గత కొన్ని సంవత్సరాలుగా గూగుల్ తన మ్యాపింగ్ అప్లికేషన్‌లో ఎక్కువగా ఆహారానికి సంబందించిన సమాచారాన్ని తెలియజేస్తుంది. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ఆహార విభాగానికి సంబంధించి ఇంకా ఎక్కువ సమాచారం అందించడం కోసం "కమ్యూనిటీ ఫీడ్" సహాయాన్ని తీసుకుంటుంది. దీని కోసం గూగుల్ మ్యాప్స్‌లో ఇప్పుడు మీరు ఎక్సప్లోర్ అనే ఆప్షన్ ని పైకి స్వైప్ చేసినట్లయితే మీకు అక్కడ బాగా జనాదరణ పొందిన షాపింగ్ మాల్స్ వంటి ప్రదేశాలు, ఆహార స్టాల్స్, ఇతర సమాచారం అక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు వీటి స్థానంలో కొత్తగా “కమ్యూనిటీ ఫీడ్” అనే ఆప్షన్ తీసుకురాబోతుంది. నమ్మదగిన సోర్స్ నుండి ప్రతి రోజు కొత్తగా “కమ్యూనిటీ ఫీడ్”ని తీసుకొస్తుంది. ప్రస్తుతం ప్రతిరోజూ గూగుల్ 20 మిలియన్ రేటింగ్‌లు/ సమీక్షలు, ఫోటోలు, సమాధానాలు వస్తున్నాయని గూగుల్ తెలిపింది. అలాగే త్వరలో మీరు ఫాలో అయ్యే ప్రదేశాలు, ఆహార స్టాల్స్, పానీయాల వ్యాపారుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.(చదవండి: ఈ ఏడాది బెస్ట్ యాప్స్ ఇవే)
Comments
Please login to add a commentAdd a comment