నా భర్త వికలాంగుడు, నాకు ఇద్దరు పిల్లలు. నేను పని చేస్తేనే మేం నలుగురం బతికేది. ఆస్తులు లేకపోయినా, మంచి ఉద్యోగాలు లేకపోయినా ఉన్నదాంట్లో మేము బాగానే ఉండేవాళ్లం. కానీ మూడేళ్ల వయసు నుంచే నా కూతురు దుర్గా భవానికి తరచు జ్వరం వస్తుండేది. ఆస్పత్రికి తీసుకెళ్తే కొద్ది రోజుల్లో తగ్గిపోయేది. కానీ పెరిగి పెద్దవుతున్నా మిగిలిన పిల్లలా పనులు చేయలేపోయేది. చిన్నచిన్న పనులకే త్వరగా అలసిపోయేది. పెరుగుతున్న కొద్ది తరచుగా జ్వరం రావడం, అలిసిపోతుండటంతో బిడ్డ ఎప్పుడూ ఏడుస్తూనే ఉండేది.
దుర్గ భవాని తరుచు అనారోగ్యం బారిన ఎందుకు పడుతుందో తెలియక పోయేది. ఎందరు డాక్టర్ల దగ్గరికి తిప్పినా సమస్యకు పరిష్కారం దొరకలేదు. మరోపక్క ఇంట్లో పాప ఏడుపు ఆగడం లేదు. చివరకు తనకు పదిహేనేళ్లు వచ్చాక.. ఓ ఆస్పత్రిలో డాక్టరు అనేక రకాల పరీక్షలు చేసి.. చివరకు దుర్గకి కాంజెనిటల్ హార్ట్ డిసీజ్ ఉందని చెప్పారు. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని ఇప్పటికే చాలా ఆలస్యమైందన్నారు. ఇంకా ఆలస్యం చేస్తే పాప ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించాడు.
డాక్టర్లు చెప్పినట్టుగా దుర్గ భవానికి గుండె ఆపరేషన్ చేయించాలంటే రూ.4,50,000 లక్షలు అవసరం. ఏ ఆధారం లేని నేను అంత డబ్బును కలలో కూడా ఊహించలేదు. కానీ ఆలస్యం అవుతున్న కొద్ది నా బిడ్డ చావుకు దగ్గరవుతోంది. ఓవైపు వికలాంగుడైన భర్త, ఇద్దరు పిల్లలు, ఇంటి పని చూసుకుంటున్నాను. కుటుంబం గడవడం కోసం ఇంట్లో పని చేసేది నేను ఒక్కదాన్నే. ఎప్పుడైనా రూపాయో అర్థనో మిగిలితే అవి కూడా దుర్గ ఆస్పత్రి ఖర్చులకే సరిపోయేవి కావు.
సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
నా నిస్సహాయస్థితి వల్ల నా కూతురు చావుకు దగ్గరవుతోంది. ఆమె ఆపరేషన్‌కు అవసరమైన నాలుగున్నర లక్షల రూపాయలు సర్థుబాటు చేసే పరిస్థితి నాకు లేదు. దయచేసి నా బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు మీ సహాయం కావాలి. ఆపరేషన్ జరిగేందుకు సాయం చేయండి. దుర్గకు మరో జన్మ ఇవ్వండి. (అడ్వెర్‌టోరియల్)
సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment