
మెగా డాటర్ నిహారిక కొణిదెల తమిళ సినిమా తెలుగులో ఓటీటీ వేదికగా విడుదల కానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 10న 'మద్రాస్‌కారణ్' చిత్రం కోలీవుడ్‌లో విడుదలైంది. ఈ మూవీలో షేన్ నిగమ్, కలైయరాసన్ హీరోలుగా నటించారు. థియేటర్లలోకి వచ్చి నెల రోజులు కూడా గడవకముందే తమిళ్ వర్షన్ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఇప్పుడు తెలుగు వర్షన్‌ను మేకర్స్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
వాలిమోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్‌ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బి.జగదీష్ నిర్మించారు. తమిళ్‌లో ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. విశాల్ మదగజరాజ మూవీ హిట్ టాక్ రావడంతో ఈ సినిమాకు కాస్త క్రేజ్ తగ్గింది. శివరాత్రి పండుగ కానుకగా ఫిబ్రవరి 26న 'ఆహా'లో 'మద్రాస్‌కారణ్' సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ కోసం సుమారు రూ. 5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. అయితే, కోటి లోపే వసూళ్లను రాబట్టడంతో నిర్మాతలకు భారీ నష్టాలను తెచ్చిపెట్టింది.

ఏడేళ్ల తర్వాత రొమాంటిక్ పాత్రతో రీఎంట్రీ
సుమారు ఏడేళ్ల తర్వాత 'మద్రాస్‌కారణ్' సినిమాతో తమిళ్‌లో నిహారిక రీఎంట్రీ ఇచ్చింది. 2018లో విజయ్ సేతుపతి నటించిన ఒక సినిమాతో ఆమె కోలీవుడ్‌కు పరిచయం అయింది. అయితే, ఆమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఇప్పుడు మద్రాస్‌కారణ్ మూవీలో మీరా అనే యువతిగా గ్లామర్ రోల్‌లో నిహారిక కనిపించింది. ఒక రొమాంటిక్ సాంగ్‌లో కూడా ఆమె నటించింది. ఈ పాటలో అటు రొమాన్స్, ఇటు డ్యాన్సులో నిహారిక రెచ్చిపోయిందని చెప్పొచ్చు. తెలుగులో సినిమాల్లో నటించింది కానీ ఈ తరహా యాక్టింగ్ మాత్రం ఎప్పుడూ చేయలేదు. ఇందులోని సాంగ్ చూసి మెగా ఫ్యాన్స్ స్టన్ అయిపోయారు. ఎందుకంటే రొమాన్స్ .. ఆ రేంజులో ఉంది మరి! ఈ సినిమాతో హీరోయిన్‌గా హిట్టు కొట్టాలని నిహారిక ప్లాన్ చేసుకుంది. కానీ, ఫలితం మరోలా వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment