google maps
-
సరైన సమయానికి.. అనువైన ఫీచర్: ఎయిర్ క్వాలిటీ ఇట్టే చెప్పేస్తుంది
ఇప్పటి వరకు గూగుల్ మ్యాప్స్‌లో ఏదైనా ప్రదేశాలను సెర్చ్ చేయడానికి, కొత్త ప్రాంతాలను సందర్శించడానికి.. ఇతరత్రా వంటి వాటికోసం ఉపయోగించేవారు. అయితే ఇప్పుడు సంస్థ తాజాగా ఎయిర్ క్వాలిటీని చెక్ చేయడానికి 'ఎయిర్ వ్యూ ప్లస్' (Air View+) అనే తీసుకువచ్చింది. మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..ఈ వారం ప్రారంభంలో ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 491 గరిష్ట స్థాయికి చేరుకోవడంతో.. సంస్థ గాలిలోని ఎయిర్ క్వాలిటీ తెలుసుకోవడం ముఖ్యమని భావించింది. ఈ కారణంగానే ఎయిర్ వ్యూ ప్లస్ ఫీచర్ తీసుకువచ్చింది. ఇది ఏఐ ద్వారా పనిచేస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు వాతావరణంలోని గాలి నాణ్యతను గురించి తెలుసుకోవచ్చు.గూగుల్ ఎయిర్ వ్యూ ప్లస్ ఫీచర్ ఇండియాలోని వంద నగరాల్లోని గాలి నాణ్యతకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తుంది. సాధారణంగా.. గాలిలోని ఎయిర్ క్వాలిటీని సంబంధిత శాఖ అధికారులు వెల్లడిస్తేనే తెలిసేది. కానీ ఇప్పుడు గూగుల్ పరిచయం చేసిన కొత్త ఫీచర్ సాయంతో ఎప్పుడైనా తెలుసుకోవచ్చు.ఇదీ చదవండి: ఇంటర్నెట్ లేకుండా ట్రాన్సక్షన్స్: వచ్చేస్తోంది 'యూపీఐ 123 పే'గూగుల్ ఎయిర్ వ్యూ ప్లస్ ఫీచర్ కోసం.. క్లైమేట్ టెక్ సంస్థలు, ఆరస్సూర్, రెస్పిరర్ లివింగ్ సైన్సెస్ వంటివి కీలక పాత్ర పోషించాయి. అంతే కాకుండా ఈ ఫీచర్‌ను ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ హైదరాబాద్, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, సీఎస్‌టీఈపీ వంటివి టెస్ట్ చేసి ధ్రువీకరించినట్లు సమాచారం.'ఎయిర్ వ్యూ ప్లస్'లో ఎయిర్ క్వాలిటీ కనుక్కోవడం ఎలా?•మొబైల్ ఫోన్లో గూగుల్ మ్యాప్ ఓపెన్ చేయాలి.•సెర్చ్ బార్లో ఏదైనా లొకేషన్‌పై ట్యాప్ చేయాలి.•ఆలా చేసిన తరువాత లొకేషన్ పక్కనే నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (NAQI) కనిపిస్తుంది.•దానిపైన క్లిక్ చేసిన తరువాత టెంపరేషన్ కనిపిస్తుంది, దాని కిందనే ఎయిర్ క్వాలిటీ కూడా కనిపిస్తుంది. -
‘ఓలా మా డేటా కాపీ చేసింది’
స్వదేశీ డిజిటల్ మ్యాపింగ్ సేవల సంస్థ మ్యాప్ మై ఇండియా తన డేటాను ఓలా ఎలక్ట్రిక్ కాపీ చేసిందని ఆరోపించింది. ఓలా మ్యాప్స్‌లో సంస్థ తయారుచేసిన మ్యాప్ డేటాను వాడుతున్నట్లు మ్యాప్ మై ఇండియా చెప్పింది. గతంలో ఇరు కంపెనీలు చేసుకున్న ఒప్పందాన్ని ఓలా ఎలక్ట్రిక్ ఉల్లంఘించిందని తెలియజేస్తూ కోర్టును ఆశ్రయించింది.ఓలా ఎలక్ట్రిక్ బైక్‌లో మ్యాపింగ్ సేవలందించేందుకు రెండు కంపెనీలు గతంలో ఒప్పందం చేసుకున్నాయి. అయితే మ్యాప్ మై ఇండియా మాతృ సంస్థ సీఈ ఇన్ఫో సిస్టమ్స్ ద్వారా ‘కో-మింగ్లింగ్’, రివర్స్ ఇంజినీరింగ్, ఏపీఐ(అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్), ఎస్డీకే(సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్)లోని కీలక మ్యాప్ డేటా వివరాలను ఒప్పందానికి విరుద్ధంగా ఓలా కంపెనీ కాపీ చేసినట్లు ఆరోపణల్లో తెలిపింది. ఓలా ఒప్పంద నియమాలను ఉల్లంఘించినందుకు కోర్టులో దావా వేసినట్లు మ్యాప్ మై ఇండియా పేర్కొంది. ఈమేరకు మ్యాప్ మై ఇండియా సీఈ ఇన్ఫో సిస్టమ్స్ ద్వారా ఓలాకు నోటీసులు పంపించింది.ఈ వ్యవహారంపై ఓలా స్పందిస్తూ..మ్యాప్ మై ఇండియా చేసిన ఆరోపణనలను తీవ్రంగా ఖండించింది. సీఈ ఇన్ఫో సిస్టమ్స్ చేసిన వాదనలను తోసిపుచ్చింది. ఈ ఆరోపణలు దురుద్దేశపూరితమైనవని, తప్పుదోవ పట్టించేవని తెలిపింది. ఓలా ఎలక్ట్రిక్ వ్యాపార పద్ధతుల సమగ్రతకు కట్టుబడి ఉందని పేర్కొంది. మ్యాప్ మై ఇండియా పంపిన నోటీసుకు త్వరలో తగిన విధంగా స్పందిస్తామని చెప్పింది.ఇదీ చదవండి: రూ.1,799కే 4జీ ఫోన్!ఇదిలాఉండగా, జులై మొదటివారంలో ఓలా ప్లాట్‌పామ్‌లో గూగుల్ మ్యాప్స్‌ను వినియోగించబోమని ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది. ఇందుకు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక సొంత లొకేషన్ ఇంటెలిజెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది. గూగుల్ మ్యాప్స్‌తో ఒప్పందం రద్దు చేసుకోవడం వల్ల కంపెనీకి ఏటా రూ.100 కోట్లు ఆదా అవుతాయని పేర్కొంది. గ్లోబల్ మ్యాపింగ్ లీడర్ గూగుల్ భారతదేశంలోని కస్టమర్ల కోసం గూగుల్ మ్యాప్స్ ధరలను 70 శాతం తగ్గించడం గమనార్హం. -
బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు.. కారు కంటే నడుస్తూ వెళ్లడమే బెటర్
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు పేరు చెబితేనే ట్రాఫిక్ సమస్యలు గుర్తుకువస్తాయి. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పిలుచుకునే బెంగళూరులో ఐటీ ఉద్యోగులు భారీగా నివసిస్తుండటంతో బెంగళూరు నగరంలో ట్రాఫిక్ కష్టాలు భరించలేనంత ఉంటుంది.కిలోమీటర్ దూరం ప్రయాణించాలంటే వాహనాల మధ్య గంటల తరబడి ఇరుక్కుపోవాల్సి ఉంటుంది. రోడ్లపైకి వస్తే తిరిగి ఎప్పుడు ఇంటికి వెళ్తామో కూడా తెలియని పరిస్థితులు బెంగళూరు నగరంలో కనిపిస్తూ ఉంటాయి. ఇక వానకాలం కావడంతో బెంగళూరులో రోడ్లు మరీ దారుణంగా తయారయ్యాయి.తాజాగా బెంగళూరు ట్రాఫిక్ గురించి గూగుల్ మ్యాప్స్ వెల్లడించిన అంశం ఆసక్తిగా మారింది. నెట్టింట్లో వైరల్‌గా మారింది. బెంగళూరు రోడ్లపై 6 కిలోమీటర్ల దూరం డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడం కంటే, నడస్తూ వెళ్లడం ద్వారా త్వరగా చేరుకోవచ్చట. వి విషయాన్ని ఆయుష్ సింగ్ అనే వ్యక్తి గూగుల్ మ్యాప్ స్క్రీన్‌షాట్‌ను ట్విటర్లో షేర్ చేశాడు.ఇందులో బెంగళూరులో కేఆర్ పురం రైల్వే స్టేషన్ నుంచి గరుడాచార్ పాళ్యలోని బ్రిగేడ్ మెట్రోపొలిస్ వరకు ఏదైనా వాహనంలో వెళ్లడానికి 44 నిమిషాల సమయం పడితే, అదే దూరం నడిచి వెళ్లడానికి 42 నిమిషాలు పడుతుందని గూగుల్ మ్యాప్స్ చెబుతోంది. ఇది కేవలం బెంగుళూరులోనే సాద్యమంటూ షేర్ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింటా వైరల్‌గా మారింది.This happens only in Bangalore pic.twitter.com/MQlCP7DsU7— Ayush Singh (@imabhinashS) July 25, 2024 ఒక్కరోజులోనే మూడు లక్షలకు పైగా లైకులు సంపాదించింది. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. బెంగళూరు భారత్‌కు ట్రాఫిక్ రాజధాని అని, ముంబై, ఢిల్లీలో కూడా ఇదే రకమైన ట్రాఫిక్ ఉంటుందని చెబుతున్నారు. -
గూగుల్ ‘మ్యాప్’ వార్!
న్యూఢిల్లీ: దేశీయంగా ఓలా మ్యాప్స్ నుంచి పోటీ తీవ్రతరం కావడంతో గూగుల్ జోరు పెంచింది. భారత్‌లో యూజర్లను ఆకట్టుకోవడం కోసం గురువారం పలు సరికొత్త ఫీచర్లను ప్రకటించింది. ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) చార్జింగ్ స్టేషన్లు, ఫ్లైఓవర్లతో పాటు కారు డ్రైవర్లు ఇరుకు సందుల్లో చిక్కుకోకుండా ఏఐ ఆధారిత రూటింగ్ సమాచారం వంటివి ఇందులో ఉన్నాయి. ఓలా ఫౌండర్, సీఈఓ భవీశ్ అగర్వాల్ దేశీ డెవలపర్ల కోసం ఓలా మ్యాప్స్‌ను అందుబాటులోకి తీసుకొచి్చన సంగతి తెలిసిందే. అంతేకాకుండా, గూగుల్ మ్యాప్స్‌ను వాడొద్దని కూడా ఆయన పిలుపునివ్వడంతో మ్యాప్స్ వార్‌కు తెరలేచింది. దేశీ డెవలపర్లకు గాలం వేయడానికి ఏడాది పాటు ఓలా మ్యాప్స్‌ను ఉచితంగా వాడుకునే సదుపాయాన్ని కూడా అగర్వాల్ ప్రకటించడం విశేషం. దీంతో గూగుల్ కూడా వెంటనే రంగంలోకి దిగింది. గూగుల్ మ్యాప్స్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించే డెవలపర్లకు ఆగస్ట్ 1 నుంచి 70 శాతం వరకు ఫీజులను తగ్గిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించింది. దేశీ యూజర్లకు మేలు చేసేందుకే... ఓలా పోటీ కారణంగానే ధరల కోత ప్రకటించాల్సి వచి్చందా అన్న ప్రశ్నకు గూగుల్ మ్యాప్స్ వైస్ ప్రెసిడెంట్, జీఎం మిరియమ్ డేనియల్ స్పందిస్తూ... వాస్తవానికి పోటీ సంస్థలపై మేము దృష్టి సారించమని, తమ యూజర్లు, డెవలపర్ల ప్రయోజనాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ‘మా పార్ట్నర్స్ చాన్నాళ్లుగా ధరలను తగ్గించాలని కోరుతున్నారు. మా యూజర్లతో పాటు డెవలపర్లకు మేలు చేయడంపై దృష్టి సారించాం. అందులో భాగంగానే రేట్ల కోతను ప్రకటించాం. వ్యాపార సంస్థలు, డెవలపర్లు, ప్రజలకు డిజిటల్ మ్యాపింగ్‌ను మరింత ఉపయోగకరంగా తీర్చిదిద్దడం కోసమే ఏఐ ఆధారిత రూటింగ్ తదితర కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టాం’ అని వివరించారు. భారత్‌లో ఇరుకు రోడ్లు అనేవి కారు డ్రైవర్ల సహనానికి పరీక్ష పెడుతుంటాయని, అందుకే వాటిని తప్పించుకునే విధంగా ఏఐ ఆధారిత రూటింగ్ ఆల్గారిథమ్ వ్యవస్థను తీర్చిదిద్దామని చెప్పారు. శాటిలైట్ చిత్రాలు, స్ట్రీట్ వ్యూతో పాటు భవనాల మధ్య దూరం, రోడ్ల రకాల వంటి సమాచారంతో రోడ్ల కచి్చతమైన వెడల్పును మ్యాప్స్‌లో చూడొచ్చని, తద్వారా సాధ్యమైనంత వరకు ఇరుకు సందుల్లో చిక్కుకోకుండా తప్పించుకునేందుకు వీలవుతుందని బ్లాగ్ పోస్ట్‌లో వివరించారు. మరోపక్క, బైకర్లు, పాదచారులు, ఇతర ప్రయాణికులు ఇప్పుడు ఈ ఇరుకు రోడ్లలో మరింత సురక్షితంగా, నమ్మకంగా వెళ్లొచ్చని చెప్పారు. అలాగే సంబంధిత రూట్లో ఎక్కడెక్కడ ఫ్లైఓవర్లు ఉన్నాయో కూడా ముందుగానే తెలియజేసే ఫీచర్ కూడా భారత్‌లో యూజర్లకు చాలా బాగా ఉపయోగపడుతుందన్నారు.ముందుగా ఎనిమిది నగరాల్లో... హైదరాబాద్‌తో సహా బెంగళూరు, చెన్నై, కోయంబత్తూరు, ఇండోర్, భోపాల్, భువనేశ్వర్, గౌహతి మొత్తం 8 నగరాల్లో ఈ ఫీచర్లు ఆండ్రాయిడ్ పరికరాల్లో ఈ వారంలోనే అందుబాటులోకి రానున్నాయి. మరిన్ని నగరాలతో పాటు ఐఓఎస్, కార్ప్లే సపోర్ట్‌ను కూడా త్వరలో తీసుకొస్తామని గూగుల్ పేర్కొంది. టూవీలర్ ఈవీ యూజర్లు చార్జింగ్ స్టేషన్ల సమాచారాన్ని అందించేందుకు ఎలక్ట్రిక్ పే, అథర్, కాజామ్, స్టాటిక్ వంటి దిగ్గజ చార్జింగ్ ప్రొవైడర్లతో గూగుల్ జట్టు కట్టింది. తద్వారా 8,000 చార్జింగ్ స్టేషన్ల సమాచారం దేశీయంగా గూగుల్ మ్యాప్స్‌తో పాటు గూగుల్ సెర్చ్‌లో కూడా లభిస్తుంది. కాగా, ఈ ఫీచర్‌ను తొలిసారిగా భారత్‌లోనే ప్రవేశపెట్టడం గమనార్హం. -
గూగుల్ మ్యాప్స్‌తో ఒప్పందం రద్దు.. రూ.100 కోట్లు ఆదా!
ప్రముఖ ఆన్లైన్ క్యాబ్ సర్వీస్ సంస్థ ఓలా గూగుల్ మ్యాప్స్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై ఓలా క్యాబ్స్ ప్లాట్‌పామ్‌లో గూగుల్ మ్యాప్స్‌ను వినియోగించబోమని తెలిపింది. ఇందుకు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక లొకేషన్ ఇంటెలిజెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పింది. గూగుల్ మ్యాప్స్‌తో ఒప్పందం రద్దు చేసుకోవడం వల్ల కంపెనీకి ఏటా రూ.100 కోట్లు ఆదా అవుతాయని సంస్థ సహ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ఓలా క్యాబ్ సర్వీస్‌ల్లో గూగుల్ మ్యాప్స్‌ను రద్దు చేస్తున్నాం. ఇందుకు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక లొకేషన్ ఇంటెలిజెన్స్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చాం. గూగుల్‌తో ఒప్పందం రద్దు చేసుకోవడం వల్ల కంపెనీకు ఏటా రూ.100 కోట్లు ఆదా అవుతుంది. కొత్త సర్వీసులు అందుబాటులోకి రావాలంటే వినియోగదారులు తమ ఓలా యాప్‌ను అప్డేట్ చేసుకోవాలి. ఓలా లొకేషన్ ఇంటెలిజెన్స్‌లో స్ట్రీట్ వ్యూ, ఇండోర్ చిత్రాలు, డ్రోన్ మ్యాప్‌లు, 3డీ మ్యాప్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి’ అని చెప్పారు.ఓలా క్లౌడ్ సర్వీస్‌లను గతంలో మైక్రోసాఫ్ట్ అజూర్ నిర్వహించేది. కానీ ఇటీవల ఆ సంస్థతో కార్యకలాపాలు నిలిపేస్తున్నట్లు ఓలా ప్రకటించింది. అజూర్ స్థానంలో ‘క్రుత్రిమ్ ఏఐ క్లౌడ్’ సేవలు వినియోగించుకుంటున్నామని కంపెనీ తెలిపింది. ఈ క్రుత్రిమ్ ఏఐ మ్యాపింగ్ సొల్యూషన్స్‌ను కూడా అందిస్తుందని పేర్కొంది. త్వరలో ఈ క్లౌడ్‌లో మరిన్ని ప్రోడక్ట్ అప్డేట్లు వస్తాయని చెప్పింది.ఇదీ చదవండి: సంగీత్‌లో అదిరిపోయే స్టెప్పులేసిన అంబానీ కుటుంబంఅక్టోబర్ 2021లో ఓలా పుణెకు చెందిన జియోసాక్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ ‘జియోస్పేషియల్’ సేవలను అందిస్తోంది. గూగుల్ మ్యాప్స్ స్థానంలో ఓలా క్యాబ్స్ జియోసాక్ సేవలు వినియోగించుకుంటుంది. దాంతో కంపెనీకు ఏటా రూ.100 కోట్లు ఆదా అవుతుంది. -
గూగుల్ మ్యాప్స్ అనుసరిస్తూ నదిలోకి..
కాసర్గోడ్: అత్యవసరంగా ఆస్పత్రికి బయల్దేరిన ఇద్దరు యువకులు అనూహ్యంగా మృత్యువు అంచులదాకా వెళ్లొచ్చారు. పొరుగు రాష్ట్రం కర్ణాటకలోని ఆస్పత్రికి గూగుల్ మ్యాప్స్‌లో చూపించే మార్గంలో బయల్దేరి మార్గమధ్యంలో కారును నదిలోకి పోనిచ్చారు. నది ప్రవాహంలో కారు అదృష్టవశాత్తు ఒక చెట్టుకు చిక్కుకోవడంతో బయటికొచ్చి ప్రాణాలు కాపాడుకోగలిగారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కేరళలోని కాసర్గోడ్ జిల్లాలోని పల్లాంచి ప్రాంతంలో ఇద్దరు యువకులు ఆదివారం తెల్లవారుజామున కర్ణాటకలోని ఆస్పత్రికి కారులో బయల్దేరారు. ‘‘గూగుల్ మ్యాప్స్ ప్రకారం వెళ్తుంటే ఎదురుగా నీళ్లు కనిపించాయి. రోడ్డుపై నీళ్లు నిలిచాయేమోనని అలాగే వెళ్లాం. అది నదిలో లోతట్టు ప్రాంతంలో కట్టిన వంతెన అని తర్వాత అర్థమైంది. ఇరువైపుల రక్షణ గోడ లేదు. నది ఉప్పొంగి పై నుంచి ప్రవహిస్తోంది. ప్రవాహం ధాటికి మా కారు కొట్టుకుపోయింది. ఒడ్డువైపుగా ఒక చెట్టుకు చిక్కుకుని ఆగింది. పోలీసులకు మా లొకేషన్ షేర్ చేయడంతో సమయానికి వచ్చి కాపాడారు. మాకిది నిజంగా పునర్జన్మ’’ అని యువకుల్లో ఒకరైన అబ్దుల్ రషీద్ చెప్పారు. సంబంధిత వీడియో వైరల్‌గా మారింది. -
గూగుల్ కొత్త ఫీచర్ తో ఇకపై ఆ కష్టం తీరినట్టే
-
గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్.. ఇకపై ఆ కష్టం తీరినట్టే..
గూగుల్ మ్యాప్స్ పుణ్యమా అని ఇప్పుడు భూ ప్రపంచం మీద మనకు తెలియని ప్రదేశమంటూ లేకుండా పోయింది. ఫోన్ లాక్ తీసేశామా... డెస్టినేషన్ టైప్ చేసి స్టార్ నొక్కామా... రయ్యి రయ్యి మంటూ దుసుకెళ్లామా అన్నట్టు ఉంటుంది గూగూల్ మ్యాప్స్‌తో వ్యవహారం. బాగానే ఉంది కానీ... నిమిషం తిరిగే సరికి ఫోన్ లాక్ అయిపోతుంది కదా.. మళ్లీ మ్యాప్స్ ఓపెన్ చేయాలంటే ఇబ్బందే కదా? అంటున్నారా? ఎస్. అది ఇప్పటివరకూ ఉన్న సమస్య. ఇకపై మాత్రం ఉండబోదు. ఎందుకంటే గూగుల్ ఈ ఇబ్బందిని తొలగించే ఏర్పాట్లు చేసింది మరి! గూగుల్ మ్యాప్స్‌లో ఇప్పటికే వినియోగదారులకు ఉపయోగపడే అనేక ఫీచర్లను దశలవారీగా ప్రవేశపెడుతూనే ఉంది ఆ కంపెనీ. వాట్సప్ అవసరం లేకుండానే రియల్ టైమ్ లొకేషన్ షేరింగ్, ఫ్యూయెల్ సేవింగ్ వంటి ఫీచర్లను తీసుకొచ్చిన గూగుల్ మ్యాప్స్.. తాజాగా లాక్ స్క్రీన్‌పైనే లొకేషన్ కనిపించేలా ఏర్పాట్లు చేసింది. ఏదైనా ప్రదేశానికి వెళ్లడానికి గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి వివరాలను అందిస్తే సమయం, షార్ట్కట్లు కనిపిస్తాయి. గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసిన తర్వాత ఫోన్ లాక్ అయితే తిరిగి లాన్ తీసి వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. కొత్తగా తీసుకొచ్చిన ఫీచర్‌తో మొబైల్ లాక్ స్క్రీన్‌పై ఈటీఏ (ఎస్టిమేటెడ్ టైమ్ ఆఫ్ అరైవల్), వెళ్లాల్సిన ప్రదేశానికి డైరెక్షన్స్ ప్రత్యక్షమవుతాయి. అంటే ఇకపై గూగుల్ మ్యాప్స్ వినియోగించాలంటే ప్రత్యేకంగా ఫోన్ లాక్ ఓపెన్ చేసి ఉంచాల్సిన అవసరం ఉండదు. అలాగే, ఏదైనా లొకేషన్‌కు సంబంధించిన వివరాలు ఎంటర్ చేయగానే.. స్టార్ట్ బటన్ క్లిక్ చేయకుండానే ప్రివ్యూ కనిపిస్తుంది. ఒకవేళ మీరు వేరే రూట్లో ప్రయాణిస్తుంటే.. ఆటోమేటిక్‌గా రూట్ అప్డేట్ అవుతుంది. ఇదీ చదవండి..పిండం వయసును నిర్ధారించే ఏఐ.. ఎవరు తయారు చేశారంటే.. ఎలా ఎనేబుల్ చేసుకోవాలంటే.. గూగుల్ మ్యాప్స్‌లో గ్లాన్సబుల్ ఫీచర్ డీఫాల్ట్‌గా ఆఫ్‌లో ఉంటుంది. యాప్ ఓపెన్ చేసి పైన కుడివైపు కనిపించే మీ ప్రొఫైల్ ఐకాన్‌పై క్లిక్ చేయండి. అందులో సెట్టింగ్స్‌ను ఎంచుకొని కిందకు స్క్రోల్ చేయగానే నావిగేషన్ సెట్టింగ్స్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. కిందకు స్క్రోల్ చేస్తే ‘గ్లాన్సబుల్ డైరెక్షన్స్ వైల్ నావిగేటింగ్’ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. -
వాట్సప్ లేకున్నా లొకేషన్ షేర్ చేయండిలా..
మనం వెళుతున్న ప్రాంతాలకు రూట్ తెలియకపోతే వెంటనే అప్పటికే అక్కడ ఉంటున్న వారిని లొకేషన్ షేర్ చేయమని అడుగుతూంటాం. వారు వెంటనే వాట్సప్‌లో లొకేషన్ షేర్ చేస్తారు. దాని ఆసరాగా చేసుకుని గమ్యం చేరుతాం. కానీ కొన్నిసార్లు వాట్సప్‌తోపాటు ఇతర లొకేషన్ షేరింగ్ యాప్‌లు పనిచేయకపోతే ఎలా.. అసలు వాట్సప్ వాడని వారు ఎలా వారి లొకేషన్ షేర్ చేయాలి.. అనే అనుమానం వచ్చిందా. అయితే అలాంటి వారికోసం గూగుల్ మనం వెళ్లే రూట్లు, షార్ట్ కట్ మార్గాలను తెలుసుకోవడానికి తన గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. రూట్ మ్యాప్‌పై రియల్ టైం లొకేషన్ షేరింగ్ ఫీచర్‌ను అందిస్తుంది. ఇప్పటివరకు రియల్ టైం లొకేషన్ షేర్ చేయాలంటే తప్పనిసరిగా వాట్సప్ వంటి మరో యాప్ మీద ఆధార పడాల్సిందే. ఇక నుంచి ఇటువంటి ఇబ్బందులకు తెర దించుతూ గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ సాయంతో ఏ ఇతర యాప్స్ లేకుండా కేవలం సాధారణ మెసేజ్‌తో రియల్ టైం లొకేషన్ షేర్ చేయొచ్చు. ఇదీ చదవండి: మస్క్ చేతికి వొడాఫోన్ ఐడియా..? క్లారిటీ ఇచ్చిన టెలికాం సంస్థ ఈ ఫీచర్‌ను ఉపయోగించుకునేందుకు గూగుల్ మ్యాప్స్ యాప్‌లో లాగిన్ అవ్వాలి. ఫ్రొఫైల్ అకౌంట్‌పై క్లిక్ చేసి అందులో లొకేషన్ షేరింగ్ ఆప్షన్ ఎంచుకోవాలి. స్క్రీన్‌పై కనిపిస్తున్న న్యూ షేర్‌పై క్లిక్ చేసి సమయాన్ని సెట్ చేసుకోవచ్చు. లేదా ‘అంటిల్ యు టర్న్ దిస్ ఆఫ్’ ఆప్షన్ ఎంచుకొని కాంటాక్ట్ సెలెక్ట్ చేసుకొని మెసేజ్ పంపించాలి. -
గూగుల్ మ్యాప్స్ మీ పెట్రోలును ఆదా చేస్తుందా?
గూగుల్ మ్యాప్స్ ఉంటే ఎక్కడికైనా వెళ్లిరావొచ్చనే ధీమా ఉంటుంది. కొన్నిసార్లు కచ్చితమైన లోకేషన్లు చూపించకపోయినా.. మనం ఎంచుకున్న లోకేషన్ దగ్గరి వరకు వెళ్లేలా సహాయపడుతుంది. ఈ గూగుల్ మ్యాప్స్‌ను సుదూర ప్రాంతాలు, కొత్త ప్రాంతాలకు వెళుతున్నప్పుడు వెళ్లే రూట్‌తోపాటు వేగం తెలుసుకోవడానికి ఉపయోగిస్తూంటాం. అయితే గూగుల్ మ్యాప్స్ ఇకమీదట ఫ్యూయల్ పొదుపు చేయడంలోనూ సహాయపడనుంది. ప్రయాణంలో ఫ్యుయల్ పొదుపు చేయడానికి గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ‘ఫ్యుయల్ ఎఫిషియంట్ రూట్స్’ అనే పేరుతో గూగుల్ యూజర్లకు ఈ ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇప్పటికే అమెరికా, ఐరోపా యూనియన్ దేశాలు, కెనడాల్లో వినియోగంలో ఉన్న ఈ ఫీచర్ ఇక భారత్‌లో అందుబాటులోకి తెచ్చింది. ఈ గూగుల్ మ్యాప్స్ ఫ్యూయల్ సేవింగ్స్ ఫీచర్ ఎనేబుల్ చేస్తే.. మనం వెళ్లే రూట్లో లైవ్ ట్రాఫిక్ అప్ డేట్స్, రహదారులు, ఇంధన సామర్థ్యాన్ని అంచనా వేస్తుంది. వాహన వేగం, ఫ్యుయల్ వాడకం రెండింటిని పరిగణనలోకి తీసుకుని అందుకు అనుకూల రూట్ చూపుతుంది. అలాగే ఆ రూట్లో వెళ్లడం వల్ల ఎంత ఫ్యుయల్ ఆదా అవుతుందో తెలుపుతుంది. ఇలా సెట్ చేసుకోండి.. గూగుల్ మ్యాప్స్ యాప్ ఓపెన్ చేసి ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి. ‘సెట్టింగ్స్’లోకి వెళ్లి ‘నేవిగేషన్ సెట్టింగ్స్’ ఎంచుకోవాలి. కిందకు స్క్రోల్ చేస్తే అక్కడ కనిపించే ‘రూట్ ఆప్షన్’ అనే ట్యాబ్‌లో ‘ప్రిఫర్ ఫ్యుయల్ ఎఫిసెంట్ రూట్స్’ అనే ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాలి. వాహనం ఇంజిన్, ఫ్యుయల్ టైప్‌ను ఎంచుకోవాలి. నేవిగేషన్ ట్యాబ్ లోనే టోల్ ధర, స్పీడో మీటర్ వంటి ఆప్షన్లు ఎంచుకోవచ్చు. వాహన వేగంతోపాటు మీరు వెళ్లే రూట్లో ఎంత టోల్ ఫీజు పే చేయాలో ఈ ఫీచర్ చెబుతుంది. ఇదీ చదవండి: వేలకోట్ల అప్పు తీర్చే యోచనలో అదానీ గ్రూప్.. ఎలాగంటే.. -
వేగానికి చెక్ పెట్టే కొత్త ఫీచర్ - ఇదెలా పనిచేస్తుందంటే?
రోజు రోజుకి రోడ్డు ప్రమాదాల వల్ల మరణిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం.. మితిమీరిన వేగం. ఈ వేగాన్ని నియంత్రిస్తే సగం ప్రమాదాలు తగ్గుతాయనే ఉద్దేశ్యంతో గూగుల్ తన మ్యాప్స్‌లో ఓ కొత్త ఫీచర్ తీసుకువచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ రోడ్డుపై ప్రయాణించే సమయంలో వాహన వినియోగదారుడు తన మొబైల్లోని గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి, దానికి కుడివైపున ఉన్న ప్రొఫైల్ ఐకాన్ని ట్యాప్ చేసి సెట్టింగ్స్ ఎంచుకోవాలి, ఆ తరువాత స్క్రీన్ కిందికి స్క్రోల్ చేస్తే.. అక్కడ న్యావిగేషన్ సెట్టింగ్స్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసి డ్రైవింగ్ సెక్షన్ ఆప్షన్లో స్పీడోమీటర్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. ఇలా సెలక్ట్ చేసుకున్న తరువాత మీరు ఎంత వేగంగా ప్రయాణిస్తున్నారనే సమాచారం ఎప్పటికప్పుడు పొందవచ్చు. వేగం పెరిగినటప్పుడు ముందుగానే మిమ్మల్ని హెచ్చరిస్తుంది కూడా. ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. మితిమీరిన వేగం వల్ల కలిగే అనర్థాలు పరిమితిని మించిన వేగంతో వాహనదారుడు ప్రయాణించినట్లైతే.. అత్యవసర సమయంలో వాహనాన్ని కంట్రోల్ చేయడం అసాధ్యం, అలాంటి సమయంలో అనుకోని ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలు కఠినమైన నిబంధనలు ప్రవేశపెట్టాయి. ఇదీ చదవండి: ఎయిర్ ఇండియా విమానంలో వాటర్ లీక్ - వీడియో వైరల్ పరిమిత వేగాన్ని మించి వాహనాన్ని డ్రైవ్ చేస్తే.. వారికి భారీ జరిమానాలు విధించడం లేదా లైసెన్స్ క్యాన్సిల్ చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎంత వేగంలో వెళ్తున్నామని విషయాన్నీ కూడా మర్చిపోయే అవకాశం ఉంది, అలంటి వారికి గూగుల్ మ్యాప్స్‌లోని కొత్త ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. -
కొంపముంచిన గూగుల్ మ్యాప్.. ఇద్దరు డాక్టర్లు మృతి
తిరువనంతపురం: కేరళలో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గూగుల్ మ్యాప్‌ను అనుసరిస్తున్న ఈ కారు ఎడమవైపుకు వెళ్లాల్సి ఉండగా పొరపాటున నేరుగా వెళ్లడంతో కారు పెరియార్ నదిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు డాక్టర్లు మృతి చెందగా మరో ముగ్గురు మాత్రం సురక్షితంగా బయట పడ్డారని పోలీసులు తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి ఇద్దరు డాక్టర్లతో పాటు మరో ముగ్గురు కలిసి హోరువానలో కారులో వెళ్తున్నారు. వీరు కొచ్చిన్ నుంచి కొడంగళ్లుర్ గూగుల్ మ్యాప్ ఆధారంగా తిరిగి వెళ్తుండగా వర్షం మరింత జోరుగా కురిసింది. మధ్యలో వారు ఎడమవైపు వెళ్లాలని మ్యాప్ సూచించగా వారు పొరపాటున నేరుగా వెళ్లిపోయారు. ఎదురుగా మొత్తం నీరు కనిపిస్తున్నప్పటికీ అక్కడ రోడ్డు నీటిలో మునిగి ఉంటుందని భావించి కారును అలాగే ముందుకు పోనిచ్చారు. కారు నీటిలోకి వెళ్లిన క్షణాల వ్యవధిలోనే అందులోకి జారుకుని పూర్తిగా మునిగిపోయింది. కారు మునిగిపోవడాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు ఫోన్ చేయగా అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చెరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వారిలో ముగ్గురు మాత్రం చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారని, వారిని స్థానిక ఆసుపత్రికి తరలించామన్నారు. మిగిలిన ఇద్దరు మాత్రం ఆ నీటిలో గల్లంతయ్యారన్నారు. గజ ఈతగాళ్లు రంగంలోకి దిగి నదిలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టగా వారిద్దరు అప్పటికే మృతిచెందడంతో మృతదేహాలను మాత్రం వెలికితీశారు. మృతులు అద్వైత్(29), అజ్మల్(29) ఇద్దరూ కొచ్చిన్ లో ఒకే ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్లుగా పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: మంగళసూత్రం మింగిన గేదె.. ఐదోతనం కాపాడిన వైద్యుడు! -
గూగుల్ మ్యాప్స్‌లో అద్భుతమైన అప్డేట్స్, చూసి మురిసిపోవాల్సిందే!
న్యూఢిల్లీ: సెర్చ్ ఇంజీన్ దిగ్గజం గూగుల్ తన మాప్స్‌లో కొత్త ఫీచర్‌ను లాంచ్ చేసింది. తన నావిగేషన్ యాప్ వినియోగదారులను మరింత ఆకట్టుకునేలా కొత్త అప్డేట్స్ను పారిస్‌లో జరిగిన కార్యక్రమంలో కంపెనీ ప్రకటించింది. ఇమ్మర్సివ్ వ్యూ అనే కొత్త ఫీచర్‌తో గూగుల్ మ్యాప్స్‌లో జత చేసింది. ప్రస్తుతం యూరప్‌లోని ఐదు కీలక నగరాల్లో తీసుకొచ్చిన ఈ ఫీచర్‌ను త్వరలోనే మిగిలిన నగరాల్లో కూడా అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్ ద్వారా గూగుల్మ్యాప్లో మరింత స్పష్టంగా ఆయా ప్రదేశాలను మనకు చూపించనుంది. గూగుల్ మ్యాప్స్‌లో సాధారణ స్ట్రీట్ వ్యూ ఫీచర్ లాగానే ఉంటుంది.మరిన్ని స్ట్రీట్ వ్యూ, ఏరియల్ ఇమేజెస్‌తో వర్చువల్ వరల్డ్ మోడల్‌ను అందిస్తుంది.వాతావరణం, ట్రాఫిక్, లొకేషన్ ఎంత బిజీగా ఉంది అనే వివరాలుంటాయి. రాబోయే నెలల్లో ఆండ్రాయిడ్, ఐవోఎస్ లో ప్రపంచవ్యాప్తంగా “గ్లాన్సబుల్ డైరెక్షన్స్” అనే కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తుందని కంపెనీ ప్రకటించింది. లండన్, లాస్ ఏంజిల్స్, న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో ,టోక్యో అనే ఐదు నగరాల్లో ఇమ్మెర్సివ్ వ్యూ ని తీసుకొచ్చింది. అలాగే ఆమ్స్టర్డామ్, డబ్లిన్, ఫ్లోరెన్స్, వెనిస్‌లతో సహా మరిన్ని నగరాలకు ఈ ఫీచర్‌ను విడుదల చేయాలని భావిస్తోంది. తద్వారా ఆయా నగరాలను సందర్శించే ముందు ప్లాన్ చేసుకోవడంతోపాటు, దానిగురించి అవగాహన పొందడంలో యూజర్లకు సహాయపడుతుందని ఒక బ్లాగ్ పోస్ట్‌లో గూగుల్ తెలిపింది. ఈ ఫీచర్‌లోని ఎడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా కంప్యూటర్ వ్యూలో డిజిటల్ వరల్డ్‌ని వీక్షించవచ్చనిపేర్కొంది. ఈ వాస్తవిక దృశ్యాలను రూపొందించడానికి సాధారణ చిత్రాలను 3డీ ఇమేజెస్‌గా మార్చే అధునాతన ఏఐ సాంకేతికత అయిన న్యూరల్ రేడియన్స్ ఫీల్డ్‌లను (NeRF) ఉపయోగిస్తుందని గూగుల్ తెలిపింది. ఆమ్స్టర్డామ్లోని రిజ్క్స్ మ్యూజియం వీడియోను షేర్ చేసింది. వర్చువల్‌గా బిల్డింగ్ పైన వున్న ఫీలింగ్ కలుగుతుందని వెల్లడించింది. అలాగే ఏటీఎంలు, రెస్టారెంట్లు, పార్కులు, రెస్ట్రూమ్లు, లాంజ్‌లు, టాక్సీస్టాండ్లు, రెంటల్ కార్స్, ట్రాన్సిట్ స్టేషన్లు వంటి అనేక విషయాలను గుర్తించడంలో సహాయపడటానికి మరో ఫీచర్ యాడ్ చేసింది. ఏఐ, ఆగ్మెంటెడ్ రియాలిటీ సాయంతో రూపొందించిన “సెర్చ్ విత్ లైవ్ వ్యూ” గురించి కూడా పోస్ట్ వెల్లడించింది. ఈ లైవ్ వ్యూ ని లండన్, లాస్ ఏంజెల్స్, న్యూయార్క్, పారిస్, శాన్ ఫ్రాన్సిస్కో టోక్యోలలో ప్రారంచింది. బార్సిలోనా, బెర్లిన్, ఫ్రాంక్ఫర్ట్, లండన్, మాడ్రిడ్, మెల్బోర్న్, పారిస్, ప్రేగ్, సావో పాలో, సింగపూర్, సిడ్నీ తైపీ వంటి అనేక నగరాల్లోని 1,000 కొత్త విమానాశ్రయాలు, రైలు స్టేషన్లు , మాల్స్ లాంటి వివరాలు రానున్న నెలల్లో అందిస్తామని గూగుల్ వెల్లడించింది. కాగా కంపెనీ తన I/O డెవలపర్ కాన్ఫరెన్స్‌లో గత సంవత్సరం ఇమ్మర్సివ్ వ్యూని తొలిసారి ప్రకటించింది. ఈ ఫీచర్ 2022 చివరిలో అందుబాటులోకి వస్తుందని ప్రకటించిన సంగతి తెలిసిందే.అప్పటినుంచి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ ఫీచర్‌ను ఎట్టకేలకు లాంచ్ చేసింది. Google demos its new immersive maps view at its event in Paris today. pic.twitter.com/LjjXDy15gp — Richard Holmes (@richeholmes) February 8, 2023 Are you the sort of person who needs to get the feel of somewhere before you commit? 🗺 With immersive view on Google Maps, you can see what a neighborhood is like before you even set foot there📍 ✨ Coming to more cities in the next few months ✨#googlelivefromparis pic.twitter.com/VPvqHP25ai — Google Europe (@googleeurope) February 8, 2023 -
తప్పుదారి చూపిన గూగుల్.. ఒక్కసారిగా అవాక్కైన ప్రయాణికులు!
అన్నానగర్(చెన్నై): గూగుల్ మ్యాప్‌ను అనుసరిస్తూ.. ఓ డ్రైవర్ శుక్రవారం కడలూరు బస్టాండ్‌లోకి లారీని తీసుకెళ్లడం కలకలం రేపింది. వివరాలు.. మార్గం తెలియని పట్టణాల్లో వెళ్తున్నప్పుడు ఆండ్రాయిడ్ సెల్ఫోన్లో గూగుల్ మ్యాప్‌ను అనుసరించి డ్రైవర్లు ప్రయాణిస్తుంటారు. అయితే గూగుల్ మ్యాప్ తప్పు చూపిచడంతో ఒక్కోసారి ప్రమాదలకు సైతం గురవుతుంటారు. వివరాలు.. శుక్రవారం కడలూరులోని ఓ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి తిరుకోవిలూరు మీదుగా బెంగళూరుకు ట్రక్కులో రసాయనాలకు సంబంధించిన ముడిసరుకును ఓ డ్రైవర్ లారీలో లోడ్ చేస్తున్నాడు. షార్ట్ కట్ కోసం వెతుకుతున్న అతను గూగుల్ మ్యాప్స్ సహాయం కోరాడు. దాని ప్రకారం గూగుల్ మ్యాప్ ద్వారా కడలూరు ముత్తునగర్, ఇంపీరియల్ రోడ్డుకు వచ్చి లారె¯న్స్ రోడ్డు, వన్‌వే రోడ్డుకు వచ్చాడు. కానీ అక్కడ రైల్వే సొరంగం ఉండడంతో అది దాటి వెళ్లలేక వాహనాన్ని అక్కడే నిలిపాడు. ట్రాఫిక్ సమస్య ఏర్పడి ఆటో డ్రైవర్లు గొడవ పడడంతో గూగుల్ మ్యాప్స్‌ను అనుసరించి వస్తూ.. ఇక్కడ ఇరుక్కుపోయానని చెప్పాడు. తర్వాత ముందుకు పోనిచ్చే క్రమంలో లారీని బస్ స్టేషన్లోకి తీసుకెళ్లాడు. లారీ ఒక్కసారిగా బస్ స్టేషన్లోకి రావడంతో ప్రయాణికులు అవాక్కయ్యారు. తర్వాత స్థానికుల సహాయంతో డ్రైవర్ ఎలాగో అలా.. లారీని మెయిన్ రోడ్డులోకి తీసుకొచ్చాడు. ఈక్రమంలో ట్రాఫిక్‌కు భారీగా అంతరాయం ఏర్పడడంతో ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. చదవండి: ఆలయాల్లోకి సెల్ఫోన్లు నిషేధం.. వస్త్రధారణ సరిగా ఉండాలన్న మద్రాస్ హైకోర్టు -
గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్.. ఇకపై ఆ సమస్య ఉండదబ్బా!
సాధారణంగా కొత్త ప్రదేశాలకు వెళ్లాలంటే మనకి మొదట గుర్తొచ్చేది గూగుల్ మ్యాప్స్. చేతిలో మొబైల్ అందులో గూగుల్ మ్యాప్స్ యాప్ ఉంటే చాలు ఏ ప్రాంతానికైనా ఈజీగా వెళ్లచ్చు. ఇక్కడి వరకు బాగానే ఉంది కాకపోతే ఇక్కడే ఓ చిక్కు కూడా ఉంది. ఈ యాప్ గమ్యాన్ని చూపించే క్రమంలో ఒక్కో సారి మనం వెళ్లాల్సిన ప్రదేశం పక్కనే ఉన్న చుట్టూ తిరిగేలా చేస్తుంది. దీని వల్ల వాహనదారులు సమయం వృథా కావడంతో పాటు ఇంధనపు ఖర్చు కూడా ఎక్కవగానే అవుతుంది. ఇలాంటి ఘటనలు చాలా మందికి ఎదురయ్యే ఉంటాయి. అందుకే ఈ సమస్యను అధిగమించేలా సరికొత్త ఫీచర్‌ను గూగుల్ మ్యాప్స్ తీసుకొచ్చింది. ఎకో ఫ్రెండ్లీ రూట్ పేరుతో వినియోగదారుడు వెళ్లాల్సిన గమ్యాన్ని అతి తక్కువ దారులను చూపిస్తూ ఇంధనం అయ్యేలా చూస్తుంది. దీని వల్ల మన సమయం, పెట్రోల్ తద్వారా మన ఖర్చు కూడా ఆదా అవుతుంది. "ఎకో-ఫ్రెండ్లీ రూట్" ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతోంది. అమెరికా, కెనడాలో ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈ ఫీచర్ సుమారు అర మిలియన్ మెట్రిక్ టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించినట్లు అంచనా అని గూగుల్ చెప్పింది. ఐరోపా అంతటా 40 దేశాల వరకు ఈ ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇటీవలే జర్మనీలో కూడా ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. చదవండి: జనవరిలో మహీంద్రా తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ.. మరో రికార్డ్ క్రియేట్ చేస్తుందా! -
వార్నింగ్.. ఈ ట్రిక్‌తో మనల్ని ఈజీగా ట్రాక్ చేస్తారు!
టెక్నాలజీ పుణ్యమా అని ప్రపంచం మొత్తం ప్రజల అరచేతుల్లోకి వచ్చేసింది. ఇక మొబైల్ ఉంటే చాలు ఏదైనా మన ముందుకే వస్తోంది. తినే తిండి నుంచి, షాపింగ్ వరకు ఇంటి నుంచి కదలకుండా ప్రజలు వారి పనులు పూర్తి చేసుకుంటున్నారు. నాణానికి రెండు వైపులు ఉన్నట్లే టెక్నాలజీ వల్ల కూడా లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీ వల్ల వ్యక్తులు ఎక్కడ ఉన్నారో ఈజీగా కనిపెట్టవచ్చు. ఇంకో రకంగా చెప్పాలంటే సులువుగా ట్రాక్ చేయవచ్చు. దీన్ని ఈ టెక్నాలజీని కొందరు మంచికి మరికొందరు చెడుకి కూడా వాడే అవకాశాలు ఉన్నాయి. ఇలా ట్రాక్ చేసేయండి! సాధారణంగా ఎక్కడికైనా వెళ్లాలన్నా, ఏ ప్రదేశాన్నికనుక్కోవాలన్నా అందరి చూపు గూగుల్ మ్యాప్స్ వైపు. అంతేనా ఒకరిని ట్రాకింగ్ చేయాలంటే కూడా అదే దిక్కుగా మారింది. దీని ద్వారా వ్యక్తుల లొకేషన్‌ను ట్రాక్ చేయవచ్చు. వాళ్లు ఎక్కడికి వెళుతున్నారో కూడా తెలుసుకోవచ్చు. కాకపోతే దానికి ఎదుటివంటి పర్మిషన్ ఉండాలి. ఇప్పుడు మీకు కావాల్సిన వ్యక్తి లొకేషన్ ను ఎలా ట్రాక్ చేయాలో ఓ లుక్కేద్దాం. ఆండ్రాయిడ్ ఫోన్లో అయితే వాట్సప్‌లో లైవ్ లొకేషన్ షేర్ చేస్తే ఒక వ్యక్తి మరో వ్యక్తిని ట్రాక్ చేయవచ్చు. అదే ఐఫోన్, ఐపాడ్ అయితే గూగుల్ మ్యాప్స్ లో ట్రాక్ చేయాలనుకునే ఎదుటి వ్యక్తి జీమెయిల్ ఐడీని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఆపై గూగుల్ మ్యాప్స్ లో మీ ప్రొపైల్ ను క్లిక్ చేసి ట్రాక్ చేయాలనుకునే వ్యక్తిని యాడ్ చేయాలి. తర్వాత షేర్ లోకేషన్ బటన్ ను క్లిక్ చేసి ఎవరికి షేర్ చేయాలనుకుంటున్నారు, ఎంతసేపు అనే వివరాలను ఇవ్వాలి. కాంటాక్ట్ నెంబర్లను యాడ్ చేయాలి. ట్రాకింగ్‌కు రెడీగా ఉన్నప్పుడు మీరు షేరింగ్ బటన్‌ను క్లిక్ చేస్తే మీరు సెలక్ట్ చేసుకున్న వ్యక్తులు మిమ్మల్ని ట్రాక్ చేయడానికి వీలు కుదురుతుంది. ఇక్కడ వరకు మన అనుమతితోనే జరుగుతుంది. అయితే మనం గుర్తు పెట్టుకోవాల్సి విషయం ఏంటంటే కొందరు ఈ ట్రిక్ని మంచికి కాకుండా చెడుగా కూడా ఉపయోగించే అవకాశం ఉంది. అందుకే మన ఈమెయిల్‌కి లేదా ఫోన్‌కి మెసేజ్ రూపంలో తెలియని వ్యక్తులు లింక్‌లు పంపితే, వాటిని ఓపన్ చేయకుండా, వెంటనే డెలీట్ చేయడం ఉత్తమమని నిపుణులు చెప్తున్నారు. చదవండి: Anand Mahindra: 'ప్రకృతి అందరి సరదా తీర్చేస్తుంది' కావాలంటే చూడండి.. ఆనంద్ మహీంద్రా వైరల్ వీడియో టెలిగ్రామ్, వాట్సప్‌లో ఈ ఇన్వెస్ట్మెంట్ సలహాలు విన్నారో.. కొంప కొల్లేరే! -
గూగుల్ స్ట్రీట్ వ్యూ 360
-
గూగుల్ గుడ్ న్యూస్: ‘స్ట్రీట్ వ్యూ’ని ఎంజాయ్ చేయండి!
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం గూగుల్ తాజాగా తమ గూగుల్ మ్యాప్స్‌లో ’స్ట్రీట్ వ్యూ’ ఫీచర్‌ను భారత మార్కెట్లో మరోసారి తీసుకొచ్చింది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబై తదితర 10 నగరాల్లో 1,50,000 కి.మీ. విస్తీర్ణంలో ఇది బుధవారం నుండి అందుబాటులోకి వచ్చింది. ఇందుకోసం జెనెసిస్ ఇంటర్నేషనల్, టెక్ మహీంద్రాతో జట్టు కట్టినట్లు పేర్కొంది. స్థానిక సంస్థల భాగస్వామ్యంతో స్ట్రీట్ వ్యూను అందుబాటులోకి తేవడం ఇదే తొలిసారని వివరించింది. 2022 ఆఖరు నాటికి ఈ ఫీచర్‌ను 50 నగరాలకు విస్తరించే ప్రణాళికలు ఉన్నట్లు గూగుల్ పేర్కొంది. ఏదైనా ప్రాంతం ఇమేజీని 360 డిగ్రీల కోణంలో చూసేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. గతంలోనే దేశీయంగా ప్రవేశపెట్టినప్పటికీ భద్రతా కారణాల రీత్యా పూర్తి స్థాయిలో విస్తరించేందుకు కేంద్రం అనుమతించలేదు. మరోవైపు, ట్రాఫిక్ సిగ్నల్ టైమింగ్‌లను మెరుగుపర్చేందుకు బెంగళూరు ట్రాఫిక్ పోలీస్ విభాగంతో కూడా జట్టు కట్టినట్లు గూగుల్ వివరించింది. త్వరలో హైదరాబాద్, కోల్‌కతాలోని స్థానిక ట్రాఫిక్ విభాగంతో కూడా ఈ తరహా ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు గూగుల్ మ్యాప్స్ ఎక్స్పీరియెన్సెస్ వైస్ ప్రెసిడెంట్ మిరియం కార్తీక డేనియల్ తెలిపారు. -
కేంద్రం గ్రీన్ సిగ్నల్.. అందుబాటులోకి గూగుల్ అదిరిపోయే ఫీచర్!
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ చేస్తున్న ప్రయత్నానికి భారత ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మన దేశంలో గూగుల్ స్ట్రీట్ వ్యూ ఫీచర్‌ను విడుదల చేసింది. ఈ ఫీచర్ సాయంతో గూగుల్ మ్యాప్స్‌లో మనకు కావాల్సిన ప్రాంతాన్ని 360డిగ్రీల్లో వీక్షించొచ్చు. గూగుల్ సంస్థ..టెక్ మహీంద్రా, జెన్సె సంస్థలతో కలిసి సంయుక్తంగా అహ్మద్ నగర్, అమృత్ సర్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, నాసిక్, పూణే, వడదోరా నగరాల్లో స్ట్రీట్ వ్యూ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. మిలియన్ల కొద్దీ 360 డిగ్రీల పనోరమిక్ ఇమేజెస్ సాయంతో మొత్తం పది నగరాల్లో లక్షా 50వేల కిలోమీటర్ల వరకు ఈ ఫీచర్‌ను వినియోగించుకోవచ్చు. ఈ ఏడాది చివరి నాటికి మరో 50 నగరాలకు ఈ ఫీచర్‌ను విస్తరించాలని గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఫీచర్ వల్ల లాభం ఏంటంటే నేషనల్ జియోస్పేషియల్ పాలసీ నిబంధనలకు అనుగుణంగా..గూగుల్ ఇవ్వాళ విడుదల చేసిన గూగుల్ స్ట్రీట్ వ్యూ ఫీచర్ సాయంతో గూగుల్ మ్యాప్స్‌ను ఓపెన్ చేసి మీకు కావాల్సిన స్ట్రీట్‌లో టార్గెటెడ్ షాప్స్, స్కూల్స్, టెంపుల్స్ విడివిడిగా చూడొచ్చని తెలిపింది. అంతేకాదు గూగుల్ ఎర్త్ ఇంజన్ సహాయంతో టెంపరేచర్ డేటాను పొందవచ్చు. 2016 నుంచి విశ్వ ప్రయత్నాలు గూగుల్ సంస్థ మనదేశంలో పనోరామిక్ స్ట్రీట్ లెవల్ ఇమేజ్ ఆప్షన్‌ను స్ట్రీట్ వ్యూ ఫీచర్ 2011లో విడుదల చేసింది. కానీ ఈ ఫీచర్‌తో దేశ భద్రతకు నష్టం వాటిల్లో ప్రమాదం ఉందనే కారణంతో 2016లో దీనిపై నిషేదం విధించింది. ఈ తరుణంలో గూగుల్ స్థానిక టెక్ కంపెనీల సాయంతో వీటిని తీసుకొచ్చింది. -
వాహనదారులకు గూగుల్ అదిరిపోయే ఫీచర్!
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ వాహనదారులకు అదిరిపోయే ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే వాహనదారులు టోల్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆ ప్రాంతానికి చేరుకోకముందే ఛార్జీలు ఎంతో తెలిస్తే ఎలా ఉంటుంది. ఇదిగో ఈ కాన్సెప్ట్ తో గూగుల్ టోల్ ఛార్జెస్ ఎస్టిమేషన్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. భారత్, అమెరికా, ఇండోనేషియా ఇతర దేశాలకు చెందిన 2వేల రూట్లలో ఈ ఫీచర్లు ప్రారంభించింది. టోల్ ధరలు ఎలా తెలుసుకోవాలంటే వాహనదారులు టోల్ ధరలు తెలుసుకోవాలంటే గూగుల్ మ్యాప్స్‌లో ఆరిజిన్, డెస్టినేషన్ వివరాల్ని ఎంటర్ చేయాలి. దీంతో మీకు వెంటనే రోడ్డు మార్గానికి సంబంధించిన రూట్లు,షార్ట్ కట్లతో పాటు ఎస్టిమేట్ టోల్ ధరల డిస్ప్లే అవుతాయి. అంతే కాదు ఆ రూట్లో ఉన్న అన్నీ టోల్ బూత్ ధరల్ని చూపుతుంది. కాగా, గూగుల్ అందుబాటులోకి తెచ్చిన ఈ కొత్త ఫీచర్ ఇప్పటికే కర్ణాటకలో చాలా రోడ్లపై డిఫాల్ట్‌గా ఆన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. -
గూగుల్ మ్యాప్స్‌లోకి ‘ట్రాఫిక్ అడ్డంకుల’ అప్డేట్
Google Maps Suggest Best Routes In Hyderabad: అత్యవసర పని మీద దిల్సుఖ్నగర్ నుంచి కూకట్పల్లి వెళ్లడానికి బయలుదేరిన ఓ వాహన చోదకుడు ఆ దారిలో రద్దీని గూగుల్ మ్యాప్స్‌లో పరిశీలించాడు. రద్దీ సాధారణ స్థాయిలో ఉన్నట్లు కనిపించడంతో బయలుదేరాడు. ఆ వాహనం లక్డీకాపూల్ చేరుకునేసరికి.. కొద్దిసేపటి ముందే తలెత్తిన ధర్నా కారణంగా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆ రద్దీలో చిక్కుకుపోయిన అతడు ఏం చేయాలో, ఎటు వెళ్లాలో తేల్చకోలేకపోయాడు. నగరవాసులకు ఇలాంటి సమస్య తలెత్తకుండా చూసేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ వినూత్నంగా ముందుకు వెళ్తున్నారు. ఇప్పటి వరకు కేవలం ట్రాఫిక్ రద్దీ మాత్రమే కనిపించే గూగుల్ మ్యాప్స్‌లో హఠాత్తుగా తలెత్తే అడ్డంకులూ కనిపించేలా చర్యలు ప్రారంభించారు. దీనికి సంబంధించి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆ సంస్థతో జరిపిన సంప్రదింపులు కొలిక్కి వస్తున్నాయి. ఉన్నతాధికారుల తుది పరిశీలనలో ఉన్న ఈ ప్రాజెక్టు త్వరలో కార్యరూపంలోకి రానుంది. దీనిపై ఇప్పటికే పలు దఫాల్లో ట్రాఫిక్ పోలీసులు–గూగుల్ ప్రతినిధులు భేటీ అయ్యారు. స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగడంతో.. ► ఇటీవల కాలంలో స్మార్ట్ఫోన్ల వినియోగం పెరగడంతో గూగుల్ మ్యాప్స్‌కు విశేష ప్రజాదరణ వచ్చింది. చిరునామాలు కనుక్కోవడానికి, ట్రాఫిక్ స్థితిగతులు తెలుసుకోవడానికి వీటిని ఎక్కువగా వాడుతున్నారు. ► స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు గూగుల్ సంబంధిత యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు లొకేషన్‌కు యాక్సెస్ ఇస్తుంటారు. ఇలా ఆయా ఫోన్లు ఉన్న లొకేషన్ తెలుసుకునే అవకాశం గూగుల్ సంస్థకు కలుగుతోంది. ► వీటిని ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్న ఆ సంస్థ ఏ సమయంలో, ఏ ప్రాంతంలో, ఏ దిశలో సెల్ఫోన్లు ఎక్కువగా ఉన్నాయనేది గుర్తిస్తుంది. రహదారులపై ఉన్న సెల్ఫోన్లు సాధారణంగా వాహనచోదకులవే అయి ఉంటాయి. ► ఇలా రోడ్లపై ఉన్న ట్రాఫిక్ వివరాలు ఎప్పటికప్పుడు గూగుల్ సంస్థకు చేరుతున్నాయి. వీటి ఆధారంగానే ఆ సంస్థ తమ మ్యాప్స్‌లో ట్రాఫిక్ రద్దీ ఉన్న రహదారుల్ని ఎరుపు రంగులో చూపిస్తుంటుంది. ► న్యూయార్క్ పోలీసు విభాగం ‘511ఎన్వై’ పేరుతో ప్రత్యేక వెబ్సైట్ నిర్వహిస్తోంది. ఇందులో రహదారులపై ఉన్న రద్దీతో పాటు హఠా త్తుగా వచ్చిపడే అవాంతరాలను చూపిస్తుంటుంది. దీని మోడల్లోనే తమ మ్యాప్స్ అభివృద్ధి చే యడానికి గూగుల్ సంస్థ ముందుకు వచ్చింది. నగరం నుంచే పైలెట్ ప్రాజెక్టుగా.. ► ట్రాఫిక్ పోలీసుల కోరిన మీదట పైలెట్ ప్రాజెక్టుగా హైదరాబాద్ నుంచే ఈ విధానాన్ని ప్రారంభించనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు– గూగుల్ ప్రతినిధుల సమావేశాలు ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో జరిగాయి. ► క్షేత్రస్థాయిలో సంచరించే హైదరాబాద్ ట్రాఫిక్ సిబ్బంది వద్ద ట్యాబ్స్ ఉన్నాయి. మరోపక్క ట్రాఫిక్ పోలీసులకు సంబంధించి హైదరాబాద్ ట్రాఫిక్ లైవ్ పేరుతో ప్రత్యేక యాప్ కూడా ఉంది. ఇది వారి ట్యాబ్స్, స్మార్ట్ ఫోన్లలో ఇన్స్టాల్ చేసి ఉంటోంది. వెంటనే అప్రమత్తం.. ► రహదారిపై హఠాత్తుగా ఏదైనా ప్రమాదం చోటు చేసుకున్నా, నిరసనలు తలెత్తినా స్థానికంగా ఉన్న ట్రాఫిక్ పోలీసులు అక్కడకు వెళ్తారు. అలా వెళ్లినప్పుడు సదరు ఉదంతం, కార్యక్రమం వల్ల కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడే అవకాశం ఉంటే వెంటనే అప్రమత్తం అవుతారు. ► ఈ విషయాన్ని తమ యాప్‌లో పొందుపరుస్తారు. ఇది ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఉండే అడ్మినిస్ట్రేటర్‌కు చేరుతుంది. ఆయన దాన్ని మరోసారి ఖరారు చేసుకుని ఆన్లైన్లో గూగుల్ సంస్థకు పంపిస్తారు. (క్లిక్: హైదరాబాద్ ప్రజలకు అలర్ట్! ఆ రెండు రోజులు ఆటోలు బంద్) ► ఆ సంస్థ ఉద్యోగులు ఈ విషయాన్ని తమ మ్యాప్స్‌లో పాయింట్‌తో సహా పొందుపరుస్తారు. ఆ ప్రాంతానికి అటు ఇటు ఉన్న ప్రత్యామ్నాయ రహదారుల వివరాలను ట్రాఫిక్ పోలీసుల నుంచి సేకరించి గూగుల్ మ్యాప్స్‌లో పాప్అప్ రూపంలో వినియోగదారులకు తెలియజేస్తారు. ► వీటిని తన స్మార్ట్ఫోన్ల ద్వారా తెలుసుకునే వాహనచోదకులు ఆ ప్రాంతాలకు వెళ్లకుండా, ప్రత్యామ్నాయ మార్గల్లో వెళ్లేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. సాంకేతిక అంశాలకు సంబంధించి తుది పరిశీలనలో ఉన్న ఈ విధానం త్వరలో హైదరాబాద్‌లో అందుబాటులోకి రానుంది. (చదవండి: కోవిడ్ పోయింది.. హైబ్రిడ్ వచ్చింది!) -
గూగుల్ సెట్టింగ్స్‌లో ఈ మార్పు చేస్తే మీ ఖాతా మరింత భద్రం..!
గూగుల్ అనగానే మనలో చాలా మందికి వెంటనే గుర్తొచ్చేది జీమెయిల్, వెబ్ బ్రౌజింగ్ ఇవేకాకుండా డ్రైవ్ స్టోరేజ్, వీడియో కాలింగ్, మెసేజింగ్, మ్యాప్స్, ఫొటోస్, క్యాలెండర్, కాంటాక్ట్స్, యూట్యూబ్, షాపింగ్, న్యూస్ ఇలా ఎన్నో రకాల సేవలను గూగుల్ అందిస్తోంది. అయితే, ఈ సేవలన్నీ అందించడానికి మనం కొంత సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మీరు ఇచ్చే పేరు, ప్రొఫైల్ ఫొటో, మెయిల్ ఐడీ, పుట్టిన తేది, జెడర్,ఉద్యోగం, నివసించే ప్రాంతం వంటి వివరాలు ఇతర యూజర్లకు కనిపించే అవకాశం ఉంది. అయితే, ఇప్పుడు మనం మన వ్యక్తి గత వివరాలను ఇతరులకు కనిపించకుండా చేసుకునే అవకాశం ఉంది. ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్కరికీ మీ సమాచారం కనిపించదు. మీ వివరాలను ఇతరులు చూడకుండా ఉండటానికి ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. మొదట పీసీ/కంప్యూటర్లో గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి ఇప్పుడు దానిపై క్లిక్ చేస్తే మేనేజ్ యవర్ గూగుల్ అకౌంట్ అనే అప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ ఓపెన్ చేస్తే గూగుల్ ఖాతా పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో పర్సనల్ మీ ఇన్ఫో సెక్షన్‌పై క్లిక్ చేస్తే చూజ్ వాట్ అథర్స్ సీ అనే ఆప్షన్ ఓపెన్ చేయాలి. అందులో అబౌట్ మీ లపై క్లిక్ చేస్తే యాడ్(Add), ఎడిట్, రిమూవ్ అనే ఆప్షన్లు ఉంటాయి. మీ ప్రొఫైల్‌కు సంబంధించి ఏదైనా సమాచారం అదనంగా చేర్చాలన్నా, ఉన్నది తొలగించాలన్నా, పేరులో మార్పులు చేయాలన్నా వాటిపై క్లిక్ చేసి మారిస్తే సరిపోతుంది. మీ సమాచారం ఎవరికి కనబడకూడదు అనుకుంటే Only Me అనే ఆప్షన్ ఎంచుకోవాలి. (చదవండి: బీజీఎంఐ గేమ్ ఆడి రూ.12.5 లక్షలు గెలుచుకున్న కుర్రాళ్లు..!) -
గూగుల్ మ్యాప్స్.. ఇక అడ్రస్ కోసం ఇబ్బంది పడక్కర్లేదు
కొత్త ప్రదేశాల్లో.. కొత్త ప్రాంతాలకు వెళ్లడానికి చాలామందికి గూగుల్ మ్యాప్స్ ఒక మార్గదర్శి. అయితే కచ్చితమైన అడ్రస్సుల విషయంలోనే ఒక్కోసారి గందరగోళం ఏర్పడవచ్చు. ఇప్పుడు ఈ సమస్యను కూడా తీర్చడానికి ఒక కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది గూగుల్ మ్యాప్స్. చాలామంది తమ హోం అడ్రస్సులను అవసరం ఉన్నప్పుడు కరెంట్ లేదంటే అడ్రస్‌ను టైప్ చేయడం ద్వారా వివరాల్ని షేర్ చేస్తుంటారు. ఇకపై ఆ అవసరం లేకుండా ఫ్లస్ కోడ్‌ని షేర్ చేస్తే సరిపోతుంది. ఫ్లస్ కోడ్‌లో హోం అడ్రస్ బదులు.. నెంబర్లు, లెటర్ల ఆధారంగా ఉదాహరణకు.. ‘CCMM+64G’ ఇలా నెంబర్లు, లెటర్ల ఆధారంగా కోడ్ రూపంలో కనిపిస్తుంది. మాటి మాటికి అడ్రస్‌ను టైప్ చేయాల్సిన అవసరం లేకుండా ఇది షేర్(ఆల్రెడీ హోం అడ్రస్‌గా సేవ్ చేసి ఉంటారు కాబట్టి) చేస్తే సరిపోతుంది. గూగుల్ ఫ్లస్ కోడ్‌ను చాలా కాలం కిందటే(2018) తీసుకొచ్చింది. చాలాకాలం పాటు ఇది ఎన్జీవోలకు, ప్రభుత్వ కార్యాలయాలకు కేరాఫ్‌గా నిలిచి.. ప్రజలకు ఉపయోగపడ్డాయి. ఇక ఇప్పుడు ఈ ఫీచర్‌ను యూజర్లందరికీ అందించనుంది. ఇది అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా గ్రిడ్ తరహాలో ప్రాంతాలను విభజించుకుంటూ పోతుంది. విశేషం ఏంటంటే.. రోడ్డు మార్గం, సరైన ల్యాండ్ మార్క్‌లు లేనిచోట్ల కూడా అదీ ఆఫ్‌లైన్‌లోనే(ఒక్కసారి సేవ్ చేస్తే సరిపోతుంది) ఫ్లస్ కోడ్ సరైన అడ్రస్‌ను లొకేట్ చేస్తుంది. కరెక్ట్‌గా అడ్రస్ పెడితేనే రావట్లేదు.. ఇంక ఫ్లస్ కోడ్ వర్కవుట్అవుతుందా? అంటారా? కచ్చితంగా అవుతుంది. ఎందుకంటే.. గూగుల్ మ్యాప్ తీసుకుచ్చిన ఫ్లస్ కోడ్ అనేది యూనివర్సల్. భూమ్మీద ప్రతీ లొకేషన్, అడ్రస్‌కు ఒక్కో ఫ్లస్ కోడ్ ఉంటుంది. పైగా ఎగ్జాట్‌గా హోం లొకేషన్‌గా సేవ్ అవుతుంది కాబట్టి. ఇది జనరేట్ చేయాలంటే.. యూజ్ యువర్ కరెంట్ లొకేషన్ ద్వారా చేయొచ్చు. సేవ్డ్ ట్యాబ్‌ను కూడా హోం అడ్రస్ కాపీ చేయడానికి, షేర్ చేయడానికి ఉపయోగించొచ్చు. ప్రస్తుతానికి ఈ ఫీచర్ కేవలం ఆండ్రాయిడ్ వెర్షన్లలో మాత్రమే ఉంది. కింద వీడియోలో మరింత స్పష్టత రావొచ్చు. -
మీరు ప్రయాణించే రైలు లైవ్ స్టేటస్ గూగుల్ మ్యాప్స్‌లో తెలుసుకోండి ఇలా..?
రైల్వే ప్రయాణికుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్న రైల్వేశాఖ సరికొత్తగా మరికొన్ని సేవలను అందుబాటులోకి తీసుకొని వచ్చింది. రైలు టికెట్ బుక్ చేసుకున్న తర్వాత రైల్వే ప్రయాణికులు ప్రయాణించే రైలు సమయానికే స్టేషన్ కు వస్తుందా..? ప్రస్తుతం ఎక్కడుంది..? అనే విషయాలు తెలుసుకోవడానికి చాలా మార్గాలున్నాయి. అయితే, ఇప్పుడు మీరు ప్రయాణించే రైలు లైవ్ స్టేటస్ మీ మొబైల్ ద్వారా సులభంగా తెలుసుకోవడానికి ఇండియన్ రైల్వే గూగుల్ మ్యాప్స్‌తో ఒప్పందం చేసుకుంది. రైలు లైవ్ స్టేటస్ కి సంబంధించిన సమాచారాన్ని గూగుల్ తన మ్యాప్స్‌లో అందిస్తుంది. గూగుల్ మ్యాప్స్‌లో రైలు లైవ్ స్టేటస్ తెలుసుకోండి ఇలా..? మొదట మీ మొబైల్ ఉన్న గూగుల్ మ్యాప్స్ యాప్ ని అప్డేట్ చేసుకోండి. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి మీరు ఎక్కాల్సిన రైల్వే స్టేషన్ మ్యాప్స్‌లో క్లిక్ చేయండి. మ్యాప్స్‌లో మీరు ఎక్కాల్సిన రైల్వే స్టేషన్ క్లిక్ చేయగానే మీకు చాలా రైళ్లకు సంబంధించిన సమాచారం కనిపిస్తుంది. ఇప్పుడు మీరు మీరు ప్రయాణించే రైలు మీద క్లిక్ చేయగానే ఆ రైలు ఎక్కడ ఉంది, ఎన్ని నిమిషాలు ఆలస్యంగా వస్తుంది అనేది మీకు చూపిస్తుంది. (చదవండి: ఉత్తర కొరియాలో రెచ్చిపోతున్న హ్యాకర్స్!! ఏం చేశారంటే..) -
20 ఏళ్లుగా పరారీలో డాన్.. ఎలా దొరికాడో తెలిస్తే సంబరపడతారు
టెక్నాలజీ.. ఆక్సిజన్ తర్వాత మనిషికి అవసరంగా మారింది. అయితే మనిషి తన కంఫర్ట్ లెవల్స్ పెరిగే కొద్దీ.. టెక్నాలజీని అప్డేట్ చేసుకుంటూ పోతున్నాడు. ఆపత్కాలంలో మనుషుల ప్రాణాల్ని కాపాడడమే కాదు.. అవసరమైతే సంఘవిద్రోహ శక్తుల వేటలోనూ సాయం చేస్తోంది సాంకేతిక పరిజ్ఞానం. ఇందుకు ఉదాహరణే.. ఇటలీలో జరిగిన ఓ ఘటన. పోలీసుల్ని సైతం ముప్పుతిప్పలు పెట్టిన కరడు గట్టిన నేరస్తుణ్ని 20 ఏళ్ల తర్వాత టెక్నాలజీ పట్టించింది. ఇటలీ రాజధాని రోమ్‌లో 'స్టిడా' అనే సిసిలియన్ మాఫియా ఉంది. 2002 -03 మధ్య కాలంలో ఈ మాఫియా సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కటకటాల వెనక్కి నెట్టారు. అయితే జైలు శిక్షను అనుభవిస్తున్న మాఫియా డాన్ గియోఅచినో గామినో (61) రోమ్ రెబిబ్బియా జైలు నుండి తప్పించుకున్నాడు. అక్కడి నుంచి నుంచి తప్పించుకుని మారు పేర్లు.. రకరకాల వేషాలతో కాలం గడిపాడు. గామినో పరారై 20ఏళ్లు గడిచినా.. ఇటలీ పోలీసులకు కంటిమీద కునుకు లేదు. ఈ నేపథ్యంలో చివరి అస్త్రంగా టెక్నాలజీని వాడాలనే బుద్ధి పోలీసులకు కలిగింది. ఇందుకోసం ఫోటోగ్రామ్ సాయం తీసుకుని..గామినో కోసం గాలింపు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఫోటోగ్రామ్ ఫోటో సాయంతో గూగుల్ మ్యాప్‌ను అనుసంధానించారు. దేశవిదేశాల్ని జల్లెడపట్టారు. చివరికి మాడ్రిడ్(స్పెయిన్) గల్లీలపై నిఘా వేయగా.. గాలాపగర్ అనే ప్రాంతంలో ఓ పండ్ల దుకాణం ముందు ఉన్న గామినోను గూగుల్ మ్యాప్ గుర్తించింది. వెంటనే ఇటలీ పోలీసులను అలర్ట్ చేసింది. అప్రమత్తమైన పోలీసులు గామినోను చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై ఇటాలియన్ యాంటీ-మాఫియా పోలీస్ యూనిట్ (డీఐఏ) డిప్యూటీ డైరెక్టర్ నికోలా అల్టీరో హర్షం వ్యక్తం చేశారు. రెండు దశాబ్దాలపాటు ముప్పుతిప్పలు పెట్టిన ఓ మాఫియా డాన్‌ను గూగుల్ మ్యాప్ పట్టించడంపై సోషల్ మీడియాలోనూ సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం అవుతున్నాయి. నిందితుడు ప్రస్తుతం స్పెయిన్ కస్టడీలో ఉన్నాడని, ఫిబ్రవరి చివరి నాటికి అతన్ని ఇటలీకి తరలిస్తారని సమాచారం. చదవండి: మనుషులు పట్టించుకోలేదు.. స్మార్ట్ వాచ్ బతికించింది