
ప్రస్తుతానికి ఎగుమతులకే పరిమితం
న్యూఢిల్లీ: తైవాన్ దిగ్గజం ఫాక్స్‌కాన్‌కి చెందిన హైదరాబాద్ ప్లాంటులో ఏప్రిల్ నుంచి యాపిల్ ఎయిర్‌పాడ్స్ ఉత్పత్తి ప్రారంభం కానుంది. ప్రస్తుతానికి ఎగుమతుల కోసమే వీటిని తయారు చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. టెక్ దిగ్గజం యాపిల్ ఇప్పటికే తమ ఐఫోన్లను భారత్‌లో తయారు చేస్తుండగా, ఎయిర్‌పాడ్స్ రెండో కేటగిరీగా ఉంటుందని వివరించాయి. దాదాపు రూ. 3,500 కోట్లతో ఈ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్లు 2023 ఆగస్టులో ఫాక్స్‌కాన్ ప్రకటించింది.
భారత్‌పైనా ప్రతీకార టారిఫ్‌లు విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో యాపిల్ ఇక్కడ ఉత్పత్తిని తగ్గించుకుని, అమెరికాలో పెట్టుబడులు పెట్టనుందనే వార్తల నేపథ్యంలో, ఎయిర్‌పాడ్స్ తయారీని ప్రారంభించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇండియా సెల్యులార్ అండ్ ఎల్రక్టానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) ప్రకారం హియరబుల్స్, వేరబుల్స్ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు భారత్‌లో 20 శాతంగా ఉండగా, అమెరికాలో అసలు లేనే లేవు. అమెరికా నుంచి స్మార్ట్‌ఫోన్లు, హియరబుల్స్, వేరబుల్స్‌పై దిగుమతులపై సుంకాలను తొలగిస్తే భారత్‌కి కూడా ప్రయోజనకరంగా ఉంటుందని ఐసీఈఏ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment