∙మానస్, జాను, ఓంకార్, రవికాంత్, ఫరియా అబ్దుల్లా, ప్రకృతి, యశ్ మాస్టర్
డ్యాన్స్ లవర్స్‌ను మెప్పించిన ‘డ్యాన్స్ ఐకాన్ సీజన్ 1’(Dance Ikon) కు కొనసాగింపుగా ‘డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2(Dance Ikon 2) వైల్డ్‌ఫైర్’ రానుంది. ఫిబ్రవరి 14 నుంచి ఈ షో ఆహా ఓటీటీలో ప్రీమియర్‌కు రెడీ అవుతోంది. ఈ షోకు ఓంకార్(Ohmkar), హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, శేఖర్ మాస్టర్ హోస్ట్‌లుగా వ్యవహరించనున్నారు. ‘డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్‌ఫైర్’ షోలో దేశవ్యాప్తంగా కంటెస్టెంట్స్ పాల్గొంటారని, హిప్ హాప్, క్లాసికల్, కాంటెంపరరీ స్టైల్స్‌తో ఈ డ్యాన్స్ షో వీక్షకులను అలరిస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ‘డ్యాన్స్ ఐకాన్ 2’ షో ప్రెస్‌మీట్‌లో హోస్ట్స్‌లో ఒకరైన ఓంకార్ మాట్లాడుతూ– ‘‘డ్యాన్స్ ఐకాన్ 2–వైల్డ్‌ఫైర్’లో ఐదుగురు కంటెస్టెంట్స్ సర్‌ప్రైజ్ చేస్తారు. ముఖ్యంగా ఇద్దరు పిల్లల పెర్ఫార్మెన్స్లు చర్చనీయాంశమవుతాయి. ముగ్గురు హోస్ట్‌లతో పాటు సింగర్ జాను లైరి, ప్రకృతి, మానస్, దీపిక ఈ నలుగురు మెంటార్స్ ఉంటారు. ‘డ్యాన్స్ ఐకాన్ 2: వైల్డ్ ఫైర్’ వీక్షకులకు హోల్‌సమ్ ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చే కంప్లీట్ డ్యాన్స్ షో’’ అని అన్నారు.
ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ–‘‘డ్యాన్స్ ఐకాన్ సీజన్ 1’కు కూడా నన్ను హోస్ట్‌గా అడిగారు. కానీ, ఆ సమయంలో చేయలేకపోయాను. ఇప్పుడు ఓంకార్, శేఖర్ మాస్టర్‌లతో కలిసి హోస్ట్ చేస్తుండటం సంతోషంగా ఉంది. ప్రతి ఎపిసోడ్ అదిరిపోయే ట్విస్టులతో ఆకట్టుకుంటుంది. ఈ షో వీక్షకులకు కంప్లీట్ ఎంటర్‌టైన్మెంట్ ఇస్తుందని గ్యారంటీగా చెప్పగలను’’ అని తెలిపారు. ‘‘ఈ షోలో వీక్షకులను సర్‌ప్రైజ్ చేసే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లు ఉంటాయి’’ అని చె΄్పారు శేఖర్ మాస్టర్. ఈ కార్యక్రమంలో మెంటార్ యశ్, మెంటార్ మానస్, సింగర్ జాను లైరి, మెంటార్ ప్రకృతి మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment