‘‘సినిమా పరిశ్రమలో రాణించాలనే ఆశయంతో అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగాన్ని వదిలేశాను. నాన్న నిర్మాతగా వ్యవహరించడంతో ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాను. ఆ సినిమా నాకు చాలా సంతృప్తిని, టాలీవుడ్‌లో మంచి గుర్తింపని ఇవ్వడం ఆనందంగా ఉంది’’ అని ప్రశాంత్ రెడ్డి అన్నారు. నేడు ఆయన పుట్టినరోజు.
ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ప్రాణం ఖరీదు’ తర్వాత ‘ఎంకి పాట–ఆర్పీ నోట’ అనే వీడియో ఆల్బమ్‌లో నటించాను. నండూరి సుబ్బారావు రాసిన ఎంకి పాటలను దృశ్యరూపంలోకి తీసుకొచ్చే ప్రాజెక్ట్ ఇది. ఇందుకు సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, ఆయన సోదరుడు గౌతమ్ పట్నాయక్‌లకు రుణపడి ఉంటాను. త్వరలోనే నా రెండో సినిమా ప్రారంభం అవుతుంది. మా నాన్నగారే నిర్మిస్తారు. నేను హీరోగా నటిస్తూనే దర్శకత్వం చేస్తా. నా డైరెక్షన్‌లో సినిమా నవంబర్‌లో సెట్స్‌పైకి వెళ్తుంది. ఈ ఏడాది నాకు మెమరబుల్’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment