స్మార్ట్‌ఫోన్‌లా పుణ్యమా అని మనం ఎక్కడికైనా వెళ్లాలన్నా..లేదా దారి తెలియకపోయినా ఏ మాత్రం భయం లేకుండా హాయిగా వెళ్లిపోతున్నాం. జస్ట్ అలా ఫోన్‌లో మ్యాప్ ఓపెన్ చేసి చెవిలో అలా హెడ్‌ఫోన్స్ పెట్టుకొని..అందులో జీపీఎస్ ఆన్ చేసి..టెక్స్ట్ వాయిస్‌తో ఇచ్చే డైరెక్షన్‌ని బేస్ చేసుకోవడంతో.. జర్నీ ఈజీ అయిపోయింది. కానీ ఎప్పుడైనా ఆలోచించామా ఆ వాయిస్ ఎవ్వరిది? ఏ మహిళ మాట్లాడుతుంది అని. ప్రపంచం నలుమూలల ఆమె వాయిస్ అందరికీ సుపరిచితమే. ఇంతకి ఆమె ఎవరంటే..
ఆమె పేరు కరెనా జాకబ్‌సెన్. ఆస్ట్రేలియన్ మహిళ. స్మార్ట్ ఫోన్‌లో ఉండే జీపీఎస్ ఫీచర్‌లో ఉండే సిరి అనే వర్చువల్ వాయిస్‌కి స్వరాన్ని అందించిందే కరెనా. ఇంతకీ ఆమె 'జీపీఎస్ గర్ల్'గా ఎలా మారింది. ఆమె నేపథ్యం ఏమిటి? అంటే..కరెనా ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో మాకేలో జన్మించింది. ఏడు సంవత్సరాల వయసులో పాటలు రాయడం, పాడడం వంటివి చేసింది. ఆమె ఆస్ట్రేలియాలో ప్రముఖ సింగర్ అయిన ఒలివియా న్యూటన్-జాన్‌లా అవ్వలనేది కరెన్ డ్రీమ్. అందుకోసం అని సూట్‌కేస్ చేత పట్టుకుని న్యూయార్క్ వచ్చేసింది.
తాను అనుకున్నట్టుగానే ఎన్నో పాటలు రాసింది, పాడింది. ఇలా ఎన్నో ఆల్బమ్‌లు రిలీజ్ చేసి కెరియర్ మంచి ఊపులో ఏ చీకుచింత లేకుండా సాగిపోతోంది. అంతేగాదు ఆమె పాటలు యూఎస్ నెట్‌వర్క్స్ టెలివజన్ లైసెన్స్ పొందడం విశేషం. ఎన్నో ప్రముఖ థియోటర్‌లో ప్రదర్శించబడ్డాయి. మాకే టు మాన్‌హాటన్ వరకు కరెన్ తన సంగీతంతో ప్రజలను అలరించింది.
జీపీఎస్ గర్ల్‌గా టర్నింగ్..
నూయార్క్‌లో ఒక రోజు కరెన్ టెక్స్ట్ టు స్పీచ్ వాయిస్ సిస్టమ్‌ను రికార్డ్ చేయడానికి ఆడిషన్‌కి వెళ్లింది. అది తన వాయిస్‌ని ప్రపంచంలోని ప్రతి మూలకు తీసుకువెళ్తుందని ఊహించలేదు. ఆ ఒక్కసారి ఇచ్చిన వాయిస్ ఓవర్ కాస్త జీపీఎస్ గర్ల్‌గా బ్రాండ్ నేమ్‌ను తెప్పించింది. ఇక వెనుదిరిగి చూసుకోకుండా అన్ని రకాల వ్యాపారాల్లోకి అడుగుపెట్టేలా చేసింది ఆమె గాత్రం. ఒకరకంగా ఆమెను ఇంటర్నేషనల్ స్పీకర్ మార్చింది.
ఆమె గాత్రం ఎన్నో యూనివర్సిటీలో టెడ్‌ఎక్స్ స్పీకర్‌గా ఫైనాన్స్, హెల్త్, ఎడ్యుకేషన్, ట్రావెల్, రియల్ ఎస్టేట్‌తో సహా ఎన్నో బహుళ పరిశ్రమలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తన స్వరాన్ని అందించింది. ప్రముఖ ఇంగ్లీష్ ఛానెల్స్ ఎన్‌బీసీ టుడే షో, ఏబీసీ వరల్డ్ న్యూస్ టునైట్, సీబీఎస్ ఎర్లీ సో, సన్‌రైజ్, ఎన్‌వై డైలీ న్యూస్, ది గార్డియన్, గ్లామర్ మ్యాగజైన్, పీపుల్ మ్యాగజైన్ తదితర ఛానెల్స్ ఆమెను శక్తిమంతమైన మహిళగా కీర్తించాయి.
కస్టమైజ్డ్ వాయిస్ సిస్టమ్స్‌లో, అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్‌లలో కరెన్ వాయిస్ ఓవర్‌కి ఎంతో డిమాండ్ ఉంది. ఓ పాప్ సింగర్‌గా ఎన్నో అవార్డులు, రివార్డులతో ప్రభంజనం సృష్టించి కెరియర్ మంచి పీక్‌లో దూసుకుపోతుందనంగా చేసిన టెక్స్ట్ టు స్పీచ్ మరో సెలబ్రేటీ స్టేటస్‌ని తెచ్చిపెట్టింది. ఆమె స్వరం ఓ వరంలా మారి ఆమెకు వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా స్థిరపడేలా చేసింది.
(చదవండి: ప్రెగ్నెంట్‌గా ఉండగానే..మరోసారి ప్రెగ్నెంట్ కాగాలరా?.. ఇది సాధ్యమేనా!)
Comments
Please login to add a commentAdd a comment