జిమ్‌ బోర్‌కొట్టి... పోరాట విద్యనో పట్టుపట్టి... | Weight loss work outs | Sakshi
Sakshi News home page

జిమ్‌ బోర్‌కొట్టి... పోరాట విద్యనో పట్టుపట్టి...

Published Wed, Dec 28 2016 10:44 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

జిమ్‌ బోర్‌కొట్టి... పోరాట విద్యనో పట్టుపట్టి... - Sakshi

జిమ్‌ బోర్‌కొట్టి... పోరాట విద్యనో పట్టుపట్టి...

‘జిమ్‌’దగీ...

పంజాబీ భామ పరిణీతీ చోప్రా... తొలుత నటనతో జనాన్ని ఆకట్టుకుంది. దాన్ని కొనసాగిస్తూనే తర్వాత తన వెయిట్‌లాస్‌ వర్కవుట్స్‌తో సంచలనం సృష్టించింది. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టే ముందుదాదాపు 86 కిలోల బరువున్న ఈ బొద్దుగుమ్మ... అనంతరం విభిన్న రకాల వ్యాయామాల ద్వారానాజూకు లలనగా మారింది. సోషల్‌ మీడియాలో తన వీడియోలు పోస్ట్‌ చేయడం ద్వారా దేశంలో
ఎంతో మంది యువతులకు స్ఫూర్తిని అందించింది. ప్రతి ఇంటర్వ్యూలోనూ మీడియా నుంచి తన వర్కవుట్స్‌ గురించిన ప్రశ్నలు ఎదుర్కునే పరిణీతి... ఏమంటుందంటే...


మొదట్లో  బరువు విషయంలో నేను పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. బాలీవుడ్‌లో అడుగుపెట్టాక కూడా రూపం ఎలా ఉన్నా... నా నటనా చాతుర్యం చాలు అనుకున్నా. అయితే అది సరైన అభిప్రాయం కాదని తర్వాత తెలిసి వచ్చింది. బాలీవుడ్‌ నటి అంటే నటనతో పాటు చూడచక్కని రూపం కూడా అవసరమే అని అర్థమైంది. మరోవైపు ఓవర్‌ వెయిట్‌ కారణంగా నచ్చిన దుస్తులు ధరించడం కూడా సమస్యే అయింది. స్లీవ్‌లెస్‌ వేసుకోవడానికి కూడా తటపటాయించాల్సి వచ్చింది. పాతికేళ్ల వయసులో నేనెలా ఉండాలి?  ప్రపంచానికి ఎలా కనపడాలి? అని అని ప్రశ్నించుకుంటే సమాధానంతో పాటు  చేయాల్సింది ఏమిటో కూడా తెలిసింది.  

త్వరగా బరువు పెరిగే శరీరతత్వంతో...
మిగతావారికి ఏమోగాని రుచులను ఇష్టపడే ఫుడ్‌ లవర్‌గా నాకు మాత్రం వెయిట్‌లాస్‌ అనేది కఠిన పరీక్షే అయింది.  నాకు మెటబాలిజం బాగా తక్కువ. అందువల్ల నా శరీరానిది చాలా తేలిగ్గా బరువు పెరిగే తత్వం. పిజ్జాలు, బర్గర్‌లు, పాస్తాలు... ఇతరత్రా ఫాస్ట్‌ ఫుడ్‌ నాకు ఇష్టమే అయినప్పటికీ... నోరు కట్టేసుకోక తప్పలేదు. బ్రేక్‌ఫాస్ట్‌గా ఒక గ్లాసుడు పాలు, బ్రౌన్‌ బ్రెడ్, బట్టర్, రెండు వైట్‌ ఎగ్స్, జ్యూస్‌ తీసుకునేదాన్ని. లంచ్‌కి దాల్, రోటీ బ్రౌన్‌ రైస్, గ్రీన్‌ సలాడ్, వెజిటబుల్స్‌తో ఫినిష్‌. పడుకోవడానికి కనీసం 2 గంటలు ముందు  డిన్నర్‌లో బాగా తక్కువ పరిమాణంలో నూనె లేని ఆహారం, గ్లాసుడు పాలు లేదా చాకొలెట్‌ షేక్‌.

వర్కవుట్స్‌ ఇలా...
ట్రెడ్‌మిల్‌ మీద జాగింగ్‌తో నా రోజు ప్రారంభించేదాన్ని. కార్డియో, స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్‌ వర్కవుట్స్‌ రెగ్యులర్‌.  మెడిటేషన్, యోగా, స్విమ్మింగ్, హార్స్‌రైడింగ్‌ సహా నన్ను చురుకుగా ఉంచే పనులన్నీ చేశాను. క్లిష్టమైన ఎరోబిక్‌ స్టెప్స్‌ సాధన చేశాను. అవి మరోవైపు నా డ్యాన్స్‌ టాలెంట్‌ను కూడా మెరుగుపర్చాయి. వీటన్నింటితో... నేను వెయిట్‌ లాస్‌ అయ్యానే గాని పూర్తి ఆరోగ్యంగా ఉన్నాననే భావన రాలేదు. సన్నగా అవడం ఒకటి మాత్రమే చాలదని తెలిసొచ్చింది.  రోజువారీ పనిలో తేలికగా అలసిపోతున్నా అనిపించింది. నాకు నేను శక్తివంతురాలిని అనే భావన కలగడం లేదు. అప్పుడే ఫిట్‌నెస్‌ మీద ధ్యాస మళ్లింది. నన్ను నేను మరింత శక్తిమంతంగా మార్చుకోవాలనుకున్నా. రొటీన్‌గా వెళ్లే జిమ్‌ బోర్‌ కొట్టేసింది... కేరళ మార్షల్‌ ఆర్ట్స్‌ మీద దృష్టి పెట్టాను. ‘కలరిపయ్యాట్టు’ అనే మార్షల్‌ ఆర్ట్‌ను రోజూ గంట సేపు సాధన చేశాను. ఇది నన్ను మరింత ఫ్లెక్సిబుల్‌గా, శక్తిమంతంగా మార్చింది. నా సామర్థ్యాన్ని కూడా పెంచింది. నేనిప్పుడు బరువు తగ్గడంతో పాటు ఫిట్‌గానూ మారాను.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement