singanamala
-
జైలుకు వెళ్లడానికి కారణం ఇదే.. 14 ఏళ్ల తర్వాత మీడియా ముందుకు ప్రముఖ నిర్మాత
టాలీవుడ్లో కొమరంపులి, ఖలేజా వంటి బిగ్ చిత్రాలను నిర్మాత సింగనమల రమేష్‌బాబు తాజాగా ఒక మీడియా సమావేశం నిర్వహించారు. ఒక కేసు విషయంలో దాదాపు 70 రోజుల పాటు జైలులో కూడా ఆయన ఉన్నారు. చాలా ఏళ్ల తర్వాత ఆయన మళ్లీ మీడియా ముందుకు ఎందుకొచ్చారు..? అనే విషయం గురించి ఆయన ఇలా చెప్పారు. ''నేనొక ఫిల్మ్ ఫైనాన్షియర్‌ని. సినిమా అంటే పాషన్‌తో నిర్మాతగా మారాను. సినిమా నాకు తల్లి లాంటిది. మహాబలిపురంలో ఉన్న నా 10 ఎకరాల స్థలాన్ని ఒకరికి తెలియకుండా మరొకరికి.. ఇలా పలువురు వ్యక్తులకు అమ్మానని నాపై కేసు పెట్టారు. 14 ఏళ్ల పాటు న్యాయ పోరాటం చేశాను. అది తప్పుడు కేసని తేలింది. న్యాయస్థానం నన్ను నిర్దోషిగా తేల్చింది. తప్పుడు కేసులు కోర్టు ముందు నిలబడవు. నా న్యాయపోరాటం గెలిచింది' అని నిర్మాత శింగనమల రమేష్ బాబు అన్నారు . ‘కొమరంపులి’, ‘ఖలేజా’ లాంటి బిగ్ స్టార్ చిత్రాలని నిర్మించిన ఆయన ఓ కేసు నిమిత్తం 14 ఏళ్ల పాటు న్యాయపోరాటం చేశారు. ఈ కేసును విచారించిన కోర్టు ఇటీవల ఆయన్ని నిర్దోషిగా తేల్చి, కేసు కొట్టి వేసింది. ఈ క్రమంలోనే ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. రమేష్ బాబు.. మీపై కేసు పెట్టిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? నాకు ఎలాంటి కక్ష సాధింపులు లేవు. ఏదైనా న్యాయపరంగానే పోరాటం చేస్తా.భవిష్యత్‌లో సినిమాల్లో కొనసాగుతారా ? నేనొక ఫిల్మ్ ఫైనాన్షియర్‌ని.. సినిమా అంటే పాషన్‌తో నిర్మాతగా మారాను. సినిమా నాకు తల్లి లాంటిది. భవిష్యత్తులోనూ ఇదే రంగంలో కొనసాగుతా. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిద్దరూ హీరోలుగా చేశారు. హిట్ అందుకున్నారు. ఇప్పుడు డైరెక్షన్ రైటింగ్ చేయాలని అనుకుంటున్నారు. నేను కూడా నిర్మాతగా చేస్తా. ఫైనాన్షియర్‌గానూ చేస్తాను.మీ మీద కేసు పెట్టింది ఎవరు..? వాళ్లకు సినీ రంగంతో సంబంధం ఉందా..? నాపై కేసు పెట్టిన వాళ్లు ఇండస్ట్రీ చెందిన వారు కాదు.అగ్ర హీరోల చిత్రాలను నిర్మించి నష్టపోయారా? అప్పట్లో సినిమాలు ఆరు నెలలు, లేదా సంవత్సరంలోగా పూర్తయ్యేవి. కానీ నా దురదృష్టం కొద్ది నేను తెరకెక్కించిన కొన్ని పెద్ద హీరోల చిత్రాలు దాదాపు మూడేళ్ల సమయం చిత్రీకరణలోనే గడిచిపోయింది. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. ఆ రెండు చిత్రాలకు రూ.100 కోట్ల వరకూ నష్టపోయా.అసలు మీపై పెట్టిన కేసు ఏమిటి..?రూ.14 కోట్లు మోసం చేశానని నా మీద అభియోగం మోపారు. మహాబలిపురంలో ఉన్న నా 10 ఎకరాల స్థలాన్ని ఒకరికి తెలియకుండా మరొకరికి.. ఇలా పలువురు వ్యక్తులకు అమ్మానని కేసు పెట్టారు. సుదీర్ఘంగా న్యాయ విచారణ జరిగింది. న్యాయస్థానం నన్ను నిర్దోషిగా తేల్చింది. ఇప్పటికీ ఆ ఆస్తులు నా పేరు మీదే ఉన్నాయి. మీ స్టొరీనే సినిమా కథలా వుంది.. సినిమా చేసే అవకాశం ఉందా ? వెబ్ సిరీస్ చేస్తే వెయ్యి ఎపిసోడ్లు పెట్టొచ్చు. అయితే, నా కథ ఎవరు చూస్తారు(నవ్వుతూ)ఫైనాన్స్ బిజినెస్ ఎంత లాభదాయకం ? మేము సంపాదించింది ఫైనాన్స్ బిజినెస్ వలనే. నాన్న గారి నుంచి అది నాకు వచ్చింది. ఐతే సినిమా మేకింగ్ అనేది ఎప్పటికీ ఓ జూదమే. ఆ గ్యాంబ్లింగ్ వలనే నాకు రెండు సినిమాల్లో వందకోట్లు పోయింది. అయితే ప్రజెంట్ సినిమా నిర్మాణం బావుందని వింటున్నాను. నిర్మాతకు పది రూపాయలు మిగులుతాయని బయట అంటున్నారు. ఈ జర్నీలో మీరు నేర్చుకున్న పాఠం ? 24 క్రాఫ్ట్స్ మన గ్రిప్‌లో ఉన్నప్పుడే సినిమా తీయాలి.ఖలేజా సినిమాకి సి కళ్యాణ్ గారు ఒక పార్టనర్ కావడానికి కారణం ? కాదండీ.., నా డబ్బుతో ఆయన సినిమా పూర్తి చేశారు. కష్టాల్లో వున్నప్పుడు నాకు దేవుడే సపోర్ట్‌గా వున్నారు. ఎలాంటి సినిమాలు చేయాలని వుంది ? కథనే నా హీరో. కథని నమ్ముకొని సినిమా చేస్తాను. పెద్ద సినిమాలు, కంటెంట్ బేస్డ్ సినిమాలు అన్ని రకాల సినిమాలు చేయాలని వుంది. తర్వలోనే ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ వుండే అవకాశం వుంది. -
పవన్ కల్యాణ్, మహేశ్ బాబు సినిమాలతో రూ.100 కోట్ల నష్టం: టాలీవుడ్ నిర్మాత సంచలన కామెంట్స్
టాలీవుడ్ నిర్మాత సింగనమల రమేశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇద్దరు పెద్ద హీరోలతో తీసిన సినిమాల వల్ల దాదాపు రూ.100 కోట్లు నష్టపోయినట్లు ఆయన తెలిపారు. తాజాగా ఏర్పాటు ప్రెస్మీట్లో మాట్లాడిన నిర్మాత మహేశ్ బాబు ఖలేజా, పవన్ కల్యాణ్ కొమరం పులి చిత్రాల గురించి మాట్లాడారు. ఆ రెండు సినిమాలతో వచ్చిన నష్టం గురించి ఆయన వెల్లడించారు.కొమరం పులి, ఖలేజా లాంటి చిత్రాలతో భారీగా నష్టపోయినట్లు సింగనమల రమేశ్ వెల్లడించారు. ఆ రోజుల్లో కేవలం ఏ సినిమా అయినా ఏడాదిలోపే పూర్తి చేసేవాళ్లమని చెప్పుకొచ్చారు. నా దురదృష్టం వల్లనేమో కొమరం పులి, ఖలేజా సినిమాలు నిర్మించడంలో ఎక్కువ టైమ్ తీసుకొవాల్సి వచ్చిందన్నారు. ఈ రెండు ఆలస్యమవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయని రమేశ్ అన్నారు. ఈ రెండు సినిమాలతో నష్టపోయినా నాకు.. ఏ హీరో కూడా సపోర్ట్ చేయలేదన్నారు. కష్టకాలంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా ఇండస్ట్రీ నుంచి అయ్యో పాపం అని.. కనీసం పలకరించిన పాపాన పోలేదని నిర్మాత రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.కాగా.. 2011లో గచ్చిబౌలిలో హైదరాబాద్ వ్యాపారవేత్తను బెదిరించి రూ.12 కోట్లు స్వాహా చేశారని రమేష్ బాబుపై కేసు నమోదైంది. ఈ కేసులో జనవరి 31 2025న రమేష్ బాబును కోర్టు నిర్దోషిగా తేల్చింది. అందువల్లే ఆయన తాజాగా ప్రెస్‌మీట్ నిర్వహించారు. కొమరం పులి, ఖలేజా సినిమాల పైన 100 కోట్లు నష్టపోయాను.హీరోలు కనీసం 'అయ్యో పాపం' అని కూడా అనలేదు- Singanamala Ramesh (Producer and Film Financier) pic.twitter.com/6KQtgFCaBZ— idlebrain.com (@idlebraindotcom) February 5, 2025 -
శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణికి చేదు అనుభవం
-
భారీ ర్యాలీతో టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు నామినేషన్
-
వైరల్ అవుతున్న శింగనమల వైసీపీ అభ్యర్థి విడియో
-
శింగనమల టీడీపీలో లుకలుకలు
-
‘జగనన్న మాటే నాకు శిరోధార్యం’
సాక్షి, తాడేపల్లి: ఓ దళిత మహిళగా నియోజకవర్గ సమస్యలను ప్రశ్నిం చడం నేరమా? అని ఎల్లో మీడియాను నిలదీశారు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి. నీటి సమస్యలపై అధికారుల్ని నిలదీస్తే.. ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న మాటే తనకు శిరోధార్యమని, ఊపిరి ఉన్నంతవరకూ జగనన్న బాటలోనే నడుస్తానని ఎమ్మెల్యే పద్మావతి స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మీడియాతో మాట్లాడుతూ.. నా మాటల్ని ఎల్లోమీడియా వక్రీకరించింది మొన్న నేను ఫేస్బుక్ లైవ్‌లో నీటి కేటాయింపులపై మాట్లాడాను. మా దగ్గర స్థానిక అధికారులు సమస్యల పరిష్కారంపై సక్రమంగా స్పందించడం లేదనే ఆవేదనతో మాట్లాడాను. అయితే, నా ఆవేదనను ఎల్లోమీడియా పూర్తిగా వక్రీకరించి హైలెట్ చేసింది. నా మాటలు తప్ప వేరే వార్తలేమీ లేనట్టు ఒక రోజంతా పనిగట్టుకుని హైలెట్ చేసింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగనన్నకు నేను వ్యతిరేకంగా మాట్లాడినట్లు చిత్రీకరించారు. ఎల్లోమీడియా ఈ విధంగా వ్యవహరించడాన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. మరి, అదే వీడియోలో ‘జగనన్న స్ఫూర్తితోనే మేము ముందుకెళ్తున్నాం..’ అని చెప్పాను కదా..? ఆ మాటల్ని ఎల్లోమీడియా ఎందుకు హైలెట్ చేయలేదు. కొన్ని ఛానెళ్లు ఆ మాటల్ని కట్ చేసి మిగతా విషయాల్ని మాత్రమే ఎందుకు హైలెట్ చేశాయని ప్రశ్నిస్తున్నాను. అధికారుల తీరుపై ఆవేదనతో మాట్లాడా.. మా నియోజకవర్గంలో నీటి సమస్య పరిష్కారానికి సంబంధించి స్థానిక అధికారులతో నేను చాన్నాళ్ల నుంచి మాట్లాడుతూనే ఉన్నాను. కానీ, ఎలాంటి పరిష్కారం లభించనందున.. సీఎం గారికి చెబితేనే ఏ పనైనా అవుతోందని.. లేకుంటే, మా మాటల్ని ఎందుకు పట్టించుకోవడం లేదని అధికారులను ప్రశ్నించాను. ఆ మాటల్ని కాస్తా.. ఎల్లోమీడియా తమకు అనుకూలంగా నేనేదో సీఎం జగనన్నను తూలనాడినట్లు.. ఆయన్ను ప్రశ్నించినట్లుగా కథనాలు రాశారు. వారి ఛానళ్లుల్లో ప్రసారం కూడా చేశారు. అధికారులపై ఆవేదనతో మాట్లాడాను తప్ప ఎల్లోమీడియా ప్రచారంలో ఉన్న అంశాలేమీ నిజంకాదు. ఎల్లోమీడియా కథనాల్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఈనాడు తప్పుడు కథనాన్ని ఖండిస్తున్నాను ఫేస్బుక్ లైవ్‌లో మాట్లాడి దాన్ని ఎవరు మార్చే వీలు ఉండదు కదా..? మరి, ఆ లైవ్‌లో నేనేం మాట్లాడానో.. ఎవరి గురించి ఏం మాట్లాడానో అందరికీ తెలుసు కదా..? అయితే, ఈరోజు ఈనాడు పత్రిక ఏదేదో ఊహించి అసత్య కథనాన్ని ప్రచురించింది. ‘దళిత మహిళ ప్రశ్నించడమే నేరమా..?’ అనే శీర్షికన కథనం ఇచ్చారు. ఒక రాజకీయ పార్టీ నేతగా మాట్లాడిన నేను.. ఎవరిని ప్రశ్నించానో.. ఏ అంశంపై నిలదీశాననేది కూడా స్పష్టంగా రాయాలి కదా..? నేను ప్రశ్నించింది అధికారులనే కానీ.. జగనన్నను కాదని మరోమారు స్పష్టం చేస్తున్నాను. జిల్లాస్థాయిలో పరిష్కారం అవ్వాల్సిన సమస్యలపై అధికారులు స్పందించనప్పుడు..జగనన్న దగ్గరకు వెళ్తేనే పనులు అవుతున్నాయని అన్నాను. అందులో తప్పేంటి..?. ఒక వారం రోజుల నీళ్ల కేటాయింపునకూ అధికారులు కుదరదనప్పుడు నాకు బాధ కలిగింది. నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎవరికి వారు తమ ప్రాంతాల్లోని సమస్యలు వేగవంతంగా పరిష్కారం కావాలనే తొందరలో అధికారులపైనా కొన్ని వత్తిళ్లు చేయడం సాధారణం. మరి, అలాంటి చిన్న చిన్న విషయాల్ని కూడా హైలెట్ చేసి మా రాజకీయ భవిష్యత్తును దెబ్బతీసే ఎల్లో మీడియా పైత్యం ఎంతవరకు సబబు..? సొంతచెల్లెలుగా చూసుకున్న జగనన్న రాజకీయాల్లోకి ప్రవేశించే సమయంలో నేనేదో భారీస్థాయిలో భవిష్యత్తును ఊహించి వచ్చిన మనిషిని కాదు. మేము జగనన్నను 2014 ఎన్నికల ముందు కలిసినప్పుడు.. ఆయనతో మాట్లాడిన రోజే మేమొక స్పష్టతకు వచ్చాం. ప్రజలకు సేవ చేసేందుకు క్షేత్రస్థాయిలో పనిచేస్తే ఖచ్చితంగా జగనన్నలాంటి నాయకుడితోనే కలిసి పనిచేయాలనుకున్నాము. రాష్ట్రాభివృద్ధి, పేదల సంక్షేమంలో వారి విజన్‌ను కలిసిన మొదటి రోజునే మేము అర్ధం చేసుకున్నాం కాబట్టి.. వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరడం జరిగింది. ఇప్పటి వరకు కూడా జగనన్న తన కుటుంబ సభ్యుల్లాగా.. సొంతచెల్లెలుగా నన్ను చూసుకున్నారు. వారు చెప్పిందే వేదవాక్కుగా పనిచేయడమే తప్ప.. ఏనాడూ వారిని ధిక్కరించే మనస్తత్వం నాదికాదు. ఈ విషయాన్ని మీడియా మొత్తానికి స్పష్టం చేస్తున్నాను. జగనన్న చెబితే పదవి లేకున్నా పార్టీ కోసం పనిచేస్తా నా రాజకీయ భవితవ్యం జగనన్న చేతుల్లోనే ఉంది. ఆయన నన్ను మరలా అదే నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీచేయమన్నా చేస్తాను. లేదంటే, వేరొకరికి అక్కడ అవకాశమిస్తానన్నా .. నేను అసెంబ్లీ సీటు వదులుకుని పార్టీకి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాను. అలాంటి నేను వైఎస్ఆర్సీపీని వీడిపోతున్నట్లు.. జగనన్నను వ్యతిరేకిస్తున్నట్లు భిన్న కథనాలు ఎల్లోమీడియాలో రావడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. జగనన్న ఎస్సీలకు చేసిన మేలు దేశచరిత్రలో లేదు ఎస్సీలకు జగనన్న చేసిన మేలు రాష్ట్రంలోనే కాదు. దేశచరిత్రలోనే గుర్తుండిపోయేలా ఆయన మేలు చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పనిచేసే నాయకుడిగా జగనన్న పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా పదవులు, పనుల్లో 50 శాతం వాటా పొందుతూ రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధిలోకి రావడం అందరూ కళ్లకు కట్టినట్లు చూస్తోన్న నిజం. కనుకనే, ఈరోజు రాష్ట్రంలోని అన్ని వర్గాలూ జగనన్న పరిపాలన పట్ల చాలా సంతోషంగా ఉన్నారు. ఆయన చిత్రపటాలు ప్రతీ పేదింట పెట్టుకుని ఆశీర్వదిస్తున్నారు. సమస్యలపై దళిత మహిళ పోరాడకూడదా..? చంద్రబాబును భుజాలపై మోస్తోన్న ఈనాడు పత్రికతో సహా ఇతర ఎల్లోమీడియా ఏం కోరుకుంటున్నాయి..? ఎమ్మెల్యేలు వారి నియోజక వర్గాల సమస్యల పరిష్కారం కోసం పనిచేయకూడదనుకుంటున్నాయా..? మా నియోజకవర్గం సమస్యలపై నేను దళిత మహిళగా పోరాడకూడదని మీర నుకుంటున్నారా..? అధికారుల్ని ప్రశ్నిస్తేనే.. మీరు నామీద లేనిపోని కబుర్లు అల్లి విషప్రచారం చేశారే..? జగనన్నకు అపాదిస్తే దళిత మహిళ నోటిని కట్టడి చేయవచ్చనుకున్నారా..? చంద్రబాబు, ఎల్లోమీడియా కట్ట గట్టుకుని వచ్చి వైఎస్ఆర్సీపీ నాయకులుపై, జగనన్న మీద ఎంత విషప్రచారం చేసినా.. మీరు ఆశించేది జరగనే జరగదు. పైగా, మీరెంత తొక్కాలనుకుంటే అంతకంతకు పైస్థాయిలో ఎదుగుతామని తెలుసుకోండి. ఇప్పటికైనా ఈనాడు దినపత్రిక తప్పుడు రాతలు రాయడం మానేయకపోతే దళిత మహిళల ఆగ్రహం ఎలా ఉంటుందో చవిచూస్తారని హెచ్చరిస్తున్నాను.. (అంటూ ఈనాడు దినపత్రికను ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి చింపేశారు) నా జోలికొస్తే కోర్టుకీడుస్తాను చంద్రబాబుకు, ఇతర ఎల్లోమీడియాకు ఒక దళిత మహిళగా నేనొక హెచ్చరిక చేస్తున్నాను. నేను రైట్ పాత్‌లోనే నడుస్తున్నాను. ఊపిరున్నంత వరకు జగనన్న నాయకత్వంలోనే వైఎస్ఆర్సీపీలోనే పనిచేస్తాను. నేను రైట్‌గానే ఆలోచిస్తున్నాను. జగనన్నకు నన్ను దూరం చేయాలనే కుట్రబుద్ధితో ఎవడైనా నా జోలికొస్తే.. ఏ స్థాయి వ్యక్తినైనా కోర్టుకీడ్చి బుద్ధిచెబుతాను. చీడపురుగు చంద్రబాబు దేశం వదిలిపోవాలి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే నారా చంద్రబాబు నాయుడు సిగ్గుమాలిన, దిక్కుమాలిన రాజకీయానికి దిగజారిపోతున్నాడు. ఆయనకు తోడుగా ఈనాడు రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ5లు పనిచేస్తూ.. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలుపై, ఇతర పార్టీ నేతలపై, ప్రభుత్వంపై విషాన్ని కక్కుతున్నారు. సొంత మామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును నేనొక ప్రశ్న అడుగుతున్నాను. నీ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలుండవా..? అలాంటిది, మా పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలతో మాకు గొడవలుంటే.. ఎవరి నియోజకవర్గాల్ని వారు అభివృద్ధి చేసుకునే క్రమంలో చిన్నపాటి వివాదాలు పడితే.. మీకేంటి అంత బాధా..? అధికారుల్ని ప్రశ్నించినంతమాత్రానా.. దాన్ని జగనన్నకు అపాదించి నీ ఎల్లోమీడియాలో ప్రచారం చేస్తావా..? నీ కుట్ర బుర్రలో నుంచి వచ్చిన విషపు ఆలోచనేనని మేము గ్రహించాము. జగనన్న రాజకీయ వ్యూహానికి భయపడి నువ్వు ఆంధ్రలో కాకుండా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌లో ఉంటున్నావు. అందుకే, నిన్ను శాశ్వతంగా ఇక్కడ లేకుండా దేశం వదిలిపోయేలా చేయాలని జగనన్నను నేను కోరుకుంటున్నాను. చంద్రబాబు, ఈనాడు, ఏబీఎన్, టీవీ5లాంటి చీడపురుగుల్ని ఏరిపారేయాల్సిన అవసరముందని ప్రజలకు కూడా నేను పిలుపునిస్తున్నాను. -
బండారు శ్రావణిని పక్కన పెట్టిన టీడీపీ!
అధికారంలో ఉన్నప్పుడే కాదు.. విపక్షంలోనూ బడుగు, బలహీన వర్గాల పట్ల చంద్రబాబు చిన్న చూపు ప్రదర్శిస్తున్నారు. అగ్ర కులాల వారే పెత్తనం చెలాయించేలా చూస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో బంతాట ఆడుతూ అడుగడుగునా అవమానాలకు గురి చేస్తున్నారు. టీడీపీ పెత్తందార్ల పార్టీనే అని నిరూపిస్తున్నారు. జిల్లాలో పలు నియోజకవర్గాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు.. చంద్రబాబు, చినబాబు లోకేష్‌ల ద్వంద్వ వైఖరిని చెప్పకనే చెప్పేస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, అనంతపురం: పేదలు, బడుగు బలహీన వర్గాల కోసమని ఎన్టీ రామారావు తెలుగు దేశం పార్టీని స్థాపించారు. చెప్పినట్లుగానే పెద్దపీట వేసి సముచిత స్థానం కల్పించారు. ఆయనకు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్న చంద్రబాబు.. ఎన్టీఆర్ సిద్ధాంతాలకు ఫుల్ స్టాప్ పెట్టారు. పార్టీని క్రమంగా పెత్తందార్లకు అడ్డాగా మార్చారు. టీడీపీలో రాజకీయంగా ఎదగాలంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నేతలు నిత్యం పోరాటం చేయాల్సిన పరిస్థితి. ఆత్మాభిమానం చంపుకోలేక ఎంతో మంది ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీ నుంచి బయటకు వస్తున్నారు. శింగనమలలో దారుణంగా.. ఎస్సీలకు కేటాయించిన రిజర్వుడు స్థానాల్లోనూ టీడీపీకి చెందిన అగ్రకులాల నేతలు పెత్తనం చెలాయిస్తున్నారు. శింగనమల నియోజకవర్గంలో ఎస్సీ అభ్యర్థి పరిస్థితి గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అవగతమవుతుంది. తెలుగుదేశం పార్టీ నేత బండారు శ్రావణిని ఇక్కడ డమ్మీగా మార్చారు. టూమెన్ కమిటీ పేరుతో ముంటిమడుగు కేశవరెడ్డి, ఆలం నరసనాయుడును నియమించి అవమానించారు. వీళ్లు చెప్పినట్టే అక్కడ పనులు జరగుతున్నాయి. ఇటీవల శ్రావణి తండ్రిపై దాడి జరిగింది. ఆ సమయంలో ‘యువగళం’ పాదయాత్రలో భాగంగా లోకేష్ జిల్లాలోనే ఉన్నారు. దాడికి పాల్పడిన వారిని మందలించనూ లేదు. దెబ్బలు తిన్న వ్యక్తిని పరామర్శించనూ లేదు. గుండుమల.. ఎస్సీ నేతల విలవిల మడకశిర ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. ఇక్కడ మైనింగ్ మాఫియాకు అధిపతిగా చెప్పుకునే గుండుమల తిప్పేస్వామిదే పెత్తనం. ఆయన నియంత వైఖరిని జీర్ణించుకోలేని ఈరన్న వర్గానికి చెందిన ఎస్సీ నాయకులు పార్టీకి ఆమడదూరం వెళ్లిపోయారు. డబ్బున్న వాళ్లే రాజకీయాలు చేస్తున్నారని, ఎస్సీలను పట్టించుకునే నాథుడే లేరని ఉన్న కొద్దిపాటి ద్వితీయశ్రేణి నాయకులు వాపోతున్నారు. ఇప్పటికే పలు సామాజిక వర్గాల నేతలు పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ఇక్కడ పార్టీకి పరిస్థితి ఏ మాత్రం అనుకూలంగా లేదన్న సర్వేలు అధిష్టానానికి వెళ్లినట్లు తెలిసింది. మైనార్టీ మాట చెల్లని రూక.. 2014లో జరిగిన ఎన్నికల్లో కదిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అత్తార్ చాంద్‌బాషా గెలిచారు. ఆ తర్వాత టీడీపీలోకి వెళ్లారు. ఇప్పుడాయన మాట చెల్లని రూక అయింది. డీడీల కుంభకోణంలో శిక్ష పడిన కందికుంట ప్రసాద్ మాటే పైచేయిగా మారింది. నేరాలకు తెగబడుతున్నా కందికుంటనే చంద్రబాబు, లోకేష్ ప్రోత్సహిస్తున్నారనేది బహిరంగ రహస్యమే. దీంతో ఇక్కడ మైనార్టీలు తెలుగుదేశం పార్టీపై మండిపడుతున్నారు. అంతటా అంతే.. ఉమ్మడి జిల్లాలో అన్ని చోట్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల నాయకుల మాట చెల్లడం లేదు. అధికారంలో ఉన్నప్పుడూ.. ఇప్పుడూ అగ్రకులాల వారు పెత్తనం చెలాయిస్తుండడంతో రగిలిపోతున్నారు. ఇక.. ఎన్నికల ముందు చెప్పినట్లుగానే అధికారంలోకి వచ్చాక సీఎం వైఎస్ జగన్ అన్ని సామాజిక వర్గాలకు సముచితం స్థానం కల్పించారు. పెద్ద ఎత్తున రాజకీయంగానూ పదవులు కట్టబెట్టారు. చెప్పాడంటే.. చేస్తాడంటే అనేంతలా పేరు తెచ్చుకున్నారు. అన్ని వర్గాల మనసులనూ గెలుచుకున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన టీడీపీలోని బడుగు బలహీన వర్గాల నాయకులు ఇప్పటికే పలు చోట్ల అధికార పార్టీలో చేరుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వలసల తాకిడి మరింత ఎక్కువయ్యేలా కనిపిస్తోంది. టీడీపీకి బడుగు బలహీన వర్గాల నేతలు గట్టి షాక్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. -
‘సీఎం జగన్ వల్లే మహిళా సాధికారత సాధ్యం’
సాక్షి, అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక న్యాయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వల్లే సాధ్యం అయ్యిందని ఏపీ స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీచరణ్ అన్నారు. గురువారం సాయంత్రం ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆధ్వర్యంలో.. సింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రంలో నిర్వహించిన సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభకు వైఎస్సార్సీపీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నాయకులు మంత్రులు, ఎమ్మెల్యేలు, పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ►‘‘సామాజిక సాధికార యాత్ర అన్ని నియోజకవర్గాల్లో కొనసాగుతుంది. సీఎం జగన్ పాలనపై ఎల్లో మీడియా వక్రీరించే కథనాలు ఆపాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు జరుగుతున్న మంచిని చూడాలి. సామాజిక న్యాయం, మహిళా సాధికారత జగన్ వల్లే సాధ్యం అయ్యింది. టీడీపీ హామీలు నమ్మొద్దు. జగన్ మళ్లీ సీఎం అయితేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయి. ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీలు సీఎం జగన్‌కు అండగా నిలబడాలి’’ అని మంత్రి ఉషాశ్రీచరణ్ ప్రసంగించారు. ►‘‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాతికేళ్లు సీఎం గా ఉంటే పేద విద్యార్థులు ఉన్నత పదవులు అధిరోహిస్తారు. చంద్రబాబు అమరావతి పేరుతో మాయా ప్రపంచం సృష్టించారు. సీఎం జగన్‌ను ఎదుర్కోవడం నారా లోకేష్ వల్ల కాదు. జగన్‌ను భయపెట్టే మగాడు ఇంకా పుట్టలేదు. న్యాయం గెలిపించాలని భువనేశ్వరి అడగాల్సిన అవసరం లేదు. చంద్రబాబు విషయం లో న్యాయం గెలుస్తుంది.. చట్టం కూడా గెలుస్తుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాయమాటలు నమ్మొద్దు అని ఎంపీ నందిగాం సురేష్ ప్రజలను కోరారు. ►పవన్ కల్యాణ్, నారా భువనేశ్వరి ఎన్ని యాత్రలు చేసినా జగన్ జైత్రయాత్ర ఆపలేరు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లను అగ్రభాగాన నిలబెట్టిన ఘనత జగన్‌దే. వెనుకబడిన వర్గాలు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అండగా నిలవాలి అని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ పిలుపు ఇచ్చారు. ►‘‘జైలుకు వెళ్లిన తర్వాత చంద్రబాబు కు ప్రజలు గుర్తిస్తున్నారు. అబద్ధపు హామీలతో మరోసారి మోసం చేసేందుకు టీడీపీ - జనసేన సిద్ధం అవుతున్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లకు 2.38 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌దే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన దేశానికే ఆదర్శం. పేదలకు అండగా జగన్ ప్రభుత్వం ఉంది. జగన్ సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శం’’ అని ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. ►‘‘టీడీపీ పాలనలో సామాజిక సాధికారత నిర్లక్ష్యానికి గురైంది. చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకులా చూశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లను మంత్రులు, ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు, ఎంపీలు గా చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దే. ఏపీలో ముస్లిం మైనార్టీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ఓ చరిత్ర. మాకు ప్రజలతోనే పొత్తు అని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ప్రసంగించారు. -
టీడీపీ బండారు శ్రావణికి ఎదురుదెబ్బ
సాక్షి, అనంతపురం: శింగనమల నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి బండారు శ్రావణి శ్రీకి ఎదురుదెబ్బ తగిలింది. ఓ మహిళ ఆత్మహత్య కేసులో ఆమె తండ్రి బండారు రవికుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురంలో మూడు రోజుల క్రితం రాజమ్మ(45) ఆత్మహత్య చేసుకుంది. బండారు రవికుమార్ వేధింపులే కారణమంటూ రాజమ్మ సెల్ఫ్ విడియో తీసింది. భూ వివాదంలో బండారు రవికుమార్ వేధిస్తున్నారంటూ అందులో ఆరోపించింది బాధితురాలు. ఈ వీడియో బయటకు రావడంతో.. కేసు నమోదు చేసి టీడీపీ నేత రవికుమార్‌ను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. -
‘బండారు’ భూదాహానికి దివ్యాంగురాలి బలి
అనంతపురం: అధికారం ఉన్నా లేకపోయినా టీడీపీ నేతల ఆగడాలు ఆగడం లేదు. నేటికీ భూ దందాలకు పాల్పడుతున్నారు. అమాయకుల ప్రాణాలు బలిగొంటున్నారు. గత ఎన్నికల్లో శింగనమల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బండారు శ్రావణి తండ్రి బండారు రవి కుమార్ భూ దాహానికి తాజాగా ఓ దివ్యాంగురాలు బలైంది. తనకు జరిగిన మోసాన్ని ఆ అభాగ్యురాలు ఉరేసుకోబోతూ సెల్ఫీ వీడియోలో వివరించడం విషాదం నింపింది. పోలీసులు తెలిపిన మేరకు.. బుక్కరాయసముద్రం మండల పరిధిలోని సిద్దరాంపురం గ్రామానికి చెందిన నాగరాణి అలియాస్ రాజమ్మ (44) దివ్యాంగురాలు. ఆమెకు గ్రామ సర్వే నంబర్–218.2లో 3.67 ఎకరాల భూమి ఉంది. కొన్ని రోజుల క్రితం ఈ భూమిని రాజమ్మ తల్లి సాకే నాగమ్మ తన చిన్నాన్న అయిన బండారు నారాయణస్వామి వద్ద రూ. 25 వేలకు కుదువ పెట్టింది. అయితే, రూ. కోటి విలువ చేసే ఈ భూమిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని నారాయణ స్వామి కుమారుడు బండారు రవి కుమార్ భావించాడు. ఇటీవల నాగమ్మ మృతి చెందగా, కుదువ పెట్టిన భూమిని విడిపించుకునేందుకు 10 రోజుల క్రితం రూ. 25 వేలకు వడ్డీ, అసలు కలిపి రూ.1.25 లక్షలు తీసుకుని బండారు రవి కుమార్ ఇంటికి రాజమ్మ వెళ్లింది. అయితే, ఆ భూమి తమదని, వేరే వారికి అమ్మేస్తున్నామని ఆయన దౌర్జన్యం చేశాడు. దీంతో రాజమ్మ ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేసింది. జరిగిన విషయాన్ని తన బంధువులతో చెప్పి బోరున విలపించింది. ఈ క్రమంలోనే గురువారం తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకునికి బలవన్మరణానికి పాల్పడింది. ఉరేసుకునే ముందు తనకు జరిగిన అన్యాయాన్ని సెల్ఫోన్లో సెల్ఫీ వీడియోలో వివరించింది. శింగనమల నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ బండారు శ్రావణి తండ్రి బండారు రవి కుమార్ తన భూమిని లాక్కున్నారని వాపోయింది. ఏవో మాటలు చెప్పి ఇటీవల తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకున్నాడని ఆరోపించింది. రాజమ్మ ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన బంధువులు ఇంటి తలుపులు పగులగొట్టి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించింది. మృతురాలి సోదరుడు, ఎంపీటీసీ నాగేంద్ర సమాచారం మేరకు సీఐ నాగార్జున రెడ్డి, ఎస్ఐ శ్రీనివాసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టు కోసం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రాజమ్మ సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఈ నెల 17న శింగనమలలో సీఎం జగన్ పర్యటన
-
శింగనమల ప్రజల 60 ఏళ్ళ ఆకాంక్ష నెరవేరిన వేళ
-
వంద అడుగుల కొండపై నుంచి జారిపడి...
-
వంద అడుగుల కొండపై నుంచి జారిపడి...
సాక్షి, అనంతపురం: జిల్లాలోని శింగనమల మండలం గంపమల్లయ్యస్వామి కొండపై శనివారం విషాదం చోటు చేసుకుంది. గంపమల్లయ్య కొండపై నుంచి జారిపడి పూజారి పాపయ్య మృతి చెందాడు. ఎత్తయిన కొండల మధ్య అడవిలో కొలువైన గంపమల్లయ్య స్వామివారికి పూజలు చేస్తుండగా పాపయ్య ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. దాదాపు వంద అడుగుల పైనుంచి జారిపడడంతో ఆయన అక్కడికక్కడే దుర్మరణం చెందారు. చదవండి: పెళ్లి చేసుకుంటానని పిలిచి లాడ్జికి తీసుకెళ్లి.. -
లోకేష్ పర్యటనపై శ్రావణి తీవ్ర అసంతృప్తి
సాక్షి, అమరావతి : గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ప్రతిపక్ష టీడీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అనంతపురం జిల్లాలో ఆ పార్టీల నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. పార్టీలో వ్యక్తుల ఆధిపత్య పోరు కారణంగా సీనియర్ నేత, ఎమ్మెల్సీ శమంతకమణితో పాటు ఆమె కుమార్తె, మాజీ ఎమ్మెల్యే యామినిబాల ఇటీవల టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే శమంతకమణి నిష్క్రమణతో నేతల మధ్య విభేదాలు మరింత పెరిగాయి. సింగనమల నియోజకవర్గ ప్రస్తుత ఇంఛార్జీ బండారు శ్రావణి పార్టీ నేతల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తనకు కాకుండా టీడీపీ నేత ఎంఎస్ రాజు వర్గానికి ప్రాధాన్యత ఇవ్వటంపై శ్రావణి అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఇరువర్గల మధ్య పచ్చగడ్డేస్తే మండే విధంగా పరిస్థితి తారాస్థాయికి చేరింది. లోకేష్ పర్యటనకు దూరంగా శ్రావణి.. ఈ క్రమంలోనే టీడీపీ నేత నారా లోకేష్ అనంతపురం పర్యటన విభేదాలను బయపడేసింది. గత ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై సింగనమల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందిన శ్రావణి.. లోకేష్ పర్యటనకు దూరంగా ఉన్నారు. పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోగా.. ఎంఎస్ రాజుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు. నేతల పర్యటనపై తనకు ఏమాత్రం సమాచారం ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో లోకేష్ పర్యటనకు దూరంగా ఉన్నారు. మరోవైపు అనంతపురం పర్యటన సందర్భంగా లోకేష్ కరోనా నిబంధనలు ఉల్లంఘించారు. కనీస సామాజిక దూరం పాటించకుండా.. నిబంధనలకు విరుద్ధంగా జనసమీకరణ చేశారు. కరోనా జాగ్రత్తలు పక్కనపెట్టి భారీ కాన్వాయ్ నడుమ పర్యటన చేశారు. లోకేష్ తీరుపై స్థానిక నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నారా లోకేష్ అబద్ధాలు బట్టబయలు.. శుక్రవారం జిల్లాలోని కరడికొండ, ధర్మాపురం, మిడుతూరు, రాందాస్ పేట, ,కామారుపల్లి గ్రామాల్లో వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన లోకేష్.. లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని ఆరోపణలు చేశారు. రైతులు ఇబ్బందుల్లో ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. అయితే వరద నష్టంపై కలెక్టర్ గంధం చంద్రుడు వాస్తవాలు బహిర్గతం చేశారు. అనంతలో భారీ వర్షాలకు 38.53 కోట్ల పంట నష్టం జరిగిందని తెలిపారు. 13861 హెక్టార్లలో పంటలు నష్టపోయాయని వివరించారు. నష్టపోయిన రైతులకు వాతావరణ బీమా, ఇన్ పుట్ సబ్సిడీ అందిస్తామని హామీ ఇచ్చారు. సమగ్ర నివేదికను ప్రభుత్వానికి పంపామని, రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. సాధారణం కన్నా 60 శాతం అధికంగా వర్షాలు నమోదు కావటంతో క్రాప్ డ్యామేజ్ జరిగిందని కలెక్టర్ వెల్లడించారు. దీంతో నారా లోకేష్ అబద్ధాలు మరోసారి బట్టబయలు అయ్యాయి. -
ఆటో డ్రైవర్ నమ్మకద్రోహం!
ఆటో డ్రైవర్‌ను నమ్మడమే ఆ మహిళా అధికారి తప్పయ్యింది. ప్రతి నెలా భారీ మొత్తంలో తీసుకొస్తున్న ‘పింఛన్’ నగదుపై ఆ డ్రైవర్ కన్నుపడింది. తనమిత్రుల ద్వారా దోపిడీకి కుట్ర పన్నాడు. పథకం ప్రకారం తను కాకుండా మరొక మిత్రుడి ఆటోలో ఆమె ఎక్కేలా చేసి మరొక మిత్రుడి ద్వారా మార్గం మధ్యంలో బెదిరించి రూ.16 లక్షల దోపిడీకి తెగబడ్డాడు. ఈ హఠాత్పరిణామంతో ఆ అధికారి గట్టిగా కేకలు వేశారు. సమీపంలోని గ్రామస్తులు అప్రమత్తమవడం, పోలీసులూ రంగప్రవేశం చేయడంతో గంటన్నర వ్యవధిలోనే ఆ దొంగను పట్టుకున్నారు. అతడితో సహా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సాక్షి, యల్లనూరు/పుట్లూరు: పింఛన్‌దారులకు అందించే రూ.16 లక్షల సొమ్మును కొందరు దుండగులు పంచాయతీ కార్యదర్శిని బెదిరించి దోపిడీ చేసిన కేసును పోలీసులు 90 నిమిషాల్లో ఛేదించారు. ఈ కేసుకు సంబందించిన వివరాలను తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు శుక్రవారం పుట్లూరు పోలీస్ స్టేషన్లో మీడియాకు వెల్లడించారు. నార్పల మండల కేంద్రానికి చెందిన నాగలక్ష్మి యల్లనూరు మండలం చింతకాయమంద గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈమె ప్రతి రోజూ నార్పల నుంచి ఎ.కొండాపురానికి బస్సులో వెళ్లి, అక్కడి నుంచి ఆటోలో చింతకాయమందకు చేరుకునేవారు. ఎ.కొండాపురం నుంచి ఆంజనేయులు అనే వ్యక్తి ఆటోలో ప్రయాణించేవారు. ప్రతి నెలా పింఛన్ బట్వాడా కోసం రూ.లక్షల్లో నగదు తీసుకుని వెళ్తుండేది. ఈ విషయాన్ని ఆంజనేయులు గమనించాడు. ఎలాగైనా పింఛన్ డబ్బును కాజేయాలని పథకం వేశాడు. తన మిత్రులైన కుళ్లాయప్ప, శ్రీనివాసులు, సుధాకర్‌లతో కలిసి చోరీకి పథకం వేశాడు. అమలు చేశారిలా... వైఎస్సార్ పింఛన్ కానుక కింద నవంబర్ నెలకు సంబంధించిన డబ్బును ఒకటో తేదీన పంపిణీ చేయాల్సి ఉంది. అక్టోబర్ 31న పంచాయతీ కార్యదర్శి నాగలక్ష్మి యల్లనూరు ఆంధ్రాబ్యాంకులో రూ.16 లక్షల నగదును డ్రా చేశారు. ఆ నగదును తీసుకుని నార్పలకు వెళ్లిన ఆమె శుక్రవారం ఉదయం చింతకాయమంద గ్రామంలో పింఛన్లు పంపిణీ చేయడానికి ఆర్టీసీ బస్సులో ఎ.కొండాపురం చేరుకున్నారు. పథకం ప్రకారం ఆంజనేయులు ఆమె ఎక్కడ వస్తోందో ఫోన్ చేసి అడిగాడు. ఆమె బస్సు దిగానని చెప్పిన తర్వాత ఈ రోజు తన ఆటోను ఫైనాన్స్ వారు తీసుకెళ్లారని, రాలేకపోతున్నానని చెప్పాడు. దీంతో ఆమె మరొక ఆటో కోసం అలా ముందుకు వచ్చింది. అప్పటికే ఆంజనేయులు మిత్రుడైన శ్రీనివాసులు ఆటో సిద్ధంగా ఉంచుకున్నాడు. ఆమెను ఆటోలో ఎక్కించుకున్నాడు. ఆదే ఆటోలో కుళ్లాయప్ప కూడా ప్రయాణికుడిగా కూర్చున్నాడు. ఈ ఆటోను సుధాకర్ ద్విచక్రవాహనంలో అనుసరిస్తూ వస్తున్నాడు. తిమ్మంపల్లిలో ప్రయాణికులు దిగి వెళ్లగా.. ఆరవీడు గ్రామం సమీపంలో కుళ్లాయప్ప పిడిబాకుతో పంచాయతీ కార్యదర్శిని బెదిరించి.. ఆమె వద్ద నుంచి రూ.16 లక్షల నగదున్న బ్యాగును తీసుకుని అక్కడి అరటి తోటల్లోకి పరారయ్యాడు. గ్రామస్తులు పట్టుకున్న దొంగ, బ్యాగులోని పింఛన్ సొమ్ము గంటన్నర వ్యవధిలోనే దొంగలు పట్టివేత డబ్బు అపహరణ విషయం తెలియగానే స్థానికులు.. పోలీసులు అప్రమత్తమయ్యారు. గంటన్నర వ్యవధిలోనే దొంగలను పట్టుకున్నారు. ఉన్నతాధికారులు పోలీసులను రంగంలోకి దింపి ఆరవీడు నుంచి ఇతర గ్రామాలకు వెళ్లే అన్ని దారులలో గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే సమయంలో గ్రామ ప్రజలను అప్రమత్తం చేయడంతో దాదాపు 1000 మంది పోలీసులకు సహకరిస్తూ దుండగుడి కోసం గాలించారు. దీంతో చిలమకూరు గ్రామ సమీపంలో గ్రామస్తుల సహకారంతో కుళ్లాయప్పను పట్టుకున్నారు. ఇతడిని విచారించగా ఈ పథకంలో ఆటో డ్రైవర్ శ్రీనివాసులు, వాసాపురం గ్రామానికి చెందిన సుధాకర్‌తో పాటు ప్రధాన సూత్రధారి ఆటో డ్రైవర్ ఆంజనేయులు గురించి తెలిసింది. ఈ మేరకు నలుగురినీ అరెస్ట్ చేయడంతో పాటు రూ.16 లక్షల నగదు, ఆటో, ద్విచక్రవాహనం, పిడిబాకును సీజ్ చేశామని డీఎస్పీ తెలిపారు. కాగా ఈ కేసును ఛేదించిన రూరల్ సీఐ దేవేంద్రకుమార్, ఎస్ఐ మోహన్‌కుమార్, కానిస్టేబుల్ లింగరాజు, స్పెషల్ పార్టీ పోలీస్ మోహన్లతో పాటు సిబ్బందిని ఆయన అభినందించారు. -
శింగనమల వాసుల నీటీ కష్టాలు తీరుస్తాను
-
శింగనమలలో ఉద్రిక్తత..జొన్నలగడ్డ అరెస్ట్
-
వానాకాలం వేసవి
అనంతపురం అగ్రికల్చర్: వర్షాకాలంలోనూ భానుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. నాలుగైదు రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. సాధారణం కన్నా రెండు డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇటీవల వర్షాలు కురవడంతో కొద్ది రోజుల పాటు జిల్లా అంతటా వాతావరణం చల్లబడింది. అయితే ఆ వెంటనే ఎండ తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. పగటి ఉష్ణోగ్రతతో పాటు రాత్రిళ్లు ఉక్కపోతను ప్రజలు భరించలేకపోతున్నారు. 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలి విసుగు తెప్పిస్తోంది. గురువారం శింగనమల మండలంలో అత్యధికంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. పామిడి, యల్లనూరు, యాడికి, శెట్టూరు, కూడేరు, నార్పల, తాడిపత్రి, గుంతకల్లు, రాయదుర్గం, పుట్లూరు, కనగానపల్లి, బెళుగుప్ప, చెన్నేకొత్తపల్లి, బుక్కరాయసముద్రం, గార్లదిన్నె, గుత్తి, ధర్మవరం, పెద్దవడగూరు మండలాల్లో 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. మిగతా మండలాల్లో 34 నుంచి 36 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండగా.. కనిష్ట ఉష్ణోగ్రతలు 22 నుంచి 22 డిగ్రీలు ఉన్నాయి. గాలిలో తేమ ఉదయం 77 నుంచి 92 శాతం.. మధ్యాహ్నం 42 నుంచి 52 శాతం మధ్య రికార్డు అయ్యాయి. ఇటీవల కురిసిన వర్షాల తర్వాత గాలిలో తేమ శాతం పాటు ఉష్ణోగ్రతలు కూడా పెరగడం వల్ల వ్యవసాయ, ఉద్యాన పంటలకు చీడపీడలు, తెగుళ్లు సోకే అవకాశం ఉన్నట్లు శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు తెలిపారు. -
అరటాకుతో ఉపాధి
– హోటళ్లలో అరటి ఆకులకు పెరిగిన డిమాండ్ – వందల కుటుంబాలకు ఉపాధి పుట్లూరు: చిన్నపాటి గాలికే చిరిగిపోయి అరటాకు వందల కుటుంబాలకు ఉపాధినిస్తోంది. కష్టాల్లో ఉన్నప్పుడు అరటాకు బతుకైపోయిందంటూ పోల్చుకునే చాలా మందికి.. అదే అరటాకు బతుకుతెరువుగా మారింది. నిత్య జీవితంలో ఒక్క పూట భోజనం లేదా టిఫెన్ అరటి ఆకులో చేయడం ఎంతో గొప్పగా చాలా మంది భావిస్తుంటారు. ఎవరైనా కొత్తగా గ్రామాల్లోకి వస్తే వారికి కడుపునిండా భోజనాన్ని అరటి ఆకులో వడ్డిస్తే... జీవిత కాలం గుర్తుండిపోతోంది. ఇదే చాలా మందికి ఉపాధిగా మారింది. పోటీ ప్రపంచంలో.. పట్టణ ప్రాంతాల్లోని హోటళ్లలో అరటి ఆకులో భోజనం ప్రత్యేకంగా ఉంటోంది. గతంలో ప్లేట్లలో భోజనం వడ్డించే హోటళ్లలో సైతం నేడు అరటి ఆకులు దర్శనమిస్తున్నాయి. అరటి ఆకులో టిఫెన్, భోజనాన్ని అందిస్తే వారి వ్యాపారం మూడు పూవ్వులు.. ఆరు కాయలుగా వర్ధిల్లుతుండడంతో చాలా మంది హోటల్ నిర్వాహకులు అరటి ఆకులపై మక్కువ చూపుతున్నారు. పోటీ ప్రపంచంలో నిలుదొక్కుకునేందుకు నేడు పట్టణ ప్రాంతాల్లోని హోటల్ నిర్వాహకులు అరటి ఆకులకు తొలి ప్రాధాన్యతనిస్తున్నారు. ‘అయిన వారికి అరటి ఆకుల్లో...కాని వారికి కంచాల్లో’ అన్న నానుడిని అనుసరిస్తూ తమ వ్యాపారాన్ని అభివృద్ది చేసుకుంటున్నారు. శింగనమల టాప్ శింగనమల నియోజకవర్గంలోని బుక్కరాయసముద్రం, నార్పల, పుట్లూరు, యల్లనూరు మండలాల్లో అరటి తోటలు విస్తారంటా ఉన్నాయి. ఈ ప్రాంతాల నుంచి ప్రతి రోజూ టన్నుల కొద్ది అరటి ఆకులు పట్టణ ప్రాంతాల్లోని హోటళ్లకు తరలి వెళ్తోంది. అరటి ఆకులను తరలించడాన్ని బతుకు తెరువుగా కొన్ని వందల కుటుంబాలు మార్చుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు హోటళ్లకు శింగనమల నియోజకవర్గం నుంచే అరటి ఆకులు అత్యధికంగా సరఫరా అవుతున్నాయి. తెల్లవారుజాము నుంచే.. అరటి ఆకులు సేకరించడం కోసం కూలీలు ఉదయం 5 గంటలకే తోటల వద్దకు చేరుకుంటారు. ఉదయం పది గంటల్లోపు తాము సేకరించిన అరటి ఆకులను కట్టలుగా కట్టి బస్సులు, ఆటోలలో అనంతపురంతో పాటు ఇతర ప్రాంతాలకు తరలిస్తుంటారు. ఏ కొద్దిగా ఆలస్యమైనా.. వారు పడిన కష్టానికి ఫలితం దక్కకుండా పోతుంది. రైతుల అనుమతి తప్పనిసరి అరటి తోటలలో గెలలు కొట్టిన అనంతరం రైతుల ఇళ్ల వద్దకెళ్లి అరటి ఆకుల సేకరణకు అనుమతి తీసుకుంటారు. ఎక్కువగా మూడవ పంట ముగిసిన అరటి తోటలలో ఆకుల సేకరణకు రైతులు అనుమతిస్తారు. కొన్ని సమయాల్లో అరటి ఆకులు దొరకక కూలీలు ఇతర మండలాలకు సైతం వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలా సేకరించిన 100 అరటి ఆకుల కట్టకు రూ.100 ఇస్తారని కూలీలు చెబుతున్నారు. ఇదే జీవనాధారం. మాకు అరటి ఆకుల సేకరణ మాత్రమే జీవనాదారం. ఎన్నో ఏళ్లుగా అరటి ఆకులను సేకరించి అనంతపురంలోని హోటళ్లకు సరఫరా చేస్తున్నాం. వర్షాలు వచ్చిన సమయంలో కూలి దొరకదు. ఇంటిళ్లపాది కష్టపడితే తప్ప మాకు గిట్టుబాటు కాదు. - నాగయ్య, నడిమిపల్లి, నార్పల మండలం సంస్కృతిలో భాగం.. అరటి ఆకులలో బోజనం చేయడమనేది మన పురాతన సంస్కృతి. నేటి పాశ్చత్య కాలంలో ఈ విషయంగా ప్రజల్లో మరింత ఆసక్తి పెరిగింది. తెల్లవారుజాము నుంచే మేము తోటల్లోకి వెళ్లి అరటి ఆకులను సేకరించాలి. కొన్నిసార్లు కూలి కూడా గిట్టుబాటు కాదు. మేము సేకరిస్తున్న అరటి ఆకులలో ఎంతో మంది కడుపు నిండా అన్నం తినడం మాకు సంతృప్తినిస్తోంది. - రాజేంద్ర, నార్పల -
చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలి
-
రైతులను కూలీలుగా మార్చారు
చంద్రబాబుపై వైఎస్సార్సీపీ శింగనమల సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి ధ్వజం - రద్దు చేస్తామని ఊరికో బెల్టుషాపు పెట్టడమేంటని ఆగ్రహం – శింగనమలలో తల్లీకూతుళ్లు దోచేస్తున్నారని మండిపాటు అనంతపురం : రైతులను కూలీలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి ధ్వజమెత్తారు. ఆదివారం అనంతపురంలోని గుత్తిరోడ్డులో గల కేటీఆర్ ఫంక్షన్ హాలులో వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ ప్లీనరీ జరిగింది. అధ్యక్షత వహించిన జొన్నలగడ్డ పద్మావతి మాట్లాడుతూ, వరుస కరువులతో పంటలు లేక రైతులు కూలీలుగా మారుతున్నారన్నారు. ఆదుకోవడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. అధికారంలోకి వస్తే బెల్టుషాపులు రద్దు చేస్తానని చెప్పిన చంద్రబాబు ఊరికో బెల్టుషాపు పెట్టించారన్నారు. దీంతో ప్రతి గ్రామంలోనూ శాంతిభద్రతల సమస్య తలెత్తుతోందన్నారు. తాను ప్రజా సమస్యలు తెలుసుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే క్రమంలో చేపట్టిన ‘మేలుకొలుపు పాదయాత్ర’పై ఎమ్మెల్యే యామినిబాల ఆరోపణలు చేయించారన్నారు. మరి ఎస్సీ కులంలో పుట్టాలని ఎవరు కోరుకుంటారని స్వయంగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ఎందుకు స్పందించలేదని మండిపడ్డారు. తల్లీకూతుళ్లు (ఎమ్మెల్సీ శమంతకమణి, ఎమ్మెల్యే యామినీబాల) శింగనమల నియోజకవర్గాన్ని దోచుకుంటున్నారన్నారు. ప్రజా సమస్యలను వారు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. శింగనమలో 30 పడకల ఆస్పత్రి కట్టిస్తామని చెప్పి విస్మరించారన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే ఆస్పత్రిని తాము నిర్మిస్తామన్నారు. బుక్కరాయసముద్రం కొండమీద రాయుడు, కోటంక సుబ్రమణ్యం, గూగూడు కుళ్లాయిస్వామి, యల్లనూరు చెన్నకేశవస్వామి, శింగనమల రుష్యశృంగ ముని కొండను అభివృద్ధి చేసి పుణ్యక్షేత్రాలుగా ప్రకటిస్తామన్నారు. పరుసలు, తేర్లు, జాతర్లు వెలుగులోకి తెచ్చి సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తామన్నారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు పాలనపై అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. వైఎస్సార్సీపీ వైపు ప్రజలు చూస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో భేదాభిప్రాయాలు పక్కనపెట్టి అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్దామని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్తా సైనికుడిలా పని చేయాలని కోరారు. సమావేశంలో రైతు విభాగం రాయలసీమ అధ్యక్షుడు శరత్‌చంద్రారెడ్డి, కదలిక ఎడిటర్ ఇమాం, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్లు నార్పల సత్యనారాయణరెడ్డి, నారాయణరెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు పామిడి వీరాంజనేయులు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు పెన్నోబులేసు, యువజన విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి సునీత తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారు : మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి నయవంచన, భూభకాసురుడిలా చంద్రబాబు రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇంకో ఏడాది పూర్తవగానే ఎన్నికల సంవత్సరంలోకి అడుగుపెడతాం. కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి. క్రమశిక్షణ, ఐకమత్యంతో అందరూ ఒకేతాటిపై నడుద్దాం. రైతులను ఆదుకోవడంలోను, కూలీల వలసలు నివారించడంలోను చంద్రబాబు విఫలమయ్యారు. శింగనమల నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. గొప్ప పరిపాలనాధ్యక్షుడిని అందించిన చరిత్ర ఈ నియోజకవర్గానిది. టీడీపీ పాలనలో దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయి. వీరి ఆగడాలు ఎంతో కాలం సాగవనేది గుర్తు పెట్టుకోవాలి. అన్ని వర్గాల ప్రజలనూ మోసగించారు : శంకరనారాయణ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలనూ మోసగించారు. ఎన్నికల ముందు ఇచ్చిన 600పై చిలుకు హామీల్లో ఒక్కటంటే ఒక్కటీ నెరవేర్చలేదు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళనలతో ప్రభుత్వంలో చలనం వస్తోంది తప్ప ప్రజల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పార్టీ కార్యకర్తలు దీన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. వచ్చే ఎన్నికలు మనకు చాలా కీలకం. సమష్టిగా పని చేసి జిల్లాలో రెండు ఎంపీలతో పాటు అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ జెండా ఎగురవేయాలి. జేసీ పట్ల రెడ్డి కులస్తులు అప్రమత్తంగా ఉండాలి : కేతిరెడ్డి పెద్దారెడ్డి, తాడిపత్రి నియోజక్వర్గ సమన్వయకర్త ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి రెడ్డి కులస్తుల ఓట్లు కావాలి. వారిపై ప్రేమమాత్రం ఉండదు. వారి గురించి పట్టించుకోడు. ఇలాంటి వారి పట్ల రెడ్డి కులస్తులు అప్రమత్తంగా ఉండాలి. ఇంటి వద్దకు వెళ్తే ఆయన ఒక్కటే కుర్చీలో కూర్చుంటాడు. తక్కిన అందరూ నిలబడాల్సిందే. ఇదేమైనా పాలేగాళ్ల రాజ్యమా? జేసీ సోదరులు ప్రజా సేవలో కాదు దోచుకోవడంలో ఆదర్శంగా ఉన్నారు. వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ఎయిర్‌పోర్డ్ సిబ్బందిని ప్రశ్నిస్తే కేసులు బనాయించారు. మరి జేసీ దివాకర్‌రెడ్డి ఏకంగా చేయి చేసుకుంటే ఏం చర్యలు తీసుకున్నారు? ఇలాంటి విషయాల్లో ప్రజలకు ఎలాంటి సందేశం పుంపుతారు? వచ్చే ఎన్నికల్లో శింగనమల నుంచి పద్మావతమ్మను గెలిపిస్తేనే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవుతారు. జేసీ తాడిపత్రి ఒక్కటికే ఎంపీ కాదు : ఇమాం, కదలికి ఎడిటర్ జేసీ దివాకర్‌రెడ్డి అనంతపురం పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకూ ఎంపీనే. కానీ ఆయన తాడిపత్రికి మాత్రమే ఎంపీ అన్నట్టు వ్యవహరిస్తున్నాడు. తాడిపత్రికి నీళ్లు తెచ్చుకున్నావు...మరి శింగనమలతో తక్కిన నియోజకవర్గాలకు అవసరం లేదా? ప్రతిదీ తాడిపత్రిని పట్టుకునే రాజకీయం చేస్తున్నావు. ఇది మంచిది కాదు. పద్ధతి మార్చుకో దివాకర్. లేదంటే ప్రజలు వారి పద్ధతి మార్చుకుని తగిన గుణపాఠం చెబుతారు. -
కనికరం లేని ప్రభుత్వం
- రైతుల ఇబ్బందులను ఏమాత్రమూ పట్టించుకోవడంలేదు - కళ్లు తెరిపించేందుకే ‘మేలుకొలుపు’ పాదయాత్ర - వైఎస్సార్సీపీ శింగనమల సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి - యల్లనూరు నుంచి పాదయాత్ర ప్రారంభం అనంతపురం : ‘పది మందికీ అన్నం పెట్టే అన్నదాతలు వరుస కరువులతో పంటలు పండక అప్పుల పాలయ్యారు. కుటుంబం కూడా గడవని పరిస్థితుల్లో వలసలు వెళుతున్నారు. అక్కడా పనుల్లేక భిక్షమెత్తుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. రైతుల కోసం ప్రభుత్వం ఏమైనా చేస్తుందేమోనని మూడేళ్ల పాటు ఎదురుచూశా. ఏమాత్రమూ పట్టించుకోలేదు. ఇక లాభం లేదనుకునే పాదయాత్రకు శ్రీకారం చుట్టాన’ని శింగనమల నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి తెలిపారు. వేసవిలో పాదయాత్ర చేయడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని చాలామంది చెప్పారని, అయితే.. రైతులు పడుతున్న కష్టాల కంటే తాను పడే ఇబ్బందులు పెద్దవి కావని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ జొన్నలగడ్డ పద్మావతి శింగనమల నియోజకవర్గంలో సుమారు 150 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్ర శుక్రవారం యల్లనూరులో ప్రారంభమైంది. ఈ సందర్భంగా తాడిపత్రి సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో పద్మావతి మాట్లాడారు. నియోజకవర్గ రైతాంగ సమస్యలపై కలెక్టరేట్ ముట్టడి, జాతీయ రహదారి దిగ్బంధం, హెచ్చెల్సీ ఎస్ఈ కార్యాలయం ముందు ఆందోళనలు చేశామని గుర్తు చేశారు. అయినా అ«ధికారులు స్పందించలేదన్నారు. ఎమ్మెల్యే యామినిబాల, ఎమ్మెల్సీ శమంతకమణి ప్రతి పనిలోనూ పర్సెంటేజీలు తీసుకోవడంలో మునిగిపోయారు తప్ప ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. కొందరికి స్థలం కొంటే కలిసొస్తుంది, మరికొందరికి పెళ్లయితే కలిసొస్తుంది, ఇంకొందరికి పిల్లలు పుడితే కలిసొస్తుంది... అయితే చంద్రబాబుకు ఇతరులను వెన్నుపోటు పొడవడం కలిసొస్తోందని ఎద్దేవా చేశారు. బిడ్డనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి ఓసారి సీఎం అయ్యారు.. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు, చేనేతలను వెన్నుపోటు పొడిచి 2014లో మరోసారి సీఎం పీఠమెక్కారని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు మరోసారి అవకాశం ఇస్తారా అంటూ ప్రజలను ప్రశ్నించారు. టీడీపీకి తగిన గుణపాఠం నేర్పాలని కోరారు. అలాగే తన పాదయాత్రకు అన్నివర్గాల ప్రజలు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. రైతు సమస్యలపై అడిగేవారేరీ? : అనంత రైతు సమస్యలపై జిల్లాలో ఏ ఒక్క టీడీపీ ప్రజాప్రతినిధీ అడగడం లేదని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. ప్రజా సమస్యలపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నిస్తే ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా మీకు సిగ్గుంటే, జిల్లాపై ప్రేమ ఉంటే సీఎం చంద్రబాబును నిలదీయాలని సూచించారు. ఈ ఏడాది జిల్లాకు 28 టీఎంసీల దాకా నీళ్లొచ్చినా కనీసం 26 ఎకరాలకు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. మంత్రి పరిటాల సునీత, ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి దౌర్జన్యంగా నీళ్లు తరలించుకుపోతే ప్రశ్నించే సాహసం చేయని దద్దమ్మలు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక గేదెకాని, అవు కాని ఇచ్చారా? రైతులు, కూలీలు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. సీఎం అబద్ధాలతో మోసం చేస్తున్నారు : శంకరనారాయణ చంద్రబాబు 2014 ఎన్నికల్లో దాదాపు 600 హామీలిచ్చి అధికారంలోకి వచ్చారని, సీఎం పీఠమెక్కాక ఒక్క హామీ పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు శంకరనారాయణ ధ్వజమెత్తారు. పైగా రోజుకో అబద్ధం చెబుతూ ప్రజలను మోసగిస్తున్నారన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చలువ వల్లే జిల్లాకు హంద్రీ–నీవా ద్వారా కృష్ణా జలాలు వస్తున్నాయని పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఆలూరి సాంబశివారెడ్డి, మాజీ మంత్రి నర్సేగౌడ్, పార్టీ క్రమశిక్షణ సంఘం సభ్యులు ఎర్రిస్వామిరెడ్డి, రైతు విభాగం రాయలసీమ అధ్యక్షులు శరత్‌చంద్రారెడ్డి, పార్టీ మడకశిర సమన్వయకర్త డాక్టర్ తిప్పేస్వామి, మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు నదీం అహమ్మద్, నాయకులు మీసాల రంగన్న, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, యల్లనూరు ఎంపీపీ ప్రసాద్, జెడ్పీటీసీ సభ్యుడు రమణ, సర్పంచ్ ఓబులేసు, ఎస్సీ సెల్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షులు పెన్నోబులేసు, బోయ సుశీలమ్మ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి, ఎంపీసీటీ సభ్యురాలు సునీత తదితరులు పాల్గొన్నారు. -
పాలకులకు పట్టని ‘శింగనమల’
అభివృద్ధికి ఆమడ దూరం తాగు, సాగు నీటికీ కటకటే ప్రజా సమస్యలపై రేపటి నుంచి ‘మేలుకొలుపు’ రైతుల్లో మనోధైర్యం నింపేందుకు జొన్నలగడ్డ పద్మావతి పాదయాత్ర తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో శింగనమల నియోజకవర్గ ప్రజల కష్టాలు రెట్టింపయ్యాయి. సాగునీరు లేక ఆయకట్టు భూములన్నీ బీళ్లుగా మారాయి. వేసవిలో దాహంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. అర్హులకు పింఛన్లు, డ్వాక్రా మహిళలకు రుణాలు, రైతులకు పంట నష్ట పరిహారం అందకపోవడంతో ప్రజల ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నమైంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. ఎక్కడికక్కడ బోరుబావులు ఎండిపోతున్నాయి. ప్రభుత్వ పథకాలేవీ అర్హుల దరి చేరడం లేదు. బిల్లలు అందక ఉపాధి కూలీలు వేసారిపోతున్నారు. పక్కా గృహ నిర్మాణాల కోసం పేదలు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు ఇవన్నీ ప్రభుత్వ విప్ యామనీబాల ప్రాతినిథ్యం వహిస్తున్న శింగనమల నియోజకవర్గ ప్రజల వెతలు. - శింగనమల 80 వేల ఆయకట్టు బీడే శింగనమల నియోజకవర్గంలో హెచ్చెల్సీ పరిధిలో 80 వేల ఆయకట్టు ఉంది. కొన్నేళ్లుగా హెచ్చెల్సీకి నీరు వదలక పోవడంతో ఆ భూములన్నీ బీళ్లుగా మారాయి. ఒక్కప్పుడు పది మందికి అన్నం పెట్టిన ఆయకట్టు రైతులు.. నేడు కూలీలుగా మారారు. ఉన్న ఊరిలో పనులు దొరక్క ఇతర ప్రాంతాలకు బతుకు తెరువు కోసం వెళుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో భవన నిర్మాణ కార్మికులుగా, సెక్యూరిటీ గార్డులుగా పనిచేసుకుంటు కుటుంబాలను పోషించుకుంటున్నారు. చెరువులకు అందని నీరు జిల్లాలోనే అతి పెద్ద చెరువుల్లో ఒక్కటైన శింగనమల చెరువుకు నీటి విడుదల కలగానే మారింది. ఈ చెరువు కింద ఆరు వేల ఎకరాలు ఆయకట్టు ఉంది. ఎన్నికల సమయంలో మాత్రమే ఈ చెరువును లోకలైజేషన్ చేస్తామంటూ హామీలిస్తున్న రాజకీయ నాయకులు.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత దీని ఊసే మరిచిపోతున్నారు. ఫలితంగా ఇది ఓటు బ్యాంక్ చెరువుగా మారింది. నియోజకవర్గ ఎమ్మెల్యేగా యామినీబాల బాధ్యతలు స్వీకరించిన ఈ మూడేళ్లలో చెరువుకు నీటిని విడిపించడంలో పూర్తిగా విఫలమయ్యారు. దీంతో చెరువు లోతట్టు ప్రాంతంలో కంపచెట్లు పెరిగిపోయాయి. నియోజకవర్గంలోని పుట్లూరు, యల్లనూరు చెరువులకూ అరకొరగానే నీటిని వదిలారు. మిగిలిన మండలాల్లోని ఏ ఒక్క చెరువునూ నీటితో నింపలేకపోయారు. అవినీతికి పరాకాష్ట.. శింగనమల పరిధిలోని ఉల్లికల్లు ఇసుక రీచ్‌లో అధికార పార్టీ నేతల అవినీతి దందా నేటికీ కొనసాగుతూ ఉంది. ఎలాంటి అనుమతులు లేకున్నా.. కేవలం అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఇసుకను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో ఉల్లికల్లు ప్రాంతం నుంచి రూ. కోట్లలోనే ఇసుక అక్రమాలు చోటు చేసుకున్నట్లు అంచనా. యథేచ్ఛగా ఇసుక తరలిస్తుండడంతో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయి. గతంలో పదుల అడుగుల్లో నీరు లభ్యమయ్యే ఈప్రాంతంలో నేడు వందల అడుగుల లోతున తవ్వినా నీటి జాడ కనిపించడం లేదు. ఆఖరుకు తాగునీటికీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. తీరని తాగునీటి ఇక్కట్లు శింగనమల నియోజకవర్గంలోని శింగనమల, గార్లదిన్నె, పుట్లూరు, యల్లనూరు, నార్పల, బుక్కరాయసముద్రం మండలాల్లో 116 పంచాయతీలున్నాయి. ఇందులో అత్యధిక పంచాయతీల్లో తాగునీరు సక్రమంగా సరఫరా కావడం లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్యాంకర్ల నీరు ప్రజావసరాలకు ఏమాత్రం సరిపోవడం లేదు. ఉన్న చేతి పంపులను మరమ్మతు చేయించడంలోనూ ప్రభుత్వం విఫలమవుతోంది. నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలు.. – మిడ్ పెన్నార్ డ్యాం ఆయకట్టుకు నీటి విడుదలలో విఫలం. మూడేళ్లుగా ఎంపీఆర్ డ్యాం పరిధిలో పంటలు పండక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. – శింగనమల, బుక్కరాయసముద్రం, సలకంచెరువు గ్రామాల్లోని చెరువులకు నీటిని విడిపించడంలో వైఫల్యం. – ఉపాధి హమీ పథకాన్ని నిర్వీర్యం. నీరు–చెట్టు పేరుతో కూలీలకు పనులు కల్పంచకుండా జేసీబీలతో చేయించి నిధులు దోచుకున్నారు. – ఇసుక అక్రమ రవాణాతో దోపీడి. – అర్హులకు అందని సామాజిక పింఛన్లు. మంజూరు కాని పక్కా గృహ నిర్మాణాలు. – పంట నష్టపరిహారం, బీమా మంజూరు చేయకపోవడంతో ఆర్థికంగా చితికిపోయిన అన్నదాతలు. ఫలితంగా ఏడాది ప్రశ్నార్థకం కానున్న ఖరీఫ్ పంట సాగు. – గ్రామాల్లో తీరని తాగునీటి సమస్యలు. ప్రభుత్వ వైఫల్యాలపై పోరుబాట ప్రభుత్వ వైఫల్యాలపై వెస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి పోరుబాట పట్టనున్నారు. మేలుకొలుపు పేరుతో ప్రజా సమస్యలను గుర్తించేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా శుక్రవారం నుంచి ఆమె పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ సందర్భంగా నెరవేరని ప్రభుత్వ హామీలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతో పాటు వరుస పంట నష్టాలతో ఆత్మస్తైర్యం కోల్పోయిన అన్నదాతల్లో మనోధైర్యం పెంచనున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం యల్లనూరు మండలం నుంచి ఆమె పాదయాత్ర ప్రారంభం కానుంది. పాదయాత్ర షెడ్యూల్ ఇలా.. - 26న యల్లనూరులో ప్రారంభమై కోడుమూర్తి, చిలమకూరు మీదుగా రాత్రికి అచ్చుతాపురం చేరుకుంటారు. - 27న అచ్యుతాపురం నుంచి ప్రారంభమై వాసాపురం క్రాస్, బొప్పేపల్లి, పుట్లూరు మండలంలోని కొండగారికుంట, కొత్తపల్లి, రంగరాజుకుంట క్రాస్, కుమ్మనమల, చాలవేముల క్రాస్ మీదుగా రాత్రికి మడ్డిపల్లి చేరుకుంటారు. - 28న మడ్డిపల్లి నుంచి ప్రారంభమై జంగంరెడ్డి పేట, మడుగుపల్లి వరకు కొనసాగుతుంది. - 29న నార్పల మండలంలోని మూగేతిమ్మంపల్లి క్రాస్, నరసాపురం క్రాస్, సుల్తాన్‌పేట, నార్పల, బీకేఎస్ మండలంలోని బొమ్మలాటపల్లి వరకు సాగుతుంది. 30న బొమ్మలాటపల్లి, చెన్నంపల్లి క్రాస్, వెంకటాపురం, నీలారెడ్డిపల్లి, కొర్రపాడు. 31న కొర్రపాడు, శింగనమల మండలం మరువకొమ్మక్రాస్, శింగనమల, గోవిందరాయునిపేట కాలనీ, సోదనపల్లిక్రాస్, పెద్దమట్లుగొంది, ఈస్ట్ నరసాపురం క్రాస్, చిన్నమట్లగొంది క్రాస్, సలకంచెరువు వరకు కొనసాగుతుంది. జూన్ 1న సలకంచెరువు, నాయనవారిపల్లి క్రాస్, రాచేపల్లి క్రాస్, నిదనవాడ, తరిమెల. 2న తరిమెల, కల్లుమడి, గుమ్మేపల్లి క్రాస్, గార్లదిన్నె మండలం ఇల్లూరు, పాత కల్లూరు, కల్లూరు. 3న కల్లూరు, ఎగువపల్లి క్రాస్, రామదాస్‌పేట క్రాస్, కనుంపల్లి క్రాస్, గుడ్డాలపల్లి, సిరివరం, క్రిష్ణాపురం, బూదేడు. 4న బూదేడు, మర్తాడు, గార్లదిన్నె. యాత్ర ముగింపు సందర్భంగా ఇదే రోజు సాయంత్రం మూడు గంటలకు గార్లదిన్నెలో భారీ బహిరంగ సభ జరగనుంది.q -
సూర్యప్రతాపం
అనంతపురం అగ్రికల్చర్ : మండుతున్న ఎండలతో జనం అల్లాడుతున్నారు. రోజురోజుకూ పగటి ఉష్ణోగ్రతలు అధికమవుతుండడంతో ‘అనంత’ నిప్పులకొలిమిలా మండుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా స్వల్పంగా పెరగడంతో ఉక్కపోత అధికమైంది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఎండవేడికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం కూడా శింగనమల మండలం తరిమెలలో 44.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత పామిడి 44.3 డిగ్రీలు, నార్పల 43.1 డిగ్రీలు, యాడికి 43.1 డిగ్రీలు, తాడిమర్రి 43 డిగ్రీలు, యల్లనూరు 43 డిగ్రీలు, బుక్కరాయసముద్రం 43 డిగ్రీలు, విడపనకల్ 42.8 డిగ్రీలు, పుట్లూరు 42.7 డిగ్రీలు కొనసాగింది. ప్రధాన పట్టణాలైన అనంతపురం 42.2 డిగ్రీలు, ధర్మవరం 41.8 డిగ్రీలు, ఉరవకొండ 42.5 డిగ్రీలు, కళ్యాణదుర్గం 42.4 డిగ్రీలు, గుంతకల్లు 42.4 డిగ్రీలు, కదిరి 41.1 డిగ్రీలు, పుట్టపర్తి 40.3 డిగ్రీలు నమోదు కాగా మిగతా ప్రాంతాల్లో 38 నుంచి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత కొనసాగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 23 నుంచి 29 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. గాలిలో తేమశాతం ఉదయం 46 నుంచి 76, మధ్యాహ్నం 14 నుంచి 24 శాతం మధ్య రికార్డయ్యింది. గంటకు 6 నుంచి 14 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచాయి. వచ్చే నాలుగు రోజులూ ఎలాంటి వర్షం వచ్చే సూచనలు లేవని, ఉష్ణోగ్రతలు ఇదే స్థాయిలో స్థిరంగా కొనసాగనున్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్ర్రవేత్తలు డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్ బి.సహదేవరెడ్డి తెలిపారు. -
ఈ రామాలయం ప్రత్యేకం
శతాబ్ధాల క్రితం శింగనమలలో వెలసిన సీతారాముల ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ ప్రతిష్టించిన సీతారాములు, లక్ష్మణ, ఆంజనేయ స్వామి విగ్రహాలు రాష్ట్రంలోని మరే ప్రాంతంలోనూ లేకపోవడం గమనార్హం. ఆత్మసీతారాములు ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయం నిర్మాణం వెనుక చరిత్ర పరిశీలిస్తే... ‘శతాబ్ధాల క్రితం బ్రాహ్మణులు ఎక్కువగా నివసించే శింగనమలలో ఆత్మసీతారాముల ఆలయాన్ని రంగరాయలు నిర్మించినట్లు తెలుస్తోంది. ఇక్కడ ప్రతిష్ఠించిన విగ్రహాల్లో రాముల వారి విగ్రహం పద్మ పీఠంపై కూర్చొని మెడలో తులసిమాలతో పద్మాసన ముద్రలో ఆత్మతత్వ్తం గురించి చెబుతున్నట్లుగా ఉంది. సీతమ్మ వారి విగ్రహం కూడా ధ్యానముద్రలో ఉంది. అంజలి ఘటిస్తూ లక్ష్మణ స్వామి, రామనామ జపం చేస్తున్నట్లుగా ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉన్నాయి. ప్రతి ఏటా ఛైత్రమాసంలో నవమి నుంచి తొమ్మిది రోజుల పాటు ఇక్కడ బ్రహోత్మవాలను నిర్వహిస్తుంటారు. పౌర్ణమి నాడు కల్యాణోత్సవం, రథోత్సవం ఉంటుంది. చెరువులో నీరు ఉంటే కార్తీక మాసంలో తెప్పోత్సవం నిర్వహిస్తుంటారు. - శింగనమల -
మామిడి తోటకు నిప్పు
శింగనమల : శింగనమల సమీపంలోని ఎస్సీ బాలుర హాస్టల్ వద్దనున్న బెస్త సుంకన్నకు చెందిన మామిడి తోటకు శుక్రవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఘటనలో 150 మామాడి మొక్కలు కాలిబూడిదయ్యాయి. ఐదేళ్ల కిందట 250 మామిడి మొక్కలు పెంచగా, ప్రసుత్తం అవి కాపు దశకు వచ్చాయని బాధితుడు తెలిపారు. ఈ నేపథ్యంలో దుండగులు నిప్పు పెట్టడంతో మొక్కలన్నీ కాలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం తెలిసిన వెంటనే ఆర్ఐ శివారెడ్డి, వీఆర్ఓ వెంకట్రామిరెడ్డి తోట వద్దకు వెళ్లి కాలిపోయిన చెట్లను పరిశీలించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు. -
కొనసాగుతున్న సూర్యప్రతాపం
– పామిడి, శింగనమల, బీకేఎస్‌లో 42 డిగ్రీలు అనంతపురం అగ్రికల్చర్ : జిల్లా అంతటా సూర్యప్రతాపం కొనసాగుతోంది. పామిడి, శింగనమల, బుక్కరాయసముద్రం మండలాల్లో 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కూడేరు, గుంతకల్లు, తనకల్లు, కనగానపల్లి, గుడిబండ, కంబదూరు, యల్లనూరు, చెన్నేకొత్తపల్లిలో 41 డిగ్రీలు, వజ్రకరూరు, యాడికి, పెద్దవడుగూరు, బుక్కపట్టణం, పుట్లూరు, తాడిపత్రి, కొత్తచెరువులో 40 డిగ్రీలు నమోదు కాగా మిగతా మండలాల్లో 37 నుంచి 39 డిగ్రీల మధ్య కొనసాగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 22 నుంచి 26 డిగ్రీల మధ్య నమోదైంది. గాలిలో తేమశాతం ఉదయం 57 నుంచి 77, మధ్యాహ్నం 17 నుంచి 27 శాతం మధ్య రికార్డయింది. గాలులు గంటకు 5 నుంచి 15 కిలోమీటర్ల వేగంతో వీచాయి. ఉక్కపోత, వేసవిగాలులతో జనం ఇబ్బంది పడుతున్నారు. -
కొనసాగుతోన్న గ్రీష్మతాపం
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లా అంతటా గ్రీష్మతాపం కొనసాగుతోంది. ఉష్ణోగ్రతలు గరిష్టస్థాయిలో నమోదవుతున్నాయి. బుధవారం శింగనమల మండలం తరిమెలలో గరిష్టంగా 41.6 డిగ్రీలు, పామిడి 41.5 డిగ్రీలు, గుంతకల్లు 40.9 డిగ్రీలు, చెన్నేకొత్తపల్లి 40.4 డిగ్రీలు, పుట్లూరు 40.2 డిగ్రీలు, యల్లనూరు 40.1 డిగ్రీలు, పుట్టపర్తి 40.1 డిగ్రీలు, యాడికి 40 డిగ్రీలు నమోదు కాగా తక్కిన మండలాల్లో 37 నుంచి 39 డిగ్రీల మధ్య కొనసాగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 22 నుంచి 26 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. గాలిలో తేమ శాతం ఉదయం 52 నుంచి 82, మధ్యాహ్నం 14 నుంచి 24 శాతం మధ్య రికార్డయింది. గంటకు 6 నుంచి 15 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఉక్కపోత ఎక్కువ కావడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ఏప్రిల్, మే నెలలు ఉండటంతో జిల్లా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రోజురోజుకు వేసవితాపం అధికమవుతుండటంతో ప్రజల పరిస్థితి ఇబ్బందిగా మారుతోంది. మంగళవారం శింగనమల మండలం తరిమెలలో 43.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కూడేరు మండలంలో 42.3 డిగ్రీలు, బుక్కరాయసముద్రం 42.2 డిగ్రీలు, పామిడి 41.6 డిగ్రీలు, యల్లనూరు 41.5 డిగ్రీలు, గుంతకల్లు 41.1 డిగ్రీలు, తాడిమర్రి 41.1 డిగ్రీలు, చెన్నేకొత్తపల్లి 40.9 డిగ్రీలు, ధర్మవరం 40.7 డిగ్రీలు, కొత్తచెరువు 40.7 డిగ్రీలు, అనంతపురం 40 డిగ్రీలు నమోదైంది. మిగతా మండలాల్లో 37 నుంచి 39 డిగ్రీల మధ్య కొనసాగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 20 నుంచి 26 డిగ్రీల మధ్య నమోదైంది. గాలిలో తేమశాతం ఉదయం 50 నుంచి 80, మధ్యాహ్నం 14 నుంచి 24 శాతం మధ్య రికార్డయింది. గాలులు గంటకు 5 నుంచి 15 కిలోమీటర్ల వేగంతో వీచాయి. -
పెరిగిన వేసవి తాపం
అనంతపురం అగ్రికల్చర్ : గత మూడు రోజులుగా కాస్తంత తగ్గిన ఉష్ణోగ్రతలు మళ్లీ పెరిగాయి. శుక్రవారం జిల్లా అంతటా వేసవితాపం కొనసాగింది. శింగనమల మండలం తరిమెల, ఎన్పీ కుంటలో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. యల్లనూరు, చెన్నేకొత్తపల్లి 40 డిగ్రీలు, తాడిపత్రి, పుట్టపర్తి, తాడిమర్రి, పుట్లూరు, పామిడి, నార్పల, కదిరిలో 39 డిగ్రీలు ఉండగా మిగతా మండలాల్లో 36 నుంచి 38 డిగ్రీలుగా కొనసాగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 20 నుంచి 25 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. గాలిలో తేమశాతం ఉదయం 65 నుంచి 85, మధ్యాహ్నం 35 నుంచి 45 శాతం మధ్య రికార్డయింది. గంటకు 6 నుంచి 15 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. కాగా శుక్రవారం రామగిరి, కనగానపల్లి, కనేకల్లు, బొమ్మనహాల్, రాయదుర్గం, చెన్నేకొత్తపల్లి, కంబదూరు తదితర మండలాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. రానున్న నాలుగు రోజుల్లో వర్షం కురిసే సూచనలు లేవని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. -
శింగనమల (అట్ ద రేట్) 42.1
అనంతపురం అగ్రికల్చర్ : శింగనమల మండలం తరిమెల గ్రామంలో శనివారం 42.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.ఎన్పీ కుంట 41.9 డిగ్రీలు, యల్లనూరు 40.2 డిగ్రీలు, చెన్నేకొత్తపల్లి, కూడేరు, తాడిమర్రి, గుంతకల్లులో 40 డిగ్రీల మేర నమోదు కాగా మిగతా మండలాల్లో 36 నుంచి 39 డిగ్రీల మధ్య కొనసాగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 19 నుంచి 24 డిగ్రీల మధ్య నమోదైంది. గాలిలో తేమశాతం ఉదయం 55 నుంచి 80, మధ్యాహ్నం 15 నుంచి 25 శాతం మధ్య రికార్డయింది. గంటకు 6 నుంచి 16 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. -
నీరు కరువు.. బతుకు బరువు
-కళావిహీనమైన శింగనమల చెరువు జిల్లాలో కరువు కరాళనృత్యం చేస్తోంది. భూగర్భ జలాలు అడుగంటి బోరు బావులు ఎండిపోయి పంటలు మాడిపోతున్నాయి. ప్రకృతి ప్రకోపం, పాలకుల నిర్లక్ష్యం వెరసి జిల్లా కరువుకు చిరునామాగా మారింది. నీటి పంపిణీలోనూ స్వార్థ రాజకీయాలు చోటుచేసుకోవడంతో వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులు పంట నష్టాలతో హాహాకారాలు చేస్తున్నారు. జిల్లాలోని అతి పెద్ద చెరువుల్లో శింగనమల చెరువు రెండవది. దీని విస్తీర్ణం 2,600 ఎకరాలు. చెరువులోకి నీరు చేరితో దాదాపు 14 గ్రామాల్లో పచ్చదనంతో కళకళలాడతాయి. అలాంటిది తీవ్ర వర్షాభావం కారణంగా చుక్కునీరు లేక చెరువు కళావీహీనంగా మారింది. చెరువుపై ఆధారపడి జీవిస్తున్న పక్షులు కూడా ఆహారం కోసం అల్లాడుతున్న దృశ్యాలు ప్రకృతి ప్రేమికులను ఆవేదనకు గురిచేస్తున్నాయి. -ఫొటోలు: వీరేష్, సాక్షి ఫొటోగ్రాఫర్ -
కుటుంబకలహాలతో వృద్ధుడు ఆత్మహత్య
శింగనమల : మండలంలోని ఆకులేడు గ్రామంలో కుటుంబ కలహాలతో పెద్దన్న (60) ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం జరిగింది. కుమారుడి అప్పుల విషయంలో ఇంట్లో గొడవ పడడంతో మనస్థాపం చెంది, ఇంట్లోనే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతనికి భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అనంతపురం సర్వజనాస్పత్రికి తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. -
గుప్త నిధుల కోసమే హత్యలు
- రుష్యశృంగుని కొండపై జంట హత్యల కేసు ఛేదింపు - నలుగురి అరెస్టు - పోలీసులకు రివార్డులు శింగనమల : శింగనమల సమీపంలోని రుష్యశృంగుని కొండపై జరిగిన జంట హత్యల కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. సెల్‌ఫోన్ ఈఎంఐతో పాటు సీసీ కెమెరాలు నిందితుల్ని పట్టించాయి. కేసులో నలుగురు నిందితుల్ని అరెస్టు చేసినట్లు ఇటుకలపల్లి సీఐ రాజేంద్రనాథ్‌యాదవ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను స్థానిక పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో ఇలా వివరించారు. బుక్కరాయసముద్రం మండలం బి.కొత్తపల్లి గ్రామానికి చెందిన బొగ్గు పవన్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డి, బాబ్జాన్, వి.రాజశేఖర్‌రెడ్డి స్నేహితులు. పవన్‌కుమార్ తండ్రి అదే గ్రామంలో పూజారి. పవన్‌కుమార్‌కు గుప్త నిధులపై ఆసక్తి ఉండేది. దీంతో పవన్‌కుమార్ తన స్నేహితులతో కలిసి గత నెల 19వ తేదీన ద్విచక్రవాహనంపై రుష్యశృంగుని కొండపైకి గుప్తనిధుల కోసం వెళ్లాడు. అయితే అప్పటికే బత్తలపల్లి మండలానికి చెందిన పూజారి పెద్దన్న, ఆయన మేనల్లుడు వీఆర్ఏ ఈశ్వరయ్య, ధర్మవరానికి చెందిన సావిత్రి కొండపై ఉన్నారు. గుప్తనిధులు తీసేందుకు అనుకూలంగా లేకపోవడంతో కొండ దిగి వచ్చి తిరిగి రాత్రికి వెళ్లారు. అయినా వారు అక్కడే ఉండటంతో అక్కమ్మ బావి దగ్గర ఉన్న వెదురు కట్టెలు తీసుకొచ్చి పడుకున్న వారిపై దాడి చేసి వారి వద్ద ఉన్న రూ.1800, సెల్‌ఫోన్ తీసుకెళ్లారు. అక్కడి నుంచి రాత్రికి రాత్రే గ్రామానికి తిరిగి వెళ్లిపోయారు. 20 వతేదీ ఉదయం తీవ్రంగా గాయపడిన సావిత్రి శింగనమలకు వచ్చి గ్రామస్తులకు, ఎస్ఐ హమీద్‌ఖాన్‌కు సమాచారం అందించిన విషయం తెలిసిందే. వారు కొండపైకి వెళ్లి పరిశీలించగా పూజారి పెద్దన్న మృతి చెంది ఉండటం, ఈశ్వరయ్యను అనంతపురంలో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందడం విధితమే. దొరికింది ఇలా .. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు రకాలుగా దర్యాప్తు చేపట్టారు. చివరకు నిందితులు తీసుకెళ్లిన సెల్‌ఫోన్ పనిచేయడంతో ఈఎంఐ నంబరు ఆధారంగా మొబైల్ వాడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. అతనికి మొబైల్ విక్రయించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని నిందితులు బి.కొత్తపల్లి గ్రామస్తులుగా గుర్తించారు. అలాగే లోలూరు క్రాస్‌వద్ద ఏర్పాటు చేసిన సీసీ పుటేజీల్లోనూ నిందితులు బైక్‌పై వెళ్లినట్లు గుర్తించారు. ఈ కేసులో నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకోవడంతో హత్యలు చేసినట్లు బయటపడింది. పోలీసులకు రివార్డులు : ఈ కేసును ఛేదించిన ఎస్ఐ హమీఖాన్‌ను జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు అభినందించినట్లు సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ తెలిపారు. పోలీస్ సిబ్బంది చౌదరి, షెక్షావలి, సురేంద్ర, స్పెషల్ పార్టీ పోలీసులు యాసర్‌అలీ, ప్రసన్నా, మారుతి, రమణకు సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ రివార్డులు అందజేశారు. కార్యక్రమంలో ఎస్ఐ హమీద్‌ఖాన్, ఏఎస్ఐ వెంకటేశ్వర్లు, పోలీస్‌సిబ్బంది పాల్గొన్నారు. -
స్వల్పంగా పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు
– అగళిలో 10.5 డిగ్రీల కనిష్టం – శింనగమలో 39.9 డిగ్రీల గరిష్టం అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో కొన్ని మండలాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు కనిష్టంగా, మరికొన్నింటిలో పగటి ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపించింది. గురువారం అగళిలో 10.5 డిగ్రీలు, మడకశిర 11 డిగ్రీలు, రొద్దం 12 డిగ్రీలు కనిష్టం నమోదు కాగా మిగతా మండలాల్లో 12 నుంచి 20 డిగ్రీల వరకు నమోదయ్యాయి. శింగనమలలో 36.9 డిగ్రీలు, గుంతకల్లు 36.4 డిగ్రీలు, కొత్తచెరువు, తాడిమర్రి, యల్లనూరులో 36.2 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా మిగిలిన మండలాల్లో 32 నుంచి 36 డిగ్రీల వరకు కొనసాగాయి. గాలిలో తేమశాతం ఉదయం పూట 60 నుంచి 80 శాతం ఉండగా మధ్యాహ్న సమయంలో 15 నుంచి 25 శాతం మధ్య రికార్డయింది. గంటకు 6 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. -
సీసీ కెమెరాలతో అదుపులోకి నేరాలు
శింగనమల : శింగనమల మండలంలోని మరువకొమ్మక్రాస్, లోలూరు క్రాస్ వద్ద ఎస్పీ ఆదేశాల మేరుకు ఏడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ హమీద్‌ఖాన్ పేర్కొన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అక్కడ ఏర్పాటు చేసిన కెమెరాల వల్ల క్రైం ఘటనలు నియంత్రణలో వస్తాయని చెప్పారు. కెమెరాలను జియో ట్యాగింగ్ చేశామన్నారు.దీని ద్వారా పోలీస్‌ల సెల్‌లకు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడమే కాకుండా లైవ్‌లో కూడా పర్యవేక్షించొచ్చన్నారు. ఈ సమావేశంలో హెడ్ కానిస్టేబుల్ ఆదిశేషు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
గుండె కోత
– పంటను చూసి మనోవేదనకు గురవుతున్న రైతన్నలు – అప్పులెలా తీర్చాలో తెలీక సతమతం – ప్రభుత్వ పెద్దల హామీ గంగ పాలు – చేసేదిలేక బలవన్మరణాలకు పాల్పడుతున్న అన్నదాతలు సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పంట చేతికి రావడం లేదు. దీంతో అప్పులెలా తీర్చాలో తెలీక కొందరు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఒక్క శింగనమల నియోజకవర్గంలోనే ఇప్పటికే ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకోగా... మరొకరు గుండెపోటుతో Ðlుతి చెందారు. శింగనమల : జిల్లాలో వేరుశనగ సాగుచేసిన రైతులకు ఈసారి కష్టాలు తప్పడం లేదు. ఎండిపోయిన వేరుశనగను చూసి ఆవేదనకు గురైన అన్నదాతలు ఈ మధ్యనే కురుస్తున్న వర్షాలకు ఊరట లభించినా... పచ్చగా ఉన్న పొలంలో కాయలు లేని వేరుశనగను చూసి కన్నీరుమున్నీరవుతున్నారు. ఒక్క ఎకరా కూడా ఎండిపోనివ్వం అన్న ప్రభుత్వ పెద్దల మాటలు నీటిమీద రాతలుగానే మారాయి. అవసరమైనప్పుడు నీళ్లిచ్చి ఆదుకొని ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని ఎంతో మంది అన్నదాతలు వాపోతున్నారు. అప్పులెలా తీర్చాలో తెలీక... ఖరీఫ్ సాగు కోసం చేసిన అప్పులను ఎలా తీర్చాలో తెలీక చాలా మంది రైతులు సతమతమవుతున్నారు. చేసేది లేక కొందరు రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. • గత నెల 26న శింగనమల మండలంలోని జూలకాల్వకు చెందిన తలారి నాగమునేశ్వర(35) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎండిన మూడున్నర ఎకరాల పొలాన్ని చూసి ఆవేదనతో పురుగుల మందు తాగి బలవన్మరణం చేసుకున్నాడు. ఈయనకు రూ. 3.50 లక్షల దాకా అప్పులున్నాయి. • గత నెల 28న శింగనమల మండలం నాగులగుడ్డంతాండాకు చెందిన రాజునాయక్ (55) ఎండిన వేరుశనగను చూసి ఇంటికొచ్చి కన్నీరు మున్నారయ్యాడు. ఇందులో భాగంగానే గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచాడు. ఈయనకు దాదాపు రూ.2 లక్షల దాకా అప్పులు ఉన్నాయి. • తాజాగా గురువారం శింగనమల పరిధిలోని చిన్నమట్లగొందిలో మహిళా రైతు సుంకమ్మ (40) కాయలు లేని వేరుశనగ పంటను చూసి తీవ్రంగా మనోవేదనకు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. వీరికి రూ. 4 లక్షల దాకా అప్పులు ఉన్నాయి. -
రౌడీ మామూళ్లు
- సీఎం సభ పేరుతో దోపిడీ - ఒక్కో రేషన్ డీలర్ నుంచి రూ.1500 వసూలు - లబోదిబోమంటున్న బాధితులు శింగనమల : అధికారపార్టీ నేతలు ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. దోచుకునేందుకు అందివచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చే సేకుంటున్న తమ్ముళ్లు..సొంత పార్టీ నేతలను కూడా వదలడం లేదు. తాజాగా శింగనమల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనను కూడా పచ్చపార్టీ నేతలు క్యాష్ చేసుకున్నారు. సీఎం సభ నిర్వహణ ఖర్చు పేరుతో నియోజకవర్గంలోని చౌక డిపోల డీలర్లతో ఒక్కొక్కరితో రూ. 1,500 మేర వసూలు చేశారు. ఇలా నియోజకవర్గ వ్యాప్తంగా 258 చౌకధాన్యపు దుకాణాల నుంచి రూ.3.80 లక్షలు దండుకున్నారు. ఈ డబ్బు వసూళ్లకు అధికారులనే వాడుకోవడం గమనార్హం. భోజనం పేరుతో మింగేశారు ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అక్కడికి వచ్చే వారికి భోజనానికి అయ్యే ఖర్చును తెలుగు తమ్ముళ్లు ఆయా రెవెన్యూ అధికారులపై వేసేశారు. దీంతో ఏం చేయాలో పాలుపోని అధికారులు ఆ బాధ్యతను నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న డీలర్లకు అంటగట్టారు. ఇందులో భాగంగానే వసూళ్లకు తెరలేపారు. శింగనమలలో 45, బుక్కరాయసముద్రంలో 50, గార్లదిన్నెలో 40, నార్పలలో 52, పుట్లూరులో 37, యల్లనూరులో 34 డిపోలున్నాయి. సీఎం సభ కోసం ప్రతి ఒక్క డీలర్ కచ్చితంగా రూ.1,500 ఇవ్వాల్సిందేనని అల్టిమేటం జారీ చేశారు. ఇప్పటికే శింగనమల మండలంలో 45 డిపో డీలర్ల నుంచి డబ్బును ముక్కుపిండి వసూలు చేశారు. మిగతా చోట్ల కూడా ఇదే పరిస్థితి నెలకొంది. లబోదిబోమంటున్న డీలర్లు ఈ నెలలోనే తూనికలు కొలతల శాఖ అధికారులు వచ్చి తూకాలకు చెందిన కాటాలకు రూ.900 వరకు వసూలు చేశారనీ, తాజాగాS సీఎం సభ ఖర్చు పేరుతో రూ.1,500 వసూళ్లు చేస్తున్నారని డీలర్లంతా వాపోతున్నారు. టీడీపీకి చెందిన కొందరు డీలర్లు కూడా రెవెన్యూ అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెలా రెవెన్యూ అధికారులకు మామూళ్లు ముట్టజెబుతూనే ఉన్నామనీ... కొత్త సీఎం సభ పేరుతో దోచేయడమేంటని మండిపడుతున్నారు. వీళ్ల దందాతో చస్తున్నామనీ.. దీనికన్నా డీలర్షిప్ వదులుకోవడమే మేలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వసూళ్ల పర్వంపై తహశీల్దార్ల వివరణ తీసుకునేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా ఏ అధికారీ అందుబాటులోకి రాలేదు. -
చూపులకు సుందరాంగి!
శింగనమల నియోజకవర్గం పుట్లూరుకు చెందిన రామకృష్ణ... బతుకు తెరువు కోసం ఓ గాలిమిషన్ ఏర్పాటుచేసుకున్నాడు. మూడేళ్ల క్రితం ఒంగోలు జాతికి చెందిన ఆవుదూడను రూ. 14 వేలు వెచ్చించి కొనుగోలు చేశాడు. రోజులు గడుస్తున్న కొద్ది అది కొత్త రూపును సంతరించుకోసాగింది. దీంతో దాని పోషణపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. అందానికే అందం చూస్తుంటే ముద్దులొలుకుతున్న ఆవును మరింత సుందరంగా అలకరించే పనిలో రామకృష్ణ నిమగ్నమయ్యాడు. దాని కోసం ప్రత్యేకంగా గౌషన్లు, మెడపట్టీ, కాళ్ల గజ్జెలు, కొమ్ము కుచ్చులు, పూసల హారాలు సమకూర్చాడు. వాటిని అప్పుడప్పుడు దానికి అలంకరించి ఆనందించేవాడు. పాల నురుగులాంటి శరీరంపై నల్లటి దారాలతో అలంకరించిన ఆవును చూసేందుకు స్థానికులు ఎగబడ్డేవారు. అందాల పోటీలకు గత ఏడాది ఏప్రిల్‌లో తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి నిర్వహించిన ఆవుల అందాల పోటీలకు రాష్ట్రం నలుమూలల నుంచి మేలు జాతి ఆవులు వచ్చాయి. ఈ పోటీలకు తన ఆవును రామకృష్ణ తీసుకెళ్లాడు. దాదాపు 750కు పైగా ఆవులు వివిధ అంశాల్లో ప్రతిభ చాటుకునేందుకు పోటీ పడ్డాయి. వాటన్నింటిని వెనక్కు నెట్టేసి రామకృష్ణ ఆవు ప్రథమస్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా రూ. 15వేలుతో పాటు ప్రశంసాపత్రాన్ని నిర్వాహకులు అందజేశారు. సంక్రాంతి సంబరాల్లోనూ... ఈ ఏడాది ప్రభుత్వం నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో సైతం ఈ ఆవు అందాల పోటీల్లో పాల్గొని మండల, జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి సాధించింది. మండల స్థాయిలో రూ.4 వేలు, జిల్లా స్థాయిలో రూ. 8 వేలు ప్రోత్సాహక నగదు తన యజమానికి దక్కేలా చేసింది. ఈ సందర్భంగా మంత్రుల చేతుల మీదుగా రామకృష్ణ సత్కారం అందుకున్నారు. -
రోడ్డుప్రమాదంలో ముగ్గురి దుర్మరణం
శింగనమల: అనంతపురం జిల్లాలో సోమవారం వేకువజామున జరిగిన ప్రమాదంలో ముగ్గురు చనిపోగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. శింగనమల మండలం లోలూరు క్రాస్ రోడ్డు వద్ద బెంగళూరు నుంచి కర్నూలు వైపు వెళ్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఒకరు అక్కడికక్కడే చనిపోగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే అనంతపురం ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ ఇద్దరు చనిపోయారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. -
విద్యుత్ షాక్‌తో రైతు మృతి
శింగనమల: అనంతపురం జిల్లా శింగనమల మండలం ఏకుల నాగేపల్లి గ్రామంలో విద్యుత్ షాక్‌తో ఓ రైతు మృతి చెందాడు. గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి(26) అనే రైతు తన పొలంలో గురువారం ఉదయం మోటార్ రిపేరు చేస్తుండగా విద్యుత్ షాక్ కు గురైయ్యాడు. స్థానికులు గమనించే లోపల కృష్ణారెడ్డి మృతి చెందాడు. ఈ సంఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. -
కారును ఢీకొన్న లారీ: ఐదుగురికి తీవ్రగాయాలు
శింగనమల (అనంతపురం జిల్లా) : తాడిపత్రి నుంచి అనంతపురానికి వెళుతున్న ఇండికా కారును రాంగ్ రూట్లో వచ్చిన లారీ ఢీకొన్న సంఘటన శనివారం అర్థరాత్రి శింగనమల మరువకొమ్మ వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో ఇండికా కారులో ప్రయాణిస్తున్న డ్రైవరుతో కలిపి ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురానికి చెందిన నలుగురు రియాజ్ అహమ్మద్, అతని భార్య, జహీర్ అహమ్మద్, సారాద్, డ్రైవరు కిశోరుబాబు కలిసి తాడిపత్రి నుంచి బయలుదేరారు. అనంతపురం నుంచి తాడిపత్రికి వెళ్లుతున్న లారీ శింగనమల మరువకొమ్మ వద్దకు రాగానే రాంగ్ రూట్లోకి వచ్చింది. కారులో ప్రయాణిస్తున్నవారు గుర్తించి రోడ్డు ప్రక్కకు వెళ్లేలోపే లారీ కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు, డ్రైవరు తీవ్రంగా గాయపడ్డారు. లారీ కిందకు కారు వెళ్లడంతో అటుగా వచ్చిన శింగనమల వాసులు గుర్తించి అందరినీ బయటకు లాగారు. నార్పల నుంచి పేషెంట్‌తో వెళ్తున్న 108 వాహనం అటుగా రావడంతో.. 108 వాహనాన్ని ఆపి, తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మరో ముగ్గురిని మరో 108 వాహనంలో తరలించారు. -
తరిమెలలో విషాదం
అనంతపురం: అనంతపురం జిల్లా సింగనమల మండలంలో విషాదం నెలకొంది. మండలంలోని తరిమెలకు చెందిన దివాకర్ అనే యువ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన సోమవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన దివాకర్(27) నాలుగేళ్లుగా ఆరెకరాల భూమి కౌలుకు తీసుకుని వేరుశెనగ, పత్తి పంటలను సాగు చేస్తున్నాడు. వరుసగా పంటలు దెబ్బ తినడంతో పెట్టిన పెట్టుబడులు కూడా రాక రూ.4లక్షల వరకు అప్పులు మిగిలాయి. దీనిపై మనోవేదనతో ఉన్న దివాకర్ సోమవారం అర్థరాత్రి గ్రామంలోని వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి కట్టుకున్న లుంగీతో ఉరి వేసుకున్నాడు. మంగళవారం ఉదయం గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. దివాకర్‌కు భార్య, కుమారుడు ఉన్నారు. ఏఎస్ఐ ఇక్బాల్ భాషా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పాముకాటుకు గొర్రెలకాపరి మృతి
శింగనమల : గొర్రెలను మేపడానికి వెళ్లిన వ్యక్తి పాముకాటుకు గురై మృతిచెందాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా శింగనమల మండలంలోని సోదనపల్లి గ్రామంలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన కేశమయ్య(50) గత రెండు సంవత్సరాల నుంచి గొర్రెలను మేపుకుంటూ జీవిస్తున్నారు. సోమవారం రుశ్యశృంగుని కొండపై గొర్రెలను మేపుతుండగా.. పాము కాటు వేసి అక్కడికక్కడే మృతిచెందాడు. -
సింగనమలలో విష జ్వరాలు
సింగనమల: అనంతపురం జిల్లా సింగనమల మండలం ఆకులేడు గ్రామంలో విషజ్వరాలు ప్రభలుతున్నాయి. గ్రామంలో సుమారు 200 మందికి విషజ్వరాలు సోకాయి. ఈ విషజ్వరం బారిన పడి ఇప్పటికే గ్రామానికి చెందిన మోషప్(6) అనే బాలుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన చాలామంది విషజ్వరాలతో బాధపడుతున్న ఆర్థిక ఇబ్బందులతో ఆస్పత్రికి వెళ్లే స్థితిలో ఉన్నారు. ప్రభుత్వం స్పదించి తగిన చర్యలు తీసుకోవాలని బాదితులు వాపోతున్నారు. -
సింగనమలలో 100 మంది కార్యకర్తలు అరెస్ట్
సింగనమల (అనంతపురం) : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్‌తో ప్రతిపక్షం పిలుపునిచ్చిన బంద్ శనివారం దిగ్విజయవంతంగా కొనసాగుతోంది. అనంతపురం జిల్లా సింగనమలలో వైఎస్సార్సీపీ జిల్లా నాయకులు ఆలూరు సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా సాగుతోంది. కాగా సింగనమలలో బంద్‌లో పాల్గొంటున్న వైఎస్సార్సీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. 100 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. -
పదవ తరగతి విద్యార్థి అనుమానాస్పద మృతి
అనంతపురం :జిల్లాలోని శింగనమల మండల కేంద్రంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి అనుమానాస్పద స్థితిలో గురువారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎస్కేడీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న జగపతి(15) అనే విద్యార్థి తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని చనిపోయాడు. అయితే విద్యార్థి వీపుపై గాయాలు ఉండటంతో ఎవరైనా హత్య చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేనుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
'యామిని బాల నామినేషన్‌పై అభ్యంతరం'
అనంతపురం : అనంతపురం జిల్లా శింగనమల టీడీపీ అభ్యర్థి యామిని బాల నామినేషన్‌పై ఇండిపెండెంట్ అభ్యర్థి అభ్యంతరం తెలిపారు. యామిని బాల ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేయకుండానే నామినేషన్ వేశారని ఆరోపణలు చేశారు. కాగా ఆర్వో రామ్మోహన్ ఆమె నామినేషన్ ఆమోదించటంతో ఇండిపెండెంట్ అభ్యర్థి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రావి వెంకట రమణ నామినేషన్‌ను అధికారులు ఆమోదించారు. టీడీపీ నేతల అభ్యంతరాలను అధికారులు తోసిపుచ్చారు. -
సైకిలెక్కిసిన మాజీమంత్రి శైలజానాథ్....
అనంతపురం : అనంతపురం జిల్లా శింగనమల అసెంబ్లీ స్థానానికి టీడీపీ తరపున మాజీమంత్రి శైలజానాథ్ శనివారం నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆయన నామినేషన్సై మాజీమంత్రి పామిడి శమంతకమణి అభ్యంతరం వ్యక్తం చేశారు. తన కుమార్తె యామిని బాలకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చారని, పార్టీలో సభ్యత్వం లేని మీరు నామినేషన్ ఎలా వేస్తారని శైలజానాథ్‌ను శమంతకమణి నిలదీశారు. కాగా రెండు రోజుల క్రితం శైలజానాథ్ కాంగ్రెస్ తరపున నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం సీమాంధ్ర కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలోనూ ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేఖరుల అడిగిన ప్రశ్నకు శైలజానాథ్ సమాధానమిస్తూ పార్టీ మారి పోటీ చేయాల్సిన దుస్థితి తనకు లేదని కాంగ్రెస్ తరపునే పోటీ చేస్తానని వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రస్తుతం సీన్ మారింది. కాంగ్రెస్ తరపున పోటీకి శైలజానాథ్ విముఖత చూపుతు టీడీపీ తరపున నామినేషన్ వేశారు. -
ఎత్తు.. చిత్తు..
అనంతపురం : సార్వత్రిక ఎన్నికల్లో శింగనమల నియోజకవర్గ ప్రజలను కనికట్టు చేసి, లబ్ధి పొందేందుకు మాజీ మంత్రి శైలజానాథ్ వేసిన ఎత్తులు చిత్తయ్యాయి. జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకాన్ని రూ.40 కోట్లతో విస్తరిస్తే.. శింగనమల నియోజకవర్గంలోని 73 గ్రామాలకు తాగునీళ్లు అందించవచ్చునని గ్రామీణ నీటి సరఫరా విభాగం(ఆర్డబ్ల్యూఎస్) అధికారులు ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనలను పక్కన పెట్టి.. రూ.150 కోట్లతో శింగనమల నియోజకవర్గానికి ప్రత్యేక పథకాన్ని 2013 నవంబర్ 25న అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై ఒత్తిడి చేసి శైలజానాథ్ మంజూరు చేయించుకున్నారు. అయితే జేసీ నాగిరెడ్డి పథకాన్ని ఇటీవల తనిఖీ చేసిన ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ చక్రపాణి.. శింగనమల నియోజకవర్గానికి ప్రత్యేక నీటి పథకాన్ని చేపట్టడమంటే రూ.110 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేయడమేనని ప్రభుత్వానికి నివేదించారు. ఆ ప్రతిపాదనతో శింగనమల తాగునీటి పథకం రద్దు చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. ఇది మాజీ మంత్రి శైలజానాథ్‌ను ఇరకాటంలోకి నెట్టింది. వివరాల్లోకి వెళితే.. తాడిపత్రి, గుంతకల్లు, శింగనమల నియోజకవర్గాల్లోని 561 గ్రామాలు, రెండు మున్సిపాల్టీల్లోని ప్రజలకు రోజుకు తలసరి 70 లీటర్ల నీటిని అందించేందుకు రూ.508 కోట్ల వ్యయంతో జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకాన్ని 2008లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మంజూరు చేశారు. ఈ పథకానికి వైఎస్సార్ జిల్లాలోని గండికోట జలాశయం నుంచి మూడు టీఎంసీల నీటిని కేటాయించారు. ఇప్పటిదాకా ఈ పథకంలో రూ.396.16 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. ప్రభుత్వం మూడేళ్లుగా బిల్లులను చెల్లించకపోవడం వల్ల కాంట్రాక్టర్లు పనులను ఆపేశారు. రూ.396.16 కోట్లను ఖర్చు చేసినా ఒక్క గ్రామానికి కూడా నీళ్లందించలేని దుస్థితి నెలకొంది.