
గణేశన్, లోగేశ్వరిలది అన్యోన్య జీవితం. భర్త కూలి పని చేసి తెచ్చిన దాంట్లోనే గుట్టుగా సంసారాన్ని నెట్టకొచ్చేది లోగేశ్వరి. ఇద్దరి మధ్య ఎటువంటి కలతలు, కలహాలు లేవు. కానీ వారికి ఉన్న ఏకైక లోటు సంతానం. గతంలో ఓ సారి లోగేశ్వరి ఓ బిడ్డకు జన్మనిచ్చినా.. ఆ పాపకు పుట్టిన రోజే నూరేళ్లు నిండిపోయాయి.
భరించలేని నొప్పి
రెండోసారి గర్భవతి అయ్యింది లోగేశ్వరి. భార్యని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు గణేశన్. ఈసారైనా తమ ఇంట ముద్దులొలికే చిన్నారి కాలు మోపుతుందనే నమ్మకంతో ఉన్నారు ఆ దంపతులు. ఇంతలో లోగేశ్వరికి 25 వారాలు నిండాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా పొత్తికడుపులో నొప్పులు మొదలయ్యాయి. భర్తను కంగారు పెట్టొద్దని ఆ నొప్పిని పంటి బిగువున భరించింది. కానీ నొప్పి అంతకంతకు పెరగడంతో భర్తను పట్టుకుని గట్టిగా ఏడ్చేసింది. ఏదో ఒకటి చేయమని.
బిడ్డ ఎలా ఉందో
నొప్పి భరించలేక కళ్లు మూసుకునే ఉంది లోగేశ్వరి. తనకు అంతా తెలుస్తూనే ఉంది. కష్టపడి భర్త ఆస్పత్రికి తీసుకెళ్లడం, చుట్టూ నర్సులు, డాక్టర్లు గుమిగూడి పరీక్షించడం అంతా లీలగా తెలుస్తూనే ఉంది. కానీ ఆమె మనసంతా తన నొప్పిపై కాకుండా లోపల బిడ్డ ఎలా ఉన్నాడో అనే ఆలోచనలతోనే నిండిపోయింది.
గుండె ముక్కలైంది
లోగేశ్వరి కళ్లు తెరిచి చూసే సరికి ఆమెను నర్సు నవ్వుతూ పలకరించింది. ‘నువ్వు పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చావ్’ అని చెప్పింది. అప్పటి వరకు ఉన్న నొప్పులు, బాధలన్నీ ఆ క్షణంలో లోగేశ్వరి నుంచి మటుమాయం అయ్యాయి. ‘నా బిడ్డ ఎక్కడ చూడాలి అంటూ ఆతృతగా నర్సుని అడిగింది’ లోగేశ్వరి. అయితే ఆమె చెప్పిన మాట వినగానే ఆ తల్లి గుండె మళ్లీ ముక్కలైంది.
ఎన్‌ఐసీయూలో
నెలలు నిండకుండానే బిడ్డ పుట్టినందు వల్ల శిశువు ఆరోగ్యం బాగా లేదని. ఎన్‌ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని నర్సు చెప్పింది. ఇదే మాట మొదటి సారి డెలివరీ అయినప్పుడు కూడా లోగేశ్వరికి ఆస్పత్రి సిబ్బంది చెప్పారు. చివరకు ఆ బిడ్డ దక్కకుండా పోయింది.
చేయూత కావాలి
లోగేశ్వరి, గణేశన్‌ల చిన్నారి కూతురు అనారోగ్య సమస్యలతో ఎన్‌ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్యం కుదుటపడాలంటే చాలా రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉంచి చికిత్స అందివ్వాలి. ఆస్పత్రి ఖర్చులకే రూ.10 లక్షలు మించి ఖర్చు అవుతుందని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. అంత ఖర్చు భరించే స్థోమత ఆ పేద తల్లిదండ్రులకు లేదు. అలాగని రెండోసారి పుట్టిన బిడ్డను చూస్తూ చూస్తూ వదులుకోలేరు. అప్పుడే ఫండ్ రైజింగ్ సంస్థ కెట్టోని సంప్రదించారు. లోగేశ్వరి, గణేశన్‌ల బిడ్డను బతికించాలంటే మన వంతు సాయం అవసరం. సాయం చేయాలనుకునే వారు ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
Please login to add a commentAdd a comment