న్యూఢిల్లీ: ఐటీ సొల్యూషన్లు అందించే ఇన్‌స్పిరా ఎంటర్‌ప్రైజ్ ఇండియా పబ్లిక్ ఇష్యూ చేపట్టనుంది. ఇందుకు తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతించింది. ఐపీవోలో భాగంగా ఇన్‌స్పిరా రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 500 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా రూ. 800 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది.
ప్రకాష్ జైన్ రూ. 131 కోట్లు, ప్రకాష్ జైన్ కుటుంబ ట్రస్ట్ రూ. 277 కోట్లు, మంజులా జైన్ కుటుంబ ట్రస్ట్ రూ. 92 కోట్లు విలువైన ఈక్విటీని ఆఫర్ చేయనున్నాయి. కంపెనీ ఆగస్టులో సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 75 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. తాజా ఈక్విటీ నిధులను వర్కింగ్ క్యాపిటల్‌తోపాటు, సాధారణ కార్పొరేట్ అవసరాలు, రుణ చెల్లింపులకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో ఇన్‌స్పిరా పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment