నా జీవితంలో పొందలేనివి నా బిడ్డకి అందివ్వాలనుకున్నా.. కానీ ఇప్పుడు? | My Daughter Is Fighting For Her Life And We Need Your Support To Save Her | Sakshi
Sakshi News home page

నా జీవితంలో పొందలేనివి నా బిడ్డకి అందివ్వాలనుకున్నా.. కానీ ఇప్పుడు?

Published Mon, Apr 4 2022 1:18 PM | Last Updated on Mon, Apr 4 2022 1:39 PM

My Daughter Is Fighting For Her Life And We Need Your Support To Save Her - Sakshi

నా జీవితంలో నేను సాధించలేనివి, పొందలేకపోయినవాటిని నా కూతురి అందివ్వాలనుకున్నాను. తాను బాగా చదువుకుని పెద్ద స్థాయికి చేరుకుంటుందని కలలు కన్నాను. అయితే మధ్యలోనే నా ఆశలు, నా కూతురి భవిష్యత్తు ప్రమాదంలో పడిపోయాయి.

అమ్మా... నాకు తలనొప్పిగా ఉందంటూ రోజుల తరబడి చెబుతుండటంతో పదకొండేళ్ల కార్తీకను విజయవాడలోని ఆస్పత్రికి తీసుకెళ్లాం. తలనొప్పే కదా మాత్రలతో తగ్గిపోతుందని భావించాం. కానీ కార్తీకను పరీక్షించాకా ఆ వయస్సు పిల్లల్లో వచ్చే అరుదైన మెడుల్లాబ్లాస్టోమా అనే బ్రెయిన్‌ ట్యూమర్‌ వ్యాధి వచ్చినట్లు డాక్టర్లు చెప్పారు. తల నొప్పితో విలవిలాడుతున్న పాప బాధను చూడలేక ఇంట్లో ఉన్న బంగారం మొత్తం తాకట్టు పెట్టి వైద్యం చేయించాం.

ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో హైదరాబాద్‌కి వచ్చాం. ఇక్కడ పాప సమస్య పూర్తిగా నయం కావాలంటే సర్జరీ చేయాలని డాక్టర్లు చెప్పారు. దాని కోసం ఆరు లక్షల రూపాయల వరకు ఖర్చు వస్తుందన్నారు. ఇప్పటికే ఉన్నదంతా అమ్మేశాం, అప్పులు కూడా చేశాం. కరోనా వల్ల ఉన్న ఆటోరిక్షా కూడా పోయి ప్రస్తుతం లారీ మెకానిక్‌గా నా భర్త  పని చేస్తూ కష్టంగా కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

ఆటపాటలతో ఉల్లాసంగా ఉండాల్సిన నా బిడ్డ ఆస్పత్రి మంచంపై నొప్పికి విలవిలాడుతూ నిస్సత్తువగా మారిపోయింది. మరోవైపు చిన్న కూతురు నిహారిక విజయవాడలో బంధువుల ఇళ్లలో వదిలేసి వచ్చాం. ఫోన్‌ చేసినప్పుడల్లా.. అమ్మా, నాన్నా అక్కను ఎప్పుడు తీసుకు వస్తారని నిహారిక అడుగుతోంది.
సహాయం చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి

మా ఆర్థిక పరిస్థితి బిడ్డకు శాపంగా మారినందుకు బాధపడని రోజంటూ లేదు. మా పాపకు పునర్జన్మను ఇచ్చి ఆమె బంగారు భవిష్యత్తును అందించేందుకు మీ సాయాన్ని వేడుకుంటున్నాను. మా బిడ్డను బాధను తొలగించేందుకు ఆపరేషన్‌కి అవసరమైన రూ.6 లక్షలు సాయం చేయాలని కోరుతున్నాను


సహాయం చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement