ఇప్పటి వరకు గూగుల్ మ్యాప్స్‌లో ఏదైనా ప్రదేశాలను సెర్చ్ చేయడానికి, కొత్త ప్రాంతాలను సందర్శించడానికి.. ఇతరత్రా వంటి వాటికోసం ఉపయోగించేవారు. అయితే ఇప్పుడు సంస్థ తాజాగా ఎయిర్ క్వాలిటీని చెక్ చేయడానికి 'ఎయిర్ వ్యూ ప్లస్' (Air View+) అనే తీసుకువచ్చింది. మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..
ఈ వారం ప్రారంభంలో ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 491 గరిష్ట స్థాయికి చేరుకోవడంతో.. సంస్థ గాలిలోని ఎయిర్ క్వాలిటీ తెలుసుకోవడం ముఖ్యమని భావించింది. ఈ కారణంగానే ఎయిర్ వ్యూ ప్లస్ ఫీచర్ తీసుకువచ్చింది. ఇది ఏఐ ద్వారా పనిచేస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు వాతావరణంలోని గాలి నాణ్యతను గురించి తెలుసుకోవచ్చు.
గూగుల్ ఎయిర్ వ్యూ ప్లస్ ఫీచర్ ఇండియాలోని వంద నగరాల్లోని గాలి నాణ్యతకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తుంది. సాధారణంగా.. గాలిలోని ఎయిర్ క్వాలిటీని సంబంధిత శాఖ అధికారులు వెల్లడిస్తేనే తెలిసేది. కానీ ఇప్పుడు గూగుల్ పరిచయం చేసిన కొత్త ఫీచర్ సాయంతో ఎప్పుడైనా తెలుసుకోవచ్చు.
ఇదీ చదవండి: ఇంటర్నెట్ లేకుండా ట్రాన్సక్షన్స్: వచ్చేస్తోంది 'యూపీఐ 123 పే'
గూగుల్ ఎయిర్ వ్యూ ప్లస్ ఫీచర్ కోసం.. క్లైమేట్ టెక్ సంస్థలు, ఆరస్సూర్, రెస్పిరర్ లివింగ్ సైన్సెస్ వంటివి కీలక పాత్ర పోషించాయి. అంతే కాకుండా ఈ ఫీచర్‌ను ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ హైదరాబాద్, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, సీఎస్‌టీఈపీ వంటివి టెస్ట్ చేసి ధ్రువీకరించినట్లు సమాచారం.
'ఎయిర్ వ్యూ ప్లస్'లో ఎయిర్ క్వాలిటీ కనుక్కోవడం ఎలా?
•మొబైల్ ఫోన్‌లో గూగుల్ మ్యాప్ ఓపెన్ చేయాలి.
•సెర్చ్ బార్‌లో ఏదైనా లొకేషన్‌పై ట్యాప్ చేయాలి.
•ఆలా చేసిన తరువాత లొకేషన్ పక్కనే నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (NAQI) కనిపిస్తుంది.
•దానిపైన క్లిక్ చేసిన తరువాత టెంపరేషన్ కనిపిస్తుంది, దాని కిందనే ఎయిర్ క్వాలిటీ కూడా కనిపిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment