వెనుకబడ్డ బాబీ జిందాల్ | Bobby Jindal lags behind in fund raising figures | Sakshi
Sakshi News home page

వెనుకబడ్డ బాబీ జిందాల్

Published Thu, Jul 16 2015 9:49 AM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM

వెనుకబడ్డ బాబీ జిందాల్ - Sakshi

వెనుకబడ్డ బాబీ జిందాల్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష రేసులో నిలిచిన ఇండియన్-అమెరికన్ బాబీ జిందాల్ ఎన్నికల నిధుల వేటలో వెనుకబడ్డారు. గత వారంలో రోజుల్లో ఆయన 579,000 డాలర్లు సేకరించారు. ఎన్నికల ప్రచారం కోసం ఆయన ఇప్పటివరకు 9 మిలియన్ డాలర్లుపైగా పోగుచేశారు. తనతో పాటు అధ్యక్ష బరిలో నిలిచిన డెమొక్రటిక్, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థులతో పోలిస్తే విరాళ సేకరణలో జిందాల్ వెనుకబడ్డారు.

సొంత పార్టీలో జిందాల్ కు పోటీలో నిలిచిన ఫ్లోరిడా గవర్నర్ జెబ్ బుష్ 16 రోజుల్లోనే 11.4 మిలియన్ డాలర్లు కూడగట్టారు. డెమొక్రటిక్ పార్టీ తరపున బరిలో ఉన్న హిల్లరీ క్లింటన్ ఖాతాలో దాదాపు 47.5 మిలియన్ డాలర్లు ఉన్నాయి. ఈ ఏడాదిలోగా 100 డాలర్లు సేకరించాలని హిల్లరీ లక్ష్యంగా పెట్టుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement