సాధారణ ప్రేక్షకులతో పాటు డ్యాన్స్ అభిమానులను ఆకట్టుకునేలా రూపొందిన డ్యాన్స్ షో ‘డ్యాన్స్ ఐకాన్’. సౌత్ ఇండియా బిగ్గెస్ట్ డ్యాన్స్ షోగా ఆడియన్స్‌ను అలరించిన డాన్స్ ఐకాన్ ఫస్ట్ సీజన్ విన్నర్స్‌గా అసిఫ్, రాజు నిలిచారు. 13 వారాల పోటీలో అందరినీ వెనక్కు నెట్టి అసిఫ్, అతని కొరియోగ్రాఫర్ రాజు ఎలాంటి డ్యాన్స్ స్టైల్ అయినా తమకు పెద్ద కష్టమేమీ కాదని నిరూపించారు. విజేతగా నిలిచిన అసిఫ్ 20 లక్షల రూపాయల నగదుతో పాటు విన్నర్ ట్రోఫీని సొంతం చేసుకున్నారు. ఇక రాజు అయితే టాలీవుడ్‌కి చెందిన స్టార్ హీరోకి కొరియోగ్రఫీ చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు.
ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌తో పాటు మైత్రీ మూవీ మేకర్స్ నుంచి రవి శంకర్, ఎస్‌వీసీసీ బ్యానర్ బాపినీడు, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ వంటి నిర్మాతలు ఫినాలే ఎపిసోడ్‌కు హాజరయ్యారు. డ్యాన్స్ ఐకాన్ విన్నింగ్ కొరియోగ్రాఫర్ రాజు మాట్లాడుతూ. 'ఈ షోలో విజేతలుగా నిలవటం మరచిపోలేని జర్నీ. ఈ జర్నీలో భాగమైన నా కంటెస్టెంట్ రాజుకి థాంక్స్. నా తోటి కొరియోగ్రాఫర్స్ వారి ప్రదర్శనతో నన్ను ఛాలెంజ్ చేస్తూ వచ్చారు. అలాగే ప్రతీ వారం జడ్జీలు నాలో స్పూర్తి నింపుతూ వచ్చారు. అందువల్లే ఈరోజు ఇక్కడ విజేతగా నిలిచాం. షోను విజయవంతం చేసిన ప్రేక్షకులకు, ఆహా యాజమాన్యానికి థాంక్స్. నా కలను నిజం చేశారు' అని చెప్పుకొచ్చాడు.
చదవండి: అగ్గదీ.. అట్లుంటది మరి ఫైమాతోని!
కొన్నిసార్లు తిరుగుబాటు కూడా అవసరమే!
Comments
Please login to add a commentAdd a comment