![Dance Ikon 2 Wild Fire on aha starting February 14th](/styles/webp/s3/article_images/2025/02/14/Dance-Icon2.jpg.webp?itok=vR1nlFR2)
∙ప్రకృతి, యశ్, ఓంకార్, మానస్
‘‘నేను గతంలో ‘ఆట, ఆట జూనియర్స్’ వంటి డ్యాన్స్ షోస్‌కి హోస్ట్ చేశాను. కానీ ‘డ్యాన్స్ ఐకాన్ 2– వైల్డ్ ఫైర్’(Dance Ikon 2 Wild Fire) మాత్రం ఇప్పటిదాకా వచ్చిన డ్యాన్స్ షోస్ అన్నింటిలో సరికొత్తగా ఉంటుంది. ప్రేక్షకులకు ఒక రియల్ ఫీల్ ఇవ్వాలనే స్క్రిప్టెడ్‌గా చేయకుండా రియాల్టీ షో చేస్తున్నాం’’ అని హోస్ట్ ఓంకార్(Omkar) చెప్పారు. ‘డ్యాన్స్ ఐకాన్’ సీజన్ 1కు కొనసాగింపుగా ‘డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2– వైల్డ్ ఫైర్’ నేటి నుంచి ఆహా ఓటీటీలో ప్రీమియర్‌కు రెడీ అవుతోంది.
ఈ షోకి ఓంకార్, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, శేఖర్ మాస్టర్ హోస్ట్‌లుగా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా సినిమాలకు ప్రివ్యూ, ప్రీమియర్స్ వేస్తుంటారు. కానీ మీడియా కోసం తొలిసారి ఒక డ్యాన్స్ రియాల్టీ షోకు సీక్రెట్ స్క్రీనింగ్ చేసింది ఆహా ఓటీటీ. సీక్రెట్ స్క్రీనింగ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఓంకార్ మాట్లాడుతూ– ‘‘సాధారణంగా తెలుగు నుంచి కంటెస్టెంట్స్‌ను సెలెక్ట్ చేస్తుంటాం. కానీ, ఈసారి దేశవ్యాప్తంగా కంటెస్టెంట్స్‌ని ఆడిషన్ చేసి ఐదుమందిని తీసుకున్నాం. వారికి పోటీ ఇచ్చే సత్తా ఉన్న తెలుగు కంటెస్టెంట్స్‌ను ఇప్పుడు సెలెక్ట్ చేయబోతున్నాం.
‘డ్యాన్స్ ఐకాన్ 1’ విన్నర్ మన తెలుగువాళ్లే. మరింత కష్టమైన పోటీలో మనవాళ్లు ప్రతిభ చూపించాలనే ఇలా చేస్తున్నాం. ఆసక్తి ఉన్న వారు 60 సెకన్ల డ్యాన్స్ వీడియో చేసి మాకు పంపిస్తే.. అది చూసి ఎంట్రీలను తీసుకుంటాం. ప్రతి శుక్రవారం 7 గంటలకు షో స్టార్ట్ అవుతుంది. షో పూర్తయ్యాక ప్రేక్షకుల నుంచి పోల్ నిర్వహిస్తాం. 100 పాయింట్స్‌లోపు ప్రేక్షకులు తమకు నచ్చినన్ని పాయింట్స్ ఇవ్వొచ్చు. ఆదివారం వరకు ఈ ఓటింగ్ కొనసాగుతుంది.
ప్రతి వారం ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతుంటారు. కంటెస్టెంట్స్‌తో పాటు మెంటార్స్ కూడా ఎలిమినేట్ అవుతారు. అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి. మూడు నెలల పాటు ‘డ్యాన్స్ ఐకాన్ 2 – వైల్డ్ ఫైర్’ని ప్రేక్షకులు ఎంజాయ్ చేయబోతున్నారు’’ అని చెప్పారు. ఈ ప్రెస్‌మీట్‌లో మెంటార్స్ మానస్, యశ్ మాస్టర్, ప్రకృతి మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment