అలా అయితేనే సినిమాలు చేసేందుకు ముందుకు రండి: ఆర్పీ పట్నాయక్ | Music Composer RP Patnaik Released Tollywood Movie Poster | Sakshi
Sakshi News home page

RP Patnaik: కొత్త టాలెంట్ ఎంత వస్తే ఇండస్ట్రీకి అంత మంచిది: ఆర్పీ పట్నాయక్

Published Mon, Nov 18 2024 6:45 PM | Last Updated on Mon, Nov 18 2024 7:05 PM

Music Composer RP Patnaik Released Tollywood Movie Poster

కిట్టు తాటికొండ, కష్మీరా,రోహిత్, వైశాలి, సునీల్ రావినూతల, శ్రీ గోపి చంద్ కొండ ప్రధాన పాత్రల్లో  నటిస్తోన్న చిత్రం 'కరణం గారి వీధి'. ఈ చిత్రాన్ని సౌత్ బ్లాక్ బస్టర్ క్రియేషన్స్ బ్యానర్‌పై అడవి అశోక్ నిర్మిస్తున్నారు.  దర్శక ద్వయం హేమంత్, ప్రశాంత్ తెరకెక్కిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో  కంప్లీట్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీ త్వరలోనే గ్రాండ్‌ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.

ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ - 'కరణం గారి వీధి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నా చేతుల మీదుగా రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. పోస్టర్, టైటిల్ డిజైన్ చాలా కొత్తగా అనిపించింది. కొత్త టాలెంట్ ఎంత ఎక్కువగా వస్తే ఇండస్ట్రీకి  అంత మంచిది. ఈ టీమ్ కూడా మంచి ప్రయత్నం చేసి ఉంటారని ఆశిస్తున్నా. ఈ సినిమా టీమ్‌కు మంచి పేరు రావాలి. కొత్త ఫిలిం మేకర్స్‌కు నాదొక చిన్న సలహా. సినిమా మీద కనీస అవగాహన, ప్యాషన్ ఉనప్పుడే సినిమాలు చేసేందుకు ముందుకు రండి. అప్పుడే మీరు  చేసే సినిమా బాగుంటుంది'అని అన్నారు.

నిర్మాత అడవి అశోక్ మాట్లాడుతూ..' మా కరణం గారి వీధి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ చేసిన ఆర్పీ పట్నాయక్‌కు థ్యాంక్స్. ఆయన మ్యూజిక్‌తో పాటు ఆయన తెరకెక్కించిన సినిమాలంటే మాకు ఇష్టం. ప్రేక్షకులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఉన్న చిత్రమిది. త్వరలోనే సినిమాను థియేటర్స్‌లోకి తీసుకొస్తాం' అని అన్నారు.

దర్శకుడు హేమంత్ మాట్లాడుతూ - 'పల్లెటూరి నేపథ్యంగా సాగే కంప్లీట్ ఎంటర్ టైనింగ్ మూవీ ఇది. మనం నిజ జీవితంలో చూసే వాస్తవిక ఘటనలు ఉంటాయి. కరణం గారి వీధి సినిమాను అందరికీ నచ్చేలా రూపొందిస్తున్నాం. త్వరలోనే రిలీజ్ డేట్ ప్లాన్ చేసి మీ ముందుకు చిత్రాన్ని తీసుకొస్తాం' అని అన్నారు.

దర్శకుడు ప్రశాంత్ మాట్లాడుతూ..' లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా కరణం గారి వీధి సినిమాను రూపొందిస్తున్నాం. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో ఉంటూ మంచి కామెడీతో మీరంతా ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది. ఆర్పీ సార్ తమ టైమ్ కేటాయించి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నాం' అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement