dance show
-
Sreemukhi: రెక్కలు తొడిగిన ముద్దబంతిలా శ్రీముఖి స్టయిల్ (ఫోటోలు)
-
ఢీ డ్యాన్స్ షో కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య
టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ చైతన్య సూసైడ్ చేసుకున్నారు. ఢీ డ్యాన్స్ షోలో కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న చైతన్య అప్పుల బాధ తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. నెల్లూరు క్లబ్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ప్రస్తుతం ఆత్మహత్యకు సంబంధించిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. (ఇది చదవండి: సిల్క్ స్మిత రాసిన చివరి ఉత్తరం ఇదే.. మోసం చేసిన సూపర్ స్టార్ ఎవరు?) 'మమ్మీ, డాడీ, చెల్లి నన్ను బాగా చూసుకున్నారు. ఏ కష్టం రానీయలేదు. చెల్లి ఫీల్ అవ్వొద్దు. లవ్ యూ అమ్మా. నా సహచరులందరికీ సారీ. నేను చాలామందిని ఇబ్బంది పెట్టేశా. మీ అందరికీ సారీ. డబ్బు విషయంలో నా మంచితనాన్ని కోల్పోయా. అప్పులు చేయడమే కాదు.. తీర్చే సత్తా ఉండాలి. సత్తా ఉంది.. కానీ నా వల్ల అవ్వట్లేదు. ప్రస్తుతం నెల్లూరులో ఉన్నా. ఇది నా లాస్ట్ డే. అప్పుల బాధను తట్టుకోలేకపోతున్నా. నా వల్ల ఇబ్బంది పడిన వారందరికీ సారీ. డ్యాన్స్ షోతో నాకు పేరు వచ్చింది. కానీ తగినంత సంపాదన రాలేదు.' అంటూ సెల్ఫీ వీడియోను షేర్ చేశారు. (ఇది చదవండి: మీకు హీరోలను అడిగే ధైర్యం ఉందా?.. శ్రియా కామెంట్స్ వైరల్) View this post on Instagram A post shared by ROCK N ROLL DANCE STUDIO (@team_rds_1) -
ఓటీటీలోకి రమ్యకృష్ణ అరంగేట్రం, ఆ డాన్స్ షోలో ‘శివగామి’ సందడే సందడి..
ప్రేక్షకులకు వందశాతం వినోదం అందించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్న ప్రముఖ తొలి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా. ప్రేక్షకులు వందశాతం వినోదం అందించేందుకు ఆహా సరికొత్త కథలు, షోలతో ముందుకు వస్తోంది. అన్‌స్టాపబుల్ టాక్ షో విత్ ఎన్బీకే, తెలుగు ఇండియన్ ఐడల్ వంటి రియాలిటీ షోలతో ప్రేక్షకులను అలరించిన ఆహా తాజాగా డాన్స్ ఐకాన్ షోతో సిద్ధమైంది. ఆహా ప్లాట్‌ఫాంపై తాజాగా గ్రాండ్‌గా లాంచ్ అయిన ఈ షోతో లేడీ సూపర్ స్టార్, ‘శివగామి’ రమ్యకృష్ణ డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టింది. చదవండి: కృష్ణంరాజు ముగ్గురు కూతుళ్ల గురించి ఈ ఆసక్తిర విషయాలు తెలుసా? ప్రముఖ యాంకర్ ఓంకార్ హొస్ట్‌గా చేయనున్న ఈ షోకి ఆమె జడ్జీగా వ్యవహరిస్తున్నారు. ఆమెతో పాటు కింగ్ ఆఫ్ హుక్ స్టెప్స్ శేఖర్ మాస్టర్ కూడా న్యాయనిర్ణేతగా ఉండబోతున్నాడు. ఈ సందర్భంగా రమ్యకృష్ణ మాట్లాడుతూ.. ‘డ్యాన్స్ ఐకాన్ వంటి షోతో ఆహాలో జడ్జిగా అరంగేట్రం చేస్తుండడం సంతోషంగా ఉంది. ఇలాంటి ఒక ఫార్మాట్ ఈ మధ్య కాలంలో ఎవ్వరూ చేయనిది. ఈ షో ద్వారా ఎవరూ చూడని ఒక కొత్త రమ్యని చూడబోతున్నారు. అందరూ ఈ షో ని ఆదరిస్తారని ఆశిస్తున్నా’ అని చెప్పుకొచ్చారు. చదవండి: ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతున్న కార్తికేయ 2! ఎప్పుడు, ఎక్కడంటే.. అదే విధంగా ఆహా సీఈఓ అజిత్ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘డ్యాన్స్ ఐకాన్‌తో ఆహా ఫ్యామిలీకి రమ్యకృష్ణని మేము స్వాగతిస్తున్నాము. రమ్య ఎంతో మందికి ఒక రోల్ మోడల్. డ్యాన్స్‌పై ఆమెకున్న అవగాహన అసమానమైనది. డాన్స్ ఐకాన్‌కు ఆమె జడ్జిగా వ్యవహరిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది’ అన్నారు. అనంతరం యాంకర్, ఈ షో ప్రొడ్యూసర్ ఓంకార్ “రమ్యకృష్ణ గారు ఈ షో కి జడ్జి గా వ్యవహరించడం నాకు చాలా ఆనందంగా ఉంది. రమ్య గారితో పనిచేయాలి అనే నా కల, ఆహ టీం ద్వారా సాకరమైంది. డాన్స్ ఐకాన్ షో ద్వారా అందరికీ నాన్-స్టాప్ ఎంటర్టైన్మెంట్ దొరకనుంది’ అని తెలిపారు. ఈ షో సెప్టెంబర్ 17 నుండి ప్రతి శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకు ఆహాలో అందుబాటులో ఉండనుంది. -
కూతురితో కలిసి బుల్లితెరపై సందడి చేసిన మహేశ్ బాబు
సూపర్ స్టార్ మహేశ్ బాబు బుల్లితెరపై సందడి చేయనున్నారు. ఓ ప్రముఖ డ్యాన్స్ షోకు కూతురు సితారతో కలిసి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో సితార తన డ్యాన్స్‌తో ఆకట్టుకుంది. సాధారణంగానే మహేశ్ షోలు, ఫంక్షన్లకు చాలా అరుదుగా వస్తుంటారు. అలాంటిది కూతురు సితారతో కలిసి తొలిసారిగా బుల్లితెరపై కనిపించనుండటంతో ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. వచ్చే ఆదివారం ఈ షో ప్రసారం కానుంది. కాగా ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మహేశ్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
ఓంకార్ హోస్ట్‌గా ఆహాలో ‘డాన్స్ ఐకాన్’ షో, ఫస్ట్‌లుక్ విడుదల
కరోనా తర్వాత ఓటీటీల వినియోగం విస్తృతంగా పెరిగింది. వెబ్‌సిరీస్, సినిమాలు, స్పెషల్ షోలతో ఓటీటీలు ప్రేక్షకుడికి బోలెడంత వినోదాన్ని పంచుతున్నాయి. తెలుగువారికి నచ్చే మెచ్చే కంటెంట్‌ను అందిస్తూ ఆహా అనిపిస్తోంది తొలి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం. ఇప్పటికే కొత్త సినిమాలు, వెబ్ సిరీస్, టాక్ షో, సింగింగ్ షోలతో ప్రేక్షకులను అలరిస్తోన్న ఆహా ఇప్పుడు మరో కొత్త షోను డిజిటల్ ప్రేక్షక్షుల ముందుకు తీసుకువస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిభవంతులైన డాన్స్‌ర్ల కోసం డాన్స్ ఐకాన్ షోను పరిచయం చేయబోతోంది. ఈ షోకు ప్రముఖ యాంకర్ ఓంకార్ హోస్ట్‌గా, నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఇక త్వరలోనే మీ ముందుకు తీసుకురాబోతున్న ఈ షో ఫస్ట్‌లుక్ ఆగస్ట్ 20న ఆహా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఈ షో యాంకర్, ప్రొడ్యూసర్ ఓంకార్ మాట్లాడుతూ.. ‘ఈ షో ద్వారా నేను మొదటిసారి ఓటీటీకి ప్లాట్‌ఫాంలోకి అడుగుపెడుతున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన అరవింద్ గారికి, ఆహాకు ధన్యవాదాలు. నేను ఎన్నో డ్యాన్స్ షోస్ చేశాను, కానీ ఇది చాల డిఫరెంట్‌గా ఉండబోతుంది. ఈ షో.. కంటెస్టెంట్స్‌తో పాటు కొరియోగ్రాఫీ చేసే మాస్టర్స్ జీవితాలని కూడా మార్చేస్తుంది. గెలిచిన కంటెస్టెంట్ కొరియోగ్రాఫర్‌కు టాలీవుడ్లో ఒక పెద్ద హీరో సినిమాలో కొరియోగ్రఫీ చేసే అవకాశం వస్తుంది. అందరు ఈ షోని ఆదరిస్తారని భావిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు. -
టీనా డిప్రెషన్లో ఉన్నానని చెప్పింది : ఆట సందీప్
ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో 'ఆట' మొదటి సీజన్ విన్నర్ టీనా సాధు మరణం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఎంతో ఫిట్‌గా ఉండే టీనా 38ఏళ్ల వయసులోనే మరణించడంతో ఆమె మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా టీనా మరణంపై ఆట సందీప్ అనుమానం వ్యక్తం చేశారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పలు షాకింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. 'టీనా లేదన్న విషయం ఇంకా నమ్మబుద్ది కావట్లేదు. 5రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చి ఎంతో సరదాగా గడిపిన టీనాకు అంత సడెన్‌గా హార్ట్ స్ట్రోక్ ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. ఆమె చాలా ఫిట్‌గా ఉంటుంది. ఇది గుండెపోటు అయ్యిండదనిపిస్తుంది. నాతో మాట్లాడినప్పుడు డిప్రెషన్లో ఉన్నాను. పర్సనల్ లైఫ్‌లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పింది. కలిసినప్పుడు వీటిపై మాట్లాడతానని చెప్పింది. కానీ అంతలోనే ఇలా జరిగిపోయింది. చాలా షాకింగ్‌గా అనిపిస్తుంది' అని పేర్కొన్నారు. దీంతో టీనా మృతిపై మరిన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ఆట సీజన్-1లో సందీప్-టీనాల జోడి టైటిల్ విన్నర్‌గా గెలిచిన సంగతి తెలిసిందే. చదవండి: ఆట' డ్యాన్స్ షో విన్నర్ టీనా కన్నుమూత చదవండి: డ్యాన్స్ షో విన్నర్ టీనా మృతిపై అనుమానాలు, లిక్కర్ ఎక్కువవడం వల్లే.. -
ఎక్కువగా మందు తాగడం వల్లే టీనా మృతి?
డ్యాన్స్ రియాలిటీ షో 'ఆట' మొదటి సీజన్ విన్నర్ టీనా సాధు మరణం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. చిన్నవయసులోనే టీనా మరణించడంతో ఆమె మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఆట మొదటి సీజన్‌కు విన్నర్‌గా నిలిచిన ఆమె ఆ షో నాలుగో సీజన్‌కు జడ్జిగానూ వ్యవహరించారు. కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న టీనా గోవాలో రఘు అనే వ్యక్తిని వివాహం చేసుకుని అక్కడే నివసిస్తోంది. అయితే నాలుగైదు రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చిన టీనా యాంకర్ శిల్పాచక్రవర్తిని కలిసిందని, తిరిగి డ్యాన్స్ షోల్లో రీఎంట్రీ ఇవ్వాలని ఉందని మనసులోని మాట బయటపెట్టినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత గోవా వెళ్లిపోయిన ఆమె ఇంట్లో ఉన్న సమయంలో మద్యం సేవించిందని, అయితే ఎక్కువ మోతాదులో మద్యం తీసుకోవడం వల్ల ఆమెకు గుండెపోటు వచ్చిందని కుటుంబీకులు తెలుపుతున్నట్లుగా ఓ వార్త వైరల్‌గా మారింది. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. ఇక టీనా సోషల్ మీడియాలో చివరిసారిగా షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by tina sadhu (@tinathestar18) View this post on Instagram A post shared by 𝐀𝐚𝐭𝐚 𝐒𝐚𝐧𝐝𝐞𝐞𝐩 𝐃𝐚𝐧𝐜𝐞 𝐌𝐚𝐬𝐭𝐞𝐫🇮🇳 (@aata_sandeep) చదవండి: 'ఆట' డ్యాన్స్ షో విన్నర్ టీనా కన్నుమూత -
'ఆట ఫేమ్ గీతిక ఎన్ని కష్టాలు పడుతుందో'.. ఆమె ఏం చెప్పిందంటే!
'ఆట' గీతిక మీకు గుర్తుంది కదా..అదేనండీ..సుందరం మాస్టార్ అంటూ ఎంతో బుజ్జిబుజ్జిగా మాట్లాడుతూ, చిన్న వయసులోనే డ్యాన్స్‌తో దుమ్మురేపిన చిచ్చరపిడుగే గీతిక. అప్పట్లో గీతిక పేరు మార్మోగిపోయింది. డ్యాన్స్ షో టైటిల్ గెలిచి మరింత పాపులర్ అయ్యింది. అయితే ఆ తర్వాత చాలాకాలం వరకు తెరపై ఎక్కడా కనిపించలేదు. దీంతో గీతిక జీవితం ఎంత దుర్బరంగా మారింతో తెలుసా? ఆమె ఎంత దయనీయ స్థితిలో ఉందో చూడండి అంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పరిస్థితులపై గీతిక స్పందించింది. 2012లో ఓ ఈవెంట్‌కు వెళ్లి వస్తుండగా తనకు పెద్ద ప్రమాదం జరిగిందని, దాంతో తన ఎడమకాలు, చేయి విరిగిపోయాయని తెలిపింది. తన తండ్రికి కూడా పెద్ద గాయాలు అయ్యాయని, కోలుకోవడానికి కొంత సమయం పట్టిందని పేర్కొంది. ఆ తర్వాత ఓ సినిమాతో పాటు పలు సీరియల్స్‌లో నటించానని, అయితే అనుకున్నంత గుర్తింపు రాలేదని పేర్కొంది. మరోవైపు ఉద్యోగ రీత్యా తన తల్లిదండ్రులు దుబాయ్‌కి వెళ్లాల్సి రావడంతో తాను అమ్మమ్మ-తాతయ్యల దగ్గర పెరిగానని, ఆ టైంలో తనతో పాటు షూటింగ్‌లకు రావడం వాళ్లకు కష్టం అయ్యేదని, అందుకే బ్రేక్ ఇవ్వాల్సి వచ్చిందని తెలిపింది. 'ఆ సమయంలో నాపై రకరకాలుగా వీడియోలు పుట్టకొచ్చాయి. ‘గీతిక అవకాశాలన్నింటినీ వెనక్కి తీసుకున్నారు. ఓ షోకి వెళ్తే అడుగు కూడా పెట్టనివ్వలేదు‘, ‘గీతిక గురించి తెలిస్తే కన్నీళ్లు పెట్టకుండా ఉండలేరు’ లాంటి వీడియోలు చాలానే వచ్చాయి. అయితే అవన్ని అసత్య ప్రచారాలే. నాకు కూడా తెలియకుండా ఇలా ఎప్పుడు జరిగిందా అని ఆ వీడియోలు చూసి అనుకునేదాన్ని' అని గీతిక వివరించింది. ప్రస్తుతం తాను ఇంటర్ సెకండ్ ఇయర్ చదవుతున్నానని, ఇప్పటికీ డ్యాన్స్‌ని మర్చిపోలేదని చెప్పింది. డ్యాన్స్ తన డీఎన్ఏలోనే ఉందని, నెక్స్ట్ ఇయర్ కెరీర్ పరంగానూ ఆలోచిస్తానని పేర్కొంది. మంచి అవకాశాలు వస్తే తప్పకుండా చేస్తానని తెలిపింది. చదవండి : గుర్తుపట్టరాని విధంగా మారిపోయిన హీరోయిన్ మీనాక్షి రోడ్డు దాటుతుండగా ప్రమాదానికి గురైన నటి.. పరిస్థితి విషమం -
స్టార్ మా ‘డాన్స్ ప్లస్’ విజేత ఎవరో తెలుసా ?
స్టార్ మా లో ఈ ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి ‘డాన్స్ ప్లస్’ సంగ్రామం గ్రాండ్ ఫైనల్స్ అద్భుతంగా అలరించబోతున్నాయి. 21 వారాలపాటు ప్రతి శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రేక్షకులకు ఓ సరికొత్త డాన్స్ ప్రపంచాన్ని సృష్టించి, ఉర్రూతలూగించిన సెన్సేషనల్ షో ‘డాన్స్ ప్లస్’ విజేత ఎవరో తేల్చడానికి స్టార్ మా సర్వం సిద్ధం చేసింది. కొత్త టాలెంట్ ని ప్రపంచానికి పరిచయం చేసిన ‘డాన్స్ ప్లస్’.. టైటిల్ ఎవరు గెలుస్తారా అన్న ప్రేక్షకుల ఎదురుచూపుకు ముగింపు పలుకుతోంది. దేశవ్యాప్తంగా వచ్చిన 5,344 డిజిటల్ ఎంట్రీల నుంచి ఆడిషన్స్ నిర్వహించి 18 టీమ్స్ తో మొదలైన ఈ రసవత్తరమైన పోటీ దేశంలోని రకరకాల ప్రాంతాల నుంచి ప్రతిభ గల డాన్సర్లకు ఓ మంచి మంచి వేదిక కల్పించింది. పాన్ ఇండియా డాన్స్ షో గా ప్రేక్షకుల అభిమానాన్ని ఆశీర్వాదాన్ని అందుకుంది. ఫైనల్స్ కి అర్హత సంపాదించిన 5 టీం లలో విజేతను తేల్చే ఫైనల్స్ ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఒక పండగలా జరిగాయి. తను ఎక్కడున్నా ఎంతో సందడి చేసే ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ముఖ్య అతిధిగా వచ్చారు. ఇక ప్రతి టీం ని సపోర్ట్ చేసేందుకు బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునయన, స్టార్ మా సూపర్ హిట్ సీరియల్ "జానకి కలగనలేదు" హీరో అమరదీప్, "జాతిరత్నాలు" సినిమా హీరోయిన్ ఫారియా అబ్దుల్లా, ప్రముఖ నాట్యకారిణి సంధ్య రాజు, సినిమా సెలబ్రిటీ నటాషా దోషి ఫైనల్స్ ని పోటీ లా కాకుండా ఒక సంబరంలా మార్చేశారు. ఎంత పండగలా అనిపించినా పోటీని ఎదుర్కొనే ప్రతి కంటెస్టెంట్... తమ టాలెంట్ తో ఈ షోకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చారు. తనదైన శైలిలో ప్రతి ఎపిసోడ్ నీ ఇంటరెస్టింగ్ గా నడిపించిన దర్శకుడు ఓంకార్ ఫైనల్స్ ని మరింత పదునైన వ్యూహాలతో రసవత్తరంగా నడిపించారు. రఘు మాస్టర్, యష్ మాస్టర్, బాబా భాస్కర్ మాస్టర్, ముమైత్ ఖాన్, యాని మాస్టర్, మోనాల్ గజ్జర్ న్యాయ నిర్ణేతలుగా వున్న ఈ వేదిక టైటిల్ ని, 20 లక్షల రూపాయల నగదు బహుమతిని ఎవరికి అందచేసింది? ఎవరి హంగామా ఏమిటి? ఎవరు ఏయే పాటలకు ఎలాంటి కొత్త కొత్త స్టెప్స్ వేశారు? టీమ్స్ ని సపోర్ట్ చేయడానికి వచ్చిన సెలెబ్రిటీల హడావిడి ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే స్టార్ మా లో "డాన్స్ ప్లస్" ఫైనల్స్ తప్పక చూడాలి. గుర్తుంచుకోండి... ఈ ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి "డాన్స్ ప్లస్" గ్రాండ్ ఫినాలే మీకు పరిపూర్ణమైన వినోదాన్ని అందించబోతోంది. -
వైరల్ : ముమైత్‌ఖాన్‌పై సీరియస్ అయిన ఓంకార్
బుల్లితెరపై యాంకర్‌గా ఓంకార్‌కు ప్రత్యేక స్థానం ఉంది. తనదైన స్టైల్‌తో షో టీఆర్పీ రేటింగ్స్ పెంచడంలో ఓంకార్ ముందుంటారు. ప్రస్తుతం ఓ బుల్లితెరపై ప్రసారం అయ్యే డ్యాన్స్ షోకు ఓంకార్ హోస్ట్‌గా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జరిగిన ఓ గొడవలో షో జడ్జిగా వ్యవహరిస్తున్న ముమైత్ ఖాన్‌కు ఓంకార్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు ఏమైందంటే..జడ్జిమెంట్ టైంలో ఓ కంటెస్టెంట్‌కు, ముమైత్ ఖాన్‌కు గొడవ జరుగుతుంది. దీంతో కంటెస్టెంట్ పైకి ముమైత్ గట్టిగా అరుస్తుండటంతో ఎందుకు సీరియస్ అవుతున్నారు అంటూ ఓంకార్ ఆమెను కూల్ చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ముమైత్ తగ్గకపోగా, ఓంకార్‌పై కూడా వేలు చూపిస్తూ తన కోపాన్ని ప్రదర్శించింది. ఈ సంఘటనతో సీరియస్ అయిన ఓంకార్..మీరు మీరు గొడవపడుతున్నప్పుడు నన్నెందుకు పాయింటౌట్ చేస్తున్నారు అంటూ సీరియస్ అయ్యాడు. ఈ షాకింగ్ ఇన్సిడెంట్‌తో ఏం చెయ్యాలో తెలియక ముమైత్ సైలంట్ అయిపోతుంది. దీనికి సంబంధించిన ఎపిసోడ్ టెలికాస్ట్ కావాల్సి ఉంది. అయితే ఈ ప్రోమోపై సోషల్ మీడియాలో పలు మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి. చదవండి : అందరు చూస్తుండగానే మోనాల్‌కు ముద్దు పెట్టిన కుర్ర మాస్టర్! ప్రముఖ డ్యాన్స్ షోలో ప్రమాదం..కంటెస్టెంట్‌కు తీవ్ర గాయం! -
ప్రముఖ డ్యాన్స్ షోలో ప్రమాదం..కంటెస్టెంట్‌కు తీవ్ర గాయం!
ప్రముఖ డ్యాన్స్ షో ఢీ తెలుగునాట సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ షో ద్వారా ఎంతో మంది డ్యాన్సర్లు సినిమాల్లో స్టార్ కొరియోగ్రాఫర్లుగా రాణిస్తున్నారు. అంతేకాక కంటెస్టెంట్లు సైతం సినిమాల్లో పలు పాటలకు చిందేస్తున్నారు. ఇప్పటివరకు పన్నెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఢీ.. ప్రస్తుతం 13వ సీజన్‌ను నిర్వహిస్తుంది. అయితే తాజాగా షోలో డ్యాన్స్ చేస్తూ ఓ లేడీ కంటెస్టెంట్ ప్రమాదానికి గురైంది. దీనికి సంబంధించిన ప్రోమో ఇటీవలె విడుదలైంది. ఇందులో..డ్యాన్స్ చేస్తూ ఓ కంటెస్టెంట్ ప్రమాదవశాత్తూ స్టేజ్ కింద పడిపోయింది. దీంతో ఆమె తలకు బలమైన గాయం అయ్యింది. దీనికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ ప్రమాదం జరిగిందని స్పష్టమవుతోంది. డ్యాన్స్ చేస్తూ కిందకు దూకే ఓ షాట్లో కంటెస్టెంట్ ప్రమాదవశాత్తూ కింద పడిపోవడంతో తలకు తీవ్రంగా దెబ్బ తగిలి రక్తస్రావమైంది. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఇది నిజంగానే ప్రమాదమా లేక పబ్లిసిటీ స్టంటా అన్నది తెలియాలంటే మాత్రం వచ్చే వారం ఏప్రిల్14న విడుదలయ్యే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సి ఉంది. చదవండి : ఈ బుల్లితెర జంట విడిపోనుందా? చూస్తుండగానే మోనాల్‌కు ముద్దు పెట్టిన కుర్ర మాస్టర్! -
చూస్తుండగానే మోనాల్‌కు ముద్దు పెట్టిన కుర్ర మాస్టర్!
బిగ్ బాస్ 4 ఫేం మోనాల్ గజ్జర్ ఒకప్పుడు ఎవరికి తెలియదు. హీరోయిన్గా ఎన్ని సినిమాలు చేసిన రాని గుర్తింపు ఒక్కసారిగా బిగ్‌బాస్ షోతో వచ్చేసింది. ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్గా బిగ్ బాస్ హౌజ్‌లో అడుగుపెట్టిన ఈ గుజరాతి భామ ఇప్పుడు అందరి నోళ్లల్లో నానుతోంది. దీనికి అభిజిత్, అఖిల్ సార్థక్‌తో ఒకేసారి లవ్ ట్రాక్ నడపడమే. అలా 98 రోజుల పాటు హౌజ్‌లో కొనసాగిన మోనాల్‌పై విమర్శలు వచ్చినప్పటికి బయటకు వచ్చాకా ఆమెకు ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. అంతేగాక దర్శక నిర్మాతల నుంచి ఆమెకు వరుస ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. ఈ క్రమంలో ఆమెకు పలు సినిమాల్లో నటించే అవకాశం కొట్టెసింది. దీంతో పాటు స్టార్ మాలో వస్తున్న డ్యాన్స్ ప్లస్ రియాలిటీ షోకు మెంటర్‌గా చేస్తూనే వీలు చిక్కినప్పుడల్లా స్టేజ్‌పై కాలు కదుపుతోంది ఈ భామ. ఈ క్రమంలో నిన్న స్టార్ మా విడుదల చేసిన ప్రోమో ప్రస్తుతం నెట్టంట వైరల్ అవుతోంది. ఈ షోలో కన్నా మాస్టర్ టీమ్ రెండు వారాల క్రితం అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి మోనాల్ మెప్పు పొందిన సంగతి తెలిసిందే. ఈ టీం పర్ఫామెన్స్‌కు ఫిదా అయిన మోనాల్ కన్నా మాస్టర్‌ను తీసుకెళ్లి తన సీట్లో కూర్చోబెట్టింది. అలా తీసుకెళ్తోన్న సమయంలో ఓ రొమాంటిక్ సాంగ్ వేశారు షో నిర్వహకులు. ఆ తర్వాత కన్నా మాట్లాడుతూ మేడమ్ కోసం ఏదైనా చేస్తానని చెప్పడంతో తనకు ఇష్టమైన పట్టు వస్త్రాలు కూడా వేసుకువస్తావా అని ఓంకార్ అడగ్గా.. మేడమ్ చేప్తే తప్పకుండా వేసుకోస్తానంటూ సమాధానం ఇచ్చాడు. అన్నట్టుగానే ఈ వారం జరిగే ఎపిసోడ్‌కు కన్నా మాస్టర్ పట్టు వస్రాలతో దర్శనమిచ్చాడు. తన పర్ఫామెన్స్ తర్వాత మోనాల్‌ను స్టేజ్‌పైకి తీసుకువేళ్లి తనతో స్టేప్పులేశాడు. అనంతరం ఆమెకు గులాబి పువ్వు ఇచ్చి మోకాళ్లపై కుర్చోని మోనాల్ చేయిపై ముద్దు పెట్టాడు. అది చూసి కంటెస్టెంట్స్, షో మెంటర్స్‌తో పాటు యాంకర్ ఓంకార్ సైతం ఒక్కసారిగా షాకయ్యారు. చదవండి: మోనాల్‌తో వీడియో కాల్, అఖిల్ కామెంట్ వైరల్ మహేశ్‌తో స్పెషల్ సాంగ్: మోనాల్ క్లారిటీ! -
భలే చాన్స్ కొట్టేసిన మోనాల్.. బుల్లితెరపై సందడి
మోనాల్ గజ్జర్.. బిగ్‌బాస్ నాల్గో సీజన్లో హాట్ టాపిక్‌గా మారిన పేరు ఇది. తొలుత అభిజిత్‌తో సన్నిహితంగా ఉండటం.. ఆ తర్వాత అఖిల్‌తో క్లోజ్‌గా మూవ్ కావడం, ఈమె వల్లే వారిద్దరు గొడవ పడటం..ఈ సీజన్‌కి హైలెట్‌గా నిలిచాయి. బిగ్‌బాస్ నాల్గో సీజన్లో ఎక్కువ ఎపిసోడ్లు కూడా ఈ ముగ్గురిపైనే ప్రసారం జరిగింది. ముఖ్యంగా హౌజ్‌లో అఖిల్- మోనాల్‌ల మధ్య రిలేషన్ వీక్షకులను బాగా ఆకట్టుకుంది. బిగ్‌బాస్‌లో పాల్గొనకముందు ఈ భామ పలు తెలుగు సినిమాల్లో నటించినప్పటికీ.. అప్పటి కంటే ఎక్కువ క్రేజ్ ఈమెకు బిగ్‌బాస్‌లో పాల్గొనడం ద్వారా వచ్చింది. హౌస్ నుంచి బయటకు వచ్చకా.. బ్యూటీకి వరుస ఆఫర్లు వచ్చాయి. కొన్ని సినిమాలతో పాటు పలు షోలలో ఆమె పాల్గొనబోతున్నట్లు సమాచారం. కాగా స్టార్ మాలో రేపటి నుంచి ప్రసారం కాబోయే డ్యాన్స్ ప్లస్ షోలో మోనాల్ పాల్గొనబోతున్నట్లు ఈ మధ్యన వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా దాన్ని కన్ఫర్మ్ చేస్తూ ఓ ప్రోమోను విడుదల చేశారు నిర్వాహకులు. అందులో వన్ డే టు గో అంటూ తనదైన స్టైల్లో చెప్పింది మోనాల్. అయితే ఈ షోలో మోనాల్ మెంటర్‌గా ఉండనున్నారా..? లేక జడ్జిగా ఉండబోతున్నారా అనేది నిర్వాహకులు తెలియజేయలేదు. కానీ ఆమె జడ్జిగానే ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ షోకి మోనాల్‌తో పాటు బాబా భాస్కర్ మాస్టర్, యశ్ మాస్టర్, రఘు మాస్టర్ కూడా జడ్జిలుగా ఉండబోతున్నారట. ఇక ఈ షోకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ప్రోమోలు అందరినీ ఆకట్టుకున్నాయి. వాటిని చూస్తుంటే ఈ షో ఓ రేంజ్లో ఉండబోతున్నట్లు అర్థమవుతోంది. 1 Day to go!!!#Dancee+ starts tomorrow at 6 PM on @StarMaa#DanceePlus pic.twitter.com/xeab1aFzgr — starmaa (@StarMaa) December 26, 2020 -
బుల్లితెర ఎంట్రీ
గ్లామరస్ క్యారెక్టర్లతో పాటు ట్రెడిషనల్ క్యారెక్టర్స్‌తోనూ సిల్వర్ స్క్రీన్‌పై ప్రేక్షకులను మెప్పిస్తున్నారు బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్. ఇప్పుడు ఆమె బుల్లితెరపై సందడి చేయబోతున్నారు. ఓ ప్రముఖ చానెల్‌కు చెందిన డ్యాన్స్ షోలో ఆమె న్యాయనిర్ణేతగా వ్యవహరించనున్నారు. ఈ షో జూన్‌లో స్టార్ట్ కానుందని తెలిసింది. ఆల్రెడీ షో విధి విధానాలు, వాటికి సంబంధించిన విశేషాలను కరీనాకు వివరించారట నిర్వాహకులు. ఇప్పటికే రిహార్సల్స్ కూడా స్టార్ట్ చేశారామె. కరీనా బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వనుండటం ఇదే తొలిసారి. ఇక సినిమా విషయానికి వస్తే... ఇటీవలే ‘గుడ్‌న్యూస్’ షూటింగ్‌ను పూర్తి చేసి, ‘అంగ్రేజీ మీడియం’సినిమాతో బిజీగా ఉన్నారు. -
వామ్మో.. డాన్స్ ఇరగదీశాడు!
కోల్‌కతాకు చెందిన డాన్సింగ్ స్టార్ 14 ఏళ్ల అక్షత్ సింగ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. అద్భుత ప్రదర్శనతో అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్నాడు. టీవీల్లో డాన్స్ కార్యక్రమాలు వీక్షించే వారికి అక్షత్ సుపరిచితుడు. ఇండియా’స్ గాట్ టాలెంట్ టీవీ షోలో సల్మాన్ ఖాన్ పాటకు అతడు చేసిన డాన్స్ వీడియో వైరల్ కావడంతో 2014లో అక్షత్ పేరు మార్మోగిపోయింది. దాంతో అతడికి పలు టీవీ షోల్లో పాల్గొనే అవకాశాలు దక్కాయి. తాజాగా బ్రిటన్స్ గాట్ టాలెంట్ షోలో అక్షత్ అదరగొట్టాడు. తన డాన్స్, హావభావాలతో అందరినీ మంత్రముగ్ధులను చేశాడు. జడ్జిలతో పాటు ప్రేక్షకులంతా లేచి నిలబడి కరతాళ ధ్వనులతో అతడిని ప్రశంసించారు. కుమారుడి ప్రతిభను కళ్లారా చూసి అక్షత్ తల్లి ఆనంద భాష్పాలు రాల్చారు. అక్షత్ సింగ్ తాజా డాన్స్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నావని జడ్జిలు అడిగిన ప్రశ్నకు అక్షత్ స్ఫూర్తిదాయక సమాధానం ఇచ్చాడు. ‘అందరిని సంతోషంగా ఉంచాలి. కష్టపడితే ఏదైనా సాధించగలమ’ని నిరూపించడానికి ఈ షోలో పాల్గొన్నానని జవాబిచ్చాడు. అక్షత్ మొదటిసారి బెంగాలీ రియాలిటీ షో ‘డాన్స్ బంగ్లా డాన్స్’లో పాల్గొన్నాడు. తర్వాత ఇండియా’స్ గాట్ టాలెంట్ షోతో బాగా పాపులర్ అయ్యాడు. దీంతో అతడి కుటుంబం ముంబైకి మారింది. -
సన్నీలియోన్ డ్యాన్స్ షో ప్రశాంతం
బెంగళూరు: బెంగళూరులో బాలీవుడ్ నటి, శృంగారతార సన్నీలియోన్ పాల్గొన్న ఓ డ్యాన్స్ కార్యక్రమం శనివారం ప్రశాంతంగా ముగిసింది. సన్నీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని కర్ణాటక రక్షణవేదికే యువసేనే(కేఆర్వీవైఎస్) హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకున్నారు. భారీగా పోలీసులను మోహరించారు. కన్నడ సంస్కృతిని దెబ్బతీసే ఇలాంటి కార్యక్రమాలను నిరసిస్తూ, వీరమహాదేవి సినిమాలో సన్నీ ప్రధానపాత్రలో నటించడాన్ని వ్యతిరేకిస్తూ కేఆర్వీవైఎస్ ఈ ప్రోగ్రామ్‌ను భగ్నం చేస్తామని హెచ్చరించింది. శాంతియుతంగా నిరసన తెలిపాలని అనుకున్నామనీ, కొందరు వ్యతిరేకులు హింసను రాజేసేందుకు ప్రణాళిక వేయడంతో తమ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నామని కేఆర్వీవైఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.హరీశ్ వెల్లడించారు. -
ఆయన దేవుడులా కనిపించాడు : ఉదయభాను
నందమూరి బాలకృష్ణ పైకి గంభీరంగా కనిపించే వ్యక్తి అయినా.. మనసు మాత్రం అతిసున్నితం అంటారు అభిమానులు. నా అనుకున్నవారి సంతోషం కోసం ఏం చేయడానికైనా వెనుకాడరని అటు అభిమానుల్లో, ఇటు సినీ ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. తాజాగా అలాంటి బాలయ్యబాబు తన గొప్పదనం చాటుకున్నారు. ఆయన సున్నిత మనసును చాటిచెప్పే ఓ ఉదంతం గురించి యాంకర్ ఉదయభాను గుర్తు చేసుకున్నారు. తన కవల పిల్లల పుట్టిన రోజుకు బాలయ్య ఎంతో పెద్ద మనసుతో వచ్చి ఆశీర్వదించడం గురించి మాట్లాడుతూ ఉదయభాను ఉద్వేగానికి గురైంది. కుటుంబం కోసం చిన్న వయసులోనే సినీరంగానికి వచ్చానని చెప్పిన ఆమె... తన జీవితంలో వేడుకలు, సెలబ్రేషన్స్ అన్నవే లేవని వాపోయింది. జీవితంలోనే మొట్ట మొదటి పండగ తన కవల పిల్లల తొలి పుట్టిన రోజు అని, ఆ వేడుకలను పరిశ్రమకు చెందిన వాళ్లతో జరుపుకోవావలని ఉదయభాను అనుకున్నారట. ఆ సెలబ్రేషన్స్ కు రావాలని చాలామందికి ఫోన్ చేసినా ఎవరూ లిఫ్ట్ చేయలేదని ఆమె తెలిపారు. ‘ఆఖరిగా బాలయ్యకు ఒక మెసేజ్ పెట్టగా రావడానికి సంతోషంగా ఒప్పుకున్నారని... తర్వాతి రోజు ఆయనకు మీటింగ్ ఉన్నా కూడా ఫంక్షన్ కి వచ్చి వెళ్తానని చెప్పారట.’ కరెక్టుగా చెప్పిన సమయానికి సింహాంలాగా వచ్చారని, ఆ సమయంలో బాలయ్య తనుకు ఒక దేవుడులా కనిపించారంటూ ఉదయభాను తెలిపారు. అందరి సెలబ్రెటీల్లాగా ఐదు నిమిషాలు ఉండి వెళ్లిపోకుండా, 45 నిమిషాలు ఉండి అందరితో నవ్వుతూ ఫొటోలు దిగారని ... ఆయన లాంటి వాళ్లు ఇండస్ట్రీలో చాలా అరుదుగా ఉంటారంటూ... హ్యాట్సాఫ్ బాలయ్య అని ఉదయభాను అన్నారు. -
నా పెళ్లికి మిమ్మల్ని పిలుస్తా: రేణుదేశాయ్
సాక్షి, హైదరాబాద్: రేణు దేశాయ్ టాలీవుడ్లో పరిచయం అవసరం లేని పేరు. పవన్ కల్యాణ్ సతీమణిగా సుపరిచయం. వివాహం అనంతరం ఆమె సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే పవన్, రేణు దేశాయ్‌లు విడాకులు తీసుకుని గత కొంత కాలంగా వేరుగా ఉంటున్నారు. విడాకుల అనంతరం పవన్ కళ్యాణ్ మరో వివాహం చేసుకోగా రేణు దేశాయ్ మాత్రం పిల్లలు అకీరా నందన్, ఆద్యలతో కలిసి పూణే లో నివసిస్తున్నారు. అనంతరం రేణు సినిమాలకు దర్శకత్వం వహించారు. అనంతరం తన అదృష్టాన్ని పరిక్షించకోవడానికి తెలుగు బుల్లి తెరపై అడుగు పెట్టారు. ఇందులో భాగంగా ప్రముఖ తెలుగు టీవీ ఛానల్లో ప్రసారమవుతున్న డ్యాన్స్ షోకి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. తనదైన శైలిలో అలరిస్తున్నారు. తాజాగా ఈ షోలో ఓ జంట చేసిన డాన్స్‌కు రేణు ఫిదా అయ్యారు. వారిపై ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు ప్రేమ మీద నమ్మకం పోయిందన్నారు. 'భవిష్యత్తులో మరో పెళ్లి చేసుకుంటే మిమ్మల్ని పిలుస్తా' అంటూ కంటిస్టెంట్లను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. రేణుదేశాయ్ అంటే పవన్‌కల్యాణ్ అభిమానులకు ప్రత్యేక అభిమానం కనపరుస్తారు. పవన్ కల్యాణ్‌ను అభిమానించినట్లే ఆమెను అభిమానిస్తారు. ఆప్యాయంగా వదినమ్మా అంటూ పిలుచుకుంటారు. గతంలో రేణుదేశాయ్ సైతం ఈ విషయాన్ని ప్రస్తావించిన సంగతి తెలిసిందే. -
నృత్య తరంగం
-
రైట్ స్టెప్పా? రాంగ్ స్టెప్పా??
బంగారు పళ్లానికైనా గోడ చేర్పు కావాలంటారు. బంగారు భవిత పొందాలంటే కళాకారులకూ ఒక వేదిక కావాలి. ఒకప్పుడు తమలోని కౌశలాన్ని ప్రపంచానికి తెలియజెప్పడానికి అవకాశమే ఉండేది కాదు. కాని రియాలిటీ షోల పుట్టుకతో అవకాశాలు నేరుగా వచ్చి అంగట్లో వాలుతున్నాయి. బాల కళాకారులకు సైతం మంచి వేదికగా మారుతున్నాయి. ముఖ్యంగా పిల్లల డ్యాన్స షోలు రాను రాను ఎక్కువవుతున్నాయి. వారిని చిన్ననాటే సెలెబ్రిటీలను చేస్తున్నాయి. కానీ కొందరు అంటున్నట్టు ఈ షోలు శృతి మించుతున్నాయా? పిల్లల మనసులపై చెడు ప్రభావాన్ని చూపుతున్నాయా? గెలుపోటముల మధ్య జరిగే ఈ సంగ్రామాలు పిల్లల పసి మనసులను గాయపరుస్తున్నాయా? గెలిచి తీరాలనే ఒత్తిడి వాళ్లను చిత్రవధకు గురిచేస్తోందా? భారతీయ టెలివిజన్ వినోద కార్యక్రమాల చరిత్రలో మహత్తరమైన మనోరంజక కార్యక్రమాలుగా నిలిచి... బ్రహ్మాండమైన ప్రజాభిమానాన్ని, ఆర్థిక విజయాన్ని కైవసం చేసుకున్నవి డ్యాన్స షోలు. వీటిలో బాలల విభాగం మరింత ఊపును, హుషారును కలిగిస్తూ ఆబాల గోపాలాన్నీ అలరించాయి, అలరిస్తున్నాయి. మన దేశంలో డ్యాన్స్ షోలు సోనీ టీవీలో భూగీ వూగీతో ప్రారంభమయ్యా యని చెప్పాలి. ప్రముఖ డ్యాన్సింగ్ స్టార్ జావెద్ జాఫ్రీ సోదరుడు నవీద్ జాఫ్రీ, రవీ బెహల్ సంయుక్తంగా సుమారు ఎనిమిదేళ్ల పాటు ఈ షోను విజయవంతంగా నడి పారు. పిల్లల డ్యాన్స్ షోలను కూడా అదే సిరీస్‌లో వాళ్లే ప్రవేశపెట్టారు. అవి కనీ వినీ ఎరుగనంత ప్రేక్షకాదరణ పొందాయి. అదిరి పోయే టీఆర్పీలు నమోదయ్యాయి. దాంతో మరికొన్ని షోలు పుట్టుకొచ్చాయి. జీ టీవీలో డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స కూడా సూపర్‌హిట్ అయ్యింది. అత్యధిక ప్రేక్షకాదరణను చూరగొంది. తెలుగులో కూడా చాలాకాలం క్రితమే పిల్లల డ్యాన్స షోలు మొదలయ్యాయి. ఓంకార్ ‘ఆట’తో పాటు ‘ఢీ జూనియర్స్’ మొదలైన పిల్లల డ్యాన్స్ షోలు సందడి చేయడం మొదలుపెట్టాయి. అంతవరకూ బాగుంది... చెప్పాలంటే... రాత్రికి రాత్రే దేశ ప్రజలకు అభిమాన పాత్రులయ్యే అవ కాశాన్ని ఈ షోలు చిన్నారులకు కల్పిస్తు న్నాయి. ఒకప్పుడు పేరు, డబ్బు రావా లంటే ఓ వయసు వరకూ ఎదురు చూడాల్సి వచ్చేది. ఎన్నో తపస్సులు చేయాల్సి వచ్చేది. ఇప్పుడంత శ్రమ లేకుండా చేస్తు న్నాయి టీవీ చానెళ్లు. అవకాశాలను తెచ్చి వాకిట్లో నిలబెడుతున్నాయి. తమ ప్రతిభకు పదును పెట్టుకునే మార్గాన్ని సులభతరం చేస్తున్నాయి. దానికితోడు ఎస్సెమ్మెస్ రిక్వెస్టుల ద్వారా ప్రజలు తమనెంత ఇష్టపడుతున్నారో తెలుసుకునే అవకాశాన్ని కూడా పిల్లలకు కలిగిస్తున్నాయి. పువ్వు పుట్టగానే పరిమళించిం దన్నట్టు... సరిగ్గా ప్రపంచాన్ని చూడక ముందే ప్రపంచానికి ఫేవరేట్స్‌గా మారిపోతోన్న తమ పిల్లలను చూసుకుని తల్లిదండ్రులు కూడా మురిసిపోతున్నారు. అయితే గత కొంతకాలంగా ఈ షోలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దానికి కారణాలు బోలెడు. పిల్లలను డ్యాన్స్ చేయ మంటున్నారు సరే. కానీ ఎలాంటి పాటలకి? ఐటెమ్ సాంగులకి, రొమాంటిక్ నంబర్స్‌కి. పైగా ఆ లిరిక్స్‌కి తగ్గట్టుగానే హావభావాలను పలికించమనడం, అసభ్యకరమైన అభ్యంతర కరమైన భంగిమల్లో నర్తింపజేయడం సమంజసమా? ఇది పిల్లల మానసిక స్థితిపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది అంటున్నారు మానసిక నిపుణులు. నిజానికి ఈ విషయంలో జాతీయ చానెళ్లు జాగరూకతతో ఉన్నాయి. కథక్, భాంగ్రా వంటి సంప్రదాయ, జానపద నర్తన రీతులను మేళవించిన పాటలకు నర్తించే విధంగా పిల్లలను ప్రోత్సహిస్తున్నాయి. దాంతో ఆ షోలకు ప్రజాదరణ ఎక్కువ, విమర్శలు తక్కువగా ఉంటున్నాయి. మన దగ్గర అలా జరగకపోవడం బాధాకరం. ఇక మరో సమస్య... గెలుపోట ములు. ఓటమి అందరికీ బాధా కరమే. పిల్లలకైతే మరీను. తాము ఓడిపోయామే అన్న బాధ వాళ్లను నలిపేస్తుంది. ఫలితాలను సున్నితంగా ప్రకటించడం ద్వారా వాళ్ల మనసులు గాయపడకుండా చూడొచ్చు. కానీ విపరీతమైన టెన్షన్ వాళ్లలో క్రియేట్ చేసి మరీ రిజల్ట్ చెప్తారు. దాంతో డిజప్పాయింట్ అయ్యి పిల్లలు విపరీతంగా ఏడ్చిన సందర్భాలున్నాయి. దానికి తోడు న్యాయనిర్ణేతల కామెంట్స్ కూడా పసి మనసుల్ని కలత చెందేలా చేస్తాయి. వారిపై ఒత్తిడిని పెంచుతాయి. నిరుత్సాహానికి గురి చేస్తాయి. అసలు జాగ్రత్తగా ప్రయత్నిస్తే ఓటమిని భరించే శక్తి పిల్లలకు నేర్పడానికి ఈ షోలు మంచి వేదిక. ఎందుకంటే షో సక్సెస్ కావాలంటే.... డ్యాన్సర్లు, కొరియోగ్రాఫర్లు, మేకప్ ఆర్టిస్టులు, కాస్ట్యూమ్స్ డిజైనర్లు, స్టేజి అలంకరణ చేసేవారు, సహాయకులు అంతా కలసి ఎన్నో రోజులు అభ్యాసం చేయవలసి ఉంటుంది. ఇలా నలుగురితో కలిసి ఒకే లక్ష్యం కోసం పరిశ్రమించడం వల్ల బాలలకూ టీమ్ స్పిరిట్ అలవాటవుతుంది. గెలుపోటములు కూడా సమాన స్థాయిలో స్వీకరించే క్రీడాస్ఫూర్తి వస్తుంది. కానీ గెలిచి తీరాలంటూ చేసే ఒత్తిడితో ఆ అవకాశం పిల్లలకు లేకుండా చేస్తున్నామా అన్నది ఓసారి చూసుకోవాలి. ఎంతసేపూ నువ్వే గెలవాలి, నువ్వే గెలవాలి అంటే వాళ్లు ఇతరుల గెలుపును ఎందుకు హర్షిస్తారు? తమ ఓటమిని ఎలా తట్టుకుం టారు? పైగా రోజుల తరబడి, రిహార్సల్స్ చేసి, ఒళ్లు హూనం చేసుకున్నాక కూడా ఓడిపోయామే అన్న బాధ ప్రశాంతంగా ఎలా ఉండనిస్తుంది? ఇవన్నీ సీరియస్‌గా ఆలోచించాల్సిన విషయాలు. కిట్టిగాడు, అపరంజి, హైస్కూల్ తప్పితే తెలుగులో బాలల కథాంశాలతో సీరియళ్లు రాలేదు. దాంతో పిల్లల ఉత్పత్తుల ప్రకటనలకు అనువైన స్లాట్ ఈ షోలు అని అడ్వటైజర్లు భావిస్తున్నారు. వ్యాపారం కోసం పిల్లల్ని బలిపెట్టడం భావ్యం కాదు కదా! ఈ విషయంలో తల్లిదండ్రులకూ సమాన బాధ్యత ఉంది. కాబట్టి నిర్వాహకులు పిల్లల బాల్యాన్ని తమ షోలు హరిస్తున్నాయా అన్నది ఓసారి ఆలోచించాలి. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలను సెలెబ్రిటీలుగా చూడాలనుకునే క్రమంలో వాళ్ల భవిష్యత్తుని, మానసిక స్థితిని పాడుచేస్తున్నామా అన్నది పరిశీలించు కోవాలి. ఎందుకంటే, అతి చిన్న వయసులో సెలెబ్రిటీ స్టేటస్ పిల్లల ఫ్యూచర్‌కి మంచిది కాదంటున్నారు నిపుణులు. తాము అందరికీ తెలుసు అన్న ఫీలింగ్ కాస్తా తమకు అన్నీ తెలుసన్న ఫీలింగ్‌గా మారి చిన్న వయసులో సెలెబ్రిటీలైన వాళ్లెందరో తప్పటడుగులు వేయడం చూస్తూనే ఉన్నాం. మరి మీ పిల్లలను ఆ దిశగా దగ్గ రుండి నడిపించడం... మీరు వేస్తున్నది రైట్ స్టెప్పా... రాంగ్ స్టెప్పా... ఆలోచించండి! - పి.వి.రామమోహన్ నాయుడు, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, టీవీ నిర్మాత బాల్యాన్ని హరించడమే! టీవీ రియాలిటీ షోస్.. ముఖ్యంగా పిల్లల డ్యాన్స్ షోస్‌లో పదేళ్లలోపు చిన్నారులే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఆ వయసువాళ్లు నిజమేదో, భ్రమేదో తెలుసుకోలేరు. చూస్తు న్నదే వాస్తవమనుకుంటారు. న్యాయనిర్ణేతలు పిల్లలు డ్యాన్స్ సరిగా చేయలేదని చెబుతుం టారు. దాంతో పిల్లల మనసు గాయపడు తుంది. అలాగే ప్రాక్టీస్ సమయాల్లో పిల్లలపై తల్లిదండ్రులు, ట్రైనర్ల ఒత్తిడి బాగా పడు తుంది. అది చైల్డ్ లేబర్ కంటే భయంకర మైనది. ఇదంతా బాల్యాన్ని హరించడం కిందికే వస్తుంది. ఇలాంటి కార్యక్రమాలపై పిల్ వేశాం. కానీ అది పెండింగ్‌లోనే ఉంది. - దేవి, సామాజిక కార్యకర్త ఒత్తిడి పెరిగితే ప్రమాదమే! రబ్బర్బ్యాండ్ని తీసుకుందాం. దాన్ని లాగితేనే పని జరుగుతుంది. కానీ, ఎంత వరకు లాగాలో అంతే లాగాలి. ఎక్కువగా లాగితే తెగిపోతుంది. అలాగే పిల్లలపై ఒత్తి డికి కూడా హద్దు ఉండాలి. బాగా చదవా లన్నా, డ్యాన్స్ చేయాలన్నా కొద్దిగా ఒత్తిడి అవసరమే. అది కూడా వయసును బట్టి మారుతూండాలి. అలా అయితేనే ఏ రంగం లోనైనా రాణించగలరు. కాబట్టి డ్యాన్స్ షోల్లో కామెంట్స్‌లో మార్పు రావాలి. సున్ని తంగా చెప్పాలి. తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉంటూ వారిని ప్రోత్సహించాలి. - డా॥శ్రీనివాస్ ఎస్‌ఆర్‌ఆర్‌వై, మానసిక నిపుణులు -
జైలులో డ్యాన్స్ షో.. వీడియో లీక్
సత్ ప్రవర్తన కలిగిన ఖైదీలను రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేయడం గురించి ఇప్పటి వరకు మనం విన్నాం. కానీ కర్నాటకలోని విజయ్ పుర్ జైలులో ఖైదీల కోసం ఏకంగా డ్యాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఈ వీడియో బయటకు రావడంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. బయట నుంచి తీసుకు వచ్చిన వారితో విజయ్ పుర్ జైలులో రిపబ్లిక్ డే రోజు డ్యాన్స్ ప్రోగ్రాం నిర్వహించారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఉదంతం పై ఉన్నతాధికారులు చర్యలు ప్రారంభించారు. జైళ్ల శాఖ డీజీపీ కే. సత్యనారాయణ ఇప్పటి వరకు ముగ్గురు అధికారులను సస్పెండ్ చేశారు. WATCH: (26/1/16) Inmates rewarded for good behaviour with a dance show in jail in Vijaypur(Karnataka) https://t.co/ZQ3FIAH4RN — ANI (@ANI_news) January 28, 2016 -
భాగ్యనగరిలో సంగీత ఝరి!
► హైదరాబాద్ వేదికగా ‘సెన్సేషన్’ డ్యాన్స్ షో సాక్షి, హైదరాబాద్: ఆకాశం నుంచి అగ్నిపూలు జాలువారుతున్నాయా అన్నట్లు బాణసంచా కాల్పులు.. కళ్లు మిరిమిట్లు గొలిపే విద్యుత్ కాంతులు.. లయబద్ధంగా వినిపిస్తూ ఉర్రూతలూగించే సంగీత ఝరి.. అందులో తడిసి ముద్దవుతూ కుర్రకారు డ్యాన్స్‌లు.. కళ్లకు కనువిందు చేసే లేజర్ షోలు.. ఇవన్నీ నెదర్లాండ్స్ కేంద్రంగా పుట్టి ప్రపంచాన్నే ఉర్రూతలూగిస్తున్న అతిపెద్ద డ్యాన్స్ షో ‘సెన్సేషన్’ విశేషాలు. నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డ్యాంలో పుట్టి ప్రపంచ యువతను ఓలలాడిస్తున్న సెన్సేషన్ డ్యాన్స్ షోకు ఇప్పుడు హైదరాబాద్ నగరం వేదిక కానుంది. ఓ తరంగంలా సాగనున్న ఈ కార్యక్రమాన్ని సెన్సేషన్ నిర్వాహకులు ఏటా ప్రపంచ వ్యాప్తంగా పలు నగరాల్లోని ప్రముఖ స్టేడియాల్లో నిర్వహిస్తూ.. తొలిసారిగా భారత్‌లో.. అది కూడా హైదరాబాద్‌లో అడుగుపెట్టనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉంది. దాదాపు 50 వేలకు పైగా ప్రేక్షకులు ఈ డ్యాన్స్ షోలో పాల్గొంటారు. ఫిబ్రవరి 6న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ‘సెన్సేషన్’ భారీ ప్రదర్శన ఇవ్వనుంది. ఇక్కడి యువతను కొంగొత్త లోకాల్లో విహరింపజేసేందుకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఈవెంట్లో పాల్గొనదలచుకునేవారు తప్పని సరిగా తెలుపు రంగు దుస్తులు ధరించాలని నిబంధన ఉంది. అందుకే ఈ షో సెన్సేషన్ వైట్‌గా పేరొందింది. ఈ డ్రెస్ కోడ్‌ను అందరూ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఈ షోలో ప్రేక్షకులను ఓలలాడించేందుకు నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డ్యాం నుంచి దాదాపు వెయ్యి మంది కళాకారుల బృందం ఇక్కడికి రానుంది. వీరితో పాటు భారత్‌కు చెందిన ప్రముఖ డీజేలు కూడా ఈ ఈవెంట్లో పాల్గొంటారు. ప్రభుత్వానికి అందివచ్చిన అవకాశం! ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి సెన్సేషన్ మంచి అవకాశం కానుంది. భిన్న సంస్కృతులతో అలరారుతున్న హైదరాబాద్‌ను ఈ డ్యాన్స్ షోకు వేదికగా మార్చుకునేందుకు అనుమతివ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని నిర్వాహకులు కోరారు. దీన్ని మంచి అవకాశంగా భావించిన ప్రభుత్వం దీనికి అనుమతులు జారీ చేసింది. వెంటనే గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాట్లు చేసేందుకు పర్యాటక శాఖ సంసిద్ధత ప్రకటించింది. -
మల్లారెడ్డిలో స్టూడెంట్స్ జోరు