Ola Cab Services
-
గూగుల్ మ్యాప్స్‌తో ఒప్పందం రద్దు.. రూ.100 కోట్లు ఆదా!
ప్రముఖ ఆన్లైన్ క్యాబ్ సర్వీస్ సంస్థ ఓలా గూగుల్ మ్యాప్స్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై ఓలా క్యాబ్స్ ప్లాట్‌పామ్‌లో గూగుల్ మ్యాప్స్‌ను వినియోగించబోమని తెలిపింది. ఇందుకు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక లొకేషన్ ఇంటెలిజెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పింది. గూగుల్ మ్యాప్స్‌తో ఒప్పందం రద్దు చేసుకోవడం వల్ల కంపెనీకి ఏటా రూ.100 కోట్లు ఆదా అవుతాయని సంస్థ సహ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ఓలా క్యాబ్ సర్వీస్‌ల్లో గూగుల్ మ్యాప్స్‌ను రద్దు చేస్తున్నాం. ఇందుకు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక లొకేషన్ ఇంటెలిజెన్స్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చాం. గూగుల్‌తో ఒప్పందం రద్దు చేసుకోవడం వల్ల కంపెనీకు ఏటా రూ.100 కోట్లు ఆదా అవుతుంది. కొత్త సర్వీసులు అందుబాటులోకి రావాలంటే వినియోగదారులు తమ ఓలా యాప్‌ను అప్డేట్ చేసుకోవాలి. ఓలా లొకేషన్ ఇంటెలిజెన్స్‌లో స్ట్రీట్ వ్యూ, ఇండోర్ చిత్రాలు, డ్రోన్ మ్యాప్‌లు, 3డీ మ్యాప్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి’ అని చెప్పారు.ఓలా క్లౌడ్ సర్వీస్‌లను గతంలో మైక్రోసాఫ్ట్ అజూర్ నిర్వహించేది. కానీ ఇటీవల ఆ సంస్థతో కార్యకలాపాలు నిలిపేస్తున్నట్లు ఓలా ప్రకటించింది. అజూర్ స్థానంలో ‘క్రుత్రిమ్ ఏఐ క్లౌడ్’ సేవలు వినియోగించుకుంటున్నామని కంపెనీ తెలిపింది. ఈ క్రుత్రిమ్ ఏఐ మ్యాపింగ్ సొల్యూషన్స్‌ను కూడా అందిస్తుందని పేర్కొంది. త్వరలో ఈ క్లౌడ్‌లో మరిన్ని ప్రోడక్ట్ అప్డేట్లు వస్తాయని చెప్పింది.ఇదీ చదవండి: సంగీత్‌లో అదిరిపోయే స్టెప్పులేసిన అంబానీ కుటుంబంఅక్టోబర్ 2021లో ఓలా పుణెకు చెందిన జియోసాక్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ ‘జియోస్పేషియల్’ సేవలను అందిస్తోంది. గూగుల్ మ్యాప్స్ స్థానంలో ఓలా క్యాబ్స్ జియోసాక్ సేవలు వినియోగించుకుంటుంది. దాంతో కంపెనీకు ఏటా రూ.100 కోట్లు ఆదా అవుతుంది. -
ధరలు తగ్గిస్తే తప్పేంటీ? నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఓలా గుత్తాధిపత్య ధరల విధానాన్ని అనుసరిస్తోందని దాఖలైన అప్పీలెంట్ పిటిషన్‌ను నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) కొట్టివేసింది. బెంగళూరు మార్కెట్లో ఓలా అసమంజస ధరల విధానాన్ని అవలంభిస్తోందని మేరు, ఫాస్ట్ ట్రాక్ కాల్ క్యాబ్ ఈ పిటిషన్లను దాఖలు చేశాయి. ఓలా బ్రాండ్ పేరుతో యాప్ ఆధారిత టాక్సీ సర్వీస్‌ను నడుపుతున్న ఏఎన్‌టీ టెక్నాలజీస్‌కు వ్యతిరేకంగా సంస్థలు ఈ అప్పీళ్లను దాఖలు చేశాయి. ఈ మేరకు సంస్థలు తొలుత దాఖలైన పిటిషన్లను కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) 2017 జూలైలో కొట్టివేసింది. దీనిపై ఆయా సంస్థలు అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా, అక్కడ కూడా వ్యతిరేక రూలింగ్ వచ్చింది. పిటిషన్లను తిరస్కరిస్తూ, బెంగళూరు మార్కెట్లో ఓలా ఆధిపత్య స్థానంలో లేదని ఎన్సీఎల్ఏటీ పేర్కొంది. అలాంటప్పుడు అసలు గుత్తాధిపత్య, దోపిడీ, అసమంజస ధరల ఆరోపణలే తప్పని రూలింగ్ ఇచ్చింది. ధరలు తగ్గించారు.. తమ పెట్టుబడిదారుల నుంచి నాలుగు సిరీస్‌లలో నిధులను స్వీకరించిన తర్వాత బెంగళూరులోని రేడియో ట్యాక్సీ సేవలపై గుత్తాధిపత్యం సాధించాలనే ఏకైక ఉద్దేశ్యంతో ఓలా వినియోగదారులకు తగ్గింపులు, డ్రైవర్లకు ప్రోత్సాహకాలను అందించిందని, తద్వారా దోపిడీ ధరలకు పాల్పడిందని మేరు, ఫాస్ట్ ట్రాక్ కాల్ క్యాబ్ తమ పిటిషన్లలో ఆరోపించాయి. ఆరోపణలు అర్థరహితం! అప్పీలేట్ ట్రిబ్యునల్ ప్రకారం ఓలా తన బ్రాండ్, నెట్‌వర్క్‌ను పటిష్టం చేసుకోడానికి తగిన వ్యూహాన్ని అవలంభించింది. వినియోగదారులకు సమర్థవంతమైన స్నేహపూర్వకమైన సేవలను అందించడం ద్వారా ప్రత్యర్థి సంస్థలకు పోటీని ఇవ్వడమే దీని లక్ష్యం తప్ప, దీనిని గుత్తాధిపత్య ధోరణిగా పరిగణించలేమని జస్టిస్ జరత్ కుమార్ జైన్ మరియు అలోక్ శ్రీవాస్తవలతో కూడిన అప్పీలేట్ ట్రిబ్యునల్ పేర్కొంది. ఇక డ్రైవర్లకు ఇచ్చిన ప్రోత్సాహకాల గురించి ప్రస్తావిస్తూ, ఇది కేవలం వారికి కేవలం ఒక ఎంపిక (ఆప్షనల్) అని వివరించింది. డిమాండ్ పెరిగిన సందర్భంలో ఓలా తన నెట్‌వర్క్‌లోకి ఎక్కువ మంది డ్రైవర్లను తీసుకురావడానికి మాత్రమే దీని ఉద్దేశ్యమని తెలిపింది. ఓలా కస్టమర్ డిస్కౌంట్ల ద్వారా డిమాండ్‌ను పెంచడానికి కృషి చేసిందని ఇక్కడ భావించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ దిశలోనే ఎక్కువ మంది డ్రైవర్లను నెట్‌వర్క్‌లోకి తీసుకురావడానికి ప్రయత్నించిందని పేర్కొంది. ఓలా–డ్రైవర్లు–కస్టమర్ల పరస్పర ప్రయోజనాలకు ఉద్దేశించి ఓలా చర్యలు ఉన్నాయని బెంచ్ అభిప్రాయపడింది. చదవండి:అనిల్ అగర్వాల్ చేజారిన వీడియోకాన్! -
ఐపీఓకి ఓలా,వేల కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా సన్నాహాలు
ట్యాక్సీ సేవల దిగ్గజం ఓలా పబ్లిక్ ఇష్యూ యోచనలో ఉంది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయనుంది. తద్వారా రూ. 7,000–11,000 కోట్ల మధ్య నిధుల సమీకరణ చేపట్టాలని ఓలా మాతృ సంస్ధ ఏఎన్ఐ టెక్నాలజీస్ భావిస్తోంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఇష్యూ నిర్వహణకు సిటీగ్రూప్, కోటక్ మహీంద్రా బ్యాంక్ తదితర ఎంపిక చేసిన సంస్థలతో చర్చలు చేపట్టింది. ఆస్టిన్ జీఐఎస్‌లో టెక్‌మహీంద్రా పెట్టుబడులు న్యూఢిల్లీ: ఆస్టిన్ జీఐఎస్‌లో 13.8 శాతం వాటాను టెక్ మహీంద్రా తన యూఎస్ సబ్సిడరీ (టెక్‌మహీంద్రా ఐఎన్‌సీ) రూపంలో కొనుగోలు చేయనుంది. ఇందుకోసం 1.25 మిలియన్ డాలర్లు (రూ.9.37కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. ఐవోటీ/5జీ విభాగంలో సేవల విస్తరణకు ఈ కొనుగోలు తోడ్పడనుందని కంపెనీ ప్రకటించింది. -
స్మార్ట్ ట్రాఫిక్
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ట్రాఫిక్నియంత్రణకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందజేసేందుకు ప్రముఖ క్యాబ్ సంస్థ ఓలా ముందుకొచ్చింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఓలా అందజేసే ‘స్మార్ట్ ట్రాఫిక్ సొల్యూషన్స్’ ద్వారా ట్రాఫిక్ నియంత్రణచర్యలను చేపడతారు. ఈ ఒప్పందంతో ఓలా రూపొందించిన ‘ఇంటెలిజెంట్ ఇన్ సైట్స్’ను షేర్ చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది. దీంతో నగరంలో మొబిలిటీ సేవలనుమరింత పటిష్టంగా అమలు చేయొచ్చు. ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, ఓలా రీజినల్ హెడ్ సందీప్ ఉపాధ్యాయ్లు ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. రవాణా సంబంధిత పాలనా వ్యవహారాలను బలోపేతం చేసేందుకు అవసరమైన మొబిలిటీ డేటా, ఉపకరణాల సృష్టికి ఓలా చేస్తున్న ప్రయత్నాల్లో ఇదో మైలురాయిగా నిలుస్తుందని జయేశ్‌రంజన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నగర అభివృద్ధిలో మొబిలిటీ కీలక పాత్ర పోషిస్తుందని, సమగ్ర స్మార్ట్ సిటీ ప్లాన్ రూపొందించడంపై దృష్టి సారించామని చెప్పారు. ఓలా అందించే విలువైన డేటా ఇన్ సైట్స్ భవిష్యత్ అవసరాలకు ఎంతో దోహదం చేస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం, ఓలాల ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ట్రాఫిక్, ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ను సరళీకృతం చేస్తుందన్నారు. డైనమిక్ మ్యాపింగ్ రూపకల్పన... ఈ అవగాహన ఒప్పందంలో భాగంగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఓలా సంస్థ భాగస్వామ్యంలోని వాహనాల నెట్వర్క్ ద్వారా నగరంలోని ప్రధాన రహదారులపై మెరుగైన ప్రయాణ సదుపాయాలను చేపట్టేందుకు కావాల్సిన డైనమిక్ మ్యాపింగ్‌ను రూపొందిస్తారు. ఆ డేటాను నగరంలో రహదారుల నాణ్యతను పర్యవేక్షించే, నిర్వహించే సంబంధిత ప్రభుత్వ విభాగాలకు అందజేస్తారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా వచ్చే ఫలితం గుంతల కారణంగా జరిగే ప్రమాదాలను తగ్గించేందుకు, రోడ్డు నిర్మాణాల నాణ్యతను పర్యవేక్షించేందుకు అవకాశం కల్పిస్తుంది. ఈ సందర్భంగా ఓలా రీజినల్ హెడ్ సందీప్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ... ఓలాకు అనుసంధానంగా ఆరేళ్లుగా నగరంలో లక్షల కిలోమీటర్లు తిరిగిన కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాల ద్వారా విలువైన సమాచారాన్ని సేకరించినట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంతో తాము కుదుర్చుకున్న ఒప్పందం ప్రజోపయోగం కోసం వినియోగంచడంలో ఒక ముందడుగు అని పేర్కొన్నారు. ట్రాఫిక్ మేనేజ్మెంట్లో సాంకేతికతక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో తెలంగాణ అగ్రగామిగా ఉందన్నారు. ఇంటెలిజెంట్ ట్రాఫిక్ సిస్టమ్, ఆటోమేటెడ్ ట్రాఫిక్ చలాన్స్ వంటివి ఇప్పటికే అమల్లో ఉన్నాయని, ఇప్పుడు ఈ భాగస్వామ్యం స్మార్ట్ హైదరాబాద్‌ను నిర్మించేందుకు దోహదం చేస్తుందన్నారు. -
తిరుపతి, విజయవాడల్లో ఓలా సేవలు
హైదరాబాద్: క్యాబ్ సర్వీసులందించే ఓలా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తరిస్తోంది. తాజాగా తిరుపతి, విజయవాడల్లో ఓలా క్యాబ్ సర్వీసులను ప్రారంభించామని ఓలా సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. విజయవాడలో 150, తిరుపతిలో 75 క్యాబ్‌లతో ఒప్పందం కుదుర్చుకున్నామని ఓలా డెరైక్టర్ (మార్కెటింగ్ కమ్యూనికేషన్స్) ఆనంద్ సుబ్రమణ్యన్ పేర్కొన్నారు. ఇప్పటికే హైదరాబాద్, విశాఖల్లో ఓలా క్యాబ్ సర్వీసులందజేస్తున్నామని త్వరలో వరంగల్, రాజమండ్రి, గుంటూరు నగరాలకు కూడా ఓలా సేవలను విస్తరించనున్నామని వివరించారు. ప్రారంభించిన ఏడాదిలోనే హైదరాబాద్‌లో 300 నుంచి 8,000 క్యాబ్స్‌కు వృద్ధి చెందామని తెలిపారు.