లింక్డ్ స్క్రీన్ ప్లేతో ‘W/O అనిర్వేష్’.. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌ | W/O Anirvesh Movie Poster Released By RP Patnaik | Sakshi
Sakshi News home page

లింక్డ్ స్క్రీన్ ప్లేతో ‘W/O అనిర్వేష్’.. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌

Feb 1 2025 6:49 PM | Updated on Feb 1 2025 7:07 PM

W/O Anirvesh Movie Poster Released By RP Patnaik

రాంప్రసాద్, జెమినీ సురేష్ , కిరీటి , సాయి ప్రసన్న ,సాయి కిరణ్ , నజియా ఖాన్ , అద్వైత చౌదరి తదితరులు కీలక పాత్రల్లో నటించిన తాజా చిత్రం W/O అనిర్వేష్.  గంగ సప్తశిఖర  దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గజేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై  మహేంద్ర గజేంద్ర సమర్పణలో శ్రీ శ్యామ్ గజేంద్ర  నిర్మిస్తున్నారు. త్వరలో ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని  మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.పి పట్నాయక్ గారి చేతుల మీదగా ఫిలిం ఛాంబర్ లో  లాంచ్ చేశారు.

ఈ సందర్భంగా ఆర్పి పట్నాయక్  మాట్లాడుతూ అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లే తో  రూపొందిన W/O అనిర్వేష్ చిత్రం కచ్చితంగా మంచి హిట్ సాధిస్తుంది. కొత్త కథతో ఈ సినిమా తెరకెక్కించడం చాలా ఆనందమని కొనియాడారు. నిర్మాతలు మాట్లాడుతూ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ ఎడిటింగ్ అని "లింక్డ్ స్క్రీన్ ప్లే" అనే ఫిలిం టెక్నీక్ తో ఎడిటర్ హేమంత్ నాగ్ కొత్త తరహా ఎడిటింగ్ ని ప్రేక్షకులకు అందిస్తున్నాము అన్నారు.

ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ జీవితం లో జరిగిన ఇబ్బందులని తనకు తెలిసిన కళతో ఎలా ఎదుర్కొని పరిష్కరించాడు అనేది దర్శకుడు ఆసక్తిగా తెరకెక్కించారని, మా బ్యానర్లో రాబోతున్న W/O అనిర్వేష్ చిత్రం ప్రేక్షకులకు కొత్త ఫీల్ ఇస్తుంది అని అన్నారు. ఈ చిత్రాన్ని ఎస్ కె ఎం ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా ఆంధ్ర మరియు తెలంగాణలో అతి త్వరలో రిలీజ్ చేయబోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement