రెండు మ్యాప్‌లతో ఐరాస వేదిక‌పై నెతన్యాహు.. భారత్‌ ఎటువైపు అంటే | Israeli PM Netanyahu Holds 2 Maps At UN Show India As Blessing, Iran And Iraq As Curse | Sakshi
Sakshi News home page

రెండు మ్యాప్‌లతో ఐరాస వేదిక‌పై నెతన్యాహు.. భారత్‌ ఎటువైపు అంటే

Published Sat, Sep 28 2024 2:56 PM | Last Updated on Sat, Sep 28 2024 3:29 PM

Netanyahu Maps At UN Show India As Blessing, Iran And Iraq As Curse

హెజ్‌బొల్లాను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌  తీవ్ర స్థాయిలో దాడులు జరుపుతోంది. అటు ఐక్యరాజ్యసమితి సమావేశాల్లోనూ..  లెబనాన్‌ సరిహద్దులో తమ లక్ష్యాలను సాధించే వరకు హెజ్‌బొల్లాపై పోరాటం ఆగదని ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు స్పష్టం చేశారు.  ఇప్పటికే హమాస్‌ సగం బలగాలను అంతం చేశామన్నారు. వారు లొంగిపోకపోతే పూర్తి విజయం సాధించే వరకు పోరాడతామన్నారు.

శుక్రవారం న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య‌స‌మ‌తి జ‌న‌ర‌ల్ అసెంబ్లీ స‌మావేశాల్లో ఇజ్రాయిల్ ప్ర‌ధాని బెంజిమ‌న్ నెతన్యాహు మాట్లాడుతూ.. త‌న చేతుల్లో రెండు మ్యాప్‌ల‌ను ప్ర‌ద‌ర్శించారు. అతని కుడి చేతిలోఉన్న మ్యాప్‌లో మిడిల్ ఈస్ట్‌తో పాటు ఇరాన్‌, ఇరాక్‌, సిరియా, యెమెన్ దేశాల‌కు న‌లుపు రంగు పెయింట్ వేశారు. ఆ మ్యాప్‌పై ద క‌ర్స్(శాపం) అని రాసి ఉన్న‌ది.

ఇక ఒక ఎడ‌మ చేతిలో ఉన్న మ్యాప్‌లో ఈజిప్ట్‌, సుడాన్‌, సౌదీ అరేబియా, ఇండియా దేశాలు ఉన్నాయి. ఈ దేశాలను హైలెట్‌ చేస్తూ గ్రీన్‌ కలర్‌ పెయింట్‌ వేశారు. ఆ మ్యాప్‌పై ద బ్లెస్సింగ్(దీవెన‌) అని రాసి ఉన్న‌ది అయితే ఆ రెండు మ్యాపుల్లోనూ .. పాల‌స్తీనా కనిపిస్తున్న ఆన‌వాళ్లు లేవు. గ్రీన్ మ్యాప్ లేదా బ్లాక్ క‌ల‌ర్ మ్యాపుల్లో .. పాల‌స్తీనాను చూపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ప్ర‌స్తుతం జరుగుతున్న ఘర్షణకు ఇరాన్ కార‌ణ‌మ‌ని నెతన్యాహు ఆరోపించారు. ఇరాన్‌తో పాటు దాని మిత్ర‌దేశాలు యుద్ధానికి ఆజ్యం పోస్తున్న‌ట్లు పేర్కొన్నారు. . ఇక గ్రీన్ మ్యాప్‌లో ఉన్న దేశాలు ఇజ్రాయిల్‌తో స‌న్నిహిత సంబంధాలు పెట్టుకుని ఉన్న‌ట్లు  తెలిపారు. లెబ‌నాన్‌, సిరియా, యెమెన్ దేశాల్లో జ‌రుగుతున్న హింస‌కు ఇరాన్ ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని తెలిపారు. లెబ‌నాన్‌లోని హిజ్‌బొల్లాకు, గాజాలోని హ‌మాస్‌కు, యెమెన్‌లోని హౌతీల‌కు ఆర్థిక‌, సైనిక స‌హకారాన్ని ఇరాన్ అందిస్తున్న‌ట్లు ఆరోపించారు. ఇరాన్ మిత్ర‌దేశాల నుంచి తమ భూభాగాన్ని ర‌క్షించుకుంటున్న‌ట్లు ఇజ్రాయిల్ ప్ర‌ధాని పేర్కొన్నారు.

ఒక‌వేళ మీరు దాడి చేస్తే, అప్పుడు మేం తిరిగి దాడి చేస్తామ‌ని ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. యూఎన్ జ‌న‌ర‌ల్ అసెంబ్లీలో నెతాన్య‌హూ మాట్లాడుతున్న స‌మ‌యంలో కొంద‌రు దౌత్య‌వేత్త‌లు నిర‌స‌న‌తో వాకౌట్ చేశారు. ఇరాన్ దూకుడు వ‌ల్లే లెబ‌నాన్‌, గాజాల‌పై దాడి చేయాల్సి వ‌చ్చింద‌ని చెప్పారు. హిజ్‌బొల్లా యుద్ధ మార్గాన్ని ఎంచుకున్నంత కాలం..  వారిని అంతం చేయడం తప్ప ఇజ్రాయెల్‌కు వేరే మార్గం లేదని స్పష్టం చేశారు

నెతాన్య‌హూ ప‌ట్టుకున్న గ్రీన్ మ్యాప్‌లో ఇండియా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇండియాతో త‌మ‌కు మంచి రిలేష‌న్స్ ఉన్నాయ‌ని చెప్పేందుకు ఆ మ్యాప్‌లో ఇండియాను చూపించిన‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల ఇండియా, ఇజ్రాయిల్ మ‌ధ్య స‌త్సంబంధాలు నెల‌కొన్నాయి. డిఫెన్స్‌, టెక్నాల‌జీ రంగంలో రెండు దేశాలు వాణిజ్యం పెంచుకున్నాయి. పాల‌స్తీనా స్వ‌యంప్ర‌తిప‌త్తికి ఇండియా స‌పోర్టు ఇస్తున్న‌ది. అయితే అదే స‌మ‌యంలో ఇజ్రాయిల్‌తో వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యాన్ని కొన‌సాగిస్తున్న‌ది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement