
ఆర్ పి పట్నాయక్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం "కాఫీ విత్ ఏ కిల్లర్"( Coffee With A Killer). సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సతీష్ నిర్మించిన ఈ చిత్రంలో టెంపర్ వంశీ, శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేష్, రవిబాబు, అంబటి శ్రీను, శ్రీరాప, జెమిని సురేష్ తదితరులు కీలకపాత్ర పోషించారు. నేటి నుంచి ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ‘ఆహా’(AHA)లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఆర్ పి పట్నాయక్ మాట్లాడుతూ...‘హీరో హీరోయిన్ లేకుండా ఒక సినిమా తీయాలి అంటే ఎలా అని ఆలోచనతో ఈ కథ మొదలైంది. కథ హీరో అయితే ఎలా ఉండబోతుంది అని ఈ కథ రాశాము. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమాను మొత్తం దగ్గరుండి చూసుకున్నది మా అన్నయ్య గౌతమ్ పట్నాయక్ గ. ఈ చిత్రంలోని కీలక పాత్ర విషయానికి వస్తే నాకు వంశీ మాత్రమే కచ్చితంగా ఈ కథకు, పాత్రకు పర్ఫెక్ట్ అని అనిపించింది. వేరే ఎవరిని నేను ఆ పాత్రలో ఊహించుకోలేకపోయాను. జెమిని సురేష్ క్యారెక్టర్ ప్రత్యేకమైనది.
నా ఆలోచనలు అర్థం చేసుకునే తిరుమల నాగ్ కలిసి ఈ చిత్రం కోసం పని చేశాను. డిఓపి అనూష్ ఎంతో సౌమ్యుడు. ఎంతో టాలెంట్ ఉన్న వ్యక్తి. చిత్రంలో నటించిన నటీనటుల క్యారెక్టర్లు చూస్తే కొన్ని ఎంతో ప్రత్యేకంగా అలాగే కొత్తగా ఉంటాయి. శ్రీనివాస్ రెడ్డి గారికి ఆయన కాకుండా ఇంకా ఎవరు అంత బాగా చేయలేరు అన్నట్లు వచ్చింది. ఆయన టైమింగ్ ప్రత్యేకం అని చెప్పుకోవాలి. ఈ చిత్రం ఎంతో శ్రద్ధగా టీమ్ అంతా కలిసి టీం వర్క్ గా చేసాము. సినిమాలో హీరో హీరోయిన్ ఉండరు కానీ విలన్ ఉంటాడు. ఈ సినిమాను ఎంతోమంది థియేటర్లో విడుదల చేయమని నన్ను అడిగారు కానీ నేను ఈ సినిమా ఖచ్చితంగా ఓటిటి లోనే విడుదల కావాలి అని పట్టు పట్టి ఆహాలో విడుదల చేస్తున్నాం’అన్నారు.
నటుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ...‘కొన్ని కథలో మధ్య జరిగే కథలా ఈ చిత్రం ఉండబోతుంది. చూసి ప్రేక్షకులంతా ఎంతో ఎంజాయ్ చేస్తారు. ప్రతి సీన్ లోను ట్విస్టులు ఉంటాయి. డబ్బింగ్ కూడా ఎంతో బాగా వచ్చింది. ఆర్ బి గారితో పని చేయడమే కాదు ఆయన దగ్గర ఉండటం కూడా ఎంతో ఆనందకరం’ అన్నారు.
టెంపర్ వంశీ మాట్లాడుతూ...‘ఆర్ పి గారు నన్ను ముఖ్య పాత్రలో ఒక సినిమా చేస్తున్నాము అని చెప్పగానే నేను నిజంగా ఆశ్చర్యపోయాను. నన్ను పెట్టి సినిమా తీయడం ఏంటి అని. ఆయన ఆలోచన చెప్పిన తర్వాత నాకు ఎంతో ఎక్సైట్ గా అనిపించింది. ఈ చిత్రానికి పనిచేసిన వారందరితో పనిచేయడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. అందరూ తప్పకుండా ఆహలో ఈ చిత్రాన్ని చూడండి’అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment