Dance Icon
-
అదిరిపోయే ట్విస్టులతో ఆకట్టుకుంటుంది: ఫరియా అబ్దుల్లా
డ్యాన్స్ లవర్స్‌ను మెప్పించిన ‘డ్యాన్స్ ఐకాన్ సీజన్ 1’(Dance Ikon) కు కొనసాగింపుగా ‘డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2(Dance Ikon 2) వైల్డ్‌ఫైర్’ రానుంది. ఫిబ్రవరి 14 నుంచి ఈ షో ఆహా ఓటీటీలో ప్రీమియర్‌కు రెడీ అవుతోంది. ఈ షోకు ఓంకార్(Ohmkar), హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, శేఖర్ మాస్టర్ హోస్ట్‌లుగా వ్యవహరించనున్నారు. ‘డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్‌ఫైర్’ షోలో దేశవ్యాప్తంగా కంటెస్టెంట్స్ పాల్గొంటారని, హిప్ హాప్, క్లాసికల్, కాంటెంపరరీ స్టైల్స్‌తో ఈ డ్యాన్స్ షో వీక్షకులను అలరిస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ‘డ్యాన్స్ ఐకాన్ 2’ షో ప్రెస్మీట్లో హోస్ట్స్‌లో ఒకరైన ఓంకార్ మాట్లాడుతూ– ‘‘డ్యాన్స్ ఐకాన్ 2–వైల్డ్‌ఫైర్’లో ఐదుగురు కంటెస్టెంట్స్ సర్ప్రైజ్ చేస్తారు. ముఖ్యంగా ఇద్దరు పిల్లల పెర్ఫార్మెన్స్లు చర్చనీయాంశమవుతాయి. ముగ్గురు హోస్ట్‌లతో పాటు సింగర్ జాను లైరి, ప్రకృతి, మానస్, దీపిక ఈ నలుగురు మెంటార్స్ ఉంటారు. ‘డ్యాన్స్ ఐకాన్ 2: వైల్డ్ ఫైర్’ వీక్షకులకు హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే కంప్లీట్ డ్యాన్స్ షో’’ అని అన్నారు.ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ–‘‘డ్యాన్స్ ఐకాన్ సీజన్ 1’కు కూడా నన్ను హోస్ట్‌గా అడిగారు. కానీ, ఆ సమయంలో చేయలేకపోయాను. ఇప్పుడు ఓంకార్, శేఖర్ మాస్టర్లతో కలిసి హోస్ట్ చేస్తుండటం సంతోషంగా ఉంది. ప్రతి ఎపిసోడ్ అదిరిపోయే ట్విస్టులతో ఆకట్టుకుంటుంది. ఈ షో వీక్షకులకు కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని గ్యారంటీగా చెప్పగలను’’ అని తెలిపారు. ‘‘ఈ షోలో వీక్షకులను సర్ప్రైజ్ చేసే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్లు ఉంటాయి’’ అని చె΄్పారు శేఖర్ మాస్టర్. ఈ కార్యక్రమంలో మెంటార్ యశ్, మెంటార్ మానస్, సింగర్ జాను లైరి, మెంటార్ ప్రకృతి మాట్లాడారు. -
‘డ్యాన్స్ ఐకాన్’ విన్నర్స్‌గా అసిఫ్, రాజు, ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?
సాధారణ ప్రేక్షకులతో పాటు డ్యాన్స్ అభిమానులను ఆకట్టుకునేలా రూపొందిన డ్యాన్స్ షో ‘డ్యాన్స్ ఐకాన్’. సౌత్ ఇండియా బిగ్గెస్ట్ డ్యాన్స్ షోగా ఆడియన్స్‌ను అలరించిన డాన్స్ ఐకాన్ ఫస్ట్ సీజన్ విన్నర్స్‌గా అసిఫ్, రాజు నిలిచారు. 13 వారాల పోటీలో అందరినీ వెనక్కు నెట్టి అసిఫ్, అతని కొరియోగ్రాఫర్ రాజు ఎలాంటి డ్యాన్స్ స్టైల్ అయినా తమకు పెద్ద కష్టమేమీ కాదని నిరూపించారు. విజేతగా నిలిచిన అసిఫ్ 20 లక్షల రూపాయల నగదుతో పాటు విన్నర్ ట్రోఫీని సొంతం చేసుకున్నారు. ఇక రాజు అయితే టాలీవుడ్‌కి చెందిన స్టార్ హీరోకి కొరియోగ్రఫీ చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌తో పాటు మైత్రీ మూవీ మేకర్స్ నుంచి రవి శంకర్, ఎస్వీసీసీ బ్యానర్ బాపినీడు, సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ వంటి నిర్మాతలు ఫినాలే ఎపిసోడ్‌కు హాజరయ్యారు. డ్యాన్స్ ఐకాన్ విన్నింగ్ కొరియోగ్రాఫర్ రాజు మాట్లాడుతూ. 'ఈ షోలో విజేతలుగా నిలవటం మరచిపోలేని జర్నీ. ఈ జర్నీలో భాగమైన నా కంటెస్టెంట్ రాజుకి థాంక్స్. నా తోటి కొరియోగ్రాఫర్స్ వారి ప్రదర్శనతో నన్ను ఛాలెంజ్ చేస్తూ వచ్చారు. అలాగే ప్రతీ వారం జడ్జీలు నాలో స్పూర్తి నింపుతూ వచ్చారు. అందువల్లే ఈరోజు ఇక్కడ విజేతగా నిలిచాం. షోను విజయవంతం చేసిన ప్రేక్షకులకు, ఆహా యాజమాన్యానికి థాంక్స్. నా కలను నిజం చేశారు' అని చెప్పుకొచ్చాడు. చదవండి: అగ్గదీ.. అట్లుంటది మరి ఫైమాతోని! కొన్నిసార్లు తిరుగుబాటు కూడా అవసరమే! -
‘ఆహా’లో అదిరిపోయే సర్ప్రైజ్లు..ఈ వారం రెట్టింపు వినోదం పక్కా!
ఒకవైపు సూపర్ హిట్ సినిమాలు మరోవైపు ఆకట్టుకునే వెబ్ సిరీస్‌లు, అలరించే టాక్ షో,గేమ్ షోలతో దూసుకెళ్తోంది ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్-2’ టాక్ షో అత్యధిక వ్యూస్‌తో దూసుకెళ్తూ రికార్డులు సృష్టిస్తోంది. రెండు ఎపిసోడ్స్‌ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ టాక్ షో.. తాజాగా మూడో ఎపిసోడ్‌కి సిద్దమైంది. ఈ ఎపిసోడ్ లో యంగ్ హీరోలు శర్వానంద్, అడవి శేష్ హాజరవుతున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు.నవంబర్ 4 నుంచి మూడో ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే ఆహాలో ఆకట్టుకుంటున్న వాటిలో డాన్స్ ఐకాన్ ఒకటి. సూపర్ డాన్స్ పర్ఫామెన్స్ లతో కంటెస్టెంట్స్ దుమ్మురేపుతున్నారు. ప్రతి శని, ఆది వారాల్లో ఈ షో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓంకార్ హోస్ట్ చేస్తోన్న ఈ షోకి ఈ వారం గెస్ట్‌గా రాశీ ఖన్నా రానున్నారు. రమ్యకృష్ణ, శేఖర్ మాస్టర్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఈ షోలోని టాప్ కంటెస్టెంట్స్ మధ్య జరగబోయే పోటీని చూడటంలో మంచి మజా ఉంది. అలాగే మంచు లక్ష్మీ ప్రసన్న హోస్ట్ గా చేస్తోన్న షో చెఫ్ మంత్ర. ఈ షోలో గెస్ట్ లుగా వచ్చిన వారు తమకు నచ్చిన వంటకాన్ని వండి.. దానితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటారు. ఇక ఈ వారం ఈ కార్యక్రమానికి రష్మీ గౌతమ్, గెటప్ శ్రీను హాజరుకానున్నారు. ఇలా ఈ మూడు షోలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి.