కేన్సర్‌ను, దాని చికిత్సను తట్టుకోవడం పెద్దవాళ్లకే చాలా కష్టం. అలాంటిది నాలుగేళ్ల వయసులోనే ప్రాణాంతక కేన్సర్‌బారిన పడితే ఊహించడమే కష్టం. థెరపీలు, ఇంజక్షన్లతో చిన్నారుల బాధను చూడలేక తల్లిదండ్రులు నరకం అనుభవిస్తారు. దీనికి తోడు వైద్య ఖర్చులు కలలో కూడా ఊహించనంతభారంగా మారితే...అటు డబ్బు సమకూర్చుకోలేక, ఇటు రోజు రోజుకూ మృత్యువుకు చేరువవుతున్న బిడ్డను చూడలేక వారి బాధ వర్ణించలేం. బిడ్డను ఎలాగైనా బతికించుకోవాలనే తపన వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. సరిగ్గా మనస్వి తల్లిదండ్రులు కూడా ఇదే మానసిక క్షోభను అనుభవిస్తున్నారు.
నాలుగేళ్ల పాప మనస్వికి న్యూరోబ్లాస్టోమా కేన్సర్ సోకింది. ప్రాణాంతకమైన న్యూరోబ్లాస్టోమాతో ఇబ్బంది పడుతున్న కుమార్తెను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు మనస్వి తల్లిదండ్రులు. సెలూన్‌లో పనిచేసే పాప తండ్రి సంపాదన రోజుకు కేవలం 400 మాత్రమే. దీంతో వైద్యానికి అవసరమైన మొత్తాన్ని సమకూర్చు కోవడం కష్టంగా మారింది. అయినా చేయాల్సిందంతా చేశారు. ఇప్పటికే పాప వైద్య కోసం ఉన్నదంతా ఖర్చు పెట్టేశారు. స్తోమతకు మించి ఆస్తులు అమ్మి, అప్పులు చేసి,ప్రతీ చివరి పైసా చికిత్సకు ఖర్చు చేశారు. మరోవైపు మనస్వికి సోకిన కేన్సర్ ముదురుతోంది. తక్షణమే మెరుగైన వైద్యం అందించకపోతే పాప ప్రాణాలకే ముప్పు అందుకే దయచేసి విరాళాలందించమని వేడుకుంటున్నారు.
మనస్వికి బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ అవసరమని వైద్యులు స్పష్టం చేశారు. ఇందుకోసం అయ్యే ఖర్చు రూ. 20 లక్షలు ($ 25769.54)గా అంచనా వేశారు.
‘‘మా తొలిచూలు బిడ్డ మనస్వి . పాపే మా ప్రపంచం.పాపే మాకు ప్రాణం. ముద్దుల మూటగట్టే ఆమె చిరునవ్వులు చూసి మురిసిపోయాం. కానీ విధి ఇంత క్రూరంగా ఉంటుందని ఊహించలేదు. గుండెలు బద్దలయ్యే వార్త తెలిసింది. నాలుగేళ్ల పసిప్రాయంలోనే మనస్వికి ప్రాణాంతకమైన న్యూరోబ్లాస్టోమా సోకింది. చికిత్సకు తట్టుకోలేక చిరునవ్వుకు దూరమై, పాప కష్టాన్ని చూడలేకపోతున్నాం. ఈ బాధ తట్టుకోలేకపోతున్నాం. దయచేసి మాకు సహాయం చేయండి’’ అని మనస్వి తల్లిదండ్రులు కన్నీటితో వేడుకుంటున్నారు మీ మద్దతే మాకు రక్ష. దయచేసి విరాళం అందించండి! ఈ కష్టం నుంచి మా కుటుంబాన్ని గట్టెక్కించండి!! అని ప్రార్థిస్తున్నారు.(అడ్వెర్టోరియల్)
Comments
Please login to add a commentAdd a comment