ప్రముఖ ఆన్‌లైన్ క్యాబ్ సర్వీస్ సంస్థ ఓలా గూగుల్ మ్యాప్స్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై ఓలా క్యాబ్స్ ప్లాట్‌పామ్‌లో గూగుల్ మ్యాప్స్‌ను వినియోగించబోమని తెలిపింది. ఇందుకు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక లొకేషన్ ఇంటెలిజెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పింది. గూగుల్ మ్యాప్స్‌తో ఒప్పందం రద్దు చేసుకోవడం వల్ల కంపెనీకి ఏటా రూ.100 కోట్లు ఆదా అవుతాయని సంస్థ సహ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ఓలా క్యాబ్ సర్వీస్‌ల్లో గూగుల్ మ్యాప్స్‌ను రద్దు చేస్తున్నాం. ఇందుకు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక లొకేషన్ ఇంటెలిజెన్స్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చాం. గూగుల్‌తో ఒప్పందం రద్దు చేసుకోవడం వల్ల కంపెనీకు ఏటా రూ.100 కోట్లు ఆదా అవుతుంది. కొత్త సర్వీసులు అందుబాటులోకి రావాలంటే వినియోగదారులు తమ ఓలా యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. ఓలా లొకేషన్ ఇంటెలిజెన్స్‌లో స్ట్రీట్ వ్యూ, ఇండోర్ చిత్రాలు, డ్రోన్ మ్యాప్‌లు, 3డీ మ్యాప్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి’ అని చెప్పారు.
ఓలా క్లౌడ్ సర్వీస్‌లను గతంలో మైక్రోసాఫ్ట్ అజూర్ నిర్వహించేది. కానీ ఇటీవల ఆ సంస్థతో కార్యకలాపాలు నిలిపేస్తున్నట్లు ఓలా ప్రకటించింది. అజూర్ స్థానంలో ‘క్రుత్రిమ్ ఏఐ క్లౌడ్’ సేవలు వినియోగించుకుంటున్నామని కంపెనీ తెలిపింది. ఈ క్రుత్రిమ్ ఏఐ మ్యాపింగ్ సొల్యూషన్స్‌ను కూడా అందిస్తుందని పేర్కొంది. త్వరలో ఈ క్లౌడ్‌లో మరిన్ని ప్రోడక్ట్ అప్‌డేట్‌లు వస్తాయని చెప్పింది.
ఇదీ చదవండి: సంగీత్‌లో అదిరిపోయే స్టెప్పులేసిన అంబానీ కుటుంబం
అక్టోబర్ 2021లో ఓలా పుణెకు చెందిన జియోసాక్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ ‘జియోస్పేషియల్’ సేవలను అందిస్తోంది. గూగుల్ మ్యాప్స్ స్థానంలో ఓలా క్యాబ్స్ జియోసాక్ సేవలు వినియోగించుకుంటుంది. దాంతో కంపెనీకు ఏటా రూ.100 కోట్లు ఆదా అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment