Fund raising
-
రిలయన్స్ ఇన్ఫ్రాకు గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: మౌలికసదుపాయాల కంపెనీ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిధుల సమీకరణ ప్రతిపాదనకు వాటాదారులు అనుమతించారు. షేర్ల ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా రూ. 6,000 కోట్లు సమీకరించేందుకు కంపెనీ బోర్డు సెపె్టంబర్ 19న గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) ద్వారా నిధులు సమకూర్చుకోనుంది. ఇందుకు పోస్టల్ బ్యాలట్ ద్వారా 98 శాతం మంది వాటాదారుల నుంచి అనుమతి పొందినట్లు కంపెనీ వెల్లడించింది. కాగా.. నిధుల్లో షేర్ల ప్రిఫరెన్సియల్ కేటాయింపుల ద్వారా రూ. 3,000 కోట్లు, మారి్పడికి వీలయ్యే వారంట్ల జారీ(క్విప్) ద్వారా మరో రూ. 3,000 కోట్లు సమీకరించనుంది. తొలి దశలో భాగంగా షేరుకి రూ. 240 ధరలో 12.56 కోట్ల ఈక్విటీ షేర్లు లేదా మారి్పడికి వీలయ్యే వారంట్లను ప్రిఫరెన్షియల్ పద్ధతిలో జారీ చేయనుంది. తద్వారా రూ. 3,014 కోట్లు అందుకోనుంది. వీటిలో 4.6 కోట్ల షేర్ల(రూ. 1,104 కోట్ల విలువ)లో ప్రమోటర్ సంస్థ రైజీ ఇనిఫినిటీ ప్రయివేట్ ఇన్వెస్ట్ చేయనుంది. -
ఒక్క డీల్‌తో దూసుకెళ్లిన ఫిజిక్స్‌వాలా
న్యూఢిల్లీ: ఎడ్టెక్ యూనికార్న్ ఫిజిక్స్‌వాలా తాజాగా రూ.1,753 కోట్ల నిధులను సమీకరించింది. సిరీస్–బి రౌండ్లో హార్న్‌బిల్ క్యాపిటల్, లైట్‌స్పీడ్ వెంచర్ పార్ట్నర్స్, జీఎస్వీ, వెస్ట్‌బ్రిడ్జ్ ఈ మొత్తాన్ని అందించాయి. ఈ డీల్‌తో కంపెనీ విలువ ఏడాదిలో రెండున్నర రెట్లు దూసుకెళ్లి రూ.23,380 కోట్లకు చేరింది.ఇదీ చదవండి: అనిల్ అంబానీకి ఇక అన్నీ మంచి రోజులేనా?పెద్ద సంస్థల వాల్యుయేషన్‌లో గణనీయమైన తగ్గుదల కారణంగా భారతీయ ఎడ్టెక్ రంగంలో పెద్ద ఎత్తున నిధుల కొరత చాలా కాలంగా ఉంది. ‘ఎడ్టెక్ రంగానికి సవాలుగా ఉన్న ప్రస్తుత సమయంలో తాజా ఫండింగ్ రౌండ్ ఆశావాదానికి దారితీసింది. కంపెనీ అభివృద్ధి, దేశం అంతటా విద్యను ప్రజాస్వామ్యం చేయాలనే లక్ష్యంపై ఇప్పటికే ఉన్న, కొత్త పెట్టుబడిదారుల అచంచల విశ్వాసానికి ఇది నిదర్శనం’ అని ఫిజిక్స్‌వాలా తెలిపింది. -
Hyderabad: ‘అకాన్ ఆహ్వానం’! సిటీలో వినూత్నంగా ఫండ్ రైజింగ్ ఫీస్ట్..
సాక్షి, సిటీబ్యూరో: స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో నగరం వేదికగా ’అకాన్ ఆహ్వానం’ పేరుతో వినూత్నంగా ఫండ్ రైజింగ్ ఫీస్ట్‌ను గురువారం నిర్వహిస్తున్నారు. పేద కుటుంబాల్లో నెలలు నిండకుండానే పుట్టిన చిన్నారుల సంరక్షణ, సహకారం అందించడం కోసం ఈ ఫీస్ట్ నిర్వహించడం విశేషం. దుర్గంచెరువు దగ్గరలోని అకాన్ రెస్టారెంట్ వేదికగా ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ ఎక్స్‌ట్రామైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ఫండ్ రైజింగ్ ఫీస్ట్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రముఖ చెఫ్‌లు తయారు చేసిన పసందైన ఆహార పదార్థాలను, సితార్ ప్రదర్శనను ఆస్వాదిస్తూ ఆరగించవచ్చు. లంచ్ మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. లంచ్ అనంతరం చెల్లించే ప్రతిపైసా పేద కుటుంబాల్లోని ప్రీ మెచ్యూర్డ్ చిన్నారులకు, అనారోగ్యాలతో జన్మించిన శిశువులకు విరాళంగా అందిస్తారు. సామాజిక బాధ్యతగా ఈ వినూత్నమైన ఆహారానికి, ఆతిథ్యానికి ఎంతైనా చెల్లించవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు.ఒక్కో శిశువుకు రూ.10 లక్షల వరకు..నెలలు నిండని శిశు జననాల సంఖ్య ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా బతుకు గడవడమే కష్టంగా మారిన పేద కుటుంబాల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. ఇలాంటి శిశువులకు, వారి కుటుంబాల చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఎక్స్‌ట్రామైల్ ఫౌండేషన్ కృషి చేస్తోంది. ’అకాన్ ఆహ్వానం’ ఫండ్ రైజింగ్ ఫీస్ట్‌లో పోగైన ప్రతి పైసా ప్రీమెచ్యూర్డ్ చిన్నారులకు, అనారోగ్యంతో జన్మించిన శిశువులకు చేరుతుంది. మా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి హాస్పిటల్లో ఉండే ఎన్ఐసీయూ యూనిట్ల ద్వారా సహాయం అవసరమైన శిశువులకు సహకారం అందిస్తున్నాం. ఇప్పటి వరకు 197 మంది చిన్నారులకు సహకారం అందించాం. 400 గ్రాముల బరువుతో జన్మించిన చిన్నారులను రక్షించాలంటే రూ.10–15 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇతర సమస్యలతో జన్మించినా కనీసం రూ.3, 4 లక్షలు అవసరం. ఒక్క లంచ్ ఎన్నో కుటుంబాలకు ఆసరాగా నిలుస్తుంది. లంచ్ రిజర్వేషన్ల కోసం ఫోన్: 96496 52222 – డా.నిటాషా, ఎక్స్‌ట్రామైల్ ఫౌండేషన్ -
జనరేటివ్ ఏఐ స్టార్టప్‌లకు ఏడబ్ల్యూఎస్ సాయం!
జెనరేటివ్ ఏఐ స్టార్టప్‌లకు అమెజాన్ వెబ్ సర్వీస్ (ఏడబ్ల్యూఎస్) సహకారం అందించనున్నట్లు తెలిపింది. జెనరేటివ్ ఏఐ విభాగంలో సేవలందించే స్టార్టప్ కంపెనీలకు ఏకంగా 230 మిలియన్ డాలర్ల (సుమారు రూ.2,000 కోట్లు) మేర సాయం చేయాలని నిర్ణయించుకుంది.ఏడబ్ల్యూఎస్ అంతర్జాతీయంగా జెనరేటివ్ ఏఐ యాక్సిలరేటర్ కార్యక్రమాన్ని విస్తరించాలని భావిస్తోంది. అందులో భాగంగానే ఈ రంగంలో సేవలందించే అంకురాలకు ఆర్థికసాయం చేయలని నిర్ణయం తీసుకుంది. అక్టోబరు 1 నుంచి 10 వారాల పాటు జరిగే ఈ కార్యక్రమం ద్వారా 80 వ్యవస్థాపకులు, అంకుర సంస్థలకు సహకారం అందించనున్నట్లు ప్రకటించింది. వీటిల్లో ఆసియా పసిఫిక్, జపాన్ ప్రాంతం నుంచే 20 వరకు ఉండనున్నాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ సంస్థల వృద్ధిని పెంచడమే ఈ నిధుల సహకారం ప్రధానం ఉద్దేశం. ఈ కార్యక్రమంలో ఎంపికైన ఒక్కో జెన్ఏఐ స్టార్టప్‌కు 1 మిలియన్ డాలర్ల (సుమారు రూ.8.3 కోట్లు) మేర ఆర్థిక వెసులుబాటు కల్పించనున్నారు. దాంతోపాటు ఏడబ్ల్యూఎస్ తరఫున ఆయా కంపెనీలకు నైపుణ్యాభివృద్ధి సెషన్లు, వ్యాపారం, సాంకేతికత అంశాలపై సలహాలు, నెట్వర్కింగ్ అవకాశాలు తదితర సహకారాన్ని అందిస్తామని ఏడబ్ల్యూఎస్ పేర్కొంది. -
సౌదీ జైల్లో భారతీయుడు.. విడుదలకు రూ.34 కోట్ల నిధుల సేకరణ
కోజికోడ్: ప్రపంచంలో ఏమూల ఉన్నాసరే విపత్కర సమయాల్లో కేరళ ప్రజలంతా ఒక్కటవుతుంటారు. ఈ క్రమంలో సౌదీ అరేబియాలో మరణ శిక్ష పడిన ఓ వ్యక్తి కోసం ఇప్పుడూ వాళ్లంతా ఏకం అయ్యారు. ఓ హత్య కేసులో మరణశిక్ష పడ్డ వ్యక్తి జైల్లో మగ్గుతున్న ఆ వ్యక్తిని కాపాడటానికి ఏకంగా రూ. 34 కోట్లు నిధుల సేకరణకు ముందుకొచ్చారు. కోజికోడ్‌కు చెందిన అబ్దుల్ రహీమ్.. 2006లో సౌదీలో ఓ బాలుడికి అబ్దుల్ రహీమ్ కేర్‌టేకర్‌గా చేరారు. అయితే ప్రమాదవశాత్తు ఆ బాలుడు రహీమ్ సంరక్షణలో మృతి చెందాడు. దీంతో ఈ కేసులో అక్కడి న్యాయస్థానం రహీమ్‌కు మరణశిక్ష విధించింది. సుమారు 18 ఏళ్ల నుంచి సౌదీ అరేబియాలో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ కేసులో రహీమ్‌కు క్షమాభిక్ష ప్రసాదించడానికి బాధిత కుటుంబం తొలుత నిరాకరించింది. అయితే.. బ్లడ్‌మనీ (నష్ట పరిహారం రూపంలో) చెల్లిస్తే క్షమించేందుకు ఎట్టకేలకు ఒప్పుకుంది. బ్లడ్ మనీ కింద రూ.34కోట్లు చెల్లించాలని ఆ బాలుడి కుటుంబం షరతు విధించింది. అయితే రహీం ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే కదా!. ఈ క్రమంలో సౌదీలోని కేరళీయులు అంతా ఏకమై నిధలు సేకరించడానికి ఓ కమిటిగా ఏర్పడ్డారు. ముందుగా నిధులు సమీకణకు పెద్దగా స్పందన రాలేదు. కొన్ని రోజుల అనంతరం కేరళీయుల నుంచి భారీ విరాళాలు రావటం ప్రారంభమైందని నిధుల సేకరణ కమిటీ మీడియాకు వెల్లడించింది. రియాద్‌లోని సుమారు 75 సంస్థలు, కేరళకు వ్యాపారవేత్తలు, స్థానిక రాజకీయ సంస్థలు విరాళాలు అందిచినట్లు తెలుస్తోంది. విరాళాల్లో పారదర్శకత కోసం సదరు కమిటి ప్రత్యేక నిధులకు సేకరణకు యాప్‌ను కూడా తయారు చేసింది. ‘ఇంత పెద్ద భారీ నిధులు సేకరణ సాధ్యం అవుతుందని అస్సలు ఊహించలేదు. రూ. 34 కోట్లు సేకరిస్తామన్న నమ్మకం మొదట్లో లేదు. కానీ మెల్లగా విరాళాలు పెరగటంతో సాధ్యం అయింది’ అబ్దుల్ రహీం తల్లి సంతోషం వ్యక్తం చేసింది. త్వరలోనే రహీమ్ జైలు నుంచి విడుదల కానున్నాడని అతని కుటుంబం సంతోషం వ్యక్తం చేస్తోంది. -
లక్షల కోట్ల అప్పులు.. వొడాఫోన్ ఐడియా నిధుల బాట
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం రంగ దిగ్గజం వొడాఫోన్ ఐడియా భారీ స్థాయిలో నిధుల సమీకరణ చేపట్టనుంది. ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత సెక్యూరిటీలు, ఇతర రుణ మార్గాల ద్వారా రూ. 45,000 కోట్లు సమీకరించేందుకు కంపెనీ బోర్డు తాజాగా ఆమోదముద్ర వేసింది. రూ. 2.1 లక్ష కోట్ల భారీ రుణ భారంతో కుదేలైన కంపెనీ మనుగడ కోసం పలు సమస్యలను ఎదుర్కొంటోంది. త్రైమాసికవారీగా నష్టాలు ప్రకటించడంతోపాటు.. వినియోగదారులను కోల్పోతోంది. ఏప్రిల్‌లో బోర్డ్ భేటీ... నిధుల సమీకరణ నిర్వహణ కోసం బ్యాంకర్లను ఎంపిక చేసేందుకు యాజమాన్యానికి అధికారాలనిస్తూ బోర్డు తీర్మానించింది. దీనిలో భాగంగా ఏప్రిల్ 24న వాటాదారుల సమావేశాన్ని నిర్వహించనుంది. వాటాదారుల అనుమతి తదుపరి త్రైమాసికంలో ఈక్విటీ నిధుల సమీకరణను పూర్తి చేయనున్నట్లు వొడాఫోన్ ఐడియా తెలియజేసింది. -
ఎస్బీఐ కొత్త ఫండ్‌కు కోట్లలో నిధులు
ముంబై: ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఓ నూతన పథకం ద్వారా భారీగా నిధులు సమీకరించింది. ఎస్బీఐ ఎనర్జీ అపార్చునిటీస్ ఫండ్ పట్ల ఇన్వెస్టర్లు ఎంతో ఉత్సాహం చూపించారు. రూ.5,000 కోట్ల సమీకరణను ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ అంచనా వేయగా, దీన్ని అధిగమించి రూ.6,700 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అన్ని రకాల పంపిణీ ఛానళ్ల ద్వారా విస్తృతమైన స్పందన వచ్చిందని, దరఖాస్తులు 5 లక్షలు దాటాయని ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ప్రకటించింది. పెద్ద సంఖ్యలో కొత్త ఇన్వెస్టర్లు ఈ నూతన ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో)లో పాల్గొనడం చూస్తుంటే అది ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ పట్ల ఇన్వెస్టర్లలో ఉన్న విశ్వాసాన్ని తెలియజేస్తోందని పేర్కొంది. ఎనర్జీ ధీమ్ (ఇంధన రంగం) పట్ల ఇన్వెస్టర్లు నమ్మకానికి నిదర్శనమని తెలిపింది. ఇంధనం, దాని అనుబంధ రంగాల్లో పనిచేసే కంపెనీల్లో ఈ పథకం ఇన్వెస్ట్ చేస్తుంది. ఈక్విటీ, డెరివేటివ్స్, డెట్ సెక్యూరిటీలలోనూ పెట్టుబడులు పెడుతుంది. రాజ్ గాం«దీ, ప్రదీప్ కేశవాన్ ఫండ్ మేనేజర్లుగా పనిచేయనున్నారు. -
మ్యూచువల్ ఫండ్స్ కొత్త పథకాల వెల్లువ
న్యూఢిల్లీ: అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు (మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ సంస్థలు) గతేడాది నూతన పథకాల రూపంలో ఇన్వెస్టర్ల నుంచి భారీగా నిధులు సమీకరించాయి. మొత్తం 212 న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో)లు 2023లో మార్కెట్లోకి వచ్చాయి. ఇవి సంయుక్తంగా రూ.63,854 కోట్లను సమీకరించాయి. అంతకుముందు ఏడాది (2022) కూడా 228 ఎన్‌ఎఫ్‌వోలు రూ.62,817 కోట్లు సమీకరించడం గమనార్హం. ఇక 2021లో రూ.99,704 కోట్లు, 2020లో రూ.53,703 కోట్ల చొప్పున కొత్త పథకాల ద్వారా సమీకరించాయి. ఈ వివరాలను ఫైయర్స్ రీసెర్చ్ విడుదల చేసింది. ‘‘వినియోగం విషయంలో మారుతున్న ధోరణి, అధిక ప్రమాణాలతో కూడిన జీవన అవసరాల నేపథ్యంలో.. ఇన్వెస్టర్లు దీర్ఘకాలం కోసం పెట్టుబడులు పెట్టడాన్ని గుర్తిస్తున్నారు. అత్యవసర సమయాలను గట్టేక్కేందుకు తగినంత నిధి, ఆర్థిక ప్రణాళిక అవసరాన్ని కరోనా మహమ్మారి తెలియజేసింది’’అని ఫైయర్స్ రీసెర్చ్ తన నివేదికలో తెలిపింది. బలమైన ఆర్థిక కార్యకలాపాలు, స్థిరమైన జీఎస్టీ వసూళ్లు, ప్రభుత్వ సంస్కరణలతో సూచీలు గతేడాది మంచి పనితీరు చూపించినప్పటికీ, 2024లోనూ అదే మాదిరి పనితీరు ఆశించరాదని పేర్కొంది. మార్కెట్ విలువలు ఖరీదుగా మారిన తరుణంలో అప్రమత్తత అవసరమని ఇన్వెస్టర్లకు సూచించింది. పెరిగిన రిస్క్ ధోరణి.. 2023 జనవరి–మార్చి కాలంలో అత్యధికంగా 57 ఎన్‌ఎఫ్‌వోలు మార్కెట్లోకి వచ్చాయి. జూలై–సెపె్టంబర్ త్రైమాసికంలో అత్యధికంగా రూ.22,049 కోట్లను ఎన్‌ఎఫ్‌వోలు సమీకరించాయి. 2023లో 29 థీమాటిక్/సెక్టోరల్ ఫండ్స్ (ఎన్‌ఎఫ్‌వోలు) రూ.17,946 కోట్లను ఆకర్షించాయి. ఈక్విటీల విషయంలో ఇన్వెస్టర్లలో రిస్క్ తీసుకునే ధోరణి పెరగడంతో వారు థీమాటిక్/సెక్టోరల్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకుంటున్నట్టు నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా మార్కెట్ ర్యాలీ సమయంలో ఎన్‌ఎఫ్‌వోలు ఎక్కువగా వస్తుంటాయి. సానుకూల సెంటిమెంట్ నేపథ్యంలో అధిక పెట్టుబడులను సులభంగా సమీకరించొచ్చని అలా చేస్తుంటాయి. స్టాక్ మార్కెట్ మెరుగైన పనితీరుకు తోడు, ఇన్వెస్టర్లలో సానుకూల సెంటిమెంట్ గతేడాది భారీగా ఎన్‌ఎఫ్‌వోలు నిధులు సమీకరించడానికి తోడ్పడినట్టు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. 2023లో నిఫ్టీ–50 సూచీ 20 శాతం రాబడులను ఇచి్చంది. ఇక నిఫ్టీ మిడ్‌క్యాప్ అయితే 47 శాతం, స్మాల్‌క్యాప్ 56 శాతం చొప్పున ర్యాలీ చేయడం గమనార్హం. గతేడాది దేశీయ ఇనిస్టిట్యూషన్స్ రూ.1.7 లక్షల కోట్ల పెట్టుబడులతో ఈక్విటీల ర్యాలీలో ముఖ్యపాత్ర పోషించాయి. గతేడాది మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ రూ.2.74 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. 2022లో వచి్చన రూ.71,000 కోట్లతో పోలిస్తే మూడు రెట్లు అధికంగా వచ్చాయి. -
ఏడాదిలోనే 90 శాతం విలువ తగ్గిన కంపెనీ..
ఒక్క ఏడాది వ్యవధిలోనే ప్రముఖ ఎడ్టెక్ సంస్థ 90 శాతం తన విలువను కోల్పోయింది. బైజూస్ బ్రాండ్‌పై కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎడ్టెక్ సంస్థ థింక్ అండ్ లెర్న్ తన విలువను భారీగా నష్టపోయింది. ఈమేరకు ‘టెక్‌క్రంచ్’ వెబ్సైట్ కథనం ప్రచురించింది. ఈ సంస్థ విలువ రూ.1,82,600 కోట్ల నుంచి రూ.16,600 కోట్లకు పడిపోయినట్లు అందులో పేర్కొంది. ఫిబ్రవరిలో షేర్లను జారీ చేసి ప్రస్తుత పెట్టుబడిదార్ల నుంచి 100 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.830 కోట్ల)ను సమీకరించాలని బైజూస్ భావిస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. గతంలో 2022 చివర్లో జరిగిన నిధుల సమీకరణ సమయంలో కంపెనీ విలువను 22 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1,82,600 కోట్లు)గా లెక్కగట్టగా.. తాజాగా 2 బిలియన్ డాలర్లు (సుమారు రూ.16,600 కోట్లు)గానే లెక్కించి ఇన్వెస్టర్లకు షాక్ఇచ్చింది. అంటే సంస్థ విలువ 90 శాతానికి పైగా తగ్గింది. కొన్ని నెలలుగా నగదు లభ్యత సమస్యల్లో ఉన్న ఈ కంపెనీ, కొత్తగా సమీకరించే నిధులతో అప్పు ఇచ్చినవారికి చెల్లింపులు చేయనుందని తెలిసింది. బైజూస్ అనుబంధ సంస్థలు వైట్ హాట్ జూనియర్, ఒస్మోల్లో నష్టాల కారణంగా 2021-22లో సంస్థ నిర్వహణ వ్యయం రూ.6,679 కోట్లకు పెరిగినట్లు సమాచారం. ఈ రెండు సంస్థల నష్టాలే 45 శాతం (రూ.3,800 కోట్లు) ఉన్నాయి. 2020-21లో సంస్థ నష్టం రూ.4,143 కోట్లతో పోలిస్తే 2021-22 నష్టం మరింత పెరిగినట్లయింది. ఆదాయాలు కూడా రూ.2428.39 కోట్ల నుంచి రూ.5,298.43 కోట్లకు పెరిగాయి. బైజూస్ ఇతర అనుబంధ సంస్థలైన ఆకాశ్, గ్రేట్ లెర్నింగ్ ఆదాయాలు పెరిగాయి. ఆకాశ్ ఆదాయం 40% పెరిగి రూ.1491 కోట్లకు, గ్రేట్‌లెర్నింగ్ ఆదాయం 80% వృద్ధితో రూ.628 కోట్లకు చేరింది. ఇదీ చదవండి: ఆగ్రహంతో రగిలిపోతున్న గూగుల్ ఉద్యోగులు.. కంపెనీకి చుక్కలు! బైజూస్ తన వాల్యుయేషన్‌ను తగ్గించడానికి సుముఖత చూపడంపై స్టార్టప్ కంపెనీలు భిన్నంగా స్పందిస్తున్నట్లు తెలిసింది. 2021-22లో 2.5 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేసిన ఈ స్టార్టప్ ప్రపంచవ్యాప్తంగా అర డజనుకు పైగా సంస్థలను కొనుగోలు చేసింది. ఒకానొక సందర్భంలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు సంస్థకు 50 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ వాల్యుయేషన్‌ను ఇచ్చినట్లు టెక్ క్రంచ్ గతంలో నివేదించింది. -
హైదరాబాద్ ఐటీ సంస్థ రామ్ ఇన్ఫో నిధుల సమీకరణ
హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఐటీ సంస్థ రామ్ ఇన్ఫో లిమిటెడ్ భారీ నిధుల సమీకరణ ప్రణాళిక చేపట్టింది. ప్రాధాన్యతా షేర్ల కేటాయింపు ద్వారా రూ.62 కోట్ల నిధుల సమీకరణ ప్రణాళికకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపిందని కంపెనీ తాజాగా ప్రకటించింది. సేకరించిన నిధులను కంపెనీ అభివృద్ధి, నాయకత్వ విస్తరణ, జాతీయ, అంతర్జాతీయ విస్తరణ కోసం ఉపయోగించాలని కంపెనీ భావిస్తోంది. టెక్నాలజీ, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఉన్న తమ అనుబంధ, జాయింట్ వెంచర్లలో భవిష్యత్తు పెట్టుబడి అవసరాలను తీర్చడం రామ్ ఇన్ఫో లిమిటెడ్ లక్ష్యంగా పెట్టుకుంది. "కంపెనీ ఆదాయం, స్థిరమైన వృద్ధిని మెరుగుపరచడానికి, సర్వీస్ పోర్ట్‌ఫోలియోను వైవిధ్యపరచడానికి, భౌగోళిక పరిధిని విస్తరించడానికి ఈ వ్యూహాత్మక చర్య ఉద్దేశించినది" అని రామ్ ఇన్ఫో మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనాథ్ రెడ్డి తెలిపారు. బలమైన ఆర్డర్లను, సర్వీస్ గ్రోత్‌ను పెంపొందించుకునేందుకు, తమ షేర్హోల్డర్లకు విలువను సృష్టించడానికి నిధుల సమీకరణ సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు. -
ఆకర్షణీయమైన డిపాజిట్ పథకాలను ఆవిష్కరించండి
న్యూఢిల్లీ: నిధుల సమీకరణకు బ్యాంకులు ఆకర్షణీయమైన, వినూత్న డిపాజిట్ పథకాలను ఆవిష్కరించాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వ రంగ బ్యాంకులకు సూచించారు. తద్వారా బ్యాంకులు తమ రుణ వృద్ధిని కూడా సాధించగలుగుతాయని అన్నారు. ప్రభుత్వ బ్యాంకుల ఎండీ, సీఈఓల సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మోసం, ఉద్దేశపూర్వక డిఫాల్ట్‌లకు సహకరించే అధికారులపై కఠిన పరిపాలనా పరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించారు. బ్యాంకింగ్ డిపాజిట్ వృద్ధి గత కొన్ని నెలలుగా క్రెడిట్ వృద్ధికి అనుగుణంగా లేదు. కొన్ని బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచినప్పటికీ క్రెడిట్– డిపాజిట్ వృద్ధి మధ్య అంతరం ఇప్పటికీ 3 నుంచి 4 శాతంగా ఉంది. ఇటీవల ఎస్బీఐ (అరశాతం), బ్యాంక్ ఆఫ్ బరోడా (125 బేసిస్ పాయిట్ల వరకూ) తమ డిపాజిట్ రేట్లను పెంచాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల మెరుగైన పనితీరు పట్ల ఆర్థికమంత్రి ఈ సమావేశంలో సంతృప్తిని వ్యక్తం చేశారు. బ్యాంకు మోసాలు వ్యక్తిగత ఖాతాదారులకు ఆర్థిక సంస్థల భద్రతకు తీవ్రమైన ముప్పును కలిగిస్తాయని, ఇది ఆర్థిక నష్టాలకు దారితీస్తుందని ఆమె పేర్కొన్నారు. అలాగే బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం తగ్గుతుందనీ ఆమె హెచ్చరించారు. అందువల్ల ఆయా పరిణామాలు తలెత్తకుండా బ్యాంకింగ్ తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ బ్యాంకులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో దాదాపు రూ. 68,500 కోట్ల నికర లాభాన్ని ఆర్జించాయి. వాణిజ్య బ్యాంకుల స్ధూల మొండిబకాయిల నిష్పత్తి 2023 మార్చి నాటికి 3.9 శాతం ఉంటే, సెపె్టంబర్ నాటికి 3.2 శాతానికి తగ్గాయి. ఈ సమావేశంలో నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్‌ఎఆర్‌సిఎల్) ఖాతాల సేకరణ పురోగతిపై కూడా చర్చ జరిగింది. -
ఐపీవోలకు కంపెనీల క్యూ..
ఇటీవల సెకండరీ మార్కెట్లు ఆకాశమే హద్దుగా చెలరేగుతూ సరికొత్త గరిష్టాలను తాకుతున్నాయి. పెట్టుబడుల ప్రోత్సాహంతో ప్రైమరీ మార్కెట్ సైతం కళకళలాడుతోంది. ఈ ప్రభావంతో కొత్త ఏడాది (2024)లోనూ పలు కంపెనీలు నిధుల సమీకరణకు క్యూ కట్టనున్నట్లు స్టాక్ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో పబ్లిక్ ఇష్యూల వెల్లువ కొనసాగనున్నట్లు అంచనా వేశారు. న్యూఢిల్లీ: ప్రస్తుత ఏడాది (2023)లో ఇప్పటివరకూ పబ్లిక్ ఇష్యూల ద్వారా కంపెనీలు రూ. 52,000 కోట్లు సమకూర్చుకున్నాయి. ప్రధాన ఎక్సే్చంజీలైన బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్టింగ్ ద్వారా దేశీ కార్పొరేట్లు సమీకరించిన నిధులివి. నిజానికి ఓవైపు వడ్డీ రేట్లు, మరోపక్క భౌగోళిక, రాజకీయ రిసు్కలు పెరిగినప్పటికీ.. ఐపీవోలు దూకుడు చూపుతున్నాయి. పలు కంపెనీలు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్ కోసం వెల్లువలా సెబీ తలుపు తడుతున్నాయి. దీంతో వచ్చే ఏడాదిలోనూ ప్రైమరీ మార్కెట్ బుల్లిష్ ధోరణిలోనే కొనసాగనున్నట్లు పలువురు స్టాక్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. గతేడాది (2022)లో ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీని మినహాయిస్తే పబ్లిక్ ఇష్యూల ద్వారా కంపెనీలు రూ. 20,557 కోట్లు సమీకరించాయి. అంటే దీంతో పోలిస్తే ఈ ఏడాది 36 శాతం అధికంగా పెట్టుబడులు అందుకున్నాయి. ప్రధానంగా మధ్య, చిన్న తరహా కంపెనీలు హవా చూపాయి. మార్కెట్ సెంటిమెంటు బలంగా ఉండటం ఇందుకు దోహదపడుతోంది. అయితే ప్రపంచ సవాళ్ల నేపథ్యంలో ఏడాది మొదట్లో మార్కెట్లు డీలా పడిన సంగతి తెలిసిందే. కారణాలున్నాయ్.. ప్రైమరీ మార్కెట్లు జోరందుకోవడానికి లిస్టింగ్ లాభాలు, అందుబాటు ధరల్లో డీల్స్ కారణమవుతున్నట్లు పంటోమత్ క్యాపిటల్ అడ్వయిజర్స్ ఎండీ మహావీర్ లూనావత్ పేర్కొన్నారు. ఆయా రంగాల్లోని లిస్టెడ్ కంపెనీలు అధిక విలువల్లో ట్రేడవుతుండటం ఇందుకు జత కలసినట్లు అభిప్రాయపడ్డారు. పటిష్ట నియంత్రణా వ్యవస్థలు సైతం ఇందుకు అండగా నిలుస్తున్నట్లు తెలియజేశారు. 2023లో కనిపిస్తున్న ప్రోత్సాహకర పరిస్థితులు 2024లోనూ కొనసాగనున్నట్లు ఆనంద్ రాఠీ అడ్వయిజర్స్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఈసీఎం వి.ప్రశాంత్ రావు అంచనా వేశారు. ఇది బంగారు కాలంగా నిలిచే వీలున్నట్లు పేర్కొన్నారు. తరలివస్తున్న దేశ, విదేశీ పెట్టుబడులు, దేశీ మార్కెట్ల వృద్ధికిగల భారీ అవకాశాల కారణంగా వచ్చే ఏడాదిలోనూ ఐపీవో మార్కెట్ మరింత జోరు చూపనున్నట్లు జేఎం ఫైనాన్షియల్ ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్స్ హెడ్ నేహా అగర్వాల్ అభిప్రాయపడ్డారు. సార్వత్రిక ఎన్నికల పూర్తి తదితర అనిశి్చతులు తొలగితే మరిన్ని పెట్టుబడులు తరలివస్తాయని పేర్కొన్నారు. మరో రూ. 26,000 కోట్లు నిధుల సమీకరణకు ఇప్పటికే క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి 24 కంపెనీలు అనుమతులు పొందాయి. ఇవి ఐపీవోలు చేపట్టడం ద్వారా రూ. 26,000 కోట్లు సమీకరించేందుకు వీలుంది. ఈ బాటలో మరో 32 కంపెనీలు లిస్టింగ్‌కు వీలుగా సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. వీటి నిధుల సమీకరణ అంచనా రూ. 35,000 కోట్లుగా ప్రైమ్ డేటాబేస్ పేర్కొంది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం 2023లో ఐపీవోల ద్వారా 58 కంపెనీలు రూ. 52,637 కోట్లు సమకూర్చుకున్నాయి. వీటిలో రూ. 3,200 కోట్లు అందుకున్న నెక్సస్ సెలక్ట్ ట్రస్ట్ రీట్ ఉంది. గతేడాది ఎల్ఐసీ (రూ. 20,557 కోట్లు) సహా.. 40 కంపెనీలు ఉమ్మడిగా రూ. 59,302 కోట్లు సమీకరించాయి. అయితే అంతకుముందు 2021లో 63 కంపెనీలు ప్రైమరీ మార్కెట్ ద్వారా ఏకంగా రూ. 1.2 లక్షల కోట్లను అందుకున్నాయి. వెరసి రెండు దశాబ్దాలలోనే అత్యధిక నిధుల సమీకరణగా 2021 నిలిచింది! అధిక లిక్విడిటీ, ఇన్వెస్టర్ల ఆసక్తి, మార్కెట్ల జోరు నేపథ్యంలో గత మూడేళ్లలో 150 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి. -
ఉడాన్ నిధుల సమీకరణ
న్యూఢిల్లీ: బీటూబీ ఈకామర్స్ సంస్థ(ప్లాట్‌ఫామ్) ఉడాన్ తాజాగా 34 కోట్ల డాలర్లు(సుమారు రూ. 2,822 కోట్లు) సమీకరించింది. సిరీస్–ఈ ఫండింగ్‌లో భాగంగా ఎంఅండ్‌జీ పీఎల్సీ అధ్యక్షతన పలు పీఈ సంస్థలు పెట్టుబడులను సమకూర్చాయి. కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన లైట్‌స్పీడ్ వెంచర్ పార్ట్నర్స్, డీఎస్టీ గ్లోబల్ సైతం నిధులు సమకూర్చాయి. బిజినెస్ నిర్వహణకు అవసరమైన పూర్తిస్థాయి పెట్టుబడులను సమకూర్చుకోవడంతో రానున్న 12–18 నెలల్లో లాభాల్లోకి ప్రవేశించే లక్ష్యంతో సాగుతున్నట్లు ఈ సందర్భంగా ఉడాన్ తెలియజేసింది. ప్రస్తుత రుణాలను ఈక్విటీగా మార్పు చేయడంతోపాటు.. తాజా ఈక్విటీ జారీ ద్వారా నిధుల సమీకరణ చేపట్టినట్లు వెల్లడించింది. వెరసి బ్యాలన్స్‌షీట్ పటిష్టంకానున్నట్లు పేర్కొంది. కస్టమర్ సేవలు, మార్కెట్ విస్తరణ, వెండార్ భాగస్వామ్యాలు, సరఫరా చైన్, క్రెడిట్ తదితరాలపై నిధులను వెచ్చించనున్నట్లు వివరించింది. -
నిధుల కొరత, వ్యూహాత్మక భాగస్వాముల వేటలో ‘కూ’
న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ కూ తదుపరి దశ వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా నిధులు సమీకరించడం లేదా వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకునే యోచనలో ఉంది. సంస్థ సహ వ్యవస్థాపకుడు మయాంక్ బిదావత్కా ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుతం పెట్టుబడుల రాక మందగించిన నేపథ్యంలో ’కూ’ ప్లాట్‌ఫామ్ విస్తృతంగా వృద్ధి చెందేందుకు తోడ్పాటు అందించగలిగే భాగస్వామితో చేతులు కలపాలని భావిస్తున్నట్లు ఆయన వివరించారు. (మోదీజీ..వచ్చే ఏడాదికి గొప్ప బర్త్‌డే గిఫ్ట్: ఫాక్స్‌కాన్ పోస్ట్ వైరల్) స్టార్టప్ వ్యవస్థకు 2023 అత్యంత కష్టతరమైన సంవత్సరాల్లో ఒకటని మయాంక్ చెప్పారు. నిధుల ప్రవాహం ఒక్కసారిగా నిల్చిపోయిందని, దాదాపు బ్రేక్ఈవెన్కి దగ్గర్లో ఉన్నవి లేదా ప్రారంభ దశలోని స్టార్టప్‌లకు మాత్రమే నిధులు లభించాయని తెలిపారు. మరో ఆరు నెలలు సమయం లభించి ఉంటే తాము దేశీయంగా ట్విటర్‌ను (ప్రస్తుతం ఎక్స్) అధిగమించి ఉండేవారమని, కానీ పరిస్థితుల వల్ల ప్రణాళికలను మార్చుకోవాల్సి వచ్చిందన్నారు. (గణేష్ చతుర్థి: ఈ మూడు రోజులు సెలవులేనా? ఇవిగో వివరాలు) -
చిన్నారుల ముఖాల్లో చిరునవ్వు కోసం రోటరీ క్లబ్.. మోటార్ ఫెస్ట్..
మంచి పని కోసం క్రీడలను నిర్వహించడం.. ఇదీ రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ తలపెట్టిన కార్యక్రమం. హృదయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు పూయించే దిశగా ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ తొలిసారిగా ఇండియన్ నేషనల్ ఆటోక్రాస్ ఛాంపియన్షిప్ 2023 ను నిర్వహించింది. దీని ద్వారా పుట్టుకతో వచ్చే గుండె జబ్బులతో బాధపడుతున్న పిల్లలకు సిద్దిపేట పట్టణంలోని శ్రీ సత్యసాయి ఆసుపత్రిలో గుండె శస్త్రచికిత్సల కోసం ఆపరేషన్ థియేటర్ కోసం ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నగరంలోని బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ కోర్స్‌లోని కస్టమ్-బిల్ట్ రేస్ ట్రాక్‌లో ఈ మోటార్ ఫెస్ట్ నిర్వహించింది. ఈ రేసులో ఎంతో మంది టాప్ రేసర్లు పాల్గొని వారి నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ ఈవెంట్ ద్వారా వచ్చిన నిధులను రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే చిన్నారుల ఆపరేషన్ నిమిత్తం థియేటర్ నిర్మాణానికి ఉపయోగించనుంది. సిద్ధిపేట పట్టణంలోని శ్రీ సత్య సాయి ఆస్పత్రిలో ఈనిర్మాణం చేపడతారు. దీనికి దాదాపు 7.5 కోట్ల భారీ మొత్తం ఖర్చవుతుందని అంచనా. గుండె వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపే క్రమంలో నిర్వహిస్తున్న ఈ కార్ రేసింగ్ ఈవెంట్ విజయవంతం చేసింది రోటరీ క్లబ్. -
అదానీ నిధుల సమీకరణ బాట రూ. 21,000 కోట్లపై కన్ను
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ నిధుల సమీకరణపై కన్నేసింది. గ్రూప్‌లోని రెండు కంపెనీలలో వాటాల విక్రయం ద్వారా 2.5 బిలియన్ డాలర్లు(రూ. 21,000 కోట్లు) సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. గ్రూప్‌లోని ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ రూ. 12,500 కోట్లు, అదానీ ట్రాన్స్మిషన్ రూ. 8,500 కోట్లు చొప్పున సమీకరించ నున్నట్లు స్టాక్ ఎక్స్ఛేజీలకు సమాచారమిచ్చాయి. ఈ బాటలో అదానీ గ్రీన్ ఎనర్జీ సైతం శనివారం బోర్డు సమావేశాన్ని నిర్వహించ తలపెట్టినప్పటికీ ఈ నెల 24కు వాయిదా పడింది. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల విక్రయాన్ని చేపట్టనుంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం మధ్యప్రాచ్యం, యూరప్ నుంచి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. (కేంద్రం గుడ్ న్యూస్: మొబైల్ పోతే..మే 17 నుంచి కొత్త విధానం) అదానీ గ్రూప్‌నకు వ్యతిరేకంగా యూఎస్ షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ నివేదిక వెలువరించడంతో అదానీ ఎంటర్ప్రైజెస్ చేపట్టిన రూ. 20,000 కోట్ల ఎఫ్‌పీవోను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇష్యూ పూర్తిగా సబ్స్క్రయిబ్ అయినప్పటికీ కంపెనీ ఇన్వెస్టర్లకు సొమ్మును వాపసు చేసింది. ఇది జరిగిన మూడు నెలల తదుపరి తిరిగి గ్రూప్ కంపెనీలు వాటా విక్రయం ద్వారా నిధుల సమీకరణకు తెరతీయడం గమనార్హం! (స్వీట్ కపుల్ సక్సెస్ స్టోరీ: తొలి ఏడాదిలోనే రూ.38 కోట్లు) -
ఫోన్‌పే దూకుడు.. కొత్త వ్యాపారాలకు నిధుల సమీకరణ
వాల్‌మార్ట్ యాజమాన్యంలోని భారతీయ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే (PhonePe) దూకుడు పెంచింది. వ్యాపార విస్తరణ కోసం నిధుల సమీకరణ చేపట్టిన ఫిన్‌టెక్ కంపెనీ అందులో భాగంగా తాజాగా మరో 100 మిలియన్ డాలర్లను (సుమారు రూ.820 కోట్లు) సమీకరించింది. (గూగుల్ చీకటి ‘గేమ్’! రూ.260 కోట్ల భారీ జరిమానా..) 12 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ ఉన్న ఫోన్‌పే వ్యాపార విస్తరణలో భాగంగా 1 బిలియన్ డాలర్లను విడతలవారీగా సమీకరించినట్లు గత జనవరిలో ప్రకటించింది. అప్పటి నుంచి ఈ ఫిన్‌టెక్ కంపెనీ జనరల్ అట్లాంటిక్ నుంచి 350 మిలియన్ డాలర్లు, టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్, రిబ్బిట్ క్యాపిటల్, టీవీఎస్ క్యాపిటల్ నుంచి 100 మిలియన్ డాలర్లు, వాల్‌మార్ట్ నుంచి 200 మిలియన్ డాలర్లు సమీకరించింది. (ఆండ్రాయిడ్ యూజర్లకు కొత్త ఫీచర్.. స్టోరేజ్ సమస్యకు పరిష్కారం) భారతదేశంలో తమ చెల్లింపులు, బీమా వ్యాపారాలను విస్తరించడంతో పాటు బ్యాంకింగ్, స్టాక్‌బ్రోకింగ్, ఓఎన్డీసీ ( ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్) ఆధారిత షాపింగ్ వంటి కొత్త వ్యాపారాలను ప్రారంభించేందుకు సమీకరించిన నిధులను వినియోగించనున్నట్లు ఫోన్‌పే గత ప్రకటనల్లో పేర్కొంది. ఈ నెల ప్రారంభంలోనే ‘పిన్‌కోడ్’ అనే ఓఎన్డీసీ ఆధారిత ఈ-కామర్స్ వ్యాపారాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
యాక్సిస్ కొత్త ఈటీఎఫ్ ఫండ్... రూ. 50 కోట్లు సమీకరణకు టార్గెట్
ముంబై: దేశీయంగా ఏడో పెద్ద ఫండ్ హౌస్ యాక్సిస్ ఎంఎఫ్ కొత్త ఫండ్ ఆఫర్(ఎన్ఎఫ్వో)కు తెరతీస్తోంది. ఈ నెల 22న ఫండ్ ప్రారంభమైన ఫండ్, ఏప్రిల్ 5న ముగియనుంది. ఈ ఎన్ఎఫ్వో(ఓపెన్ ఎండెడ్ ఎస్అండ్పీ 500 ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్) ద్వారా కనీసం రూ. 50 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఇదీ చదవండి: మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లు: డెడ్‌లైన్ ముగియకముందే మేల్కొండి! ఈ నిధులను ఎస్అండ్పీ 500 ఇండెక్స్‌ను ప్రతిబింబించే ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్‌లు)లో ఇన్వెస్ట్ చేయనుంది. ఫండ్‌ను వినాయక్ జయంత్ నిర్వహించనున్నారు. అలాట్మెంట్ తేదీ నుంచి 30 రోజుల్లోగా రిడీమ్ లేదా స్విచ్డ్ ఔట్ అయితే 0.25 శాతం ఎగ్జిట్ లోడ్ విధిస్తారు. ఇదీ చదవండి: Job search: ఇది మామూలు దండయాత్ర కాదు! 150కిపైగా కంపెనీలకు అప్లై చేశాడు.. మొత్తానికి... అలాట్మెంట్ అయ్యాక 30 రోజుల్లోగా రిడీమ్ లేదా స్విచ్డ్ ఔట్ అయితే ఎలాంటి ఎగ్జిట్ లోడ్ అమలుకాదని ఫండ్ హౌస్ చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ రాఘవ్ అయ్యంగర్ పేర్కొన్నారు. వివిధ రకాల ఆస్తులలో పెట్టుబడులు చేపట్టే ఇతర రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ మాదిరికాకుండా ఈ ఫండ్ సొంత పథకాలు లేదా ఇతర ఫండ్ హౌస్ పథకాలలో ఇన్వెస్ట్ చేయనుంది. ఆఫ్‌షోర్ మ్యూచువల్ ఫండ్స్‌లో అయితే యూనిట్లలో ఇన్వెస్ట్ చేస్తుంది. ఇదీ చదవండి: పీఎఫ్‌ను ముందస్తుగా వెనక్కి తీసుకోవచ్చా? -
రుణ రేట్లను పెంచిన ఎస్బీఐ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నిధుల సమీకరణ ఆధారిత రుణ రేటును (ఎంసీఎల్ఆర్)ను పెంచింది. రెండు ప్రైవేటు రంగ దిగ్గజ బ్యాంకులు– కోటక్ మహీంద్రా బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్‌లు కూడా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. దీనితో ఎంసీఎల్ఆర్కు అనుసంధానమైన ఆయా బ్యాంకుల వ్యక్తిగత, గృహ, ఆటో రుణాలు మరింత ప్రియం కానున్నాయి. ఆర్బీఐ రెపో రేటు (మే నుంచి 1.9 శాతం పెంపుతో 5.9 శాతానికి అప్) పెంపు బాట పట్టిన నేపథ్యంలో పలు బ్యాంకులు తమ రుణ రేట్లను పెంచుతున్న సంగతి తెలిసిందే. ఎస్బీఐ, కోటక్, ఫెడరల్ బ్యాంక్ రేట్ల పెంపు వివరాలు ఇలా.. ► ఎస్బీఐ బెంచ్‌మార్క్ ఏడాది కాలపరిమితి ఎంసీఎల్ఆర్ 25 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెరిగి 7.95 శాతానికి చేరింది. ఈ రేటు అక్టోబర్ 15 నుంచీ అమల్లోకి వస్తుంది. మెజారీటీ కస్టమర్ల రుణ రేటు ఏడాది రేటుకే అనుసంధానమై ఉంటుంది. రెండు, మూడు సంవత్సరాల కాలపరిమితుల ఎంసీఎల్ఆర్ పావుశాతం చొప్పున పెరిగి వరుసగా 8.15 శాతం, 8.25 శాతానికి ఎగసింది. ఓవర్‌నైట్, నెల, మూడు, ఆరు నెలల రేట్లు 7.60–7.90 శాతం శ్రేణిలో ఉన్నాయి. ► కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎంసీఎల్ఆర్ వివిధ కాలపరిమితులపై 7.70–8.95 శ్రేణిలో ఉంది. ఏడాది ఎంసీఎల్ఆర్ 8.75 శాతం. అక్టోబర్ 16 నుంచి తాజా నిర్ణయం అమలవుతుంది. ► ఫెడరల్ బ్యాంక్ ఏడాది రుణ రేటు అక్టోబర్ 16 నుంచి 8.70 శాతానికి పెరిగింది. ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్ రేటు కోత కాగా, ఎస్బీఐ సేవింగ్స్ డిపాజిట్ రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనితో ఈ రేటు 2.70 శాతానికి దిగివచ్చింది. అక్టోబర్ 15 నుంచి తాజా రేటు అమల్లోకి వస్తుంది. రూ.10 కోట్ల కన్నా తక్కువ బ్యాలెన్స్ ఉన్నవారికి తాజా రేటు అమలవుతుంది. కాగా, రూ.10 కోట్లు దాటిన సేవింగ్స్ అకౌంట్స్‌పై వడ్డీరేటును 2.75 శాతం నుంచి 3 శాతానికి పెంచుతున్నట్లు ఎస్బీఐ ప్రకటన పేర్కొంది. నిధుల భారీ సమీకరణ లక్ష్యంగా వివిధ బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచుతున్న నేపథ్యంలో ఎస్బీఐ చేసిన ఈ సర్దుబాట్లకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఎఫ్సీఎన్ఆర్ డిపాజిట్లపై బీఓబీ రేట్ల పెంపు కాగా, ప్రవాస భారతీయుల ఫారిన్ కరెన్సీ (ఎఫ్సీఎన్ఆర్) డిపాజిట్లపై బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) వడ్డీరేట్లు పెంచింది. వివిధ కరెన్సీలు, మెచ్యూరిటీ కాలపరిమితులపై 135 బేసిస్ పాయింట్ల వరకూ వడ్డీరేటు పెరిగినట్లు బీఓబీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 16 నుంచి నవంబర్ 15 వరకూ తాజా రేట్లు అమలవుతాయని కూడా వివరించింది. -
యూనికార్న్ హోదాకు సర్విఫై!
ముంబై: వివిధ స్మార్ట్‌ఫోన్ వెండార్ ప్రొడక్టుల(డివైస్‌లు) లైఫ్‌సైకిల్‌ను నిర్వహించే సర్విఫై తాజాగా 6.5 కోట్ల డాలర్లు(రూ. 520 కోట్లు) సమీకరించింది. సింగులారిటీ గ్రోత్ అపార్చునిటీ ఫండ్ అధ్యక్షతన పలు సంస్థలు నిధులు అందించినట్లు సర్విఫై వెల్లడించింది. తాజా పెట్టుబడులతో కంపెనీ విలువ దాదాపు బిలియన్ డాలర్లకు చేరినట్లు సర్విఫై వ్యవస్థాపకుడు శ్రీవాస్తవ ప్రభాకర్ పేర్కొన్నారు. శామ్సంగ్, ఆపిల్ తదితర గ్లోబల్ బ్రాండ్లకు సర్వీసులందించే సంస్థ రానున్న 18-24 నెలల్లో పబ్లిక్ ఇష్యూ చేపట్టే లక్ష్యంతో ఉన్నట్లు శ్రీవాస్తవ తెలియజేశారు. ఐరన్ పిల్లర్, బీనెక్ట్స్, బ్లూమ్ వెంచర్స్, డీఎంఐ స్పార్కిల్ ఫండ్ తదితరాలు పెట్టుబడులు సమకూర్చినట్లు వెల్లడించారు. వచ్చే నెలలో మరోసారి 7 కోట్ల డాలర్లవరకూ నిధులను సమీకరించే వీలున్నట్లు తెలియజేశారు. -
నా బంగారాన్ని బతికించండి!
కేన్సర్‌ను, దాని చికిత్సను తట్టుకోవడం పెద్దవాళ్లకే చాలా కష్టం. అలాంటిది నాలుగేళ్ల వయసులోనే ప్రాణాంతక కేన్సర్‌బారిన పడితే ఊహించడమే కష్టం. థెరపీలు, ఇంజక్షన్లతో చిన్నారుల బాధను చూడలేక తల్లిదండ్రులు నరకం అనుభవిస్తారు. దీనికి తోడు వైద్య ఖర్చులు కలలో కూడా ఊహించనంతభారంగా మారితే...అటు డబ్బు సమకూర్చుకోలేక, ఇటు రోజు రోజుకూ మృత్యువుకు చేరువవుతున్న బిడ్డను చూడలేక వారి బాధ వర్ణించలేం. బిడ్డను ఎలాగైనా బతికించుకోవాలనే తపన వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. సరిగ్గా మనస్వి తల్లిదండ్రులు కూడా ఇదే మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. నాలుగేళ్ల పాప మనస్వికి న్యూరోబ్లాస్టోమా కేన్సర్ సోకింది. ప్రాణాంతకమైన న్యూరోబ్లాస్టోమాతో ఇబ్బంది పడుతున్న కుమార్తెను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు మనస్వి తల్లిదండ్రులు. సెలూన్లో పనిచేసే పాప తండ్రి సంపాదన రోజుకు కేవలం 400 మాత్రమే. దీంతో వైద్యానికి అవసరమైన మొత్తాన్ని సమకూర్చు కోవడం కష్టంగా మారింది. అయినా చేయాల్సిందంతా చేశారు. ఇప్పటికే పాప వైద్య కోసం ఉన్నదంతా ఖర్చు పెట్టేశారు. స్తోమతకు మించి ఆస్తులు అమ్మి, అప్పులు చేసి,ప్రతీ చివరి పైసా చికిత్సకు ఖర్చు చేశారు. మరోవైపు మనస్వికి సోకిన కేన్సర్ ముదురుతోంది. తక్షణమే మెరుగైన వైద్యం అందించకపోతే పాప ప్రాణాలకే ముప్పు అందుకే దయచేసి విరాళాలందించమని వేడుకుంటున్నారు. మనస్వికి బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ అవసరమని వైద్యులు స్పష్టం చేశారు. ఇందుకోసం అయ్యే ఖర్చు రూ. 20 లక్షలు ($ 25769.54)గా అంచనా వేశారు. ‘‘మా తొలిచూలు బిడ్డ మనస్వి . పాపే మా ప్రపంచం.పాపే మాకు ప్రాణం. ముద్దుల మూటగట్టే ఆమె చిరునవ్వులు చూసి మురిసిపోయాం. కానీ విధి ఇంత క్రూరంగా ఉంటుందని ఊహించలేదు. గుండెలు బద్దలయ్యే వార్త తెలిసింది. నాలుగేళ్ల పసిప్రాయంలోనే మనస్వికి ప్రాణాంతకమైన న్యూరోబ్లాస్టోమా సోకింది. చికిత్సకు తట్టుకోలేక చిరునవ్వుకు దూరమై, పాప కష్టాన్ని చూడలేకపోతున్నాం. ఈ బాధ తట్టుకోలేకపోతున్నాం. దయచేసి మాకు సహాయం చేయండి’’ అని మనస్వి తల్లిదండ్రులు కన్నీటితో వేడుకుంటున్నారు మీ మద్దతే మాకు రక్ష. దయచేసి విరాళం అందించండి! ఈ కష్టం నుంచి మా కుటుంబాన్ని గట్టెక్కించండి!! అని ప్రార్థిస్తున్నారు.(అడ్వెర్టోరియల్) మీవంతు సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
నా బిడ్డను కాపాడండి: దాతలూ ఆదుకోండి ప్లీజ్!
రోడ్డు ప్రమాదం ఒక కుటుంబాన్ని అతలాకుతలం చేస్తుంది. అందులోనూ కుటుంబానికి ఆసరాగా ఉన్న వ్యక్తికి అకస్మాత్తుగా ఏమైనా జరిగితే వారి జీవితం అంధకారంలోకి కూరుకు పోతుంది. తన ప్రాణానికి ప్రాణం, కుటుంబానికి పెద్దదిక్కైన 28 ఏళ్ల కొడుకు రాహుల్ పనినుంచి తిరిగి వస్తాడని ఎదురుచూస్తూన్న తల్లికి అతనికి ప్రమాదం జరిగిందని తెలిస్తే గుండె పగిలి పోదూ! సరిగ్గా నిర్మల జీవితంలోనూ ఇదే జరిగింది. కొడుకు వస్తాడనే సంబురంతో రాత్రి భోజనానికి సిద్ధమవుతుండగా కుమారుడి స్నేహితుడి ఫోన్‌కాల్ పిడుగులా మారింది. రాహుల్ బైక్‌ను లారీ ఢీకొట్టిందనీ, తీవ్రంగా గాయపడిన రాహుల్‌ని ఆసుపత్రికి తరలించారని అతని స్నేహితుడు ఫోన్ చేసి సమాచారం అందించాడు. ఈ వార్త వినేసరికి కుప్పకూలిపోయింది నిర్మల. వెంటనే ఆసుపత్రికి పరిగెత్తింది. అక్కడ రాహుల్ జాడ కనిపించలేదు. దీంతో బిడ్డ ఏమై పోయాడో అన్న భయంతో గుండె వేగం మరింత పెరిగింది. అయితే దెబ్బలు బాగా తగలడంతో మరో ఆసుపత్రికి తరలించినట్లు నర్సు చెప్పడంతో కాస్త ఊరట పడింది. దెబ్బలు తగిలినా పరవాలేదు. బిడ్డ ప్రాణాలతో ఉంటే చాలు ఎలాగైనా కాపాడుకుంటా అంటూ ఆ తల్లి మనసు ఆరాట పడింది. ఆందోళనతో ఆ ఆసుపత్రి కెళ్లేసరికి అత్యవసర శస్త్రచికిత్స చేయడానికి వైద్యులు తీసుకెళ్లారని తెలిసింది. దీంతో సాయం చేసిన వారందరికీ కన్నీళ్లతోనే ధన్యవాదాలు తెలుపుకొని, నా బిడ్డను ఎలాగైనా కాపాడు తండ్రీ అంటూ వేయి దేవుళ్లకు మొక్కుకుంది. మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి రాహుల్‌ని కళ్లారా చూసేందుకు ఆరాటపడుతూ థియేటర్ బయట కూర్చొని ఎదురు చూస్తోంది. రాహుల్ చిన్నతనంలోనే తండ్రి కంటి చూపుకోల్పోయాడు. అప్పటినుంచి అన్నీ తానే అయ్యా కుటుంబ పోషణ బాధ్యత తీసుకున్నాడు. పగలూ రాత్రి కష్టపడి కూలిపని చేస్తూ, తల్లి దండ్రులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న కొడుకు జ్ఞాపకాల్లో మునిగిపోయింది నిర్మల. ఇంతలో థియేటర్ నుంచి బైటికి వచ్చి వైద్యులు చెప్పిన మాట విని నిర్మలమ్మ కాళ్ల కింద భూమి కంపించిపోయింది. ‘‘రాహుల్‌కి అన్నిపరీక్షలు చేశాం అతని మెదడులో తీవ్రమైన ఇంటర్నల్ బ్లీడింగ్‌ను గుర్తించాం. మెదడులోని రక్తస్రావాన్ని ఆపి, అతడి ప్రాణాల్ని రక్షించేందుకు అత్యవసరంగా అతనికి పుర్రెలో ఒక భాగానికి శస్త్రచికిత్స చేశాం. కానీ శరీరంలో ఎడమ భాగం పక్షవాతానికి గురైంది. అయినా ఈ గండంనుంచి రాహుల్ గట్టెక్కాలంటే మరిన్ని ఆపరేషన్లు చేయాలి. సుమారు 10-15 రోజుల ఆసుపత్రిలో ఉండాల్సి ఉంటుంది. ఈ చికిత్సకు మొత్తం ఖర్చు రూ. 7 లక్షలు ($ 8878.46) అవుతుంది’’ ఇదీ డాక్టర్లు చెప్పిన మాట. చెట్టంత ఎదిగిన కొడుకు అచేతనంగా పడిపోవడంతో, బిడ్డను బతికించుకోవడానికి అవసరమైన డబ్బు లేక ఆ నిరుపేద కుటుంబం అల్లాడిపోతోంది. మరోవైపు ప్రమాదానికి ముందు, తరువాత సంగతులు కొడుకు మర్చిపోతాడేమోననే భయం నిర్మలను ఆవరించాయి. అయినా తన కొడుకును దక్కించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. దయగల దాతలు స్పందించి దయచేసి నా బిడ్డను రక్షించండి! అని నిర్మల దీనంగా వేడుకుంటోంది. సరిగ్గా కదలలేక, తిండిలేక, నిద్రలేక అల్లాడిపోతున్న కొడుకును ఈ స్థితిలో చూడలేపోతున్నాను. మా దగ్గర ఉన్నదంతా ఖర్చు పెట్టేశాం అంటూ రాహుల్ ఆపరేషన్ ఖర్చులకు అవసరమైన సొమ్మును సమకూర్చాల్సిందిగా దాతలను కోరుతున్నారు ఆ నిర్మలమ్మ దంపతులు. రాహుల్ ప్రాణం కాపాడేందుకు మీ వంతు సాయం అందించండి! దానం చేయండి!! (అడ్వర్టోరియల్) మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
కెనరా బ్యాంక్ వడ్డీరేటు పెంపు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ తన నిధుల సమీకరణ వ్యయ ఆధారిత వడ్డీరేటు (ఎంసీఎల్ఆర్)ను 10 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. గురువారం నుంచి తాజా రేట్లు అమల్లోకి వస్తాయని తెలిపింది. ఆటో, వ్యక్తిగత, గృహ రుణాలకు ప్రాతిపదిక అయిన ఏడాది ఎంసీఎల్ఆర్ 7.50 శాతానికి పెరిగింది. ఓవర్‌నైట్ నుంచి ఆరు నెలల కాలాలకు సంబంధించి కొత్త రేట్లు 6.75 శాతం నుంచి 7.45 శాతం శ్రేణిలో ఉన్నాయి. రెపో ఆధారిత రుణ రేటును 7.30 శాతం నుంచి 7.80 శాతానికి పెంచుతున్నట్లు కూడా బ్యాంక్ ప్రకటించింది. -
నా కొడుకు ప్రాణాలు దక్కాలంటే..
పిల్లాడికి పాలు పట్టడం కష్టంగా మారుతోంది సంగీతకు. ఎందుకుంటే ఆమె పొత్తిళ్లలో ఉన్న నాలుగు నెలల రిహాన్‌కు పుట్టుకతోనే గ్రహనమొర్రి ఉంది. దీంతో చనుబాలు తాగడం కష్టమయ్యేది. ఆకలితో గుక్కపట్టి ఏడ్చేవాడు. కానీ ఇటీవల మరో సమస్య వచ్చి పడింది. ఉన్నట్టుండి రిహాన్ ఆరోగ్యం మరింతగా చెడిపోవడం మొదలైంది. పొట్ట ఉబ్బిపోయింది. కళ్లు ఆకుపచ్చ రంగులోకి మారాయి. వెంటనే ఆలస్యం చేయకుండా రిహాన్ను ఆస్పత్రికి తీసుకుళ్లారు సంగీతా, సుబ్రదీప్లు. రిహాన్‌కు అన్ని పరీక్షలు చేసిన డాక్టర్లు చివరకు ప్రొగ్రసివ్ ఫ్యామిలియల్ ఇంట్రాహెపాటిక్ కొలెస్టాసిట్ (లివర్ వ్యాధి) ఉన్నట్టుగా తేల్చారు. అప్పటికే వ్యాధి ముదిరిపోవడంతో ఆ పసివాడి లివర్ పూర్తిగా చెడిపోయిందని చెప్పారు. అర్జంటుగా లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయకుంటే పసివాడి ప్రాణాలకే ప్రమాదమని చెప్పారు. దీని కోసం అదనపు పరీక్షలు చేయగా సంగీత లివర్ మ్యాచ్ అయ్యింది. అయితే ఆపరేషన్‌కు రూ.20 లక్షల వరకు ఖర్చు వస్తుందని చెప్పారు. రిహాన్ తల్లిదండ్రులైన సంగీత, సబ్రదీప్ ఇద్దరు వికలాంగులే. సుబ్రదీప్కు వినికిడి సమస్య ఉండగా సంగీతకు రెండు కాళ్లు సమానంగా లేవు. దీంతో అను నిత్యం వాళ్లు అనేక ఇబ్బందుల మధ్య జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. వారి జీవితాల్లో ఉన్న ఏకైక ఆశా కిరణం, వారి ముద్దుల బిడ్డ రిహాన్. కానీ ఇప్పుడు రిహాన్ భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడింది. మీవంతు సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి రోజులు గడిచే కొద్ది రిహాన్ మృత్యువుకు చేరువ అవుతున్నాడని డాక్టర్లు చెబుతున్నారు. మరోవైపు దాతగా లివర్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా ఆపరేషన్‌కి అవసరమైన సొమ్ము సమకూర్చుకోవడం ఆ దంపతులకు అసాధ్యంగా మారింది. దీంతో తమ కొడుక్కి జరిగే లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్ ఖర్చులకు అవసరమైన సొమ్మును సమకూర్చాల్సిందిగా దాతలను కోరుతున్నారు. ఆ పిల్లాడి ప్రాణం కాపాడేందుకు మీ వంతు సాయం అందించండి.(అడ్వెర్టోరియల్) మీవంతు సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
గాలిలో దీపాలు.. నా కవల పిల్లల ప్రాణాలు..
పెళ్లైన చాన్నాళ్లకు తల్లిని కాబోతున్నానే వార్త తెలియగానే గాలిలో తేలినట్టుగా అనిపించింది. శుభవార్త తెలిసన మరుక్షణం నుంచి క్రమం తప్పకుండా ఆస్పత్రికి వెళ్లూ పరీక్షలు చేయించుకునే దాన్ని. కడుపులో ఉన్నప్పటి నుంచే ఆ పిల్లలను అపురూపంగా చూసుకోవాలని నా భర్త కలలు కనేవాడు. ఒక్కరోజు పని మానేసేట్టుగా మా ఆర్థిక పరిస్థితి లేకపోయినా.. నా కోసం, రాబోయే పసివాళ్ల కోసం పనులు మానుకుని ఇంటి దగ్గర ఉన్న రోజులు ఉన్నాయి. ఎప్పుడెప్పుడు నా బిడ్డ ఈ లోకంలోకి వస్తాడా అని కలలు కంటూ ఎదురు చూస్తున్న సమయంలో ఉన్నట్టుండి పొత్తి కడుపులో నొప్పి మొదలైంది. క్షణాల్లోనే నిభాయించుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. కంగారు పడిన నా భర్త వెంటనే నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. నా చుట్టూతా డాక్టర్లు, నర్సులు వచ్చి చేరారు. క్రమంగా కళ్లు మూతలు పడుతున్నాయి. ఏం జరుగుతుందో తెలియడం లేదు. కళ్లు తెరిచి చూసే సరికి ఆస్పత్రి బెడ్‌పై ఉన్నాను. కవలలు పుట్టారని చెప్పారు. కానీ... నెలలు నిండకుండానే కవలలు జన్మించడంతో ఇద్దరి ఆరోగ్యం క్రిటికల్‌గా ఉందని డాక్టర్లు తెలిపారు. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన చిన్నారులను ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్నారు. శ్వాస తీసుకోవడం మొదలు అనేక అనారోగ్య సమస్యలు ఉన్నాయని డాక్టర్లు చెప్పారు. వారి ఆరోగ్యం సాధారణ స్థితికి రావాలంటే నెలల తరబడి ఆస్పత్రిలో చికిత్స అందివ్వాలని చెప్పారు. దీని కోసం రూ.10లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు తెలిపారు. సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం మాది. పిల్లల ఆస్పత్రి ఖర్చులకు సరిపడా డబ్బులు సమకూర్చుకోవడం మా వల్ల కాని పని. మరోవైపు వైద్య చికిత్స అందకపోతే కవలల ప్రాణాలకే ప్రమాదం. ఆలస్యం జరిగే కొద్ది వాళ్లు మృత్యు ఒడికి దగ్గరవుతున్నారనే ఆలోచనలతో నా తల్లిమనసు తల్లడిల్లుతోంది. దయచేసి నా పిల్లల ప్రాణాలు కాపాడేందుకు మీ వంతు సాయం అందివ్వండి. నా బిడ్డలకు మరుజన్మ ప్రసాదించండి. (అడ్వెర్టోరియల్) సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి