
సాక్షి, హైదరాబాద్: జబర్దస్త్ కమెడియన్ రామ్‌ప్రసాద్ రోడ్డుప్రమాదంలో గాయపడ్డాడు. గురువారం (డిసెంబర్ 5) షూటింగ్‌కు వెళ్తుండగా తుక్కుగూడ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఎప్పటిలాగే షూటింగ్‌కు వెళ్తుండగా కారు సడన్ బ్రేక్ వేయడంతో వెనక నుంచి మరో వాహనం ఢీ కొట్టింది. దాంతో రామ్ ప్రసాద్ కారు ముందున్న కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు ధ్వంసమవగా, రామ్‌ప్రసాద్‌కు స్వల్ప గాయాలయ్యాయి.