
మా అమ్మాయి అనుప్రియకి పుస్తకాలే ప్రపంచం. చిన్నప్పటి నుంచి తను అంతే స్కూలు, కాలేజీ, హోంవర్క్, బుక్స్ ఇదే తన ప్రపంచం. ‘మీకేంటి అనుప్రియ ఉంది. పెద్దయ్యాక గొప్ప ఆఫీసరు అవుతుంది’ అంటూ చుట్టు పక్కల వారు అంటుంటూ ఆనందంతో కడుపు నిండిపోయేది. తిండితిప్పలు పక్కన పెట్టి పుస్తకాలతో కుస్తీ ఏందమ్మా అని ఎప్పుడైనా అడిగితే ‘నేను ఐఏఎస్ కావాలమ్మా.. ఈ దేశానికి సేవ చేయాలమ్మా’ అంటూ పెద్ద పెద్ద మాటలు చెబుతుండేది. చుట్టు పక్కల ఇళ్లలోనే కాదు బంధువుల్లోనే అనుప్రియ అందరికీ ఆదర్శం. అమ్మాయి బాగా చదువుకోవాలని, ఆమె చదువుకు ఏలాంటి ఆటంకం రాకుండా చూసుకోవాలని నేను, నా భర్త చర్చించుకోని రోజులేదు.
ఎప్పటిలాగే పనిలో ఉండగా అనుప్రియ గదిలోంచి పెద్ద శబ్ధం వినిపించింది. లోపలికి వెళ్లి చూస్తే అచేతనంగా నేలపై పడిపోయి ఉంది. వెంటనే దగ్గరల్లోని డాక్టరు దగ్గరికి తీసుకెళ్లాం.. ఆయన కొద్ది సేపే పరీక్షించి పెద్దాసుపత్రికి అర్జంటుగా తీసుకెళ్లమంటూ సూచించాడు.
అందినకాడికి అప్పులు చేసి వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాం. అక్కడ నర్సులు, డాక్టర్లు అనుప్రియ చుట్టూ చేరి శాంపిల్స్ తీసుకున్నారు, టెస్టులు చేశారు. చాలా సేపటి తర్వాత మమ్మల్ని డాక్టరు పిలిచారంటూ కబురు వచ్చింది. డాక్టరు గదిలోకి వెళ్లిన తర్వాత ఆయన చెప్పిన మాటలు వింటుంటూ కాళ్ల కింద భూమి కదిలిపోయింది. గుండె ఆగినంత పనైంది.
‘మీ అమ్మాయికి ఇలా జరిగిందని చెప్పడానికే బాధగా ఉంది. అక్యూట్ థ్రోంబోసిస్, బై ఫ్రంటల్ హేమరేజ్ ’ అంటూ డాక్టర్లు చెప్పారు.ఆ మాటలు ఆర్థం కాకపోయినా ఏదో పెద్ద ప్రమాదమే జరిగిందని అర్థమయ్యింది. అంతలోనే మరోసారి డాక్టర్లు మాట్లాడుతూ..తలకు గట్టిగా దెబ్బ తగలడం వల్ల ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగిందని, సర్జరీ చేయాలంటూ మొత్తం విషయం అర్థం అయ్యేలా చెప్పారు. సర్జరీ, మెడిసిన్స్, టెస్టులు, బెడ్ ఛార్జెస్ ఇలా అన్నింటికీ కలిపి రూ.15,58,200 ఖర్చు వస్తుందన్నారు. ఎంత త్వరగా ఆపరేషన్ చేస్తే అనుప్రియ అంత త్వరగా కోలుకుంటుదన్నారు.
నా భర్త నెలంత కష్టపడితేనే పది వేలు వస్తాయి. అవి మా కుటుంబ అవసరాలకే సరిపోతాయి. పైగా పాప ఆస్పత్రి ఖర్చుల కోసం అప్పటికే చాలా అప్పులు చేశాం. ఐఏఎస్ ఆఫీసర్ కావాలని కలగన్న నా బిడ్డ ఉలుకుపలుకు లేకుండా ఆస్పత్రి మంచంపై ఉండటం చూసి కన్నీరు ఇంకేలా ఏడుస్తూనే ఉన్నాం. అప్పుడే మెడికల్ ఎమర్జెన్సీలో ఫండ్ రైజింగ్ చేసే కెటో గురించి తెలిసింది. మా అనుప్రియ ప్రాణాలను కాపాడటానికి మీవంతు సాయం అందించండి. తన కల నెరవేర్చుకునే అవకాశం కల్పించండి. సహాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment