talent show
-
ఆ టాలెంట్ షోపై పరిణీతి ఆగ్రహం.. ఇదేనట కారణం
Parineeti Chopra Slams Talent Show For Listing Her As A Judge: బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా ఓ టాలెంట్ షోపై మండిపడింది. 'హునర్బాజ్' అనే టాలెట్ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరించనుంది పరిణీతి. ఇటీవల దీనికి సంబంధించిన ఒక పోస్ట్‌ను 'ఫన్ కిడ్స్ ఇండియా' ట్విటర్లో షేర్ చేసింది. అందులో 'యూకేకి చెందిన నలుగురు పిల్లలు తమ ప్రతిభను ప్రదర్శించారు. రేపు మీ ఆడిషన్‌ను నమోదు చేసుకోండి. ఇదే చివరి అవకాశం.. వదులుకోకండి.' అంటూ పరిణీతి చోప్రాను న్యాయ నిర్ణేతల్లో ఒకరిగా చేర్చి ట్వీట్ చేసింది ఫన్ కిడ్స్ ఇండియా. ఈ పోస్టుపై స్పందించిన పరిణీతి 'షేమ్. నేను ఇక ఈ షోతో భాగస్వామ్యం కాను. దయచేసి నా పేరును తొలగించండి. పిల్లలు, వారి తల్లిదండ్రుల విషయంలో నా పేరును ఇలా వాడుకోవద్దు.' అంటూ ఫన్ కిడ్స్ ఇండియా షేర్ చేసిన ట్వీట్‌ను స్క్రీన్ షాట్స్ తీసి పోస్ట్ చేసింది. అయితే అంతకుముందే ఫన్ కిడ్స్ ఇండియా ఆ ట్వీట్‌ను తొలగించింది. తర్వాత షో నిర్వాహకులు కూడా తమ అభిప్రాయాలను పరిణీతితో పంచుకునే ప్రయత్నం చేశారు. పరిణీతి మెనేజర్‌తో వారు మూడు నెలలుగా టచ్‌లో ఉంటున్నామని తెలిపారు. అదేవిధంగా పరిణీతి షోలో భాగస్వామ్యం కావడం తమకు సంతోషంగా ఉందని, త్వరలోనే ఆమెను కలుసుకునేందుకు ప్లాన్ చేస్తున్నామని పేర్కొన్నారు. Absolute SHAM - I am not associated with this show in any way. Request you to kindly remove my name and not take advantage of kids and their parents in this way. 🙏 pic.twitter.com/HlTzVfuA5P — Parineeti Chopra (@ParineetiChopra) December 18, 2021 -
ఇంటర్నెట్ను షేక్ చేస్తోన్న బీర్‌ఖల్సా ప్రదర్శన
-
ఆశ్చర్యం.. భయం.. ఉత్కంఠత అన్ని ఒక్కసారే!
వాషింగ్టన్ : కొన్ని టీవీ షోల్లో కళ్లకు గంతలు కట్టుకుని టార్గెట్‌ని కొట్టడం.. మనిషి తల మీద ఓ పండు పెట్టి దాన్ని కొట్టడం వంటివి చూస్తూనే ఉంటాం. ఇప్పుడు వీటన్నింటిని తలదన్నే వీడియో ఒకటి ప్రస్తుతం యూట్యూబ్‌లో హల్చల్ చేస్తోంది. దీన్ని చూసిన వాళ్లు భయంతో కూడిన ఆశ్చర్యంతో నోరు వెళ్లబెడుతున్నారు. ఇండియాకు చెందిన బీర్‌ఖల్సా గ్రూప్ చేసిన ఈ ప్రదర్శనకు ప్రతి ఒక్కరు ఫిదా అయిపోయారు. అమెరికాస్ గాట్ టాలెంట్ అనే షోలో బీర్‌ఖల్సా గ్రూప్ ఈ ప్రదర్శన ఇచ్చారు. ఈ గ్రూప్‌లో జగ్దీప్ సింగ్, కన్వల్జిత్ సింగ్, కరంజిత్ సింగ్ ముగ్గురు సభ్యులుగా ఉన్నారు. వీరిలో జగ్దీప్ సింగ్ ఎత్తు 7 అడుగుల 6 అంగుళాలు. ప్రస్తుతం ఇతడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలీస్ ఉద్యోగిగా రికార్డు సృష్టించాడు. ఇక ఈ గ్రూప్ చేసిన విన్యాసాలు వర్ణించడానికి మాటలు రావు. ప్రదర్శనలో భాగంగా జగ్దీప్ సింగ్‌ను పడుకోబెట్టి అతని చుట్టూ కొబ్బరి కాయలు.. తల దగ్గర పుచ్చకాయలు పెట్టారు. మరో వ్యక్తి కళ్ల మీద ఉప్పు పోసుకుని.. గంతలు కట్టుకోని.. ఓ సుత్తి తీసుకుని ఏ మాత్రం తడబడకుండా.. మనిషికి తగలకుండా కొబ్బరి కాయలు, పుచ్చ కాయలు పగలకొట్టాడు. వీరు ప్రదర్శన ఇస్తున్నంత సేపు ప్రేక్షకులతో పాటు న్యాయ నిర్ణేతలు కూడా భయపడుతూ.. ఆశ్చర్యపోతూ.. అంతలోనే తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠతో ప్రదర్శనను ఆసాంతం తిలకించారు. ప్రదర్శన పూర్తయ్యాక తేరుకోవడానికి అందరికి కాస్తా సమయం పట్టింది. ఆ తర్వాత ప్రేక్షకులతో పాటు జడ్జీలు కూడా లేచి నిల్చుని చప్పట్లతో అభినందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. -
ఈ బుజ్జాయిల పాట వింటే అదరహో!
ప్రతిభాపాటవాల చాటడంలో పిల్లలూ ఏమీ తీసిపోవడం లేదు. అద్భుతంగా ప్రతిభను చూపిస్తూ అబ్బురపరుస్తున్నారు. ఆటలు, పాటలు, విన్యాసాలు ఏ విషయంలోనైనా పిల్లలు కాదు పిడుగులు అనిపించుకుంటున్నారు. ఇద్దరు చైనా బుడతలు తమ అద్భుతగానంతో శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. 2015లో చైనా టాలెంట్ షోలో ఇద్దరు చైనా చిన్నారులు అత్యంత క్లిష్టమైన పాటను అమోఘంగా పాడారు. 10 ఏళ్ల జెఫ్రీ లీ, ఏడేళ్ల సెలినా టామ్ అత్యంత క్లిష్టమైన ’యూ రైస్ మి అప్’ పాటను తన్మయత్వంతో ఆలపించారు. వారు పాడుతున్నంతసేపు శ్రోతలు నమ్మలేనట్టుగా విస్మయంలో మునిగిపోయారు. డుయో సీక్రెట్ గార్డెన్ కోసం 2002లో మొదట రికార్డు చేసిన ’యూ రైస్ మి’ పాట ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతి చెందింది. 2002లో జోష్ గ్రోబన్, 2005లో ఐరిష్ బ్యాండ్ వెస్ట్‌లైఫ్ ఈ పాట ఆలాపించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. అత్యంత క్లిష్టమైన పాటగా పేరొందిన ఈ గానాన్ని ఆ తర్వాత ఎంతోమంది గాయనీగాయకులు రికార్డు చేశారు. అలాంటి కష్టతరమైన పాటను వేదికపై అలవోకగా తన్మయత్వంతో పాడుతూ చైనా బుడతలు అదరహో అనిపించుకున్నారు -
ఈ బుడతల పాట వింటే అదరహో అంటారు!