ట్యాక్సీ సేవల దిగ్గజం ఓలా పబ్లిక్ ఇష్యూ యోచనలో ఉంది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయనుంది. తద్వారా రూ. 7,000–11,000 కోట్ల మధ్య నిధుల సమీకరణ చేపట్టాలని ఓలా మాతృ సంస్ధ ఏఎన్‌ఐ టెక్నాలజీస్ భావిస్తోంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఇష్యూ నిర్వహణకు సిటీగ్రూప్, కోటక్ మహీంద్రా బ్యాంక్ తదితర ఎంపిక చేసిన సంస్థలతో చర్చలు చేపట్టింది.
ఆస్టిన్ జీఐఎస్‌లో టెక్‌మహీంద్రా పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఆస్టిన్ జీఐఎస్‌లో 13.8 శాతం వాటాను టెక్ మహీంద్రా తన యూఎస్ సబ్సిడరీ (టెక్‌మహీంద్రా ఐఎన్‌సీ) రూపంలో కొనుగోలు చేయనుంది. ఇందుకోసం 1.25 మిలియన్ డాలర్లు (రూ.9.37కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. ఐవోటీ/5జీ విభాగంలో సేవల విస్తరణకు ఈ కొనుగోలు తోడ్పడనుందని కంపెనీ ప్రకటించింది.
ఐపీఓకి ఓలా,వేల కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా సన్నాహాలు
Published Tue, Aug 31 2021 9:14 AM | Last Updated on Tue, Aug 31 2021 9:14 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment