
టాలీవుడ్ నిర్మాత సింగనమల రమేశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇద్దరు పెద్ద హీరోలతో తీసిన సినిమాల వల్ల దాదాపు రూ.100 కోట్లు నష్టపోయినట్లు ఆయన తెలిపారు. తాజాగా ఏర్పాటు ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన నిర్మాత మహేశ్ బాబు ఖలేజా, పవన్ కల్యాణ్ కొమరం పులి చిత్రాల గురించి మాట్లాడారు. ఆ రెండు సినిమాలతో వచ్చిన నష్టం గురించి ఆయన వెల్లడించారు.
కొమరం పులి, ఖలేజా లాంటి చిత్రాలతో భారీగా నష్టపోయినట్లు సింగనమల రమేశ్ వెల్లడించారు. ఆ రోజుల్లో కేవలం ఏ సినిమా అయినా ఏడాదిలోపే పూర్తి చేసేవాళ్లమని చెప్పుకొచ్చారు. నా దురదృష్టం వల్లనేమో కొమరం పులి, ఖలేజా సినిమాలు నిర్మించడంలో ఎక్కువ టైమ్ తీసుకొవాల్సి వచ్చిందన్నారు. ఈ రెండు ఆలస్యమవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయని రమేశ్ అన్నారు. ఈ రెండు సినిమాలతో నష్టపోయినా నాకు.. ఏ హీరో కూడా సపోర్ట్ చేయలేదన్నారు. కష్టకాలంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా ఇండస్ట్రీ నుంచి అయ్యో పాపం అని.. కనీసం పలకరించిన పాపాన పోలేదని నిర్మాత రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా.. 2011లో గచ్చిబౌలిలో హైదరాబాద్ వ్యాపారవేత్తను బెదిరించి రూ.12 కోట్లు స్వాహా చేశారని రమేష్ బాబుపై కేసు నమోదైంది. ఈ కేసులో జనవరి 31 2025న రమేష్ బాబును కోర్టు నిర్దోషిగా తేల్చింది. అందువల్లే ఆయన తాజాగా ప్రెస్‌మీట్ నిర్వహించారు.
కొమరం పులి, ఖలేజా సినిమాల పైన 100 కోట్లు నష్టపోయాను.
హీరోలు కనీసం 'అయ్యో పాపం' అని కూడా అనలేదు
- Singanamala Ramesh (Producer and Film Financier) pic.twitter.com/6KQtgFCaBZ— idlebrain.com (@idlebraindotcom) February 5, 2025