భోపాల్: మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా లాడ్లి బెహనా(ప్రియమైన సోదరి) పథకాన్ని ప్రకటించింది. భోపాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి ‘లాడ్లి బెహనా యోజన’ఫలకాన్ని ఆన్‌లైన్‌లో ఆవిష్కరించారు. పథకం కింద ప్రభుత్వం మహిళలకు నెలకు రూ.వెయ్యి అందజేస్తుంది.
ఇందుకు అర్హులుగా.. ఆదాయ పన్ను చెల్లించని, వార్షిక ఆదాయం రూ.2.50 లక్షల లోపు ఉండే వారు, తదితర కేటగిరీలను నిర్ణయించారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలకు ఈ పథకంతో లబ్ధి కలుగనుంది. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.8 వేల కోట్లను కేటాయించారు. మార్చి 15–ఏప్రిల్ 30 తేదీల మధ్య దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment