Maps
-
రెండు మ్యాప్‌లతో ఐరాస వేదికపై నెతన్యాహు.. భారత్ ఎటువైపు అంటే
హెజ్బొల్లాను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ తీవ్ర స్థాయిలో దాడులు జరుపుతోంది. అటు ఐక్యరాజ్యసమితి సమావేశాల్లోనూ.. లెబనాన్ సరిహద్దులో తమ లక్ష్యాలను సాధించే వరకు హెజ్బొల్లాపై పోరాటం ఆగదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. ఇప్పటికే హమాస్ సగం బలగాలను అంతం చేశామన్నారు. వారు లొంగిపోకపోతే పూర్తి విజయం సాధించే వరకు పోరాడతామన్నారు.శుక్రవారం న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమతి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు మాట్లాడుతూ.. తన చేతుల్లో రెండు మ్యాప్‌లను ప్రదర్శించారు. అతని కుడి చేతిలోఉన్న మ్యాప్‌లో మిడిల్ ఈస్ట్‌తో పాటు ఇరాన్, ఇరాక్, సిరియా, యెమెన్ దేశాలకు నలుపు రంగు పెయింట్ వేశారు. ఆ మ్యాప్‌పై ద కర్స్(శాపం) అని రాసి ఉన్నది.ఇక ఒక ఎడమ చేతిలో ఉన్న మ్యాప్‌లో ఈజిప్ట్, సుడాన్, సౌదీ అరేబియా, ఇండియా దేశాలు ఉన్నాయి. ఈ దేశాలను హైలెట్ చేస్తూ గ్రీన్ కలర్ పెయింట్ వేశారు. ఆ మ్యాప్‌పై ద బ్లెస్సింగ్(దీవెన) అని రాసి ఉన్నది అయితే ఆ రెండు మ్యాపుల్లోనూ .. పాలస్తీనా కనిపిస్తున్న ఆనవాళ్లు లేవు. గ్రీన్ మ్యాప్ లేదా బ్లాక్ కలర్ మ్యాపుల్లో .. పాలస్తీనాను చూపించకపోవడం గమనార్హం.ప్రస్తుతం జరుగుతున్న ఘర్షణకు ఇరాన్ కారణమని నెతన్యాహు ఆరోపించారు. ఇరాన్‌తో పాటు దాని మిత్రదేశాలు యుద్ధానికి ఆజ్యం పోస్తున్నట్లు పేర్కొన్నారు. . ఇక గ్రీన్ మ్యాప్‌లో ఉన్న దేశాలు ఇజ్రాయిల్‌తో సన్నిహిత సంబంధాలు పెట్టుకుని ఉన్నట్లు తెలిపారు. లెబనాన్, సిరియా, యెమెన్ దేశాల్లో జరుగుతున్న హింసకు ఇరాన్ ప్రధాన కారణమని తెలిపారు. లెబనాన్‌లోని హిజ్బొల్లాకు, గాజాలోని హమాస్‌కు, యెమెన్‌లోని హౌతీలకు ఆర్థిక, సైనిక సహకారాన్ని ఇరాన్ అందిస్తున్నట్లు ఆరోపించారు. ఇరాన్ మిత్రదేశాల నుంచి తమ భూభాగాన్ని రక్షించుకుంటున్నట్లు ఇజ్రాయిల్ ప్రధాని పేర్కొన్నారు.ఒకవేళ మీరు దాడి చేస్తే, అప్పుడు మేం తిరిగి దాడి చేస్తామని ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. యూఎన్ జనరల్ అసెంబ్లీలో నెతాన్యహూ మాట్లాడుతున్న సమయంలో కొందరు దౌత్యవేత్తలు నిరసనతో వాకౌట్ చేశారు. ఇరాన్ దూకుడు వల్లే లెబనాన్, గాజాలపై దాడి చేయాల్సి వచ్చిందని చెప్పారు. హిజ్బొల్లా యుద్ధ మార్గాన్ని ఎంచుకున్నంత కాలం.. వారిని అంతం చేయడం తప్ప ఇజ్రాయెల్‌కు వేరే మార్గం లేదని స్పష్టం చేశారునెతాన్యహూ పట్టుకున్న గ్రీన్ మ్యాప్‌లో ఇండియా ఉండడం గమనార్హం. ఇండియాతో తమకు మంచి రిలేషన్స్ ఉన్నాయని చెప్పేందుకు ఆ మ్యాప్‌లో ఇండియాను చూపించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఇండియా, ఇజ్రాయిల్ మధ్య సత్సంబంధాలు నెలకొన్నాయి. డిఫెన్స్, టెక్నాలజీ రంగంలో రెండు దేశాలు వాణిజ్యం పెంచుకున్నాయి. పాలస్తీనా స్వయంప్రతిపత్తికి ఇండియా సపోర్టు ఇస్తున్నది. అయితే అదే సమయంలో ఇజ్రాయిల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నది. -
గూగుల్ మ్యాప్స్ మీ పెట్రోలును ఆదా చేస్తుందా?
గూగుల్ మ్యాప్స్ ఉంటే ఎక్కడికైనా వెళ్లిరావొచ్చనే ధీమా ఉంటుంది. కొన్నిసార్లు కచ్చితమైన లోకేషన్లు చూపించకపోయినా.. మనం ఎంచుకున్న లోకేషన్ దగ్గరి వరకు వెళ్లేలా సహాయపడుతుంది. ఈ గూగుల్ మ్యాప్స్‌ను సుదూర ప్రాంతాలు, కొత్త ప్రాంతాలకు వెళుతున్నప్పుడు వెళ్లే రూట్‌తోపాటు వేగం తెలుసుకోవడానికి ఉపయోగిస్తూంటాం. అయితే గూగుల్ మ్యాప్స్ ఇకమీదట ఫ్యూయల్ పొదుపు చేయడంలోనూ సహాయపడనుంది. ప్రయాణంలో ఫ్యుయల్ పొదుపు చేయడానికి గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ‘ఫ్యుయల్ ఎఫిషియంట్ రూట్స్’ అనే పేరుతో గూగుల్ యూజర్లకు ఈ ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇప్పటికే అమెరికా, ఐరోపా యూనియన్ దేశాలు, కెనడాల్లో వినియోగంలో ఉన్న ఈ ఫీచర్ ఇక భారత్‌లో అందుబాటులోకి తెచ్చింది. ఈ గూగుల్ మ్యాప్స్ ఫ్యూయల్ సేవింగ్స్ ఫీచర్ ఎనేబుల్ చేస్తే.. మనం వెళ్లే రూట్లో లైవ్ ట్రాఫిక్ అప్ డేట్స్, రహదారులు, ఇంధన సామర్థ్యాన్ని అంచనా వేస్తుంది. వాహన వేగం, ఫ్యుయల్ వాడకం రెండింటిని పరిగణనలోకి తీసుకుని అందుకు అనుకూల రూట్ చూపుతుంది. అలాగే ఆ రూట్లో వెళ్లడం వల్ల ఎంత ఫ్యుయల్ ఆదా అవుతుందో తెలుపుతుంది. ఇలా సెట్ చేసుకోండి.. గూగుల్ మ్యాప్స్ యాప్ ఓపెన్ చేసి ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి. ‘సెట్టింగ్స్’లోకి వెళ్లి ‘నేవిగేషన్ సెట్టింగ్స్’ ఎంచుకోవాలి. కిందకు స్క్రోల్ చేస్తే అక్కడ కనిపించే ‘రూట్ ఆప్షన్’ అనే ట్యాబ్‌లో ‘ప్రిఫర్ ఫ్యుయల్ ఎఫిసెంట్ రూట్స్’ అనే ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాలి. వాహనం ఇంజిన్, ఫ్యుయల్ టైప్‌ను ఎంచుకోవాలి. నేవిగేషన్ ట్యాబ్ లోనే టోల్ ధర, స్పీడో మీటర్ వంటి ఆప్షన్లు ఎంచుకోవచ్చు. వాహన వేగంతోపాటు మీరు వెళ్లే రూట్లో ఎంత టోల్ ఫీజు పే చేయాలో ఈ ఫీచర్ చెబుతుంది. ఇదీ చదవండి: వేలకోట్ల అప్పు తీర్చే యోచనలో అదానీ గ్రూప్.. ఎలాగంటే.. -
ఆపిల్ మ్యాప్‌లో వినిపించే వాయిస్.. ఏ మహిళదో తెలుసా?
స్మార్ట్‌ఫోన్‌లా పుణ్యమా అని మనం ఎక్కడికైనా వెళ్లాలన్నా..లేదా దారి తెలియకపోయినా ఏ మాత్రం భయం లేకుండా హాయిగా వెళ్లిపోతున్నాం. జస్ట్ అలా ఫోన్లో మ్యాప్ ఓపెన్ చేసి చెవిలో అలా హెడ్‌ఫోన్స్ పెట్టుకొని..అందులో జీపీఎస్ ఆన్ చేసి..టెక్స్ట్ వాయిస్‌తో ఇచ్చే డైరెక్షన్‌ని బేస్ చేసుకోవడంతో.. జర్నీ ఈజీ అయిపోయింది. కానీ ఎప్పుడైనా ఆలోచించామా ఆ వాయిస్ ఎవ్వరిది? ఏ మహిళ మాట్లాడుతుంది అని. ప్రపంచం నలుమూలల ఆమె వాయిస్ అందరికీ సుపరిచితమే. ఇంతకి ఆమె ఎవరంటే.. ఆమె పేరు కరెనా జాకబ్సెన్. ఆస్ట్రేలియన్ మహిళ. స్మార్ట్ ఫోన్లో ఉండే జీపీఎస్ ఫీచర్లో ఉండే సిరి అనే వర్చువల్ వాయిస్‌కి స్వరాన్ని అందించిందే కరెనా. ఇంతకీ ఆమె 'జీపీఎస్ గర్ల్'గా ఎలా మారింది. ఆమె నేపథ్యం ఏమిటి? అంటే..కరెనా ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో మాకేలో జన్మించింది. ఏడు సంవత్సరాల వయసులో పాటలు రాయడం, పాడడం వంటివి చేసింది. ఆమె ఆస్ట్రేలియాలో ప్రముఖ సింగర్ అయిన ఒలివియా న్యూటన్-జాన్లా అవ్వలనేది కరెన్ డ్రీమ్. అందుకోసం అని సూట్‌కేస్ చేత పట్టుకుని న్యూయార్క్ వచ్చేసింది. తాను అనుకున్నట్టుగానే ఎన్నో పాటలు రాసింది, పాడింది. ఇలా ఎన్నో ఆల్బమ్‌లు రిలీజ్ చేసి కెరియర్ మంచి ఊపులో ఏ చీకుచింత లేకుండా సాగిపోతోంది. అంతేగాదు ఆమె పాటలు యూఎస్ నెట్వర్క్స్ టెలివజన్ లైసెన్స్ పొందడం విశేషం. ఎన్నో ప్రముఖ థియోటర్లో ప్రదర్శించబడ్డాయి. మాకే టు మాన్హాటన్ వరకు కరెన్ తన సంగీతంతో ప్రజలను అలరించింది. జీపీఎస్ గర్ల్‌గా టర్నింగ్.. నూయార్క్‌లో ఒక రోజు కరెన్ టెక్స్ట్ టు స్పీచ్ వాయిస్ సిస్టమ్‌ను రికార్డ్ చేయడానికి ఆడిషన్‌కి వెళ్లింది. అది తన వాయిస్‌ని ప్రపంచంలోని ప్రతి మూలకు తీసుకువెళ్తుందని ఊహించలేదు. ఆ ఒక్కసారి ఇచ్చిన వాయిస్ ఓవర్ కాస్త జీపీఎస్ గర్ల్‌గా బ్రాండ్ నేమ్‌ను తెప్పించింది. ఇక వెనుదిరిగి చూసుకోకుండా అన్ని రకాల వ్యాపారాల్లోకి అడుగుపెట్టేలా చేసింది ఆమె గాత్రం. ఒకరకంగా ఆమెను ఇంటర్నేషనల్ స్పీకర్ మార్చింది. ఆమె గాత్రం ఎన్నో యూనివర్సిటీలో టెడ్ఎక్స్ స్పీకర్‌గా ఫైనాన్స్, హెల్త్, ఎడ్యుకేషన్, ట్రావెల్, రియల్ ఎస్టేట్‌తో సహా ఎన్నో బహుళ పరిశ్రమలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తన స్వరాన్ని అందించింది. ప్రముఖ ఇంగ్లీష్ ఛానెల్స్ ఎన్బీసీ టుడే షో, ఏబీసీ వరల్డ్ న్యూస్ టునైట్, సీబీఎస్ ఎర్లీ సో, సన్‌రైజ్, ఎన్వై డైలీ న్యూస్, ది గార్డియన్, గ్లామర్ మ్యాగజైన్, పీపుల్ మ్యాగజైన్ తదితర ఛానెల్స్ ఆమెను శక్తిమంతమైన మహిళగా కీర్తించాయి. కస్టమైజ్డ్ వాయిస్ సిస్టమ్స్‌లో, అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్లలో కరెన్ వాయిస్ ఓవర్‌కి ఎంతో డిమాండ్ ఉంది. ఓ పాప్ సింగర్‌గా ఎన్నో అవార్డులు, రివార్డులతో ప్రభంజనం సృష్టించి కెరియర్ మంచి పీక్‌లో దూసుకుపోతుందనంగా చేసిన టెక్స్ట్ టు స్పీచ్ మరో సెలబ్రేటీ స్టేటస్‌ని తెచ్చిపెట్టింది. ఆమె స్వరం ఓ వరంలా మారి ఆమెకు వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా స్థిరపడేలా చేసింది. (చదవండి: ప్రెగ్నెంట్‌గా ఉండగానే..మరోసారి ప్రెగ్నెంట్ కాగాలరా?.. ఇది సాధ్యమేనా!) -
ఇన్‌స్టా యూజర్లకి గుడ్ న్యూస్.. కిరాక్ ఫీచర్ రాబోతోంది!
ఎప్పటికప్పుడు లేటస్ట్ అప్డేట్లతో యూజర్లను ఆకట్టుకుంటున్న ఇన్స్టాగ్రామ్ మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. ఇంతవరకు ఫోటో షేరింగ్, వీడియో రీల్స్, చాటింగ్ వంటివాటితో యూజర్లను తనవైపు తిప్పుకున్న ఇన్‌స్టా తాజాగా మ్యాప్స్ ఫీచర్‌ను ప్రవేశపెట్టబోతోంది. ఈ ఫీచర్లతో యూజర్లు సులభంగా కొత్త లొకేషన్లను కనుగొనవచ్చు. ఇన్‌స్టా ఐజీ(IG)లో కొత్తగా మ్యాప్ ఫీచర్‌ను ప్రవేశపెడుతున్నట్టు మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించారు. ఈ కొత్త ఫీచర్‌తో యూజర్లు తమ సమీపంలో ఉన్న స్థానిక వ్యాపారాలు, వివిధ ప్రసిద్ధ స్థలాలను కనుగొనవచ్చు. గతంలో యూజర్లు ఒక లొకేషన్ సందర్శించినప్పుడు వాళ్లు షేర్ చేసిన పోస్ట్‌లను మాత్రమే చూడగలిగేవారు. కానీ, లొకేషన్ వివరాల గురించి తెలుసుకునే వీలు ఉండేది కాదు. అయితే ఇన్‌స్టాలో రాబోయే లేటెస్ట్ అప్డేట్ మ్యాప్ ఫీచర్ ద్వారా లోకేషన్ వివరాలు కూడా తెలుసుకునేలా వీలు కల్పించారు. ఇన్స్టాగ్రామ్ గత సంవత్సరం కొన్ని దేశాలలో ఈ మ్యాప్ ఫీచర్‌ని పరీక్షించింది. ఇది మనకి సమీపంలోని స్థలాల వివరాలు లేదా కేవలం మనకు కావాల్సిన షాపులను మాత్రమే చూపిస్తుంది. యూజర్లు ఒక ప్రాంతం కోసం సెర్చ్ చేసిన తర్వాత, అనవసరమైన వాటిని పక్కన పెట్టేందుకు అందులో ఫిల్టర్ ఆప్షన్ కూడా ఉంటుంది. దాన్ని సెలక్ట్ చేసుకుని మనం ఎంచుకున్న రెస్టారెంట్లు, బార్లు, పార్కులు లేదా ఇతర స్థలాలను చూడవచ్చు. చదవండి: OnePlus 10T 5G: అదిరిపోయే ఫీచర్లతో వన్‌ప్లస్ 10టీ.. గ్రాండ్ లాంచ్ అప్పుడే! -
మరో సంచలనానికి సిద్ధమైన ఓలా....!
మొబిలిటీ కంపెనీ ఓలా మరో సంచలనానికి తెర తీయనుంది. ఉపగ్రహచిత్రాలు, విజువల్ ఫీడ్స్, సహాయంతో ‘లివింగ్ మ్యాప్స్’ను అభివృద్ధి చేయడానికి ఓలా సన్నద్దమైంది. అందుకు సంబంధించిన ప్రయత్నాలను ఓలా ముమ్మరం చేసింది. తాజాగా జియోస్పేషియల్ సర్వీసుల ప్రొవైడర్ జియోస్పోక్‌ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం నెక్ట్స్ జనరేషన్ లోకేషన్ సాంకేతికతను ఓలా రూపొందించనుంది. ఈ సాంకేతికతతో రియల్ టైం, త్రీ డైమన్షనల్, వెక్టర్ మ్యాప్స్‌ను రూపొందించనుంది. చదవండి: ఫేస్బుక్ యూజర్లకు మరో భారీ షాక్..! మరింత వేగవంతం..! వ్యక్తిగత వాహనాలలో మొబిలిటీని యాక్సెస్ చేయగల, స్థిరమైన, వ్యక్తిగతీకరించిన , సౌకర్యవంతంగా ఉండే లోకేషన్ టెక్నాలజీలను మరింత వేగవంతంగా అభివృద్ధి చేయడం కోసం జియోస్పోక్ ఓలాలో చేరినట్లు తెలుస్తోంది. ఓలా, జియోస్పోక్ కంపెనీలు సంయుక్తంగా తెచ్చే లోకేషన్ టెక్నాలజీ సహాయంతో ప్రజల రవాణాకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తోంది. లొకేషన్, జియోస్పేషియల్ టెక్నాలజీలు, అలాగే శాటిలైట్ ఇమేజరీలో రియల్ టైమ్ మ్యాప్స్‌గా 3 డి, హెచ్డి, వెక్టర్ మ్యాప్‌ల సహాయంతో రవాణా రంగంలో భారీ మార్పులను తేనుంది. డ్రోన్ మొబిలిటీకి ఎంతో ఉపయోగం..! బహుళ-మోడల్ రవాణా కోసం జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్ కచ్చితంగా అవసరమని ఓలా వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. ఈ లొకేషన్ టెక్నాలజీ సహాయంతో త్రీ డైమెన్షనల్ మ్యాప్స్‌ను రూపొందించడంతో డ్రోన్ వంటి ఏరియల్ మొబిలిటీ మోడల్స్‌కు ఎంతగానో ఉపయోగపడనుంది. చదవండి: ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు టీవీఎస్, టాటా పవర్ శుభవార్త! -
గూగుల్ మిమ్మల్ని ట్రాక్ చేయకుండా తప్పించుకోండి!
గూగుల్ మీ కదిలకలను ఎప్పటికప్పుడు రికార్డు చేస్తుంది అనే విషయం మీకు తెలుసా? మీరు షాపింగ్ కోసం ఏదైనా సేర్చ్ చేసిన, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లిన, మీరు యూట్యూబ్ లో వీడియొలు చూసిన ఇలా ప్రతి చిన్న విషయాన్ని గూగుల్ మన కదలికలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తుంది. ఇలా ట్రాక్ చేయడం ద్వారా మన అభిరుచులు, ఇష్ట ఇష్టాలు తెలుసుకొని దానికి తగిన విదంగా ప్రకటనలు అందజేస్తుంది. ఎక్కువ శాతం మన డేటాను ప్రకటనల కోసం వాడుకుంటుంది. అలాగే, ఏదైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని హెచ్చరిస్తుంది. మీ ప్రతి కదలికలను గమనించకూడదు అంటే మీ డేటాను గూగుల్ ట్రాక్ చేయకుండా చేయాల్సి ఉంటుంది. దీని కోసం మీరు మై యాక్టివిటీ గూగుల్ స్పెసిఫిక్ పేజీని సందర్శించాల్సి ఉంటుంది. అసలు మై యాక్టివిటీ అంటే ఏంటి? మీరు గూగుల్ నుంచి సేకరించిన సమాచారన్ని మొత్తం చూసేందుకు ఇక్కడే నిక్షిప్తమై ఉంటుంది. గూగుల్‌లో మీరు చేసే ప్రతి పనీ ఇందులో రికార్డవుతుంది. దీని ఆధారంగానే మీ బ్రౌజింగ్ చరిత్రను ఆయా సంస్థలు తెలుసుకుంటున్నాయి.ఇందుకు తగినట్లు ప్రకటనలు ఇస్తుంటాయి. డిలీట్ చేయడం ఎలా? ఈ రోజుల్లో ఆన్లైన్ ప్రపంచంలో విహరించే వాళ్లకు దాదాపు జీ-మెయిల్ ఉంటుంది. అంటే మీకు గూగుల్‌లో ఒక ఖాతా ఉందన్నమాట. గూగుల్ సెర్చ్ ఇంజిన్‌తో ఈ ఖాతా అనుసంధానమై ఉంటుంది. గూగుల్‌లో మీరు ఏం వెతికినా, ఏం చేసినా ప్రతిదీ రికార్డు అవుతుంది. ఈ డేటాను తొలగించాలంటే మేను బార్ లో "డిలీట్ యాక్టివిటీ బై" అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఒక స్పెసిఫిక్ డే నుంచి గత వారం, గత నెల, మొత్తం డేటాను ఎప్పటికప్పుడు తొలగించే ఆఫ్షన్‌ను ఎంచుకోవచ్చు. యూట్యూబ్‌లో మీరు వెతికే ప్రతి వీడియో సమాచారాన్ని కూడా గూగుల్ రికార్డు చేస్తుంది. ఈ చరిత్రను కూడా సులభంగా డిలీట్ చేయొచ్చు. ఇందుకు యూట్యూబ్ సెర్చ్ హిస్టరీ లింక్‌పై క్లిక్ చేయండి. ఎడమ వైపున "హిస్టరీ" ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. ఆ తరువాత "క్లియర్ ఆల్ సెర్చ్ హిస్టరీ", "క్లియర్ వాచ్ హిస్టరీ" వాటిని ఎంచుకోవాలి. లేదా మీరు కోరుకున్న సమాచారాన్ని డిలీట్ చేయొచ్చు. అలాగే, లొకేషన్ హిస్టరీ కూడా గూగుల్ ట్రాక్ చేయకుండా నిలిపివేయవచ్చు. ఇలా ప్రతి విషయాన్ని గూగుల్ ఏమి ట్రాక్ చేయాలో, వద్దో అనేది మనం నిర్ణయించుకోవచ్చు. మీరు మీ డేటాను తొలగించిన మాత్రాన ప్రకటనలు మాత్రం ఆగిపోవు. కానీ, మీ డేటాను డిలీట్ చేయడం వల్ల సైబర్ నెరగాళ్ల భారీన పడకుండా ఉంటుంది. చదవండి: ప్రీమియం వసూళ్లలో ఎల్ఐసీ రికార్డు! -
మ్యాపింగ్ పాలసీలో కీలక సడలింపులు
న్యూఢిల్లీ: భారత మ్యాపింగ్ పాలసీలో నిబంధనలను సడలిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జియోస్పేషియల్ డేటా నియంత్రణా నియమావళిలో మార్పులు చేయడం ద్వారా ఈ రంగంలో పబ్లిక్, ప్రైవేట్ సంస్థలకు సమానావకాశాలు ఉండేలా చర్యలు తీసుకుంది. కొత్త నిబంధనల్లో భాగంగా ఈ రంగాన్ని డీరెగ్యులేట్ చేయడంతో పాటు సర్వేయింగ్, మాపింగ్, యాప్స్ అభివృద్ధికి ప్రీ అప్రూవల్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా మార్పులు చేసినట్లు సైన్స్అండ్టెక్నాలజీ సెక్రటరీ అశుతోష్ చెప్పారు. దేశీయ సంస్థలు జియోస్పేషియల్ డేటా సేవలందించేందుకు ముందుకు వస్తే ఎలాంటి ముందస్తు అనుమతులు, సెక్యూరిటీ క్లియరెన్సులు, లైసెన్సులు అవసరం లేదన్నారు. జియోస్పేస్ రంగంలో నిబంధనల సడలింపు ఆత్మ నిర్భర్ భారత్‌లో కీలక ముందడుగని ప్రధాని మోదీ అభివర్ణించారు. హైక్వాలిటీ మ్యాప్స్ అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్న పలు రంగాలకు ఈ నిర్ణయం మేలు చేస్తుందని సైన్స్అండ్టెక్నాలజీ మంత్రి హర్ష వర్ధన్ అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు సర్వే ఆఫ్ ఇండియా సైతం మ్యాపులు తయారు చేయాలంటే పలు ఏజెన్సీల అనుమతులు తీసుకోవాల్సివచ్చేదని గుర్తు చేశారు. ఇంతవరకు నిషిద్ధ జోన్‌గా పేర్కొనే ప్రాంతాల జియోస్పేషియల్ డేటా సైతం ఇకపై అందుబాటులోకి వస్తుందని, అయితే ఇలాంటి సున్నిత ప్రాంతాలకు సంబంధించిన సమాచార వినియోగానికి సంబంధించి కొన్ని గైడ్‌లైన్స్ తీసుకువస్తామని తెలిపారు. ప్రజా నిధులతో సేకరించే డేటా మొత్తం దేశీయ సంస్థలకు అందుబాటులో ఉంటుందని, కేవలం సెక్యూరిటీ, లా అండ్ ఎన్ఫోర్స్మెంట్ సంస్థలు సేకరించిన డేటా మాత్రం అందుబాటులో ఉండదని వివరించారు. తాజా మార్పులతో 2030 నాటికి రూ.లక్ష కోట్ల విలువైన జియో స్పేషియల్ డేటా అందుబాటులోకి వస్తుందన్నారు. కొత్త నిబంధనలు ఆహ్వానించదగినవని జియోస్పేషియల్ రంగానికి చెందిన ఇస్రి ఇండియా టెక్, జెనిసిస్ ఇంటర్నేషనల్ లాంటి సంస్థలు వ్యాఖ్యానించాయి. -
గూగుల్ మ్యాప్స్‌లో సరికొత్తగా “కమ్యూనిటీ ఫీడ్”
గత కొన్ని సంవత్సరాలుగా గూగుల్ తన మ్యాపింగ్ అప్లికేషన్లో ఎక్కువగా ఆహారానికి సంబందించిన సమాచారాన్ని తెలియజేస్తుంది. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ఆహార విభాగానికి సంబంధించి ఇంకా ఎక్కువ సమాచారం అందించడం కోసం "కమ్యూనిటీ ఫీడ్" సహాయాన్ని తీసుకుంటుంది. దీని కోసం గూగుల్ మ్యాప్స్‌లో ఇప్పుడు మీరు ఎక్సప్లోర్ అనే ఆప్షన్ ని పైకి స్వైప్ చేసినట్లయితే మీకు అక్కడ బాగా జనాదరణ పొందిన షాపింగ్ మాల్స్ వంటి ప్రదేశాలు, ఆహార స్టాల్స్, ఇతర సమాచారం అక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు వీటి స్థానంలో కొత్తగా “కమ్యూనిటీ ఫీడ్” అనే ఆప్షన్ తీసుకురాబోతుంది. నమ్మదగిన సోర్స్ నుండి ప్రతి రోజు కొత్తగా “కమ్యూనిటీ ఫీడ్”ని తీసుకొస్తుంది. ప్రస్తుతం ప్రతిరోజూ గూగుల్ 20 మిలియన్ రేటింగ్‌లు/ సమీక్షలు, ఫోటోలు, సమాధానాలు వస్తున్నాయని గూగుల్ తెలిపింది. అలాగే త్వరలో మీరు ఫాలో అయ్యే ప్రదేశాలు, ఆహార స్టాల్స్, పానీయాల వ్యాపారుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.(చదవండి: ఈ ఏడాది బెస్ట్ యాప్స్ ఇవే) -
వయస్సు రెండున్నరేళ్లు.. ఐక్యూ అదుర్స్
రామచంద్రపురం రూరల్: ఆ చిన్నారి వయస్సు రెండున్నరేళ్లు. పేరు కట్టా హేమాన్స్ సాయి సత్య సూర్య. రామచంద్రపురం మండ లం తాళ్లపొలానికి చెందిన గౌడ, శెట్టిబలిజ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కట్టా సూర్యనారాయణ మనవడు. రెండు న్నరేళ్ల వయస్సులోనే ప్రపంచ దేశాల జెండాలను గుర్తిస్తూ అవి ఏ దేశానికి చెందినవో చెబుతూ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. అంతే కాదు అక్షరాలు, అంకెలు, ఇంగ్లిష్ నెలలు, తెలుగు నెలలు, తెలుగు నక్షత్రాలు, రాశులు, తిథులు, జాతీయ చిహ్నాలు, ఖండాలు, దేశంలోని రాష్ట్రాలు–వాటి రాజధానులు, 115 రకాల పరమాణు మూలకాలు, ప్రఖ్యాత వ్యక్తులు తదితర అంశాలను అలవోకగా చెబుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. హేమాన్స్ తల్లిదండ్రులు నిరోష, శర్వాణి ఇద్దరూ విశాఖపట్నంలో సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వహిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా మార్చి నుంచి తాళ్లపొలంలోనే ఉంటున్నారు. చిన్నారి ప్రతిభకు పదును పెడుతున్న తల్లిదండ్రులను స్థానికులు అభినందిస్తున్నారు. -
ఠాణాలకు డిజిటల్ అడ్రస్
సాక్షి, సిటీబ్యూరో: ‘రోడ్డపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి చేతిలో ఉన్న బ్యాగ్‌ను దుండగులు లాక్కుపోయారు. దీనిపై ఫిర్యాదు చేయడానికి అతడు సమీపంలోని ఠాణాకు వెళ్లాడు. అయితే ఆ ప్రాంతంలో తమ పరిధిలోకి రాదని చెప్పిన అధికారులు వేరే పోలీసుస్టేషన్ చిరునామా చెప్పి పంపారు. ఆ ఠాణాకు చేరుకోవడానికి బాధితుడికి కొంత సమయం పట్టింది. ఈ ఉదంతం అతడిని కొంత అసంతృప్తికి, అసౌకర్యానికి గురి చేసింది.’ .... రాష్ట్రంలో ఇలాంటి ఘటనలకు తావు లేకుండాచూడాలని డీజీపీ కార్యాలయం నిర్ణయించింది. అందులో భాగంగా ఠాణాలకు డిజిటల్ చిరుమానా ఇవ్వడానికి కసరత్తు చేస్తోంది. దీని ప్రకారం పోలీసుస్టేషన్ల పరిధులకు జియో ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు వాటిని డైరెక్షన్స్‌తో సహా అధికారిక యాప్ ‘హాక్–ఐ’లో నిక్షిప్తం చేయనుంది. ఫలితంగా స్మార్ట్‌ఫోన్ ఉన్న ఎవరైనా తాము ఉన్న ప్రాంతం ఏ ఠాణా పరిధిలోకి వస్తుందో క్షణాల్లో తెలుసుకోవచ్చు. అంతే కాకుండా దానికి ఎలా చేరుకోవాలో కూడా యాప్ సూచిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సౌకర్యాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని డీజీపీ కార్యాలయం నిర్ణయించింది. అనేక చోట్ల పరిధుల పరేషాన్... ఏదైనా ఓ ఉదంతం జరిగినప్పుడు కేసు నమోదు చేయాలన్నా, తదుపరి చర్యలు తీసుకోవాలన్నా జ్యూరిస్డిక్షన్గా పిలిచే పరిధి అత్యంత కీలకమైన అంశం. తమ పరిధిలోకి రాని కేసు విషయంలో ఓ పోలీసుస్టేషన్ అధికారులు కలగజేసుకుంటే చట్టపరంగానే కాకుండా ఇతర అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ నేపథ్యంలో బాధితులు ఎవరైనా సరే నేరం చోటు చేసుకున్న పరిధిలోని పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిందే. అయితే రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఈ పోలీసుస్టేషన్ల పరిధులు అనేవి పరేషాన్ చేస్తుంటాయి. రాజధానిలోని బంజారాహిల్స్ రోడ్ నెం.1 మాసబ్‌ట్యాంక్ చౌరస్తా నుంచి నాగార్జున సర్కిల్ వరకు విస్తరించి ఉంటుంది. ఈ ఏరియా మొత్తం బంజారాహిల్స్, పంజగుట్ట, హుమాయున్‌నగర్ పోలీసుస్టేషన్ల కిందికి వస్తుంది. ఈ రోడ్డునకు ఒక్కో వైపు ఒక్కో ఠాణా పరిధిలో ఉంటాయి. ఈ నేపథ్యంలోనే అనేక సందర్భాల్లో అటు బాధితులే కాదు కొన్నిసార్లు పోలీసులూ తికమకపడ్డారు. గూగుల్ మ్యాప్స్‌లో ఉన్నప్పటికీ... ఓ ప్రాంతంలో ఉన్న వ్యక్తి తన సమీపంలో ఉన్న హోటల్స్, రెస్టారెంట్స్, బార్స్‌తో పాటు పోలీసుస్టేషన్లనూ తెలుసుకునే అవకాశం గూగుల్ మ్యాప్స్ ఇచ్చింది. అయితే ఇది కేవలం సమీపంలో ఉన్న వాటిని మాత్రమే చూపించగలుగుతుంది. దానికే మార్గాన్ని నావిగేట్ చేస్తుంది. దిల్‌సుఖ్‌నగర్‌లోని 107 బస్టాప్ దగ్గర నిల్చున్న వ్యక్తి ‘పోలీస్ స్టేషన్ నియర్ బై మి’ అని టైప్ చేస్తే అది సరూర్‌నగర్ ఠాణాను చూపించే అవకాశం ఉంది. అయితే వాస్తవానికి ఈ ప్రాంతం మలక్‌పేట ఠాణా పరిధిలోకి వస్తుంది. పరిధులు అన్నవి ఆ మ్యాప్స్‌లో అనుసంధానించి లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఉంటోంది. బాధితులు ఎవరైనా నేరం బారినపడినప్పుడు ‘100’కు కాల్ చేస్తే పోలీసు వాహనమే వారి వద్దకు వస్తుంది. ఇలాంటప్పుడు ఇబ్బంది లేకపోయినా... ప్రతి సందర్భంలోనే బాధితులు కాల్స్ చేయడం సాధ్యం కాదు... ఆ అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలోనే పోలీసుస్టేషన్ల పరిధులు, చిరునామాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలని డీజీపీ కార్యాలయం నిర్ణయించింది. హాక్–ఐలో లింకు రూపంలో... దీనికోసం పోలీసు అధికారిక యాప్ హాక్–ఐలో ప్రత్యేక లింకు ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలోని అన్ని పోలీసుస్టేషన్ల పరిధుల్నీ జియో ఫెన్సింగ్ చేస్తూ నావిగేషన్స్‌తో సహా ఇందులో నిక్షిప్తం చేస్తుంది. స్పార్ట్ ఫోన్ ఉన్న ఏ వ్యక్తి అయినా ఓ ప్రాంతంలో నిల్చుని అది ఏ ఠాణా పరిధిలోకి వస్తుందో తెలుసుకోవాలంటే ఈ లింకు ఓపెన్ చేస్తే చాలు. ఈ వ్యక్తి ఉన్న ప్రాంతాన్ని జీపీఎస్ ఆధారంగా గుర్తించే యాప్ ఏ ఠాణా పరిధిలోకి వస్తుందో వెంటనే చెప్తుంది. మరింత ముందుకు వెళ్తే ఆ ఠాణాకు ఎలా చేరుకోవాలో కూడా స్పష్టంగా నావిగేట్ చేస్తుంది. అయితే రాష్ట్రంలోన్ని అన్ని ప్రాంతాల్లోనూ మొబైల్ డేటా సిగ్నల్స్ ఒకే విధంగా ఉండవు. దీంతో కొన్నిసార్లు నావిగేషన్, ఠాణా పరిధుల్ని యాప్ తప్పుగా చూపించే అస్కారం ఉంటుంది. వీటిని పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర పోలీసు విభాగం ట్రయల్ రన్ సందర్భంలో ఈ సమస్యల్ని గుర్తించి పరిష్కరించాలని నిర్ణయించింది. గరిష్టంగా రెండు నెలల్లో ఈ సదుపాయం హాక్–ఐలోకి వచ్చి చేసే ఆస్కారం ఉంది. -
దారి తప్పుతున్న దిక్కులు!
స్మార్ట్‌ఫోన్‌లో మ్యాప్స్ అప్లికేషన్ వాడుతుంటారా..? తెలియని ప్రదేశానికి వెళ్లాలంటే దీన్నే ఉపయోగిస్తారా..? ఏ మారుమూల ప్రాంతాలనైనా భలే గుర్తుపడుతుంది కదా.. ఈ సౌకర్యానికి రోజులు దగ్గరపడ్డాయి.. ఎందుకంటే భూ అయస్కాంత ధృవం వేగంగా కదిలిపోతోంది! దీంతో మ్యాప్స్‌లాంటి దిక్సూచిలన్నీ కకావికలం కానున్నాయి! అయస్కాంత ధృవమేంటీ..? కదిలిపోవడం ఏంటీ? స్మార్ట్ ఫోన్లకూ వాటికీ లింకేంటీ.. ఇవేగా మీ మనసులో మెదు లుతున్న ప్రశ్నలు. భూమి ఒక అయస్కాంతం లాంటిదని పుస్తకాల్లో చదువుకున్నాం. ఈ అయ స్కాంతానికి ఉత్తర దక్షిణ ధృవాలు ఉం టాయి. ఇవి కంటికి కనిపించవు. ఆర్కి టిక్.. అంటార్కిటికాలను ధృవాలు అం టాం. ఈ ప్రాంతాలను అసలు ధృవా లని పిలుస్తారు. అయస్కాంత క్షేత్ర ధృవాలు భూమి లోపలి పొరల్లో జరిగే కార్యకలాపాలకు అనుగు ణంగా కదులుతుంటాయి. ఇంకా సులువుగా చెప్పాలంటే 3 లక్షల ఏళ్లకోసారి ధృవాలు తారుమారు అవు తుంటాయి. అయస్కాంతం తిరగబడి నట్లు అన్నమాట! కానీ ఈ మధ్య ఈ ప్రక్రియ చాలా వేగంగా జరుగుతోందట. ఎంత వేగంగా అంటే.. అయస్కాంత ఉత్తర ధృవం ఏడాదికి యాభై కిలోమీటర్ల చొప్పున సైబీరియా ప్రాంతంవైపు కదలిపోయేంతగా! అయితే ఏంటి అంటున్నారా.. దీని వల్ల చాలా సమ స్యలే ఉన్నాయి. గూగుల్ మ్యాప్స్ మొదలుకొని విమా నాలు, నౌకలు తమ ప్రయాణానికి ఉపయోగించే దిక్సూచీలన్నీ ఈ అయస్కాంత ధృవాల ఆధారంగానే ఉత్తర దక్షిణాలను గుర్తిస్తుంటాయి. ఒకవేళ ధృవాలు తారుమారైతే ఈ రంగాలన్నీ అతలాకుతలమైపోతాయి. కారణమేంటో తెలీదు.. అయస్కాంత ధృవాలు ఎందుకు తారుమారు అవుతున్నా యన్న ప్రశ్నకు ఇప్పటివరకూ సమాధానం లేదు. అయస్కాంత ఉత్తర ధృవం ప్రస్తుతం కెనడా ప్రాంతంలో ఉన్నట్లు అంచనా. కంటికి కనిపించని ధృవాల కదలికలతో వరల్డ్ మాగ్నెటిక్ మోడల్ పేరుతో ఒక మ్యాప్ ఉంటుంది. గూగుల్ లాంటి సంస్థలు ఈ మోడల్‌నే వాడుకుంటాయి. 2020 వరకు పనిచేస్తుందన్న అంచనాతో నాలుగేళ్ల కింద తాజా మోడల్ విడుదలైంది. అయితే తాజా పరిశోధనలు మాత్రం ఈ మోడల్‌ను అర్జెంటుగా మార్చేయా లని సూచిస్తున్నాయి. ఐదేళ్ల కాలంలో కదిలే దూరాన్ని మూడేళ్లలోనే అధిగమించినట్లు కొలరాడో యూనివర్సిటీ, నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్టేషన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. 2000 నుంచి అయస్కాంత ఉత్తర ధృవం ఏడాదికి 50 కిలోమీటర్ల దూరం కదులుతోందని.. అయితే మూడేళ్ల కింద సంభవించిన ఓ భౌగోళిక సంఘటన.. ఉత్తర ధృవ ప్రాంతంలోని అయస్కాంత క్షేత్రంలో వచ్చిన మార్పుల కారణంగా వేగం మరింత పెరిగిందని అర్నాడ్ చుల్లియట్ అనే శాస్త్రవేత్త వివరించారు. అయస్కాంత దక్షిణ ధృవం మాత్రం ఏడాదికి పది కిలోమీటర్ల మేర మాత్రమే కదులుతోందని చెప్పారు. దీంతో ఈ మోడల్‌ను అర్జెంటుగా మార్చేయాలని, లేదంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీతో పాటు ఇతర సంస్థల నావిగేషన్ వ్యవస్థలు దెబ్బతింటాయని శాస్త్రవేత్తలు భావించారు. ఈ నెల 15 నాటికి మార్చేద్దామని నిర్ణయించారు కూడా. కాకపోతే అమెరికాలో ప్రభుత్వం షట్‌డౌన్ కారణంగా ఈ గడువు నెలాఖరుకు చేరింది. ఏం జరుగుతుంది? అయస్కాంత ఉత్తర ధృవం వేగంగా కదలిపోతే నావిగేషన్ వ్యవస్థలకు ఇబ్బందన్నది ఒక సమస్య మాత్రమే. ఇది కాస్తా సమీప భవిష్యత్తులో ధృవాలు తారుమారయ్యేం దుకు సూచిక అయితే ప్రమాదమేనని శాస్త్ర వేత్తల అంచనా. సూర్యుడి నుంచి వస్తున్న రేడి యోధార్మిక కిరణాల నుంచి మనల్ని రక్షిస్తున్న అయస్కాంత క్షేత్ర ధృవాలు తారుమారయ్యే సమ యంలో బలహీనంగా మారుతాయి. సూర్యుడి నుంచి వెలువడే శక్తిమంతమైన కిరణాలు మన ఉపగ్రహాలను, విద్యుత్ సరఫరా గ్రిడ్లను తీవ్రంగా నష్టపరుస్తాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకోపక్క ఈ అయస్కాంత క్షేత్రం ఆధారంగానే ఎటువెళ్లాలో నిర్ణయించుకునే పక్షులు గందరగోళానికి గురవుతాయి. అయితే ఈ ధృవాల తారుమారు ప్రక్రి యతో ప్రాణ నష్టం ఉండే అవకాశాలు లేకపోవడం కొంచెం సాంత్వన కలిగించే అంశం. -
సరిహద్దు తేలలేదు..!
► కొత్త జిల్లాల స్వరూపంపై అయోమయం ► సరిహద్దుల విషయంలో నెలకొన్న అస్పష్టత ► ఇప్పటికీ తయారు కాని జిల్లాల మ్యాప్‌లు ► అన్ని విభాగాల్లోనూ అరకొరగా సమాచారం ► క్షేత్ర స్థాయిలో కొనసాగుతున్న గందరగోళం సాక్షి, హైదరాబాద్: దసరా రోజున రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలను అట్టహాసంగా ప్రారంభించినా.. వాటి సరిహద్దుల విషయంలో అస్పష్టత నెలకొంది. ఏ జిల్లా పరిధిలోకి ఏయే గ్రామాలు వస్తాయి.. వాటి సరిహద్దులేమిటనే గందరగోళం క్షేత్రస్థాయిలో కొనసాగుతోంది. పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా కొత్త నైసర్గిక స్వరూపాన్ని సూచించే జిల్లాల రేఖా చిత్రపటాల(మ్యాప్‌లు)ను ప్రభుత్వం ఇప్పటికీ విడుదల చేయలేదు. దీంతో కొత్త జిల్లాలకు వెళ్లిన అధికారులు సైతం అరకొర సమాచారంతో ఇబ్బంది పడుతున్నారు. ఆగస్టులో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ముసాయిదాను ప్రకటించిన సందర్భంలో ప్రభుత్వం 27 జిల్లాల మ్యాప్‌లను సైతం విడుదల చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్లో వీటిని పొందుపరిచింది. తీరా కొత్త జిల్లాలు కొలువు దీరిన తర్వాత మ్యాప్‌ల ప్రస్తావన లేకుండా వెబ్సైట్లో నుంచి పాత మ్యాప్‌లను సైతం అధికారులు తొలిగించారు. మ్యాప్‌ల తయారీ బాధ్యతలను రెవెన్యూ, సీసీఎల్ఏ విభాగం తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్(ట్రాక్)కు అప్పగించింది. ఇప్పటికీ అధికారికంగా రాష్ట్ర చిత్రపటంతో పాటు జిల్లాల మ్యాప్‌లను సైతం ట్రాక్ విడుదల చేయలేదు. పాత జిల్లాల్లో ప్రతి జిల్లాకో వెబ్సైట్ ఉంది. అందులో ఆయా జిల్లాకు సంబంధించిన విశేషాలు, వివిధ రంగాల విశిష్ఠతలు, అధికారులు, ప్రజాప్రతినిధుల వివరాలన్నీ పొందుపరిచారు. కొత్త జిల్లాలకు వెబ్సైట్లను ఏర్పాటు చేసి.. వాటికి సంబంధించిన సమాచారాన్ని పొందుపరిచే దిశగా చర్యలు ముందుకు సాగటం లేదు. అలాగే ఏ జిల్లాలో పట్టణ జనాభా ఎంత.. గ్రామీణ జనాభా ఎంత అనేది ఆయా జిల్లా అధికారులు సైతం అంచనా వేసుకోలేని పరిస్థితి నెలకొంది. దాదాపు అన్ని విభాగాల్లోనూ ఇదే పరిస్థితి. కలెక్టర్లు సహా ఉద్యోగులు అప్ అండ్ డౌన్ అధికారులను ప్రజల చెంతకు చేర్చడంతో పాటు సుపరిపాలనే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది. కానీ ఆగమేఘాలపై నిర్ణయం తీసుకున్నందున క్షేత్రస్థాయిలో కనీస సమాచారం అందుబాటులో లేకుండాపోయిందని జిల్లాల్లో బాధ్యతలు చేపట్టిన అధికారులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఎక్కువ జిల్లాలున్న వివిధ రాష్ట్రాలకు సీనియర్ అధికారులను పంపి అధ్యయనం చేసిన ప్రభుత్వం ఆరంభంలో ఉండే ఇబ్బందులపై దృష్టి సారించిన దాఖలాలు లేవు. దీంతో ఉద్యోగులతో పాటు ఉన్నతాధికారులు జిల్లా కేంద్రాల్లో అప్ అండ్ డౌన్ డ్యూటీలకు పరిమితమయ్యారు. రాజధానికి సమీపంలో ఉన్న జిల్లాలకు నియమితులైన కొందరు కలెక్టర్లు హైదరాబాద్ నుంచే వెళ్లి వస్తున్నారు. దీంతో కొత్త జిల్లాల్లో పాలన కుదుటపడలేదు. కొత్త కలెక్టరేట్లకు ప్రతిపాదనలు కొత్త జిలాల్లో కలెక్టరేట్లు సహా విభాగాలన్నీ తాత్కాలిక భవనాల్లో సర్దుబాటు చేశారు. దీంతో సమావేశాలకు, సమీక్షలకు కనీస సదుపాయాలు కరవై అధికారులు ఇబ్బంది పడుతున్నారు. దాదాపు 30 కార్యాలయాలు ఒకేచోట ఉండేలా కలెక్టరేట్ సముదాయం నిర్మిస్తామని పునర్వ్యవస్థీకరణకు ముందే సీఎం వెల్లడించారు. దాదాపు రూ.800 కోట్లు ఖర్చుతో వీటిని నిర్మించేందుకు అంచనాలు సైతం సిద్ధం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా తాత్కాలిక అవసరాలకు జిల్లాకో రూ.కోటి విడుదల చేసిన ప్రభుత్వం కొత్త కలెక్టరేట్ల నిర్మాణానికి సైతం ఫైళ్లు కదుపుతోంది. ఇటీవలే ఒక ప్రైవేటు ఏజెన్సీ రాష్ట్రంలో అవసరమైన జిల్లా కేంద్రాలన్నింటా కలెక్టరేట్ల నిర్మాణానికి ముందుకొచ్చింది. డిజైన్ల తయారీతో పాటు నిర్మాణ పర్యవేక్షణకు అంచనా వ్యయంలో ఒకటిన్నర శాతం ఫీజుగా చెల్లించాలనే ప్రతిపాదనను ప్రభుత్వానికి సమర్పించింది. ప్రస్తుతం ఈ ఫైలు ప్రభుత్వ పరిశీలనలో ఉంది. -
యాపిల్ రంగును మార్చేశారు...
హైదరాబాద్ : అధికారంలోకి వస్తే ఆ పార్టీకి చెందిన జెండా రంగులను... ప్రభుత్వ పథకాలతో పాటు బస్సులకు వాడటం మనం ఎప్పటి నుంచో చూస్తున్నదే. అయితే తాజాగా ప్రపంచంలోనే నంబర్ వన్ కార్పొరేట్ కంపెనీ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ లోగో రంగే మారిపోయింది. యాపిల్ కంపెనీ సింబల్ ఇప్పుడు గులాబీ వర్ణాన్ని సంతరించుకుంది. హైదరాబాద్‌లో ఆ సంస్థ సొంత కేంద్రాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. యాపిల్ సీఈవో టిమ్‌కుక్ గురువారం టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా బిగ్ న్యూస్ చెబుతానంటూ రెండు రోజుల క్రితం ఊరించిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం తన ట్విట్టర్లో గులాబీ రంగు వేసిన యాపిల్ కంపెనీ సింబల్‌ను ట్వీట్ చేస్తూ ఇదే బిగ్ న్యూస్ అన్నారు. ప్రస్తుత టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్‌ను గచ్చిబౌలిలోని టిస్మన్ స్పియర్ భవనంలో ఏర్పాటు చేశారు. అమెరికా వెలుపల సంస్థకు ఇదే తొలి ఫెసిలిటీ కూడా. దీనికోసం యాపిల్ రూ.100 కోట్ల దాకా ఖర్చు చేస్తోంది. యాపిల్ మ్యాప్స్ టెక్నాలజీకి కావాల్సిన సేవలను ఈ కేంద్రం అందిస్తుంది. 2,500 మంది ఉద్యోగులు పని చేయనున్నారు. చదవండి...(కేటీఆర్ చెప్పిన బిగ్‌న్యూస్ ఇదేనా?) Big News: Hyderabad becomes home to the largest tech development center of Apple Inc outside of US. pic.twitter.com/TIepwZx3fa — KTR (@KTRTRS) 19 May 2016 -
కేటీఆర్ చెప్పిన బిగ్‌న్యూస్ ఇదేనా?
హైదరాబాద్ : యాపిల్ కంపెనీ సీఈవో టిమ్ కుక్ హైదరాబాద్ చేరుకున్నారు. ముంబై నుంచి ప్రత్యేక విమానంలో ఆయన హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆయనకు ఘన స్వాగతం లభించింది. అక్కడి నుంచి టిమ్ కుక్ బృందం నేరుగా నానక్ రామ్ గూడా చేరుకున్నారు. అక్కడ వేవ్ రాక్ బిల్డింగ్ లోని ఆపిల్ కార్యాలయంలో డిజిటల్ మాపింగ్ కేంద్రాన్ని టిమ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ఉత్పత్తులైన ఐ ఫోన్, ఐ ప్యాడ్, మ్యాక్, వాచ్ లపై దృష్టిపెట్టనున్నట్టు చెప్పారు. హైదరాబాద్ లో తమ కొత్త కార్యాలయం ప్రారంభించడం చాలా థ్రిల్లింగా ఉందని కుక్ తెలిపారు. దీనిద్వారా సుమారు 4 వేలమంది ఉద్యోగాలు లభించనున్నాయని చెప్పారు. ఇక్కడ అపారమైన ప్రతిభగల నిపుణులు ఉన్నారని, వారితో సంబంధాలను విస్తరించడంకోసం ప్రయత్నిస్తామన్నారు. యాపిల్ తమ కార్యాలయంకోసం హైదరాబాద్ ను ఎంచుకోవడం ఆనందంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు. ఇది వేలమందికి ఉద్యోగాలు కల్పించనుందన్నారు. తమ ప్రభుత్వం అనుసరించిన ప్రోయాక్టివ్ విధానానికి ఇది తార్కాణమని సీఎం అన్నారు. ప్రపంచంలో అత్యంత వినూత్నమైన కంపెనీల్లో యాపిల్ కూడా ఒకటని, ఈ ముఖ్యమైన ప్రాజెక్ట్ లో భాగస్వామ్యం కావడం చాలా గర్వంగా ఉందని ఆర్ఎంఎస్ఐ సీఈవో అనూప్ జిందాల్ అన్నారు హైదరాబాద్ క్యాంపస్‌లో 4వేల ఉద్యోగాలు ఇస్తామని కుక్ ప్రకటించారు. కాగా, గురువారం నాడు ఒక బిగ్ న్యూస్ చెబుతానని, అది అప్పటివరకు సస్పెన్స్ అని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు చెప్పారు. ఆయన చెప్పదలచుకున్న బిగ్ న్యూస్ ఇదే కావచ్చని ఐటీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకేసారి 4 వేల ఐటీ ఉద్యోగాలు.. అది కూడా కేవలం హైదరాబాద్ క్యాంపస్‌లోనే అంటే అది నిజంగా బిగ్ న్యూసేనని అంటున్నారు. -
ట్రాఫిక్ సమస్యకు గూగుల్ చెక్!
