ముంబై: ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ ఓ నూతన పథకం ద్వారా భారీగా నిధులు సమీకరించింది. ఎస్‌బీఐ ఎనర్జీ అపార్చునిటీస్ ఫండ్ పట్ల ఇన్వెస్టర్లు ఎంతో ఉత్సాహం చూపించారు. రూ.5,000 కోట్ల సమీకరణను ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ అంచనా వేయగా, దీన్ని అధిగమించి రూ.6,700 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అన్ని రకాల పంపిణీ ఛానళ్ల ద్వారా విస్తృతమైన స్పందన వచ్చిందని, దరఖాస్తులు 5 లక్షలు దాటాయని ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ ప్రకటించింది.
పెద్ద సంఖ్యలో కొత్త ఇన్వెస్టర్లు ఈ నూతన ఫండ్ ఆఫర్ (ఎన్‌ఎఫ్‌వో)లో పాల్గొనడం చూస్తుంటే అది ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ పట్ల ఇన్వెస్టర్లలో ఉన్న విశ్వాసాన్ని తెలియజేస్తోందని పేర్కొంది. ఎనర్జీ ధీమ్ (ఇంధన రంగం) పట్ల ఇన్వెస్టర్లు నమ్మకానికి నిదర్శనమని తెలిపింది. ఇంధనం, దాని అనుబంధ రంగాల్లో పనిచేసే కంపెనీల్లో ఈ పథకం ఇన్వెస్ట్ చేస్తుంది. ఈక్విటీ, డెరివేటివ్స్, డెట్ సెక్యూరిటీలలోనూ పెట్టుబడులు పెడుతుంది. రాజ్ గాం«దీ, ప్రదీప్ కేశవాన్ ఫండ్ మేనేజర్లుగా పనిచేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment