![గూగుల్ మ్యాప్స్ లో ఓలా, ఉబెర్ క్యాబ్స్ సమాచారం! - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/71458158769_625x300.jpg.webp?itok=ZpwXljHT)
గూగుల్ మ్యాప్స్ లో ఓలా, ఉబెర్ క్యాబ్స్ సమాచారం!
న్యూఢిల్లీ: మనకు దగ్గరిలో ఉన్న ఓలా, ఉబెర్ క్యాబ్స్ సమాచారాన్ని గూగుల్ మ్యాప్స్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇందులో భాగంగా టెక్ దిగ్గజం గూగుల్.. ఓలా, ఉబెర్ సంస్థలతో జతకట్టింది. స్మార్ట్‌ఫోన్ ద్వారా గూగుల్ మ్యాప్స్ తాజా వెర్షన్‌లో ఒక ప్రాంతానికి వెళ్లడానికి డెరైక్షన్స్ కోసం సెర్చ్ చేసినప్పుడు ఒక ప్రత్యేకమైన ట్యాబ్ సాయంతో క్యాబ్ సర్వీస్ సమాచారాన్ని తెలుసుకునే వెసులుబాటు కల్పిస్తామని గూగుల్ తన బ్లాగ్‌లో పేర్కొంది.