
బినితా చెట్రీ.. వయసు ఎనిమిదేళ్లు. కాని ఇవాళ దేశమంతా పేరు మారుమోగిపోతోంది. అందుకు కారణం ‘బ్రిటన్స్ గాట్ టాలెంట్’ షో (Britain's Got Talent). ప్రపంచవ్యాప్తంగా ఉండే రకరకాల టాలెంట్‌ను ఆహ్వానించి గుర్తింపునిచ్చే ఈ షోలో పాల్గొనాలని ఎందరికో కల. అలాంటి షోలో బినితా తన డ్యాన్స్‌తో అందర్నీ స్టన్ చేసింది. చురుకైన స్టెప్స్‌తో, చిరుతలాంటి మెరుపుతో బినితా చేసిన డ్యాన్స్, హావభావాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
బినితా (Binita Chhetry) స్వస్థలం ఈశాన్య రాష్ట్రమైన అస్సామ్. షోలోకి అడుగుపెట్టిన వెంటనే బినితా తనను తాను పరిచయం చేసుకుంటూ ‘నేను భారతదేశం నుంచి వచ్చాను. బ్రిటన్స్ గాట్ టాలెంట్ నా కలల వేదిక’ అని చెప్పింది. ఇక్కడ గెలవడం తన లక్ష్యం అని, తాను పింక్ ప్రిన్సెస్ హౌస్ (pink princess house) కొనాలని అనుకుంటున్నానని చెప్పి అందరి మనసుల్నీ కొల్లగొట్టింది. తన ముద్దు మాటలతో జడ్జీలను సమ్మోహనపరిచింది. అనంతరం ఆ స్టేజీ మీద చేసిన డ్యాన్స్ చూసి ప్రేక్షకులంతా తన్మయంతో చప్పట్లు కొట్టారు.
ఇంత చిన్నవయసులో శివంగిలా చేస్తున్న డ్యాన్స్ చూసి జడ్జీలు, ప్రేక్షకులందరూ లేచి మరీ తనకు అభినందనలు తెలిపారు. ఈ వీడియో వైరల్ (Video Viral)గా మారి, తన గురించి దేశమంతా చెప్పుకునేలా చేసింది. నిరంతర సాధన, పట్టుదల, అనుకున్నది సాధించేదాకా ఆగిపోని దీక్షే తన విజయ రహస్యం అంటోంది బినిత. తన వయసులోని ఎంతో మంది చిన్నారులకు స్ఫూర్తిగా నిలుస్తోంది.
ప్రశంసల వర్షం
తన మెస్మరైజింగ్ డ్యాన్స్‌తో అందర్నీ తన వైపు తిప్పుకున్న బినితా చెట్రీపై ప్రశంసల వర్షం కురుస్తుంది. అస్సాం (Assam) ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మతో పాటు పలువురు మంత్రులు బినితాను పొగడ్తలతో ముంచెత్తారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఆమెను అభినందిస్తూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. బినితా చెట్రీ అనుకున్నది సాధించాలని వారంతా ఆకాంక్షించారు.
From Assam to UK: Assam's talent shines at Britain's Got Talent
Little Binita Chhetry makes the judges of @BGT go all 'Awww' as she presents a powerful performance and moves to the next round.
My best wishes to the little one and hope she is able to buy a pink princess house… pic.twitter.com/G6xk5MEy3M— Himanta Biswa Sarma (@himantabiswa) March 2, 2025
ఎవరీ బినితా చెట్రీ?
అస్సాంలోని బోకాజన్‌లోని అమరాజన్ ప్రాంతానికి చెందిన బినితా చెట్రీ.. రాజస్థాన్‌లోని జైపూర్‌లో చదువుతోంది. బ్రిటన్స్ గాట్ టాలెంట్ షో కంటే ముందు ఆమె డాన్సీ ఐకాన్ 2 వైల్డ్‌ఫైర్‌లోనూ పాల్గొంది. 2024, ఆగస్టులో ఆల్-స్టైల్ డ్యాన్స్ కాంపిటీషన్ (సోలో)లో బినిత మొదటి రన్నరప్‌గానూ నిలిచింది. ఆమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో బినితకు లక్షకుపైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె డాన్స్ వీడియోలకు ఫుల్ క్రేజ్ ఉంది.
చదవండి: స్టూడెంట్ మైండ్ బ్లాక్ స్పీచ్.. ఫిదా అవ్వాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment