ఒకవైపు సూపర్ హిట్ సినిమాలు మరోవైపు ఆకట్టుకునే వెబ్ సిరీస్‌లు, అలరించే టాక్ షో,గేమ్ షోలతో దూసుకెళ్తోంది ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్-2’ టాక్ షో అత్యధిక వ్యూస్‌తో దూసుకెళ్తూ రికార్డులు సృష్టిస్తోంది. రెండు ఎపిసోడ్స్‌ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ టాక్ షో.. తాజాగా మూడో ఎపిసోడ్‌కి సిద్దమైంది. ఈ ఎపిసోడ్ లో యంగ్ హీరోలు శర్వానంద్, అడవి శేష్ హాజరవుతున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు.నవంబర్ 4 నుంచి మూడో ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుంది.
అలాగే ఆహాలో ఆకట్టుకుంటున్న వాటిలో డాన్స్ ఐకాన్ ఒకటి. సూపర్ డాన్స్ పర్ఫామెన్స్ లతో కంటెస్టెంట్స్ దుమ్మురేపుతున్నారు. ప్రతి శని, ఆది వారాల్లో ఈ షో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓంకార్ హోస్ట్ చేస్తోన్న ఈ షోకి ఈ వారం గెస్ట్‌గా రాశీ ఖన్నా రానున్నారు. రమ్యకృష్ణ, శేఖర్ మాస్టర్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఈ షోలోని టాప్ కంటెస్టెంట్స్ మధ్య జరగబోయే పోటీని చూడటంలో మంచి మజా ఉంది.
అలాగే మంచు లక్ష్మీ ప్రసన్న హోస్ట్ గా చేస్తోన్న షో చెఫ్ మంత్ర. ఈ షోలో గెస్ట్ లుగా వచ్చిన వారు తమకు నచ్చిన వంటకాన్ని వండి.. దానితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటారు. ఇక ఈ వారం ఈ కార్యక్రమానికి రష్మీ గౌతమ్, గెటప్ శ్రీను హాజరుకానున్నారు. ఇలా ఈ మూడు షోలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment