IPO plan
-
రూ.3,395 కోట్ల ఐపీవోకు రంగం సిద్ధం
బెంగళూరుకు చెందిన సీఆర్‌డీఎం(కాంట్రాక్ట్ రీసెర్చ్, డెవలప్మెంట్, మాన్యుఫాక్చరింగ్) సేవలందిస్తున్న యాంథెమ్ బయోసైన్సెస్ తాజాగా ఐపీవో(IPO) ద్వారా రూ.3,395 కోట్లు సమీకరించనుంది. దీనికి సంబంధించిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ(SEBI)కి సమర్పించింది. ఈ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (OFS) విధానంలో ఉండనుంది. ప్రమోటర్లు గణేష్ సాంబశివం, రవీంద్ర చంద్రప్పతో పాటు ఇతర ఇన్వెస్టర్లు, వాటాదారులు షేర్లను విక్రయించనున్నారు.ఇదీ చదవండి: ‘బీ-రెడీ’లో మంచి స్కోర్ రావాలంటే కష్టమే..ఇష్యూ పూర్తిగా ఓఎఫ్ఎస్ విధానంలో ఉంటుంది. సమీకరించిన నిధులన్నీ విక్రయదార్లకు చెందుతాయి. 2006లో ఏర్పాటైన యాంథెమ్ సంస్థ బెంగళూరు కేంద్రంగా కాంట్రాక్ట్ రీసెర్చ్, డెవలప్మెంట్, తయారీ సంస్థగా (CRDMO) కార్యకలాపాలు సాగిస్తోంది. కర్ణాటకలో రెండు ప్లాంట్లు ఉన్నాయి. నిర్మాణంలో ఉన్న మూడో యూనిట్ 2025 ప్రథమార్ధంలో అందుబాటులోకి రానుంది. కంపెనీ గత ఆర్థిక సంవత్సరం రూ.1,419 కోట్ల ఆదాయంపై రూ.367 కోట్ల లాభం నమోదు చేసింది. -
నేటి నుంచి 3 ఐపీవోలు
న్యూఢిల్లీ: నేటి(బుధవారం) నుంచి మూడు కంపెనీల పబ్లిక్ ఇష్యూలు ప్రారంభంకానున్నాయి. శుక్రవారం(9న) ముగియనున్న ఇష్యూల జాబితాలో రాశి పెరిఫెరల్స్, జానా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉన్నాయి. ఉమ్మడిగా సుమారు రూ. 1,700 కోట్లు సమీకరించనున్నాయి. ప్రస్తుతం ద పార్క్ బ్రాండ్‌తో హోటళ్లను నిర్వహిస్తున్న ఏపీజే సురేంద్ర పార్క్ రూ. 920 కోట్లు అందుకునేందుకు పబ్లిక్ ఇష్యూకి తెరతీసిన సంగతి తెలిసిందే. వీటికి అదనంగా ఎంటెరో హెల్త్‌కేర్ సొల్యూషన్స్ ఈ నెల 9న ఐపీవోకు రానుంది. తద్వారా రూ. 1,600 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. ఈ బాటలో గత నెలలోనూ ఐదు కంపెనీలు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్ ద్వారా ఉమ్మడిగా రూ. 3,266 కోట్లు సమకూర్చుకోవడం ప్రస్తావించదగ్గ అంశం! రాశి వివరాలిలా.. ఐపీవోలో భాగంగా ఐటీ, కమ్యూనికేషన్స్ టెక్నాలజీ ప్రొడక్టుల పంపిణీ సంస్థ రాశి పెరిఫెరల్స్ పూర్తిగా ఈక్విటీ జారీని చేపట్టనుంది. మొత్తం రూ. 600 కోట్ల విలువైన షేర్లను జారీ చేయడం ద్వారా అంతేమేర నిధులు సమకూర్చుకోనుంది. ఇందుకు రూ. 295–311 ధరల శ్రేణిని ప్రకటించింది. ఐపీవో నిధులలో రూ. 326 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 220 కోట్లు వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచి్చంచనుంది. జానా స్మాల్ తీరిదీ పీఈ దిగ్గజాలు టీపీజీ, మోర్గాన్ స్టాన్లీలకు పెట్టుబడులున్న జానా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఐపీవో ద్వారా రూ. 462 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 108 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. మొత్తం రూ. 574 కోట్ల సమీకరణపై కన్నేసిన కంపెనీ రూ. 393–414 ధరల శ్రేణిని ప్రకటించింది. ఈక్విటీ జారీ నిధులను భవిష్యత్ అవసరాలరీత్యా మూలధన పటిష్టతకు, కనీస మూలధన నిష్పత్తి మెరుగుకు వినియోగించనుంది. క్యాపిటల్ స్మాల్ రెడీ ఐపీవోలో భాగంగా క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రూ. 450 కోట్ల విలువైన ఈక్విటీని జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 73 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్ చేయనున్నారు. తద్వారా రూ. 523 కోట్లు అందుకోనుంది. ఇందుకు రూ. 445–468 ధరల శ్రేణిని ప్రకటించింది. ఈక్విటీ జారీ నిధులను భవిష్యత్ అవసరాలరీత్యా టైర్–1 మూలధన పటిష్టతకు కేటాయించనుంది. -
స్విగ్గీ ఉద్యోగాల ఊచకోత: 380 మందిపై వేటు
సాక్షి,ముంబై: ప్రముఖ ఫుడ్ డెలీవరీ యాప్ స్విగ్గీ కూడా ఉద్యోగులపై వేటుకు నిర్ణయం తీసుకుంది. సంస్థ పునర్నిర్మాణం, అంచనాలతో పోలిస్తే తక్కువ వృద్ధి రేటు తదితర కారణాలతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ ప్రకటించింది. లాభదాయకత,లక్ష్యాలను చేరుకోనే క్రమంలో మొత్తం పరోక్ష ఖర్చులను పునః పరిశీలించాల్సిన అవసరం ఉందని కంపెనీ సీఈవో శ్రీహర్ష మెజెటీ శుక్రవారం ఉద్యోగులకు అందించిన ఈమెయిల్ సందేశంలో చెప్పారు. 380 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు అందుబాటులో ఉన్నఅన్ని ఎంపికలను అన్వేషించిన తర్వాత ఇంత కష్టమైన నిర్ణయం తీసుకున్నట్టు సీఈవో తెలిపారు. ప్రొడక్ట్, ఇంజినీరింగ్, ఆపరేషన్ డిపార్ట్మెంట్స్ ఉద్యోగులు ఎక్కువు ప్రభావితమైనట్టు సమాచారం. అంతేకాదు త్వరలోనే మీట్ మార్కెట్‌ను మూసివేయనుంది. అయితే ఇన్‌స్టామార్ట్ ద్వారా ఆ విక్రయాలు కొనసాగుతాయని ఆయన తెలిపారు. కొత్త విభాగాల్లో తమ పెట్టుబడులు కొనసాగుతాయని వెల్లడించింది. అలాగే హైరింగ్ విషయంలో కొన్ని తప్పులు చేశాననీ, ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండి ఉండాల్సిందని శ్రీహర్ష వెల్లడించారు. ప్రభావితమైన ఉద్యోగులు అందరికీ మూడు నెలల కనీస హామీ చెల్లింపు, పదవీకాలం, గ్రేడ్ ఆధారంగా 3-6 నెలల నగదు చెల్లింపు చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. రాబోయే మూడు నెలల పాటు కెరీర్ ట్రాన్సిషన్ సపోర్ట్, పునరావాస ఖర్చులు రీయింబర్స్ చేస్తామనీ, కొత్త ఉద్యోగాన్ని వెతుక్కునే పనిలో సహాయపడటానికి వారికి కేటాయించిన పని ల్యాప్‌టాప్‌లను ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసింది. ఐపీఓకు ముందు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. -
ఐపీవోల సందడే సందడి
న్యూఢిల్లీ: ప్రైమరీ మార్కెట్లు మరోసారి సందడి చేయనున్నాయి. గత వారం నాలుగు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకురాగా.. ఈ వారం సైతం ఇదే సంఖ్యలో ఐపీవోలు వెలువడనున్నాయి. తద్వారా ఉమ్మడిగా రూ. 5,000 కోట్లకుపైగా సమీకరించనున్నాయి. తాజా జాబితాలో ఆర్కియన్ కెమికల్స్, ఫైవ్ స్టార్ బిజినెస్ ఫైనాన్స్, కేన్స్ టెక్నాలజీ ఇండియా, ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్ చేరాయి. గత వారం వెలువడిన నాలుగు ఇష్యూలలో బికాజీ ఫుడ్స్ (22 రెట్లు అధిక స్పందన), గ్లోబల్ హెల్త్ (10 రెట్లు సబ్స్క్రిప్షన్) సోమవారం(7న) ముగిశాయి. ఈ బాటలో ఆర్కియన్, ఫైవ్‌స్టార్ ఇష్యూలు 9న, కేన్స్ టెక్ 10న, ఐనాక్స్ గ్రీన్ 11న ప్రారంభంకానున్నాయి. 2022లో ఇప్పటివరకూ 26 కంపెనీలు ఐపీవోల ద్వారా రూ. 48,000 కోట్లను సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. ఆర్కియన్ కెమ్ స్పెషాలిటీ మెరైన్ రసాయనాల తయారీ కంపెనీ ఆర్కియన్ కెమికల్స్ రూ. 386–407 ధరల శ్రేణిలో ఐపీవో చేపట్టనుంది. 11న ముగియనున్న ఇష్యూలో భాగంగా రూ. 805 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.61 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు ఆఫర్ చేయనున్నారు. తద్వారా రూ. 1,462 కోట్లకుపైగా సమీకరించనుంది. ఈక్విటీ జారీ నిధులను కంపెనీ జారీ చేసిన ఎన్సీడీల చెల్లింపునకు వినియోగించనుంది. ఫైవ్ స్టార్ బిజినెస్ ఎన్బీఎఫ్సీ.. ఫైవ్ స్టార్ బిజినెస్ ఫైనాన్స్ ఐపీవోకు రూ. 450–474 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూలో భాగంగా ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు రూ. 1,960 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీలో టీపీజీ, మ్యాట్రిక్స్ పార్టనర్స్, నార్వెస్ట్ వెంచర్స్, సీక్వోయా, కేకేఆర్ తదితర దిగ్గజాలు ఇన్వెస్ట్ చేశాయి. కేన్స్ టెక్నాలజీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సొల్యూషన్స్ ఆధారిత సమీకృత ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ కేన్స్ టెక్నాలజీ ఐపీవోకు రూ. 559–587 ధరల శ్రేణిని ప్రకటించింది. ఈ నెల 14న ముగియనున్న ఇష్యూలో భాగంగా రూ. 530 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. మరో 55.85 లక్షల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా రూ. 850 కోట్లు సమీకరించనుంది. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, విస్తరణకు వినియోగించనుంది. ఐనాక్స్ గ్రీన్ పవన విద్యుత్ దిగ్గజం ఐనాక్స్ విండ్ గ్రూప్ కంపెనీ ఐనాక్స్ గ్రీన్ ఐపీవోకు రూ. 61–65 ధరల శ్రేణిని నిర్ణయించింది. ఈ నెల 15న ముగియనున్న ఇష్యూలో భాగంగా రూ. 370 కోట్ల ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. ఇంతే విలువైన షేర్లను ప్రమోటర్ సంస్థ ఐనాక్స్ విండ్ ఆఫర్ చేయనుంది. తద్వారా రూ. 740 కోట్లు సమీకరించనుంది. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పోరేట్ అవసరాలకు వినియోగించనుంది. -
డీసీఎక్స్ సిస్టమ్స్ ఐపీవో అదిరింది
న్యూఢిల్లీ: కేబుళ్లు, వైర్ హార్నెస్ అసెంబ్లీల తయారీ కంపెనీ డీసీఎక్స్ సిస్టమ్స్ పబ్లిక్ ఇష్యూ విజయవంతమైంది. ఇష్యూ చివరి రోజు బుధవారానికల్లా దాదాపు 70 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్ అయ్యింది. ఇష్యూలో భాగంగా 1.45 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా.. 101.27 కోట్ల షేర్లకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. వెరసి షేరుకి రూ.197-207 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా రూ.500 కోట్లు సమీకరించింది. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 61.8 రెట్ల అధిక స్పందన లభించింది. -
సిర్మా ఎస్జీఎస్ టెక్నాలజీ పబ్లిక్ ఇష్యూ..33 రెట్లు అధికంగా సబ్స్క్రిప్షన్!
న్యూఢిల్లీ: ఇంజినీరింగ్, డిజైన్ కంపెనీ సిర్మా ఎస్జీఎస్ టెక్నాలజీ పబ్లిక్ ఇష్యూ విజయవంతమైంది. ఇష్యూ చివరి రోజు గురువారాని(18)కల్లా దాదాపు 33 రెట్లు అధికంగా సబ్స్క్రిప్షన్ లభించింది. ఐపీవోలో భాగంగా 2,85,63,816 షేర్లను విక్రయానికి ఉంచగా.. 93 కోట్లకుపైగా షేర్ల కోసం దరఖాస్తులు వెల్తువెత్తాయి. వెరసి షేరుకి రూ. 209–220 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 840 కోట్లు సమకూర్చుకుంది. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) నుంచి 87.6 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 17.5 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. రిటైల్ ఇన్వెస్టర్ల కోటాలో సైతం 5.5 రెట్లు ఎక్కువగా దరఖాస్తులు లభించాయి. ఇష్యూలో భాగంగా రూ. 766 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుండగా.. మరో 33.7 లక్షల షేర్లను వాటాదారులు ఆఫర్ చేశారు. ఇష్యూ ముందు రోజు యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 252 కోట్లు సమీకరించింది. ఇష్యూ ద్వారా కంపెనీ రెండున్నర నెలల తదుపరి తిరిగి ప్రైమరీ మార్కెట్‌కు జోష్‌ను తీసుకువచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇంతక్రితం అంటే మే 24–26 మధ్య ఏథెర్ ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూ చేపట్టిన విషయం విదితమే. ఐపీవోకు డ్రీమ్‌ఫోక్స్ సర్వీసెస్ రెడీ న్యూఢిల్లీ: విమానాశ్రయ సర్వీసుల అగ్రిగేటర్ ప్లాట్‌ఫామ్ డ్రీమ్‌ఫోక్స్ సర్వీసెస్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఈ నెల(ఆగస్ట్) 24న ప్రారంభంకానున్న ఇష్యూ 26న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 23న షేర్లను విక్రయించనుంది. ఐపీవోలో భాగంగా 1.72 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఇవి ఇష్యూ తదుపరి చెల్లించిన మూలధనంలో 33 శాతం వాటాకు సమానం. యూనిఫైడ్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రయాణికులకు విమానాశ్రయ సౌకర్యాలను పొందేందుకు డ్రీమ్‌ఫోక్స్ వీలు కల్పిస్తుంది. ఎయిర్పోర్ట్ లాంజ్‌లు, ఆహారం, పానీయాలు, స్పా, ట్రాన్సిట్ హోటళ్లు తదితర పలు సర్వీసులను పొందేందుకు వినియోగదారులకు కంపెనీ వీలు కల్పిస్తుంది. -
విక్రమ్ సోలార్ ఐపీవోకు సెబీ గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: దేశీ మాడ్యూల్ తయారీ కంపెనీ విక్రమ్ సోలార్ పబ్లిక్ ఇష్యూకి క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అను మతి లభించింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 1,500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా 50 లక్షల షేర్లను వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. స్టాక్ ఎక్స్చేంజీల లిస్టింగ్‌కు వీలుగా కంపెనీ మార్చిలో సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. కంపెనీ సోలార్ ఫొటోవోల్టాయిక్ మాడ్యూల్స్ తయారీసహా.. సమీకృత సోలార్ ఎనర్జీ సొల్యూషన్స్ అందిస్తోంది. ఈక్విటీ జారీ నిధులను 2,000 మెగావాట్ల సామర్థ్యంగల సమీకృత సోలార్ సెల్, సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్ ఏర్పాటుకు వినియోగించనుంది. 2021 డిసెంబర్‌కల్లా రూ. 4,870 కోట్ల విలువైన ఆర్డర్‌బుక్‌ను కలిగి ఉంది. -
ఎల్ఐసీ ఫలితాలు.. ప్చ్!
న్యూఢిల్లీ: ఇటీవలే ఐపీవోకు వచ్చిన ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ జనవరి– మార్చిలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో స్టాండెలోన్ నికర లాభం 18 శాతం క్షీణించి రూ. 2,372 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 2,893 కోట్లు ఆర్జించింది. అయితే నికర ప్రీమియం ఆదాయం రూ. 1.22 లక్షల కోట్ల నుంచి రూ. 1.44 లక్షల కోట్లకు ఎగసింది. ఇది 18 శాతం వృద్ధికాగా.. తొలిసారి వాటాదారులకు డివిడెండ్ ప్రకటించింది. షేరుకి రూ. 1.50 చొప్పున చెల్లించనుంది. కాగా.. క్యూ4లో కన్సాలిడేటెడ్ నికర లాభం సైతం 17 శాతం నీరసించి రూ. 2,409 కోట్లకు చేరింది. 2020–21 క్యూ4లో రూ. 2,917 కోట్లు ఆర్జించింది. మార్చికల్లా కంపెనీ సాల్వెన్సీ రేషియో 1.76 శాతం నుంచి 1.85 శాతానికి మెరుగుపడింది. కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన తదుపరి తొలిసారి త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. ఫలితాల నేపథ్యంలో ఎల్ఐసీ షేరు 2 శాతం బలపడి రూ. 837 వద్ద ముగిసింది. -
ఐపీవోకు లగ్జరీ వాచీల కంపెనీ!
లగ్జరీ, ప్రీమియం వాచీల రిటైల్ కంపెనీ ఇథోస్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఈ నెల 18న ప్రారంభంకానున్న ఇష్యూకి రూ. 836–878 ధరల శ్రేణి ప్రకటించింది. 20న ముగియనున్న ఇష్యూలో భాగంగా రూ. 375 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా కంపెనీ ప్రస్తుత వాటాదారులు మరో 11 లక్షలకుపైగా షేర్లను విక్రయానికి ఉంచనుంది. తద్వారా రూ. 472 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 17 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేయవలసి ఉంటుంది. 2020–21లో కంపెనీ రూ. 386 కోట్లకుపైగా ఆదాయం సాధించగా, దాదాపు రూ. 6 కోట్ల నికర లాభం ఆర్జించింది. కంపెనీ దేశీయంగా ప్రీమియం, లగ్జరీ వాచీల భారీ పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. 50 రకాల బ్రాండ్లను విక్రయిస్తోంది. జాబితాలో ఒమెగా, ఐడబ్ల్యూసీ స్కఫాసెన్, లాంగిన్స్, టిస్సట్, రేమండ్ వీల్, లూయిస్ మొయినెట్ తదితరాలున్నాయి. ప్రిస్టీన్ లాజిస్టిక్స్ ఐపీవో బాట లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సర్వీసుల కంపెనీ ప్రిస్టీన్ లాజిస్టిక్స్ అండ్ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా రూ. 250 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 2 కోట్లకుపైగా షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. -
నేడే ఎల్ఐసీ ఐపీవో ..స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్లు!
దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు దేశీ సూచీలపై ప్రభావం చూపుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీంతో బుధవారం ఉదయం 9.30గంటలకు సెన్సెక్స్ 29 పాయింట్లు నష్టపోయి 56946 పాయింట్లు, నిఫ్టీ 14పాయింట్లు నష్టపోయి 17054 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది. ఇక బ్రిటానియా,ఎన్టీపీసీ,ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, యూపీఎల్, ఇన్ఫోసిస్,టాటా స్టీల్, బీపీసీఎల్, విప్రో, టాటామోటార్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా..అపోలో హాస్పిటల్, టైటాన్ కంపెనీ, భారతీ ఎయిర్టెల్, హిందాల్కో, సన్ ఫార్మా, దివిస్ ల్యాబ్స్, శ్రీ సిమెంట్, కిప్లా, ఎంఅండ్ ఎం, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఎల్ఐసీ ఐపీవో ప్రారంభం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎల్ఐసీ ఐపీవో రానే వచ్చింది. నేటి నుంచే ఐపీఓకు ధరఖాస్తు చేసుకోవచ్చు. మే 9 వరకు అందుబాటులో ఉంటుండగా.. పాలసీ దార్లు, ఇన్వెస్టర్లు ఐపీవో ధరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎల్ఐసీ ఐపీవో ధర రూ.902 నుంచి రూ.949 మధ్యలో ఉండగా.. పాలసీదార్లకు రూ.60, రీటైలర్లు,ఉద్యోగులకు రూ.45 చొప్పున డిస్కౌంట్లు ఇస్తున్నారు. -
ఎల్ఐసీ ఐపీవో.. క్యూకడుతున్న యాంకర్ ఇన్వెస్టర్లు!
న్యూఢిల్లీ: బీమా రంగ పీఎస్‌యూ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) పబ్లిక్ ఇష్యూకి యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి మద్దతు లభించింది. ఐపీవోలో భాగంగా ప్రభుత్వం 3.5 శాతం వాటాకు సమానమైన 22.13 కోట్ల షేర్లను ఆఫర్ చేస్తోంది. తద్వారా రూ. 21,000 కోట్లవరకూ సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ఇష్యూలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్లకు 5.92 కోట్ల షేర్లను రిజర్వ్ చేసింది. వీటి విలువ రూ. 5,620 కోట్లు కాగా.. సోమవారం(2న) ఈ విభాగంలో రూ. 7,000 కోట్ల విలువైన బిడ్స్ దాఖలైనట్లు తెలుస్తోంది. ప్రధానంగా సావరిన్ వెల్త్‌ఫండ్స్, దేశీ మ్యూచువల్ ఫండ్స్ ఆసక్తి చూపినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే 20 యాంకర్ సంస్థలు ఆసక్తి చూపినట్లు వార్తలు వెలువడ్డాయి. కాగా.. షేరుకి రూ.902–949 ధరలో చేపట్టిన ఇష్యూ బుధవారం(4న) ప్రారంభమై సోమవారం(9న) ముగియనుంది. అతిపెద్ద ఇష్యూ..: రూ. 21,000 కోట్ల సమీకరణ ద్వారా దేశీయంగా ఎల్ఐసీ అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా రికార్డు సృష్టించనుంది. ఇంతక్రితం 2021లో రూ. 18,300 కోట్లు సమీకరించిన వన్97 కమ్యూనికేషన్స్(పేటీఎమ్) ఇప్పటివరకూ భారీ ఐపీవోగా నిలుస్తోంది. 2010లో రూ. 15,200 కోట్ల సమీకరణతో లిస్టింగ్ సాధించిన పీఎస్‌యూ దిగ్గజం కోల్ ఇండియా తదుపరి ర్యాంకును సాధించింది. కాగా.. తాజా ఐపీవోలో ఎల్ఐసీ పాలసీదారులకు 2,21,37,492 షేర్లు, ఉద్యోగులకు 15,81,249 షేర్లు విక్రయించనుంది. పాలసీదారులకు షేరు ధరలో రూ. 60, రిటైల్ ఇన్వెస్టర్లు, ఉద్యోగులకు రూ. 45 చొప్పున రాయితీని ఇస్తోంది. ఈ నెల 17న ఎల్ఐసీ లిస్ట్‌కానుంది. చదవండి👉ఎల్ఐసీ షేరు ధర ఆకర్షణీయం... -
ఐపీవో బాటలో క్యాంపస్ షూస్, గోదావరీ బయో..!
బడ్డీ/న్యూఢిల్లీ: స్పోర్ట్స్, అథ్లెస్యూర్ ఫుట్‌వేర్ కంపెనీ క్యాంపస్ యాక్టివ్‌వేర్ ఈ ఏడాది మే నెలకల్లా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌ను సాధించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీ తాజాగా పంపిణీ నెట్వర్క్ విస్తరణతోపాటు, దేశ పశ్చిమ, దక్షిణాది మార్కెట్లలో కార్యకలాపాలను మరింత పటిష్టపరచుకోవాలని చూస్తోంది. టీపీజీ గ్రోత్ ఈక్విటీ ఫండ్, ఓఆర్జీ ఎంటర్ప్రైజస్లకు పెట్టుబడులున్న కంపెనీ అధిక మార్జిన్లుగల మహిళలు, పిల్లల ఫుట్‌వేర్ పోర్ట్‌ఫోలియోను సైతం ఆవిష్కరించే ప్రణాళికల్లో ఉన్నట్లు క్యాంపస్ యాక్టివ్‌వేర్ సీఎఫ్‌వో రామన్ చావ్లా పేర్కొన్నారు. గోదావరీ బయో.. ఇథనాల్, బయో ఆధారిత కెమికల్స్ తయారీ కంపెనీ గోదావరీ బయోరిఫైనరీస్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో ఉన్నట్లు వెల్లడించింది. ఇందుకు గతేడాది నవంబర్లోనే క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతులు లభించినట్లు కంపెనీ సీఈవో, ఎండీ సమీర్ సోమారియా తెలియజేశారు. లిస్టింగ్‌కు ఏడాది సమయం ఉన్నట్లు వెల్లడించారు. అయితే ప్రస్తుతం భౌగోళిక, రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో తగిన సమయంలో కంపెనీ ఐపీవోను చేపట్టే వీలున్నట్లు తెలియజేశారు. చదవండి: అదరగొట్టిన ఎల్అండ్టీ ఇన్ఫోటెక్..మైండ్‌ట్రీతో విలీనంపై కీలక వ్యాఖ్యలు..! -
మే 12వరకూ ఎల్ఐసీకి గడువు
న్యూఢిల్లీ: బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు మే 12వరకూ గడువున్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. దీంతో ఆలోగా కంపెనీ ఐపీవోకు మరోసారి క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతులు పొందవలసిన అవసరంలేదని తెలియజేశారు. ఐపీవోలో భాగంగా ప్రభుత్వం ఎల్ఐసీలో 5 శాతం వాటాకు సమానమైన 31.6 కోట్ల షేర్లను విక్రయించనుంది. తద్వారా రూ. 60,000 కోట్లకుపైగా సమకూర్చుకునే వీలుంది. ఇందుకు అనుగుణంగా ధరల శ్రేణి, ఆఫర్ చేయనున్న ఈక్విటీ వివరాలు తదితరాలతో ఆర్‌హెచ్‌పీని దాఖలు చేయవలసి ఉంది. నిజానికి మార్చిలోగా ఎల్ఐసీని లిస్టింగ్ చేయాలని ప్రభుత్వం తొలుత ప్రణాళికలు వేసింది. అయితే రష్యా–ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా ఇటీవల స్టాక్ మార్కెట్లు భారీ ఆటుపోట్లకు లోనవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వేచిచూసే ధోరణిని అవలంబిస్తున్నట్లు అధికారిక వర్గాలు ఇప్పటికే తెలియజేశాయి. -
యుద్ధంగిద్ధం జాన్తానై! మాకు పైసల్ గావాలె?
న్యూఢిల్లీ: ఎఫ్‌పీఐల అమ్మకాల నేపథ్యంలో సెకండరీ మార్కెట్లు ఆటుపోట్లను ఎదుర్కొంటున్నప్పటికీ మళ్లీ ప్రైమరీ మార్కెట్ కళకళలాడే వీలుంది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు హెక్సగాన్ న్యూట్రిషన్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు ఐపీవో సన్నాహాలలో భాగంగా ఇండియా ఎక్స్పొజిషన్ మార్ట్, సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను సెబీకి దాఖలు చేశాయి. ఈ బాటలో సచిన్ బన్సల్(ఫ్లిప్‌కార్ట్) కంపెనీ నవీ టెక్నాలజీస్ సైతం దరఖాస్తు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. వివరాలు ఇలా.. హెక్సగాన్ న్యూట్రిషన్ న్యూట్రిషన్ తయారీలో సమీకృత కార్యకలాపాలు గల హెక్సగాన్ న్యూట్రిషన్ ఐపీవోకు సెబీ ఓకే చెప్పింది. కంపెనీ డిసెంబర్లో దరఖాస్తు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 100 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 3 కోట్లకుపైగా షేర్లను విక్రయానికి ఉంచనుంది. తద్వారా రూ. 600 కోట్లవరకూ సమీకరించాలని భావిస్తోంది. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలు తదితరాలకు వినియోగించనుంది. 1993లో ప్రారంభమైన ఈ ముంబై కంపెనీ న్యూట్రిషన్ విభాగంలో పెంటాస్యూర్, పెడియాగోల్డ్, ఒబెసిగో తదితర సుప్రసిద్ధ బ్రాండ్లను కలిగి ఉంది. ఇండియా ఎక్స్పొజిషన్ మార్ట్ సమీకృత ఎగ్జిబిషన్లు, కన్వెన్షన్ సెంటర్లను నిర్వహిస్తున్న ఇండియా ఎక్స్పొజిషన్ మార్ట్ ఐపీవోకు వీలుగా సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా రూ. 450 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా 1.12 కోట్లకుపైగా షేర్లను విక్రయానికి ఉంచనుంది. వెరసి రూ. 600 కోట్లవరకూ సమకూర్చుకునే యోచనలో ఉంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 317 కోట్లను పెట్టుబడి వ్యయాలకు వెచి్చంచనుంది. సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు రియల్టీ రంగ కంపెనీ సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. దీనిలో భాగంగా రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. ఈ నిధులలో రూ. 315 కోట్లను కంపెనీతోపాటు, అనుబంధ సంస్థల రుణ చెల్లింపులకు వినియోగించనుంది. మరో రూ. 45 కోట్లను భూమి కొనుగోలు, అభివృద్ధి తదితరాలకు వెచి్చంచనుంది. ప్రస్తుతం ప్రమోటర్ గ్రూప్‌నకు కంపెనీలో 95 శాతం వాటా ఉంది. నవీ టెక్నాలజీస్.. సచిన్ బన్సల్ ఏర్పాటు చేసిన నవీ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి త్వరలో ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 4,000 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీవోలో భాగంగా తాజా ఈక్విటీని జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఇప్పటివరకూ నవీ టెక్నాలజీస్‌లో రూ. 4,000 కోట్లు ఇన్వెస్ట్ చేసిన ప్రమోటర్ బన్సల్ ఐపీవోలో వాటాలను ఆఫర్ చేయకపోవచ్చని సంబంధిత వర్గాలు తెలియజేశాయి. బన్సల్ గతంలో ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌కు సహవ్యవస్థాపకుడిగా నిలిచిన విషయం విదితమే. కంపెనీ వెబ్సైట్ ప్రకారం నవీ టెక్నాలజీస్ డిజిటల్ లెండింగ్ యాప్ ద్వారా రూ. 20 లక్షల వరకూ రుణాలను అందిస్తోంది. రూ. 3,500 కోట్లకుపైగా లెండింగ్ బుక్‌ను కలిగి ఉంది. చదవండి: క్రూడ్ షాక్... రూపీ క్రాష్!! -
ఐపీవోకు రెండు కంపెనీలు రెడీ
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూలు చేపట్టేందుకు తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రెండు కంపెనీలకు గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. ఈ జాబితాలో టెక్స్టైల్స్ రంగ దిగ్గజం రేమండ్ ప్రమోట్ చేసిన జేకే ఫైల్స్ అండ్ ఇంజినీరింగ్‌తోపాటు ఎలిన్ ఎలక్ట్రానిక్స్ చేరింది. ఐపీవోకు వీలుగా 2021 నవంబర్, డిసెంబర్లలో సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి. రూ. 800 కోట్ల ఇష్యూ జేకే ఫైల్స్ అండ్ ఇంజినీరింగ్ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 800 కోట్లు సమకూర్చుకోవాలని ప్రణాళికలు వేసింది. ఇందుకు అనుగుణంగా ప్రమోటర్ కంపెనీ రేమండ్ లిమిటెడ్ తగినన్ని ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. ప్రస్తుతం జేకే ఫైల్స్‌లో రేమండ్కు 100 శాతం వాటా ఉంది. కంపెనీ ప్రెసిషన్ ఇంజినీర్డ్ విడిభాగాలను రూపొందిస్తోంది. రూ. 760 కోట్లపై కన్ను ప్రధాన బ్రాండ్లకు లైటింగ్స్, ఫ్యాన్లు, చిన్న కిచెన్ అప్లయెన్సెస్ తదితరాలను తయారు చేసి అందిస్తున్న ఎలిన్ ఎల్రక్టానిక్స్ ఐపీవో ద్వారా రూ. 760 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ప్రమోటర్లు, కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్‌చేసిన వాటాదారు సంస్థలు రూ. 585 కోట్ల విలువైన ఈక్విటీని ఆఫర్ చేయనుండగా.. కంపెనీ మరో రూ. 175 కోట్ల విలువైన షేర్లను తాజాగా జారీ చేయనుంది. -
ఐపీవోకు ఉవ్విళ్లూరుతున్న ఎల్ఐసీ! అంతలోనే భారీ షాక్!!
న్యూఢిల్లీ: జీవిత బీమా కంపెనీల కొత్త బిజినెస్ ప్రీమియం ఆదాయం 2022 జనవరిలో 2.65 శాతం పెరిగి, రూ.21,957 కోట్లకు చేరింది. రెగ్యులేటర్– ఐఆర్డీఏఐ (ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా) తాజా గణాంకాలను పరిశీలిస్తే.. ► దేశంలోకి మొత్తం 24 జీవిత బీమా కంపెనీలు 2022 జనవరిలో రూ.21,390 కోట్ల కొత్త బిజినెస్ ప్రీమియంను వసూలు చేశాయి. ► ఈ రంగంలో దిగ్గజ ప్రభుత్వ రంగ సంస్థ– లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) కొత్త ప్రీమియం ఆదాయం 2 శాతం. 5పడిపోయి రూ.12,936.28 కోట్లకు చేరింది. 2021 ఇదే నెల్లో ఎల్ఐసీ కొత్త ప్రీమియం ఆదాయం రూ.13,144 కోట్లు. ► ఇక 23 ప్రైవేటు రంగ కంపెనీల కొత్త ప్రీమియం 9.39 శాతం ఎగసి, రూ.8,246.06 కోట్ల నుంచి రూ. 9,020.75 కోట్లకు చేరింది. ► మొత్తం మార్కెట్లో ఎల్ఐసీ వాటా 61.15 శాతంగా ఉంది. వివిధ కారణాలతో రద్దయిన (ల్యాప్స్డ్) పాలసీలను పునరుద్ధరించుకోవడానికి ఎల్ఐసీ ప్రకటించిన ప్రత్యేక ఆఫర్ ఈ నెల 7వ తేదీ నుంచి మార్చి 27వ తేదీ వరకూ అమలవుతుంది. హెల్త్, మైక్రో ఇన్సూరెన్స్ పాలసీలపైనా లేట్ ఫీజులో రాయితీ ఈ ఆఫర్లో ప్రత్యేకత. ఇక పబ్లిక్ ఇష్యూకు రావడానికి కూడా ఎల్ఐసీ సంసిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. -
Naaptol: నాప్టాల్ సంచలన నిర్ణయం.. అక్కడా కూడా ఎంట్రీకి రెడీ!
అతి తక్కువ ధరలకే వస్తువులను అందించే టెలిషాపింగ్, ఆన్లైన్ ప్లాట్‌ఫాం నాప్టోల్(Naaptol Online Shopping Pvt. Ltd) సంచలన నిర్ణయం తీసుకుంది. ఐపీవో ద్వారా నిధులను సేకరించాలని కంపెనీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రూ. 1,000 కోట్లే లక్ష్యంగా..! నాప్టోల్ ఆన్లైన్ షాపింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఐపీవో ద్వారా 1,000 కోట్ల నిధులను సమీకరించేందుకు ప్రణాళికలను కంపెనీ సిద్ధం చేస్తోంది. ఐపీవో ప్రణాళికలను కంపెనీ చెందిన ప్రముఖ వ్యక్తులు వెల్లడించారు. నాప్టోల్ ఇప్పటికే ఐపీవోకి సంబంధించిన డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్‌పై పని చేస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీకి ఐసిఐసిఐ సెక్యూరిటీస్, ఆనంద్ రాఠి సలహాలను ఇస్తున్నాయి. కంపెనీకి చెందిన ప్రతిపాదిత ఐపీవో ప్రాథమిక, ద్వితీయ వాటా విక్రయాలు మిశ్రమంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కంపెనీకి ఇప్పటికే ఉన్న కొంతమంది ఇన్వెస్టర్లు ఐపీవోలో తమ షేర్లలో కొంత భాగాన్ని అమ్మే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తాజా నిధుల సేకరణ దాని బ్యాక్-ఎండ్, ఆన్లైన్ షాపింగ్ పోర్టల్‌ను బలోపేతం చేయడానికి ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. కాగా నాప్టోల్ వ్యవస్థాపకుడు , చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మను అగర్వాల్ కంపెనీ ఐపీవో ప్రణాళికలపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. తక్కువ ధరలకే..! అతి తక్కువ ధరలకే వస్తువులను అందిస్తూ నాప్టోల్ టెలిషాపింగ్ మార్కెట్లో భారీ ఆదరణనే పొందింది. 2008లో పలు ఉత్పత్తుల ఆవిష్కరణ కోసం మొదటిసారి టీవీ చానల్‌ను కంపెనీ స్థాపించింది. వినూత్నమైన ప్రచారంతో ఆయా ఉత్పత్తులను సేల్ చేస్తోంది. హిందీతో పాటుగా స్థానిక భాషలు తమిళం, తెలుగు, మలయాళం, కన్నడతో సహా బహుళ భాషలలో టీవీ ఛానెల్‌ల ద్వారా ఉత్పత్తులను సేల్ చేస్తోంది. గత ఏడాది ఫ్లాట్‌గా..! జపాన్‌కు చెందిన Mitsui & Co., జేపీ మోర్గాన్, వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్ న్యూ ఎంటర్ప్రైజ్ అసోసియేట్స్ వంటి పెట్టుబడిదారుల మద్దతు నాప్టోల్‌కు ఉంది. వీరి నుంచి 2018లో 15 మిలియన్ డాలర్లను, 2015లో 51.7 మిలియన్ డాలర్లను నాప్టోల్ సేకరించింది. 2021 ఆర్థిక సంవత్సరానికి నాప్టోల్ ఫ్లాట్‌గా రాబడిని చూసినప్పటికీ, మునుపటి ఆర్థిక సంవత్సరంలో నష్టాలతో పోలిస్తే మార్జినల్ లాభాలను పొందగలిగింది. ఇది FY20లో రూ. 321.22 కోట్ల నుంచి, FY21లో రూ. 318.87 కోట్ల ఏకీకృత ఆదాయాన్ని నమోదు చేసింది .అయినప్పటికీ, ఇది FY20లో రూ. 51.84 కోట్ల నష్టం నుంచి FY21లో రూ. 3.42 కోట్ల లాభానికి తన కార్యకలాపాలను మార్చగలిగింది. చదవండి: ఐపీఓకి ముందు ఎల్ఐసీ కీలక నిర్ణయం..! -
Reliance Jio: రిలయన్స్ జియో సంచలన నిర్ణయం..!
భారత టెలికాం రంగ ముఖచిత్రాన్ని మార్చివేసిన రిలయన్స్ జియో మరో సంచలన నిర్ణయం తీసుకోనుంది. రిలయన్స్ జియో ఐపీవో దిశగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. 7.5 లక్షల కోట్ల సమీకరణ..! ఈ ఏడాదిలో రిలయన్స్ జియో ఐపీవోకు వచ్చే అవకాశం ఉన్నట్లు అంతర్జాతీయ ఫైనాన్షియల్ రీసెర్చ్ ఏజెన్సీ సీఎల్ఎస్ఏ ఒక నోట్‌ను విడుదల చేసింది.ఈ ఐపీవో ద్వారా 100 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 7.5 లక్షల కోట్లు) మేర నిధులను సమీకరించేందుకు రిలయన్స్ జియో సిద్దమవుతున్నట్లు సీఎల్ఎస్ఏ వెల్లడించింది. 2022-23 ఆర్థిక సంవత్సరం రెండు లేదా మూడో త్రైమాసికంలో రిలయన్స్ జియో పబ్లిక్ ఇష్యూ జారీ చేసే అవకాశం ఉందని అంచనా వేసింది. సపరేట్గా ఐపీవో..! టెక్ దిగ్గజ కంపెనీలు గూగుల్, ఫేస్బుక్ సంస్థలు రిలయన్స్ జియోతో జత కట్టాయి. వేర్వేరు కంపెనీలకు 33 శాతం కంపెనీ వాటాలను వేర్వేరు కంపెనీలకు ముఖేష్ అంబానీ విక్రయించారు. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ 10 శాతం, గూగుల్ 8 శాతం మేర రిలయన్స్ జియోలో పెట్టుబడులు పెట్టాయి. ఇంటెల్ క్యాపిటల్, క్వాల్కామ్ వెంచర్స్‌తో పాటు టాప్ ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ పార్ట్నర్స్, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్ కూడా రిలయన్స్ జియోలో పెట్టుబడులు పెట్టాయి. ఈ కంపెనీలు జియోలో భారీగా ఇన్వెస్ట్ చేశాయి. వీటి విలువ సుమారు 1.52 లక్షల కోట్ల రూపాయలు. కా ఆయా కంపెనీలకు వాటాలు ఉన్నందున సపరేట్ లిస్టింగ్ చేయాలని రిలయన్స్ మేనేజ్మెంట్ యోచిస్తున్నట్లు సీఎల్ఎస్ఏ పేర్కొంది. ఏడున్నర లక్షల కోట్ల రూపాయల మేర విలువ గల పబ్లిక్ ఇష్యూను రిలయన్స్ జియో జారీ చేస్తే.. ఇదే బిగ్గెస్ట్ ఐపీఓగా నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: ఆర్ఐఎల్కు భారీ నిధులు -
Ola Electric Car: ఓలా తొలి ఎలక్ట్రిక్ కారు వచ్చేది అప్పుడే!
ప్రముఖ రైడ్-హైలింగ్ కంపెనీ ఓలా తన ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 1 మిలియన్ రిజర్వేషన్లు వచ్చినట్లు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భవిష్ అగర్వాల్ తెలిపారు. అలాగే, డిసెంబర్ 15 నుంచి మొదటి బ్యాచ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను డెలివరీ చేయనున్నట్లు పేర్కొన్నారు. జపాన్ దేశానికికు చెందిన సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ మద్దతుతో భారతదేశాన్ని ప్రపంచ ఎలక్ట్రిక్ వాహన కేంద్రంగా మార్చాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. 2023లో ఓలా తన మొదటి ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయలని చూస్తున్నట్లు అగర్వాల్ తెలిపారు. ఎలక్ట్రిక్ కార్లు భారతదేశంలో ఉబెర్ కంపెనీతో పోటీపడుతున్న రైడ్-హైలింగ్ కంపెనీ ఓలా ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి అనేక ప్రపంచ మార్కెట్లలో తన ఉనికిని విస్తరిస్తుంది. ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించే ఓలా ఎలక్ట్రిక్ 2023 నాటికి తన తొలి ఎలక్ట్రిక్ కారును ప్రారంభించడానికి సిద్ధంగా ఉందని కంపెనీ సీఈఓ భవీష్ అగర్వాల్ తెలిపారు. గ్లోబల్ ఎలక్ట్రిక్ వేహికల్ హబ్‌గా ఇండియాను తయారు చేయడమే తన ఆశయమని పేర్కొన్న అగర్వాల్, డిసెంబర్ 15 నుంచి ఈవీ స్కూటర్లను డెలివరీ చేసే పనిలో ఉన్నట్లు రాయిటర్స్ నెక్ట్స్ కాన్ఫరెన్స్ ఇంటర్వ్యూలో చెప్పారు. (చదవండి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త..!) ఐపీఓ ప్రణాళికలు ఓలా వచ్చే సంవత్సరం 2022 తొలి అర్ధభాగంలో పబ్లిక్ ఇష్యూకు వచ్చే అవకాశం ఉందని సంస్థ సీఈఓ భవీష్ అగర్వాల్ తెలిపారు. ఈ ఇష్యూ ద్వారా 1 బిలియన్ డాలర్లు (సుమారు రూ.7,500 కోట్లు) సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ప్రస్తుతం స్టాక్‌మార్కెట్ ఒడుదొడుకుల మధ్య కదలాడుతుండటం, ఇటీవల కొన్ని కంపెనీల షేర్లు పేలవంగా నమోదైన నేపథ్యంలో ఆయన ఇలా పేర్కొనడం గమనార్హం. సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ మద్దతుతో వ్యక్తిగత రుణాలు, సూక్ష్మ రుణ సేవలు అందించేందుకు 'సూపర్ యాప్' రూపకల్పనను వేగవంతం చేసినట్లు అగర్వాల్ వెల్లడించారు. (చదవండి: దేశ ఆర్థిక వ్యవస్థపై నోబెల్ బహుమతి గ్రహీత కీలక వ్యాఖ్యలు) -
LIC IPO: పాన్ నంబరు అప్డేట్ చేయండి.. ఎల్ఐసీ సూచన
న్యూఢిల్లీ: ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూలో పాల్గొనేందుకు తమ తమ పాన్ నంబర్లను అప్డేట్ చేయాల్సిందిగా పాలసీదారులకు ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) సూచించింది. ఇష్యూకి సబ్స్క్రయిబ్ చేయాలంటే కంపెనీ రికార్డుల్లో పాలసీదారుల తాజా పాన్ వివరాలు ఉండాలని, అలాగే చెల్లుబాటయ్యే డీమ్యాట్ ఖాతా అవసరమని పేర్కొంది. దీనిపై పాలసీహోల్డర్లలో అవగాహన పెంచేందుకు ప్రచార కార్యకర్మాలు నిర్వహిస్తున్నామని ఎల్ఐసీ తెలిపింది. ఒకవేళ ఎవరికైనా డీమ్యాట్ ఖాతా లేకపోతే తమ సొంత ఖర్చుతో ఒక అకౌంటును తీసుకోవాలని పేర్కొంది. సదరు డీమ్యాట్ ఖాతా తెరవడం, నిర్వహణ.. పాన్ జారీ మొదలైన వాటికి అయ్యే ఖర్చు లను పాలసీదారే భరించాల్సి ఉంటుందని, కంపెనీకి సంబంధం లేదని ఎల్ఐసీ స్పష్టం చేసింది. ఐపీవోకి రెడీ ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ ప్రతిపాదనకు ఈ ఏడాది జూలైలో ప్రభుత్వం ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరంలోనే దీన్ని పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రతిపాదన ప్రకారం ఇష్యూ పరిమాణంలో 10 శాతం దాకా షేర్లను పాలసీదారులకు కేటాయించాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ.1.75 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. ఈ లక్ష్యాన్ని సాధించడంలో ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ కీలకంగా ఉండనుంది. చదవండి: ఎల్ఐసీ ఐపీవోకు మర్చంట్ బ్యాంకర్లు రెడీ -
ఇన్స్పిరా ఐపీవోకు గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: ఐటీ సొల్యూషన్లు అందించే ఇన్స్పిరా ఎంటర్ప్రైజ్ ఇండియా పబ్లిక్ ఇష్యూ చేపట్టనుంది. ఇందుకు తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతించింది. ఐపీవోలో భాగంగా ఇన్స్పిరా రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 500 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా రూ. 800 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ప్రకాష్ జైన్ రూ. 131 కోట్లు, ప్రకాష్ జైన్ కుటుంబ ట్రస్ట్ రూ. 277 కోట్లు, మంజులా జైన్ కుటుంబ ట్రస్ట్ రూ. 92 కోట్లు విలువైన ఈక్విటీని ఆఫర్ చేయనున్నాయి. కంపెనీ ఆగస్టులో సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 75 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. తాజా ఈక్విటీ నిధులను వర్కింగ్ క్యాపిటల్‌తోపాటు, సాధారణ కార్పొరేట్ అవసరాలు, రుణ చెల్లింపులకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో ఇన్స్పిరా పేర్కొంది. -
ఐపీవోలకు ‘బీమా’ సంస్థల క్యూ
ముంబై: ఇప్పటికే కిక్కిరిసిపోయిన పబ్లిక్ ఇష్యూల మార్కెట్లో కొత్తగా బీమా రంగానికి సంబంధించిన మరో మూడు సంస్థలు ఐపీవోకి సిద్ధమవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇవి రూ. 10,000 కోట్లు పైగా సమీకరించనున్నాయి. ఇన్సూరెన్స్ బ్రోకరేజి సంస్థ పాలసీబజార్ని నిర్వహించే పీబీ ఫిన్‌టెక్, ఆరోగ్య బీమా సంస్థ స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ, థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ మెడి అసిస్ట్ హెల్త్‌కేర్ సర్వీస్ ఈ జాబితాలో ఉన్నాయి. ఇవి ఇప్పటికే మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక పత్రాలు దాఖలు చేశాయి. ఈ ఏడాది ఇప్పటిదాకా దాదాపు 40 పైగా కంపెనీలు ఐపీవోకి రాగా .. సుమారు రూ. 70,000 కోట్ల పైగా నిధులు సమీకరించాయి. ఆగస్టులో ఇప్పటిదాకా 24 పైగా సంస్థలు ఐపీవోకి సంబంధించి పత్రాలు దాఖలు చేశాయి. ఈ ఏడాదిలో ఏకంగా 100 పైగా పబ్లిక్ ఇష్యూలు రాగలవని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. రెండో భారీ ఇష్యూగా పీబీ ఫిన్‌టెక్.. పీబీ ఫిన్‌టెక్ సుమారు రూ. 6,017 కోట్లు సమీకరించనుంది. టైగర్ గ్లోబల్, టెన్సెంట్ హోల్డింగ్స్ వంటి దిగ్గజాలు ఇందులో ఇన్వెస్ట్ చేశాయి. ఈ ఏడాదిలో జొమాటో తర్వాత పీబీ ఫిన్టెక్ది రెండో అతి భారీ ఇష్యూ కానుంది. జొమాటో రూ. 9,375 కోట్లు సమీకరించిన సంగతి తెలిసిందే. మరోవైపు స్టాండెలోన్ ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ అయిన స్టార్ హెల్త్ దాదాపు రూ. 3,000 కోట్లు సమీకరించే యత్నాల్లో ఉంది. అటు దేశీయంగా అతి పెద్ద థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్‌గా కార్యకలాపాలు సాగిస్తున్న మెడి అసిస్ట్ సుమారు రూ. 840–1,000 కోట్ల నిధులను ఐపీవో ద్వారా సమీకరించనున్నట్లు ముసాయిదా ప్రాస్పెక్టస్‌ల (డీఆర్‌హెచ్‌పీ) ద్వారా తెలుస్తోంది. పీబీ ఫిన్‌టెక్ ఆగస్టు 4న, స్టార్ హెల్త్ జులై 28న, మెడి అసిస్ట్ మే 11న సెబీకి డీఆర్‌హెచ్‌పీలు సమర్పించాయి. ఒక్కో ఇష్యూ ఇలా.. దేశీయంగా ప్రైవేట్ రంగంలో స్టార్ హెల్త్ అతి పెద్ద స్టాండెలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థగా ఉంది. దీనికి సుమారు 15.8 శాతం మార్కెట్ వాటా ఉంది. ఇందులో ఇన్వెస్ట్మెంట్ గురు రాకేష్ ఝున్‌ఝున్‌వాలాతో పాటు వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్ వంటి దిగ్గజ సంస్థలు ఇన్వెస్ట్ చేశాయి. పబ్లిక్ ఇష్యూలో భాగంగా రూ. 2,000 కోట్ల విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయనుండగా, వాటాదారులు 6 కోట్ల పైచిలుకు షేర్లను ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో విక్రయించనున్నారు. సేఫ్‌క్రాప్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియా 3.06 కోట్ల షేర్లు, ఎపిస్ గ్రోత్ 76 లక్షల షేర్లు విక్రయించనున్నాయి. మరోవైపు, పాలసీబజార్, ఆన్లైన్ రుణాల ప్లాట్‌ఫాం పైసాబజార్‌లను పీబీ ఫిన్‌టెక్ నిర్వహిస్తోంది. పరిమాణంపరంగా ప్రస్తుతం ఆన్లైన్లో పాలసీ విక్రయాలకు సంబంధించి పాలసీబజార్‌కు 93.4 శాతం మార్కెట్ వాటా ఉంది. 2020 ఆర్థిక సంవత్సరంలో మొత్తం డిజిటల్ ఇన్సూరెన్స్ విక్రయాల పరిమాణంలో సుమారు 65.3 శాతం లావాదేవీలు దీని ద్వారానే జరిగాయి. పాలసీబజార్ కొత్తగా రూ. 3,750 కోట్ల విలువ చేసే షేర్లను జారీ చేయనుండగా, ప్రస్తుత వాటాదారులు సుమా రు రూ. 2,267 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. ఇక మెడిఅసిస్ట్ విషయం తీసుకుంటే.. ఆదాయాలు, ప్రీమియం వసూళ్ల సేవలు తదితర అంశాలపరంగా దేశంలోనే అతిపెద్ద థర్డ్–పార్టీ ఇన్సూరెన్స్ అడ్మినిస్ట్రేటరుగా కార్యకలాపాలు సాగిస్తోంది. దేశవ్యాప్తంగా 722 నగరాలు, పట్టణాల్లో 11,000 పైచిలుకు ఆస్పత్రులతో భారీ నెట్వర్క్ ఉంది. అపోలో హాస్పిటల్స్ మణిపాల్ హాస్పిటల్, ఫోర్టిస్ హెల్త్‌కేర్, నారాయణ హృదయాలయ, మ్యాక్స్ హెల్త్‌కేర్ వంటి పేరొందిన హాస్పిటల్ చెయిన్లకు థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటరుగా (టీపీఏ) వ్యవహరిస్తోంది. పబ్లిక్ ఇష్యూకి సంబంధించి ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో విక్రమ్‌జిత్ సింగ్ చత్వాల్, మెడిమ్యాటర్ హెల్త్ మేనేజ్మెంట్, బెస్సీమర్ హెల్త్ క్యాపిటల్, ఇన్వెస్ట్‌కార్ప్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ 1 మొదలైన ఇన్వెస్టర్లు 25,39,092 షేర్లను విక్రయిస్తున్నాయి. -
ఐపీవో యోచనలో మేఘా ఇంజనీరింగ్
శ్రీనగర్ నుంచి సాక్షి ప్రతినిధి ఎన్. పార్థసారథి: ఇన్ఫ్రా రంగ దిగ్గజం మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా (ఎంఈఐఎల్) పబ్లిక్ ఇష్యూకి రావాలనే యోచనలో ఉంది. అలాగే మరిన్ని కొత్త టెక్నాలజీలను కూడా దేశీయంగా అందుబాటులోకి తేవడంపై దృష్టి పెడుతోంది. ఎంఈఐఎల్ ఎండీ పి.వి. కృష్ణారెడ్డి ఈ విషయాలు తెలిపారు. అయితే, ఎప్పట్లోగా ఐపీవోకి రానున్నది, ఎంత మేర నిధులు సమీకరించనున్నది ఆయన వెల్లడించలేదు. మరోవైపు, హైడ్రోజన్ సంబంధ టెక్నాలజీకి సంబంధించి ఒక ఇటాలియన్ సంస్థతో కలిసి పనిచేస్తున్నామని కృష్ణారెడ్డి చెప్పారు. ఇటీవలే అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకున్నామని వివరించారు. కొత్త తరహా సాంకేతికతలపై సుమారు రూ. 15–20 వేల కోట్ల దాకా ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ‘మేము ఇప్పటికే ఎలక్ట్రిక్ బస్సులు, ఆటోల్లాంటివి తయారు చేస్తున్నాం. దేశవ్యాప్తంగా 1,000కి పైగా ఎలక్ట్రిక్ బస్సులు నిర్వహిస్తున్నాం. అలాగే ఆన్‌షోర్, ఆఫ్‌షోర్ రిగ్గుల తయారీ, ఎక్స్‌ప్రెస్ వేస్, విద్యుత్ పంపిణీ తదితర రంగాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నాం‘ అని కృష్ణారెడ్డి వివరించారు. అటు ఆఫ్రికా, దక్షిణ అమెరికా తదితర ఖండాల్లో 18 పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నామన్నారు. డిజిన్వెస్ట్‌మెంట్ సంస్థలపై ఆసక్తి.. కేంద్ర పభుత్వం పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా వాటాలు విక్రయిస్తున్న సంస్థలను దక్కించుకోవడంపై కసరత్తు చేస్తున్నట్లు కృష్ణారెడ్డి చెప్పారు. బీఈఎంఎల్, షిప్పింగ్ కార్పొరేషన్, నీలాచల్ ఇస్పాత్ వంటి సంస్థల విషయంలో అర్హత కూడా సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. కొనుగోళ్లకు సంబంధించి అవసరాన్ని బట్టి ఏడాది, రెండేళ్ల వ్యవధిలో రూ. 15,000–20,000 కోట్ల దాకా నిధులు సమీకరించుకోవాలని భావిస్తున్నట్లు చెప్పా రు. విదేశాల నుంచి సమీకరించే నిధులను భారత్‌లోనే ఇన్వెస్ట్ చేస్తామని, విదేశాల్లో ఇన్వెస్ట్ చేసే యోచనేదీ తమకు లేదని కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. డెడ్‌లైన్ కన్నా ముందే జోజిలా టన్నెల్ పూర్తి.. శ్రీనగర్–లేహ్ మధ్యలో నిర్మిస్తున్న వ్యూహాత్మక జోజిలా టన్నెల్ ప్రాజెక్టు పనులను నిర్దేశిత గడువు కన్నా ముందే పూర్తి చేస్తామని కృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధితో స్థానికంగా ఉపాధి కల్పనకు, పర్యాటక రంగానికి ఊతం లభించగలదని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో టన్నెల్ ప్రాజెక్టుల అనుభవంతో, కాంపిటీటివ్‌గా బిడ్ చేసి జోజిలా ప్రాజెక్టు దక్కించుకున్నామని ఆయన వివరించారు. ప్రస్తుతం తమ సంస్థలో 35,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారని, వివిధ ప్రాజెక్టుల్లో మూడు లక్షల మంది దాకా పనిచేస్తున్నారని కృష్ణారెడ్డి వివరించారు. తమ ప్రాజెక్టుల అవసరాలకు సంబంధించి చిన్న, మధ్య తరహా సంస్థలతో కూడా కలిసి పనిచేస్తుండటం ద్వారా వాటికి కూడా తోడ్పాటు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని కృష్ణారెడ్డి చెప్పారు. చదవండి: ఒలెక్ట్రాకు మరో 150 బస్‌ల ఆర్డర్ -
కొత్త ప్రణాళికను సిద్ధం చేస్తోన్న ట్రూకాలర్..!
స్టాక్‌హోమ్: స్వీడిష్ కాలర్ ఐడెంటిఫికేషన్ సర్వీస్ మరో కొత్త ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీకి చెందిన క్లాస్ బీ షేర్లను నాస్డాక్ స్టాక్‌హోమ్‌లో లిస్ట్ చేయడానికి ప్లాన్ వేస్తోంది. మార్కెట్ పరిస్థితులను బట్టి ట్రూకాలర్ లిస్టింగ్ 2021 నాల్గో త్రైమాసికంలో పూర్తవుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఐపీవోలో భాగంగా 116 మిలియన్ డాలర్లను సేకరించాలని కంపెనీ యోచిస్తోంది. చదవండి: Jeff Bezos:జెఫ్‌బెజోస్ దెబ్బకు దిగివచ్చిన నాసా..! ట్రూకాలర్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అలాన్ మామెడి మాట్లాడుతూ...కనీసం రెండు సంవత్సరాల పాటు ఐపీవోపై ట్రూకాలర్ పనిచేస్తోందని వెల్లడించారు. సీక్వోయా క్యాపిటల్ , అటామికో కంపెనీలు ట్రూకాలర్ ఇన్వెస్టర్లుగా నిలిచాయి. ఒక నివేదిక ప్రకారం ట్రూకాలర్ సుమారు 95 మిలియన్ డాలర్లను సేకరించింది. గత ఆరు సంవత్సరాల నుంచి పలు ఇన్వెస్టర్ల నుంచి 100 మిలియన్ డాలర్లను సేకరించడంతో ట్రూకాలర్ విలువ ఒక బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా 278 మిలియన్ల ఆక్టివ్ యూజర్లు ట్రూకాలర్ సొంతం. ఇటీవలి కాలంలో ఆపిల్, గూగుల్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌లలో కాలర్ ఐడి ఫీచర్‌ను మెరుగుపరిచినప్పటికీ, స్పామ్ కాల్‌లను అరికట్టడానికి అనేక ఇతర చర్యలు తీసుకున్నప్పటికీ, ట్రూకాలర్ వాటిని పరిష్కరించలేకపోయింది. భారత్‌ను అతి పెద్ద మార్కెట్‌గా ట్రూకాలర్ పరిగణిస్తోంది. చదవండి: MediaTek : భారీ రిక్రూట్మెంట్కు ప్లాన్ చేస్తోన్న మీడియాటెక్..! -
ఆగస్టులో ఐపీవో స్పీడ్ డౌన్
న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో దూకుడు చూపుతూ వచ్చిన ప్రైమరీ మార్కెట్ గత నెలలో కొంతమేర మందగించింది. అయితే ఇదే సమయంలో సెకండరీ మార్కెట్లు రేసు గుర్రాల్లా దౌడు తీశాయి. ప్రామాణిక ఇండెక్సులు సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త గరిష్టాలకు చేరడం ద్వారా రికార్డులు నెలకొల్పాయి. ఒక్క ఆగస్ట్ నెలలోనే 9 శాతం పురోగమించాయి. సెన్సెక్స్ 57,000, నిఫ్టీ 17,000 పాయింట్ల మైలురాళ్లను అధిగమించాయి. ఈ జోష్‌తో 10 కంపెనీలు విజయవంతంగా పబ్లిక్ ఇష్యూలను పూర్తి చేసుకున్నాయి. తద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యాయి. అయితే లిస్టింగ్‌లో సగం కంపెనీలు ఇన్వెస్టర్లను నిరాశపరచాయి. వివరాలు ఎలా ఉన్నాయంటే.. స్పందన సైతం గత కేలండర్ ఏడాది(2020)లో అటు ఇన్వెస్టర్ల స్పందనలోనూ.. ఇటు లిస్టింగ్ లాభాల్లోనూ జోరు చూపిన ఐపీవోలు ఈ ఏడాది(2021)లోనూ ఇదే ట్రెండ్‌ను కొనసాగించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22)ను పరిగణిస్తే ఏప్రిల్ నుంచి 20 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి. రూ. 45,000 కోట్లను సమీకరించాయి. వీటిలో ఆగస్ట్‌లోనే 10 కంపెనీలు ఐపీవోలు పూర్తి చేసుకున్నాయి. అయితే గత నెలకల్లా ఐపీవోల స్పీడ్‌కు బ్రేక్ పడింది. ఇష్యూలకు ఇన్వెస్టర్ల నుంచి ఆసక్తి తగ్గింది. దీంతో ఇష్యూ ధరతో పోలిస్తే సగం కంపెనీలు నీరసంగా లిస్టయ్యాయి. ఇందుకు వెల్లువెత్తుతున్న ఇష్యూలు, నాణ్యమైన ఆఫర్లు కరవుకావడం వంటి అంశాలు కారణమైనట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ తెలియజేశారు. దీనికితోడు మిడ్, స్మాల్ క్యాప్స్‌లో భారీ ఒడిదొడుకులు నమోదుకావడం ప్రభావం చూపినట్లు విశ్లేషించారు. ఆగస్ట్‌లో మిడ్ క్యాప్ 3.3 శాతం పుంజుకోగా.. స్మాల్ క్యాప్ 0.5 శాతమే బలపడింది. జాబితా ఇదీ ఆగస్ట్‌లో గ్లెన్‌మార్క్ లైఫ్ సైన్సెస్, రోలెక్స్ రింగ్స్, ఎగ్జారో టైల్స్, విండ్లాస్ బయోటెక్, క్రిస్నా డయాగ్నోస్టిక్స్, దేవయాని ఇంటర్నేషనల్, కార్‌ట్రేడ్ టెక్, నువోకో విస్టాస్ కార్పొరేషన్, కెమ్‌ప్లాస్ట్ సన్మార్, ఆప్టస్ వేల్యూ హౌసింగ్ ఫైనాన్స్ ఇండియా ఐపీవోలను పూర్తి చేసుకుని లిస్టింగ్ సాధించాయి. వీటిలో ఐదు కంపెనీలే ఇన్వెస్టర్లకు హుషారునిచ్చాయి. దేవయాని ఇంటర్నేషనల్ 37 శాతం, రోలెక్స్ రింగ్స్ 30 శాతం ప్రీమియంతో లిస్టింగ్‌ను సాధించాయి. ఈ బాటలో ఎగ్జారో టైల్స్ 10 శాతం, గ్లెన్‌మార్క్ లైఫ్ 4 శాతం లాభాలతో మాత్రమే లిస్టయ్యాయి. ఇక తొలి రోజు క్రిస్నా 4% బలపడింది. నష్టాలతో.. ఇష్యూ ధరతో పోలిస్తే విండ్లాస్ బయోటెక్ 11 శాతం నష్టంతో లిస్టయ్యింది. ఇక కార్‌ట్రేడ్ టెక్ 8 శాతం, నువోకో విస్టాస్ 7 శాతం డిస్కౌంట్‌తో నమోదయ్యాయి. కెమ్‌ప్లాస్ట్ సన్మార్, ఆప్టస్ వేల్యూ ట్రేడింగ్ రోజున 1 శాతం చొప్పున నష్టాలతో ముగిశాయి. కాగా.. గత నెలలో వచ్చిన అన్ని ఐపీవోలు సక్సెస్ అయినప్పటికీ దేవయాని, రోలెక్స్ రింగ్స్‌కు మాత్రమే భారీ స్పందన లభించడం గమనార్హం! ఐపీవోకు ఈఎస్డీఎస్ సాఫ్ట్వేర్ న్యూఢిల్లీ: క్లౌడ్ సర్వీసులు, డేటా సెంటిర్ల సంస్థ ఈఎస్డీఎస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ పబ్లిక్ ఇష్యూ చేపట్టే యోచనలో ఉంది. తద్వారా రూ. 1,300 కోట్లు సమకూర్చుకోవాలని ప్రణాళికలు వేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకు వీలుగా ఈ నెలలోనే క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయనుంది. 2005లో ప్రారంభమైన కంపెనీ క్లౌడ్ సర్వీసులు, డేటా సెంటర్లతోపాటు.. ప్రొడక్ట్ ఆర్అండ్డీ తదితర సేవలు అందిస్తోంది. కస్టమర్లలో చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్, టాటా క్యాపిటల్, డీసీబీ బ్యాంక్, ముత్తూట్ గ్రూప్, యూనియన్ బ్యాంక్ తదితరాలున్నాయి. ఐపీవోకు తొందర లేదు:ఫోన్‌పే న్యూఢిల్లీ: ఐపీవోకు వెళ్లేందుకు తొందర లేదని ఫోన్‌పే సీఈవో సమీర్ నిగమ్ స్పష్టం చేశారు. కంపెనీకి అర్ధవంతం, కారణం ఉన్నప్పుడు మాత్రమే వెళ్తామని అన్నారు. ‘కంపెనీ అయిదేళ్ల క్రితం ప్రారంభమైంది. 30 కోట్ల పైచిలుకు కస్టమర్లు ఉన్నారు. ఆర్థిక సేవల్లోకి లోతుగా చొచ్చుకుపోతున్నాం. మ్యూచువల్ ఫండ్స్, బీమా విభాగాల్లో గణనీయమైన పెరుగుదలను ఫోన్‌పే నమోదు చేసింది. త్వరలో బీటూబీ అకౌంట్ అగ్రిగేటర్సహా ఇతర సేవల్లోకి అడుగు పెడుతున్నాం. పోటీ కంపెనీ ఐపీవోకు వెళితే నేను లెక్క చేయను’ అని తెలిపారు. రూ.7.47 లక్షల కోట్ల విలువైన 394.13 కోట్ల లావాదేవీ లను జూన్ క్వార్టర్లో ఫోన్‌పే నమోదు చేసింది.