OTT: Aha Release Omkar Dance Icon Show First Look - Sakshi
Sakshi News home page

Aha-OTT: ఓంకార్‌ హోస్ట్‌గా ఆహాలో ‘డాన్స్‌ ఐకాన్’ షో, ఫస్ట్‌లుక్‌ విడుదల

Published Mon, Aug 22 2022 3:46 PM | Last Updated on Mon, Aug 22 2022 5:46 PM

OTT: AHA Release Omkar Dance Icon Show First Look - Sakshi

కరోనా తర్వాత ఓటీటీల వినియోగం విస్తృతంగా పెరిగింది. వెబ్‌సిరీస్‌, సినిమాలు, స్పెషల్‌ షోలతో ఓటీటీలు ప్రేక్షకుడికి బోలెడంత వినోదాన్ని పంచుతున్నాయి. తెలుగువారికి నచ్చే మెచ్చే కంటెంట్‌ను అందిస్తూ ఆహా అనిపిస్తోంది తొలి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం. ఇప్పటికే కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌, టాక్‌ షో, సింగింగ్‌ షోలతో ప్రేక్షకులను అలరిస్తోన్న ఆహా ఇప్పుడు మరో కొత్త షోను డిజిటల్‌ ప్రేక్షక్షుల ముందుకు తీసుకువస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిభవంతులైన డాన్స్‌ర్ల కోసం డాన్స్‌ ఐకాన్‌ షోను పరిచయం చేయబోతోంది. ఈ షోకు ప్రముఖ యాంకర్‌ ఓంకార్‌ హోస్ట్‌గా, నిర్మాతగా వ్యవహరించనున్నాడు.

ఇక త్వరలోనే మీ ముందుకు తీసుకురాబోతున్న ఈ షో ఫస్ట్‌లుక్‌ ఆగస్ట్‌ 20న ఆహా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఈ షో యాంకర్, ప్రొడ్యూసర్‌ ఓంకార్ మాట్లాడుతూ.. ‘ఈ షో ద్వారా నేను మొదటిసారి ఓటీటీకి ప్లాట్‌ఫాంలోకి అడుగుపెడుతున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన అరవింద్ గారికి, ఆహాకు ధన్యవాదాలు. నేను ఎన్నో డ్యాన్స్ షోస్ చేశాను, కానీ ఇది చాల డిఫరెంట్‌గా ఉండబోతుంది. ఈ షో.. కంటెస్టెంట్స్‌తో పాటు కొరియోగ్రాఫీ చేసే మాస్టర్స్ జీవితాలని కూడా మార్చేస్తుంది. గెలిచిన కంటెస్టెంట్ కొరియోగ్రాఫర్‌కు టాలీవుడ్‌లో ఒక పెద్ద హీరో సినిమాలో కొరియోగ్రఫీ చేసే అవకాశం వస్తుంది. అందరు ఈ షోని ఆదరిస్తారని భావిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement