Parineeti Chopra Slams Talent Show For Listing Her As A Judge: బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా ఓ టాలెంట్ షోపై మండిపడింది. 'హునర్బాజ్' అనే టాలెట్ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరించనుంది పరిణీతి. ఇటీవల దీనికి సంబంధించిన ఒక పోస్ట్‌ను 'ఫన్ కిడ్స్ ఇండియా' ట్విటర్‌లో షేర్ చేసింది. అందులో 'యూకేకి చెందిన నలుగురు పిల్లలు తమ ప్రతిభను ప్రదర్శించారు. రేపు మీ ఆడిషన్‌ను నమోదు చేసుకోండి. ఇదే చివరి అవకాశం.. వదులుకోకండి.' అంటూ పరిణీతి చోప్రాను న్యాయ నిర్ణేతల్లో ఒకరిగా చేర్చి ట్వీట్ చేసింది ఫన్ కిడ్స్ ఇండియా.
ఈ పోస్టుపై స్పందించిన పరిణీతి 'షేమ్. నేను ఇక ఈ షోతో భాగస్వామ్యం కాను. దయచేసి నా పేరును తొలగించండి. పిల్లలు, వారి తల్లిదండ్రుల విషయంలో నా పేరును ఇలా వాడుకోవద్దు.' అంటూ ఫన్ కిడ్స్ ఇండియా షేర్ చేసిన ట్వీట్‌ను స్క్రీన్ షాట్స్ తీసి పోస్ట్ చేసింది. అయితే అంతకుముందే ఫన్ కిడ్స్ ఇండియా ఆ ట్వీట్‌ను తొలగించింది. తర్వాత షో నిర్వాహకులు కూడా తమ అభిప్రాయాలను పరిణీతితో పంచుకునే ప్రయత్నం చేశారు. పరిణీతి మెనేజర్‌తో వారు మూడు నెలలుగా టచ్‌లో ఉంటున్నామని తెలిపారు. అదేవిధంగా పరిణీతి షోలో భాగస్వామ్యం కావడం తమకు సంతోషంగా ఉందని, త్వరలోనే ఆమెను కలుసుకునేందుకు ప‍్లాన్ చేస్తున్నామని పేర్కొన్నారు.
Absolute SHAM - I am not associated with this show in any way. Request you to kindly remove my name and not take advantage of kids and their parents in this way. 🙏 pic.twitter.com/HlTzVfuA5P
— Parineeti Chopra (@ParineetiChopra) December 18, 2021
Comments
Please login to add a commentAdd a comment