నాగార్జున హీరోగా దశరథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా 'సంతోషం'. గ్రేసీ సింగ్, శ్రియా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది. ఇక ఈ సినిమాలోని ప్రతీ పాట సూపర్ హిట్టే. 2002లో విడుదలైన ఈ సినిమా ఇటీవలె 20ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సంతోషం మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'దేవుడే దిగివచ్చినా' సాంగ్ కంపోజింగ్ చాలా విచిత్రంగా జరిగింది. ముందు వేరే పాట ఇచ్చాను. కానీ ఆ పాటకి ఎలా కంపోజ్ చేయాలో తెలియడం లేదని రాజు సుందరం మాస్టర్ షూటింగ్ ఆపేశారు. లిరిక్స్ మారిస్తేనే చేస్తానని చెప్పారు. దీంతో చాలా టెన్షన్ పడిపోయాను. నేను వాష్ రూమ్‌కి వెళ్తే డైరక్టర్ దశరద్ బయటి నుంచి గడియ పెట్టి బంధించాడు.
పల్లవి చెబితేనే గడియ తీస్తానన్నాడు. అదే టెన్షన్‌లో 'దేవుడే దిగివచ్చినా' అనే పల్లవి చెప్పాను. దీంతో మిగతా లైన్స్ వచ్చేస్తాయిలే అని దశరధ్ గడియ తీశాడు. అలా లిరిక్స్ మార్చి షూటింగ్ చేశాం' అంటూ చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment