Parineeta Chopra
-
జిమ్ డ్రెస్‌లో పరిణీతి చోప్రా.. కేతికశర్మ సొగసులు.. అనసూయ మెరుపులు
జిమ్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధం అవుతున్న పరిణీతి చోప్రామేరే పాస్ గాడీ హై అంటూ మోటార్ బైక్ రైడ్ చేస్తున్న ఆదాశర్మవైట్ శారీలో మెస్మరైజ్ చేస్తానంటూ కేతిక శర్మ ఫోజోలుసరికొత్త లుక్‌లో కనిపించిన సమంతజిమ్ డ్రెస్‌లో పరిణీతి చోప్రా.. కేతికశర్మ సొగసులు.. అనసూయ మెరుపులు View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) View this post on Instagram A post shared by @parineetichopra View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
Parineeti Chopra: దేవుడా..! టెన్షన్లో ఉన్నప్పుడు ఈ హీరోయిన్ ఇలా చేస్తుందా!
సాధారణంగా మన జీవితాల్లో ఎన్నో కుదుపులు, చికాకులు, అడ్డంకులు వస్తూంటాయి. వీటిని కొందరు తేలికగా, మరికొందరు టెన్షన్‌గా తీసుకుంటారు. మరి ఆ టెన్షన్లో చాలామంది కొన్నిరకాల చేష్టలు చేస్తూంటారు. వాటిలో గోళ్లు కొరకడం, వేళ్లు విరవడం, తల పట్టుకోవడం, చికాకు పడుతూ ఉండటంలాంటివి. ఇక ఈ బాలీవుడ్ నటికి మాత్రం ఇలాంటి అలవాటుందని తెలుసా..! టెన్షన్లో ఉన్నప్పుడు.. భయమేసినప్పుడు పరిణీతి చోప్రాకు.. చేతివేళ్ల గోళ్లను కాదు.. ఆ గోళ్ల చుట్టూ ఉన్న స్కిన్‌ని కొరకడం అలవాటట! విమానం ల్యాండ్ అవుతున్నప్పుడు చాలా భయపడుతుందట! ఆ భయంతో గోళ్ల చుట్టూ ఉన్న స్కిన్‌ని కొరుకుతుందని బాలీవుడ్ సోర్సెస్ ఇన్ఫో. పిజ్జా అంటే పరిణీతికి ప్రాణం. పగలు.. రాత్రి.. అర్ధరాత్రి.. అనే తేడా లేకుండా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు పిజ్జా పనిపడుతుందట! ఇవి చదవండి: Priyamani: ప్రియ 'నటీమణి'.. పెర్ఫార్మెన్స్కి పర్యాయపదం ఆమె! -
హీరోయిన్ పరిణితి ఎంగేజ్మెంట్ ఫోటోలు చూశారా
-
ఆ టాలెంట్ షోపై పరిణీతి ఆగ్రహం.. ఇదేనట కారణం
Parineeti Chopra Slams Talent Show For Listing Her As A Judge: బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా ఓ టాలెంట్ షోపై మండిపడింది. 'హునర్బాజ్' అనే టాలెట్ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరించనుంది పరిణీతి. ఇటీవల దీనికి సంబంధించిన ఒక పోస్ట్‌ను 'ఫన్ కిడ్స్ ఇండియా' ట్విటర్లో షేర్ చేసింది. అందులో 'యూకేకి చెందిన నలుగురు పిల్లలు తమ ప్రతిభను ప్రదర్శించారు. రేపు మీ ఆడిషన్‌ను నమోదు చేసుకోండి. ఇదే చివరి అవకాశం.. వదులుకోకండి.' అంటూ పరిణీతి చోప్రాను న్యాయ నిర్ణేతల్లో ఒకరిగా చేర్చి ట్వీట్ చేసింది ఫన్ కిడ్స్ ఇండియా. ఈ పోస్టుపై స్పందించిన పరిణీతి 'షేమ్. నేను ఇక ఈ షోతో భాగస్వామ్యం కాను. దయచేసి నా పేరును తొలగించండి. పిల్లలు, వారి తల్లిదండ్రుల విషయంలో నా పేరును ఇలా వాడుకోవద్దు.' అంటూ ఫన్ కిడ్స్ ఇండియా షేర్ చేసిన ట్వీట్‌ను స్క్రీన్ షాట్స్ తీసి పోస్ట్ చేసింది. అయితే అంతకుముందే ఫన్ కిడ్స్ ఇండియా ఆ ట్వీట్‌ను తొలగించింది. తర్వాత షో నిర్వాహకులు కూడా తమ అభిప్రాయాలను పరిణీతితో పంచుకునే ప్రయత్నం చేశారు. పరిణీతి మెనేజర్‌తో వారు మూడు నెలలుగా టచ్‌లో ఉంటున్నామని తెలిపారు. అదేవిధంగా పరిణీతి షోలో భాగస్వామ్యం కావడం తమకు సంతోషంగా ఉందని, త్వరలోనే ఆమెను కలుసుకునేందుకు ప్లాన్ చేస్తున్నామని పేర్కొన్నారు. Absolute SHAM - I am not associated with this show in any way. Request you to kindly remove my name and not take advantage of kids and their parents in this way. 🙏 pic.twitter.com/HlTzVfuA5P — Parineeti Chopra (@ParineetiChopra) December 18, 2021 -
జిమ్ బోర్‌కొట్టి... పోరాట విద్యనో పట్టుపట్టి...
‘జిమ్’దగీ... పంజాబీ భామ పరిణీతీ చోప్రా... తొలుత నటనతో జనాన్ని ఆకట్టుకుంది. దాన్ని కొనసాగిస్తూనే తర్వాత తన వెయిట్‌లాస్ వర్కవుట్స్‌తో సంచలనం సృష్టించింది. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టే ముందుదాదాపు 86 కిలోల బరువున్న ఈ బొద్దుగుమ్మ... అనంతరం విభిన్న రకాల వ్యాయామాల ద్వారానాజూకు లలనగా మారింది. సోషల్ మీడియాలో తన వీడియోలు పోస్ట్ చేయడం ద్వారా దేశంలో ఎంతో మంది యువతులకు స్ఫూర్తిని అందించింది. ప్రతి ఇంటర్వ్యూలోనూ మీడియా నుంచి తన వర్కవుట్స్ గురించిన ప్రశ్నలు ఎదుర్కునే పరిణీతి... ఏమంటుందంటే... మొదట్లో బరువు విషయంలో నేను పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. బాలీవుడ్లో అడుగుపెట్టాక కూడా రూపం ఎలా ఉన్నా... నా నటనా చాతుర్యం చాలు అనుకున్నా. అయితే అది సరైన అభిప్రాయం కాదని తర్వాత తెలిసి వచ్చింది. బాలీవుడ్ నటి అంటే నటనతో పాటు చూడచక్కని రూపం కూడా అవసరమే అని అర్థమైంది. మరోవైపు ఓవర్ వెయిట్ కారణంగా నచ్చిన దుస్తులు ధరించడం కూడా సమస్యే అయింది. స్లీవ్‌లెస్ వేసుకోవడానికి కూడా తటపటాయించాల్సి వచ్చింది. పాతికేళ్ల వయసులో నేనెలా ఉండాలి? ప్రపంచానికి ఎలా కనపడాలి? అని అని ప్రశ్నించుకుంటే సమాధానంతో పాటు చేయాల్సింది ఏమిటో కూడా తెలిసింది. త్వరగా బరువు పెరిగే శరీరతత్వంతో... మిగతావారికి ఏమోగాని రుచులను ఇష్టపడే ఫుడ్ లవర్‌గా నాకు మాత్రం వెయిట్‌లాస్ అనేది కఠిన పరీక్షే అయింది. నాకు మెటబాలిజం బాగా తక్కువ. అందువల్ల నా శరీరానిది చాలా తేలిగ్గా బరువు పెరిగే తత్వం. పిజ్జాలు, బర్గర్లు, పాస్తాలు... ఇతరత్రా ఫాస్ట్ ఫుడ్ నాకు ఇష్టమే అయినప్పటికీ... నోరు కట్టేసుకోక తప్పలేదు. బ్రేక్‌ఫాస్ట్‌గా ఒక గ్లాసుడు పాలు, బ్రౌన్ బ్రెడ్, బట్టర్, రెండు వైట్ ఎగ్స్, జ్యూస్ తీసుకునేదాన్ని. లంచ్‌కి దాల్, రోటీ బ్రౌన్ రైస్, గ్రీన్ సలాడ్, వెజిటబుల్స్‌తో ఫినిష్. పడుకోవడానికి కనీసం 2 గంటలు ముందు డిన్నర్లో బాగా తక్కువ పరిమాణంలో నూనె లేని ఆహారం, గ్లాసుడు పాలు లేదా చాకొలెట్ షేక్. వర్కవుట్స్ ఇలా... ట్రెడ్మిల్ మీద జాగింగ్‌తో నా రోజు ప్రారంభించేదాన్ని. కార్డియో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వర్కవుట్స్ రెగ్యులర్. మెడిటేషన్, యోగా, స్విమ్మింగ్, హార్స్‌రైడింగ్ సహా నన్ను చురుకుగా ఉంచే పనులన్నీ చేశాను. క్లిష్టమైన ఎరోబిక్ స్టెప్స్ సాధన చేశాను. అవి మరోవైపు నా డ్యాన్స్ టాలెంట్‌ను కూడా మెరుగుపర్చాయి. వీటన్నింటితో... నేను వెయిట్ లాస్ అయ్యానే గాని పూర్తి ఆరోగ్యంగా ఉన్నాననే భావన రాలేదు. సన్నగా అవడం ఒకటి మాత్రమే చాలదని తెలిసొచ్చింది. రోజువారీ పనిలో తేలికగా అలసిపోతున్నా అనిపించింది. నాకు నేను శక్తివంతురాలిని అనే భావన కలగడం లేదు. అప్పుడే ఫిట్నెస్ మీద ధ్యాస మళ్లింది. నన్ను నేను మరింత శక్తిమంతంగా మార్చుకోవాలనుకున్నా. రొటీన్‌గా వెళ్లే జిమ్ బోర్ కొట్టేసింది... కేరళ మార్షల్ ఆర్ట్స్ మీద దృష్టి పెట్టాను. ‘కలరిపయ్యాట్టు’ అనే మార్షల్ ఆర్ట్‌ను రోజూ గంట సేపు సాధన చేశాను. ఇది నన్ను మరింత ఫ్లెక్సిబుల్‌గా, శక్తిమంతంగా మార్చింది. నా సామర్థ్యాన్ని కూడా పెంచింది. నేనిప్పుడు బరువు తగ్గడంతో పాటు ఫిట్‌గానూ మారాను. -
ఆ వెయిట్ పెరగాలంటే.. ఈ వెయిట్ తగ్గాల్సిందే!
హీరోలకు సిక్స్ ప్యాక్.. హీరోయిన్లకు జీరో సైజ్ ఉండాలనుకునే ట్రెండ్ ఇది. బాలీవుడ్లో అయితే ఇది మరింత ఎక్కువ. కానీ, ‘కింగ్ ఆఫ్ రొమాన్స్’ అనిపించుకున్న యశ్ చోప్రా మాత్రం తన చిత్రంలో నటించే నాయికలను ఏనాడూ సన్నబడమని నిబంధన విధించలేదట. యశ్ దర్శకత్వంలో చాలా సినిమాలు చేసిన నటి కాజోల్ స్వయంగా ఈ విషయం చెప్పారు. కానీ, దర్శకులందరికీ యశ్‌జీ అంత ఉదార స్వభావం ఉండదు కదా. ఇండస్ట్రీలో వెయిట్ పెరగాలంటే మీ వెయిట్ తగ్గించుకోవాల్సిందే అని నిర్మొహమాటంగా చెబుతారు. పైగా, ఇప్పటి తరం ప్రేక్షకులు బక్కపలచని భామలనే ఇష్టపడుతున్నారు కాబట్టి, కథానాయికగా రాణించాలనుకునేవాళ్లు బరువు తగ్గక తప్పడంలేదు. అలా గత ఆరేడేళ్లల్లో తెరకు పరిచయమైన నాయికల్లో బక్కపలచగా మారిన బరువందాల తారల గురించి చెప్పుకుందాం. సోనాక్షీ... మహా మోటు ‘దబంగ్’ చిత్రం ద్వారా పరిచయమైన సోనాక్షీ సిన్హాను చూసిన ప్రేక్షకుల గుండె దడదడలాడింది. ఈ భారీ భామ బాలీవుడ్లో నెగ్గుకు రావడం అంత ఈజీ కాదని తేల్చేశారు. హీరోయిన్ కాకముందు సోనాక్షీ ఓ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేసింది. అప్పుడామె స్టార్ అవుతుందనే నమ్మకం ఎవరికీ ఉండేది కాదట. 5 అడుగుల 8 అంగుళాల ఎత్తు, 90 కిలోల బరువుతో చాలా మోటుగా ఉండేది సోనాక్షీ. ‘దబాంగ్’ అంగీకరించిన తర్వాత సోనాక్షీ కష్టాలు మొదలయ్యాయి. వాకింగ్, జాకింగ్లతో పాటు ట్రైనర్ చెప్పిన వ్యాయామాలన్నీ చేసి, అందరూ ఆశ్చర్యపోయే రీతిలో తగ్గింది. కానీ, 60 లోపు మాత్రం తగ్గలేకపోయింది. హిందీ రంగంలో ఉన్న ఇతర నాయికలతో పోల్చితే సోనాక్షీ కొంచెం లావుగానే ఉంటుంది. ఇంకొంచెం తగ్గితే బాగుండనుకునేవాళ్లు లేకపోలేదు. కానీ, సోనాక్షీ మాత్రం ఇంకా తగ్గడం తనవల్ల కాదని అంటున్నారు. ఏదేమైనా అవకాశాలకు కొదవ లేదు కాబట్టి, ఈ 60 కిలోల బరువు తనకు పెద్ద భారం కాదనే చెప్పాలి. సోనమ్... నాట్ సో క్యూట్ ఇప్పుడేమో సోనమ్ కపూర్‌ని ‘మిస్ స్టయిల్ ఐకాన్’ అంటున్నారు. కానీ, ఒకప్పుడు.. అంటే సినిమాల్లోకి రాకముందు ఆమెను చాలామంది ‘సోనమ్ వెరీ ఫ్యాట్.. నాట్ సో క్యూట్’ అని ఆటపట్టించేవారు. అప్పుడు సోనమ్ బరువు 86 కిలోలు. వెండితెరపైకి రాకముందు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దగ్గర ‘బ్లాక్’ చిత్రానికి సహాయ దర్శకురాలిగా పని చేసింది సోనమ్. ఆ సమయంలో తన తదుపరి చిత్రం ‘సావరియా’ ద్వారా సోనమ్‌ని కథానాయికగా పరిచయం చేయాలని భన్సాలీ అనుకున్నారు. కానీ, సోనమ్ లడ్డూలా ఉండటంతో.. తగ్గమన్నారు. సోనమ్ కూడా మెరుపు తీగలా మారాలనుకుంది. కానీ, అంత ఈజీయా? అప్పటివరకు పిజ్జాలు, బర్గర్లు తెగ లాగించిన సోనమ్ అవి మానుకోవాల్సి వచ్చింది. అలాగే శరీరానికి కొన్ని క్లిష్టమైన వ్యాయామాలను పరిచయం చేయాల్సి వచ్చింది. భన్సాలీ కూడా ప్రోత్సహించడంతో ఓ సవాల్‌లా తీసుకుని తగ్గింది. ఆ తర్వాత ‘సావరియా’ ద్వారా పరిచయం కావడం, యూత్‌లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకోవడం తెలిసిందే. ఇప్పుడీ మెరుపు తీగ బరువు జస్ట్ 54. జరైన్... జర్రంత తగ్గమ్మా డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అయ్యాం అని కొంతమంది తారలంటారు. జరైన్ ఖాన్ ఈ జాబితాకి చెందిన అమ్మాయే. ఓసారి సరదాగా ‘యువరాజ్’ షూటింగ్ లొకేషన్‌కి వెళ్లినప్పుడు సల్మాన్‌ఖాన్ దృష్టిలో పడ్డారామె. కత్రినా కైఫ్ పోలికలతో ఉన్న జరైన్ని చూడగానే సల్మాన్ ఆమెను ప్రోత్సహించాలనుకున్నారు. ఆ సమయంలో కత్రినాతో మనస్పర్థలు ఏర్పడటంవల్లే ఆయన ఆ విధంగా అనుకున్నారనే వార్త ఉంది. ఏదేమైనా అదృష్టం జరైన్ ఇంటి డోర్‌ని జోరుగా తట్టింది. సల్మాన్‌ఖాన్ సరసన ‘వీర్’లో అవకాశం కొట్టేసింది. కానీ, సినిమా విడుదలయ్యాక.. ‘ప్చ్.. బొద్దుగా ఉంది. సినిమాలకు పనికి రాదు’ అని విశ్లేషకులు తమ కలంతో ఓ రిమార్క్ పడేశారు. దాంతోపాటు దర్శక, నిర్మాతలు, ప్రేక్షకులు కూడా జరైన్ శరీరాకృతిని విమర్శించారు. వాస్తవానికి 100 కిలోల బరువు ఉండే జరైన్ ఆ సినిమా కోసం కొంచెం తగ్గింది. అయినా విమర్శలపాలైంది. జర్రంత తగ్గకపోతే కష్టమే అన్నారు. ఇలా అయితే మనుగడ కష్టమే అనుకున్న జరైన్ తగ్గడం మొదలుపెట్టింది. అప్పటివరకు ముద్దుగా పెంచుకున్న శరీరాన్ని కష్టపెట్టి, ఎట్టకేలకు బరువు తగ్గించేసింది. ఇప్పుడామె వెయిట్ 55 కిలోలు. పరిణీతి... పరేషాన్ చబ్బీ చీక్స్, డింపుల్ చిన్... చిన్నప్పుడు ఈ రైమ్‌ని అందరూ పాడుకునే ఉంటాం. విచిత్రం ఏంటంటే.. టీనేజ్‌లో ఉన్న పరిణీతీ చోప్రాని చూసి కుర్రకారు ఈ రైమ్ పాడేవారట. సినిమాల్లోకి రాకముందు పరిణీతి దిగిన కొన్ని ఫొటోలు చూస్తే, వామ్మో అని పరేషాన్ అయినవాళ్లు అంటారు. ఆ రేంజ్లో ఉండేది. కథానాయిక కావాలనే కోరిక తనకు లేకపోవడంతో మిస్ ఫ్యాట్ గాళ్‌గానే ఉండిపోవాలని ఫిక్సయ్యిందట. పీఆర్ ఏజెన్సీలో పని చేయడం మొదలుపెట్టాక తన కజిన్ ప్రియాంక చోప్రాలా కథానాయిక కావాలనుకుంది పరిణీతి. దాంతో కొంచెం బరువు తగ్గింది. తొలి చిత్రం ‘లేడీస్ వెర్సస్ రిక్కీ బాల్’తో పెద్దగా మార్కులు సంపాదించకపోయినా, ఆ తర్వాత చిత్రం ‘ఇషక్జాదే’లో ‘మే పరేషాన్...’ పాటలో... తన అందచందాలతో కుర్రకారుని పరేషాన్ చేసేసింది. అయితే, పరిణీతి ఇంకా బరువు తగ్గితే బెటర్ అనే ఫీలింగ్‌ని చాలామంది వ్యక్తపరిచారు. ఆ మేరకు కొంచెం సన్నబడింది కానీ, మెరుపు తీగ అనదగ్గ శరీరాకృతికి చేరుకోవాలంటే ఇంకాస్త చిక్కాల్సిందే. ఆలియా... మిస్ ఫ్యాట్యా ప్రస్తుతం బాలీవుడ్లో ఉన్న కథానాయికలందరిలోకన్నా ఆలియా భట్ వయసులో చిన్న. ఈ సొట్ట బుగ్గల సుందరి చాలా క్యూట్‌గా ఉంటుంది. కానీ, ఒకప్పుడు అలా ఉండేది కాదు. దాంతో ‘ఆలియా... మిస్ ఫ్యాట్యా’ అన్నవాళ్లూ ఉన్నారట. చిన్నప్పుడు ‘సంఘర్ష్’లో నటించినప్పుడు ఆలియా ముద్దుగా ఉండేది. టీనేజ్‌లోకొచ్చాక కథానాయికగా రంగప్రవేశం చేయాలనుకుంది. కానీ, అది జరగాలంటే ముందు సన్నబడాలి. ఎందుకంటే, దాదాపు 67 కిలోల బరువు ఉండేదట. ఆ బరువుతో తెరపై కనిపిస్తే, ఇంకేమైనా ఉందా? అందుకే వర్కవుట్లు మొదలుపెట్టింది. తండ్రి మహేశ్ భట్ ఆధ్వర్యంలో మూడు నెలలు కఠినమైన వ్యాయామాలు చేయడంతో పాటు, ఆహార పరంగా జాగ్రత్త వహించింది. ఫలితంగా 13 కిలోలు తగ్గింది. బరువు తగ్గిన తర్వాత ఆలియాను అభిమానులు ‘ఫిఫ్టీ కేజీ తాజ్‌మహల్’ అని ముద్దుగా పిలుస్తున్నారు.