గూగుల్ అందిస్తున్న కొత్త సదుపాయంతో ఇకపై ట్రాఫిక్ లో ఇరుక్కుపోవాల్సిన పని ఉండదట. ఇప్పిటికే తాము చేరాల్సిన అడ్రస్ కనుక్కోవడం, దూరాన్ని తెలుసుకోవడం, రూట్లు వెతుక్కోవడంలో యూజర్లకు సహకరిస్తున్న గూగుల్ మ్యాప్స్... ఇప్పుడు కొత్తగా ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించే మరో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. గూగుల్ మ్యాప్స్ మీకు కొత్త కొత్త మార్గాల్లో ప్రయాణించే అదృష్టాన్ని కల్పిస్తోందని గూగుల్ ప్రొడక్ట్ మేనేజర్ సంకేత్ గుప్తా గూగుల్ మ్యాప్స్ బ్లాగ్ స్పాట్ లో వెల్లడించారు. ఈ కొత్త అవకాశంతో.. ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోకుండా వేరే మార్గాల్లో సులభంగా గమ్యాన్ని చేరుకోవచ్చని, వెళ్లే మార్గంలో ట్రాఫిక్ జామ్ అయితే మ్యాప్స్‌లో అలర్ట్ వస్తుందని చెప్పారు. ఇందుకోసం యాప్ లో మనం ఎక్కడికెళ్లాలో టైప్ చేస్తే చాలు.. దారిలో ఉండే ట్రాఫిక్ ను బట్టి ఎప్పటికప్పుడు అలర్ట్స్ వస్తుంటాయని, దాన్నిబట్టి త్వరగా వెళ్లగలిగే రూటును ఎంచుకునే అవకాశం ఉంటుందని సంకేత్ తెలిపారు. ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయినపుడు మీరు ఇంకెంత సమయం వేచి చూడాల్సి వస్తుందో తెలుపుతుందని, అలాగే ప్రత్యామ్నాయ మార్గాలను తెలుసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. యూజర్లు తమ యాండ్రాయిడ్ లేదా ఐవోఎస్ పరికరాలను నేవిగేషన్ మోడ్‌లో పెట్టుకుని ఉంటే చాలని, తమకు కావాల్సిన అన్ని అప్ డేట్లను గూగుల్ మ్యాప్స్ అందిస్తుందని అంటున్నారు. ఇప్పటికే 'శ్రీలంక స్ట్రీట్ వ్యూ ఇమేజరీ' ని మ్యాప్స్ లో అందుబాటులోకి తెచ్చినట్లు ఇటీవలే గూగుల్ వెల్లడించింది. దీనిద్వారా శ్రీలంక వాసులేకాక, ప్రపంచంలోని ప్రజలంతా శ్రీలంకను తమ ఫోన్లు, టాబ్లెట్లు, కంప్యూటర్లలో వీక్షించే అవకాశం ఉంది. -
ఆదరణ పెరుగుతున్న కెరీర్.. కార్టోగ్రాఫర్
ఒక ప్రాంత భౌగోళిక పరిస్థితులను, రూపురేఖలను తెలుసుకోవడానికి ఏకైక ఆధారం.. పటాలు(మ్యాప్స్). దేశాల మధ్య సరిహద్దులు, కొండలు, నదులు, సముద్రాలు, మైదానాలు, పీఠభూములు, నగరాలు, పట్టణాలు, పల్లెలు.. ఇలా భూమిపై ఉండే సమస్తాన్ని కళ్లముందుంచేవి పటాలే. మ్యాప్‌ల రూపకర్తలనే కార్టోగ్రాఫర్లు అంటారు. ఆధునిక కాలంలో ఎన్నో రంగాల్లో పటాల అవసరం ఉంటోంది. విదేశాల్లో డిమాండ్ కలిగిన కార్టోగ్రఫీ కెరీర్ ప్రస్తుతం మన దేశంలోనూ క్రమంగా ఆదరణ పొందుతోంది. అవకాశాలు ఎన్నెన్నో... కార్టోగ్రఫీ కోర్సులను అభ్యసించినవారికి రక్షణ శాఖ, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్(ఎన్ఐసీ), అగ్రికల్చర్ ఇంజనీరింగ్, విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, టెలి కమ్యూనికేషన్స్, ఉన్నత విద్య, పరిశోధనా కేంద్రాలు, స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, నేషనల్ సర్వే అండ్ మ్యాపింగ్ సంస్థలు, జియోలాజికల్ సర్వే, లాండ్ మేనేజ్మెంట్, ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్ సర్వీసెస్, జాతీయ పార్కులు, ఫారెస్ట్ సర్వీస్, ఐటీ పరిశ్రమ, భూగర్భ గనుల సంస్థలు, డిజాస్టర్ మేనేజ్మెంట్, రవాణా, మౌలిక సదుపాయాలు, ట్రాఫిక్ మేనేజ్మెంట్ వంటి విభాగాల్లో ఉద్యోగాలు ఉన్నాయి. సర్వేలు నిర్వహించే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో కార్టోగ్రాఫర్ల భాగస్వామ్యం తప్పనిసరి. కంప్యూటర్/మ్యాథమెటికల్/డిజైన్ స్కిల్స్ ఉన్నవారు ఈ రంగంలో సులువుగా రాణించొచ్చు. జియోమాటిక్స్ కన్సల్టెంట్, రీసెర్చ్ ఫెలో, పోస్ట్-డాక్టోరల్ ఫెలో, జీఐఎస్ అనలిస్ట్/కో-ఆర్డినేటర్, మ్యాపింగ్ సైంటిస్ట్, ప్రొఫెసర్, టెక్నికల్ సపోర్ట్ అనలిస్ట్, జీఐఎస్ సేల్స్ మేనేజర్, ఇంటర్నెట్ ప్రొడక్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, అప్లికేషన్స్ ప్రోగ్రామర్.. ఇలా వివిధ హోదాల్లో పనిచేయొచ్చు. కావాల్సిన నైపుణ్యాలు: కార్టోగ్రాఫర్లు విధుల్లో భాగంగా క్షేత్రస్థాయిలో విస్తృతంగా తిరగాల్సి ఉంటుంది. ఇందులో శారీరక శ్రమ, ఒత్తిళ్లు అధికం. వీటిని తట్టుకొనేవారే కార్టోగ్రఫీని కెరీర్‌గా ఎంచుకోవాలి. మెరుగైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఎప్పటికప్పుడు వృత్తిపరమైన పరిజ్ఞానం పెంచుకోవాలి. అర్హతలు: భారత్‌లో కార్టోగ్రఫీలో గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్, పీజీ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్మీడియెట్ తర్వాత గ్రాడ్యుయేషన్‌లో చేరొచ్చు. ఇందులో ఉత్తీర్ణత సాధించి, పీజీ కూడా పూర్తి చేస్తే మంచి అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. బీఎస్సీ జాగ్రఫీ, ఎంఎస్సీ జాగ్రఫీ, ఎంఎస్సీ అప్లయిడ్ జాగ్రఫీ, ఎంఎస్సీ స్పేషియల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎంఎస్సీ జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఎంఎస్సీ రిమోట్ సెన్సింగ్, ఎంఎస్సీ జియో ఇన్ఫర్మాటిక్స్, ఎంటెక్ జియోఇన్ఫర్మాటిక్స్, పీజీ డిప్లొమా ఇన్ జీఐఎస్ వంటి కోర్సులు చేసినవారు కూడా ఈ రంగంలో అడుగుపెట్టొచ్చు. వేతనాలు: కార్టోగ్రాఫర్లకు పని చేస్తున్న సంస్థను బట్టి జీతభత్యాలు అందుతాయి. ప్రారంభంలో నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేలు పొందొచ్చు. కనీసం రెండేళ్ల అనుభవం సంపాదిస్తే నెలకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వేతనం ఉంటుంది. కార్పొరేట్ సంస్థలు రూ.లక్షల్లో వేతన ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నాయి. కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: ఇండియన్ నేషనల్ కార్టోగ్రాఫిక్ అసోసియేషన్ వెబ్సైట్: www.incaindia.org మద్రాస్ యూనివర్సిటీ వెబ్సైట్: www.unom.ac.in అన్నామలై యూనివర్సిటీ వెబ్సైట్: http://annamalaiuniversity.ac.in/ జామియా మిలియా ఇస్లామియా-ఢిల్లీ వెబ్సైట్: www.jmi.ac.in ఉత్కళ్ యూనివర్సిటీ-భువనేశ్వర్ వెబ్సైట్: http://utkaluniversity.ac.in/