళలను ఓ వేదికపైకి తేవడం స్త్రీ పథకం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. మహిళలు, పోలీసులను ఒకే వేదికపైకి తెచ్చి మహిళలు, బాలికల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు మహిళా హక్కులు, చట్టంలో వారికున్న హక్కులను ఈ వేదిక ద్వారా తెలియజేస్తామని పేర్కొన్నారు. మహిళల పట్ల జరుగుతున్న హింసను నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరిగి మహిళల సలహాలు తీసుకుంటామని వివరించారు. స్థానికంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, రక్షణ, సమానత్వం, గౌరవం తదితర విషయాలపై ఈ వేదికపై చర్చ జరుగుతుందని తెలి పారు. మహిళా సా«ధికారత, నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తామని పేర్కొన్నారు. ఈ వేదిక ద్వారా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నెట్వర్క్ తయారు చేస్తామని, పోలీస్ స్టేషన్ పరిధిలో ‘స్త్రీ’గ్రూప్ ఏర్పాటు చేసి సబల మహిళా వలంటీర్లను ఏర్పాటు చేసి సబల శక్తి వలంటీర్ల గ్రూపులను తయారు చేస్తామని చెప్పారు. మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో హైదరాబాద్ అదనపు కమిషనర్లు షికా గోయెల్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వీధి వ్యాపారులకు రూ. 10 వేలు
న్యూఢిల్లీ: కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న వీధి వ్యాపారుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సూక్ష్మ రుణ పథకాన్ని సోమవారం ఆవిష్కరించింది. దీని ద్వారా వారికి రూ. 10 వేల వరకు రుణం అందించనున్నారు. ఈ ‘ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి’ పథకం సుమారు 50 లక్షల మందికి లబ్ధి చేకూర్చనుందని కేంద్ర పట్టణ గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సంవత్సరం మార్చి 22 వరకు వీధి వ్యాపారాల్లో ఉన్నవారు ఈ పథకానికి అర్హులని పేర్కొంది. ‘వారు రూ. 10 వేల వరకు రుణం తీసుకోవచ్చు. ఆ రుణాన్ని సులభ నెలవారీ వాయిదాల్లో సంవత్సరంలోపు చెల్లించాలి. సమయానికి కానీ, ముందుగా కానీ చెల్లించినవారికి వార్షిక వడ్డీలో 7% వరకు రాయితీ లభిస్తుంది. ఆ రాయితీ మొత్తం ఆరు నెలలకు ఒకసారి వారి బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. ఈ పథకం మార్చి 2022 వరకు అమల్లో ఉంటుంది. సమయానికి రుణ వాయిదాలు చెల్లించినవారికి రుణ పరిమితిని పెంచే అవకాశం కూడా ఉంది’ అని వివరించింది. ఈ పథకం అమలులో స్థానిక సంస్థలు కీలక పాత్ర పోషించాలని, వీధి వ్యాపారులు, బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థల మధ్య అనుసంధానకర్తలుగా వ్యవహరించాలని కోరింది. పథకం అమలు కోసం మొబైల్ యాప్‌ను, వెబ్ పోర్టల్‌ను రూపొందిస్తున్నామని వెల్లడించింది. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు రైతులు, కూలీలు, శ్రామికుల జీవితాల్లో సానుకూల మార్పులను తీసుకువస్తాయని మోదీ పేర్కొన్నారు. -
స్వయం సమృద్ధి.. స్వావలంబన
సాక్షి, న్యూఢిల్లీ: స్వయం సమృద్ధి, స్వావలంబన సాధించాలనే పెద్ద పాఠాన్ని కరోనా మహమ్మారి మనకు నేర్పించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. సమస్యల పరిష్కారం కోసం విదేశాల వైపు చూడాల్సిన అవసరం లేదని తెలియజేసిందన్నారు. ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో గ్రామీణ భారతం చూపిన పట్టుదల, తెగువ ప్రశంసనీయమన్నారు. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం దేశవ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీల ప్రతినిధులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. అన్ని గ్రామాలు, జిల్లాలు, రాష్ట్రాలు తమ అవసరాలను తామే సమకూర్చుకునే దిశగా స్వయం సమృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ‘రెండు గజాల దూరం’మంత్రం ద్వారా ప్రభుత్వం చెప్పిన భౌతిక దూరం నిబంధనను ప్రచారం చేయడం ముదావహమన్నారు. కరోనా కారణంగా చాలా మార్పులు వచ్చాయని, ఇలాంటి కార్యక్రమాలు గతంలో బహిరంగంగా, వ్యక్తిగతంగా కలుస్తూ జరిగేవని, ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీటిని నిర్వహిస్తున్నామని వివరించారు. సర్పంచ్‌లు, గ్రామపంచాయతీ సభ్యులు కరోనాను కట్టడి చేయడంలో తాము చేపట్టిన చర్యలను ప్రధానికి వివరించారు. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ‘ప్రజలను అనుమానించడం, గౌరవించడం (సస్పెక్ట్.. రెస్పెక్ట్)’విధానాన్ని అవలంబించాలని ప్రధానికి జమ్మూకశ్మీర్‌కు చెందిన ఒక సర్పంచ్ సూచించారు. కరోనా కట్టడికి ఏ చర్యలు తీసుకున్నారని పుణెకు చెందిన యువ మహిళా సర్పంచ్ ప్రియాంకను ప్రధాని ప్రశ్నించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టామని, గ్రామంలోనే తయారు చేసిన మాస్క్‌లను ప్రజలకు పంపిణీ చేశామని, మహిళలకు శానిటరీ న్యాప్కిన్స్ను అందించామని ఆమె వివరించగా, ప్రధాని ఆమెను ప్రశంసించారు. పంచాయతీరాజ్ దివస్ సందర్భంగా ఏకీకృత ‘ఈ– గ్రామ స్వరాజ్’ పోర్టల్‌ను, మొబైల్ అప్లికేషన్‌ను, స్వమిత్వ పథకాన్ని ప్రధాని ప్రారంభించారు. ఈ– ‘గ్రామ స్వరాజ్’పోర్టల్ గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించి, అమలు చేసేందుకు సహాయపడుతుంది. -
జులై 8న 27 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు
సాక్షి, తాడేపల్లి: కరోనా కష్ట సమయంలో కూడా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలబెట్టుకున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఆయన ‘వైఎస్సార్ సున్నా వడ్డీ’ పథకాన్ని తన క్యాంపు కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. ఆన్లైన్ ద్వారా బటన్ నొక్కి నగదు బదిలీ చేశారు. ఈ బటన్ నొక్కగానే సెర్ప్, మెప్మాల పరిధిలోని గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ఉండే 8,78,874 పొదుపు సంఘాల ఖాతాల్లో సీఎఫ్ఎంఎస్ ద్వారా ఒకే విడతన డబ్బులు జమ అయ్యాయి. 90,37,254 మహిళలు సభ్యులుగా ఉండే ఆయా సంఘాల ఖాతాల్లో రూ.1,400 కోట్లు ఒకే విడత జమ అయ్యాయి. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల నుంచి డ్వాక్రా మహిళలతో సీఎం మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. జులై 8 వైఎస్సార్ జయంతి రోజున ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. 27 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని వెల్లడించారు ఇళ్ల పట్టాలతో పాటు ఉచితంగా ఇల్లు కూడా కట్టించి ఇస్తామన్నారు. నామినేటెడ్ పనులు, పదవుల్లో 50% అక్కచెల్లెమ్మలకు ఇవ్వాలని గొప్ప చట్టం తెచ్చామని పేర్కొన్నారు. ‘‘కఠినంగా శిక్ష పడేలా దిశ చట్టాన్ని తీసుకొచ్చాం.13 దిశ పోలీస్స్టేషన్లు, జిల్లాల్లో ప్రత్యేక కోర్టులు తీసుకొచ్చాం. 13 దిశ పోలీస్స్టేషన్లు, జిల్లాల్లో ప్రత్యేక కోర్టులు తీసుకొచ్చాం. త్వరలో రాష్ట్రపతి ఆమోదం తెలుపుతారని ఆశిస్తున్నాం.ప్రతి గ్రామ సచివాలయంలో ఒక మహిళా పోలీస్‌ను నియమించాం..11వేలకు పైగా మహిళా పోలీసులను నియమించి ఉద్యోగాలు ఇచ్చాం. గ్రామ సచివాలయాల్లో 8 మంది మహిళా మిత్రలను ఏర్పాటు చేశామని’’ సీఎం పేర్కొన్నారు. వసతి దీవెన కింద 12 లక్షల మందికి మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకున్నామని.. గత ప్రభుత్వం బకాయి పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడమే కాకుండా.. మార్చి 31 వరకు ఉన్న బకాయిలను పూర్తిగా చెల్లిస్తామని సీఎం తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి మూడు నెలల సంబంధించి.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నేరుగా తల్లుల అకౌంట్ల్లో జమ చేస్తామని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు.(భవిష్యత్తులో కూడా మేలు జరగాలి: సీఎం జగన్) 2016 నుంచి సున్నా వడ్డీ పథకం నిలిచిపోయిందని.. కరోనా వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా సున్నా వడ్డీ పథకం ప్రారంభించామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ప్రతి గ్రూపునకు రూ.20 వేల నుంచి రూ.40వేల వరకు మేలు జరుగుతుందన్నారు. ‘‘ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు..రూ.3లక్షల పరిమితి వరకు ఆరు జిల్లాల్లో 7% వడ్డీకి రుణాలు ఇస్తున్నారు. మిగిలిన 7 జిల్లాల్లో డ్వాక్రా మహిళలకు సుమారు 13 శాతం వడ్డీ భారం వేస్తున్నారు. సున్నా వడ్డీ అమలుకు 7-13 శాతం వరకు వడ్డీని ప్రభుత్వమే చెల్లించాలి. ప్రతి పథకంలోనూ అక్కచెల్లెమ్మలకే పెద్దపీట వేశామని’’ సీఎం పేర్కొన్నారు. తల్లుల చేతిలో అక్కచెల్లెమ్మల చేతిలో డబ్బులు పెడితే.. పూర్తిగా సద్వినియోగం అవుతుందని తన భావన అని సీఎం తెలిపారు. 82 లక్షల మంది పిల్లలకు మేలు జరిగేలా అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. పిల్లల చదువులు బాగుండాలనే ఉద్దేశంతో నాడు-నేడు కార్యక్రమం చేపట్టామని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
వైఎస్సార్ సున్నా వడ్డీ పథకానికి శ్రీకారం
-
నేడు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ప్రారంభం
సాక్షి, అమరావతి: పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాట నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని ఏర్పాట్లు చేశారు. ఒక పక్క కరోనా వైరస్‌తో రాష్ట్ర ఆదాయం పూర్తిగా నిలిచిపోయింది. మరో పక్క కేంద్రం నుంచి వచ్చే నిధులూ తగ్గిపోయాయి. ఇంకో పక్క పేదలను ఆదుకోవడానికి ఉచిత బియ్యం, కందిపప్పు పంపిణీతో పాటు పేద కుటుంబాలకు 1000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా పొదుపు సంఘాల అక్క చెల్లమ్మలకు ఇచ్చిన మాట నెరవేర్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. ►ఇందులో భాగంగా శుక్రవారం వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. క్యాంపు కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో పొదుపు సంఘాల అక్క చెల్లమ్మల ఖాతాలకు సున్నా వడ్డీ డబ్బులను జమ చేసే బటన్‌ను నొక్కుతారు. ►ఈ బటన్ నొక్కగానే సెర్ప్, మెప్మాల పరిధిలోని గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ఉండే 8,78,874 పొదుపు సంఘాల ఖాతాల్లో సీఎఫ్ఎంఎస్ ద్వారా ఒకే విడతన డబ్బులు జమ అవుతాయని సెర్ప్ సీఈవో రాజాబాబు తెలిపారు. ►90,37,254 మహిళలు సభ్యులుగా ఉండే ఆయా సంఘాల ఖాతాల్లో రూ.1,400 కోట్లు ఒకే విడత జమ అవుతుంది. కాగా, ఇప్పటికే మీ రుణాలపై వడ్డీ భారం ప్రభుత్వానిదేనని పొదుపు సంఘాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేఖ రాసిన విషయం తెలిసిందే. -
రేపు ‘వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం’ ప్రారంభం
సాక్షి, తాడేపల్లి: ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఏమాత్రం వెనుకకు తగ్గకుండా ఏపీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. లాక్డౌన్ విపత్తు నుంచి మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రేపు (శుక్రవారం) వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డ్వాక్రా మహిళలతో సీఎం మాట్లాడనున్నారు. 8.78 లక్షల మహిళా స్వయం సహాయక సంఘాల్లో 93 లక్షల మంది ఆడ పడచులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే రెండు దశల్లో వారి రుణాల వడ్డీ కోసం ప్రభుత్వం 1400 కోట్లు విడుదల చేసింది. శుక్రవారం ఆన్లైన్ ద్వారా వడ్డీ మొత్తాన్ని ఆయా బ్యాంకుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. లాక్డౌన్ సమయంలో స్వయం సహాయక సంఘాలకు సీఎం వైఎస్ జగన్ అండగా నిలవడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. -
‘పన్ను’ పరిష్కారాలకు ‘వివాద్ సే విశ్వాస్’
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు సాయపడేందుకే వివాదాల పరిష్కార పథకం ‘వివాద్ సే విశ్వాస్’ను బడ్జెట్లో ప్రకటించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ‘‘ఈ పథకం పన్ను వివాదాల్ని పరిష్కరించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. పన్ను చెల్లింపుదారులు.. కేసుల పరిష్కారానికి ఎంతో సమయాన్ని, డబ్బు వెచ్చించాల్సి వస్తోంది. ఈ పథకం వాటిని ఆదా చేస్తుంది’’ అని తెలియజేస్తూ.. ‘డైరెక్ట్ ట్యాక్సెస్ వివాద్ సే విశ్వాస్, 2020’ బిల్లును సోమవారం పార్లమెంట్లో మంత్రి ప్రవేశపెట్టారు. ఎందుకు ఈ పథకం..? ప్రత్యక్ష పన్నులకు సంబంధించి కమిషనర్, అప్పీల్స్, ఆదాయపన్ను శాఖ.. ఆదాయపన్ను అప్పిలేట్ ట్రైబ్యునల్.. హైకోర్టు.. సుప్రీంకోర్టు వంటి పలు అప్పిలేట్ వేదికల వద్ద 4,83,000 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.9 లక్షల కోట్లు రావాల్సి ఉంది. వీటిలో అధిక భాగాన్ని ఈ ఏడాది మార్చి చివరికి పరిష్కరించి, పన్నుల ఆదాయం పెంచుకోవాలన్నది కేంద్ర ప్రభుత్వం లక్ష్యం. వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం కూడా ఈ లక్ష్యంలో భాగమే. ఈ పథకంలో కింద... వివాదంలో ఉన్న పన్ను మొత్తాన్ని చెల్లించినట్లయితే వారికి ఎలాంటి జరిమానాలూ ఉండవు. పైపెచ్చు క్షమాభిక్ష కల్పిస్తారు. తద్వారా భవిష్యత్తులో ఆ వివాదానికి సంబంధించి చట్టపరమైన విచారణలు లేకుండా రక్షణ పొందొచ్చు. ఎవరికి వర్తిస్తుంది.. ఆదాయపన్ను శాఖ జారీ చేసిన డిమాండ్ నోటీసులను వ్యతిరేకిస్తూ అప్పీల్‌కు వెళ్లిన వారు.. 2020 మార్చి 31 నాటికి బకాయిలను చెల్లిస్తే చాలు. దానిపై వడ్డీ, పెనాల్టీని ప్రభుత్వం రద్దు చేస్తుంది. గడువు నాటికి చెల్లించలేకపోతే, మార్చి తర్వాత జూన్ 30 వరకు మరో విడత గడువు లభిస్తుంది. కానీ, మార్చి 31లోపు చెల్లించాల్సిన దానితో పోలిస్తే ఆ తర్వాత 10 శాతం అదనంగా చెల్లించాలి. 2020 జనవరి 31 నాటికి పలు అప్పిలేట్ ఫోరమ్‌ల వద్ద నమోదై, అపరిష్కృతంగా ఉన్న కేసులు ఈ పథకం పరిధిలోకి వస్తాయి. పన్ను చెల్లింపులు రూ.5 కోట్లలోపు ఉన్న సోదా కేసులకే ఇది వర్తిస్తుంది. ఎంత మేర చెల్లించాలి..? సోదా కేసులు: ఆదాయ పన్ను, వడ్డీ, పెనాల్టీల రూపంలో చెల్లించాల్సిన మొత్తానికి మరో 25 శాతం కలిపి మొత్తం 125 శాతాన్ని మార్చి చివరి నాటికి చెల్లించడం ద్వారా వివాదాలను తొలగించుకోవచ్చు. మార్చిలోపు సాధ్యం కాకపోతే, తర్వాత జూన్ 31 నాటికి 135 శాతాన్ని చెల్లించాల్సి ఉంటుంది. సోదా జరగని కేసులు: పన్ను, పెనాల్టీ, వడ్డీ రేటుపై వివాదం ఉంటే... ఆ మొత్తాన్ని (100 శాతాన్ని) మార్చి చివరిలోపు చెల్లించడం ద్వారా వివాదాన్ని మాఫీ చేసుకోవచ్చు. ఈ గడువు దాటితే జూన్ చివరికి 110 శాతాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. ఒక వ్యక్తి ఆదాయపన్ను కింద రూ.1,00,000 చెల్లించగా.. ఆదాయపన్ను శాఖ మాత్రం చెల్లించాల్సిన పన్ను ఆదాయం రూ.1,50,000గా తేల్చి, దీనికి రూ.20,000 వడ్డీ కింద, రూ.1,00,000 పెనాల్టీ కింద చెల్లించాలని డిమాండ్ చేసి ఉంటే.. అప్పుడు వివాదంలో ఉన్న మొత్తం రూ.1,70,000 అవుతుంది. దీన్ని వ్యతిరేకిస్తూ పన్ను చెల్లింపుదారు అప్పీల్ కోసం దాఖలు చేసి ఉంటే.. ఈ కేసులో కేవలం రూ.50,000ను మార్చి చివరికి చెల్లించడం ద్వారా మాఫీ చేసుకోవచ్చు. మార్చి తర్వాత అయితే 10% అదనంగా రూ.55,000 చెల్లించాల్సి ఉంటుంది. ♦ ఇక కేవలం పెనాల్టీ, వడ్డీ రేటుపైనే వివాదం ఉన్నట్టయితే, చెల్లించాల్సిన మొత్తంలో మార్చి ఆఖరు నాటికి కనీసం 25% చెల్లిస్తే చాలు. ఆ తర్వాత జూన్‌లోపు అయితే చెల్లించాల్సిన మొత్తం 30 శాతం అవుతుంది. ఇవన్నీ కూడా పన్ను చెల్లింపుదారులు అప్పీలు దాఖలు చేసిన కేసులకే వర్తిస్తాయి. ఒకవేళ ఆదాయపన్ను శాఖే అప్పీల్‌కు వెళ్లి ఉంటే, చెల్లించాల్సిన మొత్తం ఇంత కంటే తక్కువగా ఉంటుంది. అందరికీ ఈ పథకం వర్తించదండోయ్.. ఈ ప్రతిపాదిత పథకం కొన్ని వివాదాలకు వర్తించదు. పన్ను చెల్లింపుదారుడికి వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ ఆరంభమై ఉన్నా...సోదాలు జరిగి, రూ.5 కోట్లకు పైగా విలువైన స్వాధీనాలు చోటు చేసుకున్నా... బయటకు వెల్లడించని విదేశీ ఆదాయం, విదేశీ ఆస్తులు కలిగి ఉన్న కేసులైనా... భారతీయ శిక్షాస్మృతి, మాదకద్రవ్యాల నియంత్రణ చట్టం కింద విచారణ ఎదుర్కొంటున్నా... అటువంటి వారు ఈ పథకం కింద వివాదాలు పరిష్కరించుకునే అవకాశం ఉండదు. -
మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..!
ముంబై: రాష్ట్రంలోని పేదలు ఆకలితో పస్తులుండకుండా చూడటమే లక్ష్యంగా పేదలకు పది రూపాయలకే భోజనం అందించే అపూర్వమైన పథకాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. 'శివ్ భోజన్' పేరిట మధ్యాహ్న భోజన పథకాన్ని ఆదివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆరంభించింది. ఈ పథకాన్ని మహారాష్ట్ర మంత్రి అస్లామ్ షేక్ రద్దీ ఎక్కువగా ఉండే నాయిర్ ఆసుపత్రి వద్ద ప్రారంభించారు. బండ్ర కలెక్టర్ కార్యాలయం సమీపంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య థాక్రే లాంఛనంగా ప్రారంభించారు. తొలుత ప్రయోగాత్మకంగా వీటిని ప్రారంభించారు. (ఠాక్రే కుటుంబం నుంచి మరో వారసుడు..) ఈ పథకాన్ని ప్రవేశపెడతామని శివసేన పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్నికల తరువాత కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి 'మహా అఘాడీ' ప్రభుత్వం ఏర్పాటు కాగా, మేనిఫెస్టోలోని అంశాలను ఒక్కొక్కటీ అమలు చేసే దిశగా థాక్రే కదులుతున్నారు. శివ్ భోజన్ ప్లేటులో రెండు చపాతిలు, ఒక ఆకుకూర, అన్నం, పప్పు ఉంటుందని చెప్పారు. ప్రతి రోజూ మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు పేదలకు అందుబాటులో ఉంటుందని వారు వివరించారు. ప్రతి క్యాంటీన్లో సుమారు 500 ప్లేట్ల శివ్ భోజన్ పథకాన్ని పేదలు వినియోగించుకుంటారని ఆశిస్తున్నామని అధికారులు తెలిపారు. తొలి రోజునే అనూహ్యమైన స్పందన లభించిందని, పేదలు బారులు తీరి ఖరీదు చేశారన్నారు. ఇంత తక్కువ ధరకు అందిస్తున్నందున ఈ పథకం పేదలకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ('88 ఏళ్ల తర్వాత గుర్రాలపై పోలీసుల గస్తీ') -
వినియోగదారులకు ఎస్బీఐ శుభవార్త
సాక్షి, ముంబై : దేశీయ ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. గృహ కొనుగోలుదారులకు భరోసా కల్పించడంతోపాటు రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చేందుకు ‘సప్నా ఆప్కా, భరోసా ఎస్బీఐ కా’ అనే పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించింది. దీని ప్రకారం ఎస్బీఐ బ్యాంకులో హోమ్ లోన్ తీసుకున్న వారికి గడువు లోగా ప్రాజెక్టు పూర్తికాకపోతే డబ్బు వాపస్ ఇస్తామంటోంది. ‘రెసిడెన్షియల్ బిల్డర్ ఫైనాన్స్ విత్ బయ్యర్ గ్యారంటీ (ఆర్‌బీబీజీ)’గా తీసుకొస్తున్న ఈ పథకాన్ని తొలుత ముంబై నగరంలో ప్రారంభించింది. ఈ మేరకు ఇప్పటికే సన్ టెక్ డెవలపర్స్ సంస్థతో ఎస్బీఐ ఇప్పటికే ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తమ ఈ పథకం వల్ల అటు గృహ కొనుగోలుదారులు, ఇటు బిల్డర్లకు అందరికీ ప్రయోజనకరంగా ఉంటుందని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ మీడియాకు వెల్లడించారు. ఇది దేశ రియల్ ఎస్టేట్ రంగంపై బలమైన, సానుకూల ప్రభావాన్ని చూపిస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. ముంబైలో ప్రారంభించిన ఈ పథకాన్ని క్రమంగా ఈ దేశవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. రేరా, జీఎస్టీ, నోట్ల రద్దు వంటి అంశాల నేపథ్యంలో గృహ కొనుగోలుదారులకు సమయానికి ప్రాజెక్టులను అందించటంతో పాటు, వారి డబ్బులు ఇరుక్కుపోకుండా ఈ కొత్త పథకం రక్షణ కల్పిస్తుందని రజనీష్ కుమార్ భరోసా ఇచ్చారు. ఎన్నో ఆశలతో సొంతింటి కల సాకారం కోసం బ్యాంకురుణాలు తీసుకొని మరీ సొమ్మును పలు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులుపెట్టి, అవి సమయానికి పూర్తికాక మధ్యలో నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్నవినియోగదారులకు పరిష్కారంగా ఈ పథకాన్ని తీసుకొచ్చినట్టు బ్యాంకు తెలిపింది. ఈ పథకం గరిష్టంగా రూ 2.5 కోట్ల విలువ ఉన్న గృహాలకు వర్తిస్తుంది. అలాగే ఈ పథకంలో చేరే బిల్డర్లు తమ ప్రాజెక్ట్ పూర్తిచేసేందుకు సుమారు రూ 50 కోట్ల నుంచి రూ 400 కోట్ల వరకు రుణాలను పొందవచ్చు. బిల్డర్ గడువులోగా వినియోగదారునికి ఇంటిని అందించలేకపోతే దానికి సంబంధించిన ప్రిన్సిపల్ అమౌంట్ ను బ్యాంకు తిరిగి చెల్లిస్తుంది. ఈ పథకం బిల్డర్ నుంచి ఆక్యుపేషన్ సర్టిఫికెట్ ఇచ్చేంత వరకు అమల్లో ఉంటుంది. మరిన్ని వివరాలు homeloans.sbi లో లభ్యం. #SBI launched ‘Sapna Aapka Bharosa SBI Ka’ - Residential Builder Finance with Buyer Guarantee, to protect home buyers & boost the real estate sector. A MOU was signed by #SBI & Sunteck Realty Ltd., in Mumbai, followed by a press conference by Shri Rajnish Kumar, Chairman SBI. pic.twitter.com/SjRhG0b86C — State Bank of India (@TheOfficialSBI) January 9, 2020 -
ఎస్బీఐ వినూత్న గృహ రుణ పథకం
ముంబై: దేశంలో అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ ఓ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ‘రెసిడెన్షియల్ బిల్డర్ ఫైనాన్స్ విత్ బయ్యర్ గ్యారంటీ (ఆర్‌బీబీజీ)’ పేరుతో ఆరంభించిన ఈ పథకం కింద.. ఎంపిక చేసిన గృహ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తికి ఎస్బీఐ నుంచి హామీ లభిస్తుంది. అది కూడా ఎస్బీఐ నుంచి రుణం తీసుకుని ఆ ప్రాజెక్టుల్లో ఇల్లు కొనుగోలు చేసిన వారికే ఇది వర్తిస్తుంది. దేశవ్యాప్తంగా 10 పట్టణాల్లో రూ.2.5 కోట్ల ధర ఉండే ప్రాజెక్టులపై ఈ పథకం ముందుగా అమలవుతుందని ఎస్బీఐ తెలిపింది. ఈ పథకం కొనుగోలుదారులకు, బిల్డర్లకు, బ్యాంకుకు ప్రయోజనం చేకూరుస్తుందని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ పథకం గురించి కుమార్ మరింత వివరిస్తూ.. ‘‘ఉదాహరణకు ఒక కొనుగోలుదారు ఒక ప్రాజెక్టులో రూ.2 కోట్ల ఫ్లాట్ బుక్ చేసుకుని రూ.కోటి చెల్లించారనుకుంటే, ఆ ప్రాజెక్టు నిలిచిపోతే అప్పుడు రూ.కోటి తిరిగి కొనుగోలుదారుకు చెల్లిస్తాం. ఈ గ్యారంటీ సంబంధిత ప్రాజెక్టు ఆక్యుపేషన్ సర్టిఫికెట్ పొందేంత వరకు అమల్లో ఉంటుంది’’ అని పేర్కొన్నారు. -
ఒన్ నేషన్..ఒన్ రేషన్ షురూ..
సాక్షి, న్యూఢిల్లీ : ఒక దేశం-ఒకే రేషన్ కార్డు సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఏపీ, తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో బుధవారం ప్రారంభించింది. నూతన సంవత్సరం తొలిరోజున ఏపీ, తెలంగాణా, గుజరాత్, మహారాష్ట్ర, హరియాణ, రాజస్ధాన్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, గోవా, జార్ఖండ్, త్రిపురల్లో ప్రారంభించింది. ఈ 12 రాష్ట్రాల్లో ప్రజాపంపిణీ వ్యవస్థ లబ్ధిదారులు వారు ఏ రాష్ట్రంలో నివసిసున్నా తమ రేషన్ వాటాను పొందే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. 2020 జూన్ నాటికి దేశంలోని అన్ని రాష్ట్రాలను ఒన్ నేషన్..ఒన్ రేషన్ సదుపాయానికి అనుసంధానిస్తారు. ఈ సదుపాయం కింద నూతన ఫార్మాట్లో రేషన్ కార్డును రూపొందించాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది. జూన్ 1, 2020 నుంచి నూతన రేషన్ కార్డులు అందుబాటులోకి వస్తాయి. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు జారీ చేసే రేషన్ కార్డులు ఇక స్టాండర్డ్ ఫార్మాట్లో ఉంటాయి. -
గిరిజనానికి వరం
సీతంపేట: ఏజెన్సీలో ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజన చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ఇక అదనపు పోషకాహారం అందనుంది. సీఎం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ సంపూర్ణ పోషణ్ అభియాన్ పథకాన్ని ఎనిమిది జిల్లాల్లో అమలు చేసేందుకు మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి కె.దమయంతి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇందులో భాగంగా మరికొద్ది రోజుల్లో ఉత్తరాంధ్ర, ఉభ య గోదావరి, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. జిల్లాలో అమలు ఇలా.. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఐటీడీఏ పరిధిలోని 20 సబ్‌ప్లాన్ మండలాల పరిధిలో 1250 గిరిజన గ్రామాలున్నాయి. జిల్లాలో 18 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 4,192 అంగన్వాడీ కేంద్రాలుండగా, ఏజెన్సీలో 825 కేంద్రాలున్నాయి. వీటిలో 422 మెయిన్, 403 మినీ అంగన్వాడీ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఏడు నెలల నుంచి ఆరేళ్ల లోపు సుమారు 17939 ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఏజెన్సీలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులంతా కలిపి సుమారు 25వేల మంది లబ్ధిదారులున్నట్టు గుర్తించారు. జిల్లాలో 11 శాతం కంటే తక్కువ రక్తహీనత గల గర్భణులు సుమారు 9 వేలు, మూడు నుంచి ఆరు సంవత్సరాలలోపు లోపు పోషణకు గురైన చిన్నారులు–1549మంది, 7 నెలల నుంచి మూడేళ్ల లోపు చిన్నారులు–1624 గురైనట్టు గతంలో గుర్తించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ సంపూర్ణ పోషణ్ పథకం ద్వారా వారందరికీ అదనంగా పోషకాహారం అందించనున్నారు. పూర్తిస్థాయిలో లబ్ధిదారులందరికీ పోషకాహారం అందించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా డిసెంబర్ నుంచి కొత్త మెనూ అంగన్వాడీ కేంద్రాలకు అమలు చేయనున్నారు. ఈ పథకంలో ఆరు నెలల నుంచి 3 ఏళ్ల చిన్నారులకు నెలకు రూ.600లతో ప్రతి రోజూ ఒక కోడి గుడ్డు, 200 మిల్లీలీటర్ల పాలు, వంద గ్రాముల బాలామృతాన్ని అందజేస్తారు. 3 నుంచి 6 ఏళ్లలోపు చిన్నారులకు నెలకు 25 రోజులపాటు కోడిగుడ్డుతో పాటు అన్నం, ఆకుకూరలు, పప్పుతో భోజనం, పాయసం, లడ్డు, బిస్కెట్లు ఇస్తారు. గర్భిణులు, బాలింతలకు గుడ్డు, పాలు, ప్రోటీన్లతో కూడిన భోజనాన్ని అందించనున్నారు. విధి విధానాలు రావాల్సి ఉంది.. ఈ పథకానికి సంబంధించి విది విధానాలు రావాల్సి ఉంది. దీంతో అమలు ప్రక్రియ మొదలవుతుంది. ఇప్పటికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోషకాహారం అందజేస్తున్నాం. ప్రభుత్వ ఆదేశానుసారం సక్రమంగా పోషకాహారాన్ని ప్రతి లబ్ధిదారుడికి అందజేస్తాం. – పి.రంగలక్ష్మి, సీడీపీఓ, సీతంపేట పక్కాగా అమలు చేయాలి.. ఏజెన్సీలోని 8 జిల్లాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ్ అభియాన్ పక్కాగా అమలు చేయాల్సిందే. ఎక్కడ ఎటువంటి లోపాలు ఉండకుండా చూడాల్సిన అవసరం సంబంధిత అధికారులపై ఉంది. గిరిజన ప్రాంతాల్లో ఈ తరహా పథకాలను అమలు చేసినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి మా గిరిజనుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. –విశ్వాసరాయి కళావతి, పాలకొండ ఎమ్మెల్యే కళావతి, మహిళా శిశు సంక్షేమ కమిటీ చైర్పర్సన్ -
ఆనందోత్సాహాల కల‘నేత’
సాక్షి, విశాఖపట్నం /సాక్షి నెట్వర్క్: సన్నని దారం.. చక్కని పనితనం.. చూపరుల్ని ఆకట్టుకునే వర్ణం.. అందంతోపాటు హాయినిచ్చే మన వస్త్రం.. హుందాతనాన్ని తెచ్చిపెట్టడమే చేనేత గొప్పతనం. వస్త్రాల తయారీలో అద్భుత కళ.. చేనేత. కానీ.. ఈ వృత్తిని నమ్ముకున్న వారి జీవితాలు మాత్రం దుర్భంగానే మిగిలిపోయాయి. అధికారంలోకి రాగానే బీసీ, ఎస్సీ, ఎస్టీ, చేనేత వర్గాలు తీసుకున్న రుణాలన్నీ వడ్డీతో సహామాఫీ చేసేస్తామంటూ ఊదరగొట్టిన టీడీపీ.. గడిచిన ఐదేళ్లలో ఏ ఒక్క హామీనీ నెరవేర్చకుండా వారిని పూర్తిగా విస్మరించింది. కానీ.. అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే.. చేనేత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక భరోసా అందిస్తోంది. నేతన్నకు నేస్తంగా ఉంటూ.. వారి జీవితాల్లో వెలుగు రేఖలు ప్రసరించేందుకు చేయూతనిస్తోంది. రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగి, ఉపాధి కల్పించే చేనేత రంగం.. అనాదిగా వివక్షకు గురవుతూనే ఉంది. 2014 ఎన్నికల ముందు చేనేత సహకార సంఘాల పరిధిలో ఉన్న రుణాలను కూడా మాఫీ చేస్తామని ఇచ్చిన హామీని చంద్రబాబు సర్కారు ఐదేళ్లలో పూర్తిగా గాలికొదిలేశారు. కేవలం నేత కార్మికుల వ్యక్తిగత రుణాలకే లబ్ధిని పరిమితం చేసి.. అవి కూడా కేవలం నేత పని కోసం తీసుకున్న రుణాలను మాత్రమే మాఫీ జాబితాలో చేర్చి.. వారి ఆశలపై నీళ్లు చల్లింది. జిల్లాలో 20 చేనేత సహకార సంఘాలుంటే. ..వాటి పరిధిలో 3,500కు పైగా మగ్గాలున్నాయి. ఈ మగ్గాలపై 19వేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. సంఘాల్లో లేనివారు జిల్లాలో మరో లక్ష మందికి పైగా ఉంటారని అంచనా. వివిధ బ్యాంకుల్లో సంఘాల్లోని వందలాది మంది చేనేత కార్మికులకు రుణాలున్నప్పటికీ ముడి సరుకుల నిమిత్తం 48 మంది తీసుకున్న రుణాలు రూ.5.47 లక్షలుగా చేనేత జౌళీ శాఖాధికారులు లెక్క తేల్చారు. అదే విధంగా ప్రభుత్వాదేశాల మేరకు చేనేత సహకార సంఘాల పరిధిలో రూ.కోట్లల్లో ఉన్న రుణాలను పక్కన పెట్టేశారు. జీవితాలు మారనున్నాయి... గత ప్రభుత్వం చెప్పింది చెయ్యకుండా చేనేతని వంచించింది. కానీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే.. అన్ని వర్గాల కుటుంబాల్లో సంతోషాలు వెల్లివిరుస్తున్నాయి. ఇందులో భాగంగా చేనేత కార్మికుల్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కీలక నిర్ణయం తీసుకున్నారు. బుధవారం అమరావతిలో జరిగిన కేబినెట్ భేటీలో చేనేత కుటుంబాలకు ఆర్థిక అభయ హస్తం ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకోసం కొత్త పథకం ప్రవేశపెడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. చేనేత కార్మికుల కోసం డిసెంబర్ 21న ‘వైఎస్సార్ నేతన్న హస్తం’ పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకం కింద ఒక్కో చేనేత కార్మికుడి కుటుంబానికి ఏడాదికి రూ.24 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేయనుంది. దీనికి సంబంధించిన విధివిధానాల్ని త్వరలోనే విడుదల చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించిన అర్హుల జాబితాను సిద్ధం చెయ్యాలంటూ జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. నేతన్నల్లో హర్షం... ప్రభుత్వ నిర్ణయంతో నేతన్నల మోముల్లో నవ్వులు విరబూశాయి. ఐదేళ్లుగా హామీల పేరుతో దగా పడిన తమ జీవితాలకు ఆర్థిక దన్ను దొరికిందని చేనేత కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇన్నాళ్లూ.. ఎన్ని బట్టలు నేసినా.. జీవితాలకు సరైన భరోసా లేదని చెబుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి తమ బతుకులకు వెలుగులు తీసుకొచ్చే నిర్ణయం తీసుకున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సబ్బవరం, కొత్తపేట, అనకాపల్లి, యలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం ప్రాంతాల్లో ఎక్కువ మంది చేనేత కార్మిక కుటుంబాలున్నాయి. -
వైఎస్సార్ నవోదయం పేరుతో కొత్త పథకం
ఉత్పత్తికి, వ్యయానికి తేడా రావడమో.. ఉత్పత్తులకు ఆశించిన మార్కెట్ లేకపోవడమో.. ప్రోత్సాహం కొరవడడమో తెలీదు గాని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. నష్టాలను భరించలేక పలు పరిశ్రమలు మూతపడుతున్నాయి. ఫలితంగా వాటిపై ఆధారపడి పనిచేస్తున్న కార్మికులు రోడ్డున పడుతున్నారు. జిల్లాలో గత ఐదేళ్ల కాలంలో 25 శాతం వరకు çసూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయి. 45 శాతం వరకు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. దీని వల్ల వేలల్లో కార్మికులు ఉపాధిని కోల్పోయారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, ఉపాధి కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించింది. పరిశ్రమలు సంక్షోభంలోకి వెళ్లడానికి గల కారణాలను ఆరా తీయడమే కాకుండా వాటిని ఆదుకోవాలని సంకల్పించింది. వైఎస్సార్ నవోదయం పేరుతో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న పరిశ్రమలకు ఊతం ఇవ్వడంతో పాటు నిరుద్యోగ సమస్యకు పరిష్కారం దిశగా.. పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు కేటాయించాలని ఇటీవల రాష్ట్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. – సాక్షి, విశాఖపట్నం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిశ్రమల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు చేయూతనిచ్చేందుకు ‘వైఎస్సార్ నవోదయం’ అనే కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో మూడేళ్లుగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహ పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) ఆదుకోవాలనేది ఈ పథకం ముఖ్య ఉద్దేశం. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను ప్రభుత్వం సుమారుగా 86 వేల వరకు గుర్తించింది. రూ.4 వేల కోట్ల రుణాలు వన్ టైం రీస్ట్రక్చర్ చేయడానికి కేబినెట్ ఆమోదం తెలపడంపై సూక్ష్మ, చిన్న తరహ పరిశ్రమల యజమానుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం వల్ల ఏ ఒక్క చిన్న పరిశ్రమ ఎన్పీఏలుగా మారకుండా, ఖాతాలు స్తంభించకుండా ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వం నిర్ణయంతో ఎంఎస్ఎంఈలకు మరింత రుణం, తక్షణ పెట్టుబడికి అవకాశం కల్పించే చర్యలు చేపట్టనుంది. ఈ పథకాన్ని వినియోగించుకునేందుకు తొమ్మిది నెలల వ్యవధిని ఏపీ కేబినెట్ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. తిరోగమనం నుంచి పురోగమనం దిశగా... జిల్లాలో 133 భారీ పరిశ్రమలుండగా 12,750 వరకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో గ్రానైట్, ఆక్వా రంగంతో పాటు ఇటుకల పరిశ్రమలు, సిమెంట్ ఫ్లైయాష్ బ్రిక్స్, బీరువాల తయారీ, విస్తరాకుల తయారీ, పచ్చళ్ల తయారీ, పాడి పరిశ్రమ, కేబుల్ నెట్వర్క్, మంచినీటి వ్యాపారం, ప్లాస్టిక్ బాటిల్స్ తయారీ, ప్రింటింగ్ రంగం, టైలరింగ్, జనపనార సంచుల తయారీ వంటి ఎన్నో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో అత్యధిక శాతం చిన్న పరిశ్రమలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఎక్కువ పరిశ్రమలకు ప్రోత్సాహం లేక చాలా వరకు మూతపడినవి కూడా ఉన్నాయి. ఇలా మూతపడిన పరిశ్రమలలో ఎక్కువ శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వారే ఉండటం గమనార్హం. గత మూడేళ్లుగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు 30 నుంచి 40 శాతం వరకు జిల్లాలో ఉన్నాయి. వీటిలో అర్హత కలిగిన సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను ఆర్థిక చేయూత కల్పించి.. తిరిగి జీవం పోసేందుకు సర్కారు శ్రీకారం చుట్టడంపై పరిశ్రమల వర్గాల్లో సర్వాత్ర హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో చిన్న పరిశ్రమలకు ఊరటనిస్తూ నిర్ణయం తీసుకోవడంపై ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్న పరిశ్రమలకు కోటి రూపాయల వరకు రుణం మంజూరుకు అవకాశం కల్పించే ప్రకటన చేయడం కూడా ఊరట కలిగించిందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాల వల్ల రానున్న ఐదేళ్లలో చిన్న పరిశ్రమలు ఊపందుకునే అవకాశం ఉందని వెల్లడిస్తున్నారు. ఫలితంగా మరికొంత మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలగుతాయి. ఉచిత విద్యుత్ సౌకర్యం కూడా.... చిన్న పరిశ్రమలకు చేయూతతో పాటు ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేసేందుకు నిర్ణయం తీసుకుంది. జిల్లాలో 3,29,486 మంది ఎస్సీలకు, 6,18,500 ఎస్టీలకు ప్రయోజనం కలగనుంది. ఈ పథకానికి రూ.411 కోట్లు ఖర్చు చేయనుంది. ఉచిత విద్యుత్ గతంలో కేవలం 100 యూనిట్ల వరకే ఉండేది. ఆ తరువాత సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ ప్రభుత్వం మరో 20 యూనిట్లను అదనంగా పెంచింది. ఇదే సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఎస్సీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు. ఆ ప్రకారం ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదముద్ర వేశారు. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. జిల్లాలో.... సూక్ష్మ తరహా పరిశ్రమలు - 10,200 చిన్న తరహా పరిశ్రమలు - 2,100 మధ్య తరహా పరిశ్రమలు - 450 భారీ పరిశ్రమలు - 133 ఐదేళ్లలో మూతపడిన పరిశ్రమలు - 25 శాతం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పరిశ్రమలు - 45 శాతం ఎస్సీ, ఎస్టీలకు ఉన్న ఎంఎస్ఎంఈ పరిశ్రమలు - 10 శాతం -
సరికొత్త పధకం..రూపాయికే అంత్యక్రియలు
-
దశల వారీగా ఆదాయ పథకం
చెన్నై: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ హమీ ఇచ్చిన కనీస ఆదాయ పథకాన్ని దశల వారీగా అమలు చేస్తామని, దాదాపు 5 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తామని కాంగ్రెస్ నేత చిదంబరం చెప్పారు. ఈ విషయంలో ఆర్థికవేత్తలు, నిపుణులతో చర్చించామని, ఈ పథకాన్ని అమలు చేసే సామర్థ్యం భారత్‌కు ఉందని చాలామంది అంగీకరించినట్లు ఆయన చెప్పారు. పథకం అమలుకు జీడీపీలో 1.8 శాతం మాత్రమే అవసరం అవుతుందని వివరించారు. ఈ పథకాన్ని తొలుత క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతే అమలు చేస్తామని తెలిపారు. 2009లో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం అమలు చేసినప్పుడు.. దాని అమలు సాధ్యం కాదని బీజేపీ నేత జైట్లీ విమర్శించారని, కానీ దాన్ని విజయవంతంగా అమలు చేసినట్లు గుర్తుచేశారు. కుటుంబానికి అవసరమైన మొత్తం ఆదాయాన్ని ప్రభుత్వం ఇవ్వలేదని, అందుకే కనీస ఆదాయం అందజేస్తామని చెప్పారు.మహిళ పేరుపై బ్యాంకు ఖాతా తెరవాలని, ఆ ఖాతాలోకి ఏటా రూ.72 వేలు జమ చేస్తామని చెప్పారు. -
కనీస ఆదాయ యోజనతో పేదలకు లబ్ధి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రతిపాదించిన కనీస ఆదాయ యోజన పథకంతో పేదలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని ఏఐసీసీ ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ చెప్పారు. మంగళవారం మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్, కిసాన్‌సెల్ నేత కోదండరెడ్డితో కలసి శ్రవణ్ గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. కనీస ఆదాయ యోజన పథకంతో దేశంలో 20 శాతం కుటుంబాలు పేదరికం నుంచి బయటపడతాయన్నారు. తెలంగాణలోని 3.5 కోట్ల మందికి 2.75 కోట్ల మంది బీపీఎల్ కేటగిరీలో ఉన్నారని, మొత్తం 50 లక్షల మందికి పైగా ప్రజలకు ఈ పథకం నుంచి లబ్ధి చేకూరుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే పేదరికం నిర్మూలించటం జరుగుతుందని స్పష్టం చేశారు. కనీస ఆదాయ యోజన పథకాన్ని బీజేపీ నేతలు విమర్శించడాన్ని ఆయన ఖండించారు. ఈ పథకం పూర్తిస్థాయి పరిశోధన, విశ్లేషణ తర్వాతనే ముసాయిదాను రూపొందించారని చెప్పారు. త్వరలో టీఆర్ఎస్ యుగం ముగుస్తుంది.. టీఆర్ఎస్ యుగం త్వరలో ముగుస్తుందని దాసోజు జోస్యం చెప్పారు. ఆదిలాబాద్–కరీంనగర్–నిజామాబాద్–మెదక్ ఎమ్మెల్సీ సీటును గ్రాడ్యుయేట్ల కోటా లో కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి గెలుచుకున్నారని, టీఆర్ఎస్ మద్దతు గల అభ్యర్థులు వరంగల్–ఖమ్మం–నల్లగొండ, మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో ఓడారని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు అనుకూలంగా ఓటు వేస్తారని చెప్పారు. ‘కనీస ఆదాయ’ పథకంతో పేదలకు లబ్ధి: వీహెచ్ సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన కనీస ఆదాయ భద్రత పథకంతో దేశంలో 25 కోట్ల మంది పేదలకు లబ్ధి కలుగుతుందని ఏఐసీసీ కార్యదర్శి వి.హన్మంతరావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ పథకం ద్వారా దేశంలో అత్యంత నిరుపేదలైన కుటుంబాలకు నెలవారీ రూ.6 వేల చొప్పున ఏటా రూ.72 వేలు నేరుగా వారి ఖాతాలకు జమ చేస్తామని తెలిపారు. ఈ పథకానికి ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పిస్తామని, తద్వారా తెలంగాణలో కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంపై స్పందిస్తూ ప్రజా తీర్పును అపహాస్యం చేస్తే ఏదో ఒకరోజు ప్రజలే తిరగబడతారని అన్నారు. -
ఒడిశాలో ‘రైతుబంధు’
భువనేశ్వర్: రైతులకు అండగా నిలిచేందుకు ఒడిశా ప్రభుత్వం ఓ భారీ పథకాన్ని ప్రారంభించింది. రైతులకు పెట్టుబడి వ్యయం, భూముల్లేని వారికి వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రోత్సాహం, వృద్ధాప్యం, అంగవైకల్యం తదితర కారణాలతో వ్యవసాయం చేయలేని స్థితిలో ఉన్న రైతులకు ఆర్థిక సహాయం తదితరాలు ఈ పథకంలో ఉన్నాయి. కలియా (కృషక్ అసిస్టెన్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఇన్‌కం ఆగ్మెంటేషన్) పేరుతో కొత్త పథకాన్ని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ శుక్రవారం మంత్రివర్గ సమావేశం అనంతరం ప్రకటించారు. ఈ పథకం కింద 2020–21 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ. 10,180 కోట్లను ఒడిశా ప్రభుత్వం ఖర్చు చేయనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న రుణమాఫీ హామీలు అర్థరహితమని నవీన్ పట్నాయక్ అన్నారు. రుణమాఫీ కన్నా తమ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకంతోనే రైతులకు ఎక్కువ లబ్ధి చేకూరుతుందనీ, అధిక శాతం మందికి ప్రయోజనాలు చేకూరుతాయని ఆయన తెలిపారు. ఒడిశాలో దాదాపు 32 లక్షల మంది రైతులుంటే కేవలం 20 లక్షల మందే పంటరుణాలను తీసుకున్నారనీ, రుణమాఫీ ప్రకటిస్తే మిగిలిన 12 లక్షల మందికి ప్రయోజనం ఉండదనీ, తమ కలియా పథకం మాత్రం 30 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలిగిస్తుందని పట్నాయక్ వివరించారు. ఇవీ పథకం ప్రయోజనాలు ► భూ విస్తీర్ణంతో నిమిత్తం లేకుండా వ్యవసాయం చేసే ప్రతీ కుటుంబానికి ఒక్కో సీజన్లో (ఖరీఫ్, రబీ) పెట్టుబడి కోసం రూ. 5,000 ఆర్థిక సాయం. కౌలు రైతులు కూడా ఈ మొత్తం పొందడానికి అర్హులే. ► గొర్రెలు, కోళ్లు, బాతులు, తేనెటీగల పెంపకం దార్లకు, చేపలు పట్టే వారికి అవసరమైన సామగ్రిని సమకూర్చుకునేందుకు రూ. 12,500 ఆర్థిక సాయం. భూమి లేని వారే ఇందుకు అర్హులు. వీటిలో ఏదో ఒక దాన్నే ఎంచుకోవాలి. ► వృద్ధాప్యం, అంగవైకల్యం, రోగాలు తదితర కారణాల వల్ల వ్యవసాయం చేయలేకపోతున్న రైతులకు ఒక్కో ఇంటికి ఏడాదికి రూ. 10 వేల ఆర్థిక సాయం. లబ్ధిదారులను గ్రామ పంచాయతీలు ఎంపిక చేస్తాయి. ► భూమి ఉన్న, లేని రైతులనే భేదం లేకుండా అందరికీ రూ. 2 లక్షల జీవిత బీమా, మరో రూ. 2 లక్షల ప్రమాద బీమా ► 50 వేల వరకు రుణాలపై వడ్డీ ఉండదు. జార్ఖండ్‌లోనూ కొత్త పథకం ఒడిశా తరహాలోనే జార్ఖండ్‌లోనూ ఓ పథకాన్ని రైతుల కోసం సీఎం రఘుబర్‌దాస్ శుక్రవారం ప్రారంభించారు. ఈ పథకం కింద రూ. 2,250 కోట్లను ఖర్చు చేయనుండగా, 22.76 లక్షల మంది చిన్న, సన్నకారు రైతులు లబ్ధి పొందనున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రైతులకు ప్రభుత్వం ఏడాదికి రూ. 5,000 ఆర్థిక సాయం అందజేయనుంది. గరిష్టంగా ఐదెకరాల వరకు భూమి ఉన్న రైతులు ఈ సాయం పొందేందుకు అర్హులు. రైతులు విత్తనాలు, ఎరువులు, తదితరాలను సమకూర్చుకునేందుకు ఈ పథకం సాయపడుతుంది. -
కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
-
‘కంటి వెలుగు’కార్యక్రమానికి ముహూర్తం ఖరారు
-
గజ్వేల్ నుంచి ‘కంటి వెలుగు’
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని పౌరులందరికీ ఉచిత కంటి పరీక్షలు నిర్వహించే ‘తెలంగాణకు కంటి వెలుగు’కార్యక్రమాన్ని ఆగస్టు 15న ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. గజ్వేల్ నియోజకవర్గంలో మధ్యాహ్నం రెండు గంటలకు కార్యక్రమాన్ని కేసీఆర్ స్వయంగా ప్రారంభించనున్నారు. అదేరోజు గవర్నర్ నరసింహన్‌తో ఇంకో ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కోరనున్నట్లు ఆయన తెలిపారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఇందులో భాగస్వాములు కావాలని కోరారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిం చాలని, అవసరమైన వారికీ కళ్లద్దాలు, మందులు ఇవ్వాలని, ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమానికి అవసరమైన సిబ్బంది, వైద్య పరికరాలు, వాహనాలు, కళ్లద్దాలు, మందులను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. శనివారం ప్రగతిభవన్‌లో ‘తెలంగాణకు కంటి వెలుగు’కార్యక్రమంపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంతాకుమారి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, ఆరోగ్యశ్రీ సీఈవో మాణిక్‌రాజ్, సరోజినీ దేవి కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ రవీందర్‌గౌడ్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్, జాయింట్ డైరెక్టర్ మోతీలాల్, టీఎస్ఎండీసీ ఎండీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. అవగాహన కల్పించండి ‘రికార్డు స్థాయిలో రాష్ట్రంలోని దాదాపు 3.70 కోట్ల మంది పౌరులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంత పెద్ద కార్యక్రమం గతంలో ఎవరూ, ఎప్పుడూ చేయలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపడుతున్నందున అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. ప్రజాప్రతినిధులందరినీ భాగస్వాములను చేయాలి. కలెక్టర్లు ప్రజాప్రతినిధులందరితో సమావేశాలు నిర్వహించి జిల్లాస్థాయిలో షెడ్యూల్‌ను రూపొందించాలి. క్షేత్రస్థాయిలో కార్యక్రమ నిర్వహణపై సమీక్షలు జరపాలి. ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. ప్రతి ఒక్కరు కంటి వైద్య శిబిరాలకు వచ్చేలా ఏర్పాట్లు చేయాలి’అని అధికారులను సీఎం ఆదేశించారు. 799 బృందాల ఏర్పాటు కంటి పరీక్షల నిర్వహణ కోసం చేసిన ఏర్పాట్లను అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. ‘రాష్ట్రవ్యాప్తంగా 799 బృందాలను ఏర్పాటు చేశాం. ప్రతి బృందంలో ఒక ఎంబీబీఎస్ డాక్టర్, ఆప్తోమెట్రిస్ట్, ఏఎన్ఎం ఉంటారు. ఒక్కో వైద్య బృందం రోజుకు సగటున 250 మందికి పరీక్షలు నిర్వహిస్తుంది. కంట్లో వేసే మందులను, ఇతర ఔషధాలను సిద్ధం చేస్తున్నాం. 34 లక్షల కంటి అద్దాలు సిద్ధం చేసి జిల్లాలకు పంపుతున్నాం. అవసరమైన వారికి ఆపరేషన్లు నిర్వహించడానికి రాష్ట్రవ్యాప్తంగా 114 కంటి ఆసుపత్రులను గుర్తించాం’అని అధికారులు తెలిపారు. సీఎం సూచనలివీ.. వర్షం వచ్చినా కంటి పరీక్షలు నిరాటంకంగా నిర్వహించేందుకు వీలుగా గ్రామ స్థాయిలో పాఠశాల భవవాన్నిగానీ, మరేదైనా పక్కా భవనాన్నిగానీ ఎంపిక చేసుకోవాలి. కంటి పరీక్షల కోసం నియమించే సిబ్బంది వల్ల సాధారణ వైద్య సేవలకు ఎక్కడా ఇబ్బంది రావద్దు. కంటి పరీక్షల శిబిరంలో పని చేయడానికి ఎంబీబీఎస్ పూర్తి చేసిన వైద్యుల సేవలను తాత్కాలిక పద్ధతిలో వినియోగించుకోవాలి. వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేస్తున్న వారిని వినియోగించవద్దు. ఏ రోజు ఏ గ్రామంలో పరీక్షలు నిర్వహిస్తున్నారనే విషయం ప్రజలకు తెలిసేలా విస్తృత ప్రచారం నిర్వహించాలి. కంటి పరీక్షలపై అవగాహన కల్పించాలి. ఎఎన్ఎంలు, ఆశా వర్కర్ల సేవలు వినియోగించుకోవాలి. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలి. కంటి పరీక్షల నిర్వహణలో భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తూ ప్రజా ప్రతినిధులకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లేఖలు రాయాలి. వైద్య శిబిరాల్లో పాల్గొనే సిబ్బందికి వారానికి రెండు రోజులు కచ్చితంగా సెలవులు ఇవ్వాలి. వాళ్లు వచ్చి వెళ్లడానికి ప్రభుత్వ ఖర్చుతో వాహనాలు ఏర్పాటు చేయాలి. గ్రామాల్లో సరైన వసతి ఉండదు కాబట్టి సమీప పట్టణాల్లో వసతి ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ, సింగరేణి, విద్యుత్ సంస్థల అతిథి గృహాలను ఇందుకోసం వినియోగించుకోవాలి. వీలైతే ప్రైవేటు హోటళ్లలోనూ బస ఏర్పాటు చేయాలి. పేదలకు వైద్య సేవలు అందించే వైద్య సిబ్బంది భోజన, వసతి ఏర్పాట్లు బాగుండాలి. దగ్గరి చూపు లోపం ఉన్న వారికి వెంటనే మందులను, అద్దాల (రీడింగ్)ను అందించాలి. ఇతరులకు డాక్టర్లు సూచించిన అద్దాలు పంపిణీ చేయాలి. ఆపరేషన్లు అవసరమైన వారికి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో దశల వారీగా ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా ఆపరేషన్లు చేయించాలి. సరోజినీ దేవి ఆసుపత్రికి కొత్త భవనం: సీఎం హైదరాబాద్‌లోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి కొత్త భవనం నిర్మించడంతోపాటు అన్ని రకాల ఆధునిక వసతులు కల్పించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సరోజినీ కంటి ఆసుపత్రికి మంచి పేరు, ప్రతిష్టలున్నాయని, అందుకు తగినట్లు కొత్త భవనాలు నిర్మించి రోగుల వైద్యానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న బస్తీ దవాఖానాలు పేదలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని, వాటి సంఖ్యను పెంచా లన్నారు. పేదలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. బస్తీ దవాఖానాలను సందర్శించిన గవర్నర్.. అవి పేదలకు ఎంతగానో మేలు చేస్తున్నాయని అభినందించారని సీఎం పేర్కొన్నారు. -
27న సోలార్ చరఖా పథకం ప్రారంభం
న్యూఢిల్లీ: ఐదు కోట్ల మంది మహిళలకు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన సౌర చరఖా పథకాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ నెల 27న ప్రారంభించనున్నారు. తొలి రెండేళ్లలో దేశవ్యాప్తంగా 50 క్లస్టర్లలో ఈ పథకాన్ని ప్రారంభిస్తామనీ, కేంద్రం రూ. 550 కోట్ల రాయితీని అందిస్తుందని సూక్ష, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ బుధవారం వెల్లడించారు. ఈ పథకంతో తొలి రెండేళ్లలోనే లక్ష వరకు ఉద్యోగాల సృష్టి జరుగుతుందని ఎంఎస్ఎంఈ కార్యదర్శి చెప్పారు. ఒక్కో క్లస్టర్లో 400 నుంచి 2,000 మంది వరకు చేతి వృత్తుల వారికి ఉపాధి దొరుకుతుందన్నారు. దేశవ్యాప్తంగా 15 అత్యాధునిక సాంకేతిక కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందనీ, వాటిలో 10 వచ్చే మార్చికల్లా కార్యకలాపాలను ప్రారంభిస్తాయని చెప్పారు. ఈ పదింటిలో విశాఖపట్నం, పుదుచ్చేరి, బెంగళూరు కూడా ఉన్నాయి. బుధవారం ముంబైలోని ప్రభాదేవి ప్రాంతంలోని 33 అంతస్తుల ‘బ్యూ మాండ్’ ఆకాశహర్మ్యం నుంచి ఎగసిపడుతున్న మంటలు. ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ భవంతి 26వ అంతస్తులో బాలీవుడ్ నటి దీపికా పదుకొణె నివసిస్తున్నారు. 32, 33వ అంతస్తుల్లో మాత్రమే మంటలు వ్యాపించాయి. భవంతిలోని వారిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. -
33 రోజులు.. 17 వేల దరఖాస్తులు
► వ్యవసాయ కనెక్షన్ల మంజూరుకు విద్యుత్ శాఖ లక్ష్యం ► కొత్త పథకాలతో సిబ్బందిపై పెరుగుతున్న ఒత్తిడి ► గడువులోగా పూర్తిచేస్తామంటున్న యంత్రాంగం మహబూబ్‌నగర్ (భగీరథకాలనీ) : మహబూబ్‌నగర్ సర్కిల్ పరిధిలోని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరు నత్తనడకన సాగుతుంది. గతేడాది అక్టోబర్ నాటికి పెండింగ్‌లో ఉన్న కనెక్షన్లను ఈ ఏడాది మార్చి నాటికి విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించింది. దీంతో ఇప్పటి వరకు 27,440 పెండింగ్ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను విడుదల చేసేందుకు విద్యుత్‌శాఖ అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఇక్కడి వరకు భాగానే ఉన్నా అమలులో మాత్రం నిర్లక్ష్యపు ఛాయలు అలుముకున్నాయి. 5 నెలల్లో 27,440 పెండింగ్ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను విడుదల చేసేందుకు లక్ష్యాన్ని నిర్దేశించుకోగా నాలుగు నెలలు గడుస్తున్నా ఈ నెల 9వ తేదీ నాటికి కేవలం 8,741 కనెక్షన్లకు మాత్రమే మోక్షం కలిగించారు. మరో 18,699 కనెక్షన్లు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈనెలఖారులోగా మరో 1,699 కనెక్షన్లు మంజూరు చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. మిగిలిన 17 వేల కనెక్షన్లు విడుదల చేసేందుకు అధికారులు ఇంకెంత సమయం తీసుకుంటారో మరి. నత్తనడకన కనెక్షన్ల మంజూరు..: మహబూబ్‌నగర్ సర్కిల్ పరిధిలో 5 విద్యుత్ శాఖ డివిజన్లు మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, జడ్చర్ల, గద్వాల ఉన్నాయి. వీటి పరిధిలో గతేడాది అక్టోబర్ నాటికి 27,440 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. కాగా వాటిని గతేడాది నవంబరు నుంచి ఈ ఏడాది మార్చి చివరి వరకు పరిష్కరించేందుకు అధికారులు నెలవారీగా లక్ష్యాలను నిర్ధేశించుకుని ప్రణాళిక రూపొందించారు. అయితే ఈ లక్ష్యాలకు.. క్షేత్రస్థాయిలో విడుదలవుతున్న కనెక్షన్లకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. నిర్దేశించుకున్న లక్ష్యాలలో సగం కూడా కనెక్షన్లను విడుదల చేయలేకపోయారు. వీటికితోడు ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తేదీ నాటికి మరో 4,456 కొత్త దరఖాస్తులు వచ్చాయి. ఇలా మొత్తం 31,896 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. వీటిలో 8,741 మాత్రమే కనెక్షన్లు విడుదల చేయగలిగారు. మరో 23,155 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అన్నింటినీ పరిష్కరిస్తాం..: పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను గడువులోగా విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నాం. మే చివరి నాటికి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులతోపాటు అప్పటి వరకు వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిష్కరిస్తాం. బోర్లు లేకున్నా, బోర్లలో నీరు లేకున్నా ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ సామగ్రిని పొందేందుకు ఎక్కువ డీడీలు చెల్లించి దరఖాస్తు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. వాటిపై క్షేత్రస్థాయి విచారణ జరిపి తప్పుడు దరఖాస్తులను తొలగిస్తాం.– రాముడు, ఎస్ఈ, టీఎస్ఎస్పీడీసీఎల్, మహబూబ్‌నగర్ సర్కిల్ -
గ్రామీణ సమ్మిళిత పథకాన్ని ప్ర్రారంభించిన సీఎం