'అరెస్టుకు ఆమె ఒక్క ఈమెయిల్ దూరంలో ఉన్నారు'
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ భార్య హిల్లరీ క్లింటన్ అరెస్టు అవడానికి కేవలం ఒక్క ఈమెయిల్ దూరంలో ఉన్నారని లూసియానా గవర్నర్ బాబీ జిందాల్ వ్యాఖ్యానించారు. కోర్టు ప్రొసిడింగ్స్లో ఆమె చెప్పిన అబద్దాలు, ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తిగత మెయిల్స్ సమాచారం వాడుకున్న విషయాలు బయట పడతాయని ఆయన పేర్కొన్నారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ పార్టీ తరఫున బాబీ జిందాల్ అమెరికా అధ్యక్షపదవి బరిలో ఉన్న విషయం విదితమే. స్టేట్ సెక్రటరీగా పనిచేసిన సమయంలో ఆమె మెయిల్స్ ను బహిర్గతం చేయాల్సిందిగా వచ్చిన ఆదేశాల అనుసారం హిల్లరీ ఈ సమాచారాన్ని వెల్లడించారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా జిందాల్ మాట్లాడుతూ.. హిల్లరీ ఇకనైనా చైనీస్ ప్రభుత్వాన్నిడాక్యుమెంట్లు డంప్ చేయవద్దని వేడుకోవడం మంచిదంటూ హెచ్చరించారు. ఇందులో భాగంగా పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయని జిందాల్ చెప్పారు. టాప్ సిక్రెట్ అని రాసి ఉంచిన మెయిల్స్ కొన్నింటిన క్లింటన్ తాను సెక్రటరీగా పనిచేస్తున్నప్పుడు సర్వర్ నుంచి వాడుకున్నట్లు బహిర్గతమయ్యాయి. 2009-2011 మధ్య కాలంలో డిపార్ట్మెంట్ ఉద్యోగులు కొన్ని మెయిల్స్ చేశారని, అందులో కొన్ని హిల్లరీకి పంపినట్లు ఈ ఘటనతో బయటపడింది.