rp patnaiak
-
లింక్డ్ స్క్రీన్ ప్లేతో ‘W/O అనిర్వేష్’.. ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్
రాంప్రసాద్, జెమినీ సురేష్ , కిరీటి , సాయి ప్రసన్న ,సాయి కిరణ్ , నజియా ఖాన్ , అద్వైత చౌదరి తదితరులు కీలక పాత్రల్లో నటించిన తాజా చిత్రం W/O అనిర్వేష్. గంగ సప్తశిఖర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గజేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై మహేంద్ర గజేంద్ర సమర్పణలో శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మిస్తున్నారు. త్వరలో ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ని మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.పి పట్నాయక్ గారి చేతుల మీదగా ఫిలిం ఛాంబర్ లో లాంచ్ చేశారు.ఈ సందర్భంగా ఆర్పి పట్నాయక్ మాట్లాడుతూ అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లే తో రూపొందిన W/O అనిర్వేష్ చిత్రం కచ్చితంగా మంచి హిట్ సాధిస్తుంది. కొత్త కథతో ఈ సినిమా తెరకెక్కించడం చాలా ఆనందమని కొనియాడారు. నిర్మాతలు మాట్లాడుతూ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ ఎడిటింగ్ అని "లింక్డ్ స్క్రీన్ ప్లే" అనే ఫిలిం టెక్నీక్ తో ఎడిటర్ హేమంత్ నాగ్ కొత్త తరహా ఎడిటింగ్ ని ప్రేక్షకులకు అందిస్తున్నాము అన్నారు.ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ జీవితం లో జరిగిన ఇబ్బందులని తనకు తెలిసిన కళతో ఎలా ఎదుర్కొని పరిష్కరించాడు అనేది దర్శకుడు ఆసక్తిగా తెరకెక్కించారని, మా బ్యానర్లో రాబోతున్న W/O అనిర్వేష్ చిత్రం ప్రేక్షకులకు కొత్త ఫీల్ ఇస్తుంది అని అన్నారు. ఈ చిత్రాన్ని ఎస్ కె ఎం ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా ఆంధ్ర మరియు తెలంగాణలో అతి త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. -
డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైన హీరోహీరోయిన్లు లేని సినిమా
ఆర్ పి పట్నాయక్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం "కాఫీ విత్ ఏ కిల్లర్"( Coffee With A Killer). సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సతీష్ నిర్మించిన ఈ చిత్రంలో టెంపర్ వంశీ, శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేష్, రవిబాబు, అంబటి శ్రీను, శ్రీరాప, జెమిని సురేష్ తదితరులు కీలకపాత్ర పోషించారు. నేటి నుంచి ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ‘ఆహా’(AHA)లో స్ట్రీమింగ్ కానుంది.ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఆర్ పి పట్నాయక్ మాట్లాడుతూ...‘హీరో హీరోయిన్ లేకుండా ఒక సినిమా తీయాలి అంటే ఎలా అని ఆలోచనతో ఈ కథ మొదలైంది. కథ హీరో అయితే ఎలా ఉండబోతుంది అని ఈ కథ రాశాము. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమాను మొత్తం దగ్గరుండి చూసుకున్నది మా అన్నయ్య గౌతమ్ పట్నాయక్ గ. ఈ చిత్రంలోని కీలక పాత్ర విషయానికి వస్తే నాకు వంశీ మాత్రమే కచ్చితంగా ఈ కథకు, పాత్రకు పర్ఫెక్ట్ అని అనిపించింది. వేరే ఎవరిని నేను ఆ పాత్రలో ఊహించుకోలేకపోయాను. జెమిని సురేష్ క్యారెక్టర్ ప్రత్యేకమైనది. నా ఆలోచనలు అర్థం చేసుకునే తిరుమల నాగ్ కలిసి ఈ చిత్రం కోసం పని చేశాను. డిఓపి అనూష్ ఎంతో సౌమ్యుడు. ఎంతో టాలెంట్ ఉన్న వ్యక్తి. చిత్రంలో నటించిన నటీనటుల క్యారెక్టర్లు చూస్తే కొన్ని ఎంతో ప్రత్యేకంగా అలాగే కొత్తగా ఉంటాయి. శ్రీనివాస్ రెడ్డి గారికి ఆయన కాకుండా ఇంకా ఎవరు అంత బాగా చేయలేరు అన్నట్లు వచ్చింది. ఆయన టైమింగ్ ప్రత్యేకం అని చెప్పుకోవాలి. ఈ చిత్రం ఎంతో శ్రద్ధగా టీమ్ అంతా కలిసి టీం వర్క్ గా చేసాము. సినిమాలో హీరో హీరోయిన్ ఉండరు కానీ విలన్ ఉంటాడు. ఈ సినిమాను ఎంతోమంది థియేటర్లో విడుదల చేయమని నన్ను అడిగారు కానీ నేను ఈ సినిమా ఖచ్చితంగా ఓటిటి లోనే విడుదల కావాలి అని పట్టు పట్టి ఆహాలో విడుదల చేస్తున్నాం’అన్నారు.నటుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ...‘కొన్ని కథలో మధ్య జరిగే కథలా ఈ చిత్రం ఉండబోతుంది. చూసి ప్రేక్షకులంతా ఎంతో ఎంజాయ్ చేస్తారు. ప్రతి సీన్ లోను ట్విస్టులు ఉంటాయి. డబ్బింగ్ కూడా ఎంతో బాగా వచ్చింది. ఆర్ బి గారితో పని చేయడమే కాదు ఆయన దగ్గర ఉండటం కూడా ఎంతో ఆనందకరం’ అన్నారు.టెంపర్ వంశీ మాట్లాడుతూ...‘ఆర్ పి గారు నన్ను ముఖ్య పాత్రలో ఒక సినిమా చేస్తున్నాము అని చెప్పగానే నేను నిజంగా ఆశ్చర్యపోయాను. నన్ను పెట్టి సినిమా తీయడం ఏంటి అని. ఆయన ఆలోచన చెప్పిన తర్వాత నాకు ఎంతో ఎక్సైట్ గా అనిపించింది. ఈ చిత్రానికి పనిచేసిన వారందరితో పనిచేయడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. అందరూ తప్పకుండా ఆహలో ఈ చిత్రాన్ని చూడండి’అన్నారు. -
అలా అయితేనే సినిమాలు చేసేందుకు ముందుకు రండి: ఆర్పీ పట్నాయక్
కిట్టు తాటికొండ, కష్మీరా,రోహిత్, వైశాలి, సునీల్ రావినూతల, శ్రీ గోపి చంద్ కొండ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'కరణం గారి వీధి'. ఈ చిత్రాన్ని సౌత్ బ్లాక్ బస్టర్ క్రియేషన్స్ బ్యానర్‌పై అడవి అశోక్ నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం హేమంత్, ప్రశాంత్ తెరకెక్కిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్లో కంప్లీట్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీ త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ - 'కరణం గారి వీధి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నా చేతుల మీదుగా రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. పోస్టర్, టైటిల్ డిజైన్ చాలా కొత్తగా అనిపించింది. కొత్త టాలెంట్ ఎంత ఎక్కువగా వస్తే ఇండస్ట్రీకి అంత మంచిది. ఈ టీమ్ కూడా మంచి ప్రయత్నం చేసి ఉంటారని ఆశిస్తున్నా. ఈ సినిమా టీమ్‌కు మంచి పేరు రావాలి. కొత్త ఫిలిం మేకర్స్‌కు నాదొక చిన్న సలహా. సినిమా మీద కనీస అవగాహన, ప్యాషన్ ఉనప్పుడే సినిమాలు చేసేందుకు ముందుకు రండి. అప్పుడే మీరు చేసే సినిమా బాగుంటుంది'అని అన్నారు.నిర్మాత అడవి అశోక్ మాట్లాడుతూ..' మా కరణం గారి వీధి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ చేసిన ఆర్పీ పట్నాయక్‌కు థ్యాంక్స్. ఆయన మ్యూజిక్‌తో పాటు ఆయన తెరకెక్కించిన సినిమాలంటే మాకు ఇష్టం. ప్రేక్షకులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఉన్న చిత్రమిది. త్వరలోనే సినిమాను థియేటర్స్‌లోకి తీసుకొస్తాం' అని అన్నారు.దర్శకుడు హేమంత్ మాట్లాడుతూ - 'పల్లెటూరి నేపథ్యంగా సాగే కంప్లీట్ ఎంటర్ టైనింగ్ మూవీ ఇది. మనం నిజ జీవితంలో చూసే వాస్తవిక ఘటనలు ఉంటాయి. కరణం గారి వీధి సినిమాను అందరికీ నచ్చేలా రూపొందిస్తున్నాం. త్వరలోనే రిలీజ్ డేట్ ప్లాన్ చేసి మీ ముందుకు చిత్రాన్ని తీసుకొస్తాం' అని అన్నారు.దర్శకుడు ప్రశాంత్ మాట్లాడుతూ..' లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా కరణం గారి వీధి సినిమాను రూపొందిస్తున్నాం. విలేజ్ బ్యాక్ డ్రాప్లో ఉంటూ మంచి కామెడీతో మీరంతా ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది. ఆర్పీ సార్ తమ టైమ్ కేటాయించి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నాం' అని అన్నారు. -
లిరిక్స్ మారిస్తే కానీ షూట్ చేయమన్నారు : ఆర్పీ పట్నాయక్
నాగార్జున హీరోగా దశరథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా 'సంతోషం'. గ్రేసీ సింగ్, శ్రియా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది. ఇక ఈ సినిమాలోని ప్రతీ పాట సూపర్ హిట్టే. 2002లో విడుదలైన ఈ సినిమా ఇటీవలె 20ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సంతోషం మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'దేవుడే దిగివచ్చినా' సాంగ్ కంపోజింగ్ చాలా విచిత్రంగా జరిగింది. ముందు వేరే పాట ఇచ్చాను. కానీ ఆ పాటకి ఎలా కంపోజ్ చేయాలో తెలియడం లేదని రాజు సుందరం మాస్టర్ షూటింగ్ ఆపేశారు. లిరిక్స్ మారిస్తేనే చేస్తానని చెప్పారు. దీంతో చాలా టెన్షన్ పడిపోయాను. నేను వాష్ రూమ్‌కి వెళ్తే డైరక్టర్ దశరద్ బయటి నుంచి గడియ పెట్టి బంధించాడు. పల్లవి చెబితేనే గడియ తీస్తానన్నాడు. అదే టెన్షన్లో 'దేవుడే దిగివచ్చినా' అనే పల్లవి చెప్పాను. దీంతో మిగతా లైన్స్ వచ్చేస్తాయిలే అని దశరధ్ గడియ తీశాడు. అలా లిరిక్స్ మార్చి షూటింగ్ చేశాం' అంటూ చెప్పుకొచ్చారు. -
సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ కోసం ఈ పాట..
సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు నేడు (మే 31). దాదాపు ప్రతి ఏడాది కృష్ణ జన్మదిన కానుకగా మహేశ్‌బాబు సినిమా నుంచి ఏదో ఒక అప్డేట్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ సంవత్సరం కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా మహేశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’ నుంచి అప్డేట్ రావడం లేదు. అయితే ఫ్యాన్స్‌కి ఓ కానుక సిద్ధమైంది. కృష్ణ చేసిన అద్భుత పాత్రల్లో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్ర ఒకటి. ఆయన పుట్టినరోజు సందర్భంగా సంగీత దర్శకుడు ఆర్.పి పట్నాయక్ పాడిన విప్లవ గీతాన్ని కృష్ణ అభిమానులకు అంకితమిస్తూ, ‘ఊర్వశి’ ఓటీటీ వారు విడుదల చేస్తున్నారు. దర్శకుడు వీరు.కె ఈ పాట రూపకల్పనకు సారధ్యం వహించారు. ఆర్.పి పట్నాయక్, మౌనిక పాడారు. ఈ సందర్భంగా ‘ఊర్వశి’ ఓటీటీ ఎమ్.డి రవి కనగాల, సీఈఓ రామసత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘తెలుగు సినిమా ఖ్యాతిని ఇనుమడింపజేసిన కృష్ణగారిపై ఓ పాటను ఆయన బర్త్‌డే కానుకగా ఆయన అభిమానులకు అంకితం చేస్తూ, విడుదల చేయడం గర్వంగా ఉంది. మాకు ఈ అవకాశం ఇచ్చిన ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) అధ్యక్షుడు నరేష్‌కి థ్యాంక్స్’’ అన్నారు. -
దయచేసి మొక్కుతున్నా.. ఆలోచించండి: ఆర్పీ కంటతడి
ప్రస్తుతం దేశం వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తుంది. రోజురోజుకు కరోనా మరణాలు రెట్టింపు అవుతున్నాయి. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత ఉండటంతో సమయానికి వైద్యం అందక సొంతవారి కళ్లముందే ప్రాణాలు విడుస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కోన్ని రాజకీయ నాయకుల అవలంభిస్తున్న తీరు, కార్పోరేట్ హాస్పిట్లా వారి దోపిడిపై మ్యూజిక్ డైరెక్టర్, నటుడు, సింగర్ ఆర్పీ పట్నాయక్ అగ్రహం వ్యక్తం చేశారు. కొందరి నిర్ణక్ష్యం వల్లే అమాయకులైన ప్రజలు ప్రాణాలు విడుస్తున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కంటతడి పెట్టుకుంటూ తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో వీడియో ద్వారా సందేశం ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో ప్రతి ఒక్కరి కదిలిస్తోంది. ‘అందరికీ నమస్కారం.. నేను మీ ఆర్పీ పట్నాయక్.. చాలా బాధగా ఉంది.. ఒకప్పుడు మనం వుహాన్‌ను చూసినట్టు.. ప్రస్తుతం ప్రపంచం మన దేశాన్ని చూస్తోంది. చాలా మాట్లాడాలని ఉంది.. ఎంత వరకు మాట్లాడాలో తెలియడం లేదు.. కానీ ఇప్పుడు ఇది అవసరం.. మా అమ్మకు బెడ్ దొరకలేదని హాస్పిటల్ సిబ్బంది మీద దాడి చేశారు కొంతమంది. బెడ్స్ లేనప్పుడు వారు ఇవ్వలేరు కదా?.. అమ్మ చనిపోయినప్పుడు వారికి కోపం రావడం తప్పు లేదు కానీ అదే సమయంలో.. కోవిడ్ రోగులకు ట్రీట్మెంట్ ఇస్తోన్న సిబ్బంది మీద దాడి చేయడం వల్ల మిగతా వాళ్లు బాధలు పడుతున్నారు. ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి’ అంటూ చెప్పుకొచ్చారు. అలాగే ‘కరోనా లెక్కలన్నీ కూడా సరైనవి కావు. అసలైన లెక్కలు శశ్మానంలో కనిపిస్తుంటాయి. శవాలు కూడా క్యూలో ఉంటున్నాయి. ఆక్సిజన్ కోసం ఎంతో మంది హాస్పిటల్లో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ఎలక్షన్స్ ముఖ్యం, ఫలితాలు ముఖ్యం.. గెలిచింది.. ఓడింది.. నైతిక విజయం.. అది ముఖ్యం అని అనుకునే ధౌర్భాగ్యపు రాజకీయ నాయకులు ఉన్నారు చూడండి. ఎందుకయ్యా మీరు.. ఇంత మంది శవాల మీద ఆడుకుంటున్నారు. అసలు మీరు మనుషులేనా.. ఎన్నికలు అయ్యాయి కదా వాటి మీద మీరు పెట్టిన శ్రద్ద కనీసం ఒక్క శాతమైన ప్రస్తుతం ఉన్న పరిస్థితి మీద పెట్టండి.. దయచేసి మొక్కుతున్నా.. కనీసం ఉన్న వాళ్లను ఎలా కాపాడుకోవాలనే ప్రయత్నం చేయండి’ ఆయన అభ్యర్థించారు. View this post on Instagram A post shared by Rp Patnaik (@rp.patnaik) -
మరచిపోలేని సంవత్సరం ఇది
‘‘సినిమా పరిశ్రమలో రాణించాలనే ఆశయంతో అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగాన్ని వదిలేశాను. నాన్న నిర్మాతగా వ్యవహరించడంతో ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాను. ఆ సినిమా నాకు చాలా సంతృప్తిని, టాలీవుడ్లో మంచి గుర్తింపని ఇవ్వడం ఆనందంగా ఉంది’’ అని ప్రశాంత్ రెడ్డి అన్నారు. నేడు ఆయన పుట్టినరోజు. ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ప్రాణం ఖరీదు’ తర్వాత ‘ఎంకి పాట–ఆర్పీ నోట’ అనే వీడియో ఆల్బమ్‌లో నటించాను. నండూరి సుబ్బారావు రాసిన ఎంకి పాటలను దృశ్యరూపంలోకి తీసుకొచ్చే ప్రాజెక్ట్ ఇది. ఇందుకు సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, ఆయన సోదరుడు గౌతమ్ పట్నాయక్‌లకు రుణపడి ఉంటాను. త్వరలోనే నా రెండో సినిమా ప్రారంభం అవుతుంది. మా నాన్నగారే నిర్మిస్తారు. నేను హీరోగా నటిస్తూనే దర్శకత్వం చేస్తా. నా డైరెక్షన్లో సినిమా నవంబర్‌లో సెట్స్‌పైకి వెళ్తుంది. ఈ ఏడాది నాకు మెమరబుల్’’ అన్నారు. -
సభ్యత్వం తీసుకుంటే జీవితాంతం రాయల్టీ
‘‘నేను ఇప్పటిదాకా ఎన్నో పాటలు పాడాను. రాయల్టీ రూపంలో ఏమీ సంపాదించలేదు. 2012లో రాయల్టీ గురించి పార్లమెంట్లో బిల్లు పాస్ కావడానికి ముందు నాకు వచ్చిందేమీ లేదు. ఇప్పుడు రాయల్టీ అనేది సింగర్స్ హక్కు. దీని కోసమే ‘ఇస్రా’ కృషి చేస్తోంది. అర్హులందరూ ఇందులో సభ్యులుగా చేరాలి’’ అని ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. ‘ఇండియన్ సింగర్స్ రైట్స్ అసోసియేషన్’ (ఇస్రా) ఆధ్వర్యంలో ప్రస్తుతం సభ్యత్వ నమోదు జరుగుతోంది. ఈ సంస్థ బుధవారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించింది. ముఖ్య అతిథి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ –‘‘ఏదైనా ఒక పాట పాడిన వారు రూ.2 వేలు చెల్లించి ‘ఇస్రా’లో సభ్యత్వం తీసుకోవచ్చు. ఇప్పటికి 410 మంది సభ్యులున్నారు. గాయనీగాయకులకు భాషతో సంబంధం లేదు. నన్ను, ఏసుదాస్‌గారిని ఏ భాషవాళ్లంటే ఏమని చెబుతారు? రాయల్టీ గురించి మాట్లాడితే అవకాశాలు తగ్గిపోతాయేమోననే భయాలు వద్దు. రాయల్టీ వద్దని గతంలో ఎవరైనా సంతకాలు చేసినా అవి ఇప్పుడు చెల్లవు. సభ్యత్వం తీసుకుంటే జీవితాంతం రాయల్టీ రూపంలో ఎంతో కొంత వస్తూనే ఉంటుంది. సినిమా, జానపదాలు, గజల్, ఆధ్యాత్మిక, క్లాసికల్ పాటలు పాడిన వారందరూ రాయల్టీ పొందడానికి అర్హులే’’ అన్నారు. ‘ఇస్రా’ బోర్డ్ ఆఫ్ అడ్వైజర్స్‌లో ఒకరైన సంజయ్ టాండన్ మాట్లాడుతూ– ‘‘ఇంతకు మునుపు ఉన్న ఐపీఆర్‌యస్‌కు.. ఇప్పుడు మేం పెట్టుకున్న ఇస్రాకు సంబంధం లేదు. మా సంస్థ వల్ల వారి ఆదాయానికి నష్టం ఉండదు. ప్రస్తుతం స్టేడియమ్‌లలో సీటుకు రూ. 1.60 చొప్పున వసూలు చేస్తున్నాం. డిమాండ్‌ని బట్టి భవిష్యత్తులో పెరగొచ్చు, తగ్గొచ్చు. రాయల్టీ విషయమై యు.యస్, యు.కె., బ్రెజిల్‌తో మాట్లాడాం. ఇటీవల బ్రెజిల్ నుంచే మాకు రూ.40 లక్షలు వచ్చాయంటే మన సంగీతానికి అక్కడున్న ఆదరణ ఎలాంటిదో అర్థమవుతుంది. ఇప్పటిదాకా 2016లో రూ.51లక్షలు, 2017లో రూ. 1.2కోట్ల రాయల్టీ వసూలు చేసి అందజేశాం. సభ్యులందరికీ ఆరోగ్య బీమా పథకాన్ని అందిస్తున్నాం. మృతిచెందిన గాయనీగాయకుల రాయల్టీని వారసులకు అందిస్తాం’’ అన్నారు. ఆర్.పి.పట్నాయక్, శ్రీలేఖ, వేణు, కౌసల్య, కేఎం రాధాకృష్ణన్, సింహా తదితర సింగర్స్ పాల్గొన్నారు. -
నగరంలో ప్రణీత
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): నగరంలో సినీనటి ప్రణీత(అత్తారింటికి దారేది ఫేం) శుక్రవారం సందడి చేశారు. ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చిన ఆమె సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌తో కలిసి నగరంలో తళుక్కున మెరిశారు. ఆమెను చూడడానికి అభిమానులు ఎగబడ్డారు. సెల్ఫీలు తీసుకుని ముచ్చటపడ్డారు. అనంతరం వీఐపీ రోడ్డులో ఏర్పాటు చేసిన సోమ రెస్టోబార్ను ప్రణీత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విశాఖ చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమన్నారు. ప్రస్తుతం తెలుగులో ‘హాలో గురు ప్రేమ కోసమే రా’చిత్రంలో నటిస్తున్నానని చెప్పారు. తన తొలి హిందీ చిత్రం పాట శుక్రవారం యూట్యూబ్‌లో విడుదల చేశామని, 5 మిలియన్ల మంది వీక్షించటం చాలా సంతోషంగా ఉందన్నారు. నగరంలో మంచి ఫుడ్ కోసం యువత ఎంతో ఆసక్తి కనబరుస్తారని, వారి అభిరుచులకు అనుగుణంగా ఆహారం అందించి సోమ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎండీ లోకనాథ్, నటుడు రాంకీ తదితరులు పాల్గొన్నారు. -
ఆమెది స్పందించే హృదయం..
సాక్షి, సిటీబ్యూరో: ఆర్పీ పట్నాయక్ దర్శకత్వంలో ఇటీవల నిర్మించిన ‘తథాస్తు‘ షార్ట్ ఫిల్మ్ కేవలం ఒకే ఒక్కరోజులోనే లక్షకుపైగా వ్యూస్ దాటిన విషయం విదితమే. అది ఇప్పటికి 4 లక్షల వ్యూస్‌తో అందరి అభిమానం పొందుతోంది. ఇందుకు కారణం ‘ఎంతోమంది అనాథలుగా జీవనం కొనసాగిస్తున్న ఈ సమాజంలో ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తూ వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారూ ఈ తరంలో ఎలా మార్పు తేవచ్చొ ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా దర్శకుడు ‘ఆర్పీ పట్నాయక్‘ అద్భుతంగా రూపొందించారు. ఇందులో ప్రధాన పాత్రను సుమ కనకాల పోషించారు. ఈ కథలో తమ పాప పుట్టిన రోజును అందరివలే సాదాసీదా పార్టీలతో కానిచ్చేయకుండా.. అనాథ పిల్లలతో కలిసి జరుపుకొని వారి కడుపు నిండటంతో పాటు ఆనందం పంచినట్టవుతుందని.. తన పాపకు సర్ప్రైజ్ ఇవ్వటమే ‘తథాస్తు’ అసలు సారాంశం. నిజంగా అలాగే.. కేవలం తాను నటించిన ఈ షార్ట్ ఫిల్మ్ వరకే పరిమితం కాకుండా నిజజీవితంలో సైతం పుట్టిన రోజైన మార్చి 22న భర్త రాజీవ్ కనకాల, అత్త, కూతురు, బంధువులతో గురువారం సికింద్రాబాద్‌లోని ‘సర్వ్ నీడి’ అనాథాశ్రమానికి వచ్చారు సుమ. అక్కడి 30 మంది అనాథ పిల్లలతో మూడు గంటల పాటు గడిపారు. వారి ఆటాపాటలను వీక్షిస్తూ కబుర్లు చెప్పారు. పిల్లలకు మిఠాయిలు, పండ్లు పంచి పెట్టారు. కేక్ కట్ చేసి పిల్లలతో భోజనం చేశారు. సంస్థ నిర్వాహకుడు గౌతమ్‌కుమార్‌తో చర్చించారు. సంస్థ సేవలను కొనియాడారు. తన పుట్టిన రో జును అనాథ పిల్లల మధ్య జరుపుకోవడం మరిచిపోని సంతృప్తినిచ్చిందని సుమ వివరించారు. ఆమెది స్పందించే హృదయం.. సుమ బుల్లి తెర యాంకర్ మాత్రమే కాదు. సందర్భాన్ని బట్టి ఎదుటి వారి అవసరాన్ని బట్టి స్పందించే హృదయం ఆమెది. సాటివారికి సాయం చేయాలనేది ఆమె మనస్తత్వం. ‘తథాస్తు’ షార్ట్ ఫిల్మ్‌లో నటించేందుకు రియల్ లైఫ్ జెన్యూన్ హ్యూమన్ కావాలనే ఉద్దేశంతో సుమను ఒప్పించాను. మా యూనిట్ తరపున ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు. – ఆర్పీ పట్నాయక్ -
రాగాల సంక్రాంతి
-
‘త్రివిక్రమ్ నా రూమ్ మేట్.. అయినా చాన్స్ అడగలేదు’
సాక్షి, హైదరాబాద్ : తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్. ఆయన ఓ సంగీత దర్శకుడిలా కాకుండా ఓ మాములు మనిషిగా ఎప్పుడు చెరగని చిరునవ్వుతో మనకు దగ్గరి మనిషిలా కనిపిస్తారు. ముఖ్యంగా తేజతో కలిసి పనిచేసిన చిత్రాలకు క్లాస్, మాస్ ఆడియన్స్‌ను కట్టిపడేసేలా సంగీతాన్ని అందించి ఉర్రూతలూరించారయన. ఇప్పుడు ఆయన ఓ టాప్ డైరెక్టర్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. ప్రస్తుతం టాలీవుడ్లో తనదైన స్టైల్‌తో పెన్నుకు పదును పెడుతూ క్లాస్ డైరెక్టర్ అనిపించుకుంటున్న త్రివిక్రమ్ ఒకప్పుడు ఆర్పీ పట్నాయక్ రూమ్మేట్ అని చెప్పారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన తాను సునీల్, త్రివిక్రమ్ రూమ్మేట్స్ అని తాను సినిమాల్లోకి రాకముందే ఆనందం అనే ఓ ఆల్బమ్ చేశానని, దానికి త్రివిక్రమ్‌గారే లిరిక్స్ రాశారని చెప్పారు. త్రివిక్రమ్ తన చిత్రాలకు ఇతర సంగీత దర్శకులను పెట్టుకుంటున్నా తాను ఏనాడు తనకు అవకాశం ఇవ్వాలని అడగలేదని చెప్పారు. తన చిత్రానికి సరిపోవు సంగీతం ఫలానా సంగీత దర్శకుడితోనే సాధ్యమవుతుందనే ఆయన ఆలోచనకు భంగం కలగకూడదనే తాను అలా ఏనాడు అడగలేదంటూ స్నేహంలో ఉన్న బాధ్యతను కూడా తన మాటల ద్వారా చెప్పుకొచ్చారు. -
డిసెంబర్ 22న 'తొలి కిరణం' రిలీజ్
సువర్ణ క్రియేషన్స్ పతాకంపై బేబీ మేరీ విజయ సమర్పణలో T. సుధాకర్ నిర్మాత గా జె. జాన్ బాబు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'తొలి కిరణం'. ఈ సినిమా డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సందర్బంగా చిత్ర దర్శకుడు జాన్ బాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 'తొలి కిరణం చిత్రాన్ని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నాము. యేసు క్రీస్తు సినిమాలో ఇప్పటి వరకు రాని కొత్త పాయింట్ తో మా చిత్రాన్ని నిర్మిచాం. 45 నిమిషాలు అద్భుతమైన గ్రాఫిక్స్ తో అన్ని రకాల ప్రేక్షకులను అలరిస్తుంది. అనుకున్న బడ్జెట్ కన్నా రెట్టింపు అయ్యింది. మా చిత్రానికి ఆర్పీ పట్నాయక్ మ్యూజిక్ అదించటం సినిమా పై అంచనాలు పెంచింది. ఆయన అద్భుతమైన పాటలు అందిచారు. చంద్రబోస్ లిరిక్స్ అందించారు. మలయాళ నటి భవ్య మేరీ మాతగా నటించింది. 'తొలి కిరణం' చిత్రాన్ని డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నామని తెలిపారు. -
దేవుణ్ణి చూడాలనుకుంటే షోకి రండి! – సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్
‘‘ఇళయరాజా ఉన్న కాలంలో మనం ఉండడం అదృష్టం. అదీ మనందరి ముందు ఆయన లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం మరింత అదృష్టం. (‘మ్యూజిక్’) దేవుణ్ణి ప్రత్యక్షంగా చూడాలనుకుంటే రాజా (ఇళయరాజా) గారి షోకి రండి. ఆయన సంగీత దర్శకత్వంలో ‘చిరుగాలి వీచెనే’ పాట పాడే చాన్స్, ఆయన్ని కలసే చాన్స్ ఇచ్చిన దేవుడికి థ్యాంక్స్’’ అన్నారు సంగీత దర్శకులు–నటుడు–దర్శక–రచయిత ఆర్పీ పట్నాయక్. ఈ ఆదివారం (నవంబర్ 5న) హైదరాబాద్‌లో మొట్టమొదటిసారిగా ‘స్వరజ్ఞాని’ ఇళయరాజా లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ జరగనున్న సంగతి తెలిసిందే. ‘‘ఇళయరాజా లైవ్ షోకి ఫ్రీ పాసులు కావాలా? అయితే... ‘రాజా కాలింగ్ ఆజా’ పోటీలో పాల్గొనండి’’ అని ‘సాక్షి’ పాఠకులకు ‘షో క్విజ్’ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ పోటీకి అనూహ్య స్పందన లభించింది. వాళ్లలో సరైన సమాధానాలు రాసి పంపిన 600 మందిని ఎంపిక చేశారు. 600 మందిలోంచి 200 మంది లక్కీ మెంబర్స్‌ను ఆర్పీ పట్నాయక్, హీరో నాగ అన్వేష్, హీరోయిన్ హెబ్బా పటేల్ ఎంపిక చేశారు. ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ సినిమాలో బాలనటుడిగా, ‘వినవయ్యా రామయ్యా’, ఈ శుక్రవారం విడుదలవుతోన్న ‘ఏంజెల్’లో హీరోగా నటించిన నాగ అన్వేష్ మాట్లాడుతూ– ‘‘రాజాగారి పాటల్లో ‘రుద్రవీణ’లోని ‘తరలిరాద తనే వసంతం..’ పాటంటే నాకెంతో ఇష్టం. టీవీలో ఆ పాట ఎప్పుడొచ్చినా... పనులన్నీ పక్కన పెట్టేసి టీవీ ముందు కూర్చుంటా. లక్కీ డ్రాలో పాసులు పొందిన 200 మందికి కంగ్రాట్స్. నా ఫ్రెండ్స్, స్టాఫ్ కూడా పాసులు అడుగుతున్నారు. ఒక్క ఎక్స్రా›్ట పాస్ ఉంటే నాకు ఇవ్వండి’’ అన్నారు. ‘మీ దగ్గర ఒక్క పాస్ ఉంటే... ఇంట్లో ఇల్లాలిని తీసుకువెళతారా? వంటింట్లో ప్రియురాలిని తీసుకువెళతారా?’ అని నాగ అన్వేష్ని అడగ్గా... ‘‘నేను ఇంట్లో కూర్చుని ఇద్దరినీ రాజాగారి లైవ్ కన్సర్ట్కి పంపిస్తా’’ అని నవ్వేశారు. ఈ లక్కీ డ్రాలో పాల్గొనడం హ్యపీగా ఉందని హెబ్బా పటేల్ చెప్పారు. విజేతలు (200 మంది)... తమ వివరాలను ‘సాక్షి’ వెబ్సైట్లో చూడొచ్చు. అలాగే, వాళ్ల మొబైల్ నంబర్లకు ఎసెమ్మెస్‌ల ద్వారా సమాచారం అందుతుంది. నవంబర్ 2, 3, 4వ తేదీల్లో హైదరాబాద్‌లోని ‘సాక్షి’ ఆఫీసులో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ విజేతలు తమ మొబైల్‌కు వచ్చిన మెసేజ్ చూపించి పాసులు పొందవచ్చు. సుదూర ప్రాంతాల వాళ్లు 5వ తేదీ మధ్యహ్నం 2 గంటలలోపు వచ్చి పాసులు పొందవచ్చు. ఫార్వార్డ్ మెసేజ్‌లకు పాసులు ఇవ్వబడవు. ఏ నంబర్‌కి మెసేజ్ వస్తే.. ఆ నంబర్‌కే పాస్ ఇవ్వబడును. -
సిరివెన్నెలకు అన్యాయం జరిగింది
హైదరాబాద్: పద్మ అవార్డుల ఎంపికలో తమకు అన్యాయం జరిగిందని కొందరు క్రీడాకారులు, సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ క్రీడాకారులు పంకజ్ అద్వానీ, గుత్తా జ్వాల తమను విస్మరించారని నేరుగా ఆరోపించగా.. సినీ గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తరఫున సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ స్పందించారు. పద్మ అవార్డుల ఎంపికలో సిరివెన్నెలకు అన్యాయం జరిగిందని పట్నాయక్ అన్నారు. తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండూ సిరివెన్నెలను గుర్తించకపోవడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